అమ్మమ్మ ఇంటికి వచ్చి… అనంత లోకాలకు వెళ్లే…
శోకసముద్రంలో మునిగిన శివశంకర్ కుటుంబ సభ్యులు
నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని గేటు పల్లిలో భూక్య శివశంకర్ వయసు (8) సంవత్సరాలు విద్యుత్ షాక్ తాకి మృత్యువాత వాత పడడంతో ఇ టు గెట్ పల్లి లో విశ్వనాధపురం లో విషాదం ఛాయలు అమ్ముకున్నాయి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన భూక్య నరేష్ కుమారుడు శివ శంకర్ తన అమ్మమ్మ అయినటువంటి బాధావత్ గొజి నివాసముంటున్న గేటు పల్లి గ్రామానికి వేసవి కాలం సెలవుల కోసం రావడంతో మంగళవారం సాయంత్రం గేటు పల్లి లోని భూక్య శంకర్ ఇంటి వద్ద శివశంకర్ ఆడుకుంటున్న సందర్భంలో శంకర్ ఇంటికి కరెంటు సప్లై రావడంతో అది గమనించని శివశంకర్ ఇంటికి సంబంధించిన మెట్ల కు ఉన్నటువంటి ఇనుప చువ్వలను పట్టుకోగా కరెంట్ షాక్ తగిలి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లాడని మృతుని తండ్రి భుక్య నరేష్ బోరున వినిపిస్తూ బుధవారం నెక్కొండ ఎస్సై మహేందర్ కు దరఖాస్తు ఇవ్వడంతో దరఖాస్తు స్వీకరించిన ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.