స్టేట్ రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి.!

స్టేట్ రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఎమ్మెల్యే మాణిక్ రావు సన్మానం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ మండల పరధిలోని శేఖాపూర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ – హుమెర గారి కుమారుడు
షేక్ అద్నాన్ సమీ ఇటీవలే విడుదలిన ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఎంపీసీ ~ 470 మార్కులకు 467 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన సందర్బంగా సన్మానం చేసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మాజి సర్పంచ్ చిన్న రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,గ్హౌస్ తదితరులు.

చేర్యాల కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు.

చేర్యాల కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు

చేర్యాల నేటిధాత్రి

 

చేర్యాల పట్టణంలో కోర్టు ఆవరణలో నిన్నటి రోజున కాశ్మీర్ లోయలో ఉగ్రవాద ముష్కరుల దాడి నీ ఖండిస్తూ ఈరోజు చేర్యాల కోర్టు జడ్జి కృష్ణ తేజ మరియు కోర్టు సిబ్బంది న్యాయవాదులు సంతాపం తెలియజేశారు

 

Lawyers

ఆ తర్వాత విధులు బహిష్కరించి న్యాయవాదులు ఉగ్రదాడికి నిరసనగా బైకు ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమం లో దాదాపు 30 మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు

 

Lawyers

సీనియర్ న్యాయవాది భూమి గారి మనోహర్ చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరేళ్ల వీర మల్లయ్య తాటికొండ ప్రణీత్ సురేష్ కృష్ణ కాటం సురేందర్ ఆరెల్లి మహేందర్ మెరుగు రమేష్ మోకు రాజిరెడ్డి ఏ సురేందర్ పర్వతం రాములు తదితరులు పాల్గొన్నారు

ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

కాశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాత్రి యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని ఐపీ గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. దాడులలో మృతి చెందిన వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న.!

శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న శిక్ష శిఖిరన్ని కమిటి చైర్మన్ రాజేశ్వరి సద్వినియోగం చేసుకోవాలన్నారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

వేసవి పిల్లల శిభిరం విద్యార్థులకు మంచి వరంలోఉందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుప్పానగర్ లో 24/04/2025 నుండి 14/05/2025 20 రోజులపాటలు స్వచ్చంద సంస్థ మయిన శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న శిక్ష శిఖిరన్ని అమ్మ అద పాఠశాలల కమిటి చైర్మన్ రాజేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ శిక్షణా శిఖరం విద్యార్థులకు వరం లాంటింది దీనిని అందరు విద్యార్ధులు సద్వనియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ శిభిరం నిర్వహకులు ఆయేషా సిద్దిఖీ శిభిరం కో ఆర్డినేటర్లు, రాంచెందర్, అశోక్ సి ఆర్ పి షఫీయుద్దీన్ & యోజ్బెన్, అంగన్ వాడి టీచర్. శక్తిమంతులు పాల్గొన్నారు.aa

హామీలు సరే…. వంతెన ఏదీ!

హామీలు సరే…. వంతెన ఏదీ!

గ్రామం నుండి మండలానికి పోవడానికి తప్పని అవస్థ

శాయంపేట నేటిధాత్రి:

 

ప్రభుత్వాలు పాలకులు మారిన ప్రతిసారి సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీలు గుప్పిస్తు న్నారు చివరకు వాటిని అమ లు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. శాయంపేట మండలం నుండి నేరేడుపల్లి గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంలో ఇచ్చిన హామీలు నేటికీ నీటి మూట గానే మిగిలిపోయాయి.

ప్రజలకు తిప్పలు

నేరేడుపల్లి గ్రామం నుండి ప్రజలు మండల కేంద్రానికి రావడానికి ప్రజలకు తిప్పలు బ్రిడ్జి నిర్మాణం చేస్తే మండల కేంద్రానికి రావడానికి సమయం తక్కువగా ఉంటుంది బస్సు సౌకర్యం కూడా కలిగే ఆస్కారం ఉంటుందని ప్రజలు అంటున్నారు అప్పటి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రామారెడ్డి సైతం సమస్య పరిష్కరించకుండా వంతెన ఏర్పాటు చర్యలు తీసుకుం టామని మాట ఇచ్చిన నీటి మట్టలాగే మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు శ్రీరామ రక్ష స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

Shayampet mandal

 

ఏదైనా పనిమీద మండల కేంద్రానికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. దీంతో అన్ని విధాల నష్టపోతున్నాం అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరువ తీసుకొని వంతెన త్వరిత గతిన నిర్మిస్తే ఇక్కట్లు తీరుతాయి.

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం

శాయంపేట మండలం నేరేడు పల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుంది. గ్రామం నుండి మండల కేంద్రానికి రావడానికి ప్రజల ఆర్థిక భారం పడాల్సి వస్తుంది. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ప్రజల కోరికను తీర్చాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాల పంచాయతీ ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ధ్యేయంగా ముందుకెళ్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అభివృద్ధి సంక్షే మాలు ప్రతి ఒక్క నిరుపేదకు అందించేలా చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరు తున్నారు.

పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల.!

పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బొచ్చు కోమల
యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్

పరకాల నేటిధాత్రి

పెహాల్గంలో ఉగ్రవాదుల చేతిలో చంపబడిన 26 మంది అమాయక పర్యాటకులపై దాడిని వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల తీవ్రంగాఖండించారు.ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ఆయన అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ మృతి చెందిన వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ దాడిలో గాయపడిన 20 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్తిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని,ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి,వారిని పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్ర వాద సంస్థలను సమూలంగా దేశంలో లేకుండా తుడిచివేయాలని,ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దేనని,ఉగ్రదాడుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని తస్కియా ఫైజా ప్రతిభ.

ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని తస్కియా ఫైజా ప్రతిభ.

-రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు, జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పట్టణానికి చెందిన తస్కియా ఫైజా, 2024-25 ఇంటర్మీడియట్ ఫలితాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించి జహీరాబాద్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. తస్కియా ఫైజా, జహీరాబాద్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో బైపిసి గ్రూప్లో చదువుతూ, 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆమె ఈ ర్యాంకుతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినిగా నిలిచింది. ప్రభుత్వ కళాశాలలో చదువుతూ, ఎటువంటి కోచింగ్ సెంటర్ సహాయంలేకుండా తన కష్టపడి సాధించిన ఈ విజయం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. తస్కియా ఫైజా అభినందనలు అర్షించింది. ఆమె తల్లిదండ్రులు, అధ్యాపకులు, సహ విద్యార్థులందరూ ఈ విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, జహీరాబాద్ విద్యా ప్రాంగణంలో విద్యా సంస్థల ప్రతినిధులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. “ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించగలరన్న సత్యాన్ని తస్కియా నిరూపించిందని అని వారు వ్యాఖ్యానించారు.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

జహీరాబాద్. నేటి ధాత్రి:

కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని వెళ్ళాలని కోరారు.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

జహీరాబాద్. నేటి ధాత్రి:

కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని వెళ్ళాలని కోరారు.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

జహీరాబాద్. నేటి ధాత్రి:

కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని వెళ్ళాలని కోరారు.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

జహీరాబాద్. నేటి ధాత్రి:

కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని వెళ్ళాలని కోరారు.aa

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

‘‘బిఆర్‌ఎస్‌’’ బలమేమిటో చూపిస్తాం!

రజతోత్సవ సభ కాంగ్రెస్‌, బిజేపిల గుండెలదిరేలా నిర్వహిస్తాం.

తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ వెంటనే వున్నారనేది రుజువు చేస్తాం.

‘‘బిఆర్‌ఎస్‌’’ పార్టీ రజతోత్సవ సభను కాంగ్రెస్‌, బిజేపిల గుండెలదిరిపోయేలా నిర్వహిస్తామంటున్న తెలంగాణ ఉద్యమ కారుడు, ఖైరతాబాద్‌ ‘‘బిఆర్‌ఎస్‌’’ ఇన్‌ చార్జ్‌ ‘‘మన్నె గోవర్ధన్‌ రెడ్డి’’, నేటిధాత్రి

ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో సభ సమయం దగ్గర పడుతున్న వేళ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…

`కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కసిగా వున్నారో వరంగల్‌ సభతో చూస్తారు.

`ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతుందో తెలుసుకుంటారు.

`ఏమరపాటు ఎంత నష్టం చేసిందో ప్రజలు తెలుసుకున్నారు.

`కేసిఆర్‌ ను దూరం చేసుకొని ఎంత మధనపడుతున్నారో చూస్తూనే వున్నారు.

`కేసిఆర్‌ కు తెలంగాణ మీద వున్న మమకారం మరెవ్వరికీ లేదు.

`కేసిఆర్‌ అంటేనే తెలంగాణ… తెలంగాణ అంటేనే కేసిఆర్‌.

`బిఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ మరింత పదిలంగా వుంది.

`టిఆర్‌ఎస్‌, బిఆర్‌ఎస్‌ వేరువేరు కాదు.

`కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు.

`తెలంగాణ ప్రజల్లో ఎవరికీ అపోహలు లేవు.

`కాంగ్రెస్‌, బిజేపి నాటకాలు ఇక చెల్లవు.

`ఇకపై తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ మాట తప్ప మరెవ్వరి మాట వినరు.

`తెలంగాణ ప్రజలంతా బిఆర్‌ఎస్‌ వైపే వున్నారు.

`ఇక భవిష్యత్తులో కాంగ్రెస్‌, బిజేపిలకు చీమకాలంత కూడా చోటుండదు.

`తెలంగాణ అంతా గులాబీ మయమే!

`మరో ఇరవై సంవత్సరాలు బిఆర్‌ఎస్‌ కు ఎదురుండదు.

`కేసిఆర్‌ నాయకత్వాన్ని ఢీ కొట్టే దమ్ము ఎవరికీ లేదు.

`రజతోత్సవ సభ ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

`జిల్లాల నుండి ఎడ్లబండ్లు కట్టుకొని లక్షలాది మంది రైతులు ఇప్పటికే బయలు దేరారు.

`ఇక కాంగ్రెస్‌ మీద రణమే..ఎన్నికల దాకా రణరంగమే!

                            హైదరాబాద్‌,నేటిధాత్రి:  

వాపును చూసి బలుపు అనుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి, లేని బలాన్ని అతిగా ఊహించుకుంటున్న బిజేపిలకు ఒకేసారి బిఆర్‌ఎస్‌ పార్టీ సత్తా ఏమిటో..తెలంగాణ జాతి పిత కేసిఆర్‌ బలమేమిటో వరంగల్‌ రజతోత్సవ సభతో నిరూపిస్తాం. ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా వచ్చేందుకు సిద్దమౌతున్నారు. కొన్ని జిల్లాల నుంచి రైతులు స్వచ్చంధంగా కొన్ని వేల మంది రైతులుఎడ్ల బండ్ల ద్వారా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు హజరై బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. చిన్న ఏమరపాటు చేసిన పొరపాటు వల్ల తెలంగాణ రైతాంగం ఎంత ఆగమైందో స్వయంగా రైతులే వరంగల్‌ సభకు హజరైన చెప్పాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభను కాంగ్రెస్‌,బిజేపి పార్టీల గుండెలదరిలా నిర్వహిస్తామని ఖైరతాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, తెలంగాణ ఉద్యమ కారుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మన్నెగోవర్ధన్‌రెడ్డి , నేటి ధాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రజతోత్సవ సభ సమయం దగ్గర పడుతున్న వేళ, అందిస్తున్న సమాచారం ఆయనమాటల్లోనే…

