కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు.

కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు
అడ్డుకున్న పోలీసులు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడినట్లేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నేతలకు తోపులాట జరగగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావం అయ్యింది.కొంతమంది కిందపడగా వారికి దెబ్బలు తగిలాయి. ఆందోళన చేస్తున్నంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చమరు ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని, అర్ధరాత్రి వంటగ్యాస్ యాభై రూపాయలు పెంచి పెదాలపై భారం మోపి పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెంచి వీటిని ఆయా కంపెనీలే భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమని, ఏదో ఒక రోజు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచదనే గ్యారంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానిగా పదకొండు సంవత్సరాలు గడిచిపోయిందని పదకొండు సంవత్సరాలలో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పెను భారం మోపడానికి అనేకసార్లు పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని, పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని అలాంటి విధానాలకు మోడీ స్వస్తి పలకాలని,తక్షణమే వంటగ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించక తప్పదని వెంకటస్వామి హెచ్చరించారు. వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు శాంతియుతంగా కమాన్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించడానికి అక్కడకు చేరుకున్న సీపీఐ నాయకులపై, కార్యకర్తలపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి, దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, ముఖం కనబడకుండా మాస్కులు వేసుకొని ఆర్ఎస్ఎస్,బిజెపికి తొత్తులుగా కొంతమంది వ్యవహరిస్తూ నాయకులపై, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడాన్ని సీపీఐ ఖండిస్తుందని, పేద ప్రజలకు అండగా సీపీఐ నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని, పోలీసులు ఈవిషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించాలని వెంకటస్వామి అన్నారు. ఈఆందోళన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, సాయవేణి రాయమల్లు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, నాయకులు కొట్టే అంజలి, చెంచల మురళి, తంగెళ్ళ సంపత్, చారి, రాజు, కూన రవి,నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ చెరుకు రసంతో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్..

సేంద్రియ చెరుకు రసంతో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్

పట్టణంలో సేంద్రియ చెరుకు అమ్ముతున్న ఓ యువకుడు

పరకాల నేటిధాత్రి

ఎండాకాలం ప్రారంభం అయిన తరుణంలో పట్టణంలో ఓ యువకుడు సేంద్రియ చెరుకు రస వాహనాన్ని తిప్పుతూ దానియొక్క పోషక విలవల గురించి వివరిస్తూ తక్కువ దరకే సేంద్రియ చెరుకు రసాన్ని అమ్మకం చేస్తున్నాడు.ఇంతకు మునుపెప్పుడు పట్టణంలో ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సేంద్రియ చెరుకు రసం విక్రయించింది లేదని సేంద్రియ చెరుకు రసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల అన్ని వయసుల వారికి కూడా ఎంతో మంచిదని,కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి చెరుకు రసం మేలు చేస్తు శరీరంలో ప్రొటీన్ లెవెల్స్ ను పెంచుతుంది.లివర్ సమస్యలు ఉన్నవారు అన్ని పోషకాలున్న ఈ డ్రింక్ తాగడం వల్ల అలసట వెంటనే మాయమవుతుంది ఒంట్లో వేడిని చిటికెలో తగ్గిస్తుందని జీర్ణక్రియను సులభతరం చేయడంలోనూ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.చర్మ సమస్యలు, డల్ స్కిన్ ఉన్నవారు చెరుకు రసం తీసుకోవడంలో ఫలితం ఉంటుందని రక్తహీనతతో బాధపడే వ్యక్తులకు ఇది ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తు యాంటీ ఆక్సిడెంట్స్ ను కూడా అందిస్తుందని ఇలాంటి ఉపయోగకర వ్యాపారాన్ని నిర్వరిస్తునందుకు ఆ యువకున్ని ప్రజలు అభినందిస్తున్నారు

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి

 

 

ఓదెల మండలంలోని పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకంలో విద్యార్థులకు భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో సుమారు 50 కి పైగా విద్యార్థులు హాజరు కాగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారని తెలిపారు. వాళ్లకు సందర్భంగా హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని సమాధానం బదులిచ్చారు.కానీ విద్యార్థులు మాకు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందించి అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాలమాజీ ఎంపీపీ ముక్తిసత్యం,గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

