ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి….

ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల ఉపాధ్యక్షుడు ఎం.డి. సామియుద్దీన్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు నం.33 శాంతినగర్, జహీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుటకు పార్టీ టికెట్ మంజూరు చేయాలని కోరుతూ టౌన్ పార్టీ అధ్యక్షుడికి దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా యూత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్ దక్కేనా….

పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్ దక్కేనా….?

పైసలుంటేనే కౌన్సిలర్ టిక్కెటా…? ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారికి టిక్కెటా..?

మున్సిపల్ ఎన్నికలు మంత్రికి పెద్ద సవాలేనా…?

బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే వార్డుల రిజర్వేషన్ల మార్పా..?

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే వార్డుల రిజర్వేషన్లు మార్పు చేశారా..? అంటే అవుననే సమాధానం ప్రజల నుండి ఎక్కువగా వినిపిస్తుంది. రానున్న క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలే అని తెలుస్తుంది.పంచాయతీ ఎన్నికల్లోనూ చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంతగా ఫలితాలు రాలేదనే చెప్పాలి. బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికల్లో బాగానే ఫలితాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలంటే గుర్తులుండవు. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే పార్టీలుగా విడిపోయి ప్రచారం చేసుకోవడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. అయితే గ్రామాలు వేరు పట్టణాలు వేరు. పట్టణ ఓటర్లు ఒక పట్టాన అర్ధం కారు. పట్టణ ఓటర్లు ఖచ్చితంగా పార్టీ పాలనను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటారు. డెవలెప్ మెంట్ చూస్తారు. అలాగే సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మరీ ఓటేస్తారు. అందులో భాగంగానే క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి రాబోయే మున్సిపల్ ఎన్నికలు మంత్రి వివేక్ వెంకటస్వామి కి పెద్ద సవాలుగానే నిలిచాయి.గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం, ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారికే కౌన్సిలర్ టికెట్ కేటాయిస్తారా..!

పైసలుంటేనే టికెట్ కేటాయిస్తారా..! అనేది వేచి చూడాల్సిందే.మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలకు కూడా పట్టు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ తప్పేట్లు కనిపించడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ వారికి మంత్రి భరోసా ఇచ్చి ప్రత్యామ్నాయ పదవులు ఇస్తారో లేదో అనేది వేచి చూడాల్సిందే. అధికార పార్టీ నేతలు అయితే టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తామని బహిరంగంగానే చెబుతుండడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతృప్త స్థాయి ప్రజలు ఉన్నారు, అసంతృప్త స్థాయి ప్రజలు కూడా అదే రేంజ్ లో ఉన్నారు.పింఛనుదారుల నుంచి నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు పట్టణ ఓటర్లుగా తమ తీర్పును చెప్పనున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, మంత్రికి, డిసిసి అధ్యక్షులకు కత్తిమీద సాము లాంటివనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల విషయంలో మంత్రులనే బాధ్యులను చేసినప్పటికీ మంత్రులు ఏ స్థాయిలో పార్టీ గెలుపునకు ఉపయోగపడతారన్నది వేచి చూడాల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికలను ప్రెస్టేజ్ గా తీసుకున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ రానున్న మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ పత్రాల పంపిణీ

ఉచిత కరెంట్ పత్రాన్ని అందచేసిన గ్రామ పెద్దలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో బాగంగా గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ పత్రాన్ని అందచేసిన గ్రామ పెద్దలు…వినియోగధారులకు సంక్రాంతి పండుగ శుభకాంక్షలు తెలిపిన ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన రేవంత్ సర్కార్…ఇట్టి కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, ఉపసర్పంచ్ మంగళి దత్తు,వార్డు సభ్యులు వై నగేష్,చాకలి మాణయ్య,మొగులయ్య, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, ప్రెస్ రిపోర్టర్ చింతలగట్టు నర్సింలు, గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య, శేరి సంగమేష్,రామయ్య,జర్నయ్య, కాశీనాథ్, హరి,పాపయ్య,సంజీవులు హెల్పర్, ముజీబ్,తుకారం,సుకుమార్,పాండు,బీరప్ప, శేఖర్,లింగరాజ్ మహిళలు ఈశ్వరమ్మ,లక్ష్మి,అనసుజ తదితరులు పాల్గొన్నారు..

