అభివృద్ధి పథంలో నడిపిద్ధాం – – పిఆర్‌ మంత్రి ఎర్రబెల్లి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాల అభివృద్ది కార్యక్రమాలపై హన్మకొండ అంబేడ్కర్‌భవన్‌లో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ జిల్లా ప్రతి అంశంలో అభివద్ధి కావాలని అన్నారు. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని అధికారులకు సూచించారు. హరితహారంలో అనుకున్న విదంగా విజయవంతం కాలేదని, ప్రజలు కోరుకునే చెట్లు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని, దేశంలోనే హరితహారానికి గొప్ప పేరు రావాలని తెలిపారు. పట్టాదారు పాస్‌ బుక్‌లు 80శాతం ఇచ్చారని, చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని, పోడు భూముల సమస్యలను తీర్చాలని, ఈ విషయంలో అధికారులు చాకచక్యంగా వ్యవహరించాలని అన్నారు. ఆరు జిల్లాలోని అన్నీ గ్రామాలు ఒడిఎఫ్‌ గ్రామాలు అయ్యేందుకు కషి చేయాలని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్నీ రకాలుగా సహకరిస్తుందని, అగ్రికల్చర్‌ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలను ఇవ్వాలని చెప్పారు. ఆసరా పెన్షన్‌లను జులై 1వ తేదీ నుండి పంపిణీ చేయనున్నామని అన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడాలని, బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివేలా చైతన్యం రావాలని తెలిపారు. మంజూరు అయిన రెండు పడక గదుల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదులకు భూమి సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని, దేశంలో ఎక్కడలేని విధంగా, ఎవరూ చేయలేని విధంగా అతి తక్కువ వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసిఆర్‌ పూర్తి చేశారని అన్నారు. దీని ద్వారా మొదట లాభపడేది వరంగల్‌ జిల్లానే అని తెలిపారు. ప్రతి అభివద్ధి కార్యక్రమానికి పక్కా ప్రణాళికను తయారు చేసుకోవాలని, ప్రతి మూడు నెలలకు రివ్యూ నిర్వహిస్తామని చెప్పారు. జులై 15లోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తవ్వాలని, ప్రతి ఇంటికి, పాఠశాలకు, హాస్టల్‌లకు భగీరథ నీరు అందాలని, మిషన్‌ భగీరథ పనులు పూర్తయినట్లు గ్రామసభలో సర్పంచ్‌ తీర్మాణించాలని, ఎమ్మెల్యేల పనులపై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలని, ప్రతి రోజు పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేలకు అందించాలని, రోడ్‌పై ఉన్న కుళాయిలను ఇంట్లో బిగించాలని, నీళ్లు వధా కాకూడదని, అలా చేస్తే గ్రామ పంచాయితీలకు ఫైన్‌ వేయాలని, అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చట్టాలను తీసుకొచ్చారని, ఏ రాష్ట్రంలో కూడా మిషన్‌ భగీరథ కార్యక్రమం లేదని, దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

రాష్ట్రంలో ఏ మహిళ నెత్తిన బింద పెట్టుకొని నీళ్ల కోసం ఎక్కడికో వెళ్లాలిసిన పరిస్థితి ఎదురుకాకూడదని, అధికారులు నిబద్దతతో పనిచేస్తున్నారని, ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చేశారని, రెసిడెన్షియల్‌, కెజిబివి మోడల్‌ స్కూల్‌కు ఉచితంగా కనెక్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కార్యక్రమం బహత్తర కార్యక్రమమని, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌, అధికారుల కషి వల్ల మిషన్‌ భగీరథ పనులు పరకాల నియోజకవర్గంలో త్వరగా పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొట్టమొదట చలివాగు ద్వారా భగీరథ నీరు 150అవసాలకు అందాయని, 110ఇళ్లకు ఇంటి పనులు పూర్తి అయ్యాయని, ఇంకా 30గ్రామాలకు సామాగ్రి అందాల్సి ఉందని, ఇఎన్‌సి వెంటనే మెటీరియల్‌ ఇవ్వవలిసిందిగా కోరుతున్నానని, జులై 30వరకు మిషన్‌ భగీరథ పనులు పూర్తవుతాయని, పైప్‌లైన్‌ వల్ల రోడ్డు డ్యామేజ్‌ అయితే వెంటనే సీసీ రోడ్‌ వేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. కుళాయిని బిగించినప్పుడు మాత్రమే మిషన్‌ భగీరథ పనులు అయినట్లుగా గుర్తించాలని తెలిపారు. పిదప నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పనుల విషయంలో గతంలో నర్సంపేట నియోజక వర్గంలో ప్రత్యేక పరిస్థితి ఉండేదని, పని చేయడానికి అధికారులు సిద్దంగా ఉన్నా, కొందరు ఆ పనులకు అడ్డంకులు సష్టించేవారని, సంవత్సరం నుంచి పనుల వేగం పెరిగిందని చెప్పారు. 374 అవాసాలకు పనులు పూర్తి అయ్యాయని, పాలేరు నుండి నీరు రావడం వల్ల చిట్టా చివరి నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు నీటి ప్రెషర్‌ తగ్గిందని, ఈ మండలాలకు ప్రత్యామ్నాయం ఉంటే చూడాలని కోరుతున్నానని, ఇందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, 554కిలోమీటర్ల వరకు మాత్రమే పైప్‌లైన్‌ పనులు మంజూరయ్యాయని, 700కిలోమీటర్లకు పైప్‌లైన్‌ పనులు కావాలని అన్నారు. ప్రాజెక్టు పనులు నెమ్మదిగా మొదలైనప్పటికీ ఇప్పుడు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 280 ఒహెచ్‌ఎస్‌ఆర్‌ పనులు పూర్తయ్యాయని, 30 పనులు జరుగుతున్నాయని, వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నర్సంపేట మున్సిపాలిటీకి నీటి సరఫరా అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, నీటి సమస్యతో మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సత్యవతి రాథోడ్‌, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, ఆరూరి రమేష్‌, నన్నపునేని నరేందర్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్‌ టి.రాజయ్య, బి.శంకర్‌నాయక్‌, ఎం.యాదగిరిరెడ్డి, వి.సతీష్‌కుమార్‌, పిఆర్‌, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్‌ నీతు కుమారి ప్రసాద్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, హరిత, వినయ్‌కృష్ణారెడ్డి, డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, శివలింగయ్య, నారాయణరెడ్డి, పోలీస్‌ అధికారులు, మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌, సిఇలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ట్రబుల్‌షూటర్‌ హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదన్నది ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీతో సహా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలుకుని టిఆర్‌ఎస్‌ పీఠం ఎక్కే వరకు అతి కీలకమైన పాత్ర పోషించిన హరీష్‌రావు ప్రాధాన్యత మొత్తంగా తగ్గిపోయిందని రాష్ట్రం మొదలుకుని దేశస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ప్రస్తుతం తన నియోజకవర్గమైన సిద్ధిపేటకు పరిమితం అవుతూ ప్రాధాన్యత తగ్గింది. పార్టీ అధిష్టానం కావాలనే ఇలా చేస్తుందని అనుచరగణం, ఇతర అభిమానులు ప్రకటనలు, తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్న ట్రబుల్‌షూటర్‌ మాత్రం అలాంటిది ఏం లేదు గులాబీతోనే ఉన్నానంటూ తరుచుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ప్రకటనలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ గులాబీ వెంటే నేను అన్నట్లు సిగ్నల్స్‌ ఇస్తున్నారు. అయితే మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత బారీ నీటిపారుదలశాఖ మంత్రిగా కొనసాగిన హరీష్‌రావు, రెండోసారి ఏ మంత్రి పదవి లేకుండా మాజీగానే మిగిలిపోయారు. కీలకమైన ఎన్నికల్లో సైతం అంతగా ఆయనకు ప్రాధాన్యత కల్పించలేదు. దీంతో హరీష్‌ అనుచరుల్లో, అభిమానుల్లో ఆందోళన కలిగింది. నిర్ణయం ఏం తీసుకున్నా మేం కట్టుబడి ఉంటామని వారు నిర్ణయించుకున్నారట. కానీ ట్రబుల్‌షూటర్‌ మాత్రం ఎటువంటి తొందరపాటును ప్రదర్శించకుండా గురిచూసి కొడదాం, సమయం కోసం నిరీక్షిద్దాం అన్నట్లుగానే ఉన్నాడట.

ఇతర పార్టీల్లో జోరుగా చర్చ

హరీష్‌రావు టిఆర్‌ఎస్‌ పార్టీని వీడబోతున్నారనే చర్చ టిఆర్‌ఎస్‌ పార్టీలో కంటే ఇతర పార్టీల్లోనే జోరుగా కొనసాగుతుంది. మా పార్టీలోకి వస్తున్నాడంటే మా పార్టీలోకి అంటూ వారు తెగ సంబరపడి పోతున్నారట. ఇంకొందరైతే హరీష్‌రావు పార్టీ మారితే రాజకీయ సమీకరణలు మారుతాయని అప్పుడు టిఆర్‌ఎస్‌ పార్టీని అన్నిరకాలుగా ఎదుర్కొవడం అత్యంత సులభమని సంబరపడిపోతున్నారట. ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆశించినంతగా సీట్లను సాధించకపోవడం, ఆ ఎన్నికల్లో హరీష్‌రావుకు అధిష్టానం ప్రాదాన్యతను కల్పించకపోవడంతో ఫలితాలు అలా ఉన్నాయని, మరీ హరీష్‌ పార్టీకే దూరం అయితే టిఆర్‌ఎస్‌ చొక్కా బొర్లపడటం ఖాయమని ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటున్నారట. అయితే ఈ విశ్లేషణలన్ని 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచే జరుగుతున్న కాంగ్రెస్‌ బాహుబలి అంటూ పరోక్షంగా హరీష్‌పైనే ఆధారపడుతున్నాం అన్నట్లు ప్రకటనలు చేసినా లాభం లేకుండాపోయింది. దీంతో మామ, అల్లుళ్ల బంధం విడిపోదు అని కొందరు అనుకుంటుంటే ఇతరుల మనస్తత్వాలు తెలుసుకోవడానికే హరీష్‌ ద్వారా గులాబీ బాస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడని అది చూసి మనం చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని హరీష్‌ పార్టీని వీడేది లేదని ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తాడు తప్ప ఇతర పార్టీల్లోకి మాత్రం వెళ్లడని కొందరు విపక్షనేతల విశ్లేషిస్తున్నారట.

అమిత్‌షాను హరీష్‌ కలిశాడు…?

గులాబీని వదిలి కమలాన్ని అందుకోవడానికి హరీష్‌రావు కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసినట్లు కొందరు లేదు, లేదు ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఇంకొందరు తాజాగా ప్రచారం మొదలెట్టారు. గులాబీ గూటిని వదిలి కమలం గూటికి హరీష్‌రావు చేరుకోబోతున్నాడని రాజకీయవర్గాల్లో చర్చ జోరుగానే కొనసాగింది. దీంతో హరీష్‌రావు అనుచరులు, అభిమానుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ఈ వార్త రాజకీయవర్గాల్లో తప్ప ఎక్కడ అంతగా చక్కర్లు కొట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంబ సమయంలో విజయోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న హరీష్‌ తనకు వేరే ఆలోచన లేదనే సంకేతాలు పంపారు. కానీ రాజకీయవర్గాల్లో మాత్రం హరీష్‌ పార్టీ మార్పుపై ప్రచారం బాగానే జరిగింది.

అనుచరుల్లో అసంతృప్తి

టిఆర్‌ఎస్‌ పార్టీలో హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం, పక్కన పెడుతున్నట్లుగా క్యాడర్‌లోకి సంకేతాలు వెళ్తుండడంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి కలుగుతోంది. ఈ విషయమై వీరంతా హరీష్‌రావును ప్రశ్నిస్తే సమయం వచ్చేవరకు ఓపిక పట్టాలని సర్థిచెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ మారే ప్రసక్తే లేదని మన భవితవ్యం ఏంటో ఇందులోనే తేల్చుకుందామని పరోక్షంగా హరీష్‌ అన్నట్లు సమాచారం. అవసరం అయితే మరో ప్రాంతీయ పార్టీకి తెరతీస్తాం తప్ప ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని కొందరు హరీష్‌ అనుచరులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల కేసిఆర్‌ తమిళనాడు తరహా రాజకీయం అనగానే హరీష్‌ పార్టీ పెడతాడా అనే విషయం సైతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయిపోతుంది. అవును నిజం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని కొందరు రాజకీయ విశ్లేషకులు కామెంట్‌ చేస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఎవరెన్ని ఊహగానాలు చేసినా ప్రయత్నాలు చేసినా ట్రబుల్‌షూటర్‌ మాత్రం రూటు మారే ప్రసక్తే లేనట్లు కనిపిస్తోంది.

డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి – నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌ నగరంలోని 26వ డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌ నగర అభివద్ధిలో భాగంగా 26వ డివిజన్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేసి శానిటేషన్‌, డ్రైనేజీ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగర్‌ మేయర్‌తోపాటు బల్దియా కమీషనర్‌ ఎన్‌.రవికిరణ్‌, ఆరోగ్య అధికారి రాజారెడ్డి, బల్దియా వింగ్‌ అధికారులతో కలసి 26వ డివిజన్‌లోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుండి బట్టల బజార్‌, పాపయ్యపేట్‌ చమన్‌, కాకతీయ టాకీస్‌ వరకు పర్యటించారు. 26వ డివిజన్‌ పర్యటనలో సిసి రోడ్ల గుంతలను, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. వర్షాకాలాన్ని దష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా వ్యాధుల నుండి ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బల్దియా అధికారులకు మేయర్‌ సూచించారు. గహ, భవన నిర్మాణాలు చేసుకునే నిర్వాహకులు రోడ్డుపై ఇసుక కుప్పలు పోయడం వల్ల డ్రైనేజీ కాలువ మూసుకుపోవడం, మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున పాదచారులు, వాహనదారులకు ఇబ్బందిగా మారడాన్ని గమనించిన మేయర్‌ వారిపై జరిమానా విధించాలని అధికారులను హెచ్చరించారు.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం వలన అభివద్ధి పనులు చేయలేకపోయామని చెప్పారు. ఇప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు, బల్దియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం సార్‌…జరదేఖో..!

సీఎం సార్‌…జరదేఖో..!
ఆఖరి మజిలీకి…అంతులేని కష్టం
”మనిషి జీవితం అనేక మలుపులతో కొనసాగుతుంది. కష్ట సుఖాల మధ్య సాగే మనిషి జీవితంలో ఆఖరి మజిలీ కూడా అంతులేని కష్టంగా మారింది. చివరి అంకమైన మనిషి మరణం వారి కుటుంబాలకు బొందల గడ్డ రూపంలో మరింత ఇబ్బందులను తెలిచ్చిపెడుతుంది. మరణించిన తమ కుటుంబ సభ్యున్ని ఖననం చేయటానికి కూడా  స్మశానవాటికలు సరిగా లేకపోవటం, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ సౌకర్యాలు లేకపోవటం పలు గ్రామాలలో తీరని సమస్యగా మారింది”.
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో శ్మాశానవాటికల దుస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 2017సంవత్సరంలో దృష్టి సారించింది. ఇందుకు గాను వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 126  స్మశానవాటికలను మంజూరు చేస్తూ 2017-18 బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది.  ఒక్కో శ్మాశానవాటిక నిర్మాణానికి రూ.10 లక్షల 13 వేల తో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయి సౌకర్యాలతో నిర్మించాలని సూచించింది. అయితే ఇందులో జిల్లాలోని 14 మండలాల్లో 121  స్మశానవాటికలను నిర్మించేందుకు రూ. 12 కోట్ల 76 లక్షల ప్రతిపాధనలకు అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్దం చేసింది. ఈ  స్మశానవాటికల నిర్మాణాలు ఈజీఎస్‌ పనుల కింద పూర్తి చేయాలని, ఇందులో గ్రామ పంచాయతీల పాత్ర, ఈజీఎస్‌ కూలీల పాత్ర వారికి సంబంధించిన ఖర్చుల వివరాలను బడ్జెట్‌ కేటాయింపుల్లో పేర్కొనటం జరిగింది. అయితే 2017-18 బడ్జెట్‌లోనే పూర్తి కావాల్సిన  స్మశానవాటికల నిర్మాణ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అ్కడే అన్న చందంగా మారటం గమనార్హం.
పనులు ప్రారంభమైనవి 64 మాత్రమే…
జిల్లా పరిధిలో 121 స్మశానవాటికలు నిర్మించేందుకు ప్రతిపాధనలు రూపొందించినప్పటికీ నిర్మాణ పనుల్లో మాత్రం జాప్యం జరుగుంది. ఇప్పటి వరకు కేవలం 64 మాత్రమే నామమాత్రపు పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన 57  స్మశానవాటికల ఊసే లేకపోవటం గమనార్హం. ఇందులో పనులు మొదలు పెట్టిన వాటిలోనూ ఒక్కటి కూడా పూర్తి చేయకపోవటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  స్మశానవాటికల పట్ల నిర్లక్ష్యనికి కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిధులు సైతం పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  స్మశానవాటికల నిర్మాణ పనులు ప్రారంభించకపోవటం, కొన్నింట్లో నామమాత్రపు పనులు ప్రారంభించినప్పటికీ పూర్తి చేయకపోవటం పట్ల  గ్రామీణ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్మశానవాటికల్లో కల్పించాల్సిన సౌకర్యాలు…..
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో 126  స్మశానవాటికల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేయగా, జిల్లా యంత్రాంగం ఒక్కో శ్మాశానవాటిక నిర్మాణానికి  రూ. 10 లక్షల 13 వేల ప్రతిపాధనలు రూపొందించి జిల్లా వ్యాప్తంగా రూ.12 కోట్ల 17 లక్షల ప్రతిపాధనలు పంపింది. దీని ప్రకారం ప్రతి స్మశానవాటికలో అంత్యక్రియలు జరుపుకోవటానికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అంత్యక్రియలకు రెండు ప్లాట్‌ఫామ్‌లు, ఒక్క ఆఫీసు రూం, ఓపెన్‌హాల్‌, మహిళలు, పురుషులు స్నానం చేయటానికి విడివిడిగా స్నానపు గదులు, సిమెంట్‌ గెద్దె ఒకటి, శ్మాశాన వాటిక స్థలం చుట్టూ పెన్సింగ్‌, ముఖద్వారం వద్ద కమాన్‌, గేటు, ముఖ్యంగా కరెంట్‌ నీటి సౌకర్యాలు కల్పించాలి . అవసరమైతే  నీటి సౌకర్యం కోసం బోర్‌ వేయాలి. స్మశానవాటికల నిర్మాణ పనుల్లో వీటన్నింటినీ నిర్మించాల్సిన అవసరం ప్రతిపాధనల్లో రూపొందించినప్పటికీ అందుకనుగుణమైన పనులు జరుగకపోవటం గమనార్హం.
జిల్లాలో ప్రతిపాధించిన స్మశానవాటికలు – వివరాలు
    మండలం     -మంజూరైనవి      – మొదలైనవి                 – పూర్తికానివి      – పూర్తి అయినవి
1. వర్థన్నపే     –      9                   6                      3                           0
2. పర్వతగిరి    –      6                   3                       3                          0
3. రాయపర్తి     –     15                  2                      13                         0
4. సంగెం        –    13                   9                       4                          0
5. నెక్కొండ    –     11                   6                       5                           0
6. నర్సంపేట    –      9                   6                       5                          0
7. నల్లబెల్లి      –    1                      1                       0                         0
8. ఖానాపూర    –   2                      0                        2                        0
9. చెన్నారావుపేట     8                      3                      5                         0
10. దుగ్గొండి           14                   5                       9                         0
11. శాయంపేట          2                   2                       0                         0
12. గీసుగొండ             9                  7                       2                         0
13. ఆత్మకూర్‌           11                  7                      4                          0
14. పరకాల            11                   10                    1                          0
పై వివరాల ప్రకారం జిల్లాలోని స్మశాన వాటికల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందనేది గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజా పత్రినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ పాలకవర్గాలు యుద్ద ప్రతిపాధికన నిర్మాణ పనులకు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!
”నవ్వి పోదురు గాక మాకేమి సిగ్గు” అన్న చందంగా గ్రేటర్‌ వరంగల్‌ నగర కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. శనివారం అంతర్గత సమావేశం పేరుతో నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక వర్గం సమావేశంలో కొంత మంది  కార్పొరేటర్ల భర్తలు సైతం దర్బాజగా హాజరయ్యారు. సమావేశ ప్రోటోకాల్‌ కాగితాలకే పరిమితమైంది. సమావేశానికి ఎవరు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు సైతం సమావేశానికి హాజరు కావటంతో సమావేశం కలెగూరగంపగా మారింది. సమావేశానికి హాజరు కావాల్సిన నగర మేయర్‌ డుమ్మాకొట్టి ఓ ప్రయివేటు విద్యాసంస్థ తాళ్ళపద్మావతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభ కార్యక్రమానికి వెళ్లారు. నగర మేయర్‌, తూర్పు ఎమ్మెల్యే, కమిషనర్‌ తూర్పు కార్పొరేటర్లు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర మేయర్‌ లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. సమావేశంలో మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు దర్జాగా హాజరై హవా సాగించటం, పార్టీ కా ర్యకర్తలు సమావేశానికి హాజరవ్వటాన్ని తూర్పు ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పకపోవటం కమిషనర్‌ కూడా నోరు మెదుపకపోవటం గమనార్హం.
సమావేశానికి దర్జాగా హాజరైన మహిళా కార్పొరేటర్ల భర్తలు…
కీలక సమావేశంగా చెప్తున్న నగర పాలకవర్గం సమావేశానికి మహిళా కార్పొరేటరైన 7 డివిజన్‌ కార్పొరేటర్‌ కెడల నద్మ భర్త కెడల జనార్తన్‌, 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ శారదజోషి భర్త సురేష్‌ జోషి, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మేడిది రజిత భర్త మదుసుదన్‌, 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్లి భాగ్యలక్ష్మి భర్త మరుపల్లి రవి సమావేశానికి హాజరై దర్జాగా ముందువరుసలోనే కూర్చోని ” నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు” అన్నట్లుగా వ్యవహరించటం చర్చానీయాంశంగా మారింది. గతంలోనూ పలు సమావేశాలకు సతులతో పాటు పతులు హాజరై హవా సాగించిన పరిస్థితి ఉందని వీరు ఇక మారే పరిస్థితి లేదని పలువురు చర్చించుకోవటం గమనార్హం. అధికారులు అడ్డుచెప్పకపోవటమే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ ముగ్గురు కార్పొరేటర్ల అరెస్టుకు రంగం సిద్ధం….?

