బాండు సమస్త, రైతుల మధ్య ఒప్పందం జరగాలి..

బాండు సమస్త, రైతుల మధ్య ఒప్పందం జరగాలి..

బాండు మిర్చితో రైతుల ఆవేదన ..

పురుగుల మందుల షాప్ల కు అధిక లాభాలు ఎలా…

నూగూర్ వెంకటాపురం మార్చి 01(నేటి దాత్రి ):-

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పాత్రపురం గ్రామంలో తుడుం దెబ్బ అత్యవసర సమావేశం వెంకటాపురం మండల అధ్యక్షులు బాడిస. కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో,తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు మాట్లాడుతూ రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టు బాటు ధర కల్పించాలని అన్నారు. రైతు శ్రమను గుర్తచక కంపెనీల పేరుతో అగ్రిమెంట్ లేకుండా వ్యవసాయం చేయిస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. విత్తనాలు విత్తనా శుద్ధి లేకుండా రైతులకు సరఫరా చేసి రైతులను నట్టేట ముంచారాని అయన అన్నారు. రైతులకు, సమస్త కు మధ్య ఒప్పంద పత్రాలు రాసుకోవాలి. రైతులకు పంట నష్టం జరిగినప్పుడు పోయినప్పుడు,సమస్యే రైతులకి నష్టపరిహారం అందించాలని అయన నన్నారు. .సంబంధిత అధికారులపర్యవేక్షణ లోపించిందని అయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం ద్రుష్టి సారించి చాలని అయన డిమాండ్ చేశారు . ఈకార్యక్రమంలో ప్రశాంత్, సతీష్, నర్సింహారావు, రాంకి, గణేష్, తిలక్ తదితరులు పాల్గొన్నారు.

పవన్‌ ఒప్పుకున్నట్లే!

`లోకేష్‌ కు లైన్‌ క్లియరైనట్లే!!

`లోకేష్‌ కు సీఎం గా పట్టాభిషేకమే!

`త్వరలోనే లోకేష్‌ ముఖ్యమంత్రి అయినట్లే. 

`అందుకు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు నిదర్శనమే

`పదిహేళ్ల పాటు కూటమి కొనసాగుతుందని పవన్‌ ఉవాఛ.

`అంటే లోకేష్‌ ను సీఎంగా ఒప్పుకున్నట్లే లెక్క.

`అయితే ఆలస్యం కూడా చేయొద్దు.

`నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు.

`ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు.

`పరిస్థితుల ప్రభావం అని మాట తప్ఫొచ్చు.

`పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్‌ మాట మార్చవచ్చు.

`రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఎక్కడా వుండరు.

`అవసరాల కోసం దారులు వెతుక్కునే పదవులే వుంటాయి.

`పదవి కాంక్ష లేకుండా రాజకీయాలు ఎవరూ చేయరు.

`పవన్‌ మాట మీద నిలబడతాడా? అన్నది డౌటే!

`లోకేష్‌ ను సీఎం చేయడానికి పవన్‌ను ఒప్పించే ప్రయత్నం.

`ఈ ఏడాదిలోనే లోకేష్‌ ను సీఎం చేయాలని టిడిపి పట్టు.

`సమయం కోరుతున్న పవన్‌?

`ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి అని పవన్‌ మెలిక?

`యూపిలో బిజేపి హాట్రిక్‌ సాధిస్తే లోకేష్‌ ఆశలు ఆవిరి?

`శాసనమండలి ఎన్నికలు కూడా ప్రభావం చూపొచ్చు.

`టీడీపీ విజయం సాధిస్తే లోకేష్‌ కు పట్టాభిషేకం వాయిదా పడొచ్చు!

`ఓడిపోతేనే లోకేష్‌ కు లైన్‌ క్లియర్‌ కావొచ్చు!

`ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది.

`ఏ రకంగా చూసినా లోకేష్‌ సిఎం కావడానికి మార్గం పడేదే!

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలుగు దేశం పార్టీ శ్రేణులు సంతోషపడే వార్త. సంబరాలు చేసుకోవాల్సిన వార్త. చినబాబు మంత్రి లోకేష్‌ ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమౌతున్నదనే విషయం స్పష్టమౌతున్న వార్త. అవును..చాలా తొందరగానే లోకేష్‌ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం నిర్వహించే సమయం ఆసన్నమౌతోంది. అందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా సై అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. లోకేష్‌ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సాక్షాత్తు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది. ఏపి రాజకీయాలలో నవ శకం రావాలంటే యువ తరం రాజకీయాలు పురుడు పోసుకోవాలని పవన్‌ కూడా అభిప్రాయపడుతున్నట్లు అర్థమౌతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ని, వైసిపిని మరో పదిహేళ్ల పాటు నిలువరించాలంటే కూటమి వుండాలని పవన్‌ బలంగా కోరుకుంటున్నట్లు స్వయంగా చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కూటమికి బీటలు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని కూడా అసెంబ్లీలో పవన్‌ కళ్యాణ్‌ తేల్చి చెప్పారు. ఏపి బాగుపడాలన్నదే తన తపన అన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం ఎలాంటి త్యాగాలైనా చేయడానికి తాను సిద్దమని పవన్‌ చెప్పారు. ఎందుకంటే ఎన్ని రోజులైనా, ఇంకెంత కాలమైనా తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్‌ మాత్రమే. ఆయనను కాదని మరెవరూ అధ్యక్షుడు కాలేరు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి ఇంకా ఎన్ని సార్లు వచ్చినా ముఖ్యమంత్రి కావాల్సింది లోకేష్‌ మాత్రమే. ఈ విషయం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు స్పష్టంగా తెలుసు. పవన్‌ మొదటి నుంచి చెబుతూనే తన శ్రేణులను సమాయత్తం చేస్తూనే వున్నాడు. అయితే కొంత మంది జనసేన నాయకులు పవన్‌ వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్నారు. పవన్‌ ఇలా నిర్ణయం తీసుకుంటే మా భవిష్యత్తు ఏం కావాలి? అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. అయినా పార్టీ పచ్చగా వుంటేనే నాయకులు, కార్యకర్తలు వుంటారు. పార్టీ అధికారంలో వుంటే జిందాబాద్‌ లు కొడతారు. గతంలో వుండే పరిస్థితులు ఇప్పుడు లేదు. ప్రతిపక్షంలో వుంటే నాయకులు, శ్రేణులు ఎంత కాలమైనా పార్టీని కాపాడుకునే వారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. తనేమిటో తన పార్టీ పరిస్థితి ఏమిటో పవన్‌ కళ్యాణ్‌ కు బాగా తెలుసు. కలలు కొన్ని నిజాలు కాకపోవచ్చు. అందువల్ల పవన్‌ కళ్యాణ్‌ చాలా దూరదృష్టితోనే కూటమి ఎల్లకాలం కొనసాగుతుందని చెప్పి వుండొచ్చు. అంటే లోకేష్‌ సిఎం కావడానికి పవన్‌ ఒప్పుకున్నట్లే! అనే మాటలు వినిపిస్తున్నాయి. సిఎం కావడానికి లోకేష్‌ కు లైన్‌ క్లియరైనట్లే!!అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. లోకేష్‌ కు సిఎం గా పట్టాభిషేకమే! అని పార్టీలో వినిపిస్తోంది. అయితే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం కూడా చేయొద్దు. నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు. వాళ్లు మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు. అందుకు పవన్‌ కళ్యాణ్‌ అతీతుడు కాదు. ఆయనలోనూ మార్పు రాదనే హామీ ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే రాజకీయమే అవకాశవాదానికి చిహ్నం. రాజకీయాలలో ఆశావాదమే కాదు, అవకాశ వాదం లేకపోతే ముందుకు వెళ్ళలేదు. పదవులు కావాలనుకున్నప్పుడు గాలి ఎటు వీస్తే అటు మళ్లితేనే అందుతాయి. ఎలాంటి నాయకుడైనా తాను అందరికంటే ఎత్తులో వుండాలనే కోరుకుంటారు. నేను మరో నాయకుడి పల్లకి ఎల్ల కాలం మోస్తానని చెబితే అబద్దమే అవుతుంది. రాజకీయాలలో నీతి, నిజాయితీ అనే పదాలకు చోటు ఎప్పుడూ వుండదు. పైకి సిద్దాంతాలు, రాద్దాంతాలు ఎన్ని మాట్లాడినా అవకాశ వాదాన్ని మించిన రాజకీయం ఎప్పుడూ ముందు పడదు. అందువల్ల పరిస్థితుల ప్రభావం అని పవన్‌ ఎప్పుడైనా మాట తప్ఫొచ్చు. నాకు ప్రాధాన్యత తగ్గుతుందని అలక చెందొచ్చు. పక్కనుండే నాయకులు కలత చెందవచ్చు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తారా? ప్రశ్నించొచ్చు. మీ నాయకత్వం కోసం పని చేస్తామే కానీ మరో పార్టీ కండువా కప్పుకోమని జనసేన నాయకులు అనవచ్చు. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కు తప్పకపోవచ్చు. పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్‌ మాట మార్చవచ్చు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఎక్కడా వుండరు. పవన్‌ ఇప్పటి వరకు పెట్టుకున్న పొత్తులను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. గతంలో తెలుగు దేశం తో సాగారు. తర్వాత వామపక్షాలతో కూడారు. మరి కొంత కాలం తర్వాత బిఎస్పీ అధినేత మాయావతి కాళ్లకు దండం పెట్టారు. పొత్తుకు సై అన్నారు. వాస్తవ రాజకీయాలను బాగా గమనించి మళ్ళీ కూటమికి సై అన్నారు. సామ్యవాద రాజకీయం నుంచి సనాతన ధర్మం వైపు దారి మార్చుకున్నాడు. తెలుగు దేశం పొత్తు తో తొలిసారిగా అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. ఎందుకంటే అవసరాల కోసం దారులు వెతుక్కునే పదవులే వుంటాయి. పదవి కాంక్ష లేకుండా రాజకీయాలు పవన్‌ కళ్యాణే కాదు ఎవరూ చేయరు. కాలం గడిస్తే పవన్‌ మాట మీద నిలబడతాడా? అన్నది డౌటే! అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత తొందరపడితే అంత మంచిది. ఆలస్యం అమృతం విషం. లోకేష్‌ ను సిఎం చేయడానికి పవన్‌ను ఒప్పించే ప్రయత్నం పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదు. లోకేష్‌ ను సిఎం చేయొద్దనే హక్కు పవన్‌కు లేదు. లోకేష్‌ ను సిఎం చేయొద్దు అనేది పొత్తు ధర్మంలో లేదు. అందుకే ఈ ఏడాదిలోనే లోకేష్‌ ను సిఎం చేయాలని టిడిపి పట్టు పడుతోంది. అయితే పవన్‌ కొంత సమయం కోరుతున్నారా? అనేది తేలాల్సి వుంది. అయితే యుపి ఎన్నికలయ్యేదాకా సాగ దీయాలని పవన్‌ చూస్తున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలో బిజేపి అప్రతిహతంగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వెళ్తోంది. మూడోసారి ఉత్తర ప్రదేశ్‌ ను బిజేపి గెలుచుకుంటే ఇక దేశంలో ఆ పార్టీకి తిరుగుండదు. అప్పుడు పవన్‌కు కూడా బలం పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. యూపిలో బిజేపి హాట్రిక్‌ సాధిస్తే లోకేష్‌ ఆశలు ఆవిరౌతాయని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అంతే కాకుండా శాసనమండలి ఎన్నికలు కూడా ప్రభావం చూపొచ్చు. కాకపోతే ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మండలి ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తే లోకేష్‌ కు పట్టాభిషేకం వాయిదా పడొచ్చు! ఒకవేళ టిడిపి ఓడిపోతేనే లోకేష్‌ కు లైన్‌ క్లియర్‌ కావొచ్చు! గెలిస్తే ప్రజల మద్దతు మనకే వుందని చంద్రబాబు నాయుడే కొంత ఆలస్యం చేయొచ్చు. ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది. కానీ ఏ రకంగా చూసినా లోకేష్‌ సిఎం కావడానికి మార్గం పడేదే!అది ఎప్పుడు అనేది చంద్రబాబు నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి వుంది.

ముగిసిన మహా కుంభమేళా

తర్వాతి మహాకుంభమేళా 20157లో

66.21కోట్ల మంది స్నానాలతో ఆల్‌ టైమ్‌ రికార్డ్‌

ముగింపు సందర్భంగా మహా హారతి

మహాశివరాత్రి రోజునే 1.53కోట్ల మంది స్నానాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా

ప్రపంచ వ్యాప్తంగా గూగూల్‌, వీకీపీడియాల్లో రికార్డు స్థాయిలో సెర్చ్‌లు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

‘యద్భావం తద్భవతి’ అన్న నానుడిని నిజం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగిసింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా తర్వాతి మహోత్సవం 2157లో జరుగనుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకోమారు వచ్చే కుంభమేళాలు 12 ముగిసిన తర్వాత 144 సంవత్సరాలకు వచ్చేదే మహా కుంభమేళా. ఇది కేవలం ప్రయాగ్‌ రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. కుంభమేళాలు నాలుగు రకాలు. నాలుగేళ్లకోమారు జరిగేది కుంభమేళా, ఆరేళ్లకోమారు వచ్చేది అర్థ కుంభమేళా, 12 ఏళ్లకోమారు వచ్చేది పూర్ణ కుంభమేళా అదేవిధంగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహా కుంభమేళా. ఇప్పుడు ప్రయాగ్‌ రాజ్‌ లో జరిగింది మహా కుంభమేళా. మొత్తం 45రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవంలో ఫిబ్రవరి 26 వరకు 66.21 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య దేశంలోని మొత్తం హిందూ జనాభాలో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, భూటాన్‌ రాజు సైతం ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటలో 30 మంది మరణించడం, ఢల్లీి రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటలో మరో 18మంది దుర్మరణం వంటివి మనసుకు బాధకలిగించేవే. ఇక్కడ విపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రభుత్వ వైఫల్యం కాదు, ప్రజల్లో క్రమశిక్షణా రాహిత్యం ఇటువంటి అనుకోని దుర్ఘటనలకు కారణమవు తున్నాయన్నది పరిస్థితులను గమనిస్తే తెలుస్తుంది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగిసిన కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమం వద్ద ఇచ్చిన మహా హారతితో 144 సంవత్సరాలకోమారు వచ్చే ఈ మహా క్రతువు ముగిసింది. మహాశివరాత్రి రోజున కేవలం ఒక్కరోజునే 1.53కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. 

మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఈసారి మహాకుంభమేళా ముగింపు రోజైన మహాశివరాత్రి పర్వదినాన కేదార్‌నాథ్‌ దేవాలయాన్నితెరిచే రోజును ప్రకటించారు. వచ్చే మే 2వ తేదీన ఉదయం ఏడుగంటలకు వృషభ లగ్నంలో కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరచుకుంటాయి. దీంతో చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్‌ దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. గుజరాత్‌లోని సోమనాథ్‌, నాగేశ్వర్‌ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర, ఓంకారేశ్వర ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయం, మహారాష్ట్రలోని భీమశంకర, త్రయంబకేశ్వర ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం, జార్ఖండ్‌లోని వైద్యనాథస్వామి ఆల యం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్‌ ఆలయం…వీటిని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు.

తొలిసారి కుంభమేళా ప్రస్తావన

క్రీ.శ.629ా645 మధ్యకాలంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ లేదా జియాంజంగ్‌ రచనల్లో తొలిసారి చారిత్రకంగా కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. ఇంపీరియర్‌ గెజిట్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం 1892లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సంద ర్భంగా పెద్దఎత్తున కలరా సోకింది. అప్పటి అధికార్లు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు అమ లచేసారు. ఇందులో భాగంగా హరిద్వార్‌ పునరుద్ధరణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 1903 కుంభమేళాకు సుమారు నాలుగు లక్షలమంది హాజరుకాగా, 1954 కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1998 ఏప్రిల్‌ 14న హరిద్వార్‌లో జరిగినకుంభమేళాకు పదిమిలియన్ల మంది ప్రజలు హాజరయ్యారు. 2001లో అలహాబాద్‌ (ప్రయాగ్‌ రాజ్‌) కుంభమేళాకు ఆరవై మిలియన్ల మంది హాజరుకాగా వీరిలో ఒక మిలియన్‌ ప్రజలు విదేశాలవారు కావడం విశేషం. 

పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ ప్రకారం 1892లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా ఆయన గురువు యుక్తేశ్వర్‌ మహరాజ్‌ తొలిసారి మహావతార్‌ బాబాను కలుసుకున్నారు. 1989లో కుంభమేళా సందర్భంగా ఫిబ్రవరి 6న ప్రయాగ్‌ రాజ్‌లో 1.5కోట్ల మంది హాజరు కావడంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. 

సినిమాలు, డాక్యుమెంటరీలు

1982లో దిలీప్‌రాయ్‌ తీసిన ‘అమ్రిత కుంభేర్‌ సంథానే’ చిత్రంలో కుంభమేళాను చూపించారు. 2001లో మెరీజియో బెనజో, నిక్‌డేలు కుంభమేళాపై ‘‘ది గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ది ఎర్త్‌’’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశారు. దీనితో పాటు నదీముద్దీన్‌ 2004లో ‘‘సాంగ్స్‌ ఆఫ్‌ ది రివర్‌’’, ‘‘ఇన్వొకే షన్‌’’, ‘‘కుంభమేళా’’ పేరుతో తీసిన డాక్యుమెంటరీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సి.బి.ఎస్‌.సండే మార్నింగ్‌ అనే ప్రముఖ అమెరికన్‌ మార్నింగ్‌ షో 2010 ఏప్రిల్‌లో 18న ప్రసారం చేసిన కార్యక్రమంలో హరిద్వార్‌ కుంభమేళాను ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు పాల్గనే మతకార్యక్రమంగా వర్ణించింది. 

అఖాడాల నిర్వహణలో

మన దేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన ప్రారంభమయ్యే వరకు ఈ కుంభమేళాలను ‘అఖాడా’లు నిర్వహించేవి. కుంభ స్నానాల సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పించేవారు. అంతేకాదు హిందువులకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపేవారుగా ఈ అఖాడాలకు చెందిన సాధువులను పరిగణించేవారు. 17వ శతాబ్ద కాలంలో ఈ అఖాడాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగేదని కూడా ఈస్ట్‌ ఇండియా కంపెనీ రికార్డులను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా 1760లో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో శైవ సాధువులైన గోసాయిన్లు, వైష్ణ వ సాధువులైన బైరాగుల మధ్య ఘర్షణ జరిగినట్టు ఈస్ట్‌ ఇండియా కంపెనీ రికార్డుల్లో నమోదైంది. మరాఠా పీష్వా ముద్రించిన రాగి శాసనంలో 1789లో నాసిక్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా శైవ సన్యాసులు, వైష్ణవ బైరాగి సాధువుల మధ్య గొడవలు జరిగినట్లు పేర్కొనివుంది. ఈవిధంగా అఖాడాల మధ్య నిరంతరం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ కలుగ జేసుకొని ఈ కుంభమేళాల సందర్భంగా క్యాంపులను ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు కంపెనీ అధికార్లు ఏ అఖాడా ఎప్పుడు స్నానం చేయాలన్న నియమనిబంధనలను అమలుచేసింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ కుంభ మేళాకు వచ్చేవారిపై ‘యాత్రపన్ను’ విధించడం ద్వారా ఆదాయం పొందే కోణంలోనే ఆలోచిం చింది. చివరకు 1870 నాటికి కుంభమేళా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగింది. బ్రిటిష్‌ ప్రభుత్వం విధిస్తున్న పన్నులను ప్రయాగ్‌వాల్‌ పండాలు (ప్రయాగ్‌రాజ్‌లోని బ్రాహ్మణులు) తీ వ్రంగా వ్యతిరేకించారు. పన్నులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం సదుపాయాల గురించి పట్టించుకునేది కాదు. చివరకు 1938లో లార్డ్‌ ఆక్‌లాండ్‌ ఈ యాత్రపన్నును రద్దు చేయడంతో కుంభ మేళాకు హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదిలావుండగా 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో, బ్రిటిష్‌ ప్రభుత్వం ఈకుంభమేళాలను తిరుగుబాటును ప్రోత్సహించే కేం ద్రాలుగా పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకునేది. కాగా 1895లో అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత, వ్యాసకర్త మార్క్‌ ట్వైన్‌ ( అసలు పేరు సామ్యూల్‌ లాంఘోర్న్‌ క్లీమెన్స్‌) ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాను సందర్శించాడు. ‘‘ఈ కుంభమేళా సమాజానికి ఆధ్యాత్మితను, ఐకమత్యాన్ని, భక్తిని, విలువలను ప్రభోదిస్తాయి’’ అని ఆయన తన రచనల్లో పేర్కొన్నాడు. అంతేకాదు కుంభమేళా సందర్భంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా జరిగేవి. బుఖారా, కాబూల్‌, తుర్కిస్తాన్‌, అరబ్‌లు, పర్షియన్లు హరిద్వార్‌ కుంభమేళాలో పాల్గని తమ వ్యాపారాలను నిర్వహించేవారు. ఆహారధాన్యాలు, నిత్యావసరాలు, బమ్మలు వంటివి వ్యాపారులు అమ్మ కాలు జరిపేవారు. రెండో ప్ర పంచ యుద్ధ కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వం కుంభమేళాను నిషేధించింది. ఇంధన కొరత ఏర్పడు తుందన్న భయమే ఇందుకు కారణం. ఇదేసమయంలో జపాన్‌ కుంభమేళా జరిగే ప్రాంతంపై బాంబు వేస్తుందన్న ప్రచారం జరగడంతో 1942 కుంభమేళాకు చాలా తక్కువమంది ప్రజలు హజరయ్యారు.1947 దేశ స్వాతంత్య్రం తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కుంభమేళా నిర్వహణ బాధ్యతలను నిర్వహించడం మొదలుపెట్టాయి. 

తొక్కిసలాటలు, తప్పిదాలు

1820లో హరిద్వార్‌ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 485 మంది మరణించారు. తర్వాత కంపెనీ ప్రభుత్వం తొక్కిసలాటలను నివారించేందుకు ఘాట్లను అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకుంది. 19`20 శతాబ్దాల్లో తొక్కిసలాటలు అడపాదడపాచోటుచేసుకున్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపును అప్పటి ప్రభుత్వాలు చేపట్టాయి. ఇదిలావుండగా 1885లో ఒక హుస్సేన్‌ అనే అధికారిని కుంభమేళా మేనేజర్‌గా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించడం వివాదానికి దారితీ సింది. ఇతను యూరోపియన్‌ పురుషులు, మహిళలకోసం విలాసవంతమైన బోట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వీటిల్లో యువతులతో నృత్యాలు, మద్యం, బీఫ్‌ను ఏర్పాటు చేయడంతో, వారు విలాసంగా వీటిల్లో ప్రయాణిస్తూ, స్నానం చేస్తున్న భక్తులను వీక్షిస్తూ ‘ఎంజాయ్‌’ చే శారని అప్పటి దినపత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో ప్రభుత్వ చర్య రచ్చకు దారితీసింది.

లక్ష్యానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చేయాలి

లక్ష్యానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చేయాలి
– హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్

– వివిధ శాఖల ప్రభుత్వ ఆర్డర్లు, ప్రొడక్షన్ పై సమీక్ష

– హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల,(నేటి ధాత్రి):

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయాలని
హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ సూచించారు.
సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులు, ఆసాములు, కార్మికులు, టెక్టైల్ పార్క్ పరిశ్రమల యజమానులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల వివరాలను వెల్లడించారు. ఇప్పటిదాకా ఎంత ఉత్పత్తి చేశారో ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, సమగ్ర శిక్ష అభియాన్, మహిళా శక్తి చీరల ఆర్డర్లపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా శాఖలకు ఆయా శాఖల నుంచి సిరిసిల్ల వాసన పరిశ్రమకు అందించిన ఆర్డర్లలో 50 శాతం మార్చి 15వ తేదీలోగా అందజేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయా వస్త్రాల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. గతంలో తాము ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని, సెస్ విద్యుత్తు బ్యాక్ బిల్లింగ్ సమస్య పరిష్కరించాలని, యంత్రాల కొనుగోలు తదితర అంశాలకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ మాట్లాడుతూ జిల్లాలోని యజమానులు, ఆసాములు, కార్మికుల్లో అర్హులైన వారందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందజేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. విద్యుత్ బ్యాక్ బిల్లింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆరు నెలల పాటు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనికి అనుగుణంగా సిరిసిల్లలోని పరిశ్రమ బాధ్యులు ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి చేయాలని, మిగతా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్ నుంచి ఆర్డర్లు పొందేలా సిద్ధం కావాలని సూచించారు. మార్కెట్ అనుగుణంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమకు సంబంధించి వివిధ సమస్యలపై చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారని గుర్తు చేశారు. వస్త్ర పరిశ్రమ బాధ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆయా శాఖల ఆర్డర్లు తీసుకుని పూర్తి చేసి అందజేయాలని ఆదేశించారు. దీంతో ఇంకా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఆలస్యం అయితే పరిశ్రమపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన యార్న్ బ్యాంక్ నుంచి ముడి సరుకు పంపిణీలో ఇబ్బందులు త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిఎం టీ.జీ.ఎస్.కో రఘునందన్, ఎ.డి టీ.జీ.ఎస్.కో సందీప్ జోషి గౌతమ్, ఏ.డి. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సాగర్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

#ఎస్సై వి గోవర్ధన్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి వైపుగా వెళ్తున్న ఒక బజాజ్ ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆటోను పరిశీలించగా సదరు వ్యక్తులు ఆటో వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఆటోని పరిశీలించగా అందులో 10 సోలార్ బ్యాటరీలు లభ్యం అయ్యాయి. పట్టుబడిన నిందితులను వారితో ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిలో పర్వతగిరి మండలానికి చెందిన భూక్య నవీన్, అల్లాడి దుర్గ స్వామి, సంగెం మండలం తీగరాజు పల్లి కి చెందిన గూడూరు అరవింద్, కర్నే అఖిలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి 10 బ్యాటరీలు సహా ఒక ఆటో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు .

కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదో వర్ధంతి

కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదో వర్ధంతి సభను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపందా సిద్ధాంతకర్త కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధంతి బహిరంగ సభ పోస్టర్లను గుండాల సెంటర్ లో శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, నాయిని రాజు , పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ లు మాట్లాడుతూ భారత విప్లవ ఉద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)కు ఉందన్నారు. గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను గిరిజనులు గిరిజనేతర పేద ప్రజలకు సాధించడంలో రవన్న పాత్ర క్రియాశీలకమైందని వారన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కరెంటు, రహదారి , విద్య, వైద్యం అభివృద్ధి చెందాలని అనేక ప్రజా పోరాటాలు నిర్వహించడంలో కామ్రేడ్ రవన్న చూపిన మార్గదర్శకం పార్టీకి అమోఘంగా ఉందని వారన్నారు. కామ్రేడ్ రవన్న భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే రష్యా తరహా పెట్టుబడిదారీ దేశంగా ఇండియా ఉందని ఈ మారిన పరిస్థితి అనుగుణంగా పార్టీ కార్యక్రమం, పందా, నిబంధవాలిని మార్చుకోవాలని సిద్ధాంతికరించిన గొప్ప నాయకుడని వారు కొని యాడారు. భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలను చేయాలని వారు ఆశించారని, దాని ద్వారానే విప్లవం విజయవంతం అవుతుందని నమ్మిన సిద్ధాంతకర్త అని అన్నారు. కామ్రేడ్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను ఖమ్మం పట్టణంలో మార్చి తొమ్మిదో తారీఖున నిర్వహిస్తున్నామని ఈ వర్ధంతి సభకు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాచర్ల సత్యం, కొమరం శాంతయ్య, వాంకుడోత్ అజయ్,బోర్ర ఎంకన్న,గోగ్గిల వెంకటేశ్వర్లు,తెల్లేం రాజు,ఈసం చంద్రన్న, పూనెం మంగయ్య,సనప కుమార్,దుగ్గి రాంబాబు,మోకాళ్ళ అజాద్,ఈసం సమ్మన్న,పూసం రాంబాబు, కోడూరి జగన్, ఎట్టి రాంబాబు,యనగంటి గణేష్,కల్తి పాపన్న, కల్తి రామన్న,ధనుసరి సమ్మయ్య,ఏడూర్ల రామనాథం తదితరులు పాల్గొన్నారు,

చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.

 చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.

స్మశానవాటికకు పోకుండా దారి కబ్జా చేశారు.

ద్వారకపేట గ్రామస్తుల అవేదన..

విలువైన మత్తడి వాగు కబ్జా.. కథనంపై గ్రామస్తుల పిర్యాదుల వెల్లువ..

ఆర్డీఓ కార్యాలయం,ఎమ్మార్వో,మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు మత్తడి వాగుకు సంబంధించిన వాగుభూమిని కబ్జా చేసి వే బ్రిడ్జి నిర్మించి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని మున్సిపాలిటీ పరిధిలో గల 17 వార్డు ద్వారకపేట గ్రామస్తులు ఆరోపించారు.అలాగే మా గ్రామానికి సంబంధించిన స్మశానవాటిక
కు వెళ్ళే దారి భూమిని అక్రమంగా అక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకొని మా భూములను కాపాడాలని వేడుకుంటూ అలాగే ఇటీవల ‘విలువైన మత్తడి వాగు కబ్జా.. ఆపై వే బ్రిడ్జి నిర్మాణం” అనే నేటిధాత్రి దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందించిన గ్రామస్తులు శుక్రవారం నర్సంపేట ఎమ్మార్వో రాజేష్,మున్సిపల్ కమిషనర్ కు వేరు వేరుగా పిర్యాదులు చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ

cheruvu

ద్వారకపేట పరిధిలోని ఎంఎఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర గల కాలువ ఆక్రమునకు గురికావడం జరిగిందని దీంతో 17వ వార్డు ఎస్సీ కాలనీ సంబంధించిన ఇండ్లు కాలువ వరదకు గురైతున్నదని ఆరోపించారు. కాలువకు ఆక్రమణకు కారకులైన వారిపై తక్షణ చర్యలు తీసుకొని కాలువపైన అక్రమంగా నిర్మాణం చేసిన పైపులైన్లను తీసివేయాలని వారు డిమాండ్ చేశారు.మరియు ద్వారకపేట ఆరో వార్డు, 17వ వార్డు వద్దగల స్మశానవాటికకు సంబంధించిన దారిభూమిని కబ్జాచేశారని దీంతో ప్రజలను దాన సంస్కరాలకు పోనీయకుండా పత్తిమిల్లు యజమాని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.స్మశాన వాటికకు సంబంధించిన దారిభూమిని
కబ్జా చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సి కాలని వాసులు,గ్రామస్తులు డిమాండ్ చేశారు.వెంటనే స్పందించిన ఎమ్మార్వో రాజేష్ వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు వేల్పుల మల్లయ్య, వేల్పుల శ్రీనివాస్, వేల్పుల భాస్కర్, పొన్నాల వీరస్వామి,పొన్నాల ఎల్ల స్వామి, ఇస్రాం బాబు,చింత సాంబయ్య, ఓరుగంటి నాగరాజు, ఆవుల వెంకట నరేందర్ తెలిపారు

చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి

చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్ లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్య తరువాత రానున్న నాలుగు సంవత్సరాల సమయమని చాలా విలువైనదని అన్నారు. మీ భవిష్యత్తు బాగుండాలని, మీ తల్లిదండ్రుల లాగా మీరు కష్టపడకూడదని.. వారు కూలీ పనులు చేస్తూ.. వ్యవసాయ పనులు చేసుకుంటూ.. వాళ్ళు పడే కష్టాలను సైతం ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిగా చదువుకొని జీవితంలో మీరు స్థిరపడాలని ఆయన సూచించారు. మీకోసం మీ తల్లిదండ్రులే కాకుండా మేము కూడా తపన పడుతున్నామని, మీరంతా మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని

Avoid bad friends

కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు మీకోసం ఇంజనీరింగ్, నీట్ ఎంట్రెన్స్ పరీక్షలకు క్రాష్ కోర్స్ ఏర్పాటు చేస్తామని.. ఈ కోర్సులో చేరిన వారికి ఉచితంగా వసతి భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న పాపిరెడ్డి శుక్రవారము పదవీ విరమణ సందర్భంగా ఆయన ను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేసి ఆల్ ది.. బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, టిజిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.రామకృష్ణ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు.

ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల కేంద్రం లోని కస్తూర్బ పాఠశాల యందు జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా పాఠశాల ఇంచార్జి పొన్నం సునీత మాట్లాడుతూ ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు రంగవల్లులు క్విజ్ పోటీలు ప్రముఖ శాస్రవేత్తలు మరియు ఆవిష్కరణలు సైన్స్ అంశాలపై వ్యక్తిత్వ ప్రసంగం పోటీలు వినియోగం విద్యార్థులచే చేయబడిన నమూనాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం లో సైన్స్ ఉపాధ్యాయులు తోట రాధిక వెంగల విజయలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి.

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఈ ఆర్థిక క్రమశిక్షణ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తీసుకొని పొదుపు చేయాలని, ఇప్పుడు చేస్తున్న ఈ పొదుపే మీ యొక్క భవిష్యత్తు అవసరాల కోసం చాలా ఉపయోగపడు తుందని ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని ఉండదు అని అన్నారు, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోతు న్నాయి వాటి నుండి తస్మాత్ జాగ్రత్త అని విద్యార్థులకు తెలియజేశారు, ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు పంపించిన లింక్స్ గాని ఓటీపీలు గాని ఎవరికి షేర్ చేయవద్దని అన్నారు, ఒకవేళ తెలియక సైబర్ నేరాల వలలో పడినట్లయితే వెంటనే గుర్తించి బ్యాంకును గాని పోలీసులను గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని తద్వారా మీకు సహాయం చేయడానికి వీలుగా ఉంటుందని తెలియజేశారు.
ఇదే రోజున ఈ హాస్టల్లో సైన్స్ వేర్ నిర్వహించడం జరిగింది, విద్యార్థుల యొక్క ప్రతిభను చూసి విద్యార్థులను అభినందించడం జరిగింది

students

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా అదృష్టవంతులని ఈ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులే అన్ని రంగాల్లో రాణిస్తారని తెలియజేశారు.
నేను కూడా గురుకుల పాఠశాలలోనే చదివి ఈరోజు బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నాను, ఈ పాఠశాలలో చదువుకు న్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని అదేవి ధంగా మీరందరూ కూడా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని మరియు సిబ్బంది, మరియు ప్రభుత్వ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విడ్స్ స్వచ్ఛంద సంస్థ కౌన్సిలర్స్ మారపెల్లి క్రాంతికుమార్, విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా ఉద్యనవవ అధికారి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ మరియు మొగుడంపల్లి మండలంలో బిందు సేద్యం తో పంటల సాగుకు పరిశీలించి న సంగారెడ్డి జిల్లా ఉద్యనవవ అధికారి సోమేశ్వర రావు.తెలంగాణ ఉద్యానవన శాఖ పథకం ద్వారా రైతులకు రాయితీ లపై అందజేసి న బిందు సేద్య పరికరాల వినియోగాన్నీ ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలోపర్యటించి తనిఖీ చేశారు. మండలం లోని మల్చేల్మా,మొగుడంపల్లి, చిన్న హైదరాబాద్ గ్రామాలలో ఆయన వ్యవసాయ భూములను సందర్శించి సూక్ష్మ సేద్య పరికరాలతో సాగులో ఉన్న పంట పొలాలను అమర్చిన పరికరాలను పరిశీలించి నారు. బిందు సేద్యాన్ని అమలు చేస్తున్న రైతులను ఉద్దేశించి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానం ద్వారా నీటినిపొదుపు చేసుకోవడం తో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు.క్షేత్ర పర్యటన లో జైన్ డ్రిప్ డి సి ఓ విజయకుమార్, నేటఫీమ్ డిసిఓ పాండు,గొల్ల రాజరమేష్, స్వామి రైతులు అంజన్న,శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు

ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన.

ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన

అఖిలపక్ష ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి :
అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా 28 వ వార్డు వెంగల్ రావు కాలనీ లోని క్లాసిక్ టైలర్ వేణుగోపాలచారి రామాలయం వెనుక కీర్తి టైలర్ నరసింహ లకు ఐక్యవేదిక సభ్యులు, 27,28 వార్డు సభ్యులతో కలిసి ఘనంగా సన్మానం చారు
*ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటేష్, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, బి. సి నాయకులు గౌనికాడి యాదయ్య బి.ఆర్.ఎస్ నాయకుడు బొడ్డుపల్లి సతీష్, సూగూరు రాము, రామచంద్రయ్య, మైనార్టీ నాయకులు పాష, వార్డు సభ్యులు శివకుమార్, మారం శ్రీకృష్ణ, వెంకట్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సుభాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్.

*ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్ *

6గ్యారంటీలను అమలు చేయాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక

ఎం సిపిఐ( యు )డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజా సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని ఎం సిపిఐ(యు)డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.తెలంగాణలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,తెలంగాణ వ్యాప్తంగా ఎం సిపిఐ( యు) పార్టీ చేపట్టిన తాహాసిల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలో భాగంగా శుక్రవారం నర్సంపేట తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రం,రాష్ట్రంపై చూపిన బడ్జెట్లో వివక్షపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు .మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజలను గట్టెక్కించాలని ఆయన కోరారు .లేనిపక్షంలో ఉద్యమాలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకుడు కలకోట్ల యాదగిరి,గుర్రం రవి,గొర్రె సామ్యెల్, పెండ్యాల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో..

public welfare

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును వేగవంతం చేయాలని ఎం సిపిఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలును వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఏ విధమైన షరతులు లేకుండా అర్హులందరికీ అందేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కుసుంబ బాబురావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దుగ్గొండి మండల తహసిల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పలు డిమాండ్లతో కూడిన మెమొరండాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల సహాయ కార్యదర్శి ఎల్లబోయిన రాజు,సీనియర్ నాయకులు పేరబోయిన చేరాలు, బత్తిని కుమారస్వామి,పకిడె చందర్రావు తదితరులు పాల్గొన్నారు

మానవాళి మనుగడకు మూలం సైన్స్

మానవాళి మనుగడకు మూలం సైన్స్

నర్సంపేట,నేటిధాత్రి:

మానవాళి మనుగడకు మూలం సైన్స్ అని శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి అన్నారు.నర్సంపేట మహేశ్వరం గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మహేశ్వరం శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి పాల్గొన్నారు.మానవ జీవన మనుగడకు సైన్స్ తప్పనిసరి అవసరమని ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది నడిపిస్తున్నది సైన్స్ అని తెలిపారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,డిక్షనరీలు బహుమతిగా అందజేసి,విద్యార్థులు అనేక ఆవిష్కరణలు జరపాలని, బాగా కష్టపడి చదవాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత ప్రధానోపాధ్యాయులు స్వరూప, అర్జున్ సాగర్, వేణుబాబు,శ్రీలత, రాజేశ్వరి,రమేష్,రేఖ,శ్రీలత, కరుణాకర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

పల్లె పల్లెనా అమర వీరుల స్మారక వారోత్సవాలు.

మాదిగ అమరుల త్యాగాల ఫలితమే ఏ. బి. సి వర్గీకరణ
– పల్లె పల్లెనా అమర వీరుల స్మారక వారోత్సవాలు

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ

ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఐనవోలు మండల ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం ఐనవోలు మండల కేంద్రంలో ఎం.ఆర్. పి. ఎస్. ఐనవోలు మండల అధ్యక్షులు చింత అశోక్ కుమార్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల నారాయణ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 ఏళ్ల పాటు జరిగిన సుధీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోరకై అమరులైన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకుల ప్రాణ త్యాగాలు మరువలేనివి అని కొనియాడారు. వారి త్యాగాలే దండోరా ఉద్యమాన్ని తెలుగు గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు వర్గీకరణ ఉద్యమం సాగేలా మాకు స్ఫూర్తినిచ్చాయన్నారు. అందుకే మార్చి ఒకటిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల గ్రామ కేంద్రాలలో మాదిగ జాతికి వర్గీకరణ ఫలాలు అందించేందుకు తమ ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే మార్చి 1వ తేదీన మండలం లోని అన్నిగ్రామాల్లో ఎవరికి తోచిన విధంగా వారు అమర వీరుల పేరిట పేదలకు అన్నదానాలు,మరియు పళ్ళపంపిణ చేసి పేదలకు అందించవలసిందిగా అయన కోరారు. అలాగే ఈ వర్గీకరణ అమరుల త్యాగం వలన వచ్చినదని ఈ సమావేశాలలో అమరుల త్యాగ ఫలితంగా వచ్చిన వర్గీకరణ మన బిడ్డల వంద తరాల భవిష్యత్తు నిర్మాణం జరిగినదని జాతి మొత్తానికి వివరించాలని తెలిపారు. అంతేగాకుండా ఈ వర్గీకరణలో మాదిగలకు మరియు కొన్ని ఉపకులాలకు అన్యాయం జరిగినందున ఎస్సీ కమిషన్ రిపోర్టులోని లోపాలను సరిచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సుదీర్ఘ కాలం చేసిన కృషి తపన,త్యాగాల వలన పోరాటాలు వలన వచ్చినదని, మాదిగ, మాదిగ ఉపకులాల బిడ్డలకు సవివరంగా తెలియజేయాలని ఎమ్మార్ పిఎస్ నాయకులను నారాయణ కోరారు. ఈ సమావేశానికి మండల ప్రధాన కార్యదర్శి బరిగెల ఏలియా మాదిగ హనుమకొండ జిల్లా నాయకులు, కట్కూరి రమేష్ మాదిగ మండల అధ్యక్షుడు బాబు మాదిగ బరిగల ఆరోగ్యం మాదిగ మరుపట్ల దేవదాస్ మాదిగ బర్ల బాబు మాదిగ కొండపర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్కూరి విష్ణు మాదిగ బి. ప్రభాకర్ మాదిగ బి.కుమార్ మాదిగ బొక్కల రాజు మాదిగ ఏ.మహేష్ మాదిగ శ్రీను మాదిగ చేరాలు మాదిగ రమేష్ మాదిగ ఆనందం మాదిగ బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి
బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్.జి.రాజేశ్వర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

