ఘనంగా జనసమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఇబ్రహీంపట్నం నేటిధాత్రి:
తెలంగాణ జన సమితి పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో ని కొత్త బస్టాండ్ లో తెలంగాణ జన సమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు ఏశాల గంగారెడ్డి జండా ఆవిష్కరించారు
అనంతరం జనసమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పై పోరాటం లో తెలంగాణ జన సమితి పార్టీ ముందు ఉంటుంది, నిరంతరం ప్రజా సమస్యలపై, విద్యార్థి-నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ అని మరియు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలంగాణ జన సమితి అని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో TJS జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట శంకర్ గారు, TJS ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు కంతి రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి గారు, TJS నాయకులు కాట దశరథ్ రెడ్డి, కంతి లింగారెడ్డి కంతి ప్రశాంత్, గోవర్ధన్ , ఒద్దే మోహన్,బద్దీ రాములు,జిల్లా రాజేందర్, నాగులపేట నరసయ్య, పెద్దరాజ్యం, గజ్జ రమేష్, గజ్జ శేఖర్, కంతి రాకేష్, కల్లెడ స్వామి, కంతి గంగాధర్, కచ్చకాయల వసంత్, పత్తి రెడ్డి శ్రీనివాస్, గట్టు మల్లయ్య, M.D. సలీం, హన్మాండ్లు, గుమ్మడి నరసయ్య, గడసంద రవి, నాచుపల్లి తిరుపతి, కనక ముత్తయ్య,కనక పోషయ్య,గొర్రె శ్రీనివాస్,సుంకే రాజన్న,తిమ్మని బావయ్య,కనక రాజేశ్వర్,సున్నం పెద్ద ముత్తన్న, నాచుపల్లి తిరుపతి,కనక వెంకట్, మరియు తెలంగాణ జన సమితి యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..