పార్టీని మరింత బలోపేతం చేయాలి
* డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
* కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు–కార్యకర్తల విస్తృత సమావేశం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు–కార్యకర్తల విస్తృత సమావేశం బుధవారం నారాయణపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వజ్రేష్ యాదవ్ గారు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని పేర్కొన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. గల్లీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. పార్టీ కోసం అంకితభావంతో కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గోన మహేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, బండి జగన్నాథం, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
