రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్ పట్టణానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. రామకృష్ణాపూర్ పట్టణానికి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ సేవలు లేవని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటైన నేపథ్యంలో ఆర్టీసీని పునరుద్ధరించాలని డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించడం జరిగిందని జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిపో మేనేజర్ స్పందించి వారం రోజులలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటామని తెలిపినట్లు వారు తెలియజేశారు.వినతి పత్రం అందించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, కాదండి సాంబయ్య, మామిడి గోపి, వనం సత్యనారాయణ, మొండి ,మారేపల్లి రవి ,చందర్, సిరికొండ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.