జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్
నేటి ధాత్రి చర్ల :
జూన్ 4వ తేదీన హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోవు సభలో 15000 వేల మంది గ్రామస్థాయి నాయకుల సమక్షంలో ఏర్పాటు చేయబోయే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభకు
ప్రధాన అతిథిగా భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు
అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ఇతర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు వైస్ ప్రెసిడెంట్లు టిపిసిసి ప్రధాన కార్యదర్శులు మరియు అనేకమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నరు కావున ఈ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు