హస్తంలో విజయ రెడ్డి కారులో గోవర్ధన్ రెడ్డి

దానం అడిగాడు! రేవంత్‌ కాదన్నాడు!?

పట్టుపట్టి పదిమందితో చెప్పించాలని చూసినా లేదన్నాడు?

పాత గ్రూపులు పోగేసుకొని మరీ దానం అడిగినట్లున్నాడు?

రేవంత్‌ వెంటనే విజయా రెడ్డిని రంగంలోకి దింపాడు?

పైలా పచ్చీస్‌ మొదలుపెట్టాడు?

దానంను గాంధీభవన్‌ మెట్లెక్కుండా చేశాడు?

నిన్నటి దాకా అందరినీ చిర్రుబుర్రులాడే దానం కార్యకర్తలను కౌగిలించుకుంటున్నాడు!

ముసి ముసి నవ్వులతో మచ్చటపెడుతున్నాడు?

వచ్చిన నాయకులకు మర్యాదలు చేస్తున్నాడు?

ఆ నోట, ఈ నోట ఈ సంగతి తెలిసి దానంకు కారులో చోటు లేదన్నట్లున్నారు?

అత్యాశ ఇప్పటికే ఓసారి కొంపముంచింది…ఇప్పుడు మరో సారి నిజం కానున్నది?

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…?

హస్తంలో విజయా రెడ్డి, కారులో గోవర్ధన్‌ రెడ్డి! ఇది ఫిక్స్‌!?

ఆగం కానున్న దానం రాజకీయం..!

కారులో కుదురుగా కూర్చోలేదు?

గతంలో చేజేతులా చెడగొట్టుకున్నాడు…?

పదవులు శాశ్వతం అనుకొని, రాజకీయం తాత్కాలికం చేసుకున్నాడు?

రాజకీయాలలో అంతే…అంతే!!     

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవడానికి పేకాట కాదు…పోయినచోట వెతుక్కోవడానికి వస్తువు కాదు….రాజకీయం…విశ్వాసం..నమ్మకం…ప్రజల ఆశీర్వాదం….ఏ ఎండకాగొడుగు పట్టడం, తన రాజకీయం జీవితం పబ్బం గడుపుకోవడం దానం నాగేందర్‌కు కొత్త కాదు…దానం రాజకీయ జీవితమంతా జంపింగ్‌ల మయం…ఎప్పుడు ఎక్కడ వుంటాడో తెలియని రాజకీయం….దానం నాగేందర్‌ టిఆర్‌ఎస్‌లో ఇమడ లేక, కష్టంగానే సాగుతున్నాడు అనేది చాలా మంది చెబుతున్న మాటే కాకపోతే 2014 ఎన్నికల్లో ఓటిపోయిన తర్వాత అప్పటి పరిస్ధితులను బేరీజు వేసుకొని టిఆర్‌ఎస్‌లో చేరాడు. పార్టీలు జంప్‌ కావడం అన్నది దానంకు అనాదిగా వస్తున్నదే…టిఆర్‌ఎస్‌లోకి రానైతే వచ్చాడు కాని, ఆయన టిఆర్‌ఎస్‌ శ్రేణులతో మమేకమైపోలేదు. నాయకులను పట్టించుకోలేదు. కార్యకర్తలను దరి చేరనీయలేదు. ఇక కరోనా కాలంలో ప్రజలకు అందుబాటులో వున్న దాఖలాలు పెద్దగా లేవు. దాంతో ఆయన ఇక టిఆర్‌ఎస్‌లో వున్నా, భవిష్యత్తు నీలి నీడలే కళ్లముందు కనిపిస్తున్నాయనుకున్నట్లనుకున్నాడు…దాంతో మళ్లీ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోవాలని చూసినట్లు విశ్వసనీయ సమచారం. కాని డామిట్‌ కథ అడ్డం తిరిగింది. ఒక నాడు పిజేఆర్‌ అనుచరుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దానం, ఆయన చలవ వల్ల రెండుసార్లు ఆసిఫ్‌నగర్‌ నుంచి గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దానం నాగేందర్‌కు టిక్కెట్‌ నిరాకరించింది.ఆఖరు సమయం వరకు వేచి చూసిన దానం, రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ కండువా వదిలేసి, తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నాడు. ఆసిఫ్‌ నగర్‌ నుంచి టిడిపి బిఫామ్‌ తెచ్చుకున్నాడు. గెలిచారు. కాని తెలుగుదేశం ఓడిపోయింది. కాంగ్రెస్‌ విజయం సాధించింది.

వైఎస్‌ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో వెంటనే మళ్లీ తెలుగుదేశం కండువా వదిలేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. అక్కున చేర్చుకొని, రాత్రికి రాత్రి చేరినా టిక్కెట్టు ఇచ్చి నమ్మిన చంద్రబాబును మోసం చేశాడు. తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశాడు. అలాంటి వ్యక్తి మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తానంటే రేవంత్‌ రెడ్డి ఆహ్వానిస్తాడా? ఇప్పటికీ రేవంత్‌ రెడ్డి చంద్రబాబుకు అనుచరుడే…అలాంటిది దానంను దరి చేరనిస్తాడా? ఎలాగైనా దానం కాంగ్రెస్‌లో చేరేందుకు చేయాల్సినంత ప్రయత్నం చేసినట్లే తెలుస్తోంది. కాంగ్రెస్‌ లోని సీనియర్లతో కూడా రేవంత్‌కు చెప్పి చూసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా దానంను గాంధీభవన్‌ మెట్లెక్కకుండా చేయాలి. అందుకు రేవంత్‌ రెడ్డి వెంటనే పిజేఆర్‌ కుటుంబాన్ని మళ్లీ క్రియాశీలకం చేయాలనుకున్నాడు. కార్పోరేటర్‌ విజయారెడ్డిని కాంగ్రెస్‌లోకి తెచ్చి, ఖైతరాబాద్‌ టిక్కెట్‌ నీకే అన్నాడు. దానం ఆశలను ఆదిలోచే రేవంత్‌ తుంచేశాడు. ఈ విషయం ఆనోట, ఈ నోట కారు టిఆర్‌ఎస్‌ పెద్దల చెవిన పడిరది. టిఆర్‌ఎస్‌లోనూ దానం విషయంలో పార్టీ పునపరిశీలన చేయాలన్నంతా దాకా వచ్చింది. దాంతో అన్ని వైపులా దారులు మూసుకుపోయిన దానం నాగేందర్‌ కు ఎటూ పాలుపోని స్ధితిలోకి నేట్టేసినట్లైంది. నిన్నటిదాకా కార్యకర్తలను చూస్తేనే చిర్రుబుర్రులాడే దానం వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. అక్కున చేర్చుకుంటున్నాడు. ఆలింగనం చేసుకుంటున్నాడు. మర్యాదలు కూడా చేస్తున్నాడని చెప్పుకుంటున్నాడు. ముసిముసి నవ్వులతో కార్యకర్తలతో ముచ్చటపెడుతున్నాడని చెప్పుకుంటున్నారు. 

దానం ఎక్కడ వుంటే అక్కడ విచిత్రంగా హడావుడి వుండేది. సందర్భమేదైనా, సరే హడావుడికి కొదువుండేది కాదు… వైఎస్‌ మరణంతో ఇక ఆయన జగన్‌ను ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో క్యాంపు కార్యాలయం కేంద్రంగా దానం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు…ఇక జగన్‌ తర్వాత నేనే అన్నంత హంగామా సృష్టించాడు. కాని జగన్‌కు ముఖ్యమంత్రి రావడం లేదని తెలిసిన మరుక్షణం జగన్‌కు జెల్లకొట్టాడు. జగన్‌కు అనుకూలంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే దానం దూరం జరిగాడు. రోశయ్య మంత్రి వర్గంలో చేరాడు…ఆ తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో దానం చేసిన హాడావుడి చెప్పనలవి కాదు…నగరం మొత్తం కిరణ్‌కుమార్‌రెడ్డి హోర్డింగులతో నింపేశాడు. రాజ్‌భవన్‌ దారిలో దానం నాగేందర్‌, ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నీ ఇన్నీ కావు. ఇక తెలంగాణ ఉద్యమం తీవ్ర తరమైన సందర్భంలో , శ్రీకృష్ణ కమిటి ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన సమయంలోనూ హైదరాబాద్‌ నాదీ అన్నంత హంగామా చేశాడు. హైదరాబాద్‌ను యూనియన్‌ టెరిటరీ చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చాడు. ఒక దశలో ఉద్యమ కారుల మీద సికింద్రాబాద్‌లో స్వయంగా ఆయనే పోలీసు లాఠీ పట్టుకొని వీర విహారం చేశాడు. తెలంగాణ విద్యార్థులను చెల్లాచెదురు చేశాడు. 

తన కోసం ఎంతకైనా దిగజారడతాడని , తనకు సాయం చేసిన వారిని రాజకీయంగా నిండా ముంచడానికి ఏనాడు వెనుకాడడని చెప్పడానికి ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు.2009 డిలిమిటేషన్‌ కారణంగా ఖైరతాబాద్‌ను రెండు ముక్కలు చేయడంతో కీలకపాత్ర పోషించిన దివంగత వైఎస్‌. రాజశేఖరరెడ్డి, 2009 ఎన్నికల్లో పి. విష్ణువర్ధన్‌రెడ్డికి ఖైరతాబాద్‌ కేటాయించకుండా, దానం నాగేందర్‌కు ఇచ్చారు. అలా తనను రాజకీయ గురువైన పిజేఆర్‌ కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేయడానికి పూనుకున్నాడు. తప్పని పరిస్ధితులత్లో విష్ణు జూబ్లిహిల్స్‌ నుంచి పోటీ చేయకతప్పలేదు. ఇక 2014 ఎన్నికల్లో ఓడిపోయిన దానం, టిఆర్‌ఎస్‌ దరి చేరారు. కారులో చోటు సంపాదించుకున్నాడు. మళ్లీ ఖైతరాబాద్‌ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. కాని ఆనాటి నుంచి ఆయన జనంలో వున్నట్లు పెద్దగా కనిపించలేదు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను, నాయకులను అనేక సందర్భాలలో చిన్న చూపు చూడడం, వారిని ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా వివాదాలున్నాయి. పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పార్టీపరమైన రాజకీయాల గోడ దూకడంలో ఆరి తేరిన దానం నాగేందర్‌ హస్తం గూటికి చేరడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో, మళ్లీ కారే దిక్కని కొత్త రాజకీయాలు నెపరడం అంతా జనం గమనిస్తూనే వున్నారు. దాంతో ఈసారి దానంకు టిక్కెట్టు ఇవ్వడం టిఆర్‌ఎస్‌ నాయకులకు కూడా ఇష్టం లేకుండాపోతోంది. ఒక వేళ దానం నాగేందర్‌కు ఇవ్వడం అంటూ జరిగితే కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులే కనిపిస్తాయంటున్నారు. దానం నాగేందర్‌కు ప్రత్యేకంగా వున్న బలమేమీ లేదు. కాకపోతే గత ఎన్నికల్లో మొత్తం టిఆర్‌ఎస్‌ శ్రేణులు కలిసి పనిచేసి గెలిపించాయి. కాని ఆయన దాన్ని తన సొంత బలంగా ఊహించుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం అర్ధమైంది. దాంతో మళ్లీ గెలవాలంటే టిఆర్‌ఎస్‌ శ్రేణుల అవసరం ఎంతో అన్నది బోధపడినట్టుంది. దాంతో ఎన్నడూ లేని విధంగా నాయకులతో, కార్యకర్తలను పిలిపించుకొని భుజ్జగింపు కార్యక్రమాలు మొదలుపెట్టారు. 

దానం వర్సెస్‌ విజయారెడ్డి అనేది జరిగితే మాత్రం టిఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమైన పరిస్ధితులే ఎదురుకావొచ్చు.కాకపోతే దానం స్ధానంలో ఉద్యమ కారుడైన మన్నె గోవర్ధన్‌రెడ్డికి ఇస్తే మాత్రం ఖైరతాబాద్‌ మళ్లీ కారు సొంతం కావడం తధ్యమంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలుగా రెండుసార్లు కార్పోరేటర్‌గా అవకాశం ఇచ్చిన టిఆర్‌ఎస్‌ను కాదని వెళ్లిన విజయారెడ్డి కూడా దానం వల్లనే పార్టీ మారినట్లు కూడా స్పష్టంగా చెప్పారు. అంటే దానం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని తేలిపోయింది. విజయారెడ్డి ఎలాగూ పార్టీ వదిలేసి వెళ్లిపోయింది. అంతకు ముందు వెళ్లాలని దానం అనుకున్నాడు. అందుకే ఈ సారి ఉద్యమకారుడైన మన్నె గోవర్ధన్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడానికి మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.

బండకేసి కొట్టాల్సిందే!

అధిష్టానం ఆదేశాలను అపహస్యం చేసేలా సీనియర్ల తీరు

` ప్రజల్లోకి వెళుతున్న క్రమంలో మెకాలడ్డే ప్రయత్నం

` హైకమాండ్‌ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే హద్దుమీరుతున్న వైనం

` పీసీసీ అంటే లెక్కలేని తనం మనుగడకు మంచిదేనా..?

` రేవంత్‌కు అండగా సెకెండ్‌ కేడర్‌

` పనిగట్టుకుని పార్టీని పంగనామాలు పెట్టే ప్రయత్నాలు

` పీసీసీ చీఫ్‌ బండాకు కొడాతనంటూ ప్రకటనతో ఒక్కసారిగా సీనియర్లలో మార్పు

` సంచలన ప్రకటనంటూ సల్లబడ్డ జగ్గారెడ్డి

` మెలికపెట్టబోయి మెత్తబడ్డ వీహెచ్‌

`పార్టీకి కట్టుబడి పనిచేయకపోతే అన్నంత పని చేయాల్సిందేనంటున్న క్యాడర్‌ 

` వివాదాలకు తెరతీయాలనుకున్న ఫలించని విష్ణు విందు రాజకీయం 

` సీనియర్లదంతా ఒంటెద్దు పోకడ ఒదులుకుంటేనే పార్టీ మనుగడ 

`చేరికలతో పార్టీలో కొత్త ఉత్సాహం

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి వారే…యమునా తీరే…ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు…ఎవరు ఎటు వైపు నిలుస్తున్నారో తెలుసుకోరు…ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో వారికే తెలియదు…ఎవరితో కలిసి సాగుతారో…ఎప్పుడూ రాం రాం అనుకుంటారో తెలియదు… గ్రూపులకు కొదవలేదు..ఆ కొట్లాటలకు లెక్కలేదు…యువకులు అంతే…సీనియర్లు అంతే..కొత్తగా చేరిన వారంతే…పోయిన వారు వస్తారంటుంటే వద్దంటున్న వారంతే…రమ్మని కోరుతున్నవారు అంతే…ఎవరికి ఎవరూ తగ్గరు..ఎక్కడా తగ్గరు…ఎవరికీ తలవంచరు…అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు…వారికి ఇష్టమైనట్లు వ్యహరిస్తుంటారు..విందు రాజకీయాలు చేస్తారు…గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తుంటారు…గోడమీద నిలబడ్డట్టే వుండారు..వెళ్లలేరు…వుండలేదు…ఎవరికీ ఏమీ కారు…మాకు మేమే…మాకంటే తోపులేరక్కడంతే..అనుకుంటూ వాళ్లను వాళ్లు సముదాయించుకుంటుంటారు…కుంపట్లు రాజేస్తుంటారు…..పక్కవారికి అభద్రతకు గురిచేస్తుంటారు…ఇదంతా కాంగ్రెస్‌ రాజకీయం…అతి ప్రయత్నం…అసలు ప్రభావం…శూన్యవాదం… రిక్తహస్తం…ఆఖరుకు అయ్యో చేజారిపోయేనే…అంటూ ధీర్ఘాలు…ఎత్తిపొడుపులు…వెక్కిరింతలు…ముందు అంతే…తర్వాత అంతే….ఎన్నికల ముందు కలిసి వుండరు…ఎన్నికల తర్వాత కలిసి వుండరు…ఎప్పుడూ కలిసి వుండాలన్న ఆలోచన చేయరు…అందుకే వాళ్లంతా ఒక్కటే అయితే కాంగ్రెస్‌ నేతలెందుకౌతారని సామెత…ఒకరి నొకరు కాళ్లు పట్టుకొని లాగితే గాని రాజకీయాలు చేయలేరు…ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మందు కాంగ్రెస్‌ రాజకీయాలు అచ్చు ఇలాగే వుండేవి…ఆ తర్వాత కొంత తగ్గాయి…కాని మళ్లీ ఇప్పుడు పుట్టలో నుంచి పాము లేచినట్లు మళ్లీ అదే దోరణి…అదే పద్దతి…ఆ పద్దతే కరక్టు అనుకుంటూ రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో ఎనమిదేళ్లుగా పార్టీ అధికారానికి దూరమైనా, ఇంకా నాయకులు ప్రజల్లో వుంటున్నారంటే, జనంలో కాంగ్రెస్‌ పార్టీపై వున్న నమ్మకం అన్నది వారికి బోధపడడం లేదు…

                             ఇటీవలే కాంగ్రెస్‌ రాజకీయాలు కొద్దిగా దారిన పడుతున్నాయంటే , ఎప్పటికప్పుడు ముదిరి పాకాన పడేయడం వారికి కొత్త కాదు…

అందుకే గతాన్ని మార్చలి…గతంలో కాంగ్రెస్‌ చేసిన రాజకీయాలు మార్చాలి…వర్తమానంలో అసలు సిసలైన రాజకీయాలు చేయాలి…అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రూటే కరక్టు…ఎందుకంటే కాంగ్రెస్‌లో దూకుడు మీద వుండే నాయకుడిని దూరం పెడుతుంటారు…వారితో ఎడమొహం పెడమొహంగా వుంటారు….ఎలాగైనా కాళ్లు పట్టుకొని లాగేయాలనుకుంటారు…అదే మెతక వ్యక్తిత్వం వున్న నాయకుడైతే గేలి చేస్తుంటారు… హేళన చేస్తుంటారు…ఇది ఆ పార్టీలో కామన్‌…అందుకే ఆ పార్టీలో అలిగేవారు ఎక్కువే..అరిచే వారు కూడా ఎక్కువే….2014 ఎన్నికల ముందు, తెలంగాణ ప్రకటన కంటే ముందే…భవిష్యత్తును ఊహించుకొని నేనంటే నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న నేతలు చాలా మందే వున్నారు. అందులో ముఖ్యమైన నాయకుడు జానారెడ్డి…2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అదేంటో గాని ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి మీద కలలు గన్న నేతల్లో జానారెడ్డి, మాత్రమే గెలిచారు…అదే జిల్లానుంచి కోమటి రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు గెలిచారు. అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలాగూ దక్కని జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడయ్యారు. కాని అదే ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడినట్లైంది. 

                      మొదటి దఫా తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వుంటే, ప్రతిపక్షం డల్లుగా సాగింది.

 ప్రభుత్వాన్ని ధీటుగా ఎదరుర్కొనేందుకు, అడుగడుగునా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నం చేయాలనుకున్నా, జానారెడ్డి నెమ్మదనం పార్టీ కొంప ముంచింది. ఆయన మెతక వైఖరి కూడా పిరాయింపుదారులను కట్టడి చేయలేకపోయింది. అటు ప్రభుత్వాన్ని ఎదుర్కొలేకపోయింది. ఇటు ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది. పైగా జానారెడ్డి పదే పదే ప్రభుత్వ పధకాలను మెచ్చుకుంటూ పోవడంతో ఆఖరుకు ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. అయినా పార్టీలో మార్పు రాలేదు. తర్వాత ఎన్నికలు కూడా ఓడిపోయింది…ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెవాలంటే, ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడే కరట్టు అని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. ఎందరు అడ్డుకోవాలనుకున్నా అధిష్టానం వినిపించుకోలేదు. తర్వాత కూడా రేవంత్‌కు అడుగడుగునా కాళ్లలో కట్టేలు పెట్టే ప్రయత్నం సీనియర్‌ నాయకులు ఆపలేదు. ఇప్పటికీ ఆపడం లేదు…

                          ఇక మెతక వైఖరి సరైంది కాదని రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లున్నారు.

 వరంగల్‌ సభ సక్సెస్‌ తర్వాత మంచి దూకుడు మీద వున్నాడు. పార్టీలో కూడా ఊపు తెచ్చాడు. కాకపోతే ఆ మధ్య రెడ్డి రాజకీయం సరిగ్గా సాగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదన్న సంకేతాలను ఆయన పంపాలనుకున్నాడు. కాని సొంత పార్టీయే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను చిలువలు పలువలు చేయాలని చూసింది. ఒక దశలో చేసింది కూడా…అది అధికార పార్టీకి అస్త్రంగా మారింది. బిజేపికి కూడా రాజకీయంగా ఒక రకంగా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు ఉపయోగపడిరది. కాని కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ మాత్రం పట్టించుకోలేదు. ఎక్కడా రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు స్పందించలేదు. నాయకుల వరకే విమర్శలు వినిపించినా, సముద్రంలో వచ్చే సహజమైన ఆటు పోటుగాలో చల్లబడిరది. సీనియర్ల ఆశలకు గండికొట్టింది. ఇక అప్పటినుంచి రేవంత్‌రెడ్డి కూడా మరింత గట్టిగా వుంటే తప్ప, సోకాల్డ్‌ సీనియర్లు దారిలోకి రారని నిర్ణయించుకున్నట్లున్నారు. 

 తాజాగా ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌ రావడం, కాంగ్రెస్‌ శ్రేణులను కలవకపోవడం జరిగింది.

 అయితే అంతకు ముందే పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎవరూ యశ్వంత్‌సిన్హాను కలవడానికి వీలు లేదని హుకూం జరిచేశారు…కాని సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు ఆ మాటలు పెడచెవిన పెట్టినట్లున్నాడు. యశ్వంత్‌ సిన్హాను కలిశాడు. దాంతో మీడియా ముఖంగా రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యాడు. దాన్ని జీర్ణించుకోలేని జగ్గారెడ్డి మరోసారి రెచ్చిపోయే ప్రయత్నం చేశాడు. కాని రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గకుండా, వదిలేయకుండా తన మాటలు, పార్టీ నిర్ణయాలు ఎవరు బేఖాతరు చేసినా, లెక్కలోకి తీసుకోకపోయినా బండకేసి కొట్టుడే అంటూ సీరియస్‌ అయ్యాడు. ఇక ఉపేక్షించేది లేదని సంకేతాలు పంపారు….దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్‌పార్టీలో నిశ్శబద్దం ఆవహంచినట్లైంది. అయితే ఇందులోనూ కొంత అలజడికి శ్రీకారం చుట్టాలని అనుకున్నా వారి పప్పులు ఉడకలేదు…రేవంత్‌ రెడ్డి ఇలా గట్టిగా వుంటే తప్ప పార్టీ గాడిలో పడదంటున్నారు…గో ..హెడ్‌!!అంటున్నారు. రేవంత్‌ గట్టిగానే వుండాలని కార్యకర్తలు నాయకులు కోరుతున్నారు…

ఆలేరు ముక్కొణపు పోరు!

హస్తం ప్రభావం కూడా తక్కువేం కాదు?

బలమైన గులాబిలో మోత్కుపల్లి గుబులు?

గొంగిడి సునీతకు హాట్రిక్‌ దక్కేనా?

కారులో మొదలైన కుతకుతలు?

నిన్నటి దాక గొంగిడి సునీతకు ఎదురులేదు?

సెకండ్‌ క్యాడర్‌ కనుచూపు మేర కూడా లేదు?

మోత్కుపల్లి కారెక్కడంతో సరికొత్త సమీకరణాలు?

మోత్కుపల్లిని ఒత్తిడి చేస్తున్న అనుచరులు?

గతంలో ఐదుసార్లు ఆలేరు ఎమ్మెల్యే?

ఇప్పటికీ పోటీకి సై…సై?

తెరాసలో చేరడంతో చిగురించిన ఆశలు?

గొంగిడి సునీతకు మొదలైన తలనొప్పులు?

కమల వికాసంలో ఎదురుచూపు?

ఇంతకీ జనమెటువైపు?

కారుకు కలిసొచ్చే దగ్గర సొంత కుంపటిలో పొగలు?

                        ఒకరిది హీట్రిక్‌ కోసం ఆరాటం…మరొకరిది ఎలాగైనా పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలన్న పోరాటం…ఇంకొకరిది పార్టీకి ఇప్పుడిప్పుడే ఊపొస్తోంది. గెలిస్తే నాకు కూడా పేరొస్తుందన్న ఉబలాటం…..సందిట్లో సడేమియా లాగా గతాన్ని ముందేసుకొని, చరిత్రను తవ్వే పనిలో మరో నాయకుడు వున్నాడు. అవకాశం వస్తే నేను కూడా పోటీ చేస్తానంటున్నాడు. కాకపోతే నాలుగో నేత ఆశలకు పెద్దగా ఫలించే సూచనలు లేవు. ముగ్గురు మాత్రం పక్కా…ఈ ముగ్గురు మధ్యే పోటీ అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

                    తెలంగాణ ఉద్యమంలో గొంగిడి సునీత, ఆమె భర్త మహేందర్‌రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలేరు నియోజకవర్గం నుంచి ఆమెకు అవకాశం కల్పించారు. 2014లో గెలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ టిక్కెట్టు ఇచ్చారు. రెండోసారి కూడా గెలిచారు. అయితే ఆ ఎన్నికల సమయంలో పెద్దఎత్తున వివాదాలు కూడా చెలరేగిన నియోజకవర్గం కూడా ఆలేరే…ఆలేరు చెందిన గుండాల మండలం జనగాంలో చేర్చడాన్ని ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఆ ఎన్నికల్లో గొంగిడి సునీత గెలుపుపై ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు. కాని ఆమె ఎంతో చాకచక్యంగా ఎన్నికల తర్వాత ఎలాగైనా గుండాలను యాదాద్రి జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని గట్టిగా మాటిచ్చారు. గెలిచారు. ఈ ఒక్క వివాదం తప్ప ఆమెపై మరేరకమైన ఆరోపణలు అప్పటికి లేవు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గొంగిడి సునీత బాగానే అభివృద్ధి చేస్తుందన్న మాటతో పాటు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆమె విజయానికి బాటలు వేశాయి. ఇంత వరకు బాగానే వుంది. మళ్లీ గెలిచింది. ప్రభుత్వ విప్‌గా ప్రమోషన్‌ పొందింది. కాని ఆ తర్వాత ప్రజలను , అభివృద్ధి పనులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతే కాదు నియోజకవర్గంలో ఆమె ఎవరికీ మేలు చేసినట్లుగాని, అలాగని కీడు చేసినట్లు లేదు. కేవలం రియలెస్టేట్‌ మీద వ్యాపారం తప్ప ఈ దఫా విప్‌ గొంగిడి సునీత పెద్దగా నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్న అసంతృప్తులే వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఆలేరు నియోజకవర్గం నుంచి ఈసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తలు మొదలైనప్పటినుంచి ఆమెలో కొంత నిస్తేజం కనిపిస్తుందని కూడా అంటున్నారు. ఎగిరెగిరి దంచినా అదే కూలీ, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్లు, నియోజకవర్గం మీద ఎంత దృష్టిపెట్టి అభివృద్ధి చేసినా టిక్కెట్టు ఇస్తారో లేదో లేదో అన్న డైలామాలోనే చాలా కాలంగా వుంటున్నారని అంటున్నారు. ఇదిలా వుంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలేరుపై నుంచి పోటీ చేయొచ్చని అనుకుంటున్న తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బిజేపిని వదిలి కారెక్కారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఈ మధ్య ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. దళిత బంధు అమలులో కూడా ఆయనను ముందు పెడుతున్నారు. యాదగిరి గుట్టకు ముఖ్యమంత్రి ఎప్పుడొచ్చినా, గుడి ప్రారంభ సమయంలోనూ మోత్కుపల్లికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. ఇది కూడా గొంగిడి సునీతలో కొంత అసంతృప్తికి కారణమైందని కూడా అంటున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి ఆలేరుకు వస్తారన్నది, మరో వైపు మోత్కుపల్లి ఎలాంటి ఎత్తులు వేస్తారో అన్నది కూడా పెద్ద చర్చనీయాంశంగానే వుంది. కాకపోతే గొంగడి సునీత చేసిన నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే, ఒక్క యాదగిరి గుట్ట పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించడం తప్ప, ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ లేదని కూడా అంటున్నారు. యాదాద్రి పరిసరాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని సంతోషించాలో, లేక సామాన్యలకు అందుబాటులో లేకుండా పోయాయని బాధపడాలో తెలియని పరిస్ధితిలో నియోజకవర్గం వుందంటున్నారు. ఏది ఏమైనా ఆమెపై విమర్శలు, వివాదాలు లేకపోయినా అభివృద్ధి గురించి ఈ దఫా ఆమె పట్టించుకోలేదన్న మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. 

                                   ఇక 2009 ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన బూడిద బిక్షమయ్య గౌడ్‌ అప్పట్లో మంచి పేరునే సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి రియలెస్టేట్‌ వ్యవహారంలో కొన్ని చిక్కుల్లో చిక్కుకున్నాడు. దాంతో కాంగ్రెస్‌ను వదిలేసి కారెక్కారు. అక్కడ తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆశించాడు. కాని అక్కడ పలకరించేవారు లేకుండాపోయారు. ఆయనకు ఏదైనా పదవి వస్తుందేమో అన్న ఆశతోనే గత కొంత కాలం క్రితం వరకు ఎదురుచూశారు. ఇక తనకు ఎలాంటి పదవి లభించేలా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలాగూ టిఆర్‌ఎస్‌ ఇవ్వదు. ఇంకా ఆ పార్టీలో వుండడం ఎందుకు అనుకొని బిజేపిలో చేరారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సీట్లు, రఘునందన్‌, ఈటెల గెలపుతో ఊపులా భావిస్తున్న బిజేపిని నమ్ముకొని బిక్షమయ్య గౌడ్‌ ఆ పార్టీలో చేరాడు. ఆలేరు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ ఎంతో బలంగా వుంది. ఆ పార్టీ తర్వాత బిజేపినే బలంగా వుందన్న మాటలే వినిపిస్తున్నాయి. దాంతో తన మాతృ సంస్ధ అయిన కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా బిక్షమయ్య గౌడ్‌ బిజేపిలో చేరారు. తన మీద తనకన్నా, బిజేపి మీద పెంచుకున్న నమ్మకం తనను గట్టెక్కిస్తుందేమో అన్న ఆశతో చేరినట్లున్నారు. సహజంగా హైదరాబాద్‌కు సమీపంలో ఆలేరు వుండడం, బిజేపికి కొంత కలిసి వచ్చే అంశం. నగర రాజకీయ ప్రభావం ఇక్కడ కూడా కనిపించే అవకాశాలున్నాయన్నది బిక్షమయ్య అంచనా వేసినట్లున్నారు. నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌ రాజకీయాలకాన్న, ఎలాంటి తలనొప్పి లేని బిజేపి బెటర్‌ అని అకున్నట్లున్నారు. కమలంతీర్ధం పుచ్చుకున్నారు. కాకపోతే ఇంకా ఆయన తన ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడే కావడం కూడా ఆయనకు కలిసివస్తుందన్న నమ్మకంతో వున్నట్లు తెలుస్తోంది. 

                       ఇక రేవంత్‌ రెడ్డి రాకతో కొంత ఉత్సాహాన్ని కనబర్చుతున్న కాంగ్రెస్‌లో ఆలేరులో పెద్దగా పేరున్న నాయకుడు లేడు. బిక్షమయ్య గౌడ్‌ తర్వాత అంతటి స్ధాయిని కనబర్చిన నాయకులు లేరు. కాకపోతే ఆలేరు కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న బీర్ల అయిలయ్య నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడనే అంటున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ డిక్లరేషన్‌లోని అంశాలతోను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు మాత్రం బాగానే చెప్పుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసుకుంటూ తన ప్రచారం ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారు. పైగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు కూడా పెద్దఎత్తున చేపడుతున్నారని సమచారం. పార్టీని వాడుకొని వదిలేసిన, అవకాశ వాదులకన్నా, నిత్యం ప్రజల్లో వుంటూ, అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీర్ల అయిలయ్య కొంత మెరుగే అన్న సానుకూల దృక్పథం ప్రజల్లో కనిపిస్తోందంటున్నారు. 

                               ఆలేరులో పేరుకు ముక్కొణపు పోటీ కనిపిస్తున్నా, అంతర్లీనంగా చతుర్ముఖ పోటీ వున్నట్లే వుంది. తానేం తక్కువ. తనకేం తక్కువ. ఐదుసార్లు ఆలేరు నుంచి, ఒకసారి తుంగతుర్తి నుంచి ఎదురు లేకుండా, తిరుగులేని రాజకీయాలు చేసిన నాకన్నా పెద్ద నాయకుడు ఎవరున్నారంటూ మోత్కుపల్లి కూడా తాను బరిలో వుంటే ఎలా వుంటుందనేదాన్ని పరిశీలిస్తున్నాడట. తన సొంత మనుషుల దగ్గర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడట. తాను ఇంకా ఫిట్‌గానే వున్నానని, రాజకీయ పదవుల మీద ఆశ లేకపోయినా, ప్రజలు సేవ చేయాలన్న ఆలోచన తగ్గలేదంటున్నారట. తాను ఎంతో నిజాయితీ కలిగిన నాయకునని, ఇప్పటికీ కనీసం సొంత ఇల్లు కూడా లేని నాయకుడినని, నా లాంటి రాజకీయ నాయకులు ఈ సమాజానికి ఆదర్శమంటున్నారట. నాలాంటి నాయకులే ఈ కలుషిత రాజకీయాలను మార్చాలని అంటున్నాడట. తన లాంటి నాయకులను చూసైనా రాజకీయాల్లో మళ్లీ అవినీతికి తావులేని రోజులు వస్తాయన్న నమ్మకం వుందని, నిజాయితీ అంటే ఎలా వుంటుందో, అభివృద్ధి అంటే ఎలా చేయాలో చేసి చూపిస్తానని కూడా తన అనుయాయులతో చెప్పుకుంటున్నాడట. మరి కారు టిక్కెట్టు ఎవరిని వరించినా, టిఆర్‌ఎస్‌ మాత్రం నియోజకవర్గంలో బలంగా వుంది. ఇద్దరు బలమైన నాయకులు పార్టీ కోసం కాకుండా, వ్యక్తిగత రాజకీయాలు చేస్తే మాత్రం నియోజకవర్గ అధికారం కారు నుంచి జారి పోవడం మాత్రం ఖాయం…? తేరుకోకపోతే రాజకీయ అలజడి మొదలై మునకలేయడం తధ్యం..?

