సీతగా సాయిపల్లవి.. అందుకే

 

సీతగా సాయిపల్లవి.. అందుకే

రామాయణ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సినిమా..

రామాయణ’.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సినిమా గురించే అంతా చర్చించుకుంటున్నారు. ‘నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ అట.. ‘అవతార్‌’ సినిమా బడ్జెట్‌ కంటే ఇది ఎక్కువట.. వర్కవుట్‌ అవుతుందా?’

అనేది వారి చర్చ. సినిమా బాగా ఆడాలని, భారతీయ సినిమా గొప్పతనాన్ని ‘రామాయణ’ మరోసారి చాటి చెప్పాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌ సినిమా మీద అంచనాలను భారీగా పెంచాయి. అయితే ఎందరో హీరో హీరోయిన్లు ఉండగా రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ను, సీతగా సాయిపల్లవిని తీసుకోవడం ఏమిటనే విమర్శలు వినిపించకపోలేదు. దీనిపై సినిమా క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ చబ్రా స్పష్టత ఇచ్చారు. ‘రాముడిగా రణ్‌బీర్‌ను తీసుకోవడానికి కారణం.. ప్రశాంతమైన ఆయన వ్యక్తిత్వం, గొప్పగా నటించగల నైపుణ్యం. అలాగే సీత పాత్రకు సాయిపల్లవిని ఎన్నుకోవడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. మొదటి నుంచీ ఆమె గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటున్నారు. అందం కోసం సర్జరీలు చేయించుకోలేదు. కృత్రిమం కంటే సహజ అందమే మేలు అనే భావన ఆమెది. తెరపై సీతారాముల్ని చూడగానే ఓ పవిత్రమైన భావన కలగాలని ఆ పాత్రలకు వీరిద్దరినీ ఎంపిక చేశాం’ అని వివరించారు. ‘రామాయణ’లో రావణుడిగా కన్నడ హీరో యశ్‌ నటిస్తున్నారు. ఆయన ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి కూడా. ఆయన సరసన మండోదరి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. సన్నీ డియోల్‌ హనుమంతుడిగా నటిస్తున్నారు.

హాన్స్‌ జిమ్మర్‌తో రెహమాన్‌

‘రామాయణ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం కోసం జర్మనీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హాన్స్‌ జిమ్మర్‌తో చేతులు కలిపారు ఏఆర్‌ రెహమాన్‌. ఇప్పటివరకూ జిమ్మర్‌తో కలసి లండన్‌, లాస్‌ఏంజెల్స్‌, దుబాయ్‌లో సంగీత చర్చలు జరిపాననీ, భారతీయ కళావైభవాన్ని చాటే గొప్ప చిత్రం ‘రామాయణ’కు పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు రెహమాన్‌ వెల్లడించారు. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రా, యశ్‌ కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రపంచానికి బహుమతిగా రామాయణ

ప్రపంచానికి బహుమతిగా రామాయణ

 

రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌…
రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నితీష్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రామాయణ.. ద ఇంట్రడక్షన్‌’ పేరుతో ఈ సినిమా గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన నమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ ‘మేం చరిత్రను తిరిగి చెప్పడం లేదు.. మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులందరినీ ఒక చోట చేర్చి ప్రామాణికంగా ‘రామాయణ’ చిత్రాన్ని తీస్తున్నాం. ఈ సినిమా ప్రపంచానికి మేం ఇచ్చే బహుమతి అవుతుంది’ అన్నారు. ప్రామాణికంగా, భక్తిశ్రద్ధలతో ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఐమాక్స్‌ సహా ప్రపంచంలోని అన్ని పాపులర్‌ ఫార్మెట్స్‌లో విడుదల చేస్తామని దర్శకుడు నితీశ్‌ తివారి చెప్పారు. ఈ సినిమాలో కన్నడ హీరో యశ్‌ రావణుడిగా, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version