రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పంటించిన.!

రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలి

 

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల కేంద్రంగా మంగళవారం రోజున దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలోని కేటి దొడ్డి మండలం ఇర్కుచెడు గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు బహుజనులు కలసి స్టాండ్ నిర్మాణం చేసి విగ్రహం ఏర్పాటు ప్రయత్నంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెట్టొదని దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు.

ఘర్షణలో భాగంగా కొంతమంది దుండగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు, అట్టి మంటలు ఆర్పే క్రమంలో విగ్రహంతో పాటు ఎస్ఐకి కూడా నిప్పు అంటుకుంది.

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్న భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం దురదృష్టకరమని దళిత ప్రజా సంఘాలు మండిపడ్డాయి ఇలాంటి సంఘటనలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఏప్రిల్ మాసం మొత్తం మహనీయుల మాసంగా దేశం రాష్ట్రం మహనీయుల జయంతులు చేస్తున్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన జీవోలు తెచ్చి రక్షణ కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కొమ్మట బాబు, మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం, ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, డొక్కా రామస్వామి, కాకి బాలరాజ్, బ్యాగరి రాజు, గుడ్ల బాబు, కొమ్మాట ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

 

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి సి గ్రామంలో ఏర్పాటుచేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంగళవారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొ హాజరై, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగ నిర్మూలించామని అన్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ, చిలుకల రాయకుమురు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు దబ్బట అనిల్ బుర్ర శ్రీనివాసు, చిలుముల రాజమౌళి ,అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబనీకి ఆర్థిక సాయం.

— బాధిత కుటుంబనీకి ఆర్థిక సాయం

నిజాంపేట: నేటి ధాత్రి

 

మండలం లోని రాంపూర్ గ్రామానికి చెందిన అతిగం స్వామి గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠ తిరుపతి రెడ్డి బాధిత కుటుంబ నీకి 5,000 వేల రూపాయలు తన అనుచరులతో అందజేశారు. ఈ కార్యక్రమం లో మండల మాజీ కో అప్షన్ మెంబర్ మహమ్మద్ గౌస్, సీనియర్ నాయకులు దుబ్బరాజా గౌడ్, గ్రామ నాయకులు అంజా గౌడ్, రాజు, పర్శ గౌడ్, ఫిరోజ్ లు ఉన్నారు.

ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి..

ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి..

బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి

ఎల్ఐసి డి.ఓ వెంకటయ్యకు ఘనంగా వీడ్కోలు.

డి.ఓ వెంకటయ్య టీమ్ ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం..

నర్సంపేట,నేటిధాత్రి:

 

విధి నిర్వహణలో ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి అని నర్సంపేట బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి అన్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ లో బానోతు శాంత వెంకటయ్య డెవలప్ మెంట్ ఆఫీసర్ గత 34 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం డి.ఓ వెంకటయ్య పదవీవిరమణ పొందారు.ఈ సందర్భంగా నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో పదవీవిరమణ కార్యక్రమాన్ని చేపట్టారు.నర్సంపేట బ్రాంచ్ తో వరంగల్ డివిజన్ పరిధిలోని పలువురు అధికారులు, డి.ఓలు హాజరయ్యారు.బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసి వికాస అధికారి నిరంతరం పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు.గత 34 సంవత్సరాలుగా నర్సంపేట బ్రాంచ్ కు ఒక ఫిల్లర్ గా సేవలు అందించారని వెంకటయ్య పట్ల కొనియాడారు.అనంతరం శాలువాలతో సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు.అలాగే వరంగల్ జిల్లా ఎల్ఐసి ఉద్యోగుల ఎస్సి ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.

DO Venkataiah’s

 

డి.ఓ వెంకటయ్య టీమ్ ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం..

DO Venkataiah’s

 

ఎల్ఐసి నర్సంపేట బ్రాంచ్ లో గత 34 సంవత్సరాలుగా వికాస అధికారిగా విధులు నిర్వర్తించిన బానోతు శాంతవెంకటయ్య సోమవారం పదవీవిరమణ నేపథ్యంలో బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటయ్య టీమ్ ఏజెంట్లు గజమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు,బహుమతులు అందజేశారు.ఏజెంట్లు పడిదం కట్టస్వామి,రాక రాజలింగంలు మాట్లాడుతూ జీవితభీమా పాలసీల అమ్మకంలో ఏజెంట్లకు వెంకటయ్య ఇచ్చే ప్లానింగ్స్ పట్ల కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెండ్లి రవి,శంకరయ్య,మర్థ గణేష్ గౌడ్,కందుల శ్రీనివాస్ గౌడ్,రఘుపతి,అనంతగిరి స్వామి,దాసరి కుమారస్వామి,రాజేందర్, పోశాల శ్రీనివాస్,చందు తదితరులు పాల్గొన్నారు.

