కష్టపడి చదివే వారు ఎక్కడైనా రాణిస్తారు టీజీఐడిసి చైర్మన్.

కష్టపడి చదివే వారు ఎక్కడైనా రాణిస్తారు టీజీఐడిసి చైర్మన్ మహమ్మద్ తన్వీర్ సన్మానం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కష్టపడి చదివే విద్యార్థులు ఎక్కడ చదివిన వారు తమ ప్రతిభను కనబరుస్తారని టీజీఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఆర్ ఎల్ ర్ జూనియర్ కళాశాలలో బైపిసి గ్రూప్ నందు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బిజీ సరయు 440/436 సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించడం పట్ల ఆయన అభినందించారు
నేడు ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా మారుమూల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కళాశాలలో కూడా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారంటే ఇది విద్యార్థిలకు పట్టిన ప్రతిభను బట్టి గుర్తించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి సరయు రాష్ట్ర స్థయిలో ర్యాంకు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులకు అభినందించి విద్యార్థినికి పూలమాల, శాలువాలతో సన్మానించీ ఇంకా ఉన్నతమైన ర్యాంకులు సాధించి జహీరాబాద్ నియోజకవర్గానికి తమ కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశీర్వదించారు. ఈరోజు ఏ రంగంలో చూసిన గ్రామీణ స్థాయి విద్యార్థులే రాణిస్తున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో ఏ కార్యక్రమం చేయాలనుకున్న దాన్ని విజయవంతంగా చేయగలుగుతారని అన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఉత్తమమైన విద్యాబధన చేయడంతోనే రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించగలుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మాన్ కాల్ సుభాష్ గుప్తా, సీనియర్ నాయకులు రంజుల్ వైద్యనాథ్, శ్రీ కాంత్ రెడ్డి, మహమ్మద్ కుతుబుద్దీన్, మహమ్మద్ జహంగీర్ , రంగా అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, బిజీ సందీప్, బాల్ రెడ్డి, నిజాం తదితరులు పాల్గొన్నారు.

అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లే.!

అమ్మమ్మ ఇంటికి వచ్చి… అనంత లోకాలకు వెళ్లే…

శోకసముద్రంలో మునిగిన శివశంకర్ కుటుంబ సభ్యులు

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని గేటు పల్లిలో భూక్య శివశంకర్ వయసు (8) సంవత్సరాలు విద్యుత్ షాక్ తాకి మృత్యువాత వాత పడడంతో ఇ టు గెట్ పల్లి లో విశ్వనాధపురం లో విషాదం ఛాయలు అమ్ముకున్నాయి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన భూక్య నరేష్ కుమారుడు శివ శంకర్ తన అమ్మమ్మ అయినటువంటి బాధావత్ గొజి నివాసముంటున్న గేటు పల్లి గ్రామానికి వేసవి కాలం సెలవుల కోసం రావడంతో మంగళవారం సాయంత్రం గేటు పల్లి లోని భూక్య శంకర్ ఇంటి వద్ద శివశంకర్ ఆడుకుంటున్న సందర్భంలో శంకర్ ఇంటికి కరెంటు సప్లై రావడంతో అది గమనించని శివశంకర్ ఇంటికి సంబంధించిన మెట్ల కు ఉన్నటువంటి ఇనుప చువ్వలను పట్టుకోగా కరెంట్ షాక్ తగిలి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లాడని మృతుని తండ్రి భుక్య నరేష్ బోరున వినిపిస్తూ బుధవారం నెక్కొండ ఎస్సై మహేందర్ కు దరఖాస్తు ఇవ్వడంతో దరఖాస్తు స్వీకరించిన ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన.!

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి తనప సుశీల ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పరు బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్న వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను పూర్తి చేయాలని యజమానులు దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీ వాణి , తిరుపతయ్య గారు,యర్ర సురేష్ , రాందాస్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన.

“జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన తీవ్రవాదుల దాడిని ఖండిస్తు పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం

వర్ధన్నపేట (నేటిదాత్రి):

 

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ చెంగల సురేష్ ఆధ్వర్యంలో జమ్ము కాశ్మీర్ పెహల్గాం లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో హిందువుల పై దాడికి పాల్పడుతూ మరణకాండ సృష్టించడాన్ని ఆయన ఖండించారు. భారత దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మత సంస్థలు ఉగ్రవాద సంస్థలకు అండగా నిలుస్తూ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాయని ఇప్పటికైనా వారు ఉగ్రవాదులకు సహాయం అందించడం ఆశ్రయం కల్పించడం మానుకోవాలని లేదంటే భవిష్యత్తులో వారికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెబుతుందని అదేవిధంగా పాకిస్తాన్ కి కూడా దీటైన సమాధానం ఇస్తుందని ఈట్ క జవాబు పత్తర్ సే దేంగే నినాదాన్ని చేసి చూపెడతారని మహేందర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలని లేదంటే సరైన సమాధానం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బర్ల నవీన్. పింగిలి రాజేందర్. రెడ్డి ఇటికాల ప్రశాంత్. చిర్రా కిరణ్. ఏబీవీపీ నాయకులు బెల్లం కార్తీక్. వడ్డే శ్రీకాంత్. గోరుకంటి శివ. బండారి రేవంత్. చిర్ర రాకేష్. వేము నూరి నాగరాజు. హరీష్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం..

ఇంటికో యువకుడు..ఊరికో బస్సుతో దండుగా కదిలి..కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

-బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు నేర్పటి శ్రీనివాస్

ఈనెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఇంటికో యువకుడు..ఊరుకో బస్సుతో దండుగా కదిలి..కేసిఆర్ సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేసి..అవినీతి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల నాయకుడు నేర్పటి శ్రీనివాస్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ళ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల ప్రతిరూపంగా 2021 ఏప్రిల్ లో ఆవిర్భవించిన టిఆర్ఎస్ తో తెలంగాణ ఉద్యమాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపి..తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి..ఎన్నో కష్టనష్టాలకు, అవమానాలకు, అణచివేతకు వెనుకడుగు వేయకుండా..ప్రజలను అంటిపెట్టుకొని..రాష్ట్ర సాధనకై అలుపెరుగని పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. నాడు స్వరాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమంలో..ఆ తర్వాత 10 ఏండ్లు అధికారంలో..నేడు ప్రతిపక్షంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజలకు అండగా నిలబడ్డది కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా మాత్రమేనన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం..పదేళ్ల పాలన..మేలవింపు తెలంగాణ గుండె చప్పుడుగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ..ఉద్యమం పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతుందన్నారు. టిఆర్ఎస్ 25 ఏళ్ల మహా ప్రస్థానం సందర్భంగా ఈనెల 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని, దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలకు రజతోత్సవ సభ భరోసానిస్తుందన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు.!

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కోహిర్ పట్టణంలోని భరత్ ఫంక్షన్ హాల్ జరిగిన రాజనెల్లి గ్రామ వాసులు ఆగం. ఇందిరమ్మ – సొలొమోన్ గార్ల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు శంషీర్ గారు, మాజీ ఎంపీపీ షౌకత్, ఏఎంసీ.డైరెక్టర్ అశోక్,కాంగ్రెస్ నాయకులు అశోక్, ముర్జల్,మాజీద్,నర్సింలు, శాంసన్, పరమేష్,మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజ్జమిల్, తథితరులు పాల్గొన్నారు.

వాసుళ్లే వసూళ్లు టి జి ఎండిసి వసూళ్ల పర్వం.

వాసుళ్లే వసూళ్లు.

టి జి ఎండిసి వసూళ్ల పర్వం,

శాఖ సిబ్బంది అయి ఉండి కాంట్రాక్టర్ గుమస్తాగా వసూళ్లు.

ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా అధికారులకు లేదు.

అంతా అధికారుల కనుసైగల్లో, అందుకే దర్జాగా వసూళ్లు

టిజిఎండిసి నిద్ర మత్తు వీడడం లేదు, వసూళ్లు ఆగడం లేదు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా టిజిఎండిసి వ్యవహారం.

మహదేవపూర్- నేటి ధాత్రి:

 

 

మండలంలోని ఐదు ఇసుక రీచు లో మాత్రం వసూళ్ల పర్వం ఆగడం లేదు, తాజాగా పలుగుల ఎనిమిది ఇసుక క్వారీలో టిఎస్ఎండిసి సిబ్బంది, డ్రైవర్ల దగ్గరినుండి దర్జాగా వసూళ్ల పర్వం కొనసాగించడం ఆశ్చర్యకరం. కాలేశ్వరం పరిధిలోని పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల సిక్స్, పుసుపల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్పల్లి ఒకటి, ఈ ఐదు ఇసుక రీచుల్లో ఇసుక కాంట్రాక్టర్లకు గుమస్తాగా టీఎస్ఎండిసి సిబ్బంది వ్యవహరిస్తూ, వసూళ్ల పర్వం కొనసాగించడం జరుగుతుందన్న విషయం ఇప్పటికే, సాక్షాలతో తేర పైకి తీసుకురావడం కూడా జరిగింది, తాజాగా సోమవారం రోజు, పలుగుల 8 ఇసుక క్వారీలో టీఎస్ఎండిసి సిబ్బంది డ్రైవర్ల నుండి వసూళ్ల పర్వం కొనసాగించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఐదు క్వారీల అక్రమ వసూళ్ల వ్యవహారం, తేర పైకి వస్తున్న క్రమంలోని టీజీఎండిఎస్ సిబ్బంది వసూళ్ల పరంపర మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించడం వెనుక అధికారుల హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

వాసుళ్లే వసూళ్లు.

T G MDC

 

కాలేశ్వరం పరిధిలోని ఐదు ఇసుక రిచుల్లో అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక శరమాములుగానే కొనసాగుతుంది. అడిగే నాథుడు లేకపోవడంతో,పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల సిక్స్, పుసుపల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్ పల్లి, ఒకటి, ఈ ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ల పెత్తనానికి టి జి ఎం డి సి సిబ్బంది వసూళ్ల పర్వాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు. ఈ ఐదు ఇసుక రీచులకు సంబంధించి అక్రమ వసూళ్లు, లోడింగ్ వద్ద అదనపు రూపాలు తీసుకోవడం, సీరియల్ పేరుతో 700 నుండి 1200 వరకు ఈ క్వారీల్లో లారీల నుండి డబ్బులు వసూలు చేయడం, కాంటాల వద్ద పాసింగ్ పై అదనపు ఇసుక వేసి మరో 500 రూపాయలు తీసుకోవడం, ఇలాంటి వ్యవహారాలను సాక్షాలతో తేర పైకి తీసుకురావడం జరిగినప్పటికీ నేటికీ టీజీఎండిసి, చర్యలకు మాత్రం ససేమీరా అంటుంది.

టి జి ఎండిసి వసూళ్ల పర్వం,

T G MDC

 

 

 

బాధ్యతగా వ్యవహరించాల్సిన టీజీఎండిసి సిబ్బంది స్వయంగా వసూళ్ల పర్వం కొనసాగిస్తే ,లారీ డ్రైవర్ అక్రమాలు అదనపు వసూళ్ల వ్యవహారం ఎవరికి చెప్పుకుంటారు, కేవలం టీజీఎండిసి సిబ్బంది వసూళ్లకే పెట్టినట్టు వారి ఏకైక లక్ష్యం అదనపు వసూళ్లు పాసింగ్ పై అదనపు అక్రమ ఇసుక రవాణా చేసి మరింత డబ్బులు వసూళ్లు చేసి, కాంట్రాక్టర్ మరియు అధికారులకు కట్టబెట్టడమే లక్ష్యంగా పీజీఎండిసి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. కానీ శాఖ ఏర్పాటు చేసిన సిబ్బంది అవకతవకలు జరగకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, కాంట్రాక్టర్ అక్రమాలు చేపడితే వారిపై చర్యలు తీసుకునుటకు శాఖ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా సిబ్బంది కాంట్రాక్టర్ కు గుమస్తాలుగా మారి కేవలం వసూళ్ల కొరకే తాము ఉన్నామంటూ దర్జాగా వసూలు చేస్తున్నారు.

ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా అధికారులకు లేదు.

T G MDC

 

 

 

ప్రస్తుతం మండలంలో పెద్ద మొత్తంలో ఇసుక రీచుల నుండి ఇసుక రవాణా చేస్తున్న మహాదేవపూర్ కాలేశ్వరం పరిధిలోని పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలుగుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్ పల్లి ఒకటి, ఈ ఐదు ఇసుక క్వారీల్లో ఎన్ని అక్రమాలు జరిగిన, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, అధికారులకు మాత్రం ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా లేదని గ్రామాల్లో చెప్పుకొస్తున్నారు. ఈ క్వారీల యజమానులు రాజకీయంగా పలుకుబడి, అధికారులకు లంచాలు ఇవ్వడం జరిగింది, కనుక అందుకే ఈ క్వారీలపై ఏలాంటి చర్యలు ఉండవని స్థానికులు చెప్పుకొస్తున్నారు. స్థానికుల విషయం వాస్తవమే అని చెప్పుటకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ఐదు ఇసుక క్వారీల్లో టీఎస్ఎండిసి సిబ్బంది గుత్తేదారుల గుమస్తాలుగా మారి వ్యవహరిస్తున్న సాక్షాలు, అక్రమ వసూళ్ల వ్యవహారం సాక్షాలతో తెరపైకి వచ్చిన కిందిస్థాయి అధికారి నుండి ఉన్నత అధికారి వరకు ఏలాంటి చర్యలకు ఆదేశించకపోవడం, అధికారులు లంచాలు తీసుకున్నారని గ్రామాల్లో ప్రజల మాటలు వాస్తవం అనిపించేలా కనబడుతుంది.

అంతా అధికారుల కనుసైగల్లో, అందుకే దర్జాగా వసూళ్లు.

ఇసుక క్వారీల అక్రమ వసూళ్లు అదనపు ఇసుక వ్యవహారం, గుట్టుచప్పుడు కాకుండా జరగడం లేదు, ఈ క్వారీల్లో వసూళ్లు చేస్తున్న టీజిఎండిసి సిబ్బంది అధికారులకు కూడా వాటా ఉండడంతో, అంతా అధికారుల కనుసైగల్లోనే అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక, వ్యవహారం దర్జాగా కొనసాగుతుందని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు, అక్రమ వసూళ్లలో వాటాదారులు గా అధికారులు ఉండకపోతే సాక్షాలు తెరపైకి వచ్చిన 20 రోజులుగా వరుస కథనాలు వచ్చినా కూడా, ఏ అధికారి కూడా ఈ క్వారీలపై విచారణకు రాకపోవడం, ఏలాంటి చర్యలకు ఆదేశించక పోవడం, రోజురోజుకు వసూళ్ల పర్వం మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగడం, ఈ వ్యవహారా లాన్నిటిని గమనిస్తే అధికారులు కూడా వాటాదారులేనని స్పష్టమవుతుంది.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా టిజిఎండిసి వ్యవహారం.

మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల వ్యవహారం అదనపు ఇసుక రవాణా కాసుల కొరకు కక్కుర్తి పడుతున్న కాంట్రాక్టర్ మరియు వారికి గుమస్తాలుగా వ్యవహరిస్తున్న టీజీఎండిసి సిబ్బంది వసూళ్లపర్వంతో, అధికారులకు వాటాలు పంపించి, శాఖపరమైన చర్యలు లేకుండా అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగించడం, వాస్తవాలు సాక్షాలు తెరపైకి వస్తున్న క్రమంలో, టీజీఎండిసి చర్యలు తీసుకోకుండా ఉండడంతో, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక తప్పడం లేదు, ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా అక్రమాలపై “డెడ్లైన్” విధించి ఉన్నప్పటికీ, టి జి ఎం డి సి అమలు చేయకపోవడం ఇసుక క్వారీలో అక్రమాలు మరింత పెరగడం, ప్రజల్లో ప్రభుత్వ ఆదేశాలకు విలువ లేకుండా ఉందని చెప్పుకునేలా వ్యవహరిస్తుంది టిజి ఎండిసి, అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తున్న ఈ ఐదు క్వారీలపై ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే ఈ ఇసుక క్వారీలపై చర్యలతో పాటు వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నత అధికారులపై ఉంది.

ఆత్మ గౌరవ పాదయాత్రలో ఆకుల సుభాష్ ముదిరాజ్.

ముదిరాజ్ ఆత్మ గౌరవ పాదయాత్రలో ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం తెలంగాణ ఆరాధ్య దైవలు శ్రీ మేడారం సమ్మక్క సారాలమ్మ లను దర్శించుకొను ఈ నెల 18 శుక్రవారం రోజునా ముదిరాజ్ ల పట్ల జరుగుతున్న వివక్ష విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థిక సామజిక రంగాలలో ప్రభుత్వం చూపుతున్న వైఖరికి బి సి – డి నుండి బి సి -ఏ కు మారుస్తానని హామీ నెరవేర్చక పోవడం పట్ల నిరసన తెలుపుతూ తెలంగాణ ముదిరాజ్ సమాజ్ సంఘం అధ్యక్షులు
దారం యువరాజ్ ముదిరాజ్
ముదిరాజ్ ఆత్మగౌరవ పాదయాత్ర ప్రారంభం చేశారు. ఈరోజు వారి పాదయాత్రకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ సంఘీభావం తెలుపుతూ. మండు వేసవిలో వారి పాదయాత్రను చూసి కళ్ళు చెమ్మగిల్లయాని వారు అన్నారు పాదచారుల ఆరోగ్యంపై క్షేమ సమాచారిని అడిగి తెలుసుకున్నామని ఆకుల సుభాష్ తెలిపారు.

ప్రపంచ కార్మిక పోరాట దినాన్ని జయప్రదం చేయండి..

ప్రపంచ కార్మిక పోరాట దినాన్ని జయప్రదం చేయండి

కార్మిక సంఘ వాల్ పోస్టర్ లు ఆవిస్కరించిన కార్మిక సంఘం నాయకులు

పరకాల నేటిధాత్రి

 

ఎఐటీయూసి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్,జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున పరకాల పట్టణంలో ప్రపంచ కార్మిక పోరాటదినం వాల్ పోస్టర్ లను విడుదల చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మేడే రోజు పెద్ద ఎత్తున ర్యాలీ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున కార్మికులు,కర్షకులు,బజార్ అమాలీలు,మున్సిపాలిటీ కార్మికులు,గ్రామపంచాయతీ కార్మికులు,ఆశ వర్కర్లు, అంగన్వాడీలు,మధ్యాహ్నం భోజన కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు,అన్ని రంగాల కార్మిక వర్గాలు అందరూ హాజరై 139వ మేడే ను పెద్ద పండగను తలపించే విధంగా జరుపుకోవాలని అన్నారు.ఏఐటీయూసీ కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ తమ హక్కుల కోసం తమకు కేంద్ర ప్రభుత్వం ఏవైతే నాలుగు కోడ్లుగా తీసుకువచ్చి మరి కార్మికులకు మళ్లీ తుంగలో తొక్కాలని చూస్తున్నదని కేంద్ర ప్రభుత్వానికి మే 20న దేశ వ్యాప్త సమ్మెకు దిగి మేడే ను జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోకిల శంకర్,శ్రీపతి కుమారస్వామి, రేణిగుంట్ల రాజయ్య,బొట్ల భద్రయ్య,కోట యాదగిరి,మోరే రవి,కొయ్యడ భద్రయ్య,శ్రీపతి శ్రీనివాస్,ఓ.శంకర్,రేణిగుంట్ల వెంకటేష్,ఎం.జగన్,బొట్ల రాజు,పాపయ్య లు పాల్గొన్నారు.

గౌడ కులంలో మెరిసిన ఆణిముత్యం.

