ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం..

Government

ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం..

:__ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

వరంగల్ తూర్పులో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమం.

వరంగల్, ఖిలా వరంగల్ మండలాల పరిధిలో “భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు”లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

 

 

ప్రజా పాలన, ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని వరంగల్ మండలం, ఖిలా వరంగల్ మండలం పరిధిలోని రైతులకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో మంగళవారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ, ముఖ్య అతిథులుగా వరంగల్ ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ పౌరసరఫరాల శాఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వరంగల్ నగరంలో నిర్వహించిన, భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా దేవి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ, వరంగల్ సబ్ కలెక్టర్, వరంగల్ ఆర్డిఓ, అలాగే వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు, వరంగల్ తూర్పు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వరంగల్ ఖిలా వరంగల్ మండలాల రెవెన్యూ అధికారులు, రెండు మండలాల రెవెన్యూ సిబ్బంది, రెండు మండలాల నుండి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….

భూ భారతి అవగాహన సదస్సులో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఈరోజు వరంగల్, ఖిల్లా వరంగల్ మండలాలకు సంబంధించిన భూ భారతి కార్యక్రమం ఏర్పాటు శుభసూచకం అని అన్నారు. గత ప్రభుత్వంలో ధరణి చట్టం కేవలం వాళ్ళ నాయకుల దౌర్జన్యాలకు, కబ్జాలకు మాత్రమే ఉపయోగపడిన చట్టం అని అన్నారు. రైతులను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీ మట్టికొట్టుకుపోయింది అని, భూభారతి చట్టంతో ప్రతి ఒక్క రైతుకు మేలు జరుగుతుంది అని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన మోసాలు ఇప్పుడు జరిగే అవకాశం లేదు అని, వరి వేస్తే ఉరి వేసుకోవాలన్న కేసీఆర్ కు రైతులు తగిన బుద్ధి చెప్పారు అని, ఇక నుండి భూ భారతి ద్వారా ప్రజల వద్దకు నేరుగా అధికారులు వచ్చి మీ సమస్యలు కనుక్కొని వాటిని పరిష్కారం చేస్తారని తెలిపారు.

 

Government
Government

 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి 2020 చట్టంతో ప్రతి ఒక రైతు పడిన ఇబ్బందులు చూసాము. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ధరణితో ఇబ్బంది పడిన ప్రతి రైతుల సమస్యలు తీర్చాలన్న అభిప్రాయంతో భూభారతి చట్టం తీసుకువచ్చాం. తరతరాల నుండి ఉన్న భూ సమస్యలు, ధరణితో వచ్చిన దరిద్రాన్ని పారద్రోలడానికి భూభారతి చట్టం వచ్చింది.. ధరణి చట్టంతో రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూభారతి చట్టంలో రెవెన్యూ శాఖ అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది అని అన్నారు. ధరణి చట్టంలో నమోదు కాబడిన పొరపాట్లు అన్నింటిని భూభారతి చట్టం ద్వారా సరిచేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ధరణిని అడ్డుపెట్టుకొని వేలాది ఎకరాలను కొల్లగొట్టిన బిఆర్ఎస్ నాయకులకు భూభారతి చట్టం బుద్ధి చెబుతుంది అని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలన్నీ అమలుపరుస్తున్నాం అని తెలిపారు. పేదల సంక్షేమం కొరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాము అని, నాడు ధనిక రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. బిఆర్ఎస్ ప్రభుత్వo అప్పుల తెలంగాణగా మార్చింది అని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాలలో అధికారులను పర్యటింపజేసి చట్టాలలో ప్రవేశపెట్టాం అని, తండ్రులు తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని పట్టా చేసుకునే పరిస్థితి లేదు. భూభారతితో అనేక సమస్యలు పరిష్కరించుకుని వీలు ఉంది అని, చట్టాలు రూపొందించడంతో పాటు విధి విధానాలు రూపొందించి వంద రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మొదటగా రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో, నాలుగు మండలాలు తీసుకొని, ఆ మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేసి సమస్య ప్రభుత్వమే వెళ్లి పరిష్కరించింది అని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చిన నాలుగు మండలాల దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరిస్తాం అని తెలిపారు. మిగిలిన జిల్లాలలో కూడా జూన్ రెండవ తేదీ నాటికి అన్ని జిల్లాలలో భూ భారతి చట్టాన్ని అమలు చేస్తాం అని అన్నారు. జూన్ రెండో తేదీ నుండి ప్రతి రెవెన్యూ గ్రామాన్ని, ఎమ్మార్వో సందర్శించి ఇక్కడే సమస్యలు పరిష్కరిస్తారు. రైతులకు కానీ, భూములున్న ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి ఇందిరమ్మ రాజ్యంలో ఉండదని పొంగులేటి అన్నారు. మొదటి విడతలో నాలుగు లక్షల ఇండ్లు మే 5వ తేదీ లోపు అర్హులైన లబ్ధిదారులకు అందిస్తాం. భూభారతి తెలంగాణలో కాదు దేశంలోనే ఆదర్శంగా వంద సంవత్సరాల పాటు ఉండబోతుంది అని అన్నారు. మల్లి ధనిక రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!