ఆ ముగ్గురు కార్పొరేటర్ల అరెస్టుకు రంగం సిద్ధం….?

భూకబ్జాలో దర్జా వెలగబెడదామనుకుంటే ఆ ముగ్గురు కార్పొరేటర్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందట. అధికార పార్టీ కార్పొరేటర్‌లం మాకు ఎవరు అడ్డు కల్లకు పొరలు కమ్మి కార్పొరేషన్‌ సిబ్బందిని, మహిళా అధికారిని నానా దూర్బాషలాడి కబ్జాను సమర్థించే పనిచేసి, ఎమ్మెల్యే మనుషులమని చెప్పి ఆయన ప్రమేయం లేకున్నా పేరును వాడుకుని కాంప్లెక్స్‌ నిర్మాణానికి పూనుకున్న ఆ ముగ్గురికి పోలీసులు త్వరలోనే చెక్‌ పెట్టబోతున్నట్లు తెలిసింది. భూవివాదం కోర్టులో ఉండగా అవేం పట్టించుకోకుండా అనుమతులు రాకున్న భవన నిర్మాణానికి పూనుకున్న వీరికి త్వరలోనే అరదండాలు తప్పవని తెలిసింది.

అరెస్ట్‌కు రంగం సిద్దం…?

హన్మకొండ చౌరస్తాకు అతి సమీపంలో కాకాజి వారసులకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం కొనసాగిస్తున్న ముగ్గురు కార్పొరేటర్ల అరెస్ట్‌కు రంగం సిద్దం అయినట్లు విశ్వసనీయ సమాచారం. మూడునెలల క్రితం ఈ కార్పొరేటర్లు చేస్తున్న కబ్జా తతంగంపై ‘నేటిధాత్రి’ ఓ కథనాన్ని వెలువరించింది. అడ్డు, అదుపు లేకుండా కార్పొరేటర్ల విచ్చలవిడితనాన్ని ప్రశ్నించింది. పదవి రాగానే జనం కంటికి పురుగుల్లా కనపడితే ఏంచేసిన చెల్లుతుందనే వారి గర్వాన్ని నిలదీసింది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ రంగంలోకి దిగి ఇంటలిజెన్స్‌ విచారణను పూర్తిచేసి అది పక్కా కబ్జా పర్వమేనని తేల్చినట్లు సమాచారం. కబ్జాకు పాల్పడిన ఆ ముగ్గురు కార్పొరేటర్లను త్వరలోనే అరెస్ట్‌ చేయనున్నారని తెలుస్తోంది.

అధిష్టానం సీరియస్‌…?

ఓ వైపు కార్పొరేషన్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ…అవినీతికి అసలు అస్కారం ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలు దీంతో హన్మకొండలో ఆ ముగ్గురు కార్పొరేటర్లు చేసిన కబ్జాపై అధిష్టానం సీరియస్‌ అయినట్లు తెలిసింది. పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేసే పని ఎవరు చేసిన సహించేది లేదని ముగ్గురు కార్పొరేటర్ల అరెస్ట్‌తో సంకేతాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అరెస్ట్‌ కాకుండా పైరవీలు…?

అక్రమ కబ్జాకు పాల్పడి అడ్డంగా బుక్కైన ఆ ముగ్గురు కార్పొరేటర్లు అరెస్ట్‌ కాకుండా ఉండేందుకు పైరవీల బాట పట్టినట్లు తెలిసింది. మరో నాలుగైదు రోజుల్లో పోలీసులు వీరిని అరెస్ట్‌ చేయడానికి సిద్దం అవుతుండగా అదికార పార్టీలో తమకు తెలిసిన పెద్దల సహయాన్ని కోరి అరెస్ట్‌ కాకుండా చూడాలని వేడుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో అధిష్టానం సీరియస్‌గా ఉండడం, అరెస్ట్‌కు అంఆ సిద్దం కావడంతో తమ వల్ల కాదని చేతులెత్తేసినట్లు సమాచారం.

అధికారుల వాహన ‘మాయ’

అధికారుల వాహన ‘మాయ’

– అధికారిక వాహనాలలో వారిదే ఇష్టారాజ్యం

– బిల్లు చెల్లించేది ఓ వాహనానికి, తిరిగేది మరో వాహనం

– బినామీ పేరుతో వేలు దండుకుంటున్న ఓ జిల్లాస్థాయి అధికారి

– తిరిగేది సొంతకారులో…వాహన బిల్లు బినామీ ఖాతాలోకి…

– మహబూబాబాద్‌ జిల్లాలో ఆ అధికారి రూటే సపరేటు

అధికారిక వాహనాల విషయంలో అధికారులు మాయ చేస్తున్నారు. అందినకాడికి దండుకోవాలన్న ఆలోచనతో తమ అతితెలివికి పదునుపెట్టి బినామీ పేర్లతో పని కనిస్తున్నారు. అధికారులు వాడే వాహనాల విషయంలో నిరుద్యోగులకు అవకాశం ఇచ్చి వారికే నెలనెల కిరాయి చెల్లించాలన్న నిబంధనకు తూట్టు పొడుస్తున్నారు. తమ సొంత కార్లలో తిరిగుతూ బినామీ పేర్లతో నెలనెల కిరాయి దండుకుంటూ అవినీతికి తలుపులు బార్ల తెరిచారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ జిల్లాస్థాయి అధికారి తన భార్య పేరిట ఉన్న కారులో తిరుగుతూ డబ్బులు దండుకోవడానికి మాత్రం బినామీ పేరు చెప్పి నెలనెలా వేల రూపాయలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.

ఎవరా అధికారి…ఏమా కథ త్వరలో…

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డిఎల్‌సిఇ జంక్షన్‌ వద్ద ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అలువాల కార్తీక్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలపై గెలిచి టిఆర్‌ఎస్‌ పార్టీలకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో తొలిసారి దళితుడు సీఎల్పీ నాయకుడు కావడాన్ని జీర్ణించుకోలేక దొరల అహంకారంతో కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారన్నారు. అనంతరం వరంగల్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ పల్లకొండ సతీష్‌ మాట్లాడుతూ 25మంది ఇంటర్‌ విద్యార్థులు మృతిచెందిన పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్పందించకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్‌ చేసి పార్టీలో చేర్పించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోట వద్ద విద్యార్థులపై తూటాలు పేల్చిన తెలంగాణ ద్రోహి జగన్‌తో మమేకమై సీఎం కేసిఆర్‌ నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడుపోస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా జనరల్‌ సెక్రటరీ ప్రేమ్‌చంద్‌, యశ్వంత్‌, చరణ్‌, టోని, నాగరాజ్‌, శ్రవణ్‌, వంశీ, రాజు, దినకర్‌, తిరుపతి, రవి, రమేష్‌, నగేష్‌, తేజ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామంలోని పలు సమస్యల పట్ల, గ్రామాబివద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని సర్పంచ్‌ బరిగెల లావణ్య అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామంలోని అంతర్గతరోడ్లు, మంచినీటి సౌకర్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనుల పట్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కెసిఆర్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్నిరకాల వర్గాల ప్రజలకు అందేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రుతి, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, వార్డుసభ్యులు ఉప్పుల రాజు, శ్యామల, రజితలతోపాటు కారోబార్‌ కొల్లాపురం కోటిలింగంలతోపాటు పలువురు పాల్గొన్నారు.

ఎన్నికల ఖర్చుల్లో గోల్‌మాల్‌ : ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

కమీషన్లే ఆయన ప్రధాన కర్తవ్యం. విధులు నిర్వహించే శాఖలోనైనా, అతని భాద్యత నిర్వహించే ఏ పనిలోనైనా ఆయనకు వ్యవస్థను అవినీతిమయం చేయడం వెన్నతో పెట్టిన విద్య. పైకి మాములూగా నవ్వుతూ అంతా సవ్యంగానే చేస్తున్నట్లు కనిపించినా ఆ నవ్వు మాటున అవినీతి అర్రులు చాచుకుని ఆనంద తాండవం చేస్తుంది. గత 7నెలలుగా జరుగుతున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది రెవెన్యూశాఖ. ఈ శాఖలోనూ పనిచేస్తున్న ఈయన ఈ వ్యవహారంలోనూ ఆయన వ్యవహారశైలిని మార్చుకోలేదు. ఇంకే ముంది ఎన్నికల విధుల్లో పాల్గోన్న సిబ్బందికి సంబంధించి వచ్చిన టిఎ, డిఎల్లో భారీగా దండుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారం ఇప్పుడే జరుగుతున్నది కాకపోయినా తాజాగా ఈయన వ్యవహరిస్తున్న తీరు పట్ల విసుగు చెందిన ప్రభుత్వ అధికారులే ఈయన జరుపుతున్న వ్యవహారంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారంటే సదరు రెవెన్యూ అధికారి ఆగడాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పకనే చెబుతున్నారు. ఇక ప్రభుత్వ అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఎన్నికల విధుల్లో పనిచేసిన అనధికార వ్యవస్థకు సంబంధించిన వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.

వివిధ శాఖల అధికారుల అలవెన్స్‌లలో కమీషన్లు…

శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికల విధుల్లో భాద్యతలు నిర్వహించిన వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారుల రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి గెజిటెడ్‌ అధికారులు మైక్రో అబ్జర్వర్లుగా, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, వీడియో సర్వేలైన్స్‌ టీం, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్‌టి విభాగాలకు సంబంధించి శాసనసభ ఎన్నికల్లో 52రోజులు, పార్లమెంట్‌ ఎన్నికల్లో 22రోజులు విధులు నిర్వహించారు. వీరు నిర్వహించిన విధులకుగాను ఎన్నికల కమీషన్‌ ఇచ్చిన అలవెన్స్‌లలో భారీగా కమీషన్ల రూపంలో దండుకున్నారు. పనిచేసిన కాలానికి ఎంత మొత్తం వచ్చింది అని వారు అడిగినప్పటికి పూర్తి అలవెన్స్‌ రాలేదని, ఇంతే వచ్చిందని మరికొందరు అధికారులకు చెప్పి వారితో అలవెన్స్‌లు ముట్టినట్లు సంతకాలు తీసుకున్నారు. సదరు రెవెన్యూ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై చేసేదెమి లేక ఇచ్చిందే పుచ్చుకుని సైలెంట్‌ అయ్యారు.

ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

ఎన్నికల విధుల్లో భాగమైన ప్రైవేట్‌ వాహనాలు, ఫోటో, వీడియోగ్రాఫర్లు, టెంట్‌హౌజ్‌ ఇలా అన్ని వ్యవస్థల్లోనూ ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. ఉన్నతస్థాయి గెజిటెడ్‌ అధికారుల అలవెన్స్‌లలోనే కమీషన్లకు దిగిన ఆయనకు అనధికార వ్యవస్థలో విధులు నిర్వహించిన వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. వారికి పూర్తి డబ్బులు ఇవ్వకపోగా ఇచ్చిన డబ్బులు ఇవ్వడానికి ముందుగానే తన చేతివాటంతో లంచాలు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల విధులకు సంబంధించిన వీరికి వచ్చిన నిధులను సగానికిపైగా స్వాహా చేసి అధికారులు వాటాలు పంచుకున్నారని, ప్రతి ఎన్నిక సందర్భంలోనూ రెవెన్యూ అధికారులు ఇలానే చేస్తారని ఫోటో, వీడియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కమీషన్‌ ఎంత కేటాయించిందో అంతా గోప్యం…

ఎన్నికల సంధర్భంగా విధులు నిర్వహించిన వివిధ విభాగాల వారికి కమీషన్‌ అలవెన్స్‌లు, ఖర్చుల కొరకు నిర్ధిష్టమైన మొత్తాలను కేటాయిస్తారు. కానీ ఈ ఖర్చుల మొత్తాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. విధులు నిర్వహించిన ప్రభుత్వ గెజిటెడ్‌ తెలుపుతున్న సమాచారం ప్రకారం అలవెన్స్‌లుగా 1200రూపాయలు ప్రతిరోజుకు ఇస్తారని అంటున్నారు. అధేవిధంగా ఫోటో, వీడియో గ్రాఫర్లకు భోజన ఖర్చులకు, టెంట్‌ హౌజ్‌, కిరాయి వాహనాలకు ఖర్చులను కేటాయిస్తారు. కానీ ఎవరికి ఎంత కేటాయిస్తారనేది మాత్రం రెవెన్యూ అధికారులకు మినహాయించి మరెవ్వరికి తెలియదు. తెలియకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. పనిచేసిన వారికి వచ్చిన అలవెన్స్‌లు, జీతభత్యాలు, ఖర్చులకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఎందుకు ఉంచుతారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

స్థానిక రెవెన్యూ అధికారి కనుసన్నలోనే వ్యవహారమంతా…?

స్థానికంగా రెవెన్యూ కార్యాలయంలో కీలక అధికారి అయిన ఒకరి చేతుల్లోనే ఈ వ్యవహారమంతా జరుగుతుందని ఎన్నికల విధుల్లో పని చేసిన వారు చెబుతున్నారు. కీలక అధికారి కావడంతో సమన్వయలోపం ఏర్పడుతుందని చేసేదేమి లేక ఇచ్చిన మొత్తాన్నే విధులు నిర్వహించిన వివిధ శాఖల అధికారులు తీసుకుంటే, ఇక అనధికార వ్యవస్థకు సంబంధించిన వారు ఇదేంటని అడిగితే మరోమారు వారి అవకాశం ఇవ్వరనే భయంతో ఆ అధికారిని ప్రశ్నించడం లేదు. దీంతో ఆయన చేస్తున్న అవినీతి వ్యవహారానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. సదరు అధికారి చేస్తున్న అవినీతిలో ఉన్నత అధికారులకు వాటాలు చేరుతాయని, అందుకే వారు కూడా ఈ వ్యవహారం గురించి నిమ్మకు నిరెత్తనట్లు వ్యవహరిస్తూ ఆయనకు అవసరమైన అండదండలు అందిస్తారని అందరు చెప్పుకుంటున్నారు. సమాజంలో కీలకశాఖలో పనిచేస్తూ ప్రతి అంశంలో అవినీతికి పాల్పడుతూ ఇటు ప్రజలను,అటు అధికారులను వదలకుండా చేస్తున్న వ త్తికి కలంకం తెస్తున్న సదరు అధికారి వ్యవహారం గురించి సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగిన విచారణ చేసి ఎన్నికల విధుల్లో పాల్గోన్న సిబ్బందికి, ప్రజలకు న్యాయం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించిన కేటీఆర్‌

ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించిన కేటీఆర్‌

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టీ.రామారావు అభినందించారు. బుధవారం వరంగల్‌ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విజయం, పరిషత్‌ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన సందర్బంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా వారిని కేటీఆర్‌ అభినందించారు. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించినందుకు కేటిఆర్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరించి జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుని అన్ని స్థానాల్లో విజయం సాదించిన సందర్బంగా తూర్పు ఎమ్మల్యే నన్నపునేని నరేందర్‌ను కేటీఆర్‌ ఈ సందర్బంగా అభినందించారు. కేటిఆర్‌ను కలిసిన వారిలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, టిఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు తదితరులు ఉన్నారు.

పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు : జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు

పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు

జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నామని వరంగల్‌ నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. మంగళవారం వరంగల్‌ ఆర్బన్‌ జిల్లాకు సంబంధించి మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ధర్మసాగర్‌లోని వియంఅర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలను పోలీస్‌ కమిషనర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఎనిమిది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోంది. డిసిపి స్థాయి పోలీస్‌ అధికారి పర్యవేక్షణలో ఎసిపి పోలీస్‌ అధికారి అధ్వర్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

నర్సంపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా..

నర్సంపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా..

నర్సంపేట డివిజన్‌లోని ఆరుమండలాల్లో 50ఎంపిటిసి స్థానాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. టిఆర్‌ఎస్‌ పార్టీ దుగ్గొండి, నెక్కొండ, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపిపి స్థానాల మెజారిటీని కైవసం చేసుకోగా, నర్సంపేట మండలంలో ఎంపీపీ స్థానానికి మెజారిటీతో కాంగ్రెస్‌ పార్టీ తన సత్తా చాటుతూ పరువు నిలబెట్టుకుంది. డివిజన్‌వ్యాప్తంగా 70స్థానాలు ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీ 50స్థానాలలో అత్యధికంగా గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 19స్థానాలను గెలుచుకుంది. డివిజన్‌వ్యాప్తంగా దుగ్గొండి మండలంలోని వెంకటాపురం ఎంపిటిసి స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి ఊహించని విధంగా గెలుపొందారు. నర్సంపేట డివిజన్‌వ్యాప్తంగా గెలుపొందిన ఎంపిటిసి స్థానాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. నర్సంపేట మండలంలో మొత్తం 11ఎంపిటిసి స్థానాలకు 5టీఆర్‌ఎస్‌ గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 6స్థానాలను కైవసం చేసుకుంది. చెన్నారావుపేట మండలంలో మొత్తం11స్థానాలు ఉండగా టిఆర్‌ఎస్‌ పార్టీ 9 కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ పార్టీ 2 సాధించింది. దుగ్గొండి మండలంలో 12 స్థానాలకు మల్లంపల్లి ఎంపిటిసి స్థానం ఏకగ్రీవం కాగా, ఏకగ్రీవంతోపాటు 9స్థానాల్లో అధికార పార్టీ తన సత్తాను చాటుకోగా, కాంగ్రెస్‌ 1 స్థానంలో, ఇండిపెండెంట్‌ 1స్థానాలు గెలుపొందాయి. నల్లబెల్లి మండలంలో 11స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ 10స్థానాలల్లో గెలుపొంది ప్రభంజనం సష్టించగా, కాంగ్రెస్‌ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నది. నెక్కొండ మండలంలో 16స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ 10 గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 6స్థానాలను గెలుపొందింది. ఖానాపురం మండలంలో 9ఎంపిటిసి స్థానాలకు టిఆర్‌ఎస్‌ పార్టీ 6 కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలతో నిలిచింది. ఈ సందర్భంగా గెలుపొందిన ఎంపిటిసి అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ధవపత్రాలను అందచేశారు.

నర్సంపేట మండలంలో…

రాజుపేట : కాంగ్రెస్‌

ముత్తోజిపేట : కాంగ్రెస్‌

చంద్రయ్యపల్లి : టీఆర్‌ఎస్‌

లక్నేపల్లి : కాంగ్రెస్‌

బాంజీపేట : కాంగ్రెస్‌

ముగ్దుంపురం : కాంగ్రెస్‌

మహేశ్వరం : టీఆర్‌ఎస్‌

మాధన్నపేట : కాంగ్రెస్‌

కమ్మపెల్లి : టీఆర్‌ఎస్‌

గురిజాల : టీఆర్‌ఎస్‌

ఇటుకాలపల్లి : టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 05

కాంగ్రెస్‌ : 06

మొత్తం ఎంపీటీసీలు : 11

చెన్నారావుపేట మండలంలో…

చెన్నారావుపేట : టీఆర్‌ఎస్‌

కోనాపురం : టీఆర్‌ఎస్‌

ఉప్పరపల్లి : టీఆర్‌ఎస్‌

లింగగిరి : టీఆర్‌ఎస్‌

అమీనాబాద్‌ : టీఆర్‌ఎస్‌

పాపయ్యపేట : టీఆర్‌ఎస్‌

ఖాదర్‌ పేట : టీఆర్‌ఎస్‌

జల్లి : టీఆర్‌ఎస్‌

ఎల్లాయిగూడెం : కాంగ్రెస్‌

అక్కల్‌ చెడ : టీఆర్‌ఎస్‌

బోజేర్వు : కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 02

మొత్తం ఎంపీటీసీలు : 11

దుగ్గొండి మండలంలో…

దుగ్గొండి : టీఆర్‌ఎస్‌

చాపలబండ : కాంగ్రెస్‌

తొగర్రాయి : టీఆర్‌ఎస్‌

మహ్మదాపురం : టీఆర్‌ఎస్‌

మల్లంపల్లి : ఏకగ్రీవం

ముద్దునూరు : టీఆర్‌ఎస్‌

నాచినపల్లి : టీఆర్‌ఎస్‌

పోనకల్‌ : టీఆర్‌ఎస్‌

వెంకటాపురం : స్వతంత్ర

తిమ్మంపేట : టీఆర్‌ఎస్‌

లక్మీపురం : టీఆర్‌ఎస్‌

రేకంపల్లి : టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 01

స్వతంత్ర : 01

ఏకగ్రీవం : 01

మొత్తం ఎంపీటీసీలు : 12

నల్లబెల్లి మండలంలో…

నల్లబెల్లి : టీఆర్‌ఎస్‌

నారక్కపేట : టీఆర్‌ఎస్‌

నందిగామ : టీఆర్‌ఎస్‌

రంగాపురం : టీఆర్‌ఎస్‌

అర్షనపల్లి : టీఆర్‌ఎస్‌

రుద్రగూడెం : టీఆర్‌ఎస్‌

కన్నారావుపేట : టీఆర్‌ఎస్‌

రాంపూర్‌ : టీఆర్‌ఎస్‌

మేడపల్లి : కాంగ్రెస్‌

గోవిందాపురం : టీఆర్‌ఎస్‌

లెంకాలపల్లి : టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 10

కాంగ్రెస్‌ : 01

మొత్తం ఎంపీటీసీలు : 11

నెక్కొండ మండలంలో…

నెక్కొండ 1 : కాంగ్రెస్‌

నెక్కొండ 2 : టీఆర్‌ఎస్‌

అప్పల్‌ రావుపేట : టీఆర్‌ఎస్‌

పత్తిపాక : టీఆర్‌ఎస్‌

పెద్దకోర్పోలు : టీఆర్‌ఎస్‌

దీక్షకుంట్ల : టీఆర్‌ఎస్‌

గొల్లపల్లి : టీఆర్‌ఎస్‌

అలంకానిపేట : టీఆర్‌ఎస్‌

బొల్లికొండ : కాంగ్రెస్‌

బంజరుపల్లి : టీఆర్‌ఎస్‌

నాగారం : కాంగ్రెస్‌

వెంకటాపురం : ఏకగ్రీవం

రెడ్లవాడ : కాంగ్రెస్‌

సూరిపెల్లి : కాంగ్రెస్‌

టీక్యాతండా : కాంగ్రెస్‌

గుండ్రపల్లి : టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 06

ఏకగ్రీవం : 01

మొత్తం ఎంపీటీసీలు : 16

ఖానాపురం మండలంలో…

ఖానాపురం 1 : టీఆర్‌ఎస్‌

ఖానాపురం 2 : టీఆర్‌ఎస్‌

అశోకనగర్‌ 1 : టీఆర్‌ఎస్‌

అశోకనగర్‌ 2 : టీఆర్‌ఎస్‌

బుధరావుపేట 1 : కాంగ్రెస్‌

బుధరావుపేట 2 : టీఆర్‌ఎస్‌

కొత్తూరు : టీఆర్‌ఎస్‌

మంగళవారిపేట : కాంగ్రెస్‌

ధర్మరావుపేట : కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ : 06

కాంగ్రెస్‌ : 03

మొత్తం ఎంపీటీసీలు : 09

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కారుదే పైచేయి

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కారుదే పైచేయి

వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ఎంపిటిసి ఫలితాలు

నర్సంపేట మండలంలో…

1) రాజుపేట – కాంగ్రెస్‌

2) ముత్తోజిపేట – కాంగ్రెస్‌

3) చంద్రయ్యపల్లి – టీఆర్‌ఎస్‌

4) లక్నేపల్లి – కాంగ్రెస్‌

5) బాంజీపేట – కాంగ్రెస్‌

6) ముగ్దుంపురం – కాంగ్రెస్‌

7) మహేశ్వరం – టీఆర్‌ఎస్‌

8) మాధన్నపేట – కాంగ్రెస్‌

9) కమ్మపెల్లి – టీఆర్‌ఎస్‌

10) గురిజాల – టీఆర్‌ఎస్‌

11) ఇటుకాలపల్లి – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 05

కాంగ్రెస్‌ : 06

మొత్తం ఎంపీటీసీలు : 11

…………………………..

చెన్నారావుపేట మండలంలో…

1) చెన్నారావుపేట – టీఆర్‌ఎస్‌

2) కోనాపురం – టీఆర్‌ఎస్‌

3) ఉప్పరపల్లి – టీఆర్‌ఎస్‌

4) లింగగిరి – టీఆర్‌ఎస్‌

5) అమీనాబాద్‌ – టీఆర్‌ఎస్‌

6) పాపయ్యపేట – టీఆర్‌ఎస్‌

7) ఖాదర్‌పేట – టీఆర్‌ఎస్‌

8) జల్లి – టీఆర్‌ఎస్‌

9) ఎల్లాయిగూడెం – కాంగ్రెస్‌

10) అక్కల్‌ చెడ – టీఆర్‌ఎస్‌

11) బోజేర్వు – కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 02

మొత్తం ఎంపీటీసీలు : 11

…………………………………..

దుగ్గొండి మండలంలో…

1) దుగ్గొండి – టీఆర్‌ఎస్‌

2) చాపలబండ – కాంగ్రెస్‌

3) తొగర్రాయి – టీఆర్‌ఎస్‌

4) మహ్మదాపురం – టీఆర్‌ఎస్‌

5) మల్లంపల్లి – ఏకగ్రీవం

6) ముద్దునూరు – టీఆర్‌ఎస్‌

7) నాచినపల్లి – టీఆర్‌ఎస్‌

8) పోనకల్‌ – టీఆర్‌ఎస్‌

9) వెంకటాపురం – స్వతంత్ర

10) తిమ్మంపేట – టీఆర్‌ఎస్‌

11) లక్మీపురం – టీఆర్‌ఎస్‌

12) రేకంపల్లి – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 01

స్వతంత్ర : 01

ఏకగ్రీవం : 01

మొత్తం ఎంపీటీసీలు : 12

………………………………….

