స్కూల్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి.

School workers

స్కూల్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. 

పాఠశాలలు ప్రారంభమై 9 నెలలు గడిచిన రూపాయి రాని పరిస్థితి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ వర్కర్లకు 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఉన్నాయని వాటిని వెంటనే ఇవ్వాలని బిఆర్టీయి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ పేరుతో విద్యా సంవత్సర ప్రారంభంలో కమిటీ తీర్మానం ప్రకారం స్కూల్ స్వీపర్లను నియమించుకుందని అప్పటినుండి నేటికీ 9 నెలలు గడిచయాన్నారు. వేసవి సెలవులు వచ్చే సరికి కూడా ఒక్క పైసా రాలేదని విద్యార్థుల సంఖ్య కనుగుణంగా జీరో నుండి 30 మంది విద్యార్థుల సంఖ్య ఉంటే 3 వేలు, 30 నుండి 60 మంది ఉంటే 6 వేలు,60 కి పైగా ఉంటే 12 వేల వేతనాలు వేతనాలు ఇస్తామని నియామకం చేసుకుని ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్న 3000 రూపాయలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలల నుండి జీతాలు లేకుండా పనిచేస్తే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని అన్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి జీవో ప్రకారం పెండింగ్ వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వర్కర్లు గొర్రె విజయ, రమాదేవి లక్ష్మి, ఖతాజీ మౌనిక, విజయ, సుజాత, పూజిత, బేతం రేణుక, బేబీ ,ఎల్లమ్మ, కనకమ్మ, జయలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!