సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఆదివారం రోజు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ దీర్ఘకాలకు సెలవు పై వెళ్లడం వలన మునిసిపల్ జరుగు అభివృద్ధి కార్యక్రమాలు పాలనపరమైన వ్యవహారాలన్నీ ఆటంకాలు ఏర్పడుతుంది. కేవలం కొద్దిరోజుల వరకే కమిషనర్ లీవ్ లో వెళితే బాగుండేది కానీ దీర్ఘకాలం సెలవు పై వెళ్లడం వలన 39 వార్డులతో ఉన్న సిరిసిల్ల పట్టణం చాలా పెద్ద మున్సిపల్ గా ఉన్న వ్యవహారాలలో ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నవి. మున్సిపల్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటన ఎదురు కావడం పాలకవర్గం లేకపోవడంతో ఎవరు కూడా దీని మీద శ్రద్ధ కనబడుచుక పోవడం ఒకింత బాధ కలిగించి ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో కమిషనర్ నియమించాలి కలెక్టర్ ప్రభుత్వానికి తెలియజేసి పూర్తి కలెక్టర్ నియమించాలి పాలన పాలనమైన వివారాలల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా కమిషనర్ నియమించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యం కార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చీకోట అనిల్ సహాయ కార్యదర్శి, కుసుమ గణేష్ కోశాధికారి చెప్ప దేవదాస్ సభ్యులు, నల్ల మురళి మేము ప్రజల పక్షాన కమిషనర్ నియమించాలని కోరుతున్నాము.
ఝరాసంగం: జగద్గురు మహాత్మా బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. ఆదివా రం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వర స్వామి విగ్రహాన్ని బర్దిపూర్, మల్లన్న గట్టు, ధనశ్రీ పీఠాధిపతులు సిద్దేశ్వర స్వామి, బసవలింగ, వీరేశ్వర శివాచార్య లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు అన్ని వర్గాల ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లించేందుకు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్ర మంలో ఉత్సవ కమిటీ నాయకులు పరమేశ్వర్ పాటిల్, సంగమేశ్వర్, వినీల నరేష్, చంద్రయ్యతో పాటు వివిధ గ్రామా భక్తులు పాల్గొన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన కార్యక్రమం జరగనుంది.
◆ – ఈ చారిత్రాత్మక నిరసన సమావేశానికి మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షత వహిస్తారు,మౌలానా అబూ తాలిబ్ రెహమానీ మరియు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ప్రచారం కన్వీనర్ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖైమి, వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉద్యమం సమాచారం ప్రకారం, వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ప్రచారంలో భాగంగా, తహాఫుజ్ దస్తూర్ మరియు అవుకాఫ్ సమావేశం అనే ఆల్ పార్టీ గ్రాండ్ చారిత్రాత్మక నిరసన సమావేశం సంగారెడ్డి జిల్లా స్థాయిలో మే 24, 2025 శనివారం, అస్ర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఈద్గా మైదాన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఫకీహ్ అస్ర్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది, దీనిలో ప్రత్యేక అతిథులుగా ఖతీబ్ షోలా బయాన్ హజ్రత్ మౌలానా అబూ తాలిబ్ రెహ్మానీ, హజ్రత్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్, అమీర్ జామియా నిజామియా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, సభ్యుడు పార్లమెంట్ హైదరాబాద్, మిస్టర్ అక్బర్ నిజామీ, హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్, జమియత్ ఉలేమా తెలంగాణ అధ్యక్షుడు, హజ్రత్ మౌలానా హుసాముద్దీన్ జాఫర్ పాషా.