ఎల్ఐసి యూనియన్స్ ఆధ్వర్యంలో…

DO Venkataiah’s

 

ఎల్ఐసి ఏ.ఓ.ఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య,వరంగల్ డివిజన్ కోశాధికారి మొద్దు రమేష్,నర్సంపేట బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు ఆర్.చంద్రమౌళి,బ్రాంచ్ అధ్యక్షుడు పెండ్లి రవి,ప్రధాన కార్యదర్శి పడిదం కట్టస్వామి అలాగే ఎల్ఐసి ఎల్.ఐ.ఏ.ఎఫ్.ఐ డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్, బ్రాంచ్ అధ్యక్షుడు వల్లాల శ్రీహరి,వైస్ ప్రెసిడెంట్ రాక రాజలింగం ఆధ్వర్యంలో పదవీవిరమణ పొందిన వికాస అధికారి బానోతు వెంకటయ్యకు శాలువాలతో ఘనంగా సన్మనించారు.ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ యూనియన్ వరంగల్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ,బ్రాంచ్ ఏఓ లచ్మ,ఏ.ఏ.ఓ శ్యాంసింగ్,హెచ్ జి.ఏ నిఖిల్,సుబ్బారావు,వికాస అధికారులు సురేందర్ రావు,శ్రీనివాస్,రాజు,ఐశ్వర్య,వినయ్ కుమార్,వినోద్ కుమార్,రమేష్,పలువురు అధికారులు,కార్యాలయ సిబ్బంది యునియన్ నాయకులు,ఏజెంట్లు పాల్గొన్నారు.

మీరాకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అబ్రహం మాదిగ.

మీరాకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అబ్రహం మాదిగ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ మీరాకుమార్ ని ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అబ్రహం మాదిగ. భారతీయ సామాజిక దార్శనికుడు, సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు డా. బాబూ జగ్జీవన్ రామ్ కూతురుగా ఆయన రాజకీయ వారసురాలిగా ఎన్నో పదవులను అధిరోహించారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా, భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ గా భారతదేశానికి ఎనలేని సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలిపిన ధీరవనితగా అభివర్ణించారు. రావి ఆకుపై వేసిన మీరాకుమార్ చిత్రాన్ని ఆమెకు బహుకరించారు. ప్రముఖ కవి రచయిత డప్పోల్ల రమేష్ రచించిన డా. బాబూ జగ్జీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్ర ఆంగ్లానువాదం డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్, విషనరీ ఆఫ్ ఇండియా సొసైటీ “ పుస్తకాన్ని అందజేసి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మీరాకుమార్ ను కలిసిన వారిలో ఆయనతో పాటు ఉల్లాస్ మాదిగ ఉన్నారు.

వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.

వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం రేజింతల్ లోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామి వారికి పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు.

లైన్స్ క్లబ్ మూడోసారి చైర్మన్గా దేమె యాదగిరి.

లైన్స్ క్లబ్ మూడోసారి చైర్మన్గా దేమె యాదగిరి…

రామాయంపేట ఏప్రిల్ 1 నేటి ధాత్రి (మెదక్)

 

 

లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట 2025-2026 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా మూడవసారి దేమే యాదగిరి, సెక్రటరీగా తిరుపతి, ట్రెజరర్ గా జిపి స్వామి లను పివిపి చారి మాజీ గవర్నర్ సమక్షంలో స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Ramayampet

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ సేవలను విస్తృత పరిచి గ్రామాలలో చక్కటి కార్యక్రమాలు చేపడతామని మొక్కల పంపకం,నీటి సంరక్షణ, అవయవదానం,ఉచిత కంటి మరియు దంత వైద్య ఆరోగ్య శిబిరాలు విరివిగా నిర్వహిస్తామని స్కూల్ లలో విద్యార్థులకు వ్యాస రచన,కెపాసిటీ బిల్డింగ్ గురించి సమావేశాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. తమను ఎన్నుకున్నందుకు రీజియనల్ చైర్మన సంజయ్ గుప్తా, జోన్ చైర్ పర్సన్ సుఖేందర్, ఏరియా కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి,డిసీలు లక్ష్మణ్ యాదవ్, కైలాసం, దారం రమేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రమైన తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో ప్రసిద్ది చెందిన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర జాతర. మహోత్సవం ఏప్రిల్ 17వ తేదీ గురువారం నుండి 22వ తేదీ మంగళవారం వరకు నిర్వహించునున్న శుభ సందర్భంగా సోమవారం నాడు ఏర్పాటుచేసిన అనే చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప. అధ్యక్షతన ధర్మకర్త మండలి సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కార్య నిర్వాణ అధికారి వారు మాట్లాడుతూ ఆలయంలో చలువ పందిళువిద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని భోజనాలు ఏర్పాటుకై జాతర మహోత్సవం గురించి గ్రామ గ్రామాన తెలియపరచాలని జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తదితర అంశాలపై వాటి నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆలయ చైర్మన్ కార్యనిర్మాణ అధికారి శివ రుద్రప్ప ఆధ్వర్యంలో ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రిక గోడ పత్రికను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో. ఆలయ చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) కార్యనిర్వాన అధికారి శివ రుద్రప్ప. మాజీ చైర్మన్ నట్కరి మావయ్య. గ్రామ పెద్దలు యువకులు ఆలయ సిబ్బందులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

పంతుళ్ల ప్రాపకం..నాయకుల జాతకం!