నల్లబెల్లి మండలంలో…

1) నల్లబెల్లి – టీఆర్‌ఎస్‌

2) నారక్కపేట – టీఆర్‌ఎస్‌

3) నందిగామ – టీఆర్‌ఎస్‌

4) రంగాపురం – టీఆర్‌ఎస్‌

5) అర్షనపల్లి – టీఆర్‌ఎస్‌

6) రుద్రగూడెం – టీఆర్‌ఎస్‌

7) కన్నారావుపేట – టీఆర్‌ఎస్‌

8) రాంపూర్‌ – టీఆర్‌ఎస్‌

9) మేడపల్లి – కాంగ్రెస్‌

10) గోవిందాపురం – టీఆర్‌ఎస్‌

11) లెంకాలపల్లి – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 10

కాంగ్రెస్‌ : 01

మొత్తం ఎంపీటీసీలు : 11

…………………………….

నెక్కొండ మండలంలో…

1) నెక్కొండ 1 – కాంగ్రెస్‌

2) నెక్కొండ 2 – టీఆర్‌ఎస్‌

3) అప్పల్‌రావుపేట – టీఆర్‌ఎస్‌

4) పత్తిపాక – టీఆర్‌ఎస్‌

5) పెద్దకోర్పోలు – టీఆర్‌ఎస్‌

6) దీక్షకుంట్ల – టీఆర్‌ఎస్‌

7) గొల్లపల్లి – టీఆర్‌ఎస్‌

8) అలంకానిపేట – టీఆర్‌ఎస్‌

9) బొల్లికొండ – కాంగ్రెస్‌

10) బంజరుపల్లి – టీఆర్‌ఎస్‌

11) నాగారం – కాంగ్రెస్‌

12) వెంకటాపురం – ఏకగ్రీవం

13) రెడ్లవాడ – కాంగ్రెస్‌

14) సూరిపెల్లి – కాంగ్రెస్‌

15) టీక్యాతండా – కాంగ్రెస్‌

16) గుండ్రపల్లి – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 09

కాంగ్రెస్‌ : 06

ఏకగ్రీవం : 01

మొత్తం ఎంపీటీసీలు : 16

…………………………………

ఖానాపురం మండలంలో…

1) ఖానాపురం 1 – టీఆర్‌ఎస్‌

2) ఖానాపురం 2 – టీఆర్‌ఎస్‌

3) అశోకనగర్‌ 1 – టీఆర్‌ఎస్‌

4) అశోకనగర్‌ 2 – టీఆర్‌ఎస్‌

5) బుధరావుపేట 1 – కాంగ్రెస్‌

6) బుధరావుపేట 2 – టీఆర్‌ఎస్‌

7) కొత్తూరు – టీఆర్‌ఎస్‌

8) మంగళవారిపేట – కాంగ్రెస్‌

9) ధర్మరావుపేట – కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ : 06

కాంగ్రెస్‌ : 03

మొత్తం ఎంపీటీసీలు : 09

……………………………………..

శాయంపేట్‌ మండలం.

1) శాయంపేట్‌ 1 – టిఆర్‌ఎస్‌

2) పెద్దకొడపాక 1 – టీఆర్‌ఎస్‌.

3) పెద్దకొడపాక 2 – టీఆర్‌ఎస్‌

4) మైలారం – టిఆర్‌ఎస్‌.

5) తహరపూర్‌ – టిఆర్‌ఎస్‌.

6) గట్లకనిపర్తి – టీఆర్‌ఎస్‌.

7) ప్రగతి సింగారం – టిఆర్‌ఎస్‌

8) పత్తిపాక – కాంగ్రెస్‌.

9) వసంతపూర్‌ – టిఆర్‌ఎస్‌

10) కాట్రపల్లి – టిఆర్‌ఎస్‌

11) కొప్పుల – టిఆర్‌ఎస్‌

12) శాయంపేట్‌ – టిఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 11

కాంగ్రెస్‌ : 01

మొత్తం ఎంపీటీసీలు : 12

……………………………..

పరకాల మండలం..

1) నాగారం – టిఆర్‌ఎస్‌

2) వెల్లంపల్లి – స్వతంత్ర అభ్యర్థి

3) మల్లక్కపేట్‌- టిఆర్‌ఎస్‌

4) పోచారం – టిఆర్‌ఎస్‌

5) లక్ష్మిపూర్‌ – టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 04

స్వతంత్రం : 01

మొత్తం ఎంపీటీసీలు : 05

…………………………….

నడికూడ మండలం..

1) చర్లపల్లి – టిఆర్‌ఎస్‌

2) నార్లాపూర్‌ – టిఆర్‌ఎస్‌

3) చౌటుపర్తి – టిఆర్‌ఎస్‌

4) వరికోల్‌ – టీఆర్‌ఎస్‌

5) పులిగిల్ల – కాంగ్రెస్‌.

6) రాయపర్తి – కాంగ్రెస్‌.

7) నర్సక్కపల్లి – కాంగ్రెస్‌.

8) నడికూడ – కాంగ్రెస్‌

9) కంటాత్మకూర్‌ – స్వతంత్ర అభ్యర్థి.

10) కౌకొండ – టిఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 05

కాంగ్రెస్‌ : 04

స్వతంత్రం : 01

మొత్తం ఎంపీటీసీలు : 10

……………………………….

ఆత్మకూరు మండలం.

1) ఆత్మకూర్‌ టౌన్‌ – టిఆర్‌ఎస్‌

2) ఆత్మకూరు – టీఆర్‌ఎస్‌.

3) హౌజ్‌బుజుర్గు – టీఆర్‌ఎస్‌

4) నీరుకుళ్ల – టీఆర్‌ఎస్‌.

5) గుడెప్పుడు – కాంగ్రెస్‌.

6) పెద్దపూర్‌ – కాంగ్రెస్‌.

7) అక్కంపెట్‌ – కాంగ్రెస్‌.

8) చౌళ్లపల్లి – టిఆర్‌ఎస్‌

9) పెంచిలపెేట్‌ – టిఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ : 06

కాంగ్రెస్‌ : 03

మొత్తం ఎంపీటీసీలు : 09

……………………………..

దామెర మండలం.

1) దామెర – టిఆర్‌ఎస్‌

2) ల్యాదేళ్ల – టీఆర్‌ఎస్‌

3) ఉరుగొండ – టిఆర్‌ఎస్‌

4) దుర్గంపెట్‌ – టిఆర్‌ఎస్‌

5) ఒగ్లాపూర్‌ – కాంగ్రెస్‌

6) కొగిల్వాయి – టీఆర్‌ఎస్‌

7) పులుకుర్తి – టిఆర్‌ఎస్‌

8) పసరకొండ – కాంగ్రెస్‌.

టీఆర్‌ఎస్‌ : 06

కాంగ్రెస్‌ : 02

మొత్తం ఎంపీటీసీలు : 08

అరూరికి మంత్రి పదవి ఇవ్వాలి…

ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు మంత్రి పదవి కేటాయించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు కోరారు. గురువారం వర్థన్నపేట మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టివిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల అపద్భాంధువు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమంకోసం నిరంతరం కషి చేస్తు, నియోజకవర్గంలో నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తన సమస్యలుగా భావించే వారిని, దాదాపు రెండువేలకు పైగా నిరుద్యోగ యువత, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత భోజన, వసతి, పుస్తకాలు, రవాణా కోసం ఉచిత బస్‌పాస్‌ ఇప్పించిన ఘనత గట్టుమల్లు ఫౌండేషన్‌ ద్వారానే సాధ్యమైందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీవర్గంలో బలమైన మాదిగవర్గానికి చెందిన అరూరి రమేష్‌కి రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. రెండుసార్లు దాదాపుగా లక్ష మెజారిటీతో విజయం సాధించిన ఘనత, ఇటీవల కాలంలో వరంగల్‌ ఎంపి ఎన్నికల్లో భారీ మెజారిటీని అందించిన ఎమ్మెల్యే రమేష్‌ని మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తే వర్ధన్నపేట నియోజకవర్గ అభివద్ధికి, ప్రజలకు మరింత సేవా చేసుకునే భాగ్యం ముఖ్యమంత్రి కేసిఆర్‌, కేటిఆర్‌ కల్పిస్తారని, త్వరలో తెలంగాణ వికలాంగుల ఫోరం బందంతో కేసిఆర్‌కు వినతిపత్రం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పిన్నింటి రవీందర్‌రావు, రావుల వెంకట్‌రెడ్డి, అడెపు సోమయ్య, వీరయ్య, సతీష్‌, సారయ్య, సంధ్య, రజనీ, ఎల్లయ్య, రాజయ్య, రమేష్‌, కుమార్‌, దివ్య తదితరులు పాల్గొన్నారు.

దయన్న సొమ్మెక్కడిదన్న- పీఎలకు లక్షల్లో ఖర్చు…?

ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు మంత్రి పదవి దక్కని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ రాష్ట్రంలో అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవతో మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కిన నాటి నుంచి ఎర్రబెల్లి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో తానొక్కడినే మంత్రిని అని టిఆర్‌ఎస్‌ సీనియర్లు, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నాడని అంతర్గతంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఎర్రబెల్లి తన బిల్డప్‌ను పెంచుకుని కాస్ట్లీ మంత్రి అనిపించుకోవడానికి తెగ ఆరాటపడిపోతున్నాడట. ఈ బిల్డప్‌లో భాగంగా ఎంతగా ఖర్చుపెట్టడానికైనా మంత్రి వెనుకాడడం లేదని బాగానే ప్రచారం జరుగుతోంది. నెలవారీగా మంత్రికి భారీగానే ఖర్చు అవుతున్న ఆ ఖర్చును అవలీలగా వేసి అవతల వేస్తున్నట్లు తెలుస్తోంది.