దేశ రాజకీయాల్లోనే బిఆర్‌ఎస్‌ది ఒక గొప్ప చరిత్ర. అటు ఉద్యమ చరిత్ర, ఇటు రాజకీయ చరిత్ర రెండూ కలిసిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. అందుకే తెలంగాణ ప్రజల్లో నిండి వుంది. ఆ బలమేమిటో, ప్రజల గుండెల్లో కేసిఆర్‌ స్ధానమేమిటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే రోజు దగ్గర్లోనే వుంది. తెలంగాణ ప్రజలంతా కేసిఆర్‌ నాయత్వమే కావాలని బలంగా ఎంత కోరుకుంటున్నారో మూడు రోజుల్లో ప్రపంచం చూస్తుంది. బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందని లేనిపోని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ స్ధానం తెలంగాణలో ఎక్కడుతో తేలుతుంది. పది నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరుగబాటు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరిసిస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వాన్ని తిట్టనన్ని తిట్లు, ప్రజలు కాంగ్రెస్‌ ఫ్రభుత్వాన్ని తిడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే కేసిఆర్‌ పాలనలో అందిన సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడారు. రైతు బందుకు రాం..రాం చెప్పారు. దళిత బంధుకు ఎగనాం పెట్టారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దిక్కులు చూస్తున్నారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలనువేధిస్తున్నారు. ప్రజలను గోసూ పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రాపేరిట జరుగుతున్న దౌర్జన్యంతో ప్రజలు ఉపాదికోల్పోతున్నారు. ముప్పై ఏళ్ల క్రితం, నలభై ఏళ్ల క్రితం కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తున్నారు. వారికి గూడులేకుండా తరిమేస్తున్నారు. బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తున్నారు. రాత్రికి రాత్రి సామాన్యుల జీవితాల్లో కాళ రాత్రులు నింపుతున్నారు. వారి జీవితాలను బజారున పడేస్తున్నారు. ప్రజలను ఆగమాగం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కసిగా వున్నారో వరంగల్‌ సభ ద్వారా తేలిపోనున్నది. ప్రజల ఆసక్తిని చూస్తుంటే గతంలో వరంగల్‌లో జరిగిన మహాగర్జనను మించి సభ జరుగుతుందనిపిస్తోంది. సభలు అంటేనే బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలను అదిగమించిన సభలు ఏ పార్టీకి ఇప్పటి వరకు సాద్యం కాలేదు. ప్రజల్లో వున్న ఆదరణ ఎంత గొప్పదో బిఆర్‌ఎస్‌ పార్టీకి తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే బిఆర్‌ఎస్‌ సభలు అంటేనే ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఎప్పుడూ వస్తారు. ఆ మధ్య జరిగిన కొంగరకలాన్‌ సభను చూసే కాంగ్రెస్‌, బిజేపిల గుండెలు బెదిరిపోయాయి. ఇప్పుడు వరంగల్‌ రజతోత్సవ సభను చూసి ఆ రెండు పార్టీలు అదిరిపోవాల్సిందే.. కేసిఆర్‌ను దూరుం చేసుకొని ప్రజలు మధనడుతున్నారు. సాఫీగా సాగుతున్న పాలనను కాదకున్నందకు నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారిని పట్టుకొని ఏడుస్తున్నారు. మళ్లీ మా కేసిఆర్‌ పాలన కావాలని కోరతున్నారు. ఇకపై మళ్లీ కాంగ్రెస్‌ను నమ్మే ప్రసక్తి లేదంటున్నారు. సందిట్లో సడేమియాలాగా ఒంటె పెదవుల కోసం నక్క ఆశపడినట్లు బిజేపి ఆశపడుతోంది. కాంగ్రెస్‌ అడినట్లే ఒక్క అవకాశంటూ జనం ముందుకు వస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలి. ఇప్పటికే తెలంగాణ మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్లింది. మరోసారి పొరపాటు చేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఎనమది మంది బిజేపి ఎంపిలను తెలంగాణ ప్రజలు గెలిపస్తే కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలేదు. అలాంటి పార్టీని నమ్మితే మళ్లీ మోసపోతామని ప్రజలే అంటున్నారు. ఆ రెండు పార్టీల నాయకులను దగ్గరకు కూడా రాన్విడం లేదు. ఎందుకంటే కేసిఆర్‌..