*ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడు : ఎమ్మెల్యే మాణిక్ రావు *
జహీరాబాద్ నేటి ధాత్రి:
892వ బసవ జయంతి* సంధర్బంగా జహీరాబాద్ లింగయత్ సమాజ్ వారి ఆధ్వర్యంలో స్థానిక బసవేశ్వర ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు బసవ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ జహీరాబాద్ లింగాయత్ సమాజ్ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన డాక్టర్ మడుపతి. బస్వరాజ్ గారికి లింగయాత్ సమాజ్ వారితో కలిసి ఘనంగా సన్మానించారు,అనంతరం రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆహ్వానం మేరకు దత్తగిరి కాలనీ లో బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.
Social Reformer
మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే కుల వివక్షతను వ్యతిరేకించి ధనిక, పేద, అందరూ సమానమే అని చాటిచెప్పిన మహనీయుడు శ్రీ కళ్యాణ బసవేశ్వరుడు బసవ జయంతి సందర్భంగా మహనీయునికి ఘనమైన నివాళి శ్రీ బసవేశ్వర స్వామి వారి శుభాశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ బసవ జయంతి శుభాకాంక్షల తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజి సీడీసీ చైర్మన్ ఉమకాంత్ పాటిల్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్,అప్ప రవ్ పాటిల్,అశోక్ పటేల్, లింగాయాత్ సమాజ్ అధ్యక్షులు రాజు శెట్కార్, ప్రధాన కార్యదర్శి సుభాష్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు తీసుకువచ్చే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు
గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకోసం మమత అమలు చేస్తున్న పథకాలు
బీజేపీ పట్ల బెంగాలీల్లో వ్యతిరేక భావం
భాజపాను ఉత్తరాది పార్టీగా పరిగణిస్తున్న బెంగాలీలు
ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న రాడికల్ ముస్లింలు
భద్రత కొరవడి బిక్కుబిక్కు మంటున్న హిందువులు
వక్ఫ్ బిల్లు అల్లర్లలో హిందువుల ఆస్తుల విధ్వంసం
ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో రెండోతరగతి పౌరులుగా హిందువులు
హిందువులపై దాడులు సర్వసాధారణం
హైదరాబాద్,నేటిధాత్రి:
ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో తమపై దాడులు జరుగుతున్నా, రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నా, మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు అనుసరిస్తున్నప్పటికీ, పశ్చిమబెంగాల్ హిందువుల్లో చాలామంది ఇంకా తృణమూల్ కాంగ్రెస్‌కే ఓటు వేస్తుండటం విచిత్రమనిపిస్తుంది. ఇటీవల వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ముర్షిరాబాద్ జిల్లాకు చెందిన జఫ్రాబాద్ అనే ఒక చిన్న పట్టణంలో మైనారిటీలుగా వున్న హిందువులకు చెందిన ఏ ఒక్క ఇల్లుదాడికి లేదా లూటీకి గురికాకుండా లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పెచ్చరిల్లిన హింస ప్రభావాన్ని ఇక్కడి హిందువులు చవిచూశారు. ఈ చిన్న పట్టణం కోల్‌కతాకు 284 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ 25వేల మంది ముస్లిం జనాభా వుంటే, హిందువు లు కేవలం 5100 మాత్రమే. షంషేర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ పట్టణం వుంది. ఈ నియోజకవర్గంలో 2.16లక్షల మంది ఓటర్లుండగా ఇందులో 80శాతం మంది ముస్లిం లే. ఈ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థి తప్ప మరొకరు గెలవరు. ముస్లిం మెజారిటీ ప్రాంతా ల్లో హిందువుల బతుకులు ఎంత దుర్భరంగా వుంటాయనేదానికి జఫ్రాబాద్ పట్టణం ఒక ఉదా హరణ మాత్రమే! మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాల పుణ్యమాని, ఇక్కడి హిందువులు ఎన్ని బాధలు పడుతున్నా పోలీసులు కూడా పట్టించుకోరు. రాష్ట్రంలో ముస్లింలు మెజారిటీలుగా వున్న అన్ని ప్రాంతాల్లో హిందువుల పరిస్థితి ఇట్లాగే కొనసాగుతోంది.
హిందువుల్లో ఓటింగ్ శాతం తక్కువ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.6కోట్లు. వీరిలో హిందువులు 68శాతం. హిందువుల్లో బెంగాలీ హిందువులు 54శాతం వుంటే, గుజరాతీలు, మార్వాడీలు, యు.పి, బిహార్ ప్రాంతా లనుంచి వచ్చిన వారు, గూర్ఖాలు, గిరిజనులు కలిసి 14శాతం వుంటారు. అంటే బెంగాలీ హిం దువులు 4.1 కోట్లు కాగా, బెంగాలేతర హిందువుల సంఖ్య 1.6కోట్లు. ఇక రాష్ట్రంలో ముస్లిం ఓటర్ల సంఖ్య 2.43కోట్లు. బెంగాల్లో సాధారణంగా ఓటింగ్ శాతం 80శాతానికి పైగా నమోద వుతుంది. ముస్లిం ఓటర్లు 90 నుంచి 94శాతం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుం టే, హిందువులు కేవలం 65శాతం మంది మాత్రమే పోలింగ్ బూత్‌లకు వెళతారు. అంటే రా ష్ట్రంలోని మొత్తం 5.16 కోట్ల హిందువుల్లో కేవలం 3.5కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు విని యోగించుకుంటున్నారు. అదే 2.43కోట్లమంది ముస్లింలలో 2.18కోట్లమంది ఓట్లు వేస్తారు. దీవల్ల రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లను పరిశీలిస్తే హిందువుల ఓట్లు కేవలం 3.16లక్షలు మాత్రమే అధికంగా పోలవడం గమనార్హం.
హిందువుల్లో 66శాతం మంది బీజేపీకి మద్దతు
2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 2.75కోట్ల ఓట్లు (45.76%) పోల్ కాగా, బీజేపీకి 2.33 కోట్ల (38.73%) ఓట్లు పోలయ్యాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీ కంటే 42.37లక్షల ఓట్లు మాత్రమే అధికంగా పడటం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు మొత్తం హిందువులవే. 3.51కోట్లమంది హిందువులు ఓటుహక్కును వినియోగించుకోగా, ఇం దులో 2.33కోట్ల మంది బీజేపీకే తమ ఓట్లు వేసినట్లు తేలుతోంది. అంటే మొత్తం పోలైన హిందూ ఓట్లలో 66శాతం మంది బీజేపీకి అనుకూలంగా ఓటువేసారని స్పష్టమవుతోంది. అంటే మిగిలిన 34శాతం (1.18కోట్లు) ఇతర పార్టీలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటు వేసారను కోవాలి. వీరిలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు 64లక్షల మంది హిందువులు అనుకూలంగా ఓటు వేయగా మిగిలినవారు తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు.
ఈ విశ్లేషణను పరిశీలిస్తే 34శాతం మంది హిందువులు ఇంకా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలకు ఎందుకు ఓటు వేస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.
హిందువులపై యదేచ్ఛగా దాడులు
హిందువుల వేడుకలు, ఊరేగింపులపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల పండుగల సందర్భంలో తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. హిందువుల పట్ల ప్రభుత్వం పూర్తి పక్షపాత వైఖరిని అవలంబిస్తోంది. ఇస్లామిక్ ఛాందసవాదులు నిర్హేతుక కోర్కెలకు తలగ్గి ఎన్నో తరాలుగా కొనసాగుతున్న హిందువుల పండుగలు, వేడుకలపై మమత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. హిందువులపై దాడులకు, హింసాకాండకు పాల్పడిన ఇస్లామిక్ ఛాందసవాదులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. దీన్ని అలుసుగా తీసుకొని మతఛాందసవాదులు యదేచ్ఛగా పేట్రేగిపోతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇస్లామిస్టులు దాడులకు తెగబడటానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ప్రభుత్వం అండ వున్నదన్న ధైర్యంతోనే! ఉదాహరణకుచందన్నాగోర్ సబ్‌డివిజన్‌కు చెందిన చంపదాని పట్టణంలో హిందువుల జనాభా 76%. కానీ ఏప్రిల్ 11న శుక్రవారం నమాజు ముగిసిన తర్వాత ఇస్లామిక్ రాడికల్స్ హిందువుల ఆస్తులపై పెద్దఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కర్రలు, లాఠీలు పట్టుకొని స్వైరవిహారం చేస్తున్న రాడికల్ ముస్లింలు, పోలీసులను కూడా తరిమివేశారు.
ఇస్లామిక్ రాడికల్స్ దాడులనుంచి తమను తాము కాపాడుకోవడానికి బెంగాలేతర హిందూ యువకులు గ్రూపులుగా ఏర్పడి ఇస్లామిస్టులను నిరోధిస్తున్నప్పుడు, పోలీసులు వీరినే నియంత్రించా రు తప్ప దాడులకు పాల్పడిన వారిని పల్లెత్తుమాట అనుకపోవడం బెంగాల్లో జరుగుతున్న అరాచక పాలనకు నిదర్శనం. ఆవిధంగా తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా హిందువుల కు రక్షణ లేకుండా పోయింది. బెంగాల్‌లోని గ్రామీణ, పట్టణ, సెమి అర్బన్ ప్రాంతాలకు చెందిన హిందువులకు ఈ దాడుల అనుభవాలు వెన్నాడుతున్నాయి.
పేదలకు అనుకూల పథకాలు
మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకునా, రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం కుంచించుకు పోతుండటంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అత్యధికశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. మమతా బెనర్జీ అమ లు చేస్తున్న పథకాల వల్ల, లక్షల సంఖ్యలో బాలబాలికలు పాఠశాలలకు వెళ్లగలుగుతున్నారు. ఉన్నత విద్యకూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ప్రతిగా మమతా బెనర్జీ ఆయా వర్గాల ఓట్లను కోరుతున్నారు. తమకు అందుతున్న పథకాల ప్రయోజనం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన పేద హిందువులు తృణమూల్ కాంగ్రెస్‌కే అనుకూలంగా వుంటున్నారు. ఇదే సమ యంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనాలు పొందు తుండటం ఓటుబ్యాంకు పటిష్టంగా వుండటానికి మరో కారణం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రభుత్వ భూమిలో ఒక టీస్టాల్ లేదా దుకాణాన్ని నడుపుకోవడం, పన్నులు చెల్లించకుండా చట్టవిరు ద్ధంగా ఆటోరిక్షాలు నడుపుకోవడానికి పేదలకు స్థానిక తృణమూల్ నాయకులనుంచి మద్దతు లభిస్తోంది. అదేవిధంగా చట్టవిరుద్ధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్లను నడుతున్న లక్షల సంఖ్యలో ప్రజలు కూడా తృణమూల్‌కు గట్టి మద్దతుదార్లుగా వున్నారు.
స్థానిక పార్టీగా బీజేపీకి గుర్తింపు లేదు
చాలామంది బెంగాలీ హిందువులు బీజేపీని బయటినుంచి వచ్చిన పార్టీగా పరిగణిస్తారు. బీజేపీ చేసుకున్న కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఇందుకు కారణం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తృణమూల్ కాంగ్రెస్, ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసింది. ముఖ్యంగా బీజేపీ ఉత్తరభారత్‌కు చెందిన పార్టీగా ఇక్కడి ప్రజలు పరిగణిస్తారు. తమకు బీజేపీకి ఎంత మాత్రం పొసగదన్న అభిప్రాయం దృఢంగా వుంది. ఇదే సమయంలో భాజపాకు రాష్ట్రంలో గట్టి సంస్థాగత బేస్ ఇంకా ఏర్పడలేదు. అటువంటి బేస్ ఏర్పడితే, ఓటర్లు ధైర్యంగా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోగలుగుతారు. అరాచకానికి, హింసాత్మక రాజకీయాలకు పెట్టింది పేరుగా వున్న బెంగాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా తన మద్దతుదార్లకు రక్షణ క ల్పించే స్థితిలో వుండాలి. బీజేపీకి అటువంటి సంస్థాగత బలం లేకపోవడంతో ఎంతోమంది హిందువులు పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌లకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాదు బూత్ స్థాయిలో రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు అవసరమైన కార్యకర్తల బలం బీజేపీకి లేదు. ఇక పట్టణ ప్రాంత బెంగాలీలు ప్రత్యేకించి కోల్‌కతా నగరానికి చెందిన హిందువులు లెఫ్ట్ పార్టీలకు అనుకూలం. ఎప్పుడైతే కమ్యూనిస్టులు తెరమరుగైపోయారో వీరంతా తృణమూల్ కాం గ్రెస్ మద్దతుదార్లుగా మారిపోయారు. వీరు బీజేపీని మతతత్వ పార్టీగా విస్తృతంగా ప్రచారం చే స్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో బెంగాలేతరుల జనాభా అధికం. వీరంతా తృణ మూల్ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారు. ఇటువంటి బెంగాలేతర వర్గాలనుంచి ప్రముఖ నాయకులను ఆకర్షించడంలో బీజేపీ ఇంకా సఫలీకృతం కాలేదు. దీంతో పాటు వీరిని విస్మరించడం కూడా పార్టీకి ప్రతికూలతగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు అనుకూలుడైన సమర్థ నాయకుడిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిరది. హిందువుల్లోని అన్ని వర్గాలను ఆకర్షించగలిగే ఛరిష్మా నాయకుడు లేకపోవడం పార్టీకి పెద్దలోటుగా మారింది. ఇన్ని కారణాల నేపథ్యంలో ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు నడిపే పార్టీలకు హిందూ ఓటర్లు అనుకూలంగా వుండటంలో పెద్ద విశేషమేం లేదు. బలం వున్నవాడి వైపే వీరు మొగ్గు చూపుతున్నారు. ఇదే తృణమూల్‌కు లాభం.
-ప్రత్యేకంగా పెత్తనం చేయాలనుకొన్న వారు ఊగిసలాడుతున్నారు.
-మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.
-అతి విశ్వాసంతో రాజకీయాలను ఏలుదామనుకున్నారు.
-రాణించలేక చతికిలపడిపోతున్నారు.
-ఒంటరి పోరాటంలో అలసిపోయి పార్టీల పంచన చేరుతున్నారు.
-అక్కడ గుర్తింపు కోసం ఆరాపడుతున్నారు.
-నిన్నటిదాకా పోరాటం చేసిన వారి పంచన చేరిన వారు వున్నారు.
-రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వారున్నారు.
-ఉనికి కోసం తహతహలాడుతున్నారు.
-అధికారిగా వున్నప్పుడు ప్రజలకు దూరంగా వున్నారు.
-రిటైర్ అయ్యాక రాజకీయాలలో చేరి జనాన్ని ఉద్దరిస్తామంటారు.
-రాజకీయ పదవుల కోసం అర్రులు చాస్తున్నారు.
-సవాలు చేసిన పార్టీలు పంచన చేర్చుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు.
-వున్న పేరును చెడగొట్డుకొని, విమర్శల పాలౌతున్నారు.
-రాజకీయ విశ్లేషకుల పాత్రలు పోషిస్తూ నిత్యం మీడియాలో వుంటున్నారు.
-ప్రతి సమస్య మీద ఏదో ఒక డిబేట్ లో పాల్గొంటున్నారు.
-ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయ అని ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉద్యోగులు ముదిరితే నాయకులౌతారంటే ఇదేనేమో! రాను రాను రాజకీయాల్లోకి ఉద్యోగులు పెద్దఎత్తున వచ్చే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులుగా ఎడాపెడా సంపాదించి, తర్వాత వాటిని రాజకీయాల కోసం కొంత ఖర్చు చేసి, మరింత దోచుకునేందుకు మార్గం వేసుకునే వారు చాలా మంది క్యూలో వున్నట్లున్నారు. తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుందన్నది ఎంత నిజమే ఉద్యోగులు నాయకులైతే కూడా అదే జరుగుతుంది. అంతకు మించి ప్రజలు కూడా వారి నుంచి ఏదీ ఆశించడం లేదు. నిజాయితీగా ఉద్యోగం చేసిన ఎంత పెద్ద అధికారులైనా ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాని కొంత మంది మాత్రమే రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. వాళ్లేమీ జీవితాలు త్యాగంచేసిన వారు కాదు. ఉద్యోగం చేసిన నాడు వారి జీతాల నుంచి జనానికి సేవ చేసిన వారు కాదు. కాని ఆగష్టు 15, జనవరి 26 నాడు పుటక్కున దేశ భక్తి పుట్టుకొచ్చి, జెండా వందనం అయిపోగానే చట్టుక్కున మర్చిపోయినట్లే వుంటుంది. ఉద్యోగం చేసినంత కాలం వారి జీవిత కాలం మొత్తం సామాన్యుడిని దగ్గర తీసుకున్న సందర్భాలే వుండవు. కాని అంతా అయిపోయాక రాజకీయాల్లోకి వచ్చే ముందుకు ఎవరూ చూడని, వినని ముచ్చట్లన్నీ చెప్పేస్తుంటారు. జనాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో సక్సెస్ రేటు చాలా తక్కువ. ఇయితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకోవాలి. తమకు తాము గొప్ప బలవంతులమని, అతి విశ్వాసానికి వెళ్లిన నాయకులెవరూ తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ అయిన వారు లేరు. ముందుగా చెప్పుకోవాల్సిన నాయకుడు జయప్రకాశ్ నారాయణ్. ఏకంగా లోక్‌సత్తా అనేపార్టీ పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి రహితసమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తానన్నాడు. ఉమ్మడి రాష్ట్ర్రంలో ఓ పదేళ్ల పాటు రాజకీయం చేశాడు. కాని ప్రజలు ఆదరించలేదు. పైగా ఆయనకు రాజకీయాలు చేసేంత సొమ్మెక్కడిది అని జనం ప్రశ్నించుకున్నారు. ఒక దశలో హైదరాబాద్ నగరమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని అనేక నగరాల్లో లోకస్ సత్తాను ముందుగా విస్తరించాలని చూశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌తోపాటు, అనేక నగరాల్లో లోక్ సత్తా గురించి ఆయన చేసిన ప్రచారం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్ము ఎక్కడిది? అన్న ప్రశ్న మొదలైంది. దాంతో అప్పటి నుంచి ఆయన పతనం కూడా మొదలైంది. ఏపి ప్రజలు ఆదరించలేదు. తెలంగాణ ప్రజలు దరి చేర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమం మీద లేని పోని కిరికిరి పెట్టే ప్రయత్నం చేసి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. 2009లో ఓసారి జనం నమ్మి చూద్దామని కూకట్ పల్లి నుంచి గెలిపించారు. కాని ఆయన నాయకుడిగా పనిచేయలేదు. అమెరికాలో రాజకీయం ఇలా వుంటుంది. లండన్‌లో ఇలా వుంటుంది. ఇక్కడ కూడా అదే అమలు చేద్దామన్నట్లు మాటలు చెప్పారు. ప్రజలకు దూరమయ్యారు. రేషన్ కార్డు కోసం మన దేశంలో నాయకుడికి దగ్గరకు వెళ్లడమే ప్రజలకు అలవాటు. అదే రివాజు. తర్వాత అదికారులకు అర్జీలు పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో రేషన్ కార్డు కావాలంటే రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి ధరఖాస్తు చేసుకోవాలి. నా దగ్గరకు వస్తే నేనేం చేస్తా?అని అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతే సామాన్యుడికి ఎంత దగ్గరగా వుంటే నాయకుడు అంత ప్రజల గుండెల్లో వుంటాడు. అధికారికి ప్రజలకు దూరం వుండడమే తెలుసు. డాబు, దస్కం చూపించడమే అలవాటు. అలాంటి వారు ప్రజలకు చేరువ కావడం అన్నది దుర్లభం. ఎంత మంది అదికారి అనే పేరున్నా, నేరుగా ప్రజలకు సేవ చేసే నాయకుడు కాలేదు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు తటస్ధులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, సరికొత్త రాజకీయం చూపిస్తానన్నాడు. ఎన్నికల్లో మాజీ సిబిఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన విజయరామారావును ఖైరతాబాద్ నుంచి పోటీ చేయించారు. అలా మరి కొంత మందికి అవకాశాలు కల్పించారు. ఆ ఎన్నికల్లో వాళ్లంతాగెలిచారు. అందులో ఓ నలుగురికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఆ నలుగురు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజలకు గుర్తు కూడా లేరు. కాకపోతే ఒక్కసారైనా గెలిచారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. అలా ఒకపార్టీని నమ్ముకొని రాజకీయాలు చేసిన ఉద్యోగులు అంతో ఇంతో రాజకీయంగా కూడా రాణించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు రాజకీయాలలో ఇప్పటికీ కీలకభూమిక పోషిస్తున్నారు. తొలి తెలంగాణ మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామీ గౌడ్ ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తర్వాత బిఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మండలి సభకు చైర్మన్ అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్ నాయక్ కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎమ్మెల్సీ కోదండరాం రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. కాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనే గెలవలేకపోయారు. బిఆర్ఎస్లో చేరి వుంటే ఎప్పుడో రాజకీయంగా మరో స్ధాయిలో వుండేవారు. కాని ఆయన వేసిన తప్పటడుగుల మూలంగా పార్టీ పెరిగింది లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచింది లేదు. కాకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపడంతో ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. 2023 ఎన్నికల ముందు పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ , తన ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను బిఆర్ఎస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అయినా దాన్ని కాదనుకొని రాజకీయాల్లోకి వచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వంమీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తానే స్వయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నారు. కాని బిఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేశారు. అప్పుడు గాని రాజకీయాలంటే ఏమిటో ఆయనకు అర్ధం కాలేదు. దాంతో బిఎస్పీని వదిలేసి బిఆర్ఎస్లో చేరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అదికారంలో వున్నప్పుడే ఆయన పార్టీలో చేరితే ఆయన రాజకీయం మరోలా వుండేది. కాని ఆయన అడుగడుగునా కేసిఆర్‌ను విమర్శిస్తూ వెళ్లారు. ఒక రకంగా బిఆర్ఎస్ ఓటమికి ఆయన కూడా నీటి బొట్టుగా మారారు. అప్పుడు కేసిఆర్‌ను తూర్పార పట్టిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆకాశానికెత్తుకుంటున్నారు. అంటే ఉద్యోగులు కూడా అవకాశ వాద రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చారని అర్దం చేసుకోవచ్చు. గతంలో కూడా ఉద్యోగులు కొంత మంది రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరి పదవులు పొందిన వారున్నారు. వరంగల్ ఎంపిగా రెండు సార్లు గెలిచిన సిరిసిల్ల రాజయ్య ఒకప్పుడు ఉద్యోగం చేసిన వారే. ప్రస్తుత మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్ కూడా ఒకప్పుడు ఉద్యోగి. ఆయన గతంలో ఎంపిగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు. ఈసారి మళ్లీ ఎంపిగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక టీచర్‌గా పనిచేసిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గత నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఒకటి రెండు ఓటములు తప్ప ఆయన వరుస విజయాలు సాదిస్తూవచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్ కేసును పర్యవేక్షించిన సిబిఐ. జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఇంటిపేరు జేడిగా స్ధిరపర్చుకున్న లక్ష్మి నారాయణ రాజకీయాల్లో విజయాలు చవి చూడలేకపోతున్నారు. సొంతంగా పార్టీ పెట్టి చతికిలపడిపోయారు. కొన్ని పార్టీలు తిరిగి అక్కడ కూడా నెగల్లేక పోయారు. ఇప్పుడు రాజకీయాలపై యువత అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నారు. మీడియాలో విశ్లేషకులుగా పనిచేస్తున్నారు. ఎంతో సమర్ధవంతమైన అధికారిగా ఆయనకు వున్న పేరును రాజకీయాల్లోకి వచ్చి చెడగొట్టుకున్నారు. ప్రజల్లో వున్న గుర్తింపు తనకు తానే చెరిపేసుకున్నారు. ఒకప్పుడు ఆయన మాట కోసం మీడియా ఎగబడిపోతుండేది. ఇప్పుడు తన మాటలు చెప్పడంకోసం మీడియా సంస్దల చుట్టూ లక్ష్మినారాయణ తిరగాల్సి వస్తుంది. ఉద్యోగం చేసినప్పుడు ఆయన ప్రజలకు ఏంసేవ చేశారో లేదోగాని, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేద్దామనుకుంటు ప్రజలు స్వాగతించలేదు. ఇక పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన వారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. రాణించాలని కూడా చూస్తున్నారు. వారిపై మరో ప్రత్యేక కధనం త్వరలో…
జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం లో పి.సి.పి.ఎన్.డి.టి సమావేశం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
ఈరోజు సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. రజిత ఆధ్వర్యంలో పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ కమిటీ సమావేశంలో జిల్లాలో పి.సి.పి.ఎన్.డి.టి నిబంధనలు వ్యతిరేకంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్లను, లింగ నిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారము మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు10,000 రూపాయల జరిమానా విధిస్తామని గైనకాలజిస్ట్ డాక్టర్లకు, రేడియాలజిస్ట్లకు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఈ సందర్భంగా సూచించినారు. ఈ కమిటీ సమావేశంలో పి.సి.పి.ఎన్.డి.టి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతూరు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి శుక్ల, ఎన్జీవో కమిటీ సభ్యురాలు ఝాన్సీ లక్ష్మి, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్. ఇ.బాలయ్య, డి.ఇ.ఓ మహేష్ పాల్గొన్నారు.
ఆదివాసీల అంతం కోసమే కేంద్ర ప్రభుత్వ కుట్ర ఆపరేషన్ కగార్ ను నిలిపి వేయాలి.
తుడుందెబ్బ డిమాండ్.
కొత్తగూడ, నేటిధాత్రి:
ఆదివాసీ ల భూభాగం లోని అడవి బిడ్డల కాళ్ళ కింద ఉండబడిన వనరులను,విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకు,సిద్దపడి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల ఆవాస నివాస ప్రాంతం లోకి మిల్టరీ,సి ఆర్ పి యఫ్,కొబ్రా,బ్లాక్ కామోండో బాలగాలను దించి ఆదివాసీల స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా,ఇష్టా రాజ్యాంగ ఆదివాసీల పై ఉచ్చకోత కోస్తుందని, పౌర హక్కుల ను కాలరాస్తూ, అల్లకల్లోలం సృష్టిస్తూ ఆదివాసీలని అంతం చేయాలనే కుయుక్తులు పన్నుతుందని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దమణ కాండను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తుందని, ఆదివాసుల పై వనరుల దోపిడీ కోసం జరుగుతున్న దుచర్యలను యావత్ పౌర సమాజం ముక్తాఖంఠం తో వ్యతిరేకించి ఆపరేష్ కగార్ ను నిల్పివేసే వరకు తమ నిరసన ను తెలిపాలని కర్రే గుట్టలనుండి సాయుధ బలగాలను వెంటనే వెనుకకు రప్పించెందు కు హక్కుల సంఘాలు,బిజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పై పోరాటాలు చేయాలని ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ ఆవరణములో మండల అధ్యక్షులు ఈక విజయ్ అధ్యక్షతన జరిగిన కగార్ వ్యతిక సమావేశం లో జిల్లా అధ్యక్షలు కుంజ నర్సింగరావు డిమాండ్ చేశారు సమావేశం లో పూనెం సురేందర్,ఈక సాంబయ్య,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,బంగారు సారంగా పాణి,భూపతి రమేష్ లు పాల్గొన్నారు.
కొత్తగూడ మండలం కార్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కల్తీ నరసయ్య గారి అమ్మగారు ఇటీవల కాలం చేశారు వారి యొక్క దశదినకర్మలకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, గారి ఆధ్వర్యంలో మంగళవారం రోజు దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కల్తీ నరసయ్య గారిని ఓదార్పు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ మొగిలి గ్రామ పార్టీ అధ్యక్షులు ఇర్ప వెంకన్న, మాజీ సర్పంచ్ మండల అధికార ప్రతినిధి ఇర్పరాజేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, సోలం వెంకన్న, కాంగ్రెస్ గ్రామ కమిటీ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..
ఆదివాసి సంక్షేమ పరిషత్ మండలం అధ్యక్షులు తూర్స, క్రిష్ణ బాబు.
నూగూర్ వెంకటాపురం
(నేటి ధాత్రి ):
మంగళవారం నాడు వెంకటాపురం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు అధ్యక్షనలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీల రక్షణకై ఏర్పాటు చేసిన చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీలో గిరిజనేతరులకు అన్ని విధాలుగా హక్కులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్ భూభాగంలో పనిచేస్తున్న వంటి ప్రభుత్వ అధికారులు కూడా గిరిజన ఇతరులకు అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులకు హక్కులు కావాలని సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆదివాసుల పొట్టలు కొడుతూ G.O.Ms no.3 ని కాజేశారని మండిపడ్డారు. జీ.ఓ.ఎంఎస్. నెం. 3ను మినీ అసెంబ్లీ అయినటువంటి ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీలో మరియు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాలను పరిరక్షించుటకై 5 మే 2025 న ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాటి నాగరాజు, బొగ్గుల రాజ్ కుమార్, బొగ్గుల ప్రశాంత్, గట్టుపల్లి సంజయ్, పూణేం అర్జున్, తాటి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పులో జరుగుతున్న భూ భారతి చట్టం అవగాహన సదస్సులో, ఒక పేద మహిళ రైతు, తన సమస్య చెప్పుకోవడానికి వేదిక పక్కన వేచి ఉండడంతో, అది గమనించిన మంత్రి పొంగులేటి, సదరు మహిళను స్టేజ్ మీదకు పిలిచి, తన పక్కన కూర్చోబెట్టుకొని, మహిళా సమస్యను విని, సానుకూలంగా స్పందించి, వెంటనే అధికారులకు ఆమె సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఇది చూసిన వారందరూ మంత్రిని అభినందించారు. పేద వాళ్లకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొంగులేటి వరంగల్ లో మరోసారి నిరూపించారు..
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వ్యవసాయ సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి.
వెంకటాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదాపురం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఊరటి మైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ రెడ్డి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాకు రూ.2320, సీ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2300 ప్రభుత్వ మద్దతు ధర కేటాయించిందని పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరతోపాటు రూ.500 బోనస్ అదనంగా రైతులకు అందిస్తుందని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్, జంగిలి రవి,జరుపుల శ్రీను, సీఈఓ ఎం రమేష్, ప్రకాష్ ,ఇన్చార్జి సాంబయ్య, రైతులు లింగారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుపతి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్, ఖిలా వరంగల్ మండలాల పరిధిలో “భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు”లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
వరంగల్ తూర్పు, నేటిధాత్రి.
