ఇంగ్లండ్‌ నిలిచింది.

ఇంగ్లండ్‌ నిలిచింది

భారత మహిళలతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ జట్టు తమ ఆశలను సజీవంగా నిలుపుకొంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన రెండో వన్డేలో నాట్‌ సివర్‌ సేన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన…

లండన్‌: భారత మహిళలతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ జట్టు తమ ఆశలను సజీవంగా నిలుపుకొంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన రెండో వన్డేలో నాట్‌ సివర్‌ సేన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 8 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం సిరీ్‌సలో ఇరు జట్లు 1-1తో నిలవగా.. ఆఖరి మ్యాచ్‌ మంగళవారం జరుగుతుంది. వర్షం కారణంగా నాలుగు గంటలు ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. మంధాన (42), దీప్తి శర్మ (30 నాటౌట్‌) మాత్రమే రాణించారు. ఎకెల్‌స్టోన్‌కు 3.. ఎర్లాట్‌, లిన్సే స్మిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 రన్స్‌గా నిర్ణయించారు. ఓపెనర్లు అమీ జోన్స్‌ (46 నాటౌట్‌), బ్యూమంట్‌ (34)ల ధాటికి ఇంగ్లండ్‌ 21 ఓవర్లలో 116/2 స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది.

అర్జున్‌ పరాజయం..

అర్జున్‌ పరాజయం

ఫ్రీ స్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ చెస్‌లో సెమీఫైనల్‌ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీస్‌లో…

లాస్‌ వెగాస్‌: ఫ్రీ స్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ చెస్‌లో సెమీఫైనల్‌ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీస్‌లో అర్జున్‌ 0-2తో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ లివోన్‌ అరోనియన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో సెమీస్‌లో హాన్స్‌ మోక్‌ నీమన్‌ చేతిలో ఫాబియానో కరువాన ఓడాడు. ఫైనల్లో ఆరోనియన్‌తో నీమన్‌ తలపడనున్నాడు. కాగా, 3 నుంచి 8 స్థానాల కోసం జరిగిన పోరులో విన్సెంట్‌ కీమర్‌పై ప్రజ్ఞానంద 1.5-0.5తో గెలిచాడు.

తొలి గేమ్‌లో హంపి గెలుపు..

తొలి గేమ్‌లో హంపి గెలుపు

తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు అర పాయింట్‌ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్‌ సాంగ్‌పై హంపి…

మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌

బటూమి జార్జియా): తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు అర పాయింట్‌ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్‌ సాంగ్‌పై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన హంపి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. ఆదివారం జరిగే రెండో గేమ్‌ను డ్రా చేసుకొన్నా చాలు.. హంపికి సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది. కాగా, భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్‌ మధ్య క్వార్టర్స్‌ మొదటి గేమ్‌ డ్రాగా ముగిసింది. ఇక, మరో క్వార్టర్స్‌ తొలి గేమ్‌లో మాజీ వరల్డ్‌ చాంపియన్‌ జోంగి టాన్‌ (చైనా)తో వైశాలి పాయింట్‌ పంచుకొంది. ఇక, క్వార్టర్స్‌లో హారిక, దివ్య తలపడుతుండడంతో భారత్‌ తరఫున ఒకరు సెమీస్‌ చేరడం ఖాయమైంది.

90 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెట్ కు అన్యాయం

 

90 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెట్ కు అన్యాయం

టి సి జె ఎ సి అడ్వైజర్ పాయిరాల శరత్ యాదవ్

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న జనరల్ బాడీ మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం జరిగింది, గత 90 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెట్ కి అన్యాయం జరుగుతున్న సందర్భంగా జిల్లా క్రికెట్ కి న్యాయం చేయాలని గ్రామీణ క్రీడాకారులను గుర్తించి తగిన అవకాశాలు ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ అలాగే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు 209 క్లబ్లు ఉండగా తెలంగాణ ఉమ్మడి 8 జిల్లా లకు కేవలం 8 క్లబ్బులు మాత్రమే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఖండిస్తూ తెలంగాణ జిల్లాలకు 300 క్రికెట్ క్లబ్బులు అఫిలియేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ స్టేడియం ని ముట్టడించడం జరిగింది, ఇప్పటికైనా స్పోర్ట్స్ మినిస్టర్ స్పందించి తెలంగాణ గ్రామీణ క్రీడకరులకు న్యాయం చేయాలని లేని పక్షాలు బీసీసీఐకి చెప్పి తెలంగాణ కి సపరేట్ అసోసియేషన్ కి సహకరించగలరని టి

