ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు…

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు

డీఆర్‌డీఏ సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంస

డీఆర్‌డీఏ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఈ-సైకిళ్ల పంపిణీలో ప్రతిభ కనబరిచిన డీఆర్‌డీఏ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రశంసించారు. శనివారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో పీడీ శ్రీదేవితో కలిసి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశాశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కుప్పం పట్టణం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి నమోదయ్యేలా 24 గంటల వ్యవధిలో  ఈ-సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈవిషయంలో సంతోషం వ్యక్తం చేశారన్నారు. స్వచ్ఛంద కార్యక్రమాలు, మహిళా సంఘాలను బలోపేతం లాంటి కార్యక్రమాల అమలుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ డీపీఎంలు, ఏపీఎంలు, ఏపీఎంసీసీ, సభ్యులు పాల్గొన్నారు.

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్…

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్

 

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. అమెరికా బౌలర్ల ధాటికి పేకమేడల్లా కుప్పకూలింది. ఒకానొక సందర్భంలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నాక్ ఆడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో ఏకంగా 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య ఒంటరి పోరాటం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 161 పరుగుల చేసింది. 162 పరుగులతో ఛేదనకు దిగిన అమెరికా.. 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్‌కు విజయం లాంఛనమైంది.

విధ్వంసకర బ్యాటింగ్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం సూర్య జట్టు గెలుపుపై మాట్లాడాడు. ‘నేనెంత ఒత్తిడి అనుభవించానో.. నేను మాత్రమే చెప్పగలను. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతానని నాకు తెలుసు. నేను చివరి వరకు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా మారుతుందని నా మీద నాకు నమ్మకముంది. పిచ్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. కానీ ఎప్పుడు పరుగులు వేగంగా రాబట్టాలో మాకు తెలుసు.క్యురేటర్ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. పిచ్‌ను రూల్, వాటరింగ్ చేయడానికి సరైన సన్‌లైట్ కూడా లేదు. ఈ పిచ్ మీద 180, 190 పరుగులు చేయలేమని ముందే అనిపించింది. 140 పరుగుల వికెట్ ఇది. 14 ఓవర్ల తర్వాత వచ్చిన బ్రేక్‌లో గౌతీ భాయ్ నాకు అదే విషయం చెప్పాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించు.. నువ్వు ఏ సమయంలోనైనా కవర్ చేయగలవు అన్నాడు. ఆ బ్రేక్ మాకు కలిసొచ్చింది. ముఖ్యంగా నేను ముంబైలో చాలా క్రికెట్ ఆడాను. ఇక్కడి పిచ్‌ల గురించి నాకు ఓ అవగాహన ఉంది’ అని సూర్య చెప్పుకొచ్చాడు.

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్…

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

 

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్‌గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. దాదాపు ఏడాది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్సీ విషయంలో అజేయంగా నిలుస్తున్నప్పటికీ.. సూర్య బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఫామ్ అందుకుని అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ ముందు స్కై ఫామ్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయమే. ఈ నేపథ్యంలో సూర్య కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫార్ పఠాన్(Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav)కు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డ్ ఉంది. టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా అతడికి విజయాల శాతం 84. ఇది చాలా ఎక్కువ. కానీ మనం సూర్యకుమార్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. అలాగే సూర్య బౌలర్ల కెప్టెన్. అతడిలో రోహిత్ శర్మ ఛాయలున్నాయి. అతడు బౌలర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. జట్టు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు.

ఆసియా కప్ 2025: ఓపెనర్‌గా గిల్, సందేహంలో శాంసన్ స్థానం..

ఆసియా కప్ 2025 భారత జట్టు ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి.
సంజు శాంసన్ ఇటీవల తన 12 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు చేసినప్పటికీ, ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు అవకాశమివ్వాలనే ఆలోచన జట్టులో చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో గిల్ ప్రదర్శన టీ20 జట్టులో అతని స్థానం కోసం డిమాండ్ పెంచింది. దీంతో శాంసన్ మిడిల్ ఆర్డర్‌కు నెట్టబడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ – “గిల్ ఆడితే, ఎవరిని జట్టులోంచి తొలగిస్తారు? శాంసన్ అయితే, వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు. శాంసన్ నంబర్ 5లో ఆడతాడా?” అని ప్రశ్నించారు.

అభిషేక్ శర్మ కూడా ఓపెనర్‌గా బలమైన ప్రత్యామ్నాయమని ఆయన సూచించారు. ఇంగ్లాండ్‌పై 279 పరుగులు 219.68 స్ట్రైక్ రేట్‌తో సాధించిన అభిషేక్, ఈసారి జట్టులో చోటు దక్కించుకోవచ్చని అంచనా.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version