శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్.

శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్

నేటి ధాత్రి కథలాపూర్

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్ నుండి మండలానికి వచ్చిన బోర్ బావిలను ఈరోజు రెండు గ్రామాల్లో సిరికొండ,కథలాపూర్ లో కొబ్బరికాయ కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,బద్రి సత్యం,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్,కాసోజీ ప్రతాప్,గాందారి శ్రీనివాస్, తెడ్డు మహేష్,సునీల్,జీవన్ రెడ్డి,ప్రసాద్,భూమేష్,శ్రీనివాస్, ప్రమోద్,శ్రీకర్,రాకేష్,రాజారెడ్డి,గంగామల్లయ్య ఉన్నారు.

క్యాంటిన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి.

ఇందిరా మహిళాశక్తి క్యాంటిన్ ను ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

మహిళలను కోటీశ్వరురాళ్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని మెప్మా విభాగం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మాతృ దీవెన క్యాంటీన్ ను మెప్మా మహిళా స్వశక్తి భవనం ఆవరణలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని,ప్రతి రంగంలో మహిళలు ముందుండి ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని అందుకు తన సహాయ సహకారాలు అహర్నిశలు అందిస్తానని,ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

MLA

క్యాంటీన్ నిర్వహకురాలైన గోవిందు సంతోషమ్మ మరియు వారి టీం సభ్యులందరినీ కూడా ఎమ్మెల్యే అభినందించారు.మెప్మా విభాగం సిబ్బందిని ప్రియదర్శిని పట్టణ సమాఖ్య అధ్యక్షులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ కె.నారాయణ,ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు,తహసీల్దార్ ఏ. విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేష్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుష్మా సబ్ రిజిస్ట్రార్ డి సృజన్ కుమార్,సిఐ క్రాంతికుమార్,మెప్మా డీఎంసీ యం.రజితా రాణి,మెప్మా పరకాల టీఎంసీ తడుగుల సతీష్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, మెప్మా ప్రియదర్శిని ల,పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు సరిత, రుక్మిణి ల,అమరావతి, పరంజ్యోతి,సాంబయ్య, గోవిందు కుమార్,మెప్మా ఆర్పీలు,ఎస్ఎస్జి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలు..

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలు

-కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి :

 

కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని కాంగ్రెస్ పార్టీ మొట్లపల్లి గ్రామ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ ఒక కుడి భుజం లాంటిదని, కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని, పార్టీకి యూత్ సేవలు కీలకమని ఈ సందర్భంగా అభివర్ణించారు. ఏఐసీసీ నుంచి మండల కమిటీ వరకు ఏ పిలుపు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొని, పార్టీ కార్యకలాపాలలో ముందుండి పార్టీని నడిపించే విధంగా యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుండాలని ఆయన యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కేంద్రంలోని కూడలి వద్ద వెనుకబడిన వర్గాల అభ్యున్న తకై అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల బానిస బతుకుల నుంచి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు మన భారత దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలు మరవలేవనని గ్రామస్థాయి నుంచి నేటి యువత మహాత్మజ్యోతి రావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అరికెల దేవయ్య, ముక్కెర ముఖేష్, తుడుం వెంకటేష్, గజ్జి రమేష్ కొమ్ముల తిరుపతి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు, పాపయ్య, ప్రసాద్, ఎమ్మార్పీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి.

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం ఝరాసంగం మండలం చిలేపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలు తన పని ముగించుకొని రాత్రి ఆటోలో జహీరాబాద్ నుండి తన స్వగ్రామమైన చిలేపల్లి కి వస్తున్న క్రమంలో పస్తాపూర్ గ్రామ సమీపంలో గల బ్రిడ్జి వద్ద ఆటో ఎదురుగ వస్తున్న డీసీఎం తో ఆటో అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.

Road accident

 

ఈ దూర్ఘటనలో చిలేపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలలోనే మృతి చెందాగా, డ్రైవర్‌ కు గాయాలు కావడతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్‌ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని పరిస్థితుల్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన నర్సింలు కు, సింధు (5), స్వాతి (3) సంవత్సరల ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలిపారు.

నవత ఆటో యూనియన్ చలివేంద్రం ఏర్పాటు.

నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముఖ్య అతిథిలుగా హాజరైన ఎస్ఐ మహేందర్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి నేటి ధాత్రి:

 

 

#నెక్కొండ , నేటి ధాత్రి: మండలంలోని అంబేద్కర్ కూడలిలో నెక్కొండ నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం నెక్కొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు సురేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ ఎస్ఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చలివేంద్రం ను ప్రారంభించారు ఈ సందర్భంగా టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా ప్రయాణికులకు త్రాగునీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, గంధం సుధాకర్, నవత ఆటో యూనియన్ సభ్యులు శ్రీరంగం శ్రీనివాస్, పొదిల సురేష్, వాగ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

మా భూమి రధయాత్ర ను విజయవంతం చేయండి.

ఒకలక్ష కిలోమీటర్ల మా భూమి రధయాత్ర ను విజయవంతం చేయండి

ధర్మసమాజ్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు నాగ మహారాజ్ నేటి ధాత్రి:

 

 

పరకాల నేటిధాత్రి మండలంలోని బీసీ,ఎస్సీ,ఎస్టీల హక్కులు మరియు రాజ్యాధికార సాధన జేఏసీ,ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ డైట్ కాలేజీ గ్రౌండ్లో డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టబోయే ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.ఈ కసందర్బంగా పరకాల మండల అధ్యక్షులు నాగరాజు మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం ప్రజలైన బీసీ,ఎస్సీ,ఎస్టీలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని అందిస్తూ ఈ దేశంలోనే ఎవరూ ఇంతవరకు చేయని సాహసోపేతమైన ఒక లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర అంతర్లీనంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తూ వీరిని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అధిక సంఖ్యలో వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు,ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్,సూర్యం,ప్రవీణ్, ప్రభాస్,సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.

చెత్తను తొలగించండి సారూ..!

చెత్తను తొలగించండి సారూ..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ పరిధి రంజోల్ గ్రామంలోని 4 పోస్ట్ ఆఫీస్ ముందు రోడ్డు ఎంట్రన్స్ నుంచి నక్షత్ర వెంచర్ మధ్యలో ఉన్న మురికి రోడ్డుపైకి రావడంతో కాలనీ ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తీసివేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ సిబ్బందికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం రసూల్ పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్. కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు కోవాల్సిన పోషకాహారం గురించి పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం గురించి వివరించారు.గర్భిణీ స్త్రీలలో రక్తహీనత రాకుండా ఉండాలంటే తాజా కూరగాయలు,పండ్లు ఆకుకూరలు,చిరుధాన్యాలు,పాలు సమృద్ధిగా తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు చిరు ధాన్యాలను వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని తెలియజేశారు.పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టొద్దని ఇంట్లో తయారుచేసిన పౌష్టికాహారం మాత్రమే పెట్టాలని సూచించడం జరిగింది.ఇందులో భాగంగా అక్షరాభ్యాసం,సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మల,ఆయా,గర్భిణీలు బాలింతలు,పిల్లల తల్లి తండ్రులు,ఇతరులు పాల్గొనడం జరిగింది.                           

ఫూలే ఆశయాలను కొనసాగిస్తాం.

ఫూలే ఆశయాలను కొనసాగిస్తాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

 

మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం, పద్మావతి కాలనీ లోని గ్రీన్ బెల్ట్ లో గల ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంట్లో ఒక్క మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో మొత్తం విద్యావంతులు తయారు అవుతారని నమ్మిన వ్యక్తి ఫూలే గారని ఆయన చెప్పారు. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలని తన సొంత డబ్బులతో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా మన పిల్లలకు విద్యను అందించారని, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని భావించారని ఎమ్మెల్యే తెలిపారు. విద్య మీద ప్రజా ప్రభుత్వం దృష్టి పెట్టిందంటే దానికి స్ఫూర్తి జ్యోతిబాపూలే గారే అన్నారు. ఆ రోజు బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలంలోనే చదువు అంటే ఎవరికి తెలియని సమయంలో మన పిల్లలు చదువుకోవాలని, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించిన ఘనత ఫూలే అన్నారు. బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని చెప్పి, మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఒప్పించిన ఘనత మహాత్మ జ్యోతిబాపూలే చేశారని, కొన్ని లక్షల మంది మేధావులను తయారు చేసే ఆలోచన విధానానికి రూపకల్పన చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర బోయి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నల ఆవేదన.

ఈదురు గాలుల బీభ త్సవం.. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నల ఆవేదన

పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో ఈదురు గాలుల బీభత్సానికి కోతకు వచ్చే దశలో మొక్కజొన్న నేలకొరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి .

 

farmeres

ఈదురు గాలులతో 100 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న రాత్రి వచ్చినటువంటి గాలి బీభత్సం వల్ల తండా గ్రామ రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారితో చెప్పగానే వెంటనే రైతుల పొలం కాడికి నేరుగా వచ్చి పరిశీలించి రిపోర్టు రాసుకొని రైతులకు తగిన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది రైతులు చాలా ఆనందంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరడమైనది.

దళిత బంధు లబ్ధిదారులకు నిధులను విడుదల చేయాలి.

రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు తక్షణమే నిధులను విడుదల చేయాలి

ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ ఏకు కార్తీక్

పరకాల నేటిధాత్రి

 

గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు తక్షణమే నిధులను విడుదల చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ ఏకు కార్తీక్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఇంతవరకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధం అనే పథకాన్ని ప్రవేశపెట్టి చాలామంది దళితుల జీవితాలలో వెలుగును నింపాయి అలాగే రెండవ విడతలో లబ్ధిదారుల యూనిట్ల ఎంపిక చేసే బాధ్యత గ్రామపంచాయతీలో కార్యదర్శులకు నగర పంచాయతీలో కమిషనర్ కి ఇవ్వడం జరిగిందన్నారు.వారు కూడా సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు యూనిట్ల ఎంపికను పూర్తి చేసి అకౌంట్లు కూడా తీయడం జరిగింది అప్పటి ప్రభుత్వం నిధులను విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం జరిగిందని,ప్రభుత్వం మారడం వలన నిధుల విడుదలను జాప్యం జరుగుతుంది నిధులను విడుదల చేయాలని గత 14 నెలల నుంచి రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మా నిధులను మాకు ఇవ్వాలని అడిగిన ప్రతిసారి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదని ఇప్పటినుండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని దళిత బంధు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెబుదామని అన్నారు.ఈ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే పేరుతో దళిత బంద్ అనే పథకాన్ని తొక్కి పెట్టాలని చూస్తుందని ఇది ముమ్మాటికీ దళితులను మభ్య పెట్టాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రని రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు దళితుల ఐక్యతను మీరు చూస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సమానత్వం కోసం కృషి చేసిన విప్లవ జ్యోతి పూలే.

సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన విప్లవ జ్యోతి పూలే.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే
198 వ జయంతి* వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఆ మహానీయుని చిత్ర పటానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ లు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే 11 ఏప్రిల్ 1827 న జన్మించాడని, మరియు షనవంబర్ 28, 1890 న మరణించారని* తెలిపారు . ఆయన బ్రతికినంత కాలం సామాజిక సమానత్వం కోసం పోరాడారని, బాల్యంలో అనుభవించిన దుర్బర జీవితం 19 వ శతాబ్దపు చీకటి రోజుల్లో బ్రాహ్మణీయ కులతత్వపు కోరల్లో చిక్కి శల్యమై పోతున్నా అణగారిన వర్గాలలో కుల నిర్మూలన దృక్పథాన్ని బోధించి అగ్రకులాల దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల ప్రజలను సామాజిక విప్లవం దిశగా మేల్కొలిపిన తొలి సామాజిక విప్లవ చైతన్య స్ఫూర్తి మహాత్మా జ్యోతి రావు పూలే అని కొనియాడారు. మన భారత దేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి* మొదటగా అంకురార్పణ చేసిన మహానీయుడు జ్యోతి రావు పూలేని తెలిపారు. మొట్టమొదటి సారి స్త్రీలకు పాఠశాలలను నెలకొల్పి తప బార్య అయిన సావిత్రి భాయి ఫూలే ను మొదటి ఉపాధ్యాయురాలిగా మార్చాడన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల బానీస బ్రతుకుల నుంచి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు . కరుడుగట్టిన సామాజిక కట్టుబాట్లను తీవ్రంగా వ్యతిరేకించి వాటి నిర్మూలనకు జీవితమంతా పరితపించాడని చెప్పారు. మన భారత దేశానికి ఆ మహానీయుడు చేసిన సేవలు మరువలేనివని గ్రామ స్థాయి నుంచి నేటి యువత మహాత్మా జ్యోతి రావు పూలేను ఆదర్శంగా*తీసుకోవాలని అన్నారు ,ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కార్యదర్శి పుల్ల ప్రతాప్ నవాబ్ పేట మాజీ సర్పంచ్ రత్నాకర్ రెడ్డి అంబేద్కర్ వాది అంబాల అనిల్ అంబేద్కర్ యువజన సంఘం మండల కోశాధికారి కనకం తిరుపతి ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు నాయకులు గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్..

మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో మెగా జాబ్ మేళా..

నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం

వరంగల్ తూర్పు, నేటిధాత్రి:

 

వరంగల్ తూర్పు నియోజక వర్గ పరిధిలోని ఏం.కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. వరంగల్‌లో మెగా జాబ్‌మేళా ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు మాట్లాడుతూ, 60 కంపెనీల ద్వారా 11 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం చేశాం అని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం అని, ఎవరి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు దక్కుతాయి అని అన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్‌ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. మా ప్రభుత్వంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని, ఖుస్రో పాషా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, తూర్పు కార్పొరేటర్లు, జిడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం

మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన జాబ్ మేళా నిరుద్యోగుల విశేష స్పందనతో కిక్కిరిసిపోయింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ మేళాకు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో ప్రాంగణం నిండిపోవడంతో, పరిస్థితిని సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ రంగాల్లో మొత్తం 8,000కి పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

జాబ్ మేళాలో తొక్కిసలాట, పలువురికి గాయాలు

భారీగా సంఖ్యలో చేరుకున్న నిరుద్యోగులు.

హోటల్ ప్రధాన ద్వారం అద్దం పగిలి ముగ్గురు మహిళ నిరుద్యోగులకు గాయాలు.

వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎంకే నాయుడు హోటల్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పలువురు ఉద్యోగార్థులకు గాయాలయ్యాయి. ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరు కావడంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో అద్దం పగిలి పలువురికి గాయాలయ్యాయి. ఈ జాబ్ మేళాకు సుమారు 10వేల మంది వరకు హాజరైనా, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని, హాలు సరిపోలేదని నిరుద్యోగులు విమర్శించారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులు హాజరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.

జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు.!

