జనాసమూహం ప్రదేశం లో మద్యం దుకాణాలు ముసివేయాలి
పట్టణంలోని ఎక్కువ రద్దీ ఉన్నచోట ఇబ్బందిగా మారిన మద్యం షాపులు
మెయిన్ రోడ్ చౌరస్తాలో ఉన్నటువంటి మద్యం షాపులను తొలగించి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో పెట్టించాలి*
ప్రజాతంత్ర మహిళా సంఘం
ఐ.ద్వా జిల్లా కార్యదర్శి.జవ్వాజి విమల
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐ ద్వా. జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో మెయిన్ రోడ్ల వెంబడి పాత బస్టాండ్ గాంధీ చౌక్ కొత్త బస్టాండ్ చౌరస్తాలలో మద్యం షాపులు పెట్టడం మద్యం కొనడానికి వచ్చేవారు మొత్తం రోడ్డు ఇరువైపులా వెహికల్స్ పెట్టడం వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది మద్యం షాపులో ప్రక్కనే బెల్ట్ షాపులు ఉండడం వలన ఆ ప్రాంతం నుండి వెళ్లే మహిళల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం మద్యం అమ్మడానికే ప్రాముఖ్యత ఇస్తుంది గాని ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు మద్యంపై వస్తున్న ఆదాయమే ప్రభుత్వానికి ముఖ్యంగా కనబడుతోంది ప్రధాన రహదాల నుండి 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు పెట్టాలి కానీ ప్రజలకు కండ్ల ముందు కనబడే విధంగా దూరంగా ఉంటే మద్యం తాగుడు మర్చిపోతారేమో అని ప్రధాన చౌరస్తాలో పెట్టించడం జరుగుతుంది ఇది సరైన విధానం కాదు
ఎక్స్చేంజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రధాన రోడ్ల వెంబడి ఉన్నటువంటి మద్యం షాపులను తొలగించాలి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో పెట్టించాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కొనసాగితే ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో కొడం లలిత,ఆడెపు లావణ్య,పద్మ,విజయ,వడ్డేపల్లి లక్ష్మీ,కొడం అరుణ తదితరులు పాల్గొన్నారు.