శాస్త్రీయ జ్ఞానమే ప్రజా జీవితానికి ఆయువు పట్టని,శాస్త్ర జ్ఞానం లేకపోతే ప్రపంచం ఇంతగా పురోగతిని సాధించేదికాదని బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో చదువుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత ప్రాముఖ్యత కలదని,ప్రభావశీలమైనదని,ఈ వయసులో అలవడే శాస్త్రీయ దృక్పథం భవిష్యత్తును దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తుందని అన్నారు.భారత దేశానికి చెందిన సి.వి.రామన్ తాను తయారు చేసిన రామన్ ఎఫెక్ట్ కు గాను 1930 లోనే నోబెల్ బహుమతి గ్రహించిన విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలన్నారు.పాఠశాల దశలోనే సి.వి. రామన్ అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తి వాటి సమాధానాలకై అన్వేషించే తత్వమే తనను గొప్ప శాస్త్రవేత్తగా మార్చిందనే విషయాన్ని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తు చేశారు.

Scientific knowledge

ఆయన పుట్టినరోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులు తయారుచేసిన రెండు వందలకు పైగా వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఉత్తమ ఆవిష్కరణలకు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, సైన్స్ ఉపాధ్యాయులు జగదీశ్వర్, గౌతమ్, నాగరాజు, విజయ్, పూర్ణిమ, ప్రీతి, కనకరాజు, మహేందర్, రాజ్ కుమార్, సంపత్, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి.

ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి.
పనుల వద్ద సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
దుగ్గొండి మండలంలో ఉపాధి పనుల పరిశీలన.

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

Employment

గ్రామాల్లో అర్హత గల ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
అధికారులతో కలిసి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఉపాధి హామీ కూలీలలతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ.. అడిగి తెలుసుకున్నారు.కర్ణాలకుంటలో చేపడుతున్న ఈజీఎస్ పనుల ద్వారా నిర్మిస్తున్న  ఫోమ్ ఫండ్ తవ్వకాల   పనులను కలెక్టర్ పరిశీలించారు.పనులు చేసే సందర్భంలో కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాలని అర్హులందరికీ ఉపాధి పనులు కల్పించాలని ఆదేశించారు.అనంతరం  చాపలబండ తండలో ఈజీఎస్ పథకం క్రింద నాగపురి రాజేందర్ అనే రైతు ఎకరం భూమిలో డ్రాగన్ ఫ్రూట్  పంటను సాగు చేయగా పరిశీలించి,సాగు విధానాన్ని తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో మరింతగా ముందుకెళ్లాలని రైతుకు సూచించారు. ఉపాధి పనులలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కౌశల్య దేవి జడ్పిసిఓ రామిరెడ్డి,ఎంపీడీఓ అరుంధతి,ఎంపీఓ
శ్రీదర్ గౌడ్,ఏపీఓ శ్రీనివాస్,ఈసీ రాజు, టి.ఏ రాజు,బద్రు,పంచాయతీ కార్యదర్శి రాజమౌళి ఫీల్ అసిస్టెంట్ సుమలత,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎంపిఓ రాము

నీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎంపిఓ రాము

కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి:

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ (కలాన్) గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్డు, గ్రామంలోని మంచినీటి మోటారులను పిట్లం మండల ఇన్చార్జి ఎంపీఓ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాము శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేసి, ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిషన్ భగీరథ నీటిని అన్ని ట్యాంకులలో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, వేసవికాలం దృష్ట్యా నీటి కొరత రాకుండా, గ్రామ ప్రజలు నీటిని వృధా చేయకుండా అరికట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్, గ్రామపంచాయతీ కారోబార్ కృష్ణ, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

sports

జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాల ల్లో, కళాశాల ల్లో విద్యార్థులు శారీరికంగా దృఢంగా, మానషికంగా ఎదగడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అని వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధారెడ్డి అన్నారు. కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఔట్ డోర్ గేమ్ లు అనై కబడి, కోకో ,క్రికెట్ వీటితో పాటు ఇండోర్ గేమ్స్ అయిన క్యారమ్స్, చెస్ లు, క్విజ్ పోటీలు నిర్వయించి ప్రతి విజేత టీమ్ కి విన్నర్ ప్రైజ్ లు మరియు రన్నర్ టీమ్ లకు కూడా కప్ లు పథకాలు ఇచ్చి విద్యార్థులకు ప్రోత్సాహిస్తారు. చదువు తో పాటు చక్కని క్రమ శిక్షణ నతో విద్యార్థులు ఎదగాలని అధ్యాపక బృందం కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మారుతి రావు పాటిల్, డైరెక్టర్ లు అమర్నాథ్, సంజీవ్ రావ్,శశికాంత్ ,శంకర్ రావు,సంగన్న,శ్రీనివాస్,తదితరులున్నారు పాల్గొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామం లో ని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విగ్రహ దాత బయ్యా సోమన్న గౌడ్ మాట్లాడుతూ జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు, పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో పోరాడారు. 1687 – 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించారు, ఒక సామాన్య వ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం అన్నారు,సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు, కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 – 1705 మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించడు పాపన్న గౌడ్ భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు,పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేశాడు అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్న గౌడ్, గౌడ సంఘం మోకు దెబ్బ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు రేఖా శ్రీనివాస్ గౌడ్, పెద్ద గౌడ్ బోడపట్ల రవి గౌడ్, సారాకోలాగౌడ్ నరేష్ గౌడ్,విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు రేఖ ప్రవీణ్ కుమార్ గౌడ్, సోమగాని గణేష్ గౌడ్, బయ్యా గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version