మండలంలో సోమవారం రాత్రి గాలి, దుమ్ముతోకురిసిన భారీ వర్షానికి మండలంలో పంటలు, ఇల్లులు, కరెంటు స్తంభాలు కూలిపోయాయని ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మండల తహసిల్దార్ ఇమ్మానియేల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ మండలంలో వందలాది ఎకరాల్లో పంట నేలమట్టం అయిందని, అనేక చోట్ల ఇల్లు కూలిపోయాయని, విద్యుత్ ట్రాన్స్ఫారాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అన్నారు.
మొక్కజొన్న నష్టపోయిన రైతుకు ఎకరాకు 50 వేలు, మిర్చి ఎకరాకు లక్ష రూపాయలు, వరి పంటకు 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మండలంలో కొడవటంచగ్రామంలో వర్షం కు దెబ్బతిన్న పంటను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యా సారపు వెంకన్న, పర్శక రవి, మానాల ఉపేందర్, బానోతులాలు, వాగబోయిన సుందర్రావు, వాగబోయిన బుచ్చయ్య, ఎట్టి సుధాకర్, ఇసం రమేష్, ఇసం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

కిసాన్ పరివార్ అధినేత జన్మదిన వేడుకలు..

కిసాన్ పరివార్ అధినేత జన్మదిన వేడుకలు

కనివిని ఎరుగని రీతిలో ప్రజాసేవకుడి జన్మదిన వేడుకలు

– దంతాలపల్లి మండలంలో ఘనంగా భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలు.

– ప్రజానీకంలో అశేష ఆధారణ పొందుతున్న యువ నేత భూపాల్ నాయక్.

మరిపెడ/దంతాలపల్లి నేటిధాత్రి.

 

ప్రజా సేవకుడు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కిసాన్ పరివార్ సేవా సంస్థ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామ అమ్మ ఒడి అనాధ శరణాలయంలో యువ దళపతి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.. అనంతరం వృద్ధులకు పండ్లను అందజేయడం అందజేసినారు.. అలాగే భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను ఆగపేట గ్రామ ఉపాధి హామీ కూలీలు,వాల్య తండా లో యువకులు,బిరిశెట్టి గూడెం లో భూపాల్ నాయక్ అభిమానులు,రేఖ్య తండాలో శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు..దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది…. దంతాలపల్లి మండలంలో బాణసంచాలు కాల్చి భూపాల్ నాయక్ జన్మదిన వేడుకల సంబరాలు జరుపుకున్నారు…పెద్ద ముప్పారం అనాధ ఆశ్రమ ఇంచార్జ్ మాట్లాడుతూ అనాధాశ్రమాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని,కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ కు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. రైతుల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడు,రైతు సంక్షేమం,అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే ప్రజా సేవకుడు భూపాల్ నాయక్ అని అన్నారు..గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పక్షాన నిలబడి మద్దతు తెలిపారని గుర్తు చేశారు.. పల్లెల్లో పలకరింపు కార్యక్రమంలో ఆగపేట ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేసి,ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పనులు చేయాలని సూచించారన్నారు.ఈ కార్యక్రమంలో మూడవత్ రవి నాయక్,ప్రవీణ్ కుమార్,యాకుబ్ నాయక్,పోలేపక మధు,ధర్మారపు సందీప్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి.

స్కూల్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. 

పాఠశాలలు ప్రారంభమై 9 నెలలు గడిచిన రూపాయి రాని పరిస్థితి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ వర్కర్లకు 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఉన్నాయని వాటిని వెంటనే ఇవ్వాలని బిఆర్టీయి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ పేరుతో విద్యా సంవత్సర ప్రారంభంలో కమిటీ తీర్మానం ప్రకారం స్కూల్ స్వీపర్లను నియమించుకుందని అప్పటినుండి నేటికీ 9 నెలలు గడిచయాన్నారు. వేసవి సెలవులు వచ్చే సరికి కూడా ఒక్క పైసా రాలేదని విద్యార్థుల సంఖ్య కనుగుణంగా జీరో నుండి 30 మంది విద్యార్థుల సంఖ్య ఉంటే 3 వేలు, 30 నుండి 60 మంది ఉంటే 6 వేలు,60 కి పైగా ఉంటే 12 వేల వేతనాలు వేతనాలు ఇస్తామని నియామకం చేసుకుని ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్న 3000 రూపాయలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలల నుండి జీతాలు లేకుండా పనిచేస్తే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని అన్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి జీవో ప్రకారం పెండింగ్ వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వర్కర్లు గొర్రె విజయ, రమాదేవి లక్ష్మి, ఖతాజీ మౌనిక, విజయ, సుజాత, పూజిత, బేతం రేణుక, బేబీ ,ఎల్లమ్మ, కనకమ్మ, జయలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

టీఎస్ పాలీసెట్ ఉచిత బోధన తరగతులు – 2025.

