గౌడ కులంలో మెరిసిన ఆణిముత్యం
– కొడకండ్ల టీఎస్ ఆర్ జె సి కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కీర్తన విజయకేతనం
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు మంగళవారం విడుదలైన నేపథ్యంలో..జనగామ జిల్లా కొడకండ్ల టిఎస్ ఆర్ జె సి కళాశాల విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచారు. ఈ ఫలితాల్లో ప్రత్యేకంగా వెలుగులోకి వచ్చిన విద్యార్థిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామానికి చెందిన మాదారపు లావణ్య-రంజిత్ దంపతుల పెద్ద కుమార్తె మాదారపు కీర్తన 440 మార్కులకు గాను 435 మార్కులతో కళాశాల స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి విశేషమైన విజయాన్ని సాధించింది. కీర్తన విజయాన్ని పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు హర్షాతిరేకాలతో అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆమెను అభినందించారు.
కీర్తన స్పందన
ఈ ఫలితాన్ని సాధించడంలో మా టీచర్లు, స్నేహితులు, ముఖ్యంగా మా తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం ఎంతో కీలకమైనది. భవిష్యత్తులో కూడా ఇలానే కృషి చేసి, ఉన్నత విద్యలో అద్భుత ఫలితాలను సాధించడమే నా లక్ష్యం.
తల్లిదండ్రుల హర్షం:
మా అమ్మాయి ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన బాలికగా కీర్తన సాధించిన ఈ విజయం గౌడ కులస్తుల గౌరవాన్ని పెంచడమే కాక, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.