హజ్రత్ మౌలానా గియాస్ అహ్మద్ రషాది సాహిబ్ హజ్రత్ మౌలానా షఫీక్ ఆలం జామి జమియత్ అహ్లే హదీస్ తెలంగాణ ప్రతినిధి ఖలీద్ ముబాషిర్-ఉల్-జాఫర్ అమీర్ జమాత్-ఇ-ఇస్లామి తెలంగాణ జియావుద్దీన్ నాయర్ అధ్యక్షుడు తమీర్-ఎ-మిల్లత్ శ్రీ అబ్దుల్ అజీజ్ MPI సయ్యద్ మతీనుద్దీన్: ఖాద్రీ సయ్యద్ మసూద్ హుస్సేన్ ముజ్తహిద్ అధ్యక్షుడు అంజుమాన్ మహద్వియ్య ముహమ్మద్ అలీ షబ్బీర్ సలహాదారుడు తెలంగాణ సురేష్ కుమార్ షస్కర్ పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ కె. మాణిక్ రావు అసెంబ్లీ సభ్యుడు జహీరాబాద్ నియోజకవర్గం డాక్టర్ చంద్రశేఖర్ ఇన్-చార్జ్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తన్వీర్ మాజీ చైర్మన్ తంగానా అజ్మతుల్లా హుస్సేని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలంగాణ అఫ్జల్ హుస్సేన్ ఖుస్రో పాషా చైర్మన్ హజ్ కమిటీ తెలంగాణ అతి ముఖ్యమైన ప్రసంగాలు చేస్తారు. అదనంగా, ఇతర మతాల నాయకులు ప్రసంగాలు ఇస్తారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మౌలానా అతీక్ అహ్మద్ ఖాస్మీ, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామీ, నజీముద్దీన్ ఘోరీ, అయూబ్, జమాతే ఇస్లామీ, అతిక్ హక్కానీ, అహ్లే హదీత్, అహ్లే హదీథ్, మిస్టర్, యూసుఫ్, ఆప్షన్ కమిటీ సభ్యుడు. బాష్మ్, దావత్ తబ్లీగ్ – హఫీజ్ అక్బర్, అబ్దుల్ ఖదీర్, జమియాత్ ఉలేమా, మిస్టర్ మౌల్వీ ఖాజీ జియావుద్దీన్, మిస్టర్ ఫర్హాన్ ఖాద్రీ, అహ్లే సున్నత్ వాల్ జమాత్, అబ్దుల్ మజీద్, సఫా బైతుల్ మాల్,జమీల్ అర్షద్ కాంగ్రెస్ పార్టీ, మొహియుద్దీన్ షేక్ ఫరీద్ టిఆర్ఎస్ పార్టీ. అథర్ సాహిబ్ అజ్మత్ సాహిబ్ వైస్ చైర్మన్ ఎంఐఎం ముఫ్తీ అబ్దుల్ బాసిత్ సాహిబ్ కోహీర్ మండల్, అబ్దుల్ మజీద్ సాహిబ్ హుజ్రా సంగం మండల్, బషీర్ అహ్మద్ సాహిబ్ హఫీజ్ ఖలీల్ మక్దం పాలి మండల్, ముఫ్తీ జమీర్ నియా లకల్ మండల్ మాట్లాడుతూ, ఈ సమస్య యొక్క ప్రాముఖ్యత మరియు పరిస్థితి యొక్క సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, మతం లేదా మతంతో సంబంధం లేకుండా ఇస్లాం సోదరులందరూ నిర్ణీత సమయంలో నిరసన సమావేశంలో పాల్గొని, తమ జాతీయ ఐక్యత మరియు మతపరమైన మద్దతును ప్రదర్శించి, ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా తమ నిరసనను నమోదు చేసుకోవాలని అన్నారు.
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో ఆదివారం జరిగిన డా౹౹శేషు బాబు గారీ కుమారుల పుట్టు పంచేల కార్యక్రమంలో పాల్గొని చిరంజీవులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం,మంకాల్ బాంకేట్ హాల్ లో జరిగిన ధనసిరి రవీందర్ రెడ్డి బావమరిది రిసెప్షన్ వేడుకల్లో మరియు ఈద్గా ప్రెసిడెంట్ మజీద్ సోదరుని కూతురి వివాహం మరియు డా౹౹మహమ్మద్.సలావోద్దిన్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని వారికి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి నల్లా,బిలాల్ పూర్ సోసైటి చైర్మన్ రియాజ్,కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ నరేష్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజమియా,మాజీ కౌన్సిలర్లు రంగా అరుణ్,మోతిరాం నాయక్,జహీంగీర్,రాములు నేత,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గౌని శివకుమార్,ఇమామ్ పటేల్,మరియు తదితరులు పాల్గొన్నారు.
