బిజెపి పార్టీ నుండి గెలిచిన సర్పంచ్ లకు సన్మానం
బిజెపి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను ఘన విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరై
అభ్యర్థులను సన్మానం చేయడం జరిగింది
అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ
ప్రజలు బీజేపీపై పెట్టిన నమ్మకమే ఈ విజయానికి నిదర్శనమని, ఇది పార్టీ కార్యకర్తల కష్టానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే కీలక పాత్ర పోషిస్తారని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి, పారదర్శకంగా అమలు చేయడంలో మీరు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆరంభమే తప్ప అంతిమం కాదని, గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యమని అన్నారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కీర్తి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగదీశ్వర్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు తాడికొండ రవి కిరణ్ వివిధ మోర్చ అధ్యక్షులు జిల్లా నాయకులు వివిధ మండలాధ్యక్షుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
