మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలో మట్కా నిర్వాహకులను, మట్కా ఆడుతున్నవారిని స్థానిక తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని శాంతినగర్, రాంనగర్ కాలనీలలో పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు మట్కా నిర్వాహకులను, ఐదుగురు మట్కా ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్దనుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.9,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.