ప్రజా పాలన, ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని వరంగల్ మండలం, ఖిలా వరంగల్ మండలం పరిధిలోని రైతులకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో మంగళవారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ, ముఖ్య అతిథులుగా వరంగల్ ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ పౌరసరఫరాల శాఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వరంగల్ నగరంలో నిర్వహించిన, భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా దేవి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ, వరంగల్ సబ్ కలెక్టర్, వరంగల్ ఆర్డిఓ, అలాగే వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు, వరంగల్ తూర్పు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వరంగల్ ఖిలా వరంగల్ మండలాల రెవెన్యూ అధికారులు, రెండు మండలాల రెవెన్యూ సిబ్బంది, రెండు మండలాల నుండి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….
భూ భారతి అవగాహన సదస్సులో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఈరోజు వరంగల్, ఖిల్లా వరంగల్ మండలాలకు సంబంధించిన భూ భారతి కార్యక్రమం ఏర్పాటు శుభసూచకం అని అన్నారు. గత ప్రభుత్వంలో ధరణి చట్టం కేవలం వాళ్ళ నాయకుల దౌర్జన్యాలకు, కబ్జాలకు మాత్రమే ఉపయోగపడిన చట్టం అని అన్నారు. రైతులను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీ మట్టికొట్టుకుపోయింది అని, భూభారతి చట్టంతో ప్రతి ఒక్క రైతుకు మేలు జరుగుతుంది అని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన మోసాలు ఇప్పుడు జరిగే అవకాశం లేదు అని, వరి వేస్తే ఉరి వేసుకోవాలన్న కేసీఆర్ కు రైతులు తగిన బుద్ధి చెప్పారు అని, ఇక నుండి భూ భారతి ద్వారా ప్రజల వద్దకు నేరుగా అధికారులు వచ్చి మీ సమస్యలు కనుక్కొని వాటిని పరిష్కారం చేస్తారని తెలిపారు.
Government
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి 2020 చట్టంతో ప్రతి ఒక రైతు పడిన ఇబ్బందులు చూసాము. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ధరణితో ఇబ్బంది పడిన ప్రతి రైతుల సమస్యలు తీర్చాలన్న అభిప్రాయంతో భూభారతి చట్టం తీసుకువచ్చాం. తరతరాల నుండి ఉన్న భూ సమస్యలు, ధరణితో వచ్చిన దరిద్రాన్ని పారద్రోలడానికి భూభారతి చట్టం వచ్చింది.. ధరణి చట్టంతో రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూభారతి చట్టంలో రెవెన్యూ శాఖ అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది అని అన్నారు. ధరణి చట్టంలో నమోదు కాబడిన పొరపాట్లు అన్నింటిని భూభారతి చట్టం ద్వారా సరిచేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ధరణిని అడ్డుపెట్టుకొని వేలాది ఎకరాలను కొల్లగొట్టిన బిఆర్ఎస్ నాయకులకు భూభారతి చట్టం బుద్ధి చెబుతుంది అని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలన్నీ అమలుపరుస్తున్నాం అని తెలిపారు. పేదల సంక్షేమం కొరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాము అని, నాడు ధనిక రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. బిఆర్ఎస్ ప్రభుత్వo అప్పుల తెలంగాణగా మార్చింది అని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాలలో అధికారులను పర్యటింపజేసి చట్టాలలో ప్రవేశపెట్టాం అని, తండ్రులు తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని పట్టా చేసుకునే పరిస్థితి లేదు. భూభారతితో అనేక సమస్యలు పరిష్కరించుకుని వీలు ఉంది అని, చట్టాలు రూపొందించడంతో పాటు విధి విధానాలు రూపొందించి వంద రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మొదటగా రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో, నాలుగు మండలాలు తీసుకొని, ఆ మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేసి సమస్య ప్రభుత్వమే వెళ్లి పరిష్కరించింది అని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చిన నాలుగు మండలాల దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరిస్తాం అని తెలిపారు. మిగిలిన జిల్లాలలో కూడా జూన్ రెండవ తేదీ నాటికి అన్ని జిల్లాలలో భూ భారతి చట్టాన్ని అమలు చేస్తాం అని అన్నారు. జూన్ రెండో తేదీ నుండి ప్రతి రెవెన్యూ గ్రామాన్ని, ఎమ్మార్వో సందర్శించి ఇక్కడే సమస్యలు పరిష్కరిస్తారు. రైతులకు కానీ, భూములున్న ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి ఇందిరమ్మ రాజ్యంలో ఉండదని పొంగులేటి అన్నారు. మొదటి విడతలో నాలుగు లక్షల ఇండ్లు మే 5వ తేదీ లోపు అర్హులైన లబ్ధిదారులకు అందిస్తాం. భూభారతి తెలంగాణలో కాదు దేశంలోనే ఆదర్శంగా వంద సంవత్సరాల పాటు ఉండబోతుంది అని అన్నారు. మల్లి ధనిక రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జక్కుల వారి విధికి చెందిన వాసం రవికిరణ్ (40) తండ్రి కన్నయ్య (లేటు ), కులం కోయ, వృత్తి మిషన్ భగీరథ వాటర్ వాల్ ఆపరేటర్ గా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతూ ఇంట్లో నే ఉంటూ మిషన్ భగీరథ నీళ్లు వదులుతూ ఉండేవాడు.ఐదు రోజుల క్రితం గురువారం నాడు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి బయలు దేరి మిషన్ భగీరథ నీళ్లు వదలి వస్తానని అతని తల్లి అయినా వాసం సాలమ్మ తో చెప్పి తన మోటార్ సైకిల్ తీసుకోని దేరాడు. తన కొడుకు ఇంటికి రాక పోయేసరికి తల్లి వాసం సాలమ్మ అన్ని చోట్ల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించక పోవడం తో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు పిర్యాదు చేసింది. స్థానిక ఎస్సై కె తిరుపతి రావు వాసం సాలమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు లో భాగంగా వాసం రవికిరణ్ తన ఆరోగ్యం బాగాలేనప్పటికి మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమీ లో ఇంటి నుండి బయటకు వెళ్లడం వలన వడదెబ్బకు గురై అస్వస్థత చెంది వి. ఆర్. కె పురం గ్రామ శివారు లోని పాలెం వాగు ప్రాజెక్టు కాలువ సమీపంలో పడి పోయినట్లు తెల్సింది. ఆ ప్రదేశం నిర్మాన్యూస్య ప్రదేశమై ఎవరు చూడకపోవడం తో మృతుడు మరణించినట్లు గా ప్రాథమిక విచారణ లో తెలుస్తుందని అన్నారు. మృత దేహాన్ని తన తల్లి వాసం సాలమ్మ గుర్తించగా ఆమె వాంఘ్ములం మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