 రాష్ట్ర హోమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

 రాష్ట్ర హోమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా నేటిదాత్రి: ఇల్లంతకుంట మండలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పార్లమెంట్ పరిధిలో నీ ఆర్మూర్ నుండి నందిపేట గ్రామానికి వెళ్తుండగా కొంతమంది తాగుబోతు తెరాస దుండగులు ఎంపీ పై హత్యయత్నం చేసిన దుండగులకు పోలీస్ వాళ్ళు సకరించటం పేక్షకపాత్ర పోషించటం సరికాదు, ఎంపీ బీజేపీ నాయకులపై దాడిచేయటాన్ని తీవ్రంగా కండిస్తూ తెలంగాణా రాష్ట్ర హోమంత్రి మహబూబ్అలీ దిష్టి బొమ్మ దహనం చెసిన ఇల్లంతకుంట మండల బీజేపీఅధ్యక్షులు బెంద్రం తిరుపతిరెడ్డి నాయకులు తీవ్రంగా కండిస్తూ వెంటనే దాడి చేసిన తెరాస దుండగులను వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు, ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగసముద్రల సంతోష్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లరం ప్రసన్న, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, మండల మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ పసిద్దీన్, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపిల్ల శ్రీకాంత్, సమ్ము, అమ్మన్ తదితరులు పాలుగోన్నారు

కేంద్రమే కేసిఆర్‌ గురి

 

కేంద్రంలో చక్రం తిప్పడమే లక్ష్యంగా రాజీకీయం…


మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా దిశగా అడుగులు
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రచారం దిశగా
డిల్లీ వేధికగా తెలంగాణ నూతన ఆవిష్కరణలు…
కేసిఆర్‌ కీలకంగా భవిష్యత్తు రాజకీయాలు…
ఆలోచన ఒక్కటే చాలదు. ఆచరణ కావాలి. అవి పుష్కలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌లో వున్నాయి. కల కంటే చాలదు. నెరవేరే ప్రయత్నం చేయాలి. అందుకు కృషి చేయాలి. పట్టుదల చూపించాలి. ఇవన్నీ మెండుగా కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు. పద్నాలుగేళ్ల అలుపు లేని పోరాటం చేశాడు. తెలంగాణ గొంతులన్నీ ఏకం చేశాడు. లక్ష్యం వైపు తనొక్కడేకాకుండా మూడు కోట్ల తెలంగాణ ప్రజలను వేలు పట్టి నడిపించాడు. రాజకీయ పార్టీలకు జై తెలంగాణ అనడమే అనివార్యం అనేదాకా తీసుకొచ్చాడు. తెలంగాణ ఇక ఇవ్వడం తప్ప ఏం చేయలేమని కేంద్రం ప్రకటించేలా ఉద్యమ రాజకీయ పోరాటం నడిపాడు. విజయం సాధించాడు. తెలంగాణ ఆవిష్కరణకు మూలమయ్యాడు. కీలకమయ్యాడు. తెలంగాణ కొత్త చరిత్రకు ఆద్యుడయ్యాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు తొలి, మలి ముఖ్యమంత్రిగా సంక్షేమరాజ్య ఆవిష్కరణకు బాటలు వేశాడు. ఇదీ ఒక లక్ష్య సాధకుడి పయనం. చేరుకున్న గమ్యం.
అలాగే ఇప్పుడు కేంద్రం వైపు అడుగులు…వెనకడుగు వేయని ఆత్మ విశ్వాసం కావాలి. అది కేసిఆర్‌లో కొండంత వుంది. వెనక్కి లాగేవారు చాలా మంది వుంటారు. జాగ్రత్తగా వుండాలి. ఇలాంటివి ఎన్నో తెలంగాణ ఉద్యమ కాలంలో చూసిన అనుభవం ఆయనకు సొంతం. వెన్నుపోటు పొడిచేవారు వుంటారు. వారి నుంచి అప్రమత్తంగా వుండాలి. ఇది బాగా తెలిసిన నేత కేసిఆర్‌. ఎందుకంటే తెలంగాణ జెండా ఎత్తిన తొలినాళ్లలో రాజకీయ అవసరాల కోసం, ఆయనతో కలిసి సాగి, పదవుల కోసం, పరపతి కోసం పాలకులాడిన వారు ఎంత మంది పంచన చేరారో కేసిఆర్‌కు బాగా తెలుసు. నమ్మి వారికి పదవులు అందిస్తే, టిక్కెట్లిచ్చి గెలిపిస్తే, ఉద్యమ నాయకుడు కేసిఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు ఎంత మంది చూశారో చరిత్రకు తెలుసు. ఆయన భి`పారం ఇస్తే టిఆర్‌ఎస్‌ టిక్కెట్టు మీద గెలిచి, నాటి అధికార పార్టీకి కాంగ్రెస్‌కు, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌కు కోవర్టులుగా మారిన వారు ఎవరో ప్రపంచానికి తెలుసు. టిఆర్‌ఎస్‌లోనే వుంటూనే కొంత మంది, పార్టీనుంచి దూరంగా జరిగి పదేపదే కేసిఆర్‌ను కించపర్చినవాళ్లున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్టు మీద గెలిచి తెలంగాణ రాదని ప్రకటించినవారున్నారు. కేసిఆర్‌ వల్ల అసలే రాదని స్వార్ధపూరిత రాజకీయాలు చేసి, రాజకీయ యవనిక మీద వారి పేర్లు వాళ్లంతట వాళ్లే చెరిపేసుకున్నవారు వున్నారు. ఇన్ని చూసి, అనుభవించి, ఎవరినీ నమ్మకుండా, ఒక్కడుగా ఒంటి చేత్తో పోరాటం చేసి, వచ్చేవారిని స్వాగతిస్తూ, వెళ్లేవారిని వదిలేస్తూ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసిఆర్‌.
ఆయనకు ఎవరు ఎలా వెన్నుపోటు పొడుస్తారో పూర్తిస్ధాయిలో అనుభవం వున్న నాయకుడు. అలాంటి నాయకుడు ఎంత అప్రమత్తతో వుంటాలో కేసిఆర్‌కు మరోకరు చెప్పాల్సిన పనిలేదు. గుర్తుచేయాల్సిన అవసరం అంత కన్నా లేదు. అందుకే కేసిఆర్‌కు వున్నంత ముందు చూపు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదనే చెప్పాలి. ఇక మనసంతా లక్ష్యం నింపుకోవాలి. అంటే కలైనా,నిజమైనా, తింటున్నా, పడుకున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, మౌనంగా వున్నా, ప్రతి క్షణం తలిచేదే లక్ష్యం. అలాంటి లక్ష్య సిద్ది కేసిఆర్‌కు మాత్రమే సొంతం. అది తెలంగాణ సాధనతోనే నిరూపితం. అందుకే ఆయన మనసంతా తెలంగాణనే కాదు, ఒళ్లంతా కళ్లు చేసుకొని మరీ తెలంగాణ సాధన కోసం శ్రమించారు. ప్రత్యర్ధులనుంచి వచ్చే ప్రతి బాణాన్ని ఎదుర్కొన్నారు. వాటికి సమాధానం చెప్పారు. తిరుగులేని శక్తి కేసిఆర్‌ అని కోట్లాది మందితో కొనియాడబడ్డారు…అదీ కేసిఆర్‌….
అదే కసి…అదే లక్ష్యం: ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనేది సినిమా డైలాగేమో! కాని దాని ఆచరణకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కేసిఆర్‌…అలాంటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు. పైగా రాజకీయ నిర్ణయాలలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఇప్పుడు కూడా అంతే…గతంలో ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌, తర్వాత చంద్రబాబు యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్‌డిఏ( నేషనల్‌ డెమెక్రటిక్‌ అలయెన్స్‌)లలో కీలక భూమిక పోషించారు. కాని వాళ్లు ప్రధాన మంత్రులు కాలేకపోయారు. కింగ్‌ మేకర్‌ల పాత్రకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు కేసిఆర్‌ ఒక అడుగు ముందుకేసి, కేంద్రంలో కీలకపాత్ర పోషించి, ప్రధాని కూడా కావొచ్చేమో! అన్న ప్రచారం కూడా వున్నదే… దక్షిణాదినుంచి తొలి ప్రధాని పివి. తర్వాత తెలుగు వారికి ఆ అవకాశాలు ఎవరికీ రాలేదు. ఒక దశలో చంద్రబాబు పేరు ప్రస్తావన వచ్చినట్లు ప్రచారం జరిగింది. కాని అందులో నిజమెంత అన్నదానిపై ఎవరూ స్పష్టతనివ్వలేదు. కాకపోతే కేంద్రలో కీలకభూమిక మాత్రం పోషించారు. ఇప్పుడు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పడమే కాదు, క్రియాశీల పాత్ర పోషించే అవకాశం మరోసారి దక్షిణాదికి వచ్చే వాతావరణం కనిపిస్తోంది.
అయితే ఈ మధ్యే ఎన్నో దశాబ్ధాల ఎదురుచూపుల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్‌కు ఆ ఆశలు లేవు. ఆయన ఇప్పుడే కేంద్రంలో కీలకం కావాలన్న ఆలోచన లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఆ ఆలోచనల్లో లేరు. కర్ణాటక నుంచి కూడా పెద్దగా కేంద్రంలో తనదైన శైలి రాజకీయాలు చేసే నాయకులు లేరు. కాని మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం వుంది. కుమార స్వామి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఒక వేళ భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల హవాతో కేంద్రంలో హంగ్‌ ప్రభుత్వాలే ఏర్పాటైతే కుమారస్వామికి కలిసివస్తే మాత్రం ఒకే ఇంట్లో ఇద్దరు ప్రధానులైన చరిత్ర , ఇందిరాగాంధీ కుటంబం తర్వాత చరిత్రకెక్కుతారు. కాని ఆ అవకాశం రాకపోవచ్చు. ఇక కేరళ సంగతి తెలిసిందే. సిపిఎం ఎప్పుడూ భాగస్వామ్యమే తప్ప, పాలనకు కేంద్రంలో సరిపోదు. ఇక మహా రాష్ట్ర నుంచి శరత్‌ పవార్‌ వున్నారు. ఎన్సీపీ నాయకుడు శరత్‌ పవార్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలిస్తే కేంద్రలో తిరుగులేని శక్తిగా ధర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటౌతుందని చెప్పడంలో సందేహంలేదు. కేసిఆర్‌ మదిలో నిర్మితమౌతున్న ధర్డ్‌ ఫ్రంట్‌లో అత్యంత సీనియర్‌గా శరద్‌ పవార్‌ వుంటారు. ఆయనకు కూడా ప్రధాని అయ్యే ఛాన్సులున్నాయి. ఇక బెంగాల్‌ దీదీ గురించి తెలిసిందే…ఇటీవలే తేజస్వీ యాదవ్‌ బృందం కేసిఆర్‌ను కలవడం అన్నది జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైపోయింది. కేసిఆర్‌ తన రాజకీయ చాణక్యానికి పదును పెడుతున్నాడని తెలిసిపోయింది.
ఇక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజేపి ప్రభావం తగ్గితే, ఇక వచ్చేందంతా ప్రాంతీయ పార్టీల హావానే అన్నది చెప్పకతప్పదు. అప్పుడు కేసిఆర్‌ మాత్రమే కీలకంగా మారక తప్పదు. అందుకే గత ఎన్నికల నుంచే బ్లూప్రింట్‌ రూపకల్పనతో కేంద్రం వైపు అడుగులు వేస్తూ, బాటలు ఏర్పాటు చేస్తున్న కేసిఆర్‌ ప్రచారం యూపిలో అత్యంత కీలకమౌతుందని అందరూ అనుకుంటున్నారు. ఏడేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు సాక్ష్యం ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన యూపిలో ఎస్పీకి మద్దతుగా కదిలితే, తెలంగాణ తరహాలో యూపి అభివృద్ధి ఎలా చేయాలన్నదానిపై ఎన్నికల ప్రచారంలో చెబితే ఇక ఎస్పీకి తిరుగుండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడచిన ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో వున్న బిజేపిని , గత ఎన్నికల్లో యూపిలో అత్యధిక మెజార్టీతో గెలిపించినా జరిగిన ప్రగతి ఎంతో కళ్లముందు కనిపిస్తున్నదే. ఇక మరోసారి బిజేపిని నమ్మినా జరిగేదేమిటో ప్రజలకు తెలుసు. ఇలాంటి సమయంలో కేసిఆర్‌ రంగలోకి దిగి, తెలంగాణలో జరిగిన ప్రగతి, అమలౌతున్న సంక్షేమ పథకాలను యూపికి పరిచయం చేస్తే ఇక ఎస్సీకి తిరుగుండదు. యూపిలో ఎస్పీ గెలిస్తే భవిష్యత్తులో కేంద్రంలో కేసిఆర్‌కు ఎదురుండదు. ధట్సాల్‌…

యుగానికొక్కడు

` జగాన్ని మెలుకొల్పే యుగకర్తలకు మార్గదర్శకుడు
` అనాధలను ఆదరించే ధీనజనబాంధవుడు
` కేసిఆర్‌ ఒక్క ఆలోచన కోట్ల మందికి భరోసా
` అనాధలంతా ప్రభుత్వ బిడ్డలు ఒక విప్లవం
` చరిత్రలో ఈ ఆలోచన ఒక నూతన అధ్యాయం…


` భవిష్యత్‌ తరాలకు సంచలన సందేశం
` అది కేసిఆర్‌కే సాధ్యం…ప్రపంచానికి ఆదర్శం.