గౌడ కులంలో మెరిసిన ఆణిముత్యం

– కొడకండ్ల టీఎస్ ఆర్ జె సి కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కీర్తన విజయకేతనం

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

 

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు మంగళవారం విడుదలైన నేపథ్యంలో..జనగామ జిల్లా కొడకండ్ల టిఎస్ ఆర్ జె సి కళాశాల విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచారు. ఈ ఫలితాల్లో ప్రత్యేకంగా వెలుగులోకి వచ్చిన విద్యార్థిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామానికి చెందిన మాదారపు లావణ్య-రంజిత్ దంపతుల పెద్ద కుమార్తె మాదారపు కీర్తన 440 మార్కులకు గాను 435 మార్కులతో కళాశాల స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి విశేషమైన విజయాన్ని సాధించింది. కీర్తన విజయాన్ని పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు హర్షాతిరేకాలతో అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆమెను అభినందించారు.

కీర్తన స్పందన

ఈ ఫలితాన్ని సాధించడంలో మా టీచర్లు, స్నేహితులు, ముఖ్యంగా మా తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం ఎంతో కీలకమైనది. భవిష్యత్తులో కూడా ఇలానే కృషి చేసి, ఉన్నత విద్యలో అద్భుత ఫలితాలను సాధించడమే నా లక్ష్యం.

తల్లిదండ్రుల హర్షం:

మా అమ్మాయి ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన బాలికగా కీర్తన సాధించిన ఈ విజయం గౌడ కులస్తుల గౌరవాన్ని పెంచడమే కాక, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు.

మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు. మాట్లాడుతూ మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక ఫలితాలు సాధించినందుకు గర్వంగా ఉందని అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులలో.MPC. విభాగంలో. G. సిరి.T. శైలజ. 470 మార్కులకు గాను. 462. ప్రథమ స్థానంలో నిలిచారని.Bipc. విభాగంలో.P. అనూష 400. మార్కులు గాను.CEC. విభాగంలో.E. ప్రణీత. 400. మార్కులు గాను ఆయా విభాగాలలో ప్రథమ స్థానంలో నిలిచారని. ద్వితీయ సంవత్సరంలో.M. అంజన. 932.M. హర్షిత. 931. ఎంపీసీ. బైపిసి. సిహెచ్. శ్రీజ. 894. ల.తో. ప్రథమ స్థానం నిలిచారని. సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు ఇక ముందు కూడా మోడరన్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విద్యార్థులు జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని చదువులో చక్కగా రానించి మరిన్ని మంచి ఫలితాలు రాబట్టాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారికి ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్.చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క రవి ఆధ్వర్యంలో సీఎంఆర్ ఎఫ్. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర సమయంలో వైద్యం చేయించు కో లేని పరిస్థితులు ఉన్న ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి మహత్తర అవకాశాలను తీసుకొచ్చిన ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తర్వాత లబ్ధిదారులకు జగ్గాన్ని సాహితి మహేష్కి.. 60000. పన్యాల స్వాతిక మహిపాల్ కి. 21. వేల. రూపాయల చెక్కులను అందజేశారు. మాకు ఇట్టి చెక్కులు రావడానికి కృషి చేసిన వారందరికీ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మాజీ ఎంపిటిసి బస్సు స్వప్న లింగం. మాజీ సర్పంచ్ తంగళ్ళపల్లి దేవయ్య రాగి పెళ్లి కృష్ణారెడ్డి. గుర్రం కిషన్ గౌడ్. తంగళ్ళపల్లి మహేష్ .పెద్ది రఘు .పెద్ది పరిసరాములు .రాము అమర గొండ ప్రశాంత్. ప్రభుదాస్ పెద్దిరాజు .తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్.!

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్. జూనియర్ కాలేజీలో అత్యుత్తమ ఫలితాలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గల. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ సిరిసిల్ల .1. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనార్టీ విద్యార్థులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని అందులో భాగంగా. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో భాగంగా. Bush ra.kouser. కు.470.465. వచ్చాయని. అలాగే.నవిత.కు.470.460. సాధించారు.Bipc . విభాగం నందు. సంవత్సర. విభాగంలో నందిని. 440.గాను 431. అలాగే సన. సచ్చిరి నా. 440 ద్వితీయ సంవత్సరం విభాగంలో ఎంపీసీ.sodi ya.noushir.కి. 1000.కి గాను.895. సాధించారు మిగతా విద్యార్థులు1000.కి గాను.872. అలాగే. ఇంకో విద్యార్థి.1000. గాను.871. మార్కులు సాధించారు.Bpc . విభాగమునకు.J. స్నేహ కు.1000.గాను..982. మార్కులు మిగతా విద్యార్థికి 1000 కి గాను. 991. మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే ఉపాధ్యాయులు మాట్లాడుతూ మేము బోధించడం ఒకటైతే విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఇంకా ముందు ముందు ఫలితాలు సాధించాలని విద్యార్థులు ఇటువంటి ఫలితాలు సాధించడం మైనార్టీ పాఠశాలకు గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ.!

డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి ):

రాజన్న సిరిసిల్ల జిల్లాలో డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్.బి. గితె ఐపీఎస్ ప్రారంభించారు.అనంతరం డాడీస్ రోడ్ ఆప్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాపెల్లి రాజలింగం వాహనాలు నడిపే వారికి డాడీస్ రోడ్ ఆప్ స్టిక్కర్ ఎలా ఉపయోగపడుతుందో వివరణ ఇచ్చారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డాడీస్ రోడ్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు.వాహనాలకు “డాడీస్ రోడ్ ఆప్” క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఎనిమిది రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.ప్రమాద సందేశం, రక్త నిధి, పార్కింగ్ సమస్య, పత్రములు భద్రపరచుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక, లాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

SP launches

అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడటమే “డాడీస్ రోడ్ యాప్” ముఖ్య ఉద్దేశమని తెలిపారు.అనంతరం సూపరింటెండెంట్ పోలీస్ మహేష్ బి గితె ఐ.పీ.ఎస్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందని తెలిపారు.ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైన వైద్య సేవలు వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసిన అలర్ట్ మెసేజ్ వస్తుందన్నారు.ఇటువంటి యాప్ తయారు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.జిల్లా ప్రజలు అనుకోని ప్రమాదాల భారీ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ ఆప్ క్యూఆర్ స్టిక్కర్ ను వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గం డిస్ట్రిబ్యూటర్ ముప్పిడి గంగారెడ్డి డాడీస్ రోడ్ సభ్యులు పాల్గొన్నారు.

కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ.!

కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంస్థ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనాపాల శంకరయ్య కార్యనిర్వహణలో కాశ్మీరంలో జరిగిన ఉగ్ర చర్యను ఖండిస్తూ స్వర్గస్తులైన వారికి మౌనం పాటిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు. చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ కఠిన చర్యలు ఉగ్రవాదుల మీద గైకొనాలని ప్రభుత్వం నేడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండకూడదని పేర్కొన్నారు. డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా పోతున్నదని ఇలా అయితే శాంతికి విఘాతం కలుగుతుందని వాపోయారు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ స్వర్గస్తులైన వారికి సద్గతులు ప్రాప్తించాలని వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దొంత దేవదాస్ మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కాశ్మీరంలో శాంతిని నెలకొల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి.!

బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37వ వార్డులో మాజీ కౌన్సిలర్ రెడ్డి మాధవి రాజు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో డప్పు సప్పులతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికను అందించి కుటుంబ సమేతంగా తేది:27-4-24 ఆదివారం రోజున జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వేడుకల సందర్భంగా రజతోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. అంతే కాకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలు విని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినాయంగా వార్డు ప్రజలను కోరుతూ ఆహ్వాన పత్రిక అందించడం జరిగినది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాజా మాజీ చేనేత, జౌలి మరియు టెక్స్ టైల్స్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూర్ ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ రమేష్, 37.వ వార్డు బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,కూరపాటి భూమేష్, బూత్ అధ్యక్షులు వేముల తిరుపతి, మహిళా విభాగం వార్డు అధ్యక్షులు ముదారపు లలిత రాజేశం, కమిటీ సభ్యులు, ఎక్కల దేవి శ్యామల, గంగుల సదానందం, మచ్చ సురేష్, గాజుల ఎల్లయ్య, జిందం రాజేశం, బోద్దుల రమేష్, పచ్చనూరు తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్.!

ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్యంపై అవగాహన సదస్సు

నేటిధాత్రి వరంగల్:

ఎస్సార్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ భాగస్వామ్యంపై అవగాహన సదస్సు బుధవారం నాడు హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు, ఎస్సార్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం పార్టిసిపేటరీ రూరల్ అప్రజల్ గ్రామీణ విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం నుండి విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, కెవి కెఆర్ ఎడబ్ల్యూ డిపి కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. సోషల్ మ్యాపింగ్, వెన్ రేఖ చిత్రాలు వంటి వివిధ భాగస్వామ్య పద్ధతులను ఉపయోగించి భాగస్వామ్యంపై రైతులకు వివరించారు. అనంతరం స్థానిక సంఘంతో సమావేశమయ్యారు విద్యార్థులు. ఆ ప్రాంతంలో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి కీలక సమస్యలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ డాక్టర్ భూపాల్ రాజ్, ఆర్ ఎ డబ్ల్యూ ఏపీ కోఆర్డినేటర్ శ్రీకర్ రెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ మహేష్, కె వి కె ఆర్ ఏ డబ్ల్యు ఏపీ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్, మార్గదర్శకత్వంలో పాల్గొన్న విద్యార్థులు మీనుమోసెస్, ప్రణయ్, అభిషేక్, నవీన్, ఆలీ, రంజిత్, సాయిపవన్, రాజేష్, సమద్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ ఫలితాలలో అల్ఫోర్స్ ప్రభంజనం.

ఇంటర్ ఫలితాలలో అల్ఫోర్స్ ప్రభంజనం

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో బుర్ర.తేజశ్రీ 463 /470, జి.గౌతమి 456/470, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో శ్రావ్య 992/1000, దీపిక 992/1000, నిక్షిప్త 990/1000, రశ్మిత 988/1000, అనన్య 986/1000 మార్కులు సాధించారు.

 

chairman Narender Reddy

ఈసందర్భంగా కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి నాయక్ ను పరామర్శించిన కమలాకర్.!

 

తిరుపతి నాయక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, నేటిధాత్రి:

టిఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చింతకుంట మాజీ ఎంపీటీసీ, కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు కాలికి ఫ్రాక్చరయి గాయపడిన విషయం తెలుసుకొని వారి స్వగృహం శాంతినగర్ లో కలిసి పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈసందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమంలో భాగంగా తన కాళ్లకు అయినా గాయాన్ని సైతం లెక్కచేయకుండా రజతోత్సవ సభకు విజయవంతం అవ్వాలని తిరుపతి నాయక్ పడుతున్న తపనకు పార్టీ అధిష్టానం ముందు తప్పక మంచి గుర్తింపు ఇస్తుందని పార్టీ కోసం కష్టపడే వారిని కేసీఆర్ ఎప్పటికీ తమ యాదిలో ఉంచుకుంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తెలంగాణ (మోడల్) ఆదర్శ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. సిఈసి ప్రథమ సంవత్సరం ఫలితాల్లో భోగ శ్రీజ 494/500 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తెలియజేశారు. ఎంపిసి విభాగంలో పుట్ట హాసిని 448/470, అదరలేని వైష్ణవి 427/470, మ్యాడారం అంజనీ సామ్య 415/470, బైపిసి విభాగంలో ఎన్.జ్యోతి 389/440, జాడి హరిణి 350/440, గడ్డం నవ్య 342/440, సిఈసి మొదటి సంవత్సరంలో భోగ అర్చన 477/500, కూన రేణుక 462/500 మార్కులు, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపిసిలో కే.మహేశ్వరి 934/ 1000, ఎస్.సాయి ప్రణవి 896/1000, బైపిసిలో సిహెచ్.శ్రీవిద్య 893/1000, ఎమ్.ప్రణవి 829/1000, సిఈసిలో ఈ.కార్తిక్ 955/1000, కే.శ్రావణి 873/1000 మార్కులు సాధించి రామడుగు మోడల్ పాఠశాలను మండలంలో ముందు వరుసలో ఉంచారన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తో పాటు ఉపాధ్యాయుల బృందం, తదితరులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version