దుర్గమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళి నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
మంగళవారం కేసముద్రం మండలం కేంద్రంలో సప్పిడి గుట్ట తండా దుర్గమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళి నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళీ నాయక్, మాట్లాడుతూ.. అమ్మ వారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి మరియు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తాం అని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ఇనుగుర్తి మండల అధ్యక్షులు సతీష్ మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న, మాజీ టీపీసీసీ సభ్యులు దస్రు నాయక్, మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య మాజీ ఎంపీటీసీ బానోత్ బద్రి నాయక్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు తరాల వీరేష్ యాదవ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగాల నేతాజీ, దామరి అశోక్,మండల నాయకులు,డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదాపురం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఊరటి మైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ రెడ్డి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2320, సీ గ్రేడ్ ధాన్యానికి రూ.2300 ప్రభుత్వ మద్దతు ధర కేటాయించిందని పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరతోపాటు రూ.500 బోనస్ అదనంగా రైతులకు అందిస్తుందని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్, జంగిలి రవి,జరుపుల శ్రీను, సీఈఓ ఎం రమేష్, ప్రకాష్ ,ఇన్చార్జి సాంబయ్య, రైతులు లింగారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుపతి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి అనేది కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమవుతుంది
కేసముద్రం మండల షాదీ ఖానా కమిటీ కి సన్మానం
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి
కేసముద్రం/ నేటి దాత్రి:
మంగళవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయము లో ముస్లిం మండల షాదీ ఖానా కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది, నూతనంగా ఏర్పడ్డ షాది ఖానా మండల నూతన కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులు పెద్దలు కలిసికట్టుగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డైరెక్టర్లు సంకేపల్లి నారాయణరెడ్డి, చిదురాల వసంతరావు, ఆ యూబ్ ఖాన్, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, నూతన షాది ఖానా మండల కమిటీ అధ్యక్షులు మహమ్మద్ రజాక్, ఎండి రఫీ, తాజుద్దీన్, లను మరియు కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి షాది ఖానా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ కేసముద్రం మండల ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని షాదీ ఖానా ఏర్పాటు కొరకు 80 లక్షల రూపాయలు మంజూరు చేయుటకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే షాదీ ఖానా అభివృద్ధి కొరకు ఇంతటితో సరిపోదని ఇంకా మునుముందు సహాయ సహకారాలు ఉంటాయని 80 లక్షల రూపాయల నిధితో షాది ఖానా ఏర్పాటు చేయడం నిధి సరిపోకపోతే మరల కొంత నిధులు మంజూరు చేయించడం కోసం కృషి చేస్తామని అన్నారు. అలాగే కేసముద్రం మండలంలోని ముస్లిం సోదరులు అందరూ ఏకతాటిపై ఉండి షాదీ ఖానా అభివృద్ధి కొరకు పాటుపడాలని, ముస్లిం సోదరులు అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని హితువు పలికారు. ముస్లింలలో చాలావరకు నిరుపేద కుటుంబాలే ఉన్నాయని అలాంటి నిరుపేద కుటుంబాలు శుభకార్యాలు చేసేవారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ షాదీ ఖానా ఏర్పాటు అనంతరం అందరికీ అందుబాటులో వస్తుందని ఎవ్వరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఈ షాదీ ఖానా అందరికీ ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని అందరూ కలిసికట్టుగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూరెల్లి సతీష్. ముదిగిరి సాంబయ్య. షాదీఖానా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి పట్టణంలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంద్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మరియు హిందువుల పై అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటని, కేవలం ఒక వర్గం ఓటు బ్యాంకు కోసం హిందువుల పైన విషం కక్కడం దారుణమని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మొగిలి దుర్గాప్రసాద్ అన్నారు. పహాల్గం దాడి ఘటనలో వీరమరణం పొందిన కుటుంబ సభ్యులు తమ వారిని తీవ్రవాదులు హిందువులుగా నిరూపించుకున్న తర్వాతే చంపడం జరిగిందని పక్కన ఉన్న వారి భార్య పిల్లలు వాపోయిన విషయాన్ని ఆనంద్ కుమార్ వక్రీకరించడం వెనుక ఒక వర్గం ఓట్ల కోసమే అన్నారు.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరి పబ్బం గడుపుకోవడం ఆనంద్ కుమార్ కు అలవాటే అన్నారు.వక్ఫ్ బోర్డ్ సమస్యను పక్కదోవ పట్టించడానికి భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగానే పహల్గావ్ సమస్యను తెరపైకి తెచ్చింది అనడం అవివేకమన్నారు. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ 100 కోట్ల హిందువులను చంపుతాం అన్నప్పుడు అప్పుడు హిందువులకు మద్దతుగా ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించలేదని ప్రశ్నించారు ఒక వర్గం మెప్పుకోసం కుర్చీ కోసం పనిచేసే ఆనంద్ కుమార్ ను వచ్చే స్థానిక సంస్థఎన్నికలలో బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు బోడ నర్సింహ,బిజెపి పట్టణ అధ్యక్షులు బాబీ దేవ్,మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్,తదతరులు పాల్గొన్నారు.
కోర్టు సిబ్బంది న్యాయవాదులు ఉగ్రవాదుల దాడి కి నిరసన గా మౌనం
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్,సిబ్బంది న్యాయవాదులు 22-04-2025 రోజున జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ వద్ద మన భారత విహార యత్రికులపై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపి అమాయక భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఇట్టి దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులలో రెండు నిముషాలు మౌనం పాటించాలని గౌరవనీయులైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల ననుసరించి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, చేర్యాల యందు కోర్టు సిబ్బంది మరియి న్యాయవాదులు రెండు నిముషాలు మౌనం పాటించి ప్రాణాలు కోల్పోయిన మన భారతీయుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేర్యాల కోర్టు సూపరిండెంట్ సుధాకర్ కోర్ట్ సిబ్బంది మరియు చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెల్లి వీరమల్లయ్య మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు
టెర్రరిస్టుల దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం ఆర్యవైశ్య అధ్యక్షులు బెజగం నాగరాజు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సభ్యులు అందరూ కలిసి పహల్గం లో జరిగిన టెర్రరిస్ట్ దాడి వలన చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ చనిపోయిన వారికి ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకొనుచు మండల కేంద్రంలో క్రోవత్తులతో శాంతిరాలి నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల ఆర్యవైశ్య అధ్యక్షులు బెజగం నాగరాజు ఉపాధ్యక్షులు బజ్జూరు వీరన్న యూత్ కమిటీ మెంబర్స్ పుల్లూరు సాయి మరియు బజ్జురి శ్రీరాములు మరియు మండల మాజీ అధ్యక్షులు బజ్జురి శ్రీనివాస్ ఇతర ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగినది
కనీస వేతన సలహా మండలి తీర్మానాలను వెంటనే గెజిట్ చేసి అమలుపరచాలి
కొత్తగూడెం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేసిన ఏఐటియుసి నాయకులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ప్రతిపాదనలను తక్షణమే గెజిట్ చేసి అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ముగ్దూమ్ భవన్ లో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కనీస వేతనాల సలహా మండలి సభ్యులు ఎండి.యూసుఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి.అక్బర్ ఆలీ లు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులకు కనీస వేతనాలు పెరగక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని, యాజమాన్యాలు అర కోర వేతనాలు చెల్లించి శ్రమ దోపిడికి పాల్పడ్డాయి అని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు పెంచడానికి కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేసి అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించారని, సోమవారం రోజున జరిగిన కనీస వేతనాల సలహా మండలి లో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని,కార్మికుల పర్వదినమైన మే 1 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి పంపించిన ప్రతిపాదనలను అంగీకరించి అధికారికంగా ప్రకటించాలని,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గెజిట్ చేసి అమలు పరుచుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలు జీవో ప్రకారం వేతనాలను కాంట్రాక్టు & ఔట్సోర్సింగ్ కార్మికులు పొందుతున్నారని,వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను ఆమోదించిన వెంటనే సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఉద్యోగ భద్రత,ఈఎస్ఐ, చట్టబద్ధమైన లీవులు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు అఫ్రోజ్ ఖాన్,యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ క్రిస్టోఫర్,కార్యవర్గ సభ్యులు దొడ్డిపట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో జిఎం ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
మందమర్రి నేటి ధాత్రి
కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో జి ఎం ఆఫీస్ మరియు సివిల్ ఆఫీస్ ముందు ధర్నా మెమోరం ఇవ్వడం జరిగింది సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల కూలిండియా వేతనాలు ఇతర హక్కుల సౌకర్యాలు అమలుపరచడం గురించి సింగరేణి సంస్థలో అన్ని విభాగాలలో సుమారు 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు కాంటాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు చట్టబద్ధమైన హక్కులను సౌకర్యాలను అమలు చేయకుండా ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయకపోవడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం జెవిసిసిఐ నిర్ణయించిన హై పవర్ కమిటీ వేతనాలను 2013 నుండి అమలు చేయవలసి ఉండగా సింగరేణి సంస్థ అమలు చేయడం లేదు కూల్ ఇండియా పరిధిలో కొన్ని సంస్థలు జేబీసీసీ నిర్ణయించిన హైపర్ కమిటీ వేతనాలను అమలు చేస్తున్నప్పటికీ లాభాలతో నడుస్తున్న సింగరేణిలో కుంటి సాకులు చూపి అమలు చేయకపోవడం అన్యాయం కాంట్రాక్ట్ కార్మికులుగా
GM office
పనిచేస్తున్న వారు దళిత గిరిజన మైనార్టీ నిరుపేద కాంట్రాక్ట్ కార్మికులు వారి శ్రమకు తగ్గ వేతనం లభించకపోవడంతో లక్షలాది రూపాయల కష్టార్జితం కోల్పోయి ఇబ్బందులను అనుభవిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆదేశాలున్నప్పటికీ అందుకు కూడా సింగరేణి యాజమాన్యం అమలు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచడానికి పూనుకొనలేదు ఈ మేడే సందర్భంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను చట్టబద్ధహక్కులను తక్షణమే అమలు చేయాలని కోరుచున్నాము ఇట్లు జేఏసీ సంఘాల ప్రతినిధులు ఎండి జాఫర్ ఐ ఎఫ్ టి యు పి.మహేశ్వరి ఆర్ అజయ్ ఎస్ కనకయ్య ఎస్ భూమయ్య వెంకట స్వామి గణేష్ తదితరులతోపాటు టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు మణిరం సింగ్ ఎండి సుల్తాన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు జిఎం ఆఫీస్ లో పీఎం సివిల్ ఆఫీసులో డివైజిఎం రాములు మెమోరండం ఇవ్వడం జరిగింది
తెలంగాణ జన సమితి పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో ని కొత్త బస్టాండ్ లో తెలంగాణ జన సమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు ఏశాల గంగారెడ్డి జండా ఆవిష్కరించారు అనంతరం జనసమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పై పోరాటం లో తెలంగాణ జన సమితి పార్టీ ముందు ఉంటుంది, నిరంతరం ప్రజా సమస్యలపై, విద్యార్థి-నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ అని మరియు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలంగాణ జన సమితి అని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో TJS జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట శంకర్ గారు, TJS ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు కంతి రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి గారు, TJS నాయకులు కాట దశరథ్ రెడ్డి, కంతి లింగారెడ్డి కంతి ప్రశాంత్, గోవర్ధన్ , ఒద్దే మోహన్,బద్దీ రాములు,జిల్లా రాజేందర్, నాగులపేట నరసయ్య, పెద్దరాజ్యం, గజ్జ రమేష్, గజ్జ శేఖర్, కంతి రాకేష్, కల్లెడ స్వామి, కంతి గంగాధర్, కచ్చకాయల వసంత్, పత్తి రెడ్డి శ్రీనివాస్, గట్టు మల్లయ్య, M.D. సలీం, హన్మాండ్లు, గుమ్మడి నరసయ్య, గడసంద రవి, నాచుపల్లి తిరుపతి, కనక ముత్తయ్య,కనక పోషయ్య,గొర్రె శ్రీనివాస్,సుంకే రాజన్న,తిమ్మని బావయ్య,కనక రాజేశ్వర్,సున్నం పెద్ద ముత్తన్న, నాచుపల్లి తిరుపతి,కనక వెంకట్, మరియు తెలంగాణ జన సమితి యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.