వైకాపా నేతల దాడిలో మృతి చెందిన
రామక్రిష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన
మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పలువురు
ఎమ్మెల్యే లు
పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి 27:
పుంగనూరు నియోజకవర్గంలోని చండ్రమాకుల పల్లి పంచాయతీ క్రిష్ణపురం గ్రామంలో
ఇటీవల వైకాపా నేతల దాడిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు చిత్తూరు ఇన్ చార్జీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి,గురజాల జగన్మోహన్, మురళీమోహన్ లు నివాళులర్పించారు.ఆ మేరకు కృష్ణాపురం గ్రామంలో గురువారం జరిగిన దినకర్మ కార్యక్రమానికి వారు హాజరై రామకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అదేవిధంగా ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ ఆర్థిక సాయం అందజేశారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇన్ చార్జీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు.ఈ సంతాప కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సి. ఆర్. రాజన్, పుంగనూరు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు, యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబులతో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు..