ఇందిరా మహిళాశక్తి క్యాంటిన్ ను ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి
మహిళలను కోటీశ్వరురాళ్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని మెప్మా విభాగం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మాతృ దీవెన క్యాంటీన్ ను మెప్మా మహిళా స్వశక్తి భవనం ఆవరణలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని,ప్రతి రంగంలో మహిళలు ముందుండి ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని అందుకు తన సహాయ సహకారాలు అహర్నిశలు అందిస్తానని,ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

క్యాంటీన్ నిర్వహకురాలైన గోవిందు సంతోషమ్మ మరియు వారి టీం సభ్యులందరినీ కూడా ఎమ్మెల్యే అభినందించారు.మెప్మా విభాగం సిబ్బందిని ప్రియదర్శిని పట్టణ సమాఖ్య అధ్యక్షులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ కె.నారాయణ,ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు,తహసీల్దార్ ఏ. విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేష్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుష్మా సబ్ రిజిస్ట్రార్ డి సృజన్ కుమార్,సిఐ క్రాంతికుమార్,మెప్మా డీఎంసీ యం.రజితా రాణి,మెప్మా పరకాల టీఎంసీ తడుగుల సతీష్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, మెప్మా ప్రియదర్శిని ల,పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు సరిత, రుక్మిణి ల,అమరావతి, పరంజ్యోతి,సాంబయ్య, గోవిందు కుమార్,మెప్మా ఆర్పీలు,ఎస్ఎస్జి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.