మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం
గాదె ప్రభాకర్ రెడ్డి విమర్శ
పరకాల,నేటిధాత్రి
రైతులు పండించిన మొక్కజొన్న,వరి కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.పరకాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులతో కలిసి సమస్యలను పరిశీలించిన ఆయన,సంబంధిత అధికారులతో చర్చించారు.కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని,20 రోజులుగా పంటలు కొనకుండా రైతులను నిరీక్షింపజేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వం తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో ఈ నెల 11న జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు సారంపల్లి వాసుదేవ రెడ్డి,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల చక్రపాణి,రాగుల రమేష్, పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్,బొచ్చు ఈశ్వర్,మడికొండ ప్రశాంత్,రవి,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
