రాష్ట్రస్థాయి ప్రదర్శనకు రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా గారి ఎంపిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాదులోని రాష్ట్రస్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో వివిధ అభ్యసన పద్ధతులపై బెస్ట్ ప్రాక్టీస్ నిర్వహించే ఉత్తమ ప్రదర్శనకు న్యాల్ కల్ మండల రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా ఎంపికైనట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలు తెలిపారు.
వీరి ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర పర్సన్ గా ఉన్న కమిటీ జిల్లా నుండి నలుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది, అందులో ఒకరు సఫియా సుల్తానా ఇలా ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 4వ తేదీన ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యాధికారులు మరియు మల్టీజ్జోన్ కి సంబంధించిన అన్ని జిల్లాల ఎంఈఓ మీటింగ్లో వీళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న న్యాల్ కల్ మండల విద్యాధికారి మారుతి రాథోడ్ అదేవిధంగా మండల ఉపాధ్యాయులు సఫియా సుల్తాన్ గారికి అభినందించారు.