 

సి జె ఎ సి అడ్వయిజర్
పాయిరాల శరత్ యాదవ్
మాజీ విజ్జి ట్రోఫీ ప్లేయర్
మాజీ హెచ్ సి ఏ ప్లేయర్
కాకతీయ యూనివర్సిటీ మాజీ కెప్టెన్ మాట్లాడారు ఇట్టి కార్యక్రమం లో తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి టి సి జె ఎ సి జిమ్మి బాబు తదితరులు పాల్గొన్నారు.

ఫీజులో కోత.. ఓ డీమెరిట్‌ పాయింట్‌..

ఫీజులో కోత.. ఓ డీమెరిట్‌ పాయింట్‌

ఇంగ్లండ్‌ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్‌ ప్రతికా రావల్‌కు జరిమానా విధించారు.

ప్రతికా రావల్‌కు జరిమానా

దుబాయ్‌: ఇంగ్లండ్‌ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్‌ ప్రతికా రావల్‌కు జరిమానా విధించారు. భారత ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ప్రతిక.. సింగిల్‌ తీసే క్రమంలో ప్రత్యర్థి బౌలర్‌ లారెన్‌ ఫిలర్‌ను ఢీకొట్టింది. అంతేగాకుండా తర్వాతి ఓవర్‌లో తాను అవుటవగానే ప్రతిక.. మరో బౌలర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో లెవెల్‌ 1 తప్పిదం కింద ప్రతికకు మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్‌ పాయింట్‌ను కేటాయించారు. అదే మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడిన ఇంగ్లండ్‌ జట్టు సభ్యులకు మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం కోత విధించారు.

పెయింటర్‌గానే ఎక్కువ సంపాదన..

పెయింటర్‌గానే ఎక్కువ సంపాదన

దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జాక్‌ రస్సెల్‌ ఇప్పుడు కాన్వాస్‌ పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 1988-1998 మధ్య తను…

లండన్‌: దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జాక్‌ రస్సెల్‌ ఇప్పుడు కాన్వాస్‌ పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 1988-1998 మధ్య తను 54 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. కళ్లకు నల్లటి గ్లాసులు, తలకు పనామా టోపీ, పొడవాటి మీసాలతో విలక్షణంగా కనిపించే రస్సెల్‌ 90 దశకంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకునేవాడు. క్రికెట్‌ నుంచి వైదొలిగాక పెయింటింగ్‌లో బిజీ అయ్యానని చెప్పాడు. అంతేకాకుండా క్రికెట్‌ ఆడే సమయంలోకన్నా ఇప్పుడే ఎక్కువగా సంపాదిస్తున్నట్టు రస్సెల్‌ తెలిపాడు. అయితే ధన సంపాదన కోసమే పెయింటింగ్స్‌ వేయడం లేదని, బొమ్మలు గీయడం తనకో వ్యసనమని తేల్చాడు. భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నందున తాను రంజిత్‌ సింగ్‌జీ బొమ్మను సైతం చిత్రించినట్టు పేర్కొన్నాడు.

అప్పుడే ఎంత ఎదిగావు తల్లీ..

అప్పుడే ఎంత ఎదిగావు తల్లీ

కూతురు ఐరా 10వ పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. షమి-హసీన్‌ జంట మనస్పర్థల కారణంగా…

న్యూఢిల్లీ: కూతురు ఐరా 10వ పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. షమి-హసీన్‌ జంట మనస్పర్థల కారణంగా 2018లో విడిపోయినప్పటినుంచి ఐరా తల్లి వద్ద ఉంటోంది. ‘నువ్వు ఇంత త్వరగా ఎదిగావంటే నమ్మలేకపోతున్నా. జీవితంలో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. భగవంతుడు నీకు ప్రేమ, ఆనందం, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఐరాతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.

