గణప సముద్రం చెరువు నుండి నీరు విడుదల
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లో యాసంగి పంటకు ఘనప సముద్రం చెరువు నుంచి నీటిని ఐబి అధికారులతో కలిసి భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం గనప సముద్రం నుండి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా యాసంగి పంట సాగు చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అని చర్యలు తీసుకుంటుందన్నారు చెరువును రిజర్వాయర్ చేసి రైతులకు తాగు నీరు సాగునీరు అందించుతామన్నారు జిల్లాలో 1.26.000 ఎకరాల్లో రైతులు వారి పంటలు సాగుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ శాఖ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ గణపురం మండల వైస్ చైర్మన్ వీడిదినేని అశోక్ అధికారులు ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి ఎంపీడీవో ఎల్ భాస్కర్ ఐబి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