టీఎస్ పాలీసెట్ ఉచిత బోధన తరగతులు – 2025. 

మందమర్రి నేటి ధాత్రి

 

సింగరేణి సిఎండి శ్రీ ఎన్. బలరాం గారు మరియు డైరెక్టర్ (పా) శ్రీ కె. వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో టీఎస్ పాలీసెట్ – 2025 పరీక్షకు ఉచిత బోధన తరగతులు నిర్వహించబోతున్నాము.

ఈ తరగతులు 2025 ఏప్రిల్ 10 నుండి మే 10 వరకు సింగరేణి పాఠశాలల్లో నిర్వహించబడతాయి.

అర్హులు:

ఎస్ఎస్సి – 2025 పూర్తి చేసిన విద్యార్థులు

ఇతర పాఠశాలల్లో చదువుతున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు

సీట్ల పరిమితి మేరకు బడుగు, బలహీన వర్గాల, నిరుపేద ఎస్ఎస్సి విద్యార్థులు

వివరాలు: టీ.ఎస్ పాలీసెట్ (తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు:

లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు

ప్రభుత్వ/ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు

స్వంతంగా పరిశ్రమ/వ్యాపారం స్థాపించి స్వయం ఉపాధి పొందవచ్చు

మరిన్ని వివరాలకు: సమీపంలోని సింగరేణి పాఠశాల మందమర్రి ప్రధానోపాధ్యాయులను సంప్రదించగలరు సెల్ నెంబర్. 98492 15692

కార్యదర్శి సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్ సి ఈ ఎస్)

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.! 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి. 

సోషల్ మీడియా వేదిక గా ప్రచారం నిర్వహించాలి

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్ర

 

కె.సి.ఆర్ గారి నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి చేశారని మాజి మంత్రి అన్నారు వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.ఈ భారీగా వచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేశారు
రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు గ్రామగ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను,ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 25.సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్పూర్తి కలిగించాలని కోరుకున్నారు.
తెలంగాణ ఆస్తి కె.సి.ఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర,10ఏండ్ల అధికారంలో తెలంగాణ కె.సి.ఆర్ నాయకత్వములో సుభిక్షంగా మారిందని కొంతమది కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో అభిమానం తగ్గలేదని అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కె.సి.ఆర్ విలువ బి.ఆర్.ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చింది అని అన్నారు. 20రోజులలో నాయకులు మండల,గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రజతోత్సవ సభ విజయవంతంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు రుణ మాఫీ రైతు భరోస,మహిళలకు 2500,తొలం బంగారం,నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలని అన్నారు.రజతోత్సవ సభ విజయవంతంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సకల జనులు బి.ఆర్.ఎస్ వైపు చూస్తారని గౌరవ నిరంజన్ రెడ్డి అన్నారు.
వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, చంద్రశేఖర్ నాయక్,కురుమూర్తి యాదవ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,దిలీప్ రెడ్డి,వనం.రాములు,రాళ్ళ.కృష్ణయ్య,మాణిక్యం,వేణు యాదవ్,వెంకటస్వామి,మాజీ ప్రజాప్రతినిధులు రఘుపతి రెడ్డి,బోర్ల.భీమయ్య,కృష్ణా నాయక్, లక్ష్మమా రెడ్డి, కర్రేస్వామి, రాజశేఖర్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ, పెండం నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,ప్రేమ్ నాథ్ రెడ్డి,సమద్, స్టార్.రహీమ్,ఇమ్రాన్,హేమంత్ ముదిరాజ్,సూర్యవంశం.గిరి జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము,సునీల్ వాల్మీకి మహిళా నాయకురాలు నందిమల్ల.శారద ,నాగమ్మ,జమ్ములమ్మ, సాయిలీలా,కవితా నాయక్ తదితరులు పాల్గొన్నారని
జిల్లా మీడియా కన్వీనర్
నందిమల్ల అశోక్ తెలిపారు

ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు.!

మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారి ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రాంతంలో బస్టాండ్ ఏరియా లోని అభయ ఆంజనేయ స్వామి గుడి లో ఎమ్మెల్యే మాజీ విప్ నల్లాల ఓదెలు గారు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం రోజున స్థానిక అభయాంజనేయ స్వామి మారుతి నగర్ మందమర్రి బస్టాండ్. ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు ఏటూరి సత్యనారాయణ గారు మాజీ మా మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారు ఆరోగ్యంగా మహామృత్యుంజయడు గా తిరిగి రావాలని. అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.భక్తులకు ఓదన్న గారి అభిమానులు తీర్థప్రసాదాలను స్వీకరించి మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొద్దిరోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉన్నాడు. అరోగ్యం తొందరగా బాగా పాడాలని అభిమానులు కార్యకర్తలు భగవంతుని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరి సత్యనారాయణ తో పాటు ఓదన్న గారి అభిమానులు. ఆ ఏరియా ప్రజలు పెద్దలు అందరూ పాల్గొన్నారు

కోటగుళ్లలోని మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలి. 

కోటగుళ్లలోని మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలి. 

బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో టూరిజం వాల్ల ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలని బీజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైందని పనులు పూర్తయి ఆరు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించడం లేదన్నారు దీంతో కోటగుళ్లకి వచ్చే పర్యాటకులు ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ , టూరిజం శాఖ వారు స్పందించి వెంటనే మరుగుదొడ్లను ప్రారంభించి వాడుకలోకి తేవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి చెలిమల్ల ప్రవీణ్ కుమార్ బీజేవైఎం నాయకులు కర్క అన్వేష్ చరణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

మసీదులో హజ్ యాత్రికుల శిక్షణా శిబిరం.

ఏప్రిల్ 12న అరాఫత్‌లోని జహీరాబాద్ మసీదులో హజ్ యాత్రికుల శిక్షణా శిబిరం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

హజ్ యాత్రికుల కోసం ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అరాఫత్ మసీదులో ఒకరోజు శిక్షణ శిబిరం జరుగుతుందని, దీనిలో వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు పాల్గొంటారని అహ్మద్ అడ్వకేట్ తెలిపారు. మహిళలకు ప్రత్యేక బురఖా ఏర్పాటు ఉంటుంది. పాల్గొనేవారికి భోజన ఏర్పాటు ఉంటుంది. ముస్లిం సమాజం యాత్రికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ముహమ్మద్ జమీరుద్దీన్, న్యాయవాది ముహమ్మద్ ముయీజుద్దీన్ అలీ, అలీం మక్బూల్ అహ్మద్ వకార్ పటేల్, ముంతాజ్ అహ్మద్, ముయెజ్జిన్ సయ్యద్ ఇబ్రహీం చంద్ ఖాదిర్ మొహ్సిన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ్ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు.!

శ్రీరామ్ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి. 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శ్రీరామ్ మందిర్ ఆలయం లో శ్రీ సీతారాముల స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో వారిని సన్మానించారు.

Temple.

ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,డా౹౹చంద్రశేఖర్,బి.మల్లికార్జున్,శివాజీ సేన నాయకులు వంశీకృష్ణ గోడ్కే,శ్రీనివాస్ మరియు అర్చకులు,భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

ధ్యానం వాకింగ్ చేయాలి జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత.

ధ్యానం వాకింగ్ చేయాలి జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత. 
వనపర్తి నేటిదాత్రి :

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాసవి వనిత క్లబ్ వనపర్తి గోల్డ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశము నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా జెడ్జి శ్రీమతి ఎమ్.ఆర్ సునీత లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బి రజిని డిహెచ్ఎంఓ శ్రీనివాసులు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల న్యాయ వాది ఉత్తరయ్య పాల్గొన్నారు ఈసందర్భంగా జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం ఉదయం నడక తప్పనిసరిగా చేయాలని ఆరోగ్యం గా ఉంటారని అన్నారు పిల్లలను మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పిల్లలను గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి శ్రీనివాసులు సెక్రెటరీ కే బుచ్చయ్య కోశాధికారి ఏ మధుసూదన్ ఆర్యవైశ్య సంగం కన్వీనర్ పూరి బాలరాజు పట్టణ బీజేపీ మాజి అధ్యక్షులు బచ్చు రాము వనితా క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి సువర్ణ సెక్రెటరీ కొంపల్లి రజిత భార్గవి ఆర్యవైశ్య సంగం పట్టణ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి సంధ్య మాధవి రాజశేఖర్ నరసింహస్వామి నవీన్ వనపర్తి ఆర్యవైశ్య లు పాల్గొన్నారు. 

సిరిసిల్ల చేనేత కార్మికులను పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు.  

సిరిసిల్ల చేనేత కార్మికులను పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు.  

సిరిసిల్ల సి.పి.ఎం పట్టణ కార్యదర్శి అన్నదాస్ గణేష్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు గత ఎనిమిది రోజులుగా పవర్ లూమ్ ,వార్పిన్ , వైపని కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరెలకు కూలీ నిర్ణహించాలని సమ్మె చేస్తున్న కార్మికులకు సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ 24 గంటల నేతన్న దీక్షను విరమింప జేస్తూ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి. అనంతరం అన్నదాస్ గణేష్ మాట్లాడుతూ పట్టణంలోని తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లుకు కండ్లు కనిపించడం లేదా కార్మికుల గోడు వినిపించడం లేదా అని ప్రశ్నించారు.

Workers.

మున్సిపల్ ఎన్నికలలో కార్మికుల ఓట్ల కోసం చేతులు చాచే కౌన్సిలర్లు కార్మికుల వేతనాలు ఇతర సమస్యల పై మాట్లాడకుండా యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.

Workers.

పట్టణంలోని పవర్ లూమ్ కార్మికులు బి.ఆర్.ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడి కార్మికులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. పవర్ లూమ్ కార్మికుల కూలీ సమస్యపై స్పందించని తాజా మాజీ కౌన్సిలర్లు వారి పార్టీలపై పట్టణ కార్మిక కుటుంబాలు రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తుంటే బిజెపి నాయకులు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కార్మికుల సమస్యలపై మాట్లాడకుండా యజమానులకు తొత్తులుగా మారి కార్మికుల సమస్యలపై మౌనం వహిస్తున్న పై మూడు పార్టీలు రాజకీయ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని కార్మిక వర్గం రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, మూషం రమేష్, సూరం పద్మ, సిరిమల్ల సత్యం, నక్క దేవదాస్, బెజుగం సురేష్,ఉడుత రవి తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని రెండవ బైపాస్ చంద్రంపేట ఎక్స్ రోడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అధికారిక పర్యటన నిమిత్తం అటుగా వెళుతున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రమాదాన్ని చూసి గాయపడిన యువకులను అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక.

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక. 

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రంలో నూతన హనుమాన్ సేవ కమిటీ అధ్యక్షులుగా చిలువేరి కనకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కడారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రమేష్, క్యాషియర్ గా జవ్వాజి అజయ్, కమిటీ మెంబర్ లుగా బొజ్జ తిరుపతి, నీలం ప్రశాంత్, మాడిశెట్టి జయంత్, మండల లక్ష్మణ్, మూల వంశీ, పూరెల్ల రాహుల్, చిట్యాల కమలాకర్, చిట్యాల శివకుమార్, మాడిశెట్టి శ్రీసాయి, బాసరవేణి కళ్యాణ్, కీర్తి కుమార్, బొమ్మరవేణి శ్రీనివాస్ ఈరెళ్ళ అంజయ్య, బసవేణి మధు, ఒంటెల ఆదిత్య రెడ్డి, మామిడి రాజకుమార్, తదితరులను ఎన్నుకున్నారు.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భారత రాష్ట్ర సమితి యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య రంగ నిపుణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈసందర్భంగా బుదారపు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుద్ధత పాటించాలని డాక్టర్ల సూచనలేని అనవసరమైన మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడ రాదని తమ ఆరోగ్యాల పట్ల ఎవరికి వారు శ్రద్ధ వహించాలని కోరారు. ఈసందర్భంగా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వైద్య సిబ్బందిని సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి వెంకట గ్రీష్మన్య, వెంకటేశ్వర్లు, కొలిపాక కమలాకర్, స్వామి, పురాణం రమేష్, తిరుపతి, నరేందర్, శ్రీధర్, కొమురయ్య, శివశంకర్, నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పదోన్నతి పొందిన కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు.!

పదోన్నతి పొందిన కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు తెలిపిన సిఐ.  

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పరశురాములు, రవీందర్ లు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందారు. చొప్పదండి సిఐ ప్రకాష్‌గౌడ్, చొప్పదండి ఎస్‌ఐ సురేందర్ చేతుల మీదుగా పదోన్నతి తీసుకోని పరశురాములు మెదక్ జిల్లాకి, రవీందర్ కామారెడ్డి జిల్లాకి పదోన్నతిపై బదిలి అయ్యారు. పదోన్నతి పొందిన ఇరువురిని సిఐ ప్రకాష్ గౌడ్, ఎస్‌ఐ సురేందర్, సిబ్బంది, తదితరులు శుభకాంక్షలు తెలియజేశారు.

జీతం చిల్లి గవ్వతో సమానం.. లంచం లక్షలతో తులా భారం!

-రోజు లక్షలు మూట కనిపిస్తుంటే జీతం తాలుతో సమాతూకం

-ఇక అధికారులు మారమంటే ఎందకు మారుతారు?

-లంచాలు వద్దంటే అధికారులెందుకూరుకుంటారు?

-పట్టుబడతామని భయమెందుకు పడతారు?

-ఏ అధికారి జీతం కోసం ఎదురు చూడడం లేదు!

-రోజూ సూట్‌కేస్‌ల తూకం చూసుకుంటున్నారు.

-జనాన్ని పీడిరచుకు తింటున్నారు!

-పట్టుబడినా రెండేళ్ల వరకు కేసు తేలకుండా చూసుకుంటున్నారు.

-దర్జాగా మళ్ళీ కొలువులు తెచ్చుకొని అదే సీట్లో కూర్చుంటున్నారు.

-పెట్టిన పెట్టుబడికి మళ్ళీ పదింతలు వసూలు చేసుకుంటున్నారు.

-సస్పెండ్‌ అయిన కాలాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

-విందులు, వినోదాలతో కాలం గడుపుతున్నారు.

-సస్పెన్షన్‌ కాలానికి కూడా తర్వాత జీతాలు అందుకుంటున్నారు.

-జీవితాంతం కష్టపడినా రాని సంపాదన లంచాల రూపంలో పదేళ్లలో పోగేసుకుంటున్నారు.

-ఏసిబి ఎంత కష్టపడి పట్టుకున్నా కేసులు నిలబడక కొలువుకెక్కుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఉగాది పండుగ రోజు ఎవరైనా తప్పుడు పని చేయాలనుకుంటారా? తొలి పండుగ రోజు ఆత్మ వంచన చేసుకోవాలని ఎవరైనా చూస్తారా? అంటే కొంత మంది వుంటారు. మానవత్వం మర్చినవారు, మంచితనం లేని వారు వుంటారు. ఉగాది పండుగ రోజు లంచం తీసుకుంటే సంవత్సరమంతా లంచాల సంపాదన మూడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని ఆశించే దౌర్భాగ్యులు కూడా కొంత మంది వుంటారని తేలింది. ఓ అదికారి ఏకంగా ఉగాది నాడు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారంటే పరిస్దితి ఎంత దారుణంగా వుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు ఆ లంచంకూడా ఉగాది పండుగ రోజు కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. ఏసిబికి పట్టుబడ్డాడు. ఇక మరో ఇరిగేషన్‌ ఉద్యోగి ఓ వ్యక్తి భూమి ఎఫ్‌టీఎల్‌, భఫర్‌ జోన్‌లో లేదని ఎన్‌వోసి ఇవ్వడానికి శ్రీరారమ నవమి పండుగ రోజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిజానికి ఈ రెండు రోజులు ప్రభుత్వ సెలవు రోజులు. అయినా ఆ లంచాల వతారులకు పండగ, పబ్బం, నీతి, నిజాయితీ, మంచి తనం అనేది మచ్చుకు కూడా లేదని తేలిపోయినట్లైంది. ఇలాంటి అధికారులు తెలంగాణలో ఎంతో మంది వున్నారు. పట్టుబడుతూనే వున్నారు. ఎందుకంటే కొంత మంది ఉన్నతోద్యోగులకు జీతం చిల్లిగవ్వతో సమానమైపోయింది. దాన్యంలో తాలుతో సమానమైపోయింది. జీతం అన్నది లెక్కలేకుండాపోయింది. ఎందుకంటే లంచాల ద్వారా జీతానికి పదుల రెట్లు నెలనెల సంపాదన అందుతోంది. అక్రమ సంపాదనకు పూర్తిగా అలవాటుపడిన కొంత మంది ఉద్యోగులు ఈ విధంగా లంచం లేనిదే పూట గడపడం లేదు. ఇది ఈ శాఖ, శాఖ అని తేడాలేదు. ఏశాఖలో చూసినా లంచావతారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒకప్పుడు నెల జీతగాళ్లమని చెప్పుకునే అదికారులు ఇప్పుడు జీతం కోసం ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. లంచాల పేరుతో నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తూ, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అలా లంచాలు తీసుకుంటూ దొరుకుతున్న వారు కేవలం ఒక్క శాతమే.. ఇంతగా ఏసిబి దృష్టిపెట్టినా అధికారులు లంచాలు తీసుకోవడం ఎందుకు మానుకోవడం లేదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కళ్లమందు లక్షలకు లంచాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంటే ఊరికే పనులు ఎందుకు చేయాలన్న ఆలోచన అధికారుల్లో మొదలైంది. సంతకం పెట్టాలంటే, పెన్ను కదలాంటే లంచం అందాల్సిందే..లేకుంటే అదికారుకు కనికరం అనేది లేకుండా పోతోంది. వ్యవస్ధలన్నీ దిగిజారిపోతున్నాయి. ఏ శాఖలో చూసినా లంచమే కనిపిస్తోది. ఈ మధ్య పట్టుబడుతున్న వారిలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికులు వున్నారు. గత వారం రోజుల్లోనే వైద్య, రెవిన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌, ఆఖరుకు విద్యాశాఖకు చెందిన ఉన్నతోద్యోగులు పట్టుబడ్డారంటే ఎంతగా భరితెగించారో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి జీతం మీద లెక్కలేదు. జీతం ఆగిపోతుందన్న భయం లేదు. ఉద్యోగం పోతుందన్న భయం అసలే లేదు. ఎందుకంటే ఒక వేళ ఏసిబికి పట్టుబడినా, ఆ కేసును రెండు సంవత్సరాల పాటు కొనసాగేలా చేసుకంటే సరిపోతుంది. అప్పుడు న్యాయస్ధానమే ప్రభుత్వానిది తప్పని తేల్చి, లంచావతారులకు మళ్లీ పోస్టింగ్‌ ఇస్తుంది. చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకొని, ప్రజల జీవితాలతో కొంత మంది లంచగొండులు ఆడుకుంటున్నారు. లంచం తీసుకున్నాడని తెలిస్తే వెంటనే ఉద్యోగం పోతుందన్న భయం లేదు. ఉద్యోగులు ఇంతలా దిగజారిపోతారని చట్టంచేసినప్పుడు ప్రభుత్వాలు అనుకోలేదు. రాజ్యాంగంలో పొందుపర్చినప్పుడు ఉద్యోగులకు హక్కులు కల్పించబడినప్పుడు పెద్దలు ఆలోచించలేదు. అది ఇప్పుడు ఉద్యోగులకు వరమైంది. ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా కాపాడుతోంది. వారి కొలువకు భరోసా కల్పిస్తోంది. అందుకే ఉద్యోగులు ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయడం లేదు. ప్రభుత్వాలను కూడా లెక్క చేయడం లేదు. లంచాలకు మరిగి..మానవత్వం మరిచి! దిగజారిపోతున్న రెవిన్యూ వ్యవస్ధ. లంచాలు లేనిదే కొలువు చేయలేకపోతున్న ఉద్యోగులు. తహసిల్ధారుల మితిమీరుతున్న ఆగడాలు. రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. రైతులు భూములు అమ్ముకున్నా కష్టమే? కొనుక్కున్నా లంచం ఇవ్వాల్సిందే. ఆఖరుకు తమ భూమి తమ పేరు మీద మార్చుకున్నా లంచమే. తహసిల్ధార్‌ సంతకం పెట్టాలంటే కూడా లంచమే. రైతుల రక్తం తాగుతున్నారు.. ఏసిబికి ఎంత మంది చిక్కుతున్నా భయపడడం లేదు. కేసులు పెడతారన్న ఆందోళన లేదు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం అసలే లేదు. తప్పు చేస్తున్నామన్న భావన అసలే లేదు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. చిన్నా, చితకా పని ఏదైనా సరే..లంచం ఇవ్వాల్సిందే. రైతులను అరిగోస పెడుతున్నారు. అయినా పట్టింపు ఎవరికీ లేదు. కొంత మంది తహసిల్ధార్‌లలో కనీసం మానవత్వం కరువైపోతోంది. ఎక్కడికక్కడ కొంత మంది తహసిల్ధార్‌లు ఏసిబికి పట్టుబడుతున్నా, మిగతా వాళ్లు భయపడం లేదు. కాసుల కక్కుర్తికి బాగా అలవాటు పడ్డారు. లంచాలు తీసుకోకుండా వుండలేకపోతున్నారు. లంచం తమ హక్కు అకునే స్ధాయికి దిగిజారిపోతున్నారు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము? జైలుకెళ్తాము..ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది వుందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదుతుందా? అనుకుంటున్నట్లున్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంత మంది తహసిల్ధార్‌లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు. విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు నాలుగురోజులైతే చెరిగిపోతాయి. విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ..లేకుంటే దొర..అంతే ఇక్కడ పెద్ద తేడాలేదు. తహసిల్ధార్‌లు అడిగింది ఇవ్వాల్సిందే..లేకుంటే జీవిత కాలం చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే..ఎమ్మార్వో కాళ్లునిత్యం మొక్కాల్సిందే..అయినా ఆఖరుకు ఎమ్మార్వోలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్ధితులు రాష్ట్రంలో వున్నాయంటేనే సిగ్గు చేటు. రోజుకు లక్షల రూపాయల్లో లంచాలు వస్తుంటే, వారి ఆగడాలకు అడ్డూ అదుపేముంటుంది. రైతుల బలహీనతలను ఆసరా చేసుకొని వారికి మేలు చేస్తామని స్దానిక నాయకులు చెబుతుంటారు. నిజానికి ఏ సమస్య వచ్చినా నేరుగా తహసిల్ధార్‌ వద్దకు వెళ్లొచ్చు. కాని ఇప్పటికీ అధికార యంత్రాంగం అంటే ప్రజలకు కూడా భయమే వుంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టడానికి సామాన్యుడు ముందూ వెనుక ఆలోచిస్తూనే వుంటాడు. తమ సమస్యచెప్పుకుందామని వెళ్లినా ముందుగా అటెండర్ల నుంచే చిన్న చూపు ఎదురౌతుంది. సార్‌ లేడంటూ..లేదంటే పక్కన నిలబడంటూ…రేపు రాపో అంటూ అటెండర్లే రైతులను, ఇతర పనులపై వచ్చిన ప్రజలను గద్దిస్తుంటారు. దాంతో ప్రజలకు తమ పనులకోసం ఆ గ్రామంలోవున్న నాయకులను తీసుకొని వెళ్తుంటారు. నాయకులు మధ్య వర్తిత్వం వహిస్తుంటారు. సంబంధిత అధికారులతో బేర సారాలు చేసుకుంటారు. అప్పుడుగాని ప్రజలకు మోక్షం దొరకదు. ఇలా నిత్యం డబ్బుల మూటలు అందుతుంటే అదికారులు మారమంటే ఎందుకు మారుతారు? లంచాలు తీసుకోవద్దంటే ఎందుకు ఊరుకుంటారు? పట్టుబడతామని ఎందుకు భయపడతారు? పట్టుబడినా ఫరవాలేదని చాలా మంది అదికారులు తెగించేశారు. మహా అయితే ఓ నాలుగు రోజులు జైలుకెళ్తారు. అక్కడ ఇతర క్రిమినల్స్‌ వుంటే ట్రీట్‌ మెంటు వుండదు. అందువల్ల జైలు జీవితం అంటే పెద్దగా భయం కూడా వుండడంలేదు. రోజూ సూట్‌కేసుల తూకం కళ్లముందు కనిపిస్తుంటే, పట్టుబడితే కదా? అన్న ఆలోచన తప్ప, భయం వుండడడం లేదు. ఒక వేళ పట్టుబడి సస్పెండ్‌ అయినా ఎలాంటి బాధ వుండదు. ఎందుకంటే ఇవ్వాల కాకపోయినా రేపు తన ఉద్యోగం తనకు వస్తుందన్న బలమైన నమ్మకం. ఆ సస్పెన్షన్‌ కాలంలో హాయిగా విందులు, వినోదాలు, విహారయాత్రలు, వ్యాపారాలు చూసుకుంటున్నారు. మొత్తానికి చాలా మంది ఉన్నతోద్యోగులు తెగిస్తున్నారు. అందుకే నిత్యం ఎక్కడో అక్కడ పట్టుబడుతున్నారు. అందులో కూడా నిస్సిగ్గుగానే వ్యవహరిస్తున్నారు.

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.!

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సోమవారం నాడు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదిలాపల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ నాయకులు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఏర్పడడంతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

error: Content is protected !!
Exit mobile version