జపాన్‌ ఓపెన్‌ మన కథ ముగిసెన్‌.

జపాన్‌ ఓపెన్‌ మన కథ ముగిసెన్‌

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ కథ ముగిసింది. బరిలో మిగిలిన సాత్విక్‌ జోడీ, లక్ష్యసేన్‌ కూడా రెండో రౌండ్‌లో పరాజయంతో ఇంటిబాట పట్టారు…

సాత్విక్‌ జంట, లక్ష్యసేన్‌ ఓటమి

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ కథ ముగిసింది. బరిలో మిగిలిన సాత్విక్‌ జోడీ, లక్ష్యసేన్‌ కూడా రెండో రౌండ్‌లో పరాజయంతో ఇంటిబాట పట్టారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌ 19-21, 11-21తో కొడాయ్‌ (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. ఇక సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి జోడీ 22-24, 14-21తో చైనా జంట లియాంగ్‌ వీ కెంగ్‌/వాంగ్‌ చాంగ్‌ చేతిలో ఓటమి చవి చూసింది. అనుపమా ఉపాధ్యాయ 21-13, 11-21, 12-21తో వాంగ్‌ ఝీ హీ (చైనా) చేతిలో పోరాడి ఓడింది.

కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్.. ఇది కదా కావాల్సింది!

కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్.. ఇది కదా కావాల్సింది!

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలో నడుస్తున్నాడు శుబ్‌మన్ గిల్. బ్యాటర్‌గానే కాదు.. సారథ్యంలోనూ అతడ్ని దింపేస్తున్నాడు. అసలేం జరిగిందంటే..

విరాట్ కోహ్లీ.. ఈ పేరు చెప్పగానే సెంచరీలు, రికార్డులు, భారీ ఫ్యాన్ ఫాలోయింగే గుర్తుకొస్తాయి. క్రికెట్ మైదానంలో లెక్కలేనన్ని రికార్డులతో దిగ్గజ స్థాయిని అందుకున్నాడు విరాట్. అయితే కోహ్లీ అంటే పరుగులు, మైలురాళ్లే కాదు.. అగ్రెషన్ కూడా గుర్తుకొస్తుంది. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనడం, అవసరమైతే బాహాబాహీకి దిగడం, స్లెడ్జింగ్ చేయడానికి కోహ్లీ వెనుకాడడు. అందుకే అతడి సారథ్యంలో భారత్‌ను చూసి అంతా భయపడేవారు. అదే ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. దీన్ని నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరింత ముందుకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు.

దమ్ముంటే ఆడమంటూ..

గిల్ అనగానే కామ్, కూల్ యాటిట్యూడ్ అనే అంతా అనుకునేవారు. కానీ లార్డ్స్ టెస్ట్‌లో శుబ్‌మన్ రూటు మార్చి తనలోని అగ్రెషన్‌ను బయటకు తీశాడు. మూడో రోజు ఆట ముగింపు సమయంలో ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్‌కు మీదకు దూసుకెళ్లాడు గిల్. దమ్ముంటే ఆడండి.. నాటకాలు ఎందుకు చేస్తున్నారంటూ వాళ్లతో బాహాబాహీకి దిగాడు. మాటలతో ఇచ్చిపడేసిన భారత నూతన సారథి.. వేళ్లు చూపిస్తూ బాడీ లాంగ్వేజ్‌తోనూ ప్రత్యర్థులను భయపెట్టాడు. దీంతో కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్ అంటూ అభిమానులు పోల్చడం షురూ చేసేశారు..

చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు

*చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు…

*హర్షం వ్యక్తం చేస్తున్న చంద్రగిరి పట్టణ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు..

*అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి కృతజ్ఞతలు తెలుపుకున్న ప్రజలు…

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 10:

పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.
1.53 కోట్లతో మంజూరైన క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పునఃనిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ క్రీడా వికాస్ కేంద్రం నిర్మాణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఊపందుకుందిభూమిపూజతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అధునాతన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే యువ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని, చంద్రగిరి క్రీడా రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్విస్‌ చెస్‌లో అర్జున్‌కు టాప్‌ సీడ్‌

స్విస్‌ చెస్‌లో అర్జున్‌కు టాప్‌ సీడ్‌

ఫిడే గ్రాండ్‌ స్విస్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసికి టాప్‌ సీడింగ్‌ దక్కింది. ఉజ్బెకిస్థాన్‌లో సెప్టెంబరు 3 నుంచి 16 వరకు పోటీలు జరగనున్నాయి. వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌ దొమ్మరాజు రెండో సీడ్‌, ప్రజ్ఞానందకు నాలుగో సీడ్‌ అభించింది. మహిళల విభాగంలో కోనేరు హంపి, డిఫెండింగ్‌ చాంప్‌ వైశాలి బరిలో నిలవనున్నారు.

డబుల్ సెంచరీ కొట్టి తీరుతా..

డబుల్ సెంచరీ కొట్టి తీరుతా.. ఇంగ్లండ్‌కు సూర్యవంశీ వార్నింగ్!

ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు యంగ్‌ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. డబుల్ సెంచరీతో విరుచుకుపడతానని హెచ్చరించాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

14 ఏళ్ల వయసులోనే స్టార్‌డమ్ సంపాదించాడు వైభవ్ సూర్యవంశీ. అండర్-19లో ఆడుతూ వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాటర్.. ఐపీఎల్-2025తో ఓవర్‌నైట్ స్టార్‌గా అవతరించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన సూర్యవంశీ.. 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 252 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది పాత రికార్డులకు పాతర వేశాడు. అక్కడితో ఆగని వైభవ్.. ఇంగ్లండ్ టూర్‌లో భారత అండర్-19 జట్టుకు ఆడుతూ 52 బంతుల్లోనే మెరుపు శతకం బాదాడు. 10 ఫోర్లు, 7 సిక్సులు బాదిన సూర్యవంశీ.. 78 బంతుల్లో 143 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అలాంటోడు ప్రత్యర్థులకు మరోమారు హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతకీ వైభవ్ ఏమన్నాడంటే..

టీమ్‌లో నుంచి అతడ్ని తీసెయ్..

టీమ్‌లో నుంచి అతడ్ని తీసెయ్.. పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడ్ని తీసెయ్ అంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో విజయానికి చేరువలో ఉంది టీమిండియా. ఇంకో 7 వికెట్లు తీస్తే గెలుపు మనదే. లీడ్స్ టెస్ట్‌లో ఓడి సిరీస్‌లో 0-1తో వెనుకబడిన గిల్ సేన.. తాజా మ్యాచ్‌లో ఐదో రోజు గనుక చెలరేగి ఆడితే సిరీస్‌ను సమం చేయొచ్చు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టేందుకు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలసి స్కెచ్ వేస్తున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఏయే బ్యాటర్‌ను ఎలా ఔట్ చేయాలా? అని పథకాలు రచిస్తున్నాడు. ఈ తరుణంలో అతడ్ని తీసెయ్ అంటూ పంత్‌తో గంభీర్ మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

కపిల్ శర్మ షోలో గంభీర్, పంత్, అభిషేక్ శర్మ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంత్-కపిల్ మధ్య సాగిన జోక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ శాలరీ (రూ. 27 కోట్లు) అందుకున్నావ్ కదా.. నీ టీమ్‌లో ఏదైనా తక్కువ వేతనం అందుకునే ఆటగాడు నీ కంటే బాగా ఆడితే ఏం చేస్తావంటూ పంత్‌ను ఆటపట్టించాడు కపిల్. నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు నీ కంటే ఇంకెవరైనా బాగా కామెడీ చేస్తే ఏం చేస్తావంటూ కపిల్‌కు రివర్స్‌ కౌంటర్ వేశాడు పంత్. వీళ్ల మధ్య ఇలా జోక్స్ సాగుతుండగా మధ్యలో గంభీర్ కలుగజేసుకున్నాడు.

