25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో వెలుగు ప్రాజెక్టు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్వర్ణభారతి మండల సమాఖ్య వ్యవస్థాపక పాలక వర్గం అధ్యక్షులు చెలమల్ల సంధ్యారాణి కార్యదర్శి ఎండీ రజియా కోశాధికారి సంపెల్లి సరస్వతి గారలను శాలువ షీల్డ్ తో సన్మానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డి ఆర్ డి ఓ బాలకృష్ణ డీపీఎం సోమయ్య సీసీ లు ఇమామ్ బాబా మండలం లో ని అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి మండల సమైక్య పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేశారు.

వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక.!

వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల వెలుగు సమాఖ్య పాలకవర్గ సభ్యుల ఎన్నిక కార్యదర్శి కొండ్ర శోభ సమక్షంలో నిర్వహించారు. బాగా నూతన అధ్యక్షురాలుగా రంగాపురం గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు కొలిపాక రమాదేవి, కార్యదర్శిగా పర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు రేళ్ల సునీత, కోశాధికారిగా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన నాయకురాలు బత్తిని శిరీష లను నియమించినట్లు ఏపిఎం రవివర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ సంఘాల నుండి వచ్చిన ప్రతినిధులు, సీసీలు గాజుల బాబురావు, బత్తిని ప్రవీణ్, మహిళా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..

రామాయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version