ఆ స్టార్ హీరోపై నిధి అగర్వాల్ పొగడ్తల వర్షం..

ఆ స్టార్ హీరోపై నిధి అగర్వాల్ పొగడ్తల వర్షం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో.. బాబి డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుండగా.. ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాసుంది. ఈ సందర్భంగా గురువారం నిధి అగర్వాల్ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ వంటి తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరోతో కలిసిన నటించడం గొప్ప అదృష్టం. ఆయనతో ఒక్క సినిమా చేసినా అది వంద సినిమాలతో సమానం. ఈ సినిమాలో నా పాత్ర పేరు పంచమి. తను చాలా శక్తివంతురాలు. ఎలాంటి సవాలునైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండే ధైర్యశాలి. నా పాత్ర భిన్న కోణాలతో ఆసక్తికరంగా సాగుతుంది. మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథను రాశారు. ఇందులో పవన్కల్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ సన్నివేశం ఉంటుంది. అందులో అభినయించడం ఛాలెంజింగ్గా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు..

*తిరుపతిలో ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు..

 

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

గురువారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో రుయా హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు విచ్చేసి.మెగా అభిమానులతో కలిసి పేదలకు భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తండ్రికి, బాబాయికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అని కొనియాడారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో.. నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, పగడాల మురళి, కిషోర్, సాయి, సుమన్ బాబు, రాజమోహన్, హేమకుమార్, రాజేష్ ఆచారి, సాయిదేవ్, రమేష్, సుధా, హేమంత్, వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రావణ్, ముఖేష్, మరియు మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version