కొత్త రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

కొత్త రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో నూతన రేషన్ షాపును ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ తో కలిసి రేషన్ షాపులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అందించే ఉచిత సన్న బియ్యం పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పిల్లి రాజయ్య ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆదివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఎలబోయిన ఎర్ర మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఎనిమిదవ రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం అంబటి లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందగా మూడవరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుకపెళ్లి రమేష్, ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు కొడారి రవీందర్ సీనియర్ నాయకులు మార్నేని ఉపేందర్ రావు దోమల రాజయ్య కొడాలి రవీందర్ ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ రమా రవీందర్ తదితరులు పాల్గొన్నారు._

కాంగ్రెస్ పార్టీ నూతన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల…

కాంగ్రెస్ పార్టీ నూతన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియమితుల య్యారు. ఈమేరకు శనివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాజేందర్ రావుకు నియోజకవర్గ ఇన్చార్జి నియమానికి సంబంధించి లేఖను అందించారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు, నేతలతో పాటు ప్రతి ఒక్కరికి పేరుపేరునా రాజేందర్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు అధిష్టానం పెద్దలు తనపై అతిపెద్ద బాధ్యతను అప్పగించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైనికుడి వలె కష్టపడి పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రతి పల్లె పల్లెనా ప్రతి వార్డు వార్డునా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. కరీంనగర్లో డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర నాయకులు అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేస్తామని రాజేందర్రావు ధీమా వ్యక్తం చేశారు. రాజేందర్ రావ్ ను అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, రాజేందర్ రావ్ నియామకంతో కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు వెలిచాల అభిమానులు సన్నిహితులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని రాబోయే రోజుల్లో రాజేందర్ రావు నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలో బ్రహ్మాండంగా పార్టీ ముందుకు సాగుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీబీజీఆర్‌జీ చట్టం రద్దు చేయాలి – ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని యెడల పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటేలా, ప్రతీ ఒక్క కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకువెళ్లాలని సూచించారు. క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకురాలు…

ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకురాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నిరుపేద అమ్మాయి వివాహానికి ఆర్థిక సహాయం చేసి ధాతృత్వం చాటుకున్న జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ,మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఈ ఆర్థిక సహాయం లక్ష్యం అని కుటుంబీకులు యువతి తల్లి నూర్జహాన్ బేగం, సోదరుడు మరియు గ్రామస్థులకు అందచేయడం జరిగింది.

కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం…

కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 5 :

 

 

 

మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉందని మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు – మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మూడుచింతల పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి కమిటీని సోమవారం ప్రకటించారు. కమిటీ మండల అధ్యక్షుడిగా దోసకాయల వెంకటేశం, ఉపాధ్యక్షులుగా పుర్రెలి నరసారెడ్డి, గుర్రం బసవ రెడ్డి, నర్సింగ్ రావు గౌడ్, మర్యాల వీరేశం గుప్తా, తడిసిన వీరారెడ్డి, మహమ్మద్ జాఫర్ ప్రధాన కార్యదర్శిగా, వంగ భూపాల్ రెడ్డి, బండి జగన్నాథం, కమ్మరి బాలకృష్ణ, కామెడీ శశిధర్ రెడ్డి, కార్యదర్శులుగా సుంకు బుచ్చిరెడ్డి, కాషామైన ప్రవీణ్ కుమార్, కీసరి నర్సింహులు, తునికి వెంకటేష్ , ముద్రం పాపిరెడ్డి, స్పోర్ట్స్ పర్సన్ గా రవీందర్, ట్రెజరర్ గా బుద్ధి సదానందం, కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గా వంగ దామోదర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా జయల పాండు బీసీ సెల్ అధ్యక్షులుగా
గుండపల్లి శ్రీకాంత్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా దాసరి నాగేశ్వర్, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా కేతావత్ శ్రీకాంత్ నాయక్, మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మహమ్మద్ యూషఫ్, సేవా దళ్ అధ్యక్షులుగా భానుచందర్ రెడ్డి లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాలరావు, కొల్తూరు గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహ, గోవర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పట్టా బాల నరసింహ, కరుణాకర్, దుర్గం ప్రవీణ్ యాదవ్, గురువయ్య, నల్ల శిల్పా యాదగిరి, వంగ వెంకటరమణారెడ్డి, తూము వేణుగోపాల్, సురేష్, మధుసూదన్ రెడ్డి, జగన్ గూడ రవీందర్, జలీల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

#తదుపరి కాజీపేటలో సీసీ కెమెరాల ప్రారంభం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన నాయకులు విష్ణు రెడ్డి ఆదివారం రోజున 47వ, 62వ డివిజన్‌లలో వివిధ కారణాలతో మృతి చెందిన దబ్బేట ఐలేష్,గద్దల కోర్నెల్,దాట్ల బాబు,బంగారి రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు కాజీపేట పెద్దమ్మతల్లి హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు)ను ఎసిపి ప్రశాంత్ రెడ్డి, సిఐ సుధాకర్ రెడ్డి తో కలిసి విష్ణు రెడ్డి ప్రారంభించారు. ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సంబంధిత డివిజన్‌ల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.

#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్…

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు నడికూడలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ను నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణాపురం సర్పంచ్ పెండ్లి లక్ష్మి, కార్యదర్శిగా కంఠాత్మకూర్ సర్పంచ్ కొంగంటి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా రాయపర్తి సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్, కోశాధికారి గా ధర్మారం సర్పంచ్ భాషిక ఎల్లస్వామి లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండలంలోని సర్పంచులు కుడ్ల మలహల్ రావు,చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక,చౌటుపర్తి గ్రామ సర్పంచ్ ఓదెల రూప,ధర్మారం గ్రామ సర్పంచ్ బాషిక ఎల్లస్వామి,కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, ముస్త్సాల పెల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, నర్సక్కపల్లి గ్రామ సర్పంచ్ కోడెపాక ముత్యాలు,పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ,సర్వాపూర్ గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత,వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి,రాయపర్తి గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నడికూడ మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అప్పం కుమార్ స్వామితో పాటు వివిధ గ్రామాల,మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందిస్తూ,మండల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఘనంగా జరుపుకున్న డిసిసి ఉపాధ్యక్షులు జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న డిసిసి ఉపాధ్యక్షులు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

డిసిసి ఉపాధ్యక్షులు & సోదరుడు మహమ్మద్ ముల్తానీ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాచనూర్ గ్రామ స్థానిక వద్ద స్టేజీ ఏర్పాటు చేసి బాణాసంచా కాల్చి, బారి గజ మాలను మహమ్మద్ ముల్తానీకు అలంకరించి, ఆయనతో కేక్ కట్ చేయించి, శాలువా పూలమాలలతో సన్మానించి వేడుకలు ఘనంగా నిర్వహించారపటేల ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రటరీ మహేందర్ పటేల్, అశ్విన్ పటేల్, మొహమ్మద్ ఖదీర్, షేక్ ఖాయుమ్,
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టి ఆర్గనేజింగ్ సెక్రటరీగా ముద్దం రాఘవ రెడ్డి నియామకం…

 

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-03T112255.577.wav?_=1

 

కాంగ్రెస్ పార్టి ఆర్గనేజింగ్ సెక్రటరీగా ముద్దం రాఘవ రెడ్డి నియామకం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 

 

అలియాబాద్ మున్సిపాల్ కాంగ్రెస్ పార్టి ఆర్గనేజింగ్ సెక్రటరీగా ముద్దం రాఘవ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు తునికి రమేష్ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్ లను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కంఠం కృష్ణ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, ఉపాధ్యక్షులు ముద్దం సుధాకర్ రెడ్డి, భూమి రెడ్డి నవీన్ రెడ్డి, సినియర్ నాయకులు అబ్బగౌని భాస్కర్ గౌడ్, మణికొండ నవీన్, వారాల మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాటకారి బాబు, లింగోళ్ల శ్రీకాంత్ గౌడ్, పిట్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 2 :

 

నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శాంతి, అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలని, సేవలు మరింత ఫలప్రదంగా కొనసాగాలని ఆకాంక్షింస్తూ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిని అలియాబాద్ మున్సిపాల్ కాంగ్రెస్ పార్టి అద్యక్షులు తుంకి రమేష్ కమిటీ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ తుంకి భిక్షపతి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కంఠం కృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షులు భూమి రెడ్డి నవీన్ రెడ్డి, చట్లపల్లి నర్సింగ రావు, అబ్బగౌని భాస్కర్ గౌడ్, ముద్దం రాఘవ రెడ్డి, మణికొండ నవీన్, వారాల మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాటకారి బాబు, వల్లపు మహేష్, లింగోళ్ల శ్రీకాంత్ గౌడ్, పిట్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

పార్టీని మరింత బలోపేతం చేయాలి…

పార్టీని మరింత బలోపేతం చేయాలి
* డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
* కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు–కార్యకర్తల విస్తృత సమావేశం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి

 

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు–కార్యకర్తల విస్తృత సమావేశం బుధవారం నారాయణపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వజ్రేష్ యాదవ్ గారు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని పేర్కొన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. గల్లీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. పార్టీ కోసం అంకితభావంతో కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గోన మహేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, బండి జగన్నాథం, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

అనాధ బాలికలకు అండగా ఉంటకోరుట్లనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు..