కేసిఆరే…ఆయనకు వున్న ఆత్మ మరేపార్టీకి లేదు. మరే పార్టీ నాయకులకు వుండదు. ఎందుకంటే తెలంగాణను కేసిఆర్‌ పద్నాలుగేళ్లు కొట్లాడి తెచ్చారు. కేసిఆర్‌ చేసిన త్యాగ ఫలితమే తెలంగాణ. కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు. వచ్చేదే కాదు. ప్రజల తెలంగాణ కల కలగానే మిగిలిపోయేది. తెలంగాణ మరింత ఆగమయ్యేది. తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణీ పౌరులుగానే మిగిలిపోయేవారు. తెలంగాణ మరింత ఎడారిగా మారిపోయేది. పల్లెల ఆకృతిమరింత క్షీణించేది. తెలంగాణలో రైతులు అనిచెప్పుకునేవారు లేకుండాపోయేవారు. ఎందుకంటే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ హాయంలో తెలంగాణ రైతులు ఎంతో మంది అప్పార్టుమెంట్లలో వాచ్‌ మెన్‌లుగా పనిచేశారు. యాభై ఎకరాలున్న రైతులు కూడా ఏటిఎంల మందు, ఇతర షపుల ముందు వాచ్‌మెన్‌ పనులు చేశారు. తెలంగాణ పల్లెల్లో ఎంతో గౌరవంగా బతికిన రైతు కూడా హైదరాబాద్‌ వచ్చి హోటళ్లలో పనిచేసిన వాళ్లు కొన్ని వేల మంది వున్నారు. మరి కొంత మంది సాగుమీద ఆశతో, వ్యవసాయం మానుకోలేక, భూమిని అమ్ముకోలేక నష్టాలను, కష్టాలను ఓర్చుకుంటూ, ఏటా అప్పులు చేస్తూ కష్టాల సాగు చేశారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు వేయించి, అప్పుల పాలయ్యారు. వాటిని తీర్చుకునేందుకు హైదరాబాద్‌లో కూలీలుగా మారిపోయారు. మరి కొందరు బొంబాయి, షోలాపూర్‌, పూన వంటి నగరాలకు పొట్ల చేత్తో పట్టుకొని వలసలు పోయేవారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి మహారాష్ట్రలకు నిత్యం బస్సుల్లో వందల సంఖ్యలో వలసలుపోయిన రోజులు వున్నాయి. కాని కేసిఆర్‌ తెలంగాణ తేవడంతోనే దశ మారింది. రైతుల జీవితాల్లో వెలుగులొచ్చాయి. వలసలు పోయిన లక్షలాది మంది రైతులు మళ్లీ తమ తమ పల్లెలకు చేరుకున్నారు. దశబ్ధాల తరబడి వదిలేసిన భూములను మళ్లీ సాగుయోగ్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ పాలనకు వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటలు కరంటు వస్తుందని తెలిసి తెలంగాణ సంబురాలుచేసుకున్నారు. తెలంగాణలోని చెరువులన్నీ నింపుతున్నారని తెలిసి, బతపోయిన రైతులంతా మళ్లీ పల్లెలు చేరుకున్నారు. పాడుబడిపోయిన బావుల్లో కూడా నీటి ఊటలు జలపాతాల్లా వస్తుంటే చూసి ఆనందంతో గంతేలేశారు. మళ్లీ తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతికే రోజులు చూసి మరిసిపోయారు. సాగు వాటు కోసం ఏ షావుకారు దగ్గరకో, అప్పులు ఇచ్చేవారినో బతిమిలాడుకునే పరిస్దితి లేకుండా కేసిఆర్‌ రైతుబంధు ఇచ్చారు. దాంతో రైతుల్లో ఎంతో ధైర్యం పెరిగింది. మనకు ఏమైనా సరే కేసిఆర్‌ చూసుకుంటారన్న నమ్మకంతెలంగాణ రైతుల్లో వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో పండిన పంటను కొనాలంటే దళారులు, మధ్య వర్తులు, మిల్లర్లు లేనిపోని కొర్రీలు పెట్టేవారు. ఎంత మంది వడ్లనైనా అడ్డికిపావు శేరుకు కొనుక్కునేవారు. డబ్బులకు తిప్పించుకునేవారు. కాని కేసిఆర్‌ వచ్చిన తర్వాత వడ్లలలో పెళ్లలలున్నా, ఒడిపిల్లున్నా, వడ్లు తడిసినా, రంగు మారినా, మొలకలు వచ్చినా సరే ప్రభుత్వమే నేరుగా రైతులను వడ్లు కొనుగోలు చేసింది. రైతులునష్టపోకుండా కేసిఆర్‌ కాపాడారు. దాంతో పదేళ్ల కాలంలో ఏనాడు రైతునష్టపోయింది లేదు. దళారుల చేత కాకుండా, రైతులకు ప్రభుత్వమే నేరుగా బ్యాంకు అకౌంట్లలో వడ్ల సొమ్ము వేసేది. దాంతో రైతుకు రూపాయి కూడా నష్టం జరిగేది కాదు. ప్రభుత్వమే మహిళా సంఘాల ద్వారా ఐకేపి సెంటర్లు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయడం అన్నది దేశంలో ఎక్కడా లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే వుండేది. దాంతో తెలంగాణలో పండిన వడ్లే కాకుండా, ఇతర రాష్ట్రాల రైతులు కూడా తెలంగాణకు వచ్చి, మ్ముకున్నారు. లాభపడ్డారు. రైతు బాంధువుడుగా కేసిఆర్‌ పేరు తెచ్చుకున్నారు.

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను.!

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని. వర్షకొండ ఇబ్రహీంపట్నం, కేశవాపూర్ ,ఎర్రపూర్, గోధుర్, కోమటి కొండాపూర్ రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురు గాలులకు నువ్వుల పంట, సజ్జ ,వరి పంటలు, మొక్కజొన్న ,మామిడి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే, పలువురు గుడిసెలు సైతం దెబ్బతిన్నాయని పంటలు నేలవాలయని నష్టపోయిన రైతులను పరామర్శించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్లా నియోజకవర్గ టిడిపి సభ్యులు రాజ గణేష్ ,కోరుట్ల పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు మహదేవ్, ఇర్నాల గంగులు ,శ్రీనివాస్ ,బాలే మారుతి రైతులు రాములు ,మల్లయ్య, లచ్చయ్య, దయాకర్, లక్ష్మణ్ ,పెద్ది నరసయ్య ,రాజేశ్వర్, గంగాధర్, భాగ్యలక్ష్మి, చిన్న భూమయ్య, వెంకటి, నర్సారెడ్డి ,విజయ, రాజలింగం ,భూమన్న ,మురళి ,పెద్ద భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ఆరుముల్ల ఎల్ల స్వామి కుమార్తె అరుణ్ జ్యోతి కిషోరల వివాహ మహోత్సవానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యేగండ్రసత్యనారాయణరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక.!

వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల వెలుగు సమాఖ్య పాలకవర్గ సభ్యుల ఎన్నిక కార్యదర్శి కొండ్ర శోభ సమక్షంలో నిర్వహించారు. బాగా నూతన అధ్యక్షురాలుగా రంగాపురం గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు కొలిపాక రమాదేవి, కార్యదర్శిగా పర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు రేళ్ల సునీత, కోశాధికారిగా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన నాయకురాలు బత్తిని శిరీష లను నియమించినట్లు ఏపిఎం రవివర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ సంఘాల నుండి వచ్చిన ప్రతినిధులు, సీసీలు గాజుల బాబురావు, బత్తిని ప్రవీణ్, మహిళా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో .!

జిల్లా పరిషత్ పాఠశాలలో
తల్లిదండ్రులు ఉపాద్యాయుల సమావేశానికి హాజరైన ఎస్సై దీకొండ రమేష్

ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

 

ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన తల్లి దండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా పోత్కపల్లి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ధీకొండ రమేష్ హాజరయ్యారు.2024-25 విద్యాసంవత్సరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు జారీ చేసిన ఓదెల యం ఈ ఓ Y. రమేష్ ఈ సందర్భంగా SI రమేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు జాగ్రత్త గా ఉండాలని ఈత కోసం వెళ్లి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది అని, మొబైల్ ఫోన్లను వాడే క్రమం లో ఆన్లైన్లో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని. విద్యార్థినులు ఫేస్ బుక్,వాట్సాప్,ఇన్స్తా గ్రామ్ లలో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ ఆన్లైన్ గేమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని,చిన్న పిల్లలకు బైక్ లు మొదలైన వి డ్రైవింగ్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని అన్నారు.ఓదెల MEO మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు చదవడం రాయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పై తరగతులకు చెందిన తెలుగు,హిందీ పుస్తకాలు విద్యార్థులకు అందించి వాటిని తిరిగి పాఠశాల ప్రారంభం నాటికి వాటిని చదవడం రాయడం చేస్తూ భాష పట్ల ప్రావీణ్యం పెంచుకోవాలని, ప్రమాదాల వైపు పోకుండా తల్లి దండ్రుల సంరక్షణలో ఉండాలని కోరారు.2024-25 విద్యాసంవత్సరం FLN లో ఓదెల మండలం యం ఈ ఓ సమర్ధ వంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఓదెల 3వ స్థానం లో నిలిపినందుకు డి ఈ ఓ చేతుల మీదుగా ప్రశంస అందుకున్న యం ఈ ఓ కు గ్రామస్తులు విద్యార్థుల తల్లి దండ్రులు శాలువాతో సన్మానం చేశారు.ఈ సమావేశం లో కనగర్తి మాజీ సర్పంచ్ తాళ్లపల్లో లక్ష్మణ్ , కొట్టిరెడ్డి మహేందర్ రెడ్డి ,మాజీ వార్డు సభ్యులు తాళ్లపెల్లి శ్రీనివాస్ ,జాగిరి కిషోర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిండ్రులు పాల్గొన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్.!

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఎస్.వి.కన్వెన్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన పస్తాపూర్ గ్రామం పట్నం అశోక్ రెడ్డి కుమార్తె వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వెడుకల్లో క్రిష్ణారెడ్డి, సి.యం. మాణిక్ రెడ్డి,చెంగల్ జైపాల్, సి.యం.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి.!

నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి???
స్థానిక ఎలక్షన్స్ రాకముందే వేడెక్కుతున్న రాజకీయాలు
కక్కిరాల పల్లిలో మళ్ళీ మారిన రాజకీయం
మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో తిరిగి చేరికలు
కక్కిరాలపల్లి గ్రామంలో రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక..

నేటిధాత్రి ఐనవోలు :

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐనవోలు మండలంలోని బీఆర్ఎస్ బిజెపి నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయము అందరికి తెలిసిందే.మంగళవారం రోజు అధికార పార్టీ నుంచి కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు గతంలో పార్టీలో పనిచేసిన కార్యకర్తలుకక్కిరాలపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కండవు కప్పుకున్న నాయకులు కార్యకర్తలు తిరిగి మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేష్ ఆధ్వర్యంలో బుధవారం అధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దని అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని. కె ఆర్ నాగరాజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ బిజెపి నాయకులు చెప్పిన మాటలు విని ఆగమాగం కావద్దని అధికార పార్టీతోనే అన్ని సాధ్యమైతాయని ప్రతి కార్యకర్తను ఎమ్మెల్యే కంటికి రెప్పలా కాపాడుకుంటాడని పార్టీలో చేరిన వారికి ఈ సందర్భంగా మహేష్ గౌడ్ తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారిలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు పొన్నం గోపాల్. బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కంజర్ల సురేష్ మాజీవార్డు మెంబర్ కంజర్ల అశోక్ బీఆర్ఎస్ నాయకులు కంజర్ల మధుకర్ కత్తెర శాల రమేష్ అరుణ, బర్ల సుమలత రాజు, అరూరి లలిత, అరూరి పూలమ్మ, రావుల సాంబయ్య, కంజర్ల మమత, కంజర్ల యాకమ్మ, అన్నెపు రాజు,నూనె రాజ్ కుమార్, పిట్టల యాదమ్మ, నాయిని శ్రీను మరియు నూనె రాజు తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

ఘనంగా చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు.!