-నేతలు..జాతకాలు..ఉగాది సంబరాలు.

-ఒక్కో పంతులు ఒక్కో జోస్యం.

-పంచాంగ లెక్కలందరూ ఒకటే చెబుతారు.

-అది ప్రామాణికమని అందరూ నమ్ముతారు.

-జాతకాల విషయంలో ఎవరికి తోచింది వారు చెబుతారు.

-నాయకుల చేత జేజేలు కొట్టించుకుంటారు.

-ఉగాది సాక్షిగా పండగ రోజే ఇన్ని అబద్దాలా!

-తొలి రోజే లెక్కలేనన్ని అసత్యాలా!

-జోస్యం ఎవరికైనా ఒకటే వుండాలి.

-పార్టీల పరిస్థితి నిజాయితీగా చెప్పగలగాలి.

-నిజం చెబితే సంభావన కష్టం. నిజం నిష్టూరం.

-కష్టాల గురించి చెబితే వచ్చే ఉగాదికి పిలువరు.

-ఎవరి కష్టాలు వారివి…పంతుళ్ల తిప్పలు పంతుళ్లవి.

-తెలంగాణలో సిఎం రేవంత్‌ రెడ్డి కి తిరుగులేదంటారు.

-వచ్చే సారి కూడా రేవంత్‌ రెడ్డే సిఎం అని ఓ పంతులు చెప్పాడు.

-మూడు నెలల్లో కేసిఆర్‌ సిఎం అవుతారని మరో పంతులంటారు.

-తెలంగాణ వచ్చే ఎన్నికలలో బిజేపి గెలుస్తుందని మరో పంతులు చెబుతాడు.

-చంద్రబాబు ఆరు సార్లు సిఎం అవుతారని అక్కడంటారు.

-వచ్చేది జగనే మరో పంతులు సెలవిస్తాడు.

-పవన్‌ కళ్యాణ్‌ ఇంకా పదిహేనేళ్లు చంద్రబాబు వుండాలంటాడు.

-పంతులేమో పవన్‌ కళ్యాణ్‌ సిఎం అవుతారని అంటారు.

-ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం వుంది.

-ఈ ముచ్చట్లు ఇప్పుడెందుకు చెబుతారో అర్థం కాదు.

-గతంలో కాలాల గురించి మాత్రమే చెప్పే వారు.

-గ్రహ గతుల వల్ల ప్రాంతాలకు ఎదురయ్యే సమస్యలు ప్రస్తావించే వారు.

-ప్రతి సారి వర్షాలు విపరీతంగా కురుస్తాయంటారు.

-కరువొచ్చిన కాలంలో కూడా ఇలా చెప్పే ఊరడిరచారు.