టీమ్‌లో నుంచి అతడ్ని తీసేస్తానని చెప్పమంటూ పంత్‌కు సూచించాడు గంభీర్. నీ కంటే ఎవరైతే బాగా ఆడతారో ఆ ప్లేయర్‌ను డ్రాప్ చేస్తానని చెప్పమని గంభీర్ అన్నాడు. దీంతో పంత్, అభిషేక్, కపిల్ సహా షోలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. గంభీర్ ఎక్కువగా సైలెంట్‌గా ఉంటాడు. అలాంటోడు జోక్ వేయడం, అది బాగా పేలడంతో అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంత్-గంభీర్ మామూలోళ్లు కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజంగానే అమల్లో పెడతారా? ఏంటి అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

ఎడ్జ్‌బాస్టన్‌లో కీలక ఇన్నింగ్స్…

ఎడ్జ్‌బాస్టన్‌లో కీలక ఇన్నింగ్స్.. ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డులతో చెడుగుడు ఆడేసిన పానీపూరీ వాలా

India vs England 2nd Test: బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.

India vs England 2nd Test: టెస్ట్ క్రికెట్ తొలి దశలో ఉన్న యశస్వి జైస్వాల్, రికార్డు సృష్టించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా 21 టెస్ట్ మ్యాచ్‌ల ద్వారా ఈ రికార్డులో చేరడం గమనార్హం. ఈ మ్యాచ్‌ల ద్వారా యశస్వి జైస్వాల్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మొత్తం 115 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన యశస్వి, రెండవ ఇన్నింగ్స్‌లో 28 పరుగులకు ఒక వికెట్ ఇచ్చాడు. దీని ప్రకారం, మొత్తం 115 పరుగులు చేయడం ద్వారా, జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేశాడు.

 

 

దీంతో, యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన భారతీయుడిగా నిలిచాడు. గతంలో, ఈ రికార్డు టెస్ట్ స్పెషలిస్ట్ రాహుల్ ద్రవిడ్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.

 

 

రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 25 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు సాధించారు. దీంతో టీమ్ ఇండియా తరపున అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌ల్లో, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఈ రికార్డును బద్దలు కొట్టడంలో విజయం సాధించాడు. టీం ఇండియా యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 2000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 21 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఈ 21 టెస్ట్ మ్యాచ్‌లలో 40 ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వి జైస్వాల్, భారతదేశం తరపున అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో, అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

 

 పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు..

 పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ఆర్సీబీ క్రికెటర్‌పై యువతి ఫిర్యాదు

 

 

 

 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాల్‌పై ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెటర్ యశ్ దయాల్ (Yash Dayal) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఈ ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ నెల 14వ తేదీన మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ, వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. తాను యశ్ దయాల్‌తో ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడి ఇంటికి కూడా తీసుకెళ్లాడని తెలిపింది. కాబోయే కోడలు అంటూ ఇంట్లో కూడా పరిచయం చేశాడని, ఆ తర్వాత తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఫిర్యాదులో పేర్కొంది. అతడికి ఇతర మహిళలతో కూడా సంబంధాలున్నాయని తెలిసిందని తెలిపింది.

యశ్ దయాల్‌తో తాను దిగిన ఫొటోలను, తీసుకున్న వీడియోలను, వీడియో కాల్స్, ఛాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను కూడా ఆ ఫిర్యాదుతో పాటు ఆధారాలుగా ఆ యువతి జత చేసింది. యశ్ దయాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన సీఎం కార్యాలయం సంబంధిత పోలీస్ అధికారుల నుంచి నివేదిక కోరినట్టు తెలుస్తోంది.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక

మహాదేవపూర్ జూన్ 28( నేటి ధాత్రి )

 

స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ తెలిపారు కుదురుపల్లి కి చెందిన విద్యార్థినిలు జిముడ రహస్య గోగుల అనుష్క ఎంపికయ్యారు జులై ఒకటిన నుండి హైదరాబాద్ హంకి పేటలొ స్పోర్ట్స్ స్కూల్ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, సంధ్య గ్రామస్తులు తదితరులు అభినందించారు

కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

సెంచరీలు ఊరికే రావు.. కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు.

పరుగుల వరద పారిస్తున్న రాహుల్..

ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్టులు.. ఇలా ఫార్మాట్ ఏదైనా సరే బరిలోకి దిగితే పరుగుల వర్షం కురిపించాల్సిందే అనేలా అతడి బ్యాటింగ్ సాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన రాహుల్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో భారత బ్యాటింగ్‌ను ముందుండి నడిపించాడు. అతడి సెంచరీకి అంతా ఇంప్రెస్ అవుతున్నారు. వాటే బ్యాటింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు.

సెంచరీ బాదిన రాహుల్.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (118)తో కలసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీళ్లిద్దరూ రాణించడం వల్లే 364 పరుగులు చేయగలిగింది భారత్. దీంతో రాహుల్‌ను అంతా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనపడకుండా చేస్తున్నాడని, అతడి బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కేఎల్ ప్రాక్టీస్ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మ్యాచ్‌కు వెళ్లే ముందు సన్నాహకాల్లో రాహుల్ పడిన కష్టాన్ని ఇందులో చూడొచ్చు.

ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను ప్రారంభించిన.

ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను..ప్రారంభించిన. ఎంఈఓ కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలల ఎంపికలను(హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) గురువారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం స్టేషన్ నందు మండల ఎంఈఓ కాలేరు యాదగిరి గారు క్రీడ ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇప్పుడు నిర్వహించే ఫిజికల్ పరీక్షలు తొమ్మిది విభాగంలో నిర్వహిస్తారని. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు, ఇందులో పాల్గొని ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఎంపికైన వారు ఈనెల 24వ తేదీన జిల్లాలో జరిగే ఎంపిక పోటీలకు హాజరు కావాల్సిందిగా సూచించారు. కాగా మండలం నుండి సుమారుగా 26 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్.కొమ్మురాజేందర్, కొప్పుల శంకర్, దామల్ల విజయ చందర్, పద్మ, మధు, తదితరులు పాల్గొన్నారు.

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు .

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు

 

క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి…
గ్లాస్గో: క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి నేపాల్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ కూడా టై అయ్యింది. అయితే ఇక్కడ ఫలితం తేలేందుకు ఒక్క సూపర్‌ ఓవర్‌ సరిపోలేదు. ఏకంగా మూడుసార్లు ఇరు జట్లు బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటి వరకు టీ20 లేక లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ముందుగా నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. ఛేదనలో నేపాల్‌ చివరి ఓవర్‌లో రెండు ఫోర్లతో సరిగ్గా 152/8 స్కోరే చేసింది. దీనికి తోడు రెండు జట్లు కూడా తొలి సూపర్‌ ఓవర్‌లో 19, రెండో సూపర్‌ ఓవర్‌లో 17 పరుగులు సాధించడంతో మూడోసారి అనివార్యమైంది. అందులో నేపాల్‌ పరుగులేమీ చేయకుండా 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా.. నెదర్లాండ్స్‌ ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ను విజయంతో ముగించింది.

రోహిత్ శర్మ రికార్డ్ సమం..

రోహిత్ శర్మ రికార్డ్ సమం.. అద్భుత సెంచరీ సాధించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

 

shine junior college

 

 

 

 

 

 

చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి.

 

 

 

 

 

 

 

చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఆడుతున్న మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీతో అలరించాడు (Glenn Maxwell Century). ఈ క్రమంలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

 

 

 

 

 

 

 

 

 

మేజర్ లీగ్ క్రికెట్ లీగ్‌-2025లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు కెప్టెన్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాక్సీ తన ఇన్నింగ్స్‌లో 13 భారీ సిక్సర్లతో పాటు 2 ఫోర్లు కూడా కొట్టాడు. మొత్తానికి 49 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇది మ్యాక్స్‌వెల్ టీ20 కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్.. రోహిత్ శర్మ, జోస్ బట్లర్ సరసన చేరాడు.

 

 

 

 

 

 

 

రోహిత్, బట్లర్, ఫించ్, వార్నర్ కూడా ఎనిమిదేసి టీ-20 సెంచరీలు సాధించారు. అలాగే టీ-20ల్లో 10, 500 పరుగులు, 170 కంటే ఎక్కువ వికెట్లు, 5 కంటే ఎక్కువ సెంచరీల చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డును మ్యాక్స్‌వెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ-20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ తర్వాత పాకిస్తాన్ బాబర్ ఆజామ్ (11) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన రౌలీ రూసో, విరాట్ కోహ్లీ తొమ్మిదేసి సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version