ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై నల్లపు దుర్గాప్రసాద్ హెచ్చరిక

ఏబీన్ రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలు మానుకో

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ హెచ్చరిక

నేటిదాత్రి చర్ల

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఎండి రాధాకృష్ణను తీవ్రంగా హెచ్చరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్
తెలంగాణ ప్రజలు అత్యంత గౌరవంతో చూసే ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు భట్టి విక్రమార్క పై ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండి రాధాకృష్ణ చేసిన అనూహ్య అవగాహనలేని వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలి వ్యక్తిగత దూషణలు అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే వ్యాఖ్యలు జర్నలిజం కాదు అది పక్షపాత ప్రచారం మాత్రమే ప్రజా సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన భట్టి విక్రమార్క ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు
ఏబీఎన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం వెంటనే స్పందించి రాధాకృష్ణ వ్యాఖ్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా తగిన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నామని తెలిపారు మీడియా స్వేచ్ఛను గౌరవిస్తున్నాం కానీ స్వేచ్ఛ పేరుతో విష ప్రచారం అనుమతించబోమని స్పష్టం చేస్తున్నామని అన్నారు

గిరిజన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: నల్లపు దుర్గాప్రసాద్

గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తాం
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్

నేటిదాత్రి చర్ల

 

పోరిక బలరాం నాయక్ మరియు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశాల మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గిరిజన గ్రామాలైన కుర్నపల్లి పులిగుండాల వీరాపురం కొండేవాయి తదితర గ్రామాల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పనిచేస్తోందని గిరిజన గ్రామాల అభివృద్ధికి స్పష్టమైన దృష్టితో పథకాలను అమలు చేస్తోందని ప్రశంసించారు రహదారులు తాగునీరు విద్య వైద్య సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల రూపురేఖలను మార్చబోతున్నాయని తెలిపారు
గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నల్లపు దుర్గాప్రసాద్ అన్నారు ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను గుర్తించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రతి గ్రామానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం పార్టీ నాయకులు కలిసి పని చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ .

జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్

 

నేటి ధాత్రి చర్ల :

జూన్ 4వ తేదీన హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోవు సభలో 15000 వేల మంది గ్రామస్థాయి నాయకుల సమక్షంలో ఏర్పాటు చేయబోయే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభకు
ప్రధాన అతిథిగా భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు
అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ఇతర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు వైస్ ప్రెసిడెంట్లు టిపిసిసి ప్రధాన కార్యదర్శులు మరియు అనేకమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నరు కావున ఈ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version