-విని సంతోషించాలనే పంచాంగ శ్రవణం అంటారేమో!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మారేదే అయితే జాతకమెలా అవుతుంది. కలిసొచ్చేదే అదృష్టమైతే ఎందుకు దాగి వుంటుంది. లాక్కొచ్చి పరిహారం చెల్లిస్తేగాని పని చేయనిది భవిష్యత్తు ఎలా అవుతుంది. బతుకు జీవుడా అని ఏళ్లకేళ్లు బాదించి, ఆఖరుకు కలిసొస్తే అది కలిసొచ్చే కాలమెలా అవుతుంది. బతకలేని బతుకులు బతుకంతా ఏడిపించి, కన్నీళ్లను కూడా మిగల్చకుండా చేస్తుంటే అది బతుకెలా అవుతుంది. భగవంతుని కరుణెలా అవుతుంది. నమ్మకం మన బలం. ఆ నమ్మకమే కొంపలు ముంచడం..చదువుకున్న వాళ్ల మూడత్వం..ఈ జన్మకే దిక్కులేని సంబరం..ఏడేడే జన్మలు తెచ్చేదంతా ఆనందం. అంటే ఎవరైనా సంతోషిస్తారా? వచ్చే జన్మ కోసం ఈ జన్మంతా కష్టపడతారా? దేవుణ్ణి తిట్టుకోకుండా వుంటారా? ఈ జన్మకు మోసిన కష్టాలు..మళ్లీ జన్మొద్దు. ఈపుట్టకే వద్దనే కదా? కైలాసం కోరుకుంటారు..అలాంటి వారిలో ఆశలు నింపడం కోసమే జ్యోతిష్యులుంటారు. వారి ప్రాపకం గడుపుకుంటారు. ఆశలో జీవి జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణ పాండిత్యం వున్న పండిత సిద్దాంతులు పడే యాతన అంత ఇంతా కాదు. ఏ పార్టీ పంచాంగ శ్రవణానికి వెళ్తే ఆ పార్టీ గొప్పదని చెప్పకుండా వుండలేరు. ఒక్కసారి విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితాలు చెప్పిన సిద్దాంతులు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ఒకటే. పాలన ఒకటే. కాని రాజకీయాల మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాలుగా చెప్పారు. అందరూ అన్ని పార్టీల జాతకాలు అద్భుతమనే అన్నారు. మరి అన్ని పార్టీల జాతకాలు అధ్భుతమే అయినప్పుడు అన్ని పార్టీలు గెలవలేవు. ఏదో ఒకపార్టీ మాత్రమే గెలుస్తుంది. అన్ని పార్టీలకు ఆ అవకాశం లేదు. కాని చెబుతారు. పార్టీలను నమ్మిస్తారు. నాయకులను రంజింప జేస్తారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి సంతోష్‌ కుమార్‌ శర్మ చెప్పిన జాతక ఫలితాలు ఎలా వున్నాయో చూద్దాం. రేవంత్‌ రెడ్డిది తులా రాశి అని చెప్పుకుంటూ ఆయనకు నరగోష వుందన్నారు. ఆయనపై నరఘోష చెప్పాలంటే ఇప్పుడు కాదు, ఆయనపై ఎప్పటి నుంచో వుందనే చెప్పాలి. ఈ విషయం చెప్పడానికి పంచాంగమే అక్కర్లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి స్వతహాగా పైకొచ్చిన నాయకుడు. ఆయనను ఎవరూ నాయకుడిగా తయారు చేయలేదు. రాజకీయ గురువు ఆయనకు ఎవరూ లేరు. ఒక్కసారిగా రాజకీయ యవనిక మీదకు ఉత్తుంగతరంగంలా వచ్చారు. వస్తూ వస్తూనే జడ్పీటీసి అయ్యారు. తర్వాత ఏడాదిన్నరకే ఎమ్మెల్సీ అయ్యారు. మరో రెండేళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం పార్టీలో అందరూ అసూపడేలా ఎదిగారు. చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్‌ ప్రెసిడెంటు అయ్యారు. ఒక దశలో తెలంగాణ తెలుగుదేశంపార్టీకి అధ్యక్షుడు కావాలనుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్దితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా వర్కింగ్‌ ప్రెసిడెంటుగానే తన ప్రస్దానం ప్రారంభించారు. గత ఎన్నికలకు మూడేళ్ల ముందే పిపిసి. అధ్యక్షుడయ్యారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై నరదిష్టి అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఎదుగుతున్న క్రమంలోనే మొదలైంది. ఏ నరదిష్టి ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే జాతకం బాగుంది. అసలు ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడే తాను ముఖ్యమంత్రి అవుతా! అన్నారు. అప్పటికి తెలంగాణ రాలేదు. ఒక్కరోజైనా సరే నేను ముఖ్యమంత్రికావాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ వచ్చిందే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసమా? అన్నట్లు ఆయన జాతకం కాలాన్నే మార్చేసింది. ఇప్పుడుకొత్తగా ఆయనపై దిష్టి వుందన్న సంగతి ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. కాని చెప్పాలి. చెప్పకుంటే పంచాంగ శ్రవణం పూర్తికాదు. అందుకే ఓ వైపు రేవంత్‌రెడ్డికి తిరుగులేదు. ఎదురులేదు. మరో పదేళ్లపాటు ఆయన పాలనకు తిరుగుండదని చెప్పిన సిద్దాంతి నరోఘోష వుందని పరిహారం చేసుకోవాలని సూచించారు. అందరిలోనూ ఆనందం నింపారు. ఇది నిజమా? అబద్దామా? అనేది కాలం తేల్చుతుంది. ఇక బిఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో మరో విశేషం జరిగింది. ఇకపై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్‌దే గెలుపు అంటూ సిద్దాంతి చెప్పుకోచ్చారు. ఇంత వరకు బాగానే వుంది. మరి ప్రభుత్వం తరుపున పంచాంగ శ్రవణం చెప్పిన సిద్దాంతి సిఎం. రేవంత్‌ రెడ్డికి పదేళ్లపాటు తిరుగులేదన్నాడు. మరి బిఆర్‌ఎస్‌ జాతకం చెప్పిన సిద్దాంతి ఈసారి సిఎం. అయ్యేది కేసిఆరే అంటున్నారు. ఇదెలా సాధ్యం. లెక్కలంటే లెక్కలాగానే వుండాలి. పక్కాగా వుండాలి. లెక్కలకు సూత్రాలెన్ని వున్నా, ఆన్సర్‌ మాత్రం ఎప్పుడూ ఒక్కటే వుండాలి. ఒకే లెక్కను సూత్రానికొక సమాధానం వస్తే అది లెక్కెలా అవుతుంది. దానికి విలువేమిటుంటుంది. ఇక బిజేపి కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో ఇక వచ్చేదంతా బిజేపి కాలమే అని సిద్దాంతి సెలవిచ్చారు. అదేంటి ఒకే రాష్ట్రంలో మూడు పార్టీల జాతకం బాగానే వుంది. కాని అదికారం ఏదో ఒకపార్టీనే వరిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అదికారంలో వుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిఎంగా వున్నారు. ఆయన పదవికి పదేళ్లు ఢోకాలేదన్నప్పుడు, ఈ రెండు పార్టీలు ఎలా అదికారంలోకి వస్తాయో? అర్ధం కాని విషయం. అయినా ఎన్నికలు మరో ముడున్నరసంవత్సరాలకు గాని రావు. ఇప్పటికిప్పుడు ఎన్నికల వస్తే అని సర్వే సంస్ధలు చెప్పినట్లు జోస్యం చెబితే పంచాగానికి విలువేముంటుంది. పంచాంగం అంటే అన్నీ నిజాలే చెప్పాలి. సిద్దాంతులు అదే చెప్పాలి. గ్రహగతులు అన్ని పంచాంగాలలో ఒకటే వుంటుంది. ఎప్పుడు పౌర్ణమివస్తుందో..ఎప్పుడు గ్రహణాలు వస్తాయో? లెక్క పొల్లు పోకుండా పంచాంగంలో రాస్తారు. ఇప్పటికీ సైన్స్‌కు అందని మిస్టరీ. అంత కరక్టుగా పంచాంగం రూపకల్పన జరిగినప్పుడు నేతల జాతకాలు, పార్టీల భవిష్యత్తును ఇలా మర్చి చెప్పిడం కరక్టు కాదు కాదా? నిజం చెప్పాలంటే సిద్దాంతుల విజ్ఞానం సామాన్యమైంది కాదు. ఎంతో విద్వత్తు వుంటే గాని సిద్దాంతులు కాలేరు. మరి అలాంటి సిద్దాంతులు ఉగాది పూట ఎందుకు అబద్దాలు చెప్పడం. ఉన్నది ఉన్నట్లు చెబితే జనం నమ్మరు. అంతా బాగుందంటేనే నమ్ముతారు. వ్యక్తిగా కష్టాలొస్తాయంటే నమ్ముతారు. కాని రాజకీయాల్లో వున్నవారు పదవులు పోతాయంటే జీర్ణించుకోలేరు. అందుకే సిద్దాంతులు కూడా లోకకల్యాణం కోసమే అబద్దాలు ఆడుతుంటారేమో? అనుకోవాలేమో?? ఇక ఏపిలో మాడుగుల నాగఫణి శర్మ లాంటి గొప్ప సిద్దాంతి కూడా చెప్పింది వింటే విచిత్రమనిపిస్తుంది. అదేంటో సిద్దాంతులు సామాన్యులను కష్టాలున్నాయని భయపెడతారు. నాయకులకు అంతా బాగుందని చెప్పి సంతోషపెడతారు. మీరు పదవిలో నుంచి దిగిపోతారని ఏ నాయకుడి ముందు, ఏ సిద్దాంతి చెప్పరు. ఇదే అసలు ట్విస్టు. ఏపి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తంగా ఆరు సార్లు ముఖ్యమంత్రి యోగముందని నాగఫణిశర్మ చెప్పారు. ఇప్పటికి నాలుగు సార్లు పూర్తి చేశారు. ఇంకా రెండుసార్లు మిగిలి వుంది. మరి స్వయంగా మంత్రి లోకేష్‌ ఆ మధ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, ఎమ్మెల్సీలకైనా మూడుసార్లే అవకాశం. నేను కూడా అదే ఆచరిస్తానని చెప్పారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడుకు వర్తింపజేస్తారా? అంతే కాకుండా లోకేష్‌ అప్పటి వరకు ముఖ్యమంత్రికాకుండా వుండగరలా? ఇదిలా వుంటే పవన్‌ కల్యాన్‌కు కూడా రాజయోగం వుందని సిద్దాంతులు అంటున్నారు. పవన్‌ కల్యాణేమో చంద్రబాబుమరో మూడుసార్లు సిఎంగా వుండడమే నేను కోరుకుంటున్నానంటున్నారు. జాతకం ప్రకారం ఆరుసార్లు సిఎం. చంద్రబాబు అయ్యే అవకాశంవుంటే పవన్‌కు సిఎం.అయ్యే చాన్స్‌ లేనట్లే. మరి ఇతర సిద్దాంతులు పవన్‌కు ఆ వరం వుందంటున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్‌ విషయానికి వస్తే ఆయన వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తారని పంచాంగ సిద్దాంతి సూరి నారాయణ మూర్తి అన్నారు. అదెలా సాధ్యమౌతుంది. వరుసగా ఇంకా రెండు సార్లు చంద్రబాబు సిఎం. అయ్యేదే వుంటే వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఎలా సిఎం అవుతారు. అసలు అక్కడ కూడా ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం వుంది. కూటమి బలంగా వుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలువచ్చే అవకాశమే లేదు. ఇకపోతే జగన్‌ విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయలంత కీర్తిని సంపాదిస్తారట. ఇలా పంతుళ్లు పోటీ పడి మరి నాయకులను కీర్తించారు. గతంలో ఎప్పుడు పంచాంగ శ్రవణాలు చెప్పినా నాయకుల జాతకాలు చెప్పేవారు కాదు. వాతవారణ పరిస్ధితులు, భూకంపాలు, వర్షాలు, వరదలు, కరువు కాటకాల గురించి చెప్పి, ప్రభుత్వాలను అప్రమత్తం చేసేవారు. ఇప్పుడు నాయకులు జాతకాలు చెప్పి వారిని సిద్దాంతులు ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదీ మ్యాటర్‌.

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలోని సోమవారం ఘనంగా నిర్వహించారు.
నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ ముస్లిం ప్రజలు జరుపుకున్నారు.మత పెద్ద జామీ మజీద్ ఇమామ్ మహబూబ్ నమాజ్ ను చదివారు. అనంతరం రంజాన్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ మాట్లాడుతూ భారత దేశ ముస్లింలు రంజాన్ మాసంలో లోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆర్బించడం జరిగిందన్నారు. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పాటించి ప్రతిరోజు ప్రత్యేక తరాబి నమాజు పటించి అనంతరం జకాత్ ఫిత్రాలు మరియు హదీయాలు డబ్బు రూపాన పేదలకు అనాధలకు వితంతువులకు దానం చేస్తారన్నారు. ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ ప్రత్యేక నమాజుకై ఈద్గాకు మండల స్థాయి ముస్లిం చదువుతారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికి ఒకరు అలింగనం చేసుకొని కులమతాల అతీతంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం ఖబురస్థాన్లోకు వెళ్లి చనిపోయిన బంధువుల సమాధులపై పూలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖ నాయకులు జామి మసీద్ అధ్యక్షులు మహమ్మద్ నబీ, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ అయుబ్, మీర్జా మసూద్, అలీబేగ్, మహమ్మద్ రబ్బాని, మహమ్మద్ ఆఫీస్,ఇర్ఫాన్ మహమ్మద్, అన్వర్ సయ్యద్ జావేద్ ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

చిట్యాల, నేటిధాత్రి :

 

 

ఉగాది పండుగ పర్వదినాన పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా జరిగిన శ్రీ వివేకానంద సేవా సమితి ఫౌండర్ కే సంజీవరావు అధ్యక్షతన పుష్ప గ్రాండ్ పంక్షన్ హాల్ లో అవార్డ్ కవుల, కళాకారులుకు అవార్డు ప్రదానోత్సవం జరిగినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని పత్తి పువ్వు పాట ఆవిష్కరణ చేయడం జరిగింది సమాజంలో మేలుకొలిపే పాటలు రాయాలని పేర్కొన్నారు పాట రచయిత దాసారపు నరేష్ బాగా రాసారని అభినందించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ఆర్ఎస్ నంద గాయకులు మధు రోజా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు ఎన్ఎస్ఆర్ ఫౌండర్ సంపత్ రావు , కవులు గాయకులు పాల్గొన్నారు.

కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

ముస్లింల పవిత్ర పండుగ అయినా రంజాన్ పండుగను పురస్కరించుకొని చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ మజీద్ ఆవరణలోని ఈద్గాలో మండలంలోని ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నమాజ్ చేసుకుని ఒకరికొకరు అలై బాలాఈ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సమావేశంలో మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ నెల ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష లో ఉండి సోమవారం.రోజున ఉపవాస దీక్షను విరమించి రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అలాగే సమాజంలో గంగ జమున తహసీబ్ కే జైస హిందూ ముస్లింలు అనే భేదం లేకుండా అందరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ సమావేశంలో మసీదు కమిటీ అధ్యక్షలు అజ్మత్ మియా కార్యదర్శిహైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ షేక్ హుస్సేన్ వివిధ గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

అంత్య క్రియలకు ఆర్థిక సాయం అందజేత.

అంత్య క్రియలకు ఆర్థిక సాయం అందజేత

నిజాంపేట , నేటిధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలో కమ్మరి నరసింహ చారి (20) మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మెదక్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంట తిరుపతిరెడ్డి అంత్య క్రియల నిమిత్తం 5000 రూపాయలు తన అనుచరులతో అందించారు ఇందులో నర్సింలు, మావురం రాజు, తాడం మల్లేశం, నాయిని లక్ష్మణ్, తిరుమల గౌడ్ తదితరులు ఉన్నారు

కరెంటు షాక్ తో షాపు దగ్ధం.

కరెంటు షాక్ తో షాపు దగ్ధం

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో పట్టణానికి చెందిన మారం రాకేష్ కంప్యూటర్,ఆయిల్ షాపులు కరెంటు షాక్ తో దగ్ధమయ్యాయి.

Electric shock

ఈ ప్రమాదంలోభారీగా ఆస్తి నష్టం జరిగింది. సుమారుగా రూ.50 లక్షల అస్థి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలిపోయిన షాపుని పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఎమ్మెల్యేను కోరాడు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి వర్తక, వ్యాపారస్తులు పలువురు ఆర్థిక సహాయాన్ని అందించారు.

అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి.

– అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి….

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోన ముస్లిం ప్రార్థన మందిరంలో రంజాన్ వేడుకలు

*పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ముస్లిం పెద్దలు అన్నారు *

Ramadan

*ఈద్-ఉల్-ఫీతర్ (పవిత్ర రంజాన్) పర్వదినం పురస్కరించుకొని ఈరోజు జెడ్పీఎస్ఎస్ పాఠశాల నందు మైదానంలో ముస్లిం సోదర అందరూ ప్రార్థనలు చేశారు ముస్లిం ప్రార్థన గురువు మసీద్ సదర్ ఎండి యూసుఫ్ పాషా ముఖ్య అతిథులుగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ
*వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగలో ఒకటి రంజాన్ అని కొనియాడుతూ చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ పండుగని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌబ్రతృత్వ గుణాలు పంచుతుందని పేర్కొన్నారు. మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ముస్లింలకు పెద్దపేట వేస్తుందని అన్నారు. అల్లా దయతో ఈ పండుగ మానవాళికిచ్చే గొప్ప సందేశమని అన్నారు.

మహిళపై అత్యాచారం ఎమ్మెల్యే ఆగ్రహం.

మహిళపై అత్యాచారం.. ఎమ్మెల్యే ఆగ్రహం

జడ్చర్ల / నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని వెల్లడించారు. ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనాప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలోని ఊర్కొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలోనీ యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ

 

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

ఏప్రిల్ 27 న మహబూబ్ నగర్ పట్టణం లోని ఎంబిసి మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కళాభవన్ లో పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూలె- అంబేద్కర్ జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలే – అంబేద్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ళ బాలరాజు, గువ్వ లక్ష్మణ్, యాదగిరి నాయక్, జంగయ్య, మాసయ్య, ఆది విష్ణు, విద్యావతి, బాబమ్మ, నర్సింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
ముస్లింల పవిత్రదినం రంజాన్ పండుగ సందర్బంగా భూపాలపల్లి బాంబులగడ్డలోని ఈద్గలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్ని ముస్లిం సోదరీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి,మీ కష్ట నష్టాలల్లో, ముస్లిం మైనారిటీ ప్రజల అభ్యున్నతిలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

ఘనంగా మండలంలో ఈద్-ఉల్-ఫితర్.

ఘనంగా మండలంలో ఈద్-ఉల్-ఫితర్.

“వక్ఫ్ బిల్లుకు “వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన.

రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన.

ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధుల హాజరు, ముస్లింలకు “ఈద్” శుభాకాంక్షలు.

పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలోనూ “ఈద్” శుభాకాంక్షలు.

సి ఐ ఎస్ ఐ, ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

ఈనెల రెండవ తేదీ నుండి ప్రారంభమైన రంజాన్ సోమవారం నాటికి ఈదుల్ తో ముగిసింది. మహాదేవపూర్ మండల కేంద్రం తో పాటు ఉమ్మడి మండలంలోని కాళేశ్వరం, పంకేనా, లెంకలగడ్డ, అన్నారం, గ్రామాల్లోని ఈద్గాల వద్ద, ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కొరకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రార్థించడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వఫ్ఫ్ బోర్డు బిల్లును క్యాబినెట్ ఆమోదం కొరకు ప్రతిపాదించడంతో, ఈద్గా వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలను ధరించి బిల్లులు వ్యతిరేకించడం జరిగింది. మండల కేంద్రంతో పాటు ఉమ్మడి మండలంలోని గ్రామాల్లో ఈద్గాలు అలాగే గ్రామ ప్రజలు ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలపడంలో నిమగ్నం కావడం జరిగింది. మతసామర్స్యాలకు ప్రతీకంగా రంజాన్ మాసం, పవిత్రత తో కూడిన పండుగ కావడంతో, కుల మతాలకు తేడా లేకుండా పిల్ల పెద్ద, ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులకు అలై బలై చేస్తూ ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన.