` ఇకపై అనాధలన్నవారు తెలంగాణలో కనిపించరు.
` వారికి జీవించే హక్కును కల్పించి..వారి జీవితాల్లో వెలుగులు నింపదమే…
` ఆసరా సగటు జీవన ఆయుః ప్రమాణానికి సూచిక
` కళ్యాణలక్ష్మి ఒక ఆడపిల్ల ధైర్యానికి ప్రతీక
` ఇప్పుడు అనాధలకు చేయూత…వారి జీవితాలకు భరోసా…
హైదరాబాద్‌ , నేటిధాత్రి : రామాయణంలో రాముడు చేయలేదు( త్రేతాయుగం). మహాభారతంలో కృష్ణుడు( ద్వాపర యుగం) చేయలేదు. కలియుగంలో ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించలేదు. రాజరికంలో ఏ రాజు చేసినట్లు లేదు. ప్రపంచ దేశాలలో ఆచరించినట్లు ఎక్కడా కనిపించలేదు. మొదటిసారి ఒక్కడే..ఒక్కడు…కేసిఆర్‌ ఆలోచించాడు. అనాధలను అక్కున చేర్చుకునే యజ్ఞం మొదలుపెట్టాడు. రాష్ట్రంలో అనాధలందరూ ప్రభుత్వ బిడ్డలు కావాలని సంకల్పించాడు. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు….ఇక రాష్ట్రంలో తాను అనాధను అన్న మాట ఎవరి వెంట వినపడకుండా చేయనున్నాడు….
ఆకలి ఒక నరకం. అనాధ జీవితం ఒక శాపం. కాని యుగానికొక్కడుగా యుగపురుషుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో ఇక శాపగ్రస్ధులు అనే మాట ఇక వుండదేమో! అనాధ పిల్లలు అంటూ ఎవరూ చెప్పుకోవాల్సిన అవసరం రాదేమో! మాకు ఎవరూ లేరన్న భాధ వారిలో ఒక వుండదేమో… భవిష్యత్తులో అనాధ అన్న పదమే తెలంగాణలో వినిపించదేమో! పసి వయసులోనే అందరూ దూరం చేసుకొని చెత్త కుప్పల్లో బతుకులీడ్చేవారు వుండకపోవచ్చు. భూమ్మీదకొచ్చాక వారికి కూడా జీవించే హక్కు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవడం అన్నది ఒక వినూత్నం. విప్లవాత్మకం. ప్రపంచం అబ్బుర పడే నిర్ణయం. అనాధ అనే మనో వేధన బతికినంత కాలం వెంటాడే మానసిక శిక్ష ఇక భవిష్యత్తులతో తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తికి వుండదు. వారు కూడా బతికేందుకు, అందమైన జీవితం అనుభవించేందుకు కూడా మంచి రోజులు వస్తున్నాయంటే అది తెలంగాణ సంకల్పం. బలమైన నమ్మకం. ఆ నమ్మకం పేరు కేసిఆర్‌.
ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కారణజన్ముడు అని చాలా మంది ఎందుకంటారో …ఈ నిర్ణయాన్ని బట్టి చెప్పొచ్చు. చరిత్రలో సమాజం కోసం, ప్రజల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం జీవిత పర్యంతం ఉద్యమం సాగించిన అతి కొద్ది మంది యుగకర్తలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరికంటే ముందున్న వ్యక్తి అని చెప్పకతప్పదు. అవరైఏళ్ల తెలంగాణ ఆకాంక్షను తన జీవితం లక్ష్యం చేసుకొని, పద్నాలుగేళ్లపాటు పోరాటం సాగించి, తెలంగాణ సాధించి, కలలు గన్న తెలంగాణ ఆవిష్కరణే కాదు, ప్రపంచం ఆశ్చర్యపోయేలా…అబ్బురపడేలా…ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారు. ఇది ఏ నాయకుడికి సాధ్యం కాదు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సాధించి చూపిస్తున్నారు. ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కాలోజీ అన్నారు. ఒక్క మంచి ఆలోచన కొన్ని కోట్ల మంది జీవితాలకు వెలుగులు అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిరూపిస్తున్నారు. అవును ఇది చరిత్ర కాదలేని సత్యం. జీవిత సత్యం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ మదిలో చిగురించిన ఏ ఆలోచన వృధా కాలేదు. అది తెలంగాణ సాధన నుంచి మొదలు, నేటి కాళేశ్వర ప్రాజెక్టుదాకా…ఎండిన బీడ్లనుంచి, జలజల పారే నీటి సవ్వడుల దాకా… ఆడపిల్ల పెళ్లి కష్టం నుంచి, సంతోషంగా కళ్యాణ లక్ష్మి దాకా…వృద్దాప్యంలో ఏ కొడుకు, కోడలు ఆసరా లేకుండా ప్రభుత్వమే ఆసరాగా అందిస్తున్న పింఛన్లు వారి జీవితాలకు ఒక భరోసా నింపుతున్నాయి. వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాయి. ఆత్మగౌరవంతో బతికేందుకు ఉపయోగపడుతున్నాయి. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసునిండా ప్రశాంతంత వుంటే ఏ రోగం రాదు. చావు అంత తొందరగా దరిచేదరంటారు. ఇప్పుడు తెలంగాణలోని ఎంతో మంది వయసు మళ్లిన వారిని చూస్తే ఇదే కనిపిస్తుంది. ఇదే నిజమని ప్రపంచం గుర్తించింది. ఏతోడు లేని, నీడలేని పిల్లలుండీ ఆసరా లేని వారందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు తెలంగాణ ప్రజల సగటు జీవిత ఆయుః ప్రమాణం కూడా పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు అనాధలకు న్యాయం. వారి జీవితాలను కాపాడే బాధ్యతా ధర్మం ప్రభుత్వం తీసుకోవడం అన్నది ఆషామాషీ నిర్ణయంకాదు.
ఆకలి ఒక పాపమో! శాపమో!! కాని ఎవరికైనా అది నరకమే!!! ఏవరూ లేని వారికి అది నిత్య నరకం. పసిపిల్లల పాటిల శాపం. అది ఆకలని వారికి తెలియదు. కడుపులో మంట జీవితాన్ని దహిస్తుంటే ఏమిటో తెలియదు. ఆ క్షణం ఒక ముద్ద కావాలి. లేకుంటే జీవితం ఆరిపోవాలి. అలా ఆకలిని భరించలేక ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. సహజంగా పోషకాహారలోపమే పెద్ద శాపమైతే, అసలే ఆహారం అన్నది అందని జీవితాలను ఏమని చెప్పగలం. వారి బాధ వర్ణణాతీం. దానంత దురదృష్టం మరొకటి వుండకోవచ్చు. మహానగరాల్లో వారి జీవితాలు చూస్తుంటే అసలు మానవజన్మ అన్నది ఎంత నరకమో? వారికే ఎందుకంత వేధనో అని మన కళ్లునిండా నీళ్లు సుడులు తిరగక మానవు. కాని ఆ కన్నీటి చుక్కలే నోటి దాహానికి ఆసరా చుక్కలైతే ఇక వారి జీవితం ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కళ్లు తెరవకుండానే ఈ లోకం మీదకు వచ్చి, భూమ్మీద పడి, ఎక్కడున్నామో తెలియని వేధనే ప్రపంచమైపోయే పసి అనాధ హృదయాల జీవితం అరణ్యరోధన. అభం శుభం తెలియని వయసులోనే నా అనేవారు లేక, కన్నవారు కనిపించక, ఎవరికి పుట్టామో తెలియక, ఎవరూ దగ్గరకు రానీయకుండా, చెట్టుకింద జీవితాలు. ఎండకు ఎండి, వానకు నాని, మురిక కాలువల పక్కన, వీధి కుక్కల మధ్యన బతకడం అంటే ఇంతకన్నా శాపగ్రస్ధమేముంటుంది. అసలు తామెవరమో? కూడా తెలియని పసిహృదయాలకు అంత శిక్ష ఎందుకో? అన్న ప్రశ్న అందరిలో ఉత్పన్నమైనా, ఎంత మంది వారిని ఆదుకోగలరు. ఎంత కాలం ఆదుకోగలరు. దైవం చేసిన మోసంతో భూమ్మీదకొచ్చి, కళ్లు తెరవకుండానే కన్న వారిని దూరం చేసుకొని, ఎంగిలి విస్తర్లే ఆహారమై కడుపుకునింపుకొని కోట్ల మంది జీవిస్తున్నారు. అలా నీడలేని వారికి ఆశ్రయం ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదు. వారిని ఏకంగా ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడం అన్నది చరిత్రలో సువర్ణాధ్యాయం. ఏ తోడు లేని అనాధ పిల్లలను ప్రభుత్వమే దరి చేర్చుకోవడం, వారి జీవితాలివ్వడం, వారి భవిష్యత్తు తీర్చిదిద్దడం, భవిష్యత్తులో అలాంటి వారి జీవితాలకు తావులేకుండా చూడడం అన్నది ఒక దైవకార్యం. ఒక జీవన యజ్ఞం. చరిత్రలో ఇలాంటిది విన్నది లేదు. చూసింది లేదు. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ప్రకటించడం విశేషం. విప్లవాత్మకం. ఆదర్శం. అనాధ పిల్లలను అక్కున చేర్చుకోవడం కోసం వారందరినీ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయానికి నేటిధాత్రి దినపత్రిక ప్రత్యేక అభినందనలు. ఇలాంటి నిర్ణయాలు ఒక్క కేసిఆర్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపించారు. పేదల జీవితాలకు కేసిర్‌ అనే ఒక్క పదమే భరోసా అని మరోసారి రుజువు చేస్తున్నారు. యుగపురుషుడుగా చరిత్ర వున్నంత కాలం కేసిఆర్‌ నిలుస్తారు. ఇదే నిత్యం…కేసిఆర్‌ సంక్షేమం సత్యం…యుగయుగాలకు ఆదర్శం…

కేంద్రంపై పోరుకు దుబ్బాక నుంచే తొలి అడుగు

చేనేత పై జిఎస్టి రద్దు చేసే దాకా పల్లె పల్లెనా ధర్నాలు చేస్తాం కేంద్రం మెడలు వంచుతాం చేనేతలకు అండగా ఉంటాం : చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ రమణ

నేటి ధాత్రి,దుబ్బాక:
చేనేత వస్త్ర రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం జీఎస్టీ ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ డిమాండ్ చేశారు.జిఎస్టి పెంపునకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటానికి చేనేతలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగంపై 12 శాతం జీఎస్టీ విధింపును నిరసిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నిర్వహించిన చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొని మాట్లాడారు.స్వాతంత్ర పోరాటంలో చరఖాను ఆయుధంగా చేసుకుని మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్రం సాధించారని తెలిపారు.అంతటి ప్రాధాన్యం కలిగిన చేనేత వస్త్ర రంగంపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 5 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీని విధించడాన్ని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు.నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి చేనేత రంగానికి చెందిన 6 సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో
చేనేతల ఆత్మహత్యలు ఉండేవని నేడు సీఎం కేసీఆర్ కృషితో చేనేతలకు చేతినిండా పని కల్పిస్తున్న ఘనత కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.వస్త్ర రంగంపై జిఎస్టి పెంపును నిరసిస్తూ రాష్ట్ర మంత్రులు కేటీఆర్,హరీష్ రావు లు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.డిసెంబర్ 31లోగా జిఎస్టి ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జనవరి1 నుండి పల్లె పల్లెనా చేనేతలతో కలిసి కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించారు.త్వరలో నిర్వహించబోయే హ్యాండ్లూమ్ మార్చ్ కు దుబ్బాక నుండే తొలి అడుగు పడనుందన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, రాజమౌళి తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూర మల్లేశం,పద్మశాలి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీధర్,పద్మశాలి సంఘం సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కాముని రాజేశం,జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, నందాల శ్రీజ శ్రీకాంత్,లోంక రాజవ్వ లచ్చయ్య,దుబ్బాక పట్టణ పద్మశాలి,నీలకంఠ సంఘాల అధ్యక్షులు బింగి రవి,మర్గల సత్యానందం,మున్సిపల్ కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాస్,దుబ్బాక చేనేత కార్మికులు,టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo గురువారం దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఎండీ. అబ్బాస్ హాజరయి మాట్లాడుతూ దుబ్బాక ప్రాంతంలో చేనేత వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నదని దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్ట కొట్టే విధంగా జిఎస్టి నీ 12 శాతం పెంచడం ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన చేనేతపై 70 సంవత్సరాల కాలంలో ఎక్కడ వస్త్రాలపై సుంకo లేదని,ఈరోజు చేనేత పైన జిఎస్టి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చేనేత రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరియు రాష్ట్రంలో బిజెపి నిరుద్యోగ సమస్యపైన నిరాహార దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఏడు సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగులను తొలగించిన దుర్మార్గమైన చరిత్ర బిజెపి పార్టీదని విమర్శించారు. దేశంలోని రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