అనాధ బాలికలకు అండగా ఉంటకోరుట్లనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు
మల్లాపూర్ ,నేటి దాత్రి

 

మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో తల్లి తండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ఇద్దరు ఆడపిల్లలకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రోజున ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు అందజేశారు జువ్వడి నరసింగరావు ఫోన్ ద్వారమాట్లాడి అనాధలైన ఆ ఇద్దరు ఆడపిల్లలకు ధైర్యం చెప్పారు వారికి అండగా ఉంటామని వారు చదువుకోడానికి సహకరిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏనుగు రాజారెడ్డి పొన్నం భూమానందం మిట్టపల్లి రాజేశ్వర్ రెడ్డి మిట్టపల్లి నడిపి రాజారెడ్డి నేరెళ్ల రాజారెడ్డి నిమ్మల రాజేశం ఇనుగుర్తి వినోద్ మురళి సంతోష్ గుండో జి జనార్ధన్ ఎడమల నర్సారెడ్డి ఏనుగు రాజు బద్దం చిన్న రాజారెడ్డి ఎండి అకుర్ ఎలేటి రాజారెడ్డి బద్దం పెద్ద రాజారెడ్డి ముల్క గంగారం తదితరులు పాల్గొన్నారు

తుంకుంట సర్కిల్ ను శామీర్ పేట్ గా మార్చడం సరికాదు : తుంకుంట అఖిలపక్ష్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-27T125949.446.wav?_=2

 

తుంకుంట సర్కిల్ ను శామీర్ పేట్ గా మార్చడం సరికాదు : తుంకుంట అఖిలపక్ష్యం
* కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వజ్రష్ యాదవ్ కు వినతి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 27 :

 

తుంకుంట సర్కిల్ ను శామీర్ పేట్ గా మార్చడం సరికాదని తుంకుంట అఖిలపక్ష నేతలు అన్నారు. ఈ మేరకు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ను శనివారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంకుంట మున్సిపాలిటీ జిహెచ్ఎంసి లో విలీనం తర్వాత తూముకుంట పేరును శామీర్ పేటగా మార్చడం సరైన విషయం కాదన్నారు. తూముకుంటను షామీర్పేటగా మార్చడం కంటే తూముకుంట- శామీర్ పేట్ సర్కిల్ గా పేరు మార్చిన సరిపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికారులు 300 డివిజన్ కు తూముకుంట- శామీర్ పేట్ గా పేరును పెట్టాలన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఉత్తర తెలంగాణ కు గేటివేగా తుంకుంట ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకనుగునంగా తూంకుంట ప్రజల ఆత్మగౌరవం కాపాడేవిదంగా తుంకుంట డివిజన్ గా కొనసాగించాలని కోరారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 27 :

 

ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు తునికి రమేష్, ప్రధాన కార్యదర్శి కంటం కృష్ణారెడ్డి అన్నారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని అలియాబాద్ కు చెందిన వైల ఎల్లయ్య వైద్య పరీక్షలకు ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.30.000 చెక్కును శనివారం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక గొప్ప వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టి నాయకులు నాటకారి బాబు, లబ్ధిదారుడు ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T125108.610.wav?_=3

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఝరాసంగంలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్ ఆధ్వర్యంలో బోరు బావిని తవ్వించడం జరిగింది. త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు కాలనీలో అందరి సహకారంతో బోరు ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్ పాటిల్, చంద్రప్ప, పెంటయ్య, సంగమేశ్వర్, ఆనందం, రాజ్ కుమార్, నాగప్ప, తుకారం, ఇస్మాయిల్, మహమ్మద్ ఫక్రుద్దీన్, అనిల్ కుమార్, సాయిలు, నర్సింలు, లక్ష్మయ్య, సంగన్న, ఫక్రుద్దీన్, కృష్ణ, దత్తు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కార్యక్రమానికి విచ్చేయుచున్న
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ నేటి ధాత్రి తో మాట్లాడుతూ మండల గ్రామపంచాయతీ పరిధిలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారు ఉదయం 8 గంటలకు వచ్చి వారి వారి కల్యాణ లక్ష్మి చెక్కులను తీసుకోగలరని ,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
కోరారు
స్థలం : * గణపురం గ్రామపంచాయతీ కార్యాలయం *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version