అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్.. మ్యాచ్ ఫీజులో కోత…

అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్.. మ్యాచ్ ఫీజులో కోత

 

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అతడు అంపైర్‌ను దూషించాడనే కారణంతో జరిమానా విధించింది.

ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ప్రవర్తనా తీరుపై బీసీసీఐ సీరియస్ అయింది. అతడు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా సహా ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. అంపైర్ నిర్ణయంపై అసభ్య పదజాలంతో దూషించాడనే కారణంతో లెవల్ వన్ నేరం కింద డాషింగ్ ఓపెనర్‌పై మ్యాచ్ రిఫరీ ఈ పనిష్మెంట్ విధించాడు.

మళ్లీ ఆడపిల్లేనని..!

చేనేతల పొట్టకొడుతున్న సర్కార్‌

ఏడాదికి రూ.80 లక్షల జీతంతో కొలువు..ఏఐ ప్రభావంతో పోయిన ఉద్యోగ

పీఆర్సీ నివేదికలో జాప్యం వద్దు: ఉద్యోగుల సంఘం

కాళేశ్వరానికి పైసా ఇచ్చారా? కేసీఆర్‌ ఇంట్లోంచి తెచ్చారా?

చేనేత కార్మికుల పొట్టకొడుతున్న రేవంత్‌:కవిత

డ్రగ్స్‌ కేసులో ఆర్థిక లావాదేవీలపై విచారణ!

యుద్ధం ఆగదు

ఎవరి కోసం ఈ యుద్ధం?

ఇరాన్‌పై ఇంకా దాడులెందుకు?

హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి!

సర్‌ లెక్కలు తేల్చడానికి వచ్చిన న్యాయాధికారులపై దాడి

ఎవరెస్ట్‌పై ప్రాణాల మీదకు తెచ్చి.. భయపెట్టి..!

మళ్లీ ఆడపిల్లేనని..!

చేనేతల పొట్టకొడుతున్న సర్కార్‌

ఏడాదికి రూ.80 లక్షల జీతంతో కొలువు..ఏఐ ప్రభావంతో పోయిన ఉద్యోగ

పీఆర్సీ నివేదికలో జాప్యం వద్దు: ఉద్యోగుల సంఘం

కాళేశ్వరానికి పైసా ఇచ్చారా? కేసీఆర్‌ ఇంట్లోంచి తెచ్చారా?

చేనేత కార్మికుల పొట్టకొడుతున్న రేవంత్‌:కవిత

డ్రగ్స్‌ కేసులో ఆర్థిక లావాదేవీలపై విచారణ!

యుద్ధం ఆగదు

ఎవరి కోసం ఈ యుద్ధం?

ఇరాన్‌పై ఇంకా దాడులెందుకు?

హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి!

సర్‌ లెక్కలు తేల్చడానికి వచ్చిన న్యాయాధికారులపై దాడి

ఎవరెస్ట్‌పై ప్రాణాల మీదకు తెచ్చి.. భయపెట్టి..!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ టీమ్ తొలుత బ్యాటింగ్‌‌కు దిగింది. బౌండరీలతో విరుచుకుపడిన అభిషేక్ హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో.. ముజరబాని వేసిన ఓ బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే.. వరుణ్ చక్రవర్తి పట్టిన ఆ క్యాచ్ కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేశాడు. క్యాచ్ పట్టుకునే సమయంలో బంతి నేలను తాకుతున్నట్లు కనిపించింది. అందరూ నాటౌట్‌ అనుకుంటుండగానే థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అసహనానికి లోనైన అభిషేక్.. అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ తర్వాత పెవిలియన్‌కు వెళ్లాక తన తప్పును అంగీకరించాడు.అయితే.. మ్యాచ్‌లో అభిషేక్ ప్రవర్తన సరిగాలేదనే కారణంతో జరిమానా విధించేందుకు మ్యాచ్ అధికారులు నిర్ణయించారు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఆర్టికల్ 2.3 కింద లెవల్ వన్ నేరాన్ని అభిషేక్ శర్మ అంగీకరించినట్టు ఐపీఎల్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా అసభ్య పదజాలం ఉపయోగిస్తే వారికి ఆర్టికల్ 2.3 కింద లెవల్ వన్ నేరం వర్తిస్తుందని పేర్కొంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ శర్మ (48; 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (46; 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్లాసెన్ (52; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (39; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)ల విధ్వంసంతో 20 ఓవర్లలో 226/8 భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాటర్లు తడబడటంతో 16 ఓవర్లలోనే 161 పరుగులకు పరిమితమైంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఉనద్కత్ 3 వికెట్లతో చెలరేగగా, ఇషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లతో రాణించారు.

అభిషేక్ శర్మ విధ్వంసం.. మరో సూపర్ సెంచరీ..

అభిషేక్ శర్మ విధ్వంసం.. మరో సూపర్ సెంచరీ!

 

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 32 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.

 టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ సెంచరీలతో అదరగొడుతున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, పంజాబ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో అతడు 32 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 310 పరుగులు చేసింది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనే ఇది రెండో అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్.
తొలుత టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) 52 బంతుల్లో 148 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రికార్డ్ స్థాయిలో 16 సిక్సులు, 8 ఫోర్లతో విరుచుపడ్డాడు. ప్రభు సిమ్రన్ సింగ్‌తో కలిసి అతడు మొదటి వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రభు(70) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అన్‌మోల్ ప్రీత్ సింగ్(11) నిరాశ పర్చాడు. రమణ్‌దీప్ సింగ్(39), సన్విర్ సింగ్(22) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. నమన్ ధీర్(7), నేహాల్ వధేరా(2) నాటౌట్‌గా నిలిచారు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, షమీ, ప్రదీప్త ప్రమాణిక్, సాక్షైమ్ చౌదరి తలో వికెట్ పడగొట్టారు.

యువీ సరసన..

అభిషేక్ శర్మ తొలుత 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. తన మెంటార్, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh) సరసన నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ 2007లో యువీ 12 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఆసియా కప్ 2025: ఓపెనర్‌గా గిల్, సందేహంలో శాంసన్ స్థానం..

ఆసియా కప్ 2025 భారత జట్టు ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి.
సంజు శాంసన్ ఇటీవల తన 12 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు చేసినప్పటికీ, ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు అవకాశమివ్వాలనే ఆలోచన జట్టులో చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో గిల్ ప్రదర్శన టీ20 జట్టులో అతని స్థానం కోసం డిమాండ్ పెంచింది. దీంతో శాంసన్ మిడిల్ ఆర్డర్‌కు నెట్టబడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ – “గిల్ ఆడితే, ఎవరిని జట్టులోంచి తొలగిస్తారు? శాంసన్ అయితే, వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు. శాంసన్ నంబర్ 5లో ఆడతాడా?” అని ప్రశ్నించారు.

అభిషేక్ శర్మ కూడా ఓపెనర్‌గా బలమైన ప్రత్యామ్నాయమని ఆయన సూచించారు. ఇంగ్లాండ్‌పై 279 పరుగులు 219.68 స్ట్రైక్ రేట్‌తో సాధించిన అభిషేక్, ఈసారి జట్టులో చోటు దక్కించుకోవచ్చని అంచనా.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version