పీఎలకు లక్షల్లో ఖర్చు…?

పీఎలకు, పీఆర్వోలకు నెలవారిగా చెల్లించడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం బేఖాతర్‌ చేస్తున్న మంత్రి పీఎల నియామకం విషయంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడట. తన చుట్టూ ఉండేందుకు డజను మందికిపైగా పీఎలను నియమించుకున్న ఎర్రబెల్లి ఎంతమంది తన వెనకాల ఉండే అంతమంచిది అనే లెవల్‌లో భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పీఎలు, పీఆర్వోలకు 20వేలకుపైగానే జీతం చెల్లిస్తున్న మంత్రి నెలవారీగా ఈ మొత్తం ఎక్కడి నుంచి, ఎలా సమకూరుస్తున్నారో అర్థం కాని విషయం. ప్రభుత్వం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను పీఎలు, ఓఎస్డీగా అందజేయగా నలుగురు అటెండర్లను సైతం సమకూర్చిందట. వీరు సరిపోరనట్లుగా మంత్రి తన ఇష్టారీతిన నియమించుకుంటున్నారు. మంత్రి చుట్టూ ఉండేందుకు ఎవరిని పలకరించిన మంత్రి పీఎను అని అంటున్నారట. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు ఎవరు పీఎలో, ఎవరు కాదో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో అత్యధిక పీఎలు, అత్యధిక చెల్లింపులో మంత్రి దయాకర్‌రావే టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

సొమ్మెలా సమకూరుతుంది…?

ప్రభుత్వం నియమించిన పీఎలు, ఓఎస్డీ, అటెండర్లకు వేతనాలు చెల్లిస్తుంది మరీ. ఎర్రబెల్లి నియమించుకున్న ఇంతమంది పీఎలకు జీతాలు ఎలా సమకూరుతున్నాయో అర్థంకాని విషయం. లక్షల్లో సొమ్మును సమకూర్చడానికి మంత్రి ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారో తెలియడం లేదు. పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి కాంట్రాక్టర్లు, ఇతరులకు ప్రైవేట్‌ సిబ్బంది వేతనాల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎర్రబెల్లికి ఇంతగా ప్రైవేట్‌ సిబ్బంది ఎందుకని ప్రశ్న తలెత్తుతుంది. ఆంగ్ల భాషలో అంతగా పరిజ్ఞానం లేని మంత్రి శాఖపరమైన జిఓలను ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేసేందుకు సైతం భారీ మొత్తంలో వేతనాలు అందిస్తూ ట్రాన్స్‌లెటర్లను పీఎలుగా నియమించుకున్నారట. వీరి వేతనాలు కూడా తడిసి మోపడవుతున్న మంత్రి కదా సొమ్ము సులభంగానే చక్కబెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న మంత్రికి శాఖాపరంగా సైతం బాగానే గిట్టుబాటు అవుతుందని ఈ విషయంలో అందరి మంత్రులంటే ఎర్రబెల్లి ముందువరుసలో ఉన్నట్లు సమాచారం.

మీడియా మేనేజ్‌మెంట్‌లోనూ…

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియా మేనేజ్‌మెంట్‌లోనూ దూసుకువెళుతున్నారట. మేనేజ్‌మెంట్‌ అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రతిపక్షం సమాధానం చెప్పకుండా ఉండే కౌంటర్లు ఇవ్వడం అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. తాను ఏం చేసిన పాజిటివ్‌గా ప్రచారం చేసేలా, నెగిటివ్‌ ఉన్నా చూసిచూడనట్లు ఉండేట్లు మీడియాను మేనేజ్‌ చేస్తున్నాడట. మొత్తానికి పని తక్కువ…ప్రచారం ఎక్కువ అన్నట్లు. ఇక వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోనైతే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన ఇద్దరు మీడియా ప్రతినిధులకు నెలవారి అవసరాలు తీర్చేందుకు లక్షల్లో ముట్టజెప్పుతూ మీడియా అంతటిని మేనేజ్‌ చేసినట్లు ఎర్రబెల్లి సంతృప్తి చెందుతున్నడట. తనపై ఏ వ్యతిరేక వార్తలు వచ్చిన ఈ ఇద్దరు చక్కదిద్దేలా బాద్యతలు అప్పగించాడట.

ప్రభుత్వం ఇచ్చేది లక్షల్లో…ఖర్చుపెట్టేది కోట్లల్లో…

రాష్ట్రప్రభుత్వం మంత్రుల క్వార్టర్స్‌ మరమ్మత్తుల కోసం లక్షల రూపాయల్లో బడ్జెట్‌ కేటాయించింది. ఈ మరమ్మత్తులు ఈ బడ్జెట్‌లోనే ముగిసిపోవాలి కానీ మంత్రి మాత్రం తన క్వార్టర్‌ రిపేరు కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్నాడట. ఇంటీరియల్‌, ప్లోరింగ్‌ ఇతర ఆధునిక సదుపాయాలను ఈ ఇంటిలో ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఈ ఖర్చు అంతా పైల్‌పై సంతకం పెడితే చాలు ఈజిగా సమకూరుతుందని ఈ మరమ్మత్తు బాధ్యతను ఎంత ఖర్చు అయిన ఓ కాంట్రాక్టర్‌ భరిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.

ఎర్రబెల్లి ట్రస్ట్‌ పేరుతో ఆదాయం…?

మంత్రి ఎర్రబెల్లి తన ప్రైవేట్‌ సిబ్బంది, ఇతర కార్యక్రమాలకు భారీగా ఖర్చుపెట్టడానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్‌ ట్రస్ట్‌ మంచి ఆదాయవనరుగా ఉపయోగపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి తన పరపతితో ట్రస్ట్‌కు ఆదాయాన్ని భారీగానే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీని మూలంగానే మంత్రి ఎంత ఖర్చయిన చేయగలుగుతున్నారనే ప్రచారం ఉంది. మొత్తానికి మంత్రి పదవి లభించిన దగ్గర నుంచి ఖర్చు లెక్క చేయకుండా భారీగా వెచ్చిస్తున్న ఎర్రబెల్లికి సొమ్ము ఎలా సమకూరుతుందనే సందేహాలు పార్టీ వర్గాలతోపాటు అందరిలో కలుగుతున్నాయి. ప్రైవేట్‌ పీఎలు, పీఆర్వోలతో ఎర్రబెల్లి తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే పార్టీకి తలవంపులు వచ్చేలా ఉన్నాయని కొందరు సీనియర్లు అంటున్నారు. ఎర్రబెల్లిని కంట్రోల్‌లో పెడితే మంచిదని భావిస్తున్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్‌

సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ప్రజల గుండెల్లో జననాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనియాడారు. హన్మకొండ భవానీనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి ఏర్పాటుచేసిన కేక్‌ను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కట్‌ చేశారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ వెండితెర వేల్పుగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతికాలంలోనే అన్నివర్గాల ప్రజల మన్ననలు స్వర్గీయ ఎన్టీఆర్‌ పొందారని అన్నారు. 1982కంటే ముందు నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌ మహిళా రిజర్వేషన్‌తోపాటు నిమ్న వర్గాలకు స్వాతంత్య్రం, సామాజిక, రాజకీయపరమైన అవకాశాలను కల్పించారని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో వ్యక్తిగత కక్షతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మోడీ, కేసిఆర్‌, జగన్లు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడిని ఓడించడమే ధ్యేయంగా అక్రమ పద్ధతులతో పనిచేశారని, తెలుగుదేశం పార్టీ వ్యక్తుల పార్టీ కాదని ప్రజల పార్టీ అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రం ఎంతో అభివద్ధి చెందిందని తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రానికి రెండుసార్లు లేఖలిచ్చారని తెలుగుదేశం పార్టీ ద్వారానే అన్నివిధాలుగా ఎదిగిన వారే తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడిని దెబ్బతీయాలని కుట్ర చేయడం సిగ్గుచేటని అన్నారు. సిద్ధాంతపరంగా నిస్వార్థంగా సేవచేసే వారే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజలు, బడుగు, బలహీనవర్గాలు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం రాజకీయ విశ్వరూపం ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం దొరికే ఎన్టీఆర్‌ అని ప్రజల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశమని అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల సంక్షేమానికి కషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పుల్లూరు అశోక్‌కుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ జాటోతు సంతోష్‌నాయక్‌, మాజీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ బాబా ఖాదర్‌ అలీ, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు కంప వినోద్‌కుమార్‌, టిఎన్‌యుఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంజ వెంకట్రాజంగౌడ్‌, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ రహీం, ఉమ్మడి జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు హన్మకొండ సాంబయ్య, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కుసుమ శ్యాంసుందర్‌, జిల్లా నాయకులు బైరపాక ప్రభాకర్‌, గొల్లపల్లి ఈశ్వరాచారి, మాఢగాని మనోహర్‌, తోట రమేష్‌, అంబటి ప్రభాకర్‌, బర్ల యాకుబ్‌, సయ్యద్‌ బాబాభాషా, బైరి శేషాద్రి, రవీందర్‌ గుప్తా, చెంచు వేణు, శివరాత్రి వెంకన్న, నాయిని సత్యనారాయణరెడ్డి, కిన్నెర సుధాకర్‌, పిట్టల శ్రీనివాస్‌, కొంగర ప్రభాకర్‌, పోతరాజు అనిల్‌కుమార్‌, కాగితాల జయశంకర్‌, బోడా మోహన్‌బాబు, సాగంటి రాకేష్‌, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

‘ఈటెల’కు పీఎల తలనొప్పి…? ఈటెలను వదలనంటున్న పీఎలు?

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రస్తుతం పీఎల తలనొప్పితో గందరగోళానికి గురి అవుతున్నట్లు తెలిసింది. గతంలో మంత్రికి సన్నిహితంగా ఉన్నవారు, పీఎలుగా కొనసాగిన వారు ఉద్యోగం ఖాళీగా లేదు. ప్రస్తుతం తనకు పీఎల అవసరం ఎంతమాత్రం లేదన్న వినడం లేదట. వద్దుమొర్రో అని చెప్పిన మంత్రి పేషీ చూట్టే తిరుగుతూ పీఎలుగా పనిచేస్తాం అంటూ జబర్థస్తీ చేస్తున్నట్లు తెలిసింది. రెండోసారి అధికారంలోకి వచ్చి పాలన పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రులు, ఇతరులకు పీఎల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పీఎలు, ఓఎస్డీల విషయంలో తానే స్వయంగా వారిని నియమిస్తానని, ఎవరి ఇష్టాలకు వారు నియమించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఆ పనిని చేసి చూపించారు. కానీ సీఎం అంతగా ఆదేశించిన ప్రైవేట్‌ పీఎల విషయంలో మంత్రుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఒక్కో మంత్రి అవసరం ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చినట్లుగా ఎంతమందిని అంటే అంత మందిని పీఎలుగా నియమించుకుంటున్నారు. దీని మూలంగా ప్రజల్లో, నాయకులు, కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

ఈటెలను వదలనంటున్న పీఎలు

టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత ఈటెల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. అప్పుడు కొంతమందిని పీఎలుగా నియమించుకున్నారు. అయితే ఈ పీఎల్లో ఓ ఇద్దరు పీఎలు ఆర్థిక అరాచకత్వాకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మీడియా నుంచి బయటకు వచ్చి ఈటెల పీఎగా కొనసాగిన వ్యక్తి ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బుతో అదృశ్యమయ్యాడని తెలిసింది. ఈటెల పదేపదే ప్రశ్నించిన సమాధానం చెప్పకుండా దాటవేసి మొహం చాటేసినట్లు సమాచారం. అయితే రెండోసారి టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఈటెల తిరిగి మంత్రి కావడంతో పీఎగా కొనసాగుతానని ఈటెలను బ్రతిమిలాడగా అవసరం లేదని చెప్పినా వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చూసుకుంటానని చెప్పి తిరిగి విధుల్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. సెటిల్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ నిర్వహించేందుకు ఈ పీఎ ఈటెలను ఒప్పించి హైదరాబాద్‌లోని జివికె మాల్‌ వెనకాల రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి ఓ కార్పొరేట్‌ కార్యాలయాన్ని తెరిచినట్లు తెలిసింది. ఇదే పీఎ గతంలో తన సొంత మీడియా సంస్థ పేరుతో ఆర్థికశాఖ నుంచి ప్రకటనల రూపంలో లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక వనరుల విషయంలో తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పడం వల్లే ఈటెల ఈ మాజీ మీడియా జర్నలిస్టు, ప్రస్తుత పీఎకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

అప్‌ అండ్‌ డౌన్‌ పీఎ

ప్రస్తుతం మంత్రి ఈటెల వద్ద అప్‌ అండ్‌ డౌన్‌ పీఎ సైతం తన సెటిల్‌మెంట్ల ప్రతాపాన్ని చూపుతున్నట్లు తెలిసింది. అసలు పీఎ కాకున్న, మంత్రి పీఎగా ఒప్పుకోకపోయిన ఇతగాడు నిత్యం కరీంనగర్‌ నుండి హైదరాబాద్‌ సెక్రటేరియట్‌కు తిరుగుతూ పైరవీల పనులు చక్కబెడుతున్నట్లు తెలిసింది. మంత్రికే తెలియకుండా తాను పీఎనని అధికారులను పరిచయం చేసుకుని పనులన్నీ చేసుకుంటున్నట్లు తెలిసింది. టోకెన్‌ క్లియరెన్స్‌, బదిలీలు, ప్రమోషన్లు, సీఎం రిలీప్‌ఫండ్స్‌, ఎల్‌ఓసి, పనులు లేకుండా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి పేషీలో పనిచేసిన అధికారులను మచ్చిక చేసుకుని మెడికల్‌ సీట్లు సైతం ఇప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్న ఈ విషయాలేవి మంత్రి ఈటెల దృష్టికి రాకపోవడం గమనార్హం.

పొమ్మంటే…పోరు

ఈటెల వద్ద గతంలో పీఎలుగా పనిచేసిన వారు అవసరం లేదు అంటే కూడా వినడం లేదంటే. ఎందుకు అంతలా పీఎ పోస్టునే పట్టుకు వేలాడుతున్నారో అద్దం కావడం లేదు. ఈటెల సైతం వీరి విషయంలో సానుకూలంగా వ్యవహారించడం, అవసరం లేదని చెపితే ఏం జరుగుతుందోనని ఆలోచించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మంత్రికి సంబంధించిన కొన్ని రహాస్యాలు వీరి వద్ద ఉండడం వల్లే మంత్రి వీరి విషయంలో సీరియస్‌గా ఉండలేకపోతున్నారే ప్రచారం జోరుగానే కొనసాగుతుంది.

తెలంగాణలో మిశ్రమ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ 4స్థానాలను కైవసం చేసుకోగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలను చేజిక్కించుకోగా, 16కు 16 గెలుస్తామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 9స్థానాల వద్దే ఆగిపోయింది. ఇక ఎంఐఎం పార్టీ ఒకస్థానంతో సరిపెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ 16కు 16 గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఖంగుతిన్న పరిస్థితి నెలకొంది. ప్రజలు ఊహించని విధంగా తెలంగాణలో బిజెపి కరీంనగర్‌లో బండి సంజీవ్‌, సికింద్రాబాద్‌ కిషన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ సోయం బాబురావులు గెలుపొందారు.

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలలో బిజెపి 4స్థానాలను గెలవడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ మొదటి నుండి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఎలాగైనా కేంద్రంలో అధికారం చేపట్టి ప్రధాని కావాలనుకున్నారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా రావడంతో ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేకుండాపోయింది. కేసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయస్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు వెలువడిన ఫలితాలలో నల్గొండ నియోజకవర్గం నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), భువనగిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌), మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌), నిజామాబాద్‌ ధర్మపురి అరవింద్‌ (బిజెపి), కరీంనగర్‌ బండి సంజీవ్‌ (బిజెపి), ఆదిలాబాద్‌ సోయం బాబురావు (బిజెపి), సికింద్రాబాద్‌లో జి.కిషన్‌రెడ్డి (బిజెపి), పెద్దపల్లిలో నేతకాని వెంకటేశ్వర్లు (టిఆర్‌ఎస్‌), నాగర్‌కర్నూల్‌లో రాములు (టిఆర్‌ఎస్‌), వరంగల్‌లో పసునూరి దయాకర్‌ (టిఆర్‌ఎస్‌), మహబూబాబాద్‌లో మాలోతు కవిత (టిఆర్‌ఎస్‌), ఖమ్మంలో నామా నాగేశ్వర్‌రావు (టిఆర్‌ఎస్‌), మెదక్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), మహబూబ్‌నగర్‌లో యన్నం శ్రీనివాస్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), జహీరాబాద్‌లో బివి పాటిల్‌ (టిఆర్‌ఎస్‌), చేవేళ్లలో రంజిత్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఓవైసి (ఎంఐఎం) కైవసం చేసుకున్నారు.

దేశంలో రెండోసారి మోడీ హవా : కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

దేశవ్యాప్తంగా మరోసారి భారతీయ జనతా పార్టీ సునామీ కొనసాగింది. 45రోజుల ఉత్కంఠ అనంతరం కొనసాగిన ఎన్నికల లెక్కింపులో దేశవ్యాప్తంగా మొదటి నుంచి బిజెపి తన సత్తా చాటింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన బిజెపి ఎవరి మద్దతు లేకుండానే అధికారపీఠం ఎక్కడానికి మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంది. మిత్రపక్షాల సహకారం లేకుండానే 299 స్థానాలను సాధించుకుంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 348 స్థానాలతో బిజెపి బలమైన శక్తిగా అవతరించింది. యుపిఎ తన మిత్రపక్షాలతో కలిసి 90స్థానాలను సాధించగా కేవలం 50 స్థానాలను సొంతంగా సాధించగలిగింది.

రెండోసారి మోడీ హవా

దేశంలో రెండోసారి మోడీ హవా కొనసాగింది. నోట్ల రద్దు, జిఎస్టీ తదితర అంశాలు మోడీకి ఎన్నికల్లో ప్రతికూలంగా మారి ఘోరపరాజయాన్ని పొందుతాడని ప్రతిపక్షాలు కలలు కంటే వాటినన్నింటిని కల్లలుగా మార్చి, దేశప్రజలు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం దగ్గర నుండి బిజెపి తన ప్రభావాన్ని చూడగలిగింది. దీంతో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కనున్నారు. బిజెపి విజయంతో పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది.

కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

ఈ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి ప్రధాని పీఠం ఎక్కవచ్చనే రాహుల్‌గాంధీ ఆశలపై బిజెపి నీళ్లు చల్లింది. ఘనవిజయంతో రాహుల్‌ ఆశలు అడియాశలయ్యాయి. ఎంపీగా కేరళ వయనాడ్‌లో, యుపి అమేథీలో పోటీ చేసిన రాహుల్‌ కేవలం కేరళ వయనాడ్‌లో మాత్రమే తన ప్రభావాన్ని చూడగలిగాడు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీతో తలపడిన రాహుల్‌ విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.

పశ్చిమబెంగాల్‌లోను బిజెపి హవా

పశ్చిమ బెంగాల్‌లో మొదటి నుండి దీదీ వర్సెస్‌ మోడీగా కొనసాగింది. అయితే ఇక్కడ బిజెపి అంతగా ప్రభావం చూపదని అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి 15స్థానాల్లో తన సత్తాను చాటుకుంది. తృణమూల్‌ 25స్థానాలతో సరిపెట్టుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version