బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం
పరకాల నేటిధాత్రి:
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శిలుగా పాలకుర్తి తిరుపతి,సంగ పురుషోత్తంలను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను మాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్ జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
Gas Cylinder: వంటగది గ్యాస్ సిలిండర్‌కు ఎరుపు రంగు ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం ఇదే?
నేటిధాత్రి
Gas Cylinder Red Color: ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వంటగదిలో ఉపయోగించే సిలిండర్ పెట్రోలియం వాయువు (LPG)తో నిండి ఉంటుంది. LPG కాకుండా , వివిధ రంగుల సిలిండర్లలో నిండిన అనేక ఇతర వాయువులు ఉన్నాయి. ఇంట్లో ఉంచే LPG సిలిండర్..
Gas Cylinder Red Color: ప్రతి ఇంటి వంటగదిలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. మీకు వీటన్నింటి గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ అనేక ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటంటే గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది? సాధారణంగా ఎరుపు రంగు అనేది ప్రమాదానికి చిహ్నంగా భావిస్తారు. ఏదైనా ప్రమాదం సమయంలో దానిని ఆపేందుకు ఎరుపు రంగులు ఉపయోగిస్తారు.
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వంటగదిలో ఉపయోగించే సిలిండర్ పెట్రోలియం వాయువు (LPG)తో నిండి ఉంటుంది. LPG కాకుండా , వివిధ రంగుల సిలిండర్లలో నిండిన అనేక ఇతర వాయువులు ఉన్నాయి. ఇంట్లో ఉంచే LPG సిలిండర్ ఎల్లప్పుడూ ఎరుపు రంగులో ఉండటానికి కారణం తెలుసుకుందాం.
మనందరికీ తెలిసినట్లుగా, ఎరుపు రంగు ప్రమాదానికి సంకేతంగా పరిగణిస్తారు. అందుకే సిలిండర్‌లో కూడా ప్రమాదం ఉంది కాబట్టి సిలిండర్‌కు ఎరుపు రంగు వేస్తారు. దాని లోపల నింపే ఎల్‌పీజీ గ్యాస్ మండేది. దానిని సరిగ్గా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించవచ్చు. ప్రజలను అప్రమత్తం చేయడానికి మాత్రమే గ్యాస్ సిలిండర్లకు ఎరుపు రంగు వేస్తారు. ఇది కాకుండా, గ్యాస్ సిలిండర్ LPG తో నిండి ఉంటుంది. అందుకే ప్రజలు దానిని సులభంగా గుర్తించగలిగేలా దానికి ఎరుపు రంగు వేస్తారు.
ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) కాకుండా, అనేక ఇతర రకాల వాయువులను ఉపయోగిస్తారు. దీనితో పాటు సంపీడన సహజ వాయువు ( CNG ), పైపుల ద్వారా నడిచే సహజ వాయువు ( PNG ), ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, హీలియం వాయువులు కూడా ఉన్నాయి. అన్ని వాయువులకు వాటి స్వంత ఉపయోగాలు ఉన్నాయి. అవి సరిగ్గా, జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే ప్రజల జీవితాలను సౌకర్యవంతంగా చేస్తాయి.
ఏ గ్యాస్‌కి ఏ రంగు సిలిండర్?
ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ తెల్లగా పెయింట్ చేసి ఉంటుంది. మీరు ఆసుపత్రులలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లను చూడవచ్చు.
నైట్రోజన్ వాయువు సిలిండర్ నల్లగా పెయింట్ వేసి ఉంటుంది. ఈ వాయువును టైర్లలో గాలి నింపడానికి ఉపయోగిస్తారు. మీరు ఈ సిలిండర్‌ను పెట్రోల్ పంపులు, టైర్ ఫిల్లింగ్ దుకాణాలు లేదా పంక్చర్ మరమ్మతు దుకాణాలలో పొందుతారు.
హీలియం వాయువు సిలిండర్ గోధుమ రంగులో పెయింట్ వేసి ఉంటుంది. ఈ వాయువును బెలూన్లలో గాలిని నింపడానికి ఉపయోగిస్తారు. దీని కారణంగా బెలూన్లు ఆకాశం వైపు వెళ్తాయి.
మీరు తరచుగా ‘లాఫింగ్ గ్యాస్’ గురించి విని ఉండవచ్చు. ఈ వాయువు సిలిండర్ నీలం రంగులో పెయింట్ వేసి ఉంటుంది. దానిలో నైట్రస్ ఆక్సైడ్ వాయువు నిండి ఉంటుంది.
కార్బన్ డయాక్సైడ్ వాయువు కోసం సిలిండర్లు బూడిద రంగులో పెయింట్ వేసి ఉంటుంది. వ్యాపారాలు, కర్మాగారాలు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
బక్రీద్ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని డి. ఎస్.పి సైదా అన్నారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగను సోదర భావంతో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలనరు సమావేశంలో హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా,విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు కుల,మతాలకు అతీతంగా పండగలను జరుపుకోవాలని చెప్పారు.సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు.
మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
సమయం లేదు మిత్రమా..! జూన్ 14 వరకే అవకాశం.. ఆ తర్వాత..
1. బంగారం ధరలు పెరిగినప్పుడు, మార్కెట్లో లాభాలు వస్తుంటాయి. గోల్డ్ ఇటిఎఫ్‌లు పెరిగాయి. దీనివల్ల లాభాలు ఆర్జించడానికి బంగారాన్ని అమ్మే అవకాశం ఉంటుంది. ఇది బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతుంది.
2. ప్రపంచ సంఘటనలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రపంచ స్థాయిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. కానీ ప్రస్తుతం అమెరికా సుంకాలపై తన వైఖరిని మృదువుగా చేసింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. దీని వలన బంగారం ధర తగ్గుదల ఉండవచ్చు.
3.బంగారం ధరలో ఆర్‌బిఐ ద్రవ్య విధానం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జూన్ 6న ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బంగారం ధరపై ప్రభావం చూపవచ్చు. ధరలో తగ్గుదల ఉండవచ్చు.
4. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. ఫెడ్ రేట్లను తగ్గిస్తే బంగారానికి మద్దతు లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు. వడ్డీ రేట్లలో కోత ఉంటే బంగారం ధర తగ్గవచ్చు.
బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి
సహకరించిన అందరికి ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి
పరకాల నేటిధాత్రి:
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శి గా పాలకుర్తి తిరుపతి ని ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను నాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్ జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
నాలుగు రోజుల తరువాత మిగిలిపోయిన రోడ్ల కటింగ్ ప్రారంభo
వనపర్తి నేటిధాత్రి:
గత ప్రభుత్వం లో వనపర్తి లో రోడ్ల విస్తరణ లో ఆస్తులు నష్టపోయిన వారికి న్యాయం జరగలేదని వనపర్తి పట్టణంలో మార్నింగ్ వాకింగ్ లో ఎమ్మెల్యే మెగా రెడ్డి పాన్గల్ ల్ రోడ్ లో ఇండ్లు షాపులు వ్యాపార సంస్థల నష్టపోయే ప్రజలను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలను సూచనలను తీసుకున్నారు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి అభిప్రాయము మేరకు రోడ్ల విస్తరణ చేపడతామని ఎమ్మెల్యే మెగా రెడ్డి చెప్పారు .గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు పెద్దమనుషులు పానగల్ రోడ్డు గాంధీ చౌక్ హై స్కూల్ రోడ్డు లో ఆస్తులు నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయింపు లో మూడో ఫ్లోర్ రెండో ఫ్లోర్ కేటాయించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ప్రజలు తమతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మెగా రెడ్డి చెప్పారు వనపర్తి లో రోడ్ల విస్తరణకు ప్రజలు సు ముఖంగా ఉన్నారని కొందరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని మరికొందరు డబుల్ బెడ్ రూమ్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కేటాయించాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారని ప్రజా అదృష్టమేరకే రోడ్ల విస్తరణ చేపడతామని రోడ్ల కాటింగ్ నాలుగైదు రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు . వనపర్తి లో దాదాపు 1,20,000 జనాభా ఉన్నదని ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రోడ్ల కటింగ్ చేపడతామని చెప్పారు ఎమ్మెల్యే మెగా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు . రాజావారి పాలిటెక్నిక్ కళ శాల కర్నూల్ రోడ్ కొత్తకొత్త కోట రాజవారి పాలిటెక్నిక్ నుండి వివేకానంద రోడ్ రోడ్ల విస్తరణలో నష్టపోయే ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారు ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉన్నవారికి గత ప్రభుత్వం లో ఓకే డబుల్ బెడ్ రూము కేటాయించారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేశారని ఎమ్మెల్యే చెప్పారు విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు చీర్లసత్యం సాగర్ నందిమల్ల శ్యామ్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు
ఇలాంటి సర్కస్‌లు వద్దు.. మానుకోండి అంటూ విమర్శకులకు నటుడు ధనుష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ధనుష్, నాగార్జున కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ కుబేర ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించారు.
తాజాగా ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
‘నేనెప్పుడూ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాపై, నా మూవీలపై ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తారో చేసుకోండి. నా మూవీల విడుదలకు ముందు నెలకు రెండు సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా మీరేమి చెయ్యలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. ఇలాంటి సర్కస్‌లు మానుకోండి. ఇక్కడ ఉన్నవారంతా నా అభిమానులు మాత్రమే కాదు.. వీరంతా 23 సంవత్సరాలుగా నా వెంటే ఉంటున్నారు. మీరెంత వ్యతిరేక ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు’ అని ధనుష్ కుండబద్దలు కొట్టారు.
పాఠశాలలు మొదలవుతుంది అంటే తల్లిదండ్రులకు టెన్షన్ మొదలయ్యే సందర్భాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు. అందుకే జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ మొదలవుతుంది. ఒకటో తారీఖు అంటే ప్రతినెలా సామాన్య కుటుంబాలకు ఇబ్బందిగానే ఉంటున్నా జూన్ మాసంలో మాత్రం ఇంకాస్తా భయాన్ని కలిగిస్తుంది. ఇంటి బడ్జెట్కు తల్లిదండ్రుల కసరత్తు మొదలైంది. జూన్ మాసం వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోతారు. ప్రతి కుటుంబంపై జూన్ మాసంలో రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకు బడి ఖర్చులు ఉంటాయి. మరో 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సెలవులు మిగిలి ఉన్నాయి. పాఠశాలలు తెరుచుకోవడానికి ముందే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ సహా కొనుగోలు చేయడంతో పాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు.
జూన్ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతి ఇంటిలో ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్కు టర్మ్ ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది. కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కార్పొరేట్ పాఠశాలలు కూడా రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంభాలు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ చదువాలంటే కూడా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉ న్నాయి. మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉ న్నాయి. దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి. పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు కూడా మండిపోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు.. ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉ ంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా, మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.
రాష్ట్రస్థాయి ప్రదర్శనకు రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా గారి ఎంపిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాదులోని రాష్ట్రస్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో వివిధ అభ్యసన పద్ధతులపై బెస్ట్ ప్రాక్టీస్ నిర్వహించే ఉత్తమ ప్రదర్శనకు న్యాల్ కల్ మండల రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా ఎంపికైనట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలు తెలిపారు. వీరి ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర పర్సన్ గా ఉన్న కమిటీ జిల్లా నుండి నలుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది, అందులో ఒకరు సఫియా సుల్తానా ఇలా ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 4వ తేదీన ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యాధికారులు మరియు మల్టీజ్జోన్ కి సంబంధించిన అన్ని జిల్లాల ఎంఈఓ మీటింగ్లో వీళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న న్యాల్ కల్ మండల విద్యాధికారి మారుతి రాథోడ్ అదేవిధంగా మండల ఉపాధ్యాయులు సఫియా సుల్తాన్ గారికి అభినందించారు.
ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మొగ్గు వేసి ప్రారంభం చేసిన ఎంపిఓ సౌజన్య రావు గారు, హౌసింగ్ DE అంజయ్య గారు,న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు B. శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి K. భాస్కర్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, న్యాల్కల్ పాక్స్ చైర్మన్ సిద్ది లింగా స్వామి, మండల మాజీ ఉప అధ్యక్షుడు మొహమ్మద్ గౌసోద్దీన్, జిల్లా మైనారిటీ నాయకులు మొహమ్మద్ రఫియోద్దీన్, మాజీ ఎంపీటీసీ శాంత్ కుమార్ పటేల్, AE శివానంద, పంచాయతీ కార్యదర్శి N. సరేన్ రాజ్, అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఫీక్ పటేల్, మాజీ ఉప సర్పంచ్ నిలయా గౌడ్, నయీమొద్దీన్, ముస్తఫా, లాలూ పటేల్, ఖాయమొద్దీన్, పాషా భాయ్, యాదుల్ భాయ్, మిస్లోడ్డిన్, మౌల పటేల్, అఫ్జల్ భాయ్, మచ్కురి శంకర్, మచ్కురి మాణిక్, సురేష్ , బసవరాజు, సమీర్, నాసర్ , అక్బర్, సయ్యోజి గౌడ్, అజర్, జలీల్ మియా, మహిళలు కమలమ్మ , శేషమ్మ, జ్యోతి , గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
-బిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలంటే విజయశాంతి లాంటి వాళ్లే కావాలి.
-ఉద్యమ ఆకాంక్షలు, కేసిఆర్ మోసాలు తెలిసిన నాయకురాలు విజయశాంతి.
-అధిష్టానం ఇప్పటికే స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.
-ఏపిలో కూడా మహిళా హోం మంత్రి వున్నారు.
-డైనమిక్ విజయశాంతికి హోం బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు.
-రాములమ్మ కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఇచ్చిన మాట.
-తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆనాడు పార్టీలో చేరారు.
-అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.
-తెలంగాణ కోసం తల్లి తెలంగాణ ఏర్పాటు చేసిన విజయశాంతి.
-రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితం త్యాగం చేసిన నాయకురాలు విజయశాంతి.
-ఏనాడు పదవుల కోసం ఆశించి రాజకీయాలు చేయలేదు.
-పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి కెరియర్ కూడా వదులుకున్నారు.
-ఎన్నికల రాజకీయాలలో పదవుల అనుభవించిన వారు త్యాగాలు అని చెప్పుకుంటున్నారు.
-విజయశాంతి త్యాగం అంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కవ.
హైదరాబాద్,నేటిధాత్రి: రాములమ్మ హోం మంత్రి కాబోతున్నారా? అంటే డిల్లీ సర్కిళ్లలో ఔననే సమాధానం వస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో కచ్చితంగా ఎమ్మెల్సీ విజయశాంతిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీల నుంచి ఎవరూ మంత్రి లేరు. ఎమ్మెల్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా బిసి సామాజిక వర్గానికి మరింత ప్రాదాన్యతనిచ్చినట్లు సంకేతాలు కూడా కాంగ్రెస్ పంపాలని అనుకుంటోంది. అందుకే ఆరు మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం వుంది. అయితే అవి ఇప్పుడే భర్తీ చేస్తారా? లేక ఇంకా కొంత కాలం ఆగి చేస్తారా? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి డిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పరమైన పదవులు ఇప్పటికే చాలా వరకు కొలిక్కి వచ్చాయి. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. పదవుల పంపకాలు దాదాపు పూర్తయినట్లే లెక్క. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాత్రమే మిగిలివున్నాయి. పార్టీ ఉపాధ్యక్ష పదవులు ఇంకా రాలేదని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్‌లో వున్న పార్టీపరమైన సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలందరూ పార్టీ అటోమెటిగ్‌గా ఉపాధ్యక్షులౌతారు. ఇది అనాదిగా ఆపార్టీలో అనుసరిస్తున్న సంప్రదాయమే. అవి కూడా పూర్తయనట్లే లెక్క. ఇక మిగిలినవి మంత్రి పదవులు. నామినేటెడ్ కార్పోరేషన్‌పదవులు ఇంకా కొన్ని పెండిరగ్‌లో వున్నాయి. ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనలో నామినేటెడ్ పదవులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. కాని మంత్రి పదవుల పంపకాలలో కొన్ని పీట ముడులున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు ఒక్క రాములమ్మకు మాత్రమే మంత్రి పదవి ఖాయమైందని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు. తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతామని బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో ఆమె మెదక్ పార్లమెంటును పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీచేసేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. పార్టీ నుంచి సూచనలు వచ్చినా ఆమె పార్టీకి సేవ చేయడానికే పరిమితయ్యారు. అందుకే ఆమె 2018 ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా బాద్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కడం లేదని ఎన్ని రకాల వార్తలు వచ్చినా స్పందించలేదు. తాను కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా వున్నానని కూడా చెప్పలేదు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఆమె చేసుకుంటూ వెళ్లారు. అంతే తప్ప ఎక్కడా పార్టీపై ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. తాను చేసిన సేవలకు, తెలంగాణ ఉద్యమ కారిణిగా సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుందని మాత్రం నమ్మకంతో వున్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు వరంగా మారింది. తెలంగాణ వచ్చిన సమయంలో పార్టీ ఆమెకు కొన్ని వాగ్ధానాలు చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే సముచితస్ధానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ పదేళ్లలో ఆమె ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా, కాంగ్రెస్‌లోనే వున్నది. ఓ దశలో రాములమ్మ కాంగ్రెస్‌లో వున్నట్లా? లేనట్లా? అంటూ వార్తలు కూడా వచ్చాయి. గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి పిలుపు లేదని కూడా ఆమె ఎక్కడా ఒక్క ప్రకటన కూడా చేసింది లేదు. సమయం కోసం వేచి చూశారు. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు కూడా ఆమెకు పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎంత నిబద్దతతో వుంటుందో ఈ ఒక్క విషయంలోనే తేలిపోయింది. ఎంతో మంది పేరు ఎమ్మెల్సీల ఎంపికలో వచ్చినా, విజయశాంతికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. విజయశాంతి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత విశ్వాసమో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే విజయశాంతి అంటే సామాన్యురాలు కాదు. ఆమె ఒకప్పటి సినీ సూపర్ స్టార్. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా, మూడు దశాబ్దాల పాటు ఆమె సినీ పరిశ్రమను ఏలిన నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఆమె అగ్రశ్రేణి నటిగా ఓ వెలుగు వెలిగారు. దేశమంతా లేడీ అమితాబ్ అని కీర్తించేవారు. ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలో వుండేవారు. కేరిర్ పీక్ స్టేజ్‌లో వున్నప్పుడు ఆమె జై తెలంగాణ అన్నారు. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ ఇచ్చింది చాలు. ప్రేక్షకుల ప్రేమచాలు. ఇక తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం వస్తున్నానని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. నిజానికి ఆమె రాజకీయంగా పదవులే కావాలనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో పదవులు వచ్చేవి. తమిళనాడులో కూడా ఆమెకు పెద్ద పెద్ద పదవులే వచ్చేవి. ఎందుకంటే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు విజయశాంతి ఎంతో సన్నిహితురాలు. ఆమె రాజకీయం చేయాలనుకుంటే తమిళనాడు నుంచికూడా ఎమ్మెల్యే అయ్యేది. మంత్రి అయ్యేది. కాని ఆమె తెలంగాన ఉద్యమంలోకి వచ్చారు. కేరీర్ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన వద్దనుకున్నారు. కార్లు, అద్దాల మేడలు, ఏసి గదుల్లో జీవితం వదులుకొని ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. తెలంగాణ ప్రజలకు తోడుగా పోరాటంలోకి దిగారు. తల్లి తెలంగాణ రాజకీయ పార్టీని పెట్టారు. తాను సంపాదించిన కోట్లాది రూపాయలను ఆమె ఉద్యమానికి ఖర్చు చేశారు. తల్లి తెలంగాణ పార్టీ నిర్వహణకు కోట్లు ఖర్చు చేశారు. నిజానికి ఆమె ఆ పార్టీని అలాగే నడిపి వుంటే ఆమె రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. ఆమె ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చేది. కేసిఆర్ మాటలు నమ్మి, కేవలం తెలంగాణ కోసం పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. ఆ సమయంలో ఎంతో మంది కేసిఆర్ పార్టీలో తల్లి తెలంగాణను విలీనం చేయొద్దని సూచించారు. కేసిఆర్ వల్ల మొదటికే మోసం వస్తుందని కూడా హెచ్చరించారు. ఎందుకంటే అప్పటికే తల్లి తెలంగాణ పార్టీ తెలంగాణ అంతటా విస్తరించింది. అన్ని జిల్లాల కమిటీలు వేయడం జరిగింది. టిఆర్‌ఎస్‌కు పోటీగా తల్లి తెలంగాణ ఎదిగింది. ఆ పార్టీ కోసం, ఉద్యమం కోసం కొన్ని వందల మంది తల్లి తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దఎత్తున ఖర్చు చేసింది. వాళ్లందరికీ బిఆర్‌ఎస్‌లో సముచిత స్ధానం వుంటుందని విజయశాంతిని నమ్మించారు. చివరికి ఆమెను కూడా కేసిఆర్ నట్టెట ముంచారు. తొలుత విజయశాంతిని సొంత చెల్లెలుకన్నా ఎక్కువ అంటూ ఆమెను నమ్మించారు. తర్వాత ఆమె ప్రాధాన్యత తగ్గిస్తూ పోయారు. అయినా ఆమె ఏనాడు వెరవలేదు. తెలంగాణ కోసం మాత్రమే తాను వచ్చానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు ప్రత్యేకమైన రాజకీయం అవసరంలేదని తేల్చి చెప్పారు. టి ఆర్‌ఎస్ నుంచి తప్పించినా, ఆమె చిరునవ్వుతోనే స్వాగతించింది. తాను కోరుకున్న రాష్ట్రం ఏర్పాటైందన్న సంతోషమే ఆమె ఎక్కువ పడిరది. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన చరిత్ర చాలనుకున్నది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానన్న మాటను కూడా నిలబెట్టుకున్నది. ఆమె అంకితభావం కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అంతే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి పోరాట పటిమ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష్యంగా చూసింది. డిసెంబర్ 9 ప్రకటన పరిణామాల తర్వాత జరిగిన ఉద్యమంలో విజయశాంతి చూపిన చొరవ అంతా ఇంతా ఇంతా కాదు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సాగిన పార్లమెంటు సమావేశాలను ఏ ఒక్కనాడు సజావుగా సాగకుండా అడ్డుకున్న ఏకైన నాయకురాలు విజయశాంతి. నాలుగేళ్ల సుధీర్ఘ కాలం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం ఆమె సభ జరుగుతున్నంత సేపు నిలబడి నిరసన తెలియజేసేశారు. వెల్‌లోకి దూసుకెళ్లెవారు. ఆ అవకాశం దక్కనప్పుప్పుడు తనసీట్ వద్దనే నిలబడి నిరసన తెలియజేసేవారు. నిజానికి లోక్‌సభ సమావేశాలకు కేసిఆర్ పెద్దగా హజరయ్యేవారు కాదు. బడ్జెట్‌సమావేశాలకు కూడా వెళ్లేవారు కాదు. కాని విజయశాంతి ఏ ఒక్కరోజు కూడా వెళ్లకుండా వుండలేదు. నిరసన తెలియజేయని రోజంటూ లేదు. అలా నాలుగు సంవత్సరాల పాటు లోక్‌సభలో నిరవదిక నిరసన చేసిన ఏకైక నాయకురాలు విజయశాంతి. ప్రపంచ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఉద్యమకారిణి విజయశాంతి త్వరలో తెలంగాణ మంత్రి కానున్నారు. ఆమె చేసిన త్యాగం వృధా కాలేదు. కాస్త ఆలస్యం కావొచ్చు. కాని గుర్తింపు ఎప్పటికైనా పక్కా అనుకున్న ఆమె నమ్మకం మరోసారి నిలబడిరదనే చెప్పాలి.
ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు…
నేటి ధాత్రి – బయ్యారం :-
బయ్యారం సొసైటీ చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా జరిపినారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తమ్మిశెట్టి వెంకటపతి మాట్లాడుతూ, ఎల్లప్పుడూ మండల అభివృద్ధి గురించి ఆలోచించించే మూల మధుకర్ రెడ్డి భవిష్యత్ లో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.బయ్యారం ఏజెన్సీ అభివృద్ధి కై పాటుపడుతున్న ప్రజా నాయకుడని కొనియాడారు.అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు,నిరంజన్, రాకేష కార్తీక్,జాన్,ప్రసన్నకుమార్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవవేడుకల సందర్భంగా జెండాఆవిష్కరించిన ఎస్పీ
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయఆవరణలో ఎస్పీ రావుల గీరీదర్ పోలీసు సిబ్బంది తో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ 2014, జూన్ 2న అధికారికంగా ఏర్పడిందన తెలంగాణ రాష్ట్రం పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకుందన్నారు ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా . తెలంగాణ రాష్ట్రము సాధించు కున్నామని అన్నారు అనంతరం పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ మిఠాయిలు పంచారు జిల్లా ప్రజలకు పోలీసు సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునందన , నరేష్ స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, వనపర్తి సీఐ కృష్ణ కొత్తకోట సీఐ రాంబాబు ఆత్మకూరు సీఐ, శివకుమార్ సిసిఎస్ సీఐ, రవిపాల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయం
అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శం మన ప్రజా ప్రభుత్వం
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శం మన ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని రాష్ట్ర అవతరణ దినోత్సవ ముఖ్య అతిథి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ముఖ్య అతిథి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య పాల్గొన్నారు.
ముందుగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం పెట్టి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం భూపాలపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ముఖ్య అతిథి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథి మాట్లాడుతూ..
శుభకార్యం తలపెట్టేటప్పుడు దేవుడిని తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకోవడం మన ధర్మం అన్నారు.
అది వారి త్యాగానికి మనం ఇచ్చే గొప్ప గౌరవమన్నారు.
జై తెలంగాణ.. ఇది నినాదం కాదు..
యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస అంతేకాదు..
అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన త్యాగధనులకు వేల వేల వందనాలు..
అరవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాల్లో వారి పోరాటం, అమరం, అజరామరం..
వారి త్యాగం, వారి త్యాగ స్ఫూర్తి నిరూపమానం అన్నారు.
జీవితాన్ని త్యాగం చేయడమంటే మాటలు కాదు.
అయినా ఏండ్ల తెలంగాణ కలను నిజం చేయడం కోసం వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు.
నావల్లనైనా తెలంగాణ రాష్ట్రం రావాలి అని విద్యార్థి శ్రీకాంతాచారి, పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్, యాదిరెడ్డిలాంటి వందలమంది ప్రాణాలర్పించారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకుంది కేవలం 459 మందే అని గత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కానీ, ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో 1200 మందికి పైగా ఉద్యమకారులు ప్రాణాలర్పించారన్నారు.
బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు.
తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో వారి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, వారు కలలు కన్న తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.
వందలాది అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.
వారి స్ఫూర్తి నిత్యం మదిలో మెదిలేలా అమరవీరుల త్యాగం భవిష్యత్ తరాలకు తెలిపేలా మనందరం సమిష్టి గా కృషి చేయాలన్నారు.
అనంతరం రాష్ట్ర సాధన కోసం అసలు బాసిన అమరుల కుటుంబ సభ్యులను అతిథిచే శాలువాలు కప్పించి సత్కరించారు.
రైతులకు మేలు రకం వరి విత్తనాలను పంపిణీ చేశారు.
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను, అక్కడున్న వారిని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
భూపాలపల్లి లోని కేజీబీవీ, బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్, సెయింట్ పీటర్స్ హై స్కూల్, సన్ వ్యాలీ హై స్కూల్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ సంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన తెలంగాణ ఉద్యమ గీతాలు సైతం ఆహుతులను ఆకట్టుకున్నాయి.
అనంతరం అతిధుల చేతుల మీదుగా చిన్నారులకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు.
అనంతరం కలెక్టరేట్ ఐడీవోసీ లో ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి:
టేకుమట్ల మండలం అంకుషాపురం సోమనపల్లి గ్రామ శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ సమయంలో ఆలయ కమిటీ సభ్యులు ఏనుగుల రాకేష్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంలో ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హనుమంతుడు హిందూ సంస్కృతిలో అత్యంత దేవుళ్ళు ఒకరు. అపారమైన బలం, అచంచలమైన భక్తి మరియు అపరిమిత జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన హనుమాన్ జీ హిందూ పురాణాలలో ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యమైన పాత్ర పోషించాడని అన్నారు. ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభయాంజనేయుని శుభ ఆశీస్సులు కలిగి సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ సందర్భంగా ఈ గొప్ప ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలోనికి ఆహ్వానం పలికినందుకు కమిటీ సభ్యులందరికీ ఉమ్మడి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సోమనపల్లి మాజీ సర్పంచ్ ఉద్దమారి మహేష్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, పిఎసిఎస్ డైరెక్టర్ మారం లింగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నందికొండ రామ్ రెడ్డి, తోట వినయ్ సాగర్, పోతనవేన ఐలయ్య, దేవేందర్ పటేల్ వీసం బారత్ రెడ్డి, పిన్నింటి మణిదీప్ రావు, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి మంద అశోక్, చిక్కుల రవి, మేకల శ్రీకాంత్, గిర వేణ కిరణ్, గిరవేణ భాస్కర్ అంతనగిరి దేవేందర్, మేకల అనిల్ ఉమ్మడి గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నే.
ఆవిర్భావ వేడుకలో జెండా ఆవిష్కరించిన గూట్ల తిరుపతి
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం* ఘనంగా నిర్వwహించుకోవడం జరిగినది.
మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి* జాతీయ జెండా ఎగురవేసి అనంతరం మాట్లాడుతూ..
ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ
ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి యువకులు 1200 మంది చనిపోయిన దాన్ని చూసి సోనియా గాంధీ మనసు చలించిపోయి
తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదని నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును పెట్టి ఆమోదింపచేసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియా గాంధీ ఆమెకు మనం ఎంతో రుణపడి ఉన్నాం.
అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందియాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ప్రజాపాలనను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకపోయిన ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఎన్నో మన్ననలు పొందుతున్నారు.
గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ బీసీల అందర్నీ ఎలాంటి సంక్షేమ పథకాల అందించక అనేక ఇబ్బందులకు గురిచేస్తూ తమ స్వలాభం కోసం కమిషన్ల కోసం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కేసీఆర్ పాలనను అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అదే తీరుగా ప్రజాసంక్షేమ పథకాల అమలు అందరికీ అందిస్తున్నారు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,కామిడి రత్నాకర్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*
75 వేల రూపాయలు ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
ముత్తారం నేటి ధాత్రి:
ముత్తారాం మండలంలోనీ ఓడేడు గ్రామానికి చెందిన కట్కూరి సుజాత నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే స్పందించి సి ఎమ్ ఆర్ ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వీరికి డెబ్బది ఐదు వేల ఎల్ ఓ సి మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది డెబ్బది ఐదు వేల రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు
ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి
బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మనోహర్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ అన్నారు.తెలంగాణ ఏర్పాటు అయి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులు బిసి నాయకులు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటం ఫలించి నేటికీ 11 సంవత్సరాల కావస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ తెలంగాణ ఏర్పాటు కాలేదని,ఆంధ్ర కబంధ హస్తాల నుండి విడిపోయిన తెలంగాణ అగ్రవర్ణాల కుట్రలో బందీ అయి ఉన్నదని ఉద్యోగ ఉపాధి రంగాలలో తెలంగాణ యువతకు నష్టం చేకూరుస్తున్న,రైతాంగాన్ని నడ్డి విరుస్తున్నారు.ఈ పాలకవర్గాలను,ఏదైతే తెలంగాణ ఆకాంక్షల కోసం జరిగిన బలిదానాల ఆశయాలు నెరవేరలేదని,ఆ ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం సిద్ధం కావాలని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. తెలంగాణ ఉద్యమము తొలిదశ మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు తుల మధుసూదన్ రావు,జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్,పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రాయలింగు పద్మశాలి సంఘం జిల్లా నాయకులు నల్ల నాగేంద్రప్రసాద్,తెలంగాణ బీసీ జేఏసీ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవిడపుగణేష్,జిల్లా నాయకులు వేముల మల్లేష్, భీమ్సేన్,బీసీ జేఏసీ యువజన నాయకులు పెద్దల చంద్రకాంత్,ఎండి లతీఫ్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇప్పలపల్లి బాపు,జిల్లా నాయకులు తాళ్ల పెళ్లి దేవేందర్ గౌడ్,అడిచర్ల రాజయ్య,తోకల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ (చందు) వివాహ వేడుకకు హాజరైన నాయకులు
◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ (చందు) వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అక్బర్,జుబేర్ యూత్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ నథానెయల్,టిపిసిసి జిల్లా మీడియా&కమ్యూనికేషన్ కన్వీనర్ అశ్విన్ పాటిల్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,అక్షయ్ జాడే,మాజీ కౌన్సిలర్ నాగేష్,నర్సింహా యాదవ్,పాండు యాదవ్,మోహీన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బలుగురు తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా బారాస అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు పోరాటం ద్వారా అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమళ్ళ రమేష్ మల్సాని బాపురావు దేవునూరికుమారస్వామి బొల్లేని రవికుమార్ ఎల కంటి మూర్తిలింగాచారిపడిదల జగ్గారావు బండారి రామస్వామి చెక్క సురేష్ వనం కార్తీకు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.