ఘనంగా.. చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు

జడ్చర్ల / నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దయపల్లి చౌరస్తాలో బుధవారం రాజపూర్ మండలంలోని దొండ్లపల్లి మాజీ ఎంపీటీసీ.. చొక్కంపేట గ్రామానికి చెందిన చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమన్యు రెడ్డికి గజమాలతో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. రాజాపూర్, బాలానగర్ ప్రభుత్వ పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్తున్న..40 మంది గిరిజన విద్యార్థులకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం.!

ఘనంగా.. ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం

హన్వాడ /నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్రామంలో శివ సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా ప్రతిష్టించిన ధ్వజస్థంభం ప్రతిష్ట మహోత్సవానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే యజ్ఞశాలలో ముందుగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుడిని ఎమ్మెల్యే కోరారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, టంకర కృష్ణయ్య, నాయకులు మండల బిసి సెల్ చైర్మన్ పాశం సత్యయ్య, కేశవులు , అక్కపల్లి నర్సింహులు, మోహన్, పార్పల్లి మోహన్, కృష్ణయ్య, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.!

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్(జంగుపల్లి), గొల్లపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అదేవిధంగా, గత ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇలాంటి అనేక హామీలను ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఇంతకీ ఇరవై ఐదేళ్ల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా? తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా? అని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ఎమ్మార్వో ఎంపీడీవో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

స్టెరాయిడ్స్ వాడొద్దు.. నార్కోటిక్ పోలీసుల హెచ్చరిక.!

స్టెరాయిడ్స్ వాడొద్దు.. నార్కోటిక్ పోలీసుల హెచ్చరిక

*స్టెరాయిడ్స్ పై జిమ్ సెంటర్ నిర్వాహకులకు, వరంగల్
నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.*

వరంగల్, నేటిధాత్రి:

 

తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు, ఎస్పీ రూపేష్ ఐపీఎస్ పర్యవేక్షణలో, 23 ఏప్రియల్ బుధవారం నాడు నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, వరంగల్ నందు హన్మకొండ, వరంగల్ పట్టణ పరిధిలోని జిమ్ ఓనర్స్ అలాగే జిమ్ కోచ్‌లకు మాదకద్రవ్యాలు మరియు సింథటిక్ ఇంజేక్షన్స్, స్టెరాయిడ్స్ కు సంబంధించి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎవరైనా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే చట్టరీత్య చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు వరంగల్ నార్కోటిక్ పోలీసులు. ఈ సదస్సులో జిమ్‌ సెంటర్ల రికార్డుల నిర్వహణ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల కొనుగోలు, అమ్మకం, రవాణా, వాడకంపై ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. జిమ్ కు వచ్చిన కస్టమర్ల ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డుల సేకరణ, జిమ్‌లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగానే నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేయబడిందని వారికి వివరించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు నార్కోటిక్స్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిని నిరోధించడం ప్రతీ పౌరుడి బాధ్యత అని తెలిపారు. మన రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుండి రక్షించేందుకు ప్రతి ఒక్కరు కలసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఎవరైనా గంజాయి మరియు డ్రగ్స్ కి సంభందించిన అమ్మకాలు, కొనుగోలు, త్రాగే వారి వివరాలు తెలిసినచో, టోల్ ఫ్రీ నంబర్ 1908, టిజిఎన్ఏబి కంట్రోల్ రూమ్ నంబర్: 8712671111 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అని తెలిపారు. ఈ సమావేశంలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కె. సైదులు, ఇన్స్పెక్టర్ బి. రవిందర్ , మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోపి, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు, నార్కోటిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version