తుంకుంట సర్కిల్ ను శామీర్ పేట్ గా మార్చడం సరికాదు : తుంకుంట అఖిలపక్ష్యం
* కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వజ్రష్ యాదవ్ కు వినతి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 27 :
తుంకుంట సర్కిల్ ను శామీర్ పేట్ గా మార్చడం సరికాదని తుంకుంట అఖిలపక్ష నేతలు అన్నారు. ఈ మేరకు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ను శనివారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంకుంట మున్సిపాలిటీ జిహెచ్ఎంసి లో విలీనం తర్వాత తూముకుంట పేరును శామీర్ పేటగా మార్చడం సరైన విషయం కాదన్నారు. తూముకుంటను షామీర్పేటగా మార్చడం కంటే తూముకుంట- శామీర్ పేట్ సర్కిల్ గా పేరు మార్చిన సరిపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికారులు 300 డివిజన్ కు తూముకుంట- శామీర్ పేట్ గా పేరును పెట్టాలన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఉత్తర తెలంగాణ కు గేటివేగా తుంకుంట ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకనుగునంగా తూంకుంట ప్రజల ఆత్మగౌరవం కాపాడేవిదంగా తుంకుంట డివిజన్ గా కొనసాగించాలని కోరారు.