హజ్ యాత్రకు షేక్ ఫరీదుద్దీన్ ఘనంగా వీడ్కోలు పలికిన ముస్లింలు సోదరులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు షేక్ ఫరీదుద్దీన్ హజ్ యాత్రకు బయలుదేరిన సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అధ్యక్షుడు ముహమ్మద్ అయూబ్ అహ్మద్ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు.శాలువాలు, పువ్వులు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హజ్ యాత్ర వెళ్తున్న యాత్రికుల ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆ అల్లాహ్ దయతో అందరూ హజ్ యాత్ర సంపూర్ణం చేసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు దేశ ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోలోజ్ సంతోష్ ఎన్నిక.
చిట్యాల నేటిధాత్రి:
జూకల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి అభివృద్ధి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు అలాగే మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆదేశాల మేరకు నూతనకాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామశాఖ*అధ్యక్షుడిగా: పోలోజు సంతోష్* ప్రధానకార్యదర్శిగా: ముష్కే నాగరాజు* వర్కింగ్ ప్రెసిడెంట్ గా: బుస్సరవి ఉపాధ్యక్షుడిగా: బోయిని రవి, మేకల ఐలయ్య* సహాయకార్యదర్శిగా: కురిమిళ్ళ ప్రసాద్ కోశాధికారిగా: భయగాని రాజు* కార్యవర్గ సభ్యులుగా: నల్ల ధర్మారెడ్డి, బయగాని* రమేష్,మంగళంపల్లి శ్రీనివాస్, మొలుగురి రమేష్,ఆవంచ. సదానందం, ఎలమాద్రి భద్రయ్య,* ఎనుమల్ల రాములు, డబ్బాల మహేందర్, బయగాని సదానందం, నూనె సురేందర్ గా ఎన్నుకోవడం జరిగింది.*
రైల్వే ఓవర్ బ్రిడ్జి పేరు దివంత నేత మొహమ్మద్ పరిదోద్దీన్ పెట్టాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని రైల్వేగేటు వద్ద కోట్లతో రెండు వరుసలతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులకు 2018 ఆగస్టు 30న ఎంపీ బీబీ పాటిల్, అప్పటి ఎమ్మెల్సీ మహ్మద్ పరీదుద్దీన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వికారాబాద్-పర్లివైజ్యనాథ్ రైలు మార్గం జహీరాబాద్ పట్టణం మీదుగా వెళుతుంది. సికింద్రాబాద్, నాందేడ్, పూర్ణ, షిర్డీ, బెంగుళూరు, తిరుపతి, కాకినాడ రైళ్లు రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతిసారి గేటు పడటంతో వాహనదారులకు కష్టాలు తప్పడం రైల్వేగేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ను ప్రారంభం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మొహమ్మద్ పరిదోద్దీన్ పేరు పెట్టాలని ఝరాసంగం మండల యువ నాయకులు మొహమ్మద్ సద్దాం హుస్సేన్ చెప్పారు ఎందుకంటే మాజీ దివంత నేత మొహమ్మద్ ఫరిద్రుద్దీన్ జహీరాబాద్ కు చేసిన సేవలు అందించిన ప్రజలలో జ్ఞాపకాలు ఉంటాయని తెలిపారు ప్రతి ఒక్క ప్రజలకు కుల మతాలు లేకుండా జ్ఞాపకం గా ఉండే అందుబాటులో ఉంటూ సేవలందించారు అందు గురించి ఒక జ్ఞాపకం ఉండే రైల్వే ఓవర్ బ్రిడ్జి ను అతని పేరు పెట్టాలని యువ నాయకులు కోరారు.
మొగుళ్ళపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారులకు(డీలర్లకు) రైతు వేదిక మొగుళ్ళపల్లి లో విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల చట్టాలపై అవగాహన/సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఈ క్రింద సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని .
డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా
ఎదురుగాపెట్టాలి. లైసెన్సు లేకుండా విత్తనాలు గాని, ఎరువులు గాని మరియు పురుగు
మందులు అమ్మకం చేయరాదు. డీలర్ యొక్క షాప్ పేరు, ఇంటి/డోర్ నెంబర్ మరియు ఇతర
వివరాలు పేయింట్ తో రాయాలి
స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి. డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు
ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి.
కంపనీల నుండి వచ్చే సరుకులకు ఇన్వాయిస్ లేనిదే అమ్మకాల స్థలంలో లేదా గోదాముల్లో
దింసుకోనరాదు.బిల్లు మరియు డి.సి.లు లేనిదే స్టాక్ సరఫరా చేయరాదు.స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్
బోర్డుపై రాయాలి.బ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును.లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా
పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా నిల్వచేయాలి. డీలర్లు తామ యొక్క లైసెన్సు గడువు మీరినట్లైతే ఎటువంటి అమ్మకాలు జరపరాదు.డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం జరపరాదు.లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలి.డీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి.
స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి మరియు. అలాగే అన్ని గ్రామాల డీలర్లు, AEO లు ఇట్టి సమావేశంలో పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి
నేటిధాత్రి మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…. రైతులకు అవగాహన కార్యక్రమం
కేసముద్రం/ నేటి ధాత్రి
శనివారం కేసముద్రం రైతు వేదికలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను ప్రోగ్రాం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేయడం జరిగింది. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు ఈ విధమైన సలహాలు చేయడం జరిగింది 1. తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవాలి 2. అవసరమేరకు మందులను పిచికారి చేసి మేలా ఆరోగ్యాన్ని కాపాడాలని 3. విత్తనాలు పురుగు మందుల మరియు ఎరువుల రసీదులు భద్రపరుచుకోవాలి 4. సాగునీటిని ఆదా చేసుకోవాలి 5. పంట మార్పిడి చేసుకోవాలి 6. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి 7. పచ్చిరొట్ట ఎరువులు, పశువుల పెంట, చెరువు మట్టి వలన కలిగే ఉపయోగాలు.
వారు మాట్లాడుతూ వచ్చే వానకాలం సీజన్ 2025 -26 గాను వివిధ పంటలలో సాగు చేసే వివిధ రకాల విత్తనాలు మరియు మేలైన యాజమాన్య పద్ధతులు, వరి పంటలో నేరుగా విత్తనాలు వెదజల్లి మంచి దిగబడులు పొందే మీద సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. రైతులు పురాతన మూస పద్ధతులను విడనాడి, నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించి, ఖర్చులను తగ్గించి మంచి దిగబడులు, పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా కెవికె మల్యాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డాక్టర్, ఎస్. మాలతి , ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం ధనసరి అధ్యక్షులు మర్రి రంగారావు, సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు, కె వి కె మల్యాల శాస్త్రవేత్తలు డాక్టర్ రాంబాబు , డాక్టర్ క్రాంతి కుమార్ , మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, తోట వెంకన్న, ఆయా గ్రామాల అభ్యుదయ రైతులు, మండలంలోని ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు, రాజేందర్, శ్రీనివాస్, రవివర్మ, సాయి చరణ్, లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి
నేటిధాత్రి మొగుళ్ళపల్లి
భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మేధా చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన కొండూరు విద్యార్థులు.
“రాయపర్తి, నేటిధాత్రి*
మేధా చారిటబుల్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ లో జెడ్ పి హెచ్ ఎస్ కొండూరు పాఠశాల విద్యార్థులు గంకిడి సాయి వర్ధన్, బొబ్బల వర్షిత్ రెడ్డి లు సెలెక్ట్ అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత తెలియజేశారు. వీరికి శ్రీ మేధా ట్రస్ట్ నుండి సుమారు మూడు నుండి నాలుగు లక్షల విలువైన రెండు సంవత్సరాల ఉచిత విద్యను ప్రఖ్యాత నారాయణ, శ్రీ చైతన్య కాలేజిలలో అందిస్తారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు రామిరెడ్డి, ఆచార్యులు, సత్యనారాయణ, రఘు, నాగరాజు, వెంకటరమణ, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్య నాయక్ , స్వామి, అమర స్వర్ణ ,శివకృష్ణ అభినందించారు.
రామకృష్ణాపూర్ పట్టణంలో అభయ అంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని స్థానిక విజయగణపతి దేవాలయ ఆవరణలోని హనుమాన్ ఆలయంలో పూజారి సతీష్ శర్మ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని యజ్ఞశాలలో నిర్వహించిన మహా యజ్ఞంలో హనుమాన్ మాలాధారులు పాల్గొన్నారు. పట్టణంలోని భక్తులు ఆయురారోగ్యాలతో సుఖ జీవనం సాగించాలని, స్వామివారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేశారు.
నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన ఎక్కల సుజాత నెల రోజుల క్రితం తమ గ్రామంలో ఆమె మొబైల్ ఫోన్ను పోగొట్టుకుంది. సీఈఐఆర్ వెబ్సైట్లో నమోదు చేయగా పోగొట్టుకున్న ఫోన్ ఐఎంఈఐ నంబర్ ను ట్రాక్ చేసి బాధితురాలుకి శనివారం ఇంచార్జ్ ఎస్సై సృజన అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఎవరైనా మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నట్లయితే అధైర్య పడకుండా సీఈఐఆర్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించారని పేర్కొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కొమిశెట్టి కిరణ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా, మృతుడు కాశీపేట 2 గని లో విధులు నిర్వర్తించేవాడు.సింగరేణి సంస్థకు ఎస్బిఐ బ్యాంక్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎస్బిఐ సాలరీ అకౌంట్ ఎస్బిఐ లొ మెయింటైన్ చేసినందుకు గాను కోటి రూపాయల భీమా ఎస్బిఐ బ్యాంక్ మంజూరు చేసింది. ఇట్టి కోటి రూపాయల చెక్కును నామిని అయిన మృతుని భార్య కొమిశెట్టి కోమల కు శనివారం రామకృష్ణపూర్ ఎస్బిఐ బ్యాంక్ ఆవరణలో మంచిర్యాల ఎస్బిఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్త, ఆర్బీవో సివిఈ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి లు మృతుని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ గుగులోత్ గోపాల్, బ్యాంక్ స్టాఫ్ ప్రశాంత్,రామ కార్తిక్, వెంకటేశ్. రాజేంద్ర ప్రసాద్ , చందు, రమాదేవి లు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ నూతన అధ్యక్షుడిగా గందె వెంకటేశ్వర్లు
అసోసియేషన్ అభివృద్ధికి కృషిచేస్తా-గందే వెంకటేశ్వర్లు
పరకాల నేటిధాత్రి
ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్స్ పేస్టిసైడ్స్ సీడ్స్ జిల్లా అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవంగా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రేటర్ గందె వెంకటేశ్వర్లు ను,ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీ,కోశాధికారిగా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Gande Venkateshwarlu
ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన నాగుర్ల వెంకటేశ్వర్లు కి ఎల్లవేళలా రుణపడి ఉంటు పరకాల పట్టణ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నాతోటి వ్యాపారస్తులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.
సంగారెడ్డి: జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది.పరిశ్రమలోని ఆటోమోటివ్ డివిజన్ ప్లాంట్లోని స్టోరూమ్లో మంటలు చెలరేగాయి. ప్లాంట్ నుంచి దట్టమైన పొగలు వెలువడంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిశ్రమలోని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కార్మికులు, ఉద్యోగులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆగిన దళిత బంధు ఇవ్వాలని …,. జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….
జమ్మికుంట :నేటిధాత్రి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు గురించి, హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిపి వేయబడిన రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, స్పోర్ట్స్ గ్రౌడ్ పనులు వెంటనే ప్రారంభించాలి అని, దళితుల అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని కరీంనగర్ జిల్లాలో నిలిపివేయబడిన అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని మరియు కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన
MLA Padi Kaushik Reddy
ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు గారు, జిల్లా అధ్యక్షులు GV రామాక్రిష్ణా రావు గారు. మరియు మాజీ మున్సిపల్ చెర్మన్ లు కౌన్సెలర్స్ మాజీ ఎంపీపీ లు మాజీ జడ్పీటీసీలు పాల్గొన్నారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మంత్రుల అవినీతిని బట్టబయలు చేసిన మంత్రి కొండా సురేఖ
-మంత్రి వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి..సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
-బీసీ మహిళా మంత్రిపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీ సమాజం
-వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు చేసిన అవినీతి చిట్టాను విప్పిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీలోని అగ్రకులస్తులు తప్పుగా వక్రీకరించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని, అట్టి కుట్రలను చూస్తూ బీసీ సమాజం ఊరుకోబోదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. కమిషన్లకు కక్కుర్తి పడి..ప్రతి పనిలో వాటాలు తీసుకుని..ధనిక తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి వేశారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగాలన్నా, ఫైల్ కదలాలన్నా మంత్రులకు కమిషన్లు ఇస్తేనే పనులు జరిగేవని కాలేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పథకాలలో భారీ అవినీతి జరిగిందని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తే.ఆ ఆరోపణలపై సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు..వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోని కొందరు అగ్రవర్ణ కులస్తులు మంత్రి కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని, బీసీ మంత్రిగా..ఓరుగల్లు ప్రజల ముద్దుబిడ్డగా.పేద ప్రజల గుండెచప్పుడుగా..నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యి..వారి హృదయాల్లో కొలువుదీరి.ప్రజా నాయకురాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గంలో చోటు సంపాదించుకొని.మిగతా మంత్రులను కలుపుకొని..సమిష్టి నిర్ణయాలతో ప్రజా పాలనను ముందుకు తీసుకెళుతున్న తరుణంలో.బీసీ మంత్రి అయినా కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేక.ఆమెను టార్గెట్ చేసి.కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం మధ్య చిచ్చుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీలోని అగ్ర కులస్తులు కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.ప్రజా కోర్టులో బీఆర్ఎస్ పార్టీ అగ్రకులస్తుల వైఖరిని ఎండగడతామని మహేందర్ గౌడ్ హెచ్చరించారు.
డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్ తో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే
వనపర్తి నేటిధాత్రి :
శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర పాత భవనానికి రెన్యువేషన్ చేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు ఉండాలని అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు.
ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డీఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు.
భవనం రెనోవేషన్ కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.
వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
జిల్లాలో కొత్తగా మూడు మండలాల్లో కొత్త తహసిల్దార్ కార్యాలయాలు ఒక్కోటి రూ 32 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ లు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరో ఎస్. హెచ్. ఒ మంజూరు కు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పట్టణంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ చొరవ చూపడం వల్ల నిధులు మంజూరు చేయడంతో రెనోవేషన్ అనంతరం నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుండి అద్దె చెల్లించే బాధ కూడా తప్పిందని అన్నారు.
అదేవిధంగా పోలీస్ శాఖకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందు కు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల విషయంలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు.ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి వనపర్తి జిల్లాకు మంచిపేరు తెస్తామని అన్నారు పోలీస్ శాఖకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డీఎస్పీ వెంకటేశ్వర రావును గౌరవ ప్రదంగా తన కుర్చీలో కూర్చోబెట్టారు డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.
డీఎస్పీ వెంకటేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్ ఎల్ ఏన్ మిడిదొడ్డి రమేష్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ టి శంకర్ ప్రసాద్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ లు, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.