Wakf Bill

 

ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలోని” ఖుద్బ” అనంతరం ప్రత్యేక దువా కార్యక్రమం చేయడం జరుగుతుంది, 30 రోజులపాటు రోజాలు ఉన్న ముస్లింలు చేతులెత్తి ఈదుల్ ఫితర్ నమాజ్ అనంతరం” దువా” నిర్వహించడం జరుగుతుంది, ఈ దువాలు మదిని ఈదుగా జామి మస్జీద్ ఈద్గా కు సంబంధించిన మత గురువులు ప్రత్యేకంగా, రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తుపాతు రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రత్యేక దువ నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, లో అల్లాహ్, దీవించి సంరక్షించాలని కోరడం జరిగింది. మరోవైపు ఈద్ శుభాకాంక్షలు సంబంధించి సామాజిక మాధ్యమం ఉమ్మడి మండలంలోని “వాట్సప్ గ్రూప్”
“నమస్తే మహాదేవపూర్” మిన్ను భాయ్ రిపోర్టర్” లోకల్ గ్రూప్ తో పాటు “మిన్ను భాయ్ విత్ ముస్లిం” సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరూ మతానికి సంబంధం లేకుండా ఈదుల్ ఫితర్ తో పాటు ఈద్ ముబారక్ సందేశాలను పంపి, శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.

Wakf Bill

ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధుల హాజరు, ముస్లింలకు “ఈద్” శుభాకాంక్షలు.

పవిత్ర మాసం రంజాన్ చివరి రోజు, ఈదుల్ ఫితర్ కొరకు ప్రత్యేక ప్రార్థన కొరకు ఈద్ఘా ల వద్దకు చేరిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుటకు, ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్, బిజెపి, పార్టీలతో ప్రతినిధులతో పాటు, పలు కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఈద్గాల వద్దకు చేరి నమాజ్ అనంతరం, అలా ఇవ్వలాయ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బాన్సువాడ రాణి బాయ్,రామారావు, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు సుధాకర్, పి ఎ సి ఎస్ చైర్మన్ తిరుపతి, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్, శ్రీపతి బాబు, సల్మాన్ ఖాన్. సింగిల్ విండో డైరెక్టర్ ఇబ్రహీం, వామన్ రావు, కలికోట వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, కుదురుపల్లి మాజీ సర్పంచ్ కోట సమ్మయ్య, నాగరాజు,అశోక్,ముస్లిం సోదరులతో పాటు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన, సల్మాన్ ఖాన్, ఇస్తియాక్, ఖదీర్, అలీమ్ ఖాన్, తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన, అస్రార్ ఖురైషి, ఎండి అజాజ్ ఖాన్, ఎండి సలావుద్దీన్, గయాజ్ ఖాన్, ఇర్షాద్ ఖాన్, సలాం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మతిన్ ఖాన్, ముజీబ్ ఖాన్, అసిన్ ఖాన్ ఖాన్ మేస్త్రి, ఎండి ఉవెజ్, సోయఫ్ ఖాన్, షాకిరుల్ల ఖాన్, సయ్యద్ ముఖిద్, సయ్యద్ మెహరాజ్, ఎండి నయూమ్, ఎండి సోహెల్, ఎండి చాంద్, ఎండి నదీమ్, షేక్ బబ్లు, ఎండి ఇమ్రాన్, ఎండి నూమాన్, షేక్ రొమాన్,షారుఖ్ ఖాన్,ఎండి మోఖిద్,అక్రమ్ ఖాన్,షాహిద్,వాలిఉల్లహ ఖాన్,మశుక్ అలీ, లకు కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈద్గాల వద్ద శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Wakf Bill

సి ఐ ఎస్ ఐ, ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు.

ఈదుల్ ఫితర్ నిర్వహణకు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈద్గాల వద్ద చేరడం జరుగుతుందని, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా, మహదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, రామ్మోహన్ రావ్, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, కాలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ తమాషా రెడ్డి, పలివెల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద, సిఆర్పిఎఫ్ బాటాయంతో పాటు సివిల్ పోలీస్ లతో ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, సుమారు రెండు గంటల పాటు పోలీస్ సిబ్బంది, ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ విధులు నిర్వహించి, చివరికి పోలీసులు కూడా ముస్లింలకు ఈద్గాల వద్ద శుభాకాంక్షలు తెలపడం జరిగింది. స్థానిక మైనారిటీలతోపాటు మస్జిద్ కమిటీల బాధ్యులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ చౌకధరల దుకాణం 25 వెలగం సంతోష్ కుమార్ షాప్ వద్ద శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూనే గత ప్రభుత్వాలు చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఏ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ పథకం రాష్ట్ర ప్రజలకు కలిగించే ప్రయోజనాలను మంత్రి వివరించారు. పేద ప్రజలకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం చారిత్రకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ
ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియమాలు చేపట్టామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పధకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరాయంగా కొనసాగుతుందని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ
సన్న బియ్యం పంపిణీ పధకం ద్వారా పేద కుటుంబాలకు భారం తగ్గుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పంపిణీ చేపట్టి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ఓ రాములు, ఆర్డిఓ రవి, సివిల్ సప్లై జిల్లా అధికారి రాములు తహసిల్దార్ శ్రీనివాసులు పట్టణ అధ్యక్షుడు దేవాన్ పదహారే వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ రేషన్ డీలర్ సంతోష్ కుమార్ పిసిసి మెంబర్ చల్లూరు మాది బుర్ర కొమురయ్య విజయ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version