జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం లో పి.సి.పి.ఎన్.డి.టి సమావేశం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
ఈరోజు సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. రజిత ఆధ్వర్యంలో
పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ కమిటీ సమావేశంలో జిల్లాలో పి.సి.పి.ఎన్.డి.టి నిబంధనలు వ్యతిరేకంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్లను, లింగ నిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారము మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు10,000 రూపాయల జరిమానా విధిస్తామని గైనకాలజిస్ట్ డాక్టర్లకు, రేడియాలజిస్ట్లకు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఈ సందర్భంగా సూచించినారు. ఈ కమిటీ సమావేశంలో పి.సి.పి.ఎన్.డి.టి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతూరు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి శుక్ల, ఎన్జీవో కమిటీ సభ్యురాలు ఝాన్సీ లక్ష్మి, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్. ఇ.బాలయ్య, డి.ఇ.ఓ మహేష్ పాల్గొన్నారు.