సివిల్ సప్లై హమాలి యూనియన్.!

సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా మహాసభల కరపత్రం విడుదల

కేసముద్రం నేటి ధాత్రి:

మే 18న కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ సాయి గార్డెన్లో జరిగే సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎఐటియుసి మండల కార్యదర్శి మంద భాస్కర్, సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంద భాస్కర్ , చొప్పరి శేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను సంస్కరణ పేరుతో చట్టాలను సవరించి కార్మికుల శ్రమను అప్పనంగా దోచుకునేందుకు కుట్ర పండుతుందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. కేసముద్రంలో జరిగే జిల్లా మహాసభలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తామన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని ఐదు ఎం ఎల్ ఎస్ పాయింట్ నుండి హమాలీ కార్మికులతో పాటు ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజయ్ సారధి రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమ బిక్షపతి హాజరవుతారన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్డే బోయిన లక్ష్మీనరసయ్య, రాజబోయిన శ్రీను, నరముల యాకయ్య, బిచ్చు, రాజు, యాకయ్య, రెంటాల వెంకన్న, నగేష్, తాటికాయల యాకయ్య, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ లో సుందరీమణులు ఆహ్వానించిన సీపీ.!

ఖిలా వరంగల్ లో ప్రపంచ సుందరీమణులు

ప్రపంచ సుందరిమణులను సాధరంగా ఆహ్వానించిన వరంగల్ సీపీ

ఖిలా వరంగల్ లో భారీ పోలీస్ బందోబస్తు

వరంగల్ తూర్పు  నేటిధాత్రి :

 

 

మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా హన్మకొండ, వరంగల్ పర్యటనకై బుధవారం సాయంత్రం హరిత కాకతీయ హోటల్ కు చేరుకున్న వివిధ దేశాలకు చెందిన సుందరిమణులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సాధరంగా ఆహ్వానించారు.

 

Thousand Pillar

మొదటగా హనుమకొండ లోని వేయి స్తంభాల దేవాలయంలో సందర్శన చేసిన ప్రపంచ సుందరీమణులు, అనంతరం వరంగల్ తూర్పు పరిధిలోని ఖిలా వరంగల్ కోట వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

Thousand Pillar

వరంగల్ డివిజన్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో, ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, మట్టేవాడ సిఐ తుమ్మ గోపి, వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, ఎస్సై లు, మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా రైతు మృతి.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

 

తిమ్మాజీపేట/నేటి ధాత్రి :

 

నాగర్ కర్నూల్ జిల్లా బావాజీ పల్లి గ్రామంలో బుధవారం ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నిలిపింది. గ్రామస్తులకు వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల బాలస్వామి (55) సొంత పొలంలో ట్రాక్టర్ సహాయంతో పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.

ఎల్ఐసి నూతన మేనేజర్ భాద్యతల స్వీకరణ.!

ఎల్ఐసి నూతన మేనేజర్ గోపి కిషోర్ భాద్యతల స్వీకరణ

పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన సిబ్బంది, ఏజెంట్ల నాయకులు.

నర్సంపేట నేటిధాత్రి:

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ గా గోపి కిషోర్ బుదవారం బాధ్యతలు చేపట్టారు.ఎల్ఐసి కార్యాలయానికి చేరుకున్న నూతన మేనేజర్ గోపి కిషోర్ కు .కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్,అడ్మినిస్ట్రేషన్ అధికారితో.

LICs new manager

ముఖ్య అధికారులు,సిబ్బంది,ఎల్ఐసి ఏఓఐ సంఘం నాయకులు, ఎల్ఐసి లియాపి సంఘం నాయకులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం పలువురు శాలువాలతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్స్,అధికారులు,ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

బస్ షెల్టర్ నిర్మించిన ఆర్టీసీ అధికారులు.

బస్ షెల్టర్ నిర్మించిన ఆర్టీసీ అధికారులు..

“నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండీ

పోచంమైదాన్ బస్ షెల్టర్ పై, కొన్ని రోజులుగా వార్తలు ప్రచురించిన “నేటిధాత్రి”.

“నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ కు అభినందనలు

ఎక్స్ అకౌంటు (ట్విట్టర్) ద్వారా ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన “నేటిథాత్రి” పత్రిక

ఎట్టకేలకు పోచంమైదాన్ బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి

షెల్టర్ నీడన ప్రయాణికులు.. “నేటిధాత్రి” పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

బస్ షెల్టర్ నిర్మాణాన్ని అడ్డుకున్న బిల్డింగ్ ఓనర్, ఆర్టీసీ అధికారుల పైకి ఎదురు దాడి ప్రయత్నం

అండగా నిలబడి నిర్మాణం పూర్తి చేయించిన 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్..

వరంగల్ తూర్పు నేటిధాత్రి:

వరంగల్ తూర్పు పరిధిలో, పోచంమైదాన్ జంక్షన్ వద్ద ఉన్న బస్సు స్టాండ్ గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో బాగంగా ఉన్న బస్ స్టాండ్ ను తొలగించారు. అదే స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టిన అధికారులు, పైకప్పు (షెల్టర్) వేయడం మర్చిపోయారు. దీంతో మహిళలు, ప్రయాణికులు కొన్ని రోజులగా నానా ