వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల వెలుగు సమాఖ్య పాలకవర్గ సభ్యుల ఎన్నిక కార్యదర్శి కొండ్ర శోభ సమక్షంలో నిర్వహించారు. బాగా నూతన అధ్యక్షురాలుగా రంగాపురం గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు కొలిపాక రమాదేవి, కార్యదర్శిగా పర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు రేళ్ల సునీత, కోశాధికారిగా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన నాయకురాలు బత్తిని శిరీష లను నియమించినట్లు ఏపిఎం రవివర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ సంఘాల నుండి వచ్చిన ప్రతినిధులు, సీసీలు గాజుల బాబురావు, బత్తిని ప్రవీణ్, మహిళా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.
వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక.!