బహుజన సంఘర్షణ సమితి అధ్వర్యం లో జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు…పాల్గొన్న నాయకులు అధికారులు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రం లో జరిగిన మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా మహాత్మా జ్యోతి రావు పూలె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బహుజన, సంఘర్షణ నాయకులు ఈ సందర్బంగా ఝరాసంగం ఎంపిడిఓ సుధాకర్ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతల్ గట్టు శివరాజ్ మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వం వంద ఏబై ఏండ్ల క్రితమే జ్యోతి రావు పూలె బహుజనులకు సామాజిక న్యాయం కోసం స్త్రీ విద్య మరియు సమానత్వం కోసం అగ్రకులాల వారి తో పోరాటం చేసి బహుజన వర్గాల సామాజిక హక్కులు కాపాడిన మహనీయుడు జ్యోతి రావు పూలె అన్నారు. ఆయన ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు బడ్జెట్ కేటాయింపులలో, సామాజిక న్యాయం కోసం బహుజనుల విద్య ఉపాధి అవకాశల కోసం బడ్జెట్ లో అధిక నిధులు కేటాయింపులు చేసి రాజ్యాంగ ఫలాలు, చట్ట బద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చుడాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఎంపీడీఓ సుదాకర్, సమత సైకిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్,మాజీ ఎంపీటీసీ సి. హెచ్ రాజ్‌కుమార్,అడ్వాకేట్ షకీల్, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్, బహుజన నాయకులు జాగృతి అధ్యక్షులు ముదిరాజ్ పాండు, సి హెచ్ దత్తు, కొల్లూర్ గ్రామ అధ్యక్షులు డప్పుర్ సంగమేష్,బోజ్యానాయక్ తండా అధ్యక్షులు సుబాష్,సామాజికవేత్త దన్‌రాజ్ గౌడ్, 24 న్యూస్ మీడియా దిగంబర్,నాయకులు అమృత్, ప్రవీణ్,రవి విద్యాసాగర్,ఉపేందర్ మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మరియు వివిధ పార్టీ నాయకులు,వివిధ సంఘనాయకులు తధితరులు పాల్గోని మహాత్మ జ్యోతి రావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జ్యోతిరావు పూలే ఫోటో కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

రాజేందర్ మాట్లాడుతూ సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త ఆలోచనపరుడు కుల వ్యతిరేక సంఘసంస్కర్త అని అన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహిళలు అనగారిన కులాల ప్రజలలో విద్య వ్యాప్తికి కృషిని కొనసాగించారని వారి సేవలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ,నాయకులు దూడపాక శ్రీనివాస్,రజనీకాంత్,సంపత్,శివకుమార్ యూత్ నాయకులు పాల్గొన్నారు._

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 26న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని గాంధీనగర్,మైలారం గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 15 లోపు గూగుల్ ఫామ్,క్యూఆర్ కోడ్ ద్వారా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు._

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి.

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలా మాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, సామాజిక సంఘ సంస్కర్త,సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మరియు విద్య కోసం జీవితాంతం కృషి చేసిన సంఘసేవకుడైన మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతి సందర్బంగా వారి సేవలను స్మరిస్తూ.వారికి నా ఘన నివాళులు తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ ,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, వార్డ్ అధ్యక్షులు దత్తాత్రేయ,అలి,వెంకట్,విశ్వేశ్వర్,
బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్,నాయకులు తులసి దాస్ గుప్తా,రాజ రమేష్ ,జగదీశ్వర్,ఆనందం,ప్రవీణ్ పాటిల్,ఎజాస్ బాబా,గణేష్ ,నర్సింహ రెడ్డి,దీపక్,లక్ష్మీకాంత్,మోహన్ తదితరులు పాల్గొన్నారు

నూతన రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలి.

నూతన రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలి

కందుకూరి నరేష్ టిడిపి పరకాల నియోజకవర్గ బాధ్యులు

పరకాల నేటిధాత్రి

రేషన్ కార్డుల అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ ప్రక్రియ చేసిన తర్వాత కూడా జిల్లా కలెక్టర్లు గాని స్థానిక తహశీల్దార్లు గాని రేషన్ కార్డుల పై క్లారిటీ ఇవ్వకపోవడం దురదృష్టకరమని గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఫోన్లు చేసి,కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకున్న వారికి సమాచారం ఇస్తూ,మీకు ఇదివరకు మీ తల్లిదండ్రులతో కార్డు ఉందా ఉంటే మీరు అందులో నుండి మీ పేరును డిలీట్ చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు ఎంట్రీ అవుతుంది చెప్పడం జరుగుతుందని ఏ అధికారి కూడా సరైన వివరణ ఇవ్వడం లేదన్నారు.దీనిపై పూర్తి సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ తో లేదా పౌరసరపరల శాఖ మంత్రితో చర్చించి దీనికి ఒక సులభమైన మార్గాన్ని తీసుకురావాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కోరారు.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ

జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ లో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నుండి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామిక ప్రజలు వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్, గాంధీనగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇంజిపెల్లి విక్రం, సాగర్, పవన్, సాంబయ్య  పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version