వనపర్తి లో వివేకానంద జయంతి వేడుకలలో ఆర్యవైశ్యలు..

వనపర్తి లో వివేకానంద జయంతి వేడుకలలో ఆర్యవైశ్యలు
వనపర్తి నేటిదాత్రి .

 

స్వామివివేకానందజయంతి వేడుకలలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయుల మేధాసంపత్తిని ప్రపంచానికి స్వామి వివేకానంద చాటి చెప్పారని వారు పేర్కొన్నారు యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు
ఈ కార్యక్రమంలో బి జె పి నేత పట్టణ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు బచ్చు రాము యూవజన సంఘము అధ్యక్షులు .బచ్చు వెంకటేష్ గోవిందు, సురేష్, శ్రీకాంత్, చందు మహేష్, కల్వ భూపేశ్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు .

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను కలిసిన-వెలిచాల…

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను కలిసిన-వెలిచాల

నేడు కరీంనగర్ కు వెలిచాల

ఘన స్వాగతం, ర్యాలీకి
పెద్ద ఎత్తున ఏర్పాట్లు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రులు రాజేందర్ రావును శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజేందర్ రావు మంత్రులను శాలువాలతో సన్మానించారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మరింత కష్టపడి పనిచేయాలనీ, కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రాజేందర్ రావుకు సూచించారు. కరీంనగర్లో వార్డు వార్డునా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో సమస్యల పరిష్కారానికి రాజేందర్రావు ప్రత్యేక దృష్టి పెట్టాలని నిధుల మంజూరుకు సంబంధించి కృషి చేస్తామన్నారు. అందరం కలిసి కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేద్దామని మంత్రులు పేర్కొన్నారు. కరీంనగర్లో సమస్యలు పరిష్కరిస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలనీ ఇందుకు అధికారులతో నిత్యం టచ్ లో ఉండాలనీ మంత్రులు వెలిచాల రాజేందర్రావుకు సూచించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాజేందర్రావు వారికి తెలిపారు. నాయకులందరితో కలిసి సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పని చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అధిష్టానం పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ నేతల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అంటే కరీంనగర్ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతామని రాజేందర్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు మొట్టమొదటిసారిగా మంగళవారం కరీంనగర్ కు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిచాల అభిమానులు మాజీ ప్రజా ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం ఉదయం 11 గంటలకు అల్గునూరు చౌరస్తాలో రాజేందర్రావుకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్లు, కార్లు ఇతర వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈమేరకు అలుగునూర్ చౌరస్తా నుంచి గీత భవన్ చౌరస్తా మీదుగా డిసిసి కార్యాలయం వరకు ఏర్పాట్లు చేపట్టారు. అదేవిధంగా గీత భవన్ చౌరస్తాలో స్వాగత కార్యక్రమం ఉంటుందని, కరీంనగర్ పట్టణంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు డిసిసి కార్యాలయంలో రాజేందర్రావు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సన్నిహితులు, వెలిచాల అభిమానులు సర్పంచులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నూతన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల…

కాంగ్రెస్ పార్టీ నూతన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియమితుల య్యారు. ఈమేరకు శనివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాజేందర్ రావుకు నియోజకవర్గ ఇన్చార్జి నియమానికి సంబంధించి లేఖను అందించారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు, నేతలతో పాటు ప్రతి ఒక్కరికి పేరుపేరునా రాజేందర్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు అధిష్టానం పెద్దలు తనపై అతిపెద్ద బాధ్యతను అప్పగించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైనికుడి వలె కష్టపడి పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రతి పల్లె పల్లెనా ప్రతి వార్డు వార్డునా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. కరీంనగర్లో డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర నాయకులు అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేస్తామని రాజేందర్రావు ధీమా వ్యక్తం చేశారు. రాజేందర్ రావ్ ను అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, రాజేందర్ రావ్ నియామకంతో కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు వెలిచాల అభిమానులు సన్నిహితులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని రాబోయే రోజుల్లో రాజేందర్ రావు నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలో బ్రహ్మాండంగా పార్టీ ముందుకు సాగుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version