ఘనంగా మండలంలో ఈద్-ఉల్-ఫితర్.
“వక్ఫ్ బిల్లుకు “వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన.
రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన.
ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధుల హాజరు, ముస్లింలకు “ఈద్” శుభాకాంక్షలు.
పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలోనూ “ఈద్” శుభాకాంక్షలు.
సి ఐ ఎస్ ఐ, ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఈనెల రెండవ తేదీ నుండి ప్రారంభమైన రంజాన్ సోమవారం నాటికి ఈదుల్ తో ముగిసింది. మహాదేవపూర్ మండల కేంద్రం తో పాటు ఉమ్మడి మండలంలోని కాళేశ్వరం, పంకేనా, లెంకలగడ్డ, అన్నారం, గ్రామాల్లోని ఈద్గాల వద్ద, ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కొరకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రార్థించడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వఫ్ఫ్ బోర్డు బిల్లును క్యాబినెట్ ఆమోదం కొరకు ప్రతిపాదించడంతో, ఈద్గా వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలను ధరించి బిల్లులు వ్యతిరేకించడం జరిగింది. మండల కేంద్రంతో పాటు ఉమ్మడి మండలంలోని గ్రామాల్లో ఈద్గాలు అలాగే గ్రామ ప్రజలు ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలపడంలో నిమగ్నం కావడం జరిగింది. మతసామర్స్యాలకు ప్రతీకంగా రంజాన్ మాసం, పవిత్రత తో కూడిన పండుగ కావడంతో, కుల మతాలకు తేడా లేకుండా పిల్ల పెద్ద, ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులకు అలై బలై చేస్తూ ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన.

ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలోని” ఖుద్బ” అనంతరం ప్రత్యేక దువా కార్యక్రమం చేయడం జరుగుతుంది, 30 రోజులపాటు రోజాలు ఉన్న ముస్లింలు చేతులెత్తి ఈదుల్ ఫితర్ నమాజ్ అనంతరం” దువా” నిర్వహించడం జరుగుతుంది, ఈ దువాలు మదిని ఈదుగా జామి మస్జీద్ ఈద్గా కు సంబంధించిన మత గురువులు ప్రత్యేకంగా, రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తుపాతు రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రత్యేక దువ నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, లో అల్లాహ్, దీవించి సంరక్షించాలని కోరడం జరిగింది. మరోవైపు ఈద్ శుభాకాంక్షలు సంబంధించి సామాజిక మాధ్యమం ఉమ్మడి మండలంలోని “వాట్సప్ గ్రూప్”
“నమస్తే మహాదేవపూర్” మిన్ను భాయ్ రిపోర్టర్” లోకల్ గ్రూప్ తో పాటు “మిన్ను భాయ్ విత్ ముస్లిం” సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరూ మతానికి సంబంధం లేకుండా ఈదుల్ ఫితర్ తో పాటు ఈద్ ముబారక్ సందేశాలను పంపి, శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.

ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధుల హాజరు, ముస్లింలకు “ఈద్” శుభాకాంక్షలు.
పవిత్ర మాసం రంజాన్ చివరి రోజు, ఈదుల్ ఫితర్ కొరకు ప్రత్యేక ప్రార్థన కొరకు ఈద్ఘా ల వద్దకు చేరిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుటకు, ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్, బిజెపి, పార్టీలతో ప్రతినిధులతో పాటు, పలు కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఈద్గాల వద్దకు చేరి నమాజ్ అనంతరం, అలా ఇవ్వలాయ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బాన్సువాడ రాణి బాయ్,రామారావు, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు సుధాకర్, పి ఎ సి ఎస్ చైర్మన్ తిరుపతి, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్, శ్రీపతి బాబు, సల్మాన్ ఖాన్. సింగిల్ విండో డైరెక్టర్ ఇబ్రహీం, వామన్ రావు, కలికోట వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, కుదురుపల్లి మాజీ సర్పంచ్ కోట సమ్మయ్య, నాగరాజు,అశోక్,ముస్లిం సోదరులతో పాటు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన, సల్మాన్ ఖాన్, ఇస్తియాక్, ఖదీర్, అలీమ్ ఖాన్, తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన, అస్రార్ ఖురైషి, ఎండి అజాజ్ ఖాన్, ఎండి సలావుద్దీన్, గయాజ్ ఖాన్, ఇర్షాద్ ఖాన్, సలాం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మతిన్ ఖాన్, ముజీబ్ ఖాన్, అసిన్ ఖాన్ ఖాన్ మేస్త్రి, ఎండి ఉవెజ్, సోయఫ్ ఖాన్, షాకిరుల్ల ఖాన్, సయ్యద్ ముఖిద్, సయ్యద్ మెహరాజ్, ఎండి నయూమ్, ఎండి సోహెల్, ఎండి చాంద్, ఎండి నదీమ్, షేక్ బబ్లు, ఎండి ఇమ్రాన్, ఎండి నూమాన్, షేక్ రొమాన్,షారుఖ్ ఖాన్,ఎండి మోఖిద్,అక్రమ్ ఖాన్,షాహిద్,వాలిఉల్లహ ఖాన్,మశుక్ అలీ, లకు కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈద్గాల వద్ద శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

సి ఐ ఎస్ ఐ, ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు.
ఈదుల్ ఫితర్ నిర్వహణకు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈద్గాల వద్ద చేరడం జరుగుతుందని, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా, మహదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, రామ్మోహన్ రావ్, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, కాలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ తమాషా రెడ్డి, పలివెల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద, సిఆర్పిఎఫ్ బాటాయంతో పాటు సివిల్ పోలీస్ లతో ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, సుమారు రెండు గంటల పాటు పోలీస్ సిబ్బంది, ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ విధులు నిర్వహించి, చివరికి పోలీసులు కూడా ముస్లింలకు ఈద్గాల వద్ద శుభాకాంక్షలు తెలపడం జరిగింది. స్థానిక మైనారిటీలతోపాటు మస్జిద్ కమిటీల బాధ్యులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.