వెంటనే ఐకేపీ కొనుగోలు ద్వారా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి భవిష్యత్తులో కూడా రైతుల పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగం కేంద్ర ప్రభుత్వం పై సంవత్సరం కాలంపాటు పోరాటం చేసి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం జరిగిందని మరియు విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ధనవంతులకు అప్పగించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా,కార్మిక,రైతు వ్యతిరేక విధానాలను మానుకొని ప్రజల కోసం పని చేయాలని లేనియెడల రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అర్, శశిధర్,జి.భాస్కర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎస్. నవీన, రుద్రారం సిపిఎం పార్టీ ఎంపీటీసీ కే.మంజులత,సిపిఎం పార్టీ దుబ్బాక మండల నాయకులు దేవయ్య,మహేందర్ రెడ్డి,కొంపల్లి భాస్కర్, బత్తుల రాజు, శంకర్,స్వామి,దేవయ్య, యాదవరెడ్డి,మోహన్ రెడ్డి,మానస,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

నేడే బహుజన సమాజ్ పార్టీ చలో మానుకోట కార్యక్రమం

మహబూబాబాద్, నేటిధాత్రి: బహుజన రాజ్యాధికారాని కై హలో బహుజన చలో మానుకోట నేడు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ మహబూబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ , అసెంబ్లీ అధ్యక్షులు తప్పెట్ల, చాణక్య, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పాల్వాయి బుచ్చిరాములు పిలుపునిచ్చారు.మంగళవారం గ్రామ, గ్రామాలు తిరిగి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…బుధవారం 22న బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగ మహబూబాబాద్ యశోద గార్డెన్ లో బహుజన రాజ్యాధికార సంకల్పసభకు వస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు అధికసంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

భారతదేశంలో రాజ్యాధికారంలో బహుజనులకు తగిన భాగస్వామ్యం లేదు బహుజనులు మమేకమై బహుజన రాజ్యం కోసం కృషి చేయాలని డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకత్వం లో బహుజనులకు న్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు పాల్గొని కార్యక్రమన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రైతుల సంక్షేమమే బిజెపి ప్రభుత్వ ధ్యేయం :

రేగొండ నేటిధాత్రి :
రేగొండ, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రజాసంక్షేమం రైతుల సంక్షేమం పట్ల ఎప్పుడు నిబద్ధతతో ఉంటుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్నఅన్నారు.రేగొండ మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి అధ్యర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్బముగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపన్న మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం, నిజాంనిరంకుశత్వం పాలన సాగిస్తుందని, ధర్నాల పేరట కెసిఆర్ రైతులను మోసం చేస్తూ వ్యవసాయ రంగాన్ని కూని చేస్తూ రైతులను మాయమాటలతో మోసం చేస్తున్నాడు అనిఅన్నారు. రైతుల జీవితాలతో ఆడుకున్న ఏప్రభత్వంమనుగడసాగించలేదు అని అన్నారు .

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిశిధర్ రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలులో తెరాస ప్రభుత్వం మోసంచేస్తూఢిల్లీలోఒక్కమాట గల్లీలో ఒక్క మాటతో తెలగాంణ ప్రజల ను మోసం చేస్తూ , భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ తగలబెట్టడం సిగ్గు చేటు అని బీజేపీ కార్యకర్త మీద దాడి చేయండి అని చెప్పడం కెసిఆర్ దిగజారుడుకు నిదర్శనము అని వారుఅన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముడుపు అశోక్ రెడ్డి, సుంకరి మనో హర్, గాలిఫ్, బీజేపీ మండల ప్రధానకార్యదర్శి పెండల రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు కిరణ్,ఎస్టీ మార్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

పాలకుల విధానాలే అతి పెద్ద శాపం : తాటి వెంకటేశ్వర్లు

దేశంలో, రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న దివాలాకోరు విధానాలు అన్ని వర్గాల ప్రజలకు అతి పెద్ద శాపంగా మారాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బికెయంయు) రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అన్నారు.
ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా 2వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని తాటి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. దున్నేవాడికే భూమి కావాలని. వెట్టిచాకిరీ నిర్మూలించాలని తొలినాళ్ళనుండి ఉద్యమిస్తూనే ఉందని చెప్పారు . సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చిన అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ పథకం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంటుందని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదని, పేదలు మరింత పేదలు గా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సబ్సిడీలు పేదలకు అందడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత పెద్ద ఎత్తున ఉందని, ప్రభుత్వ వైద్యం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేదలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని అన్నారు, కరోనా కష్ట కాలంలో ఎన్నో పేద కుటుంబాలు తిండి గింజలు లేక అల్లాడిపోయాయని అని, వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రాణాలు వదిలేశారని, పేదలకు సరైన వైద్య సదుపాయాలు అందించాల్సిన ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరించిందని అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీల నిధులు డారి మల్లు తున్నాయని, వాటిని కాజేస్తున్నారని , దీంతో అసలైన లబ్ధిదారులకు మోసం జరుగుతుందని చెప్పారు.

గ్రామీణ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం కేవలం మిగిలిపోన్నాయని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన పాలకులు ఖరీదైన భవంతులు, ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడితే ఒరిగేది ఏముందన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ ఈ దేశ సంపద కొందరి చేతుల్లోనే నిక్షిప్తమై ఉందని, ఆ వర్గానికి అన్ని రకాల ఫలాలు అందుతున్నాయని అన్నారు. రేషన్ షాపుల్లో ఒకప్పుడు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇచ్చేవారని ఇప్పుడు బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదన్నారు వాటిని కూడా రేషన్ షాపు డీలర్లు దొడ్డిదారిన అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు అని మండిపడ్డారు నిత్యావసరాల ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిరుపేదలు కొనలేక తినలేక అంటున్నారని కానీ పాలకులు మాత్రం ప్రజాధనాన్ని లక్షల కోట్లు కాజేసి దోచుకుంటున్నారని ఆరోపించారు అన్ని రకాల వస్తువులతో పాటు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగి పోతున్నప్పటికీ పేదల ఆదాయం మాత్రం కొంచెం కూడా పెరగడం లేదని చెప్పారు.

గిరిజనులు పేదల సాగులో ఉన్న భూమి సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పేదల సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 29 30 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కేసరి లో తలపెట్టిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3 వ మహాసభలు జయప్రధానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వర్లు, ముత్యాల విశ్వనాథం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు తమ్మళ్ళ వెంకటేశ్వరరావు, భాస్కర్, వాసంశెట్టి పూర్ణచంద్ర రావు, పద్మ ,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ధాన్యానికి మద్దతు ధరకోసం రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

“కాంగ్రెస్ అధికారంలొకి వస్తే….ఖాయిలా పడ్డ పరిశ్రమలను పున ప్రారంభిస్తాం ..వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు పసుపు బోర్డు ఏర్పాటును అటకెక్కించిన అర్వింధ్  చెరుకు రైతులను రోడ్డుమీద పడేసిన ఘనత కవితదే ధాన్యానికి మద్దతు ధరకోసం రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం” – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా నేటిదాత్రి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో ఖాయిలా పడ్డా పరిశ్రమలను పున ప్రారంభిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో బుధవారం టిపిసిసి ప్రచార కమిటి చైర్మెన్,మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్మానాథ్మక పాత్ర పొశిస్థుంధన్నారు.

జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వపరంగా నడిపించి చెరుకు రైతులను అన్నివిధాల ఆధుకుంటానని చెప్పి ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ ఫ్యాక్టరీనే మూయించి రైతులకు తీరని అన్యాయం చేశారని కవిత పై తీవ్రంగా జీవన్ రెడ్డి మండిపడ్డారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు పంటను రైతులు అధికంగా పండిస్థారని నాకు ఓట్లు వేసి గెలిపిస్థే పసుపు బోర్డ్ తీసుకువచ్చి గిట్టుబాటు ధర కల్పిస్థానని రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి దాన్ని ఎంపీ అరవింద్ అటకెక్కించారని దుయ్యబట్టారు.
ఇరువురు నిజామాబాద్ ఎంపీలు రైతుల విషయంలో మోసం చేశారని చెభుతూ ఎంపీగా మధుయాష్కీ బడుగు,బలహీన,మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజక వర్గాన్ని అభివృద్ధి పర్చాడని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పసుపు,మిర్చి వాణిజ్య పంటలకు ప్రోత్సాహకాలు కల్పించక పోవడంతో రైతులు తీవ్రంగా నస్టపొయారని కెంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ప్రత్యామ్నాయoగా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెబుతూ వాటికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదనీ విమర్శిస్తునె జగిత్యాల ప్రాంతంలో చెరుకు పంట అనుకూలంగా ఉంటుందని దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుథ్వానికి సూచించారు.

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విపలమయ్యయని ఆరోపించారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పించడంకొసం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణా ఉద్యమంలో మధుయాష్కి కీలకంగా వ్యవహరించి సోనియాగాంధీకి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను వివరించి సానుకూలపరిచారని వివరించారు.

మధు యాష్కి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కేకు కట్ చేసి నాయకులకు తినిపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం,దేవేందర్ రెడ్డి, బండ శంకర్ , ధుర్గయ్య,మన్సుర్ ఆలీ, రామచంద్రా రెడ్డి, చిట్ల అంజన్న , జున్ను రాజేందర్, గుండా మధు, రఘువీర్ గౌడ్, తోట నరేశ్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఓటు బిజేపివైపు మళ్లిందా? ప్రచారం చేసిన నేతలు పైకి చెప్పదేంమిటి?

నా చేతికి కత్తి అందించండహోనేనేం చేస్తానో….చూడండహోనేనెంత ఎగిరెగిరి దుంకుతానో చూడండహోఅన్న రేవంత్‌ రెడ్డి ఏం చేశారు. కోవర్జులు వుండే వెళ్లిపోవచ్చుఅని పదే పదే చెప్పి రేవంత్‌ చేసిందేమిటి? మరో ఉత్తర కుమారుడికంటే గొప్పగా చేసిందేమిటి? నేను కొట్టినట్లు చేస్తా! నువ్వు ఏడ్చినట్లు చేయి!! నేను తిట్టినట్లు చేస్తాతుప్పిళ్లను తూద్చేయిఅనుకున్నా బాగుండేదేమో! అంతకన్నా అధ్వాన్నంగా కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు వ్యవహరించింది?ఈటెలకు మేలుఎవరికి లాభం;

పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ సొంత లాభం చూసుకోవచ్చునా! అని కాంగ్రెస్‌ నేతలే కడిగిపారేస్తున్నారు. ఆ పాటి పోటీ ఎందుకు? దానికి అంత ప్రచారం ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి అని కాంగ్రెస్‌ సీనియర్లు రగిలిపోతున్నారు. వచ్చీ రాగానే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ కు, పిసిసి అధ్యక్షుడు చేయాల్సిన పనేనా అని కారాలు మిదియాలు నూరుతున్నారు. అసలు గత ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న స్థితి ఏమిటి? గత ఎన్నికలలో ఈటెల రాజేందర్‌కు చక్కలు చూపించిన కాంగైస్‌ తనకు తానుగా చుక్కలు చూడాలనుకోవడం అంటే ఆత్మహత్య అదృశ్యం కాదా! అదే కౌషిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో వుంటే, బిజేపికి అంత సీనుండేదా! రేవంత్‌ రాకతోనే కౌషిక్‌ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది. అలా అపనమ్మకాన్ని కలిగేలా చేసింది ఎవరో పార్టీలో అందరికీ తెలిసిన ముచ్చటే కదా? అలా పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, పార్టీకి పుట్టగతులు లేకుండా చేయడం వెనుక వున్నదేమిటో అందరికీ తెలుసు. ఇలా పార్టీని ఫణంగా పెట్టడం ఎప్పుడూ జరగలేదు. ఈటెల రాజేందర్‌ బిజేపి నాయకుడు. ఉప ఎన్నికలో బిజేపి అభ్యర్థి. యుద్ధం అన్నాక పోరాడాలి. లేకుంటే ముందే తప్పుకోవాలి. కానీ యుద్ధం మధ్యలో చేతులెత్తేయడం రాజకీయ వైకల్యంవైఫల్యంతాను యుద్ధం చేయగలను అనుకున్నప్పుడు, కదనరంగంలోకి దిగినప్పుడు చావో,రేవో తేల్చుకోవాలి. అది మానిలోపాయి కారి ఒప్పందాలు సరైనవేనా! ఉమ్మడి శత్రువును బలంగా కొట్టాలనుకున్నప్పుడు కలిసి కొట్టాలి. కానీ దొంగ దెబ్బ తీసి శత్రవును గెలిచామనుకోవడం విజయం కాదు.

కొన్ని సార్లు పైకి కనిపించని రాజకీయం కౌకు దెబ్బలా పడుతుందంటారు. అది కోలుకోలేని రాజకీయాలకు మూలం కావొచ్చు. ఇంతకీ హుజూరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీ పోషించనున్న పాత్రేమిటి? పోషిస్తున్నదేమిటి? చేతులెత్తేసినంత పని ఎందుకు చేస్తోంది. ఎన్నికల బరిలో నిలిచినట్లేనిలిచి? జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ. నూటా నలభై సంవత్సరాల వయసున్న చరిత్ర కలిగిన పార్టీ. ఎన్ని సార్లు చీలికలు పీలికలైనా మళ్ళీ నిలబడిన పార్టీ. ఇంతటి దురవస్థను ఏనాడూ ఎదుర్శొని పార్టీసాక్ష్యాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలైన ఇందిరా గాంధీ ని సైతం పార్టీ నుంచి బహిష్కరించిన పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ అది. దేశంలో మళ్ళీ గ్గ పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్న పార్టీ. మరి తెలంగాణ లో ఉనికి కోసం ఆరాట పడుతున్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ఇచ్చి చెల్లాచెదురైన కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ర మళ్ళీ జవసత్వాలు వస్తాయని అందరూ అనుకుంటున్న పార్టీ. మరేమైంది. మొన్నటి దాకా కోవర్టు రాజకీయ ఆరోపణలు విపరీతంగా వున్నదేపార్టీ ప్రెసిడెంట్‌ మారితే తప్ప, పార్టీ తలరాత మారదన్న వాళ్తేఎట్టకేలకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కుర్చీ దిగిపోయాడు.. రేవంత్‌ రెడ్డి కుర్చీ ఎక్కాడు. కొంత జోష్‌ నింపాడు. గాంధీ భవన్‌ కు కళ తెచ్చాడు. దళిత గిరిజన దండోరా పేరుతో పార్టీ పటిష్టత కోసం పిసిసి కొత్త అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో రేవంత్‌ రెడ్ది ఏం చేశారన్నది (బ్రహ్మ రహస్యమేమీ కాదు. తన మార్కును, మార్పును చూపించాల్సిన సమయంలో ముందే చేతులెత్తేశాడు. ఆరు నెలల నుంచి రెండు పార్టీలు అలపెరగని ప్రచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసింది ఎందుకు? క్షేత్ర స్థాయిలో ఎంతో కొంత బలంగా వున్న కాంగ్రెస్‌ కు కోరి, కోరి కొత్త కష్టం ఎందుకు తెచ్చారు. గత ఎన్నికలలో 1683 ఓట్లు వచ్చిన బిజేపి బలడానికి కారణమై, నామినేషన్‌ ఆఖరు రోజు దాకా ఊగిసాలడడంలో ఆంతర్యం అర్ధం కానీదా? హుజూరాబాద్‌ నా వల్ల కాదని చేతులెత్తేయడానికేనా ఇంత హంగామా చేసింది. ఇప్పుడు ముప్పై లక్షల సభ్యత్వం సాధించాలని కోరితే జరిగేదేనాపని.

హుజూరాబాద్‌ విషయంలో కాంగ్రెస్‌ కప్పగంతులే: ఈటెల రాజేందర్‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన దగ్గర నుంచి టిఆర్‌ఎస్‌, బిజేపి కనిపించిన ఆతృత కాం(గ్రెస్‌ లో కనిపించలేదు. ఇప్పుడు కూడా లేదు. ఎందుకు? రాజకీయాలలో సహకారాలనేవి ఎన్నికల నాడు క్షేత్ర స్థాయిలో పనిచేస్తాయని అనుకోవడం భ్రమ. ఏ ఏ పార్టీ అయినా తమకు ఓటేయమని ప్రచారం చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్‌ ఏం ప్రచారం చేస్తోంది. కాం(గైస్‌ పార్టీతో ఆనుబంధం వున్న వాళ్లు ఏం (ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అవకాశం కాంగ్రెస్‌ వదులుకోవడం తప్పిదం కాదా? రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు. వ్యవస్థలుగానే కాదు, వ్యక్తులుగా కూడా కలిసిపోతారు. సమాజం కోసం (ప్రగతి కోసం అంటూ చెబుతారుతాజాగా టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ను దూషించినంతగా ఎవరినీ దూషించకపోయి వుండొచ్చు. ఇప్పుడు మేం మంచి మిత్రలం అనుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌ గూటికి చేరారు. మరి కాంగ్రెస్‌ పార్టీకి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అన్న దానిని ఎంతో ప్రతివ్రాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు విస్తరించింది. శత్రువు, శత్రువు మిత్రలే కాని, సమయమొస్తే రాజకీయాలలో మిత్రులు కూడా శత్రువులేఈ చిన్న లాజిక్‌ రేవంత్‌ రెడ్ది మర్చిపోయారా? ఎవరైనా ఆయనను మార్చారా? గత ఎన్నికలలో కాంగైస్‌ ఓటు బ్యాంకు అరవై వేలు. ఇది తెలంగాణ లోని అన్ని నియోజకవర్హాల కన్నా మెరుగైనది. ఆ బలమంతా కాంగ్రెస్‌ దే. నాడు బిజేపి బలం, దాని ముందు అతి తక్కువ.

ఈటెల రాజేందర్‌ బిజేపి గూటికి చేరడంతో టిఆర్‌ఎస్‌ బలం తగ్గుతుందే గాని, కాం([గైస్‌ బలం తగ్గదు. కౌశిక్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరినా, ఆయన వెంట వెళ్లింది తక్కువేఈటెల రాజేందర్‌ తో టిఆర్‌ఎస్‌ నుంచి బిజేపికి వెళ్లిన వాళ్లే ఎక్కువ. ఓటు మార్చిడి అన్నది ఆ రెండు పార్టీలు పంచుకున్నా అటు కేంద్ర, ఇటు రాష్ట్ర రాజకీయాలతో విసిగిన వారి సైలెంట్‌ ఓటు కాంగ్రెస్‌ దే కదా! ఇది కాంగ్రెస్‌ ఎందుకు మిస్సైంది. (ప్రెసిడెంట్‌ మారితే: గడచిన ఐదేళ్ళ కాలంగా ఎక్కుడ విన్నా ఇదే మాట. ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ మీద ప్రేమ వుంది. తెలంగాణ ఇచ్చిందన్న అభిమానం వుంది. అయినా పార్టీ గెలవకపోవడానికి కారణం నాటి పిసిసి. అధ్యక్షుడు అని అందరూ అనుకున్న మాటే. కానీ కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీలో నింపుతున్న జోష్‌ అందరికీ నచ్చింది. పార్టీకి పూర్వవైభవం వస్తున్న నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. ఇలాంటి తరుణంలో వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో రాజకీయ వ్యూహం పేరుతో వేసిన ఎత్తుగడ మాత్రం ఎన్నికల తర్వాత విమర్శలవాలౌతుందని చెప్పడంలో సందేహం లేదు.

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి : దీక్షలో కాంగ్రెస్ నాయకులు

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా తక్షణమే నోటిఫికేషన్ లు జారీ చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్ ,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు కృష్ణమూర్తి ,టీపీసీసీ కార్యదర్శి గణేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వెంటనే మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుతు నిరుద్యోగ సమస్య లు తీర్చాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య దీక్షా ద్వారా సీఎం కేసీఆర్ ని డిమాండ్ చేశారు.ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తరువాత నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. అలాగే యువజన కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షులు శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల సమయంలో నీళ్ళు, నిధులు మరియు నియామకాలు కల్పిస్తాం అని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా కెసిఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు కల్పించుకొని నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలకుర్తి మండల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు భార్గవ్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నియంత ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

పాలకుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసు హరీశ్ మాట్లాడుతూ కెసిఆర్ గారు బార్ షాపులు, వైన్ షాపులు కాదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే తెలంగాణ కావలి అని కోరారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమంటే గల్లికో వైన్ షాప్ తెరుస్తూ తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు అని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పోరాడి ప్రతేక రాష్ట్రం సాధించుకుంటే కేవలం కెసిఆర్ ఇంట్లోనే రాజకీయ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారని విమర్శించారు. అలాగే ప్రతిసారీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి ట్రస్టు ద్వారా కొచిగ్ ఇస్తున్నామన్నారు కానీ అలా కోచింగ్ ఇచ్చిన వారిలో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారో చెప్పాల్సిన బాధ్యత మీదే అని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గం లో ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిన అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమలో ఎంపీటీసీ మానస భాస్కర్, బిసి సెల్ అధ్యక్షులు ఐలేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్, చిలువీరు సంపత్, డైరెక్టర్ సోమమల్లయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హరీష్ గౌడ్,యకస్వామి, మహమూద్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పీడుగు రమేష్, సుధీర్, రవి, బనుక ప్రభాకర్, అశోక్, ప్రవీణ్, శ్రీకాంత్, నాగన్న, శంకర్, కళ్యాణ్ గౌడ్, రాజు అనిల్, హరిచందర్, సుధాకర్, వెంకట్ తిరుపతి, శేకర్, సంపత్ అఖిల్, బాబు,
నాగరాజు, రాజు,శ్రీను,రాజేష్,గణేష్ , మురళి కుస భాస్కర్, మహేందర్ తదితులున్నారు.

దళిత బందు పై అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

వీణవంక నేటిదాత్రి

వీణవంక మండలం లోని చల్లూరు గ్రామ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో బుడగ జంగాల కాలనీ వాసులతో నారదాసు లక్ష్మణరావు ముచ్చటించి వారి సమస్యలపై అడిగి తెలుసుకుని దళిత బందు పై ఉన్నటువంటి అపోహల పై వారితో ముచ్చటించి అవగాహనను కల్పించడం జరిగింది. దళిత బందు అనేది ప్రతి దళిత కుటుంబానికి చేరే విధంగా ప్రయత్నంలోనే తెలంగాణ గవర్నమెంట్ కెసిఆర్ ప్రత్యేక చొరవతో కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఏలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరికి దళిత బంధు అందుతుందని వారితో చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొదిల జ్యోతి రమేష్ ఎంపిటిసి సవితా మల్లయ్య మాజీ సర్పంచ్ జక్కు నారాయణ గౌడ్ పిఎసిఎస్ డైరెక్టర్ ముదిగంటి శ్యాంసుందర్ రెడ్డి మరియు. నెక్కొండ ఇన్చార్జులు సోమయ్య సారంగపాణి. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

మేయర్ సుధారాణికి సీఏం పలకరింపు

వరంగల్ అర్బన్, నేటిధాత్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన శుక్రవారం నిర్వహించారు. ఈ సంధర్భంగా వరంగల్ నూతన మేయర్ గుండు సుధారాణి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన మేయర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తేలిపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా , నగర అభివృద్ధి మరింత ముందుకు తీసుకేళ్ళే లా పని చేయాలని సూచించారు. తనకు శుభాకాంక్షలు తేలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తేలిపి ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధికి పాటుపడేలా పని చేస్తానని తేలిపారు. ఈ సంధర్భంగా ఆమేతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు.

నిరుద్యోగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేమేందర్ రెడ్డి

గెలిస్తే చేయాల్సిన పనులు బిజెపి చేతిలో ఓడితే చేస్తున్నారు*

*ఎమ్మెల్సీగా గెలిపించి ఒక్క అవకాశం బిజెపికి ఇవ్వండి*

శాయంపేట, నేటిధాత్రి: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కల్పించకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బిజెపి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయాన్ని భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడితే తమ ఉద్యోగాలు తమకు వస్తాయని అని యువతకు ఎన్నో ఆశలు కలిగించిన సీఎం కేసీఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ జిల్లాలో ఉన్న ఏకేక
కమలాపూర్ బెల్ట్ రొయన్ ఫ్యాక్టరీని టిఆర్ఎస్ ప్రభుత్వం కాపాడలేక పోయిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి కల్పించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, ప్రజాసేవ చేస్తామని ఎమ్మెల్సీగా గెలుపొందిన వారు విద్యావ్యవస్థను ప్రతిష్ఠాం చేయకుండా యూనివర్సిటీ మంజూరు చేసుకుని ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, 400 మంది స్టాప్
ఉన్న కాకతీయ యూనివర్సిటీలో నేడు 120 మంది మాత్రమే ఉన్నారంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏ రకంగా నిర్లక్ష్యానికి గురి చేశారు అనేది ఇది చూస్తే అర్థమవుతుందని అన్నారు. కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను కాపాడడానికి రాష్ట్రప్రభుత్వం ఏ ఒక్క చర్య చేపట్టకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ యువతకు అవకాశాలు ఉన్నా పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
విచారం వ్యక్తం చేశారు.

*గెలిస్తే చేయాల్సిన పనులు బిజెపి చేతిలో ఓడితే చేస్తున్నారు*

ప్రభుత్వం గెలిస్తే చేయాల్సిన పనులు బిజెపి పార్టీ చేతిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలైతే చేస్తుందని, టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు దుబ్బాక హైదరాబాద్ ఎన్నికలలో ఓడిస్తే గెలిచినప్పుడు చేయని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ చేతిలో ఓటమి బాలయ్యక మొదలు పెట్టిందని ఎద్దేవా చేశారు. వరంగల్ నగరాన్ని వరదల్లో మించిన పాపం టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులదేఅని నాలాలను ఎక్కడికక్కడ కబ్జా చేయడం, నాలలక అడ్డంగా భవనాలు నిర్మించడంతో వరంగల్ నగరం వరద ముప్పుకు గురైందని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా అవుటర్ రింగ్ రోడ్డు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రజాస్వామ్య విధంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని
నిర్ణయించుకున్నారని ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి పార్టీకి ఒక అవకాశాన్ని కల్పించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం

*మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు*

*కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం*

నేటిధాత్రి: భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని,
తన నాయకత్వాన్ని నమ్ముకున్న వారిని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ
ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు
అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మొగుళ్లపల్లి శాయంపేట మండలాలలో పలు వివాహ వేడుకలలో ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని కొండా దంపతుల
అభిమానుల ఆహ్వానం మేరకు వివాహా వేడుకలకు పాల్గొనడానికి వచ్చిన కొండా మురళీధర్ రావుకు కొండా దంపతుల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
బాణాసంచాలు కాల్ చి ఘనంగా స్వాగతం పలికారు. చిట్యాల మండలంలోని బావుసింగ్ పల్లిలో
వివాహ వేడుకల్లో పాల్గొని, శాయంపేట మండలంలోని మైలారం
గ్రామానికి చెందిన నూనె లక్ష్మీనరసయ్య దంపతుల కుమార్తె దివ్యదేవేందర్ వివాహ వేడుకలో పాల్గొన్నారు, వివాహ వేడుకతో ఏకమవుతున్న నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా
మురళీధర్ రావు మాట్లాడుతూ
భూపాలపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు.

కొండా అభిమానులు కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కొండా దంపతుల అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన 24 గంటలు తన ఇంటి గడప తలుపులు తెరుచుకునే ఉంటాయనీ అన్నారు. కష్టకాలంలో తమ వెంట నడిచిన అభిమానులకు అన్ని తానై వారికి తోడుగా ఉంటానని భరోసా కల్పించారు, కార్యకర్తలు అభిమానులు ఆధైర్య పడొద్ధని రానున్న రోజులు మనవేనని, కార్యకర్తలు అభిమానులు పార్టీ పటిష్టతకోసం
ఆహర్నిశలు కష్టపడి పని చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతల భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్,
కాంగ్రేస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చర్లపల్లి శ్రీదర్ గౌడ్, భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు పులి
శ్రీనివాస్ రెడ్డి, పోతుగల్లు
కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లేపల్లి తిరుపతి, నాయకులు బండి రఘుపతి,బోల్లేపల్లి అజయ్, పెద్దిరెడ్డి సమ్మిరెడ్డి, వావిలాల గణేష్, రవి పాల్, బహుజన సంక్షేమ సంఘం అధ్యక్షులు మారేపల్లి క్రాంతి కుమార్ నాయకులు పాల్గొన్నారు.

బంధు సక్సెస్

@ కాంగ్రెస్ నాయకుల అరెస్టు
@ తెలంగాణ వచ్చింది రైతుల కోసమే : పెద్ది
@ బందులో పాల్గొన్న సిపిఎం ఎమ్మార్పీఎస్ రైతు అనుబంధ సంఘాలు టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు


#నెక్కొండ, నేటిదాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపడుతున్న భారత్ బంద్ లో భాగంగా నెక్కొండ మండలం లోని రైతులకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ టిఆర్ఎస్ సిపిఐ ఎమ్మార్పీఎస్ నాయకులు మండలంలోని బందును సంపూర్ణంగా పాటించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి పాల్గొని నెక్కొండ నర్సంపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతుల పాలిట యమకింకరులు వ్యవహరిస్తుందని దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడవలసిందిగా పై రైతుల పై లాఠీఛార్జ్ చేయడం ఎంతో బాధాకరమైన విషయమని ఇక ముందు రైతుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్న తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీజేపీ ప్రభుత్వానికి చురకలంటించారు.
ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
@ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెక్కొండ మండల కేంద్రంలో చేపట్టిన బంద్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది రైతుల సమస్య రాజకీయాలను పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చింది రైతు బతుకుల కోసమేనని రైతులను కాపాడుకోవాలని రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీ దేనికైనా వెనకాల ఓ దని ఇది ఆరంభం మాత్రమేనని రైతు ఉద్యమం మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని మద్దతు ధర అనే స్టీరింగ్ను కేంద్రం చేతుల్లో తీసుకుని రాష్ట్రాలకు అధికారం ఇవ్వకుండా దేశ రైతులను ఆగం చేస్తున్నారని గత 11 రోజులుగా పది డిగ్రీల చలిలో రైతులను వృద్ధులను చేస్తున్న దీక్ష లక్ష్యాన్ని నెరవేరాలని ఈరోజు రైతులందరూ బందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని రాష్ట్రాల స్థితిగతులపై అధ్యయనం చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఖండించిన తెలంగాణ రైతులకు సన్నబియ్యం ఎక్కువ దిగుబడి వస్తే దాన్ని కొనడానికి కేంద్రం ముందుకు రాకుండా లేవి పేరుతో జాప్యం చేస్తోందని కరువు కాలంలో తెలంగాణ రైతాంగం తరికి సన్న బియ్యం పెట్టి కేంద్రం దిగి రాకుంటే ఇక్కడి నుండి ఢిల్లీ వరకు లక్ష మంది రైతులతో రాజధాని లో నిరసన చేపడతామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంఘాని సూరయ్య నెక్కొండ ఎంపీపీ రమేష్ నాయక్ జెడ్పిటిసి సరోజ హరికిషన్ చైర్మన్ లు మారం రాము దామోదర్ రెడ్డి ఆర్ ఎస్ ఎస్ కన్వీనర్లు కార్యకర్తలు ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు యాకయ్య, సిపిఐ నాయకులు వెంకన్న, అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి*

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర బొజ్జం రమేష్*

*మొక్కజొన్న పంటకు అనుమతులు కల్పించాలి రైతులు*

*ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రశ్నిస్తున్న రైతులు*

శాయంపేటపేట, నేటిధాత్రి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రగతి సింగారం మైలారం జోగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్, డిసిఓ రాచర్ల పరమేశ్వర్ ముఖ్యఅతిథులుగా హాజరై కొనుగోలు కేంద్రాలను
బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రైతులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక విపక్ష పార్టీల వద్ద ఎలాంటి అంశాలు లేకపోవడంతో మద్దతు ధర కల్పించాలని రాద్ధాంతం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర పెంచి అందజేస్తామని అంటే కొన్ని సమస్యలు ఉన్నాయని, మద్దతు ధరకు తోడు సపోర్టింగ్ ప్రైస్
అందజేయాలని ఆలోచన చేస్తున్నామని కొడకండ్లలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగిందని గుర్తు చేస్తూ, రైతులకు అండగా
నిలుస్తామని 100 నుండి 150 రూపాయల సపోర్టింగ్ ప్రైస్ అందజేయడానికి రాష్ట్రప్రభుత్వం
సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని అన్నారు.

*ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర చైర్మన్ బొజ్జం రమేష్*

రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ గ్రామాలలో కొనుగోలు చేపడుతుందని శాయంపేట మండలంలో రైతుల సౌకర్యార్థం 12 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్ అన్నారు. అతివృష్టి కారణంగా పంట నష్టం వాటిల్లి దిగుబడి చాలా తగ్గిపోయిందని రైతులకు జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, రైతులు పాడి క్లీనర్ల ను వినియోగించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వడ్లను తీసుకు వస్తే ఇలాంటి తరుగు తియ్యకుండానే కొనుగోలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. పాడి క్లీనర్ల ను వినియోగిస్తే ఏడు వందల గ్రాముల వరకే తరుగు పోతుందని రైతులు కష్టం అనుకోకుండా ప్యాడి క్లీనర్ లను వినియోగించి గ్రాము ఎక్కువ ఇవ్వకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధరను పొందాలని అన్నారు.

*మొక్కజొన్న పంటకు అనుమతులు కల్పించాలి రైతులు*

ప్రభుత్వ సూచనలతో వేసిన పత్తి సన్నరకం వరి ధాన్యం పంటలు అధిక వర్షాలతో దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటలు వేసుకోవడానికి అనుమతులు కల్పించాలని మైలారం గ్రామానికి చెందిన రైతు దూదిపాల బుచ్చిరెడ్డి జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్ అధికారుల దృష్టికి సభాముఖంగా తీసుకు వచ్చారు. ప్రత్యామ్నాయంగా వేరుశనగ పంట వేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్ సూచించగా ఇక్కడ భూమి అందుకు అనుగుణంగా లేదని మాకు ప్రత్యామ్నాయ పంటలు చూపించాలని లేదా
మొక్కజొన్న సాగుకు అనుమతి ఇవ్వాలని మైలారం గ్రామంలోని పలువురు రైతులు కోరారు.

*ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రశ్నిస్తున్న రైతులు*

నియంత్రిత పంట సాగు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగా క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు నాయకులు వ్యవసాయ అధికారులు
రైతులతో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పిస్తూ పంటలు వేసే విధంగా చర్యలు చేపట్టారు. అధిక వర్షాలతో పంట నష్టం వాటిల్లి పెట్టుబడి గణనీయంగా పెరగడం దొడ్డు రకం వరి ధాన్యానికి బదులు రైతులు వేసిన సన్నరకం వడ్ల దిగుబడి గణనీయంగా తగ్గడం మద్దతు ధర కూడా ఆకర్షణీయంగా లేకపోవడం ప్రజాప్రతినిధులను నాయకులను రైతులు అడుగడుగున ప్రశ్నిస్తున్నారు, కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన నాయకులను ప్రగతి సింగారం గ్రామంలో రైతులకు మద్దతు ధర పంట నష్ట పరిహారం పై ప్రశ్నించగా, మైలారం గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలు చూపాలని లేదా మొక్కలకు అనుమతి ఇవ్వాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రైతులు కోరడం ప్రజాప్రతినిధులకు నాయకులకు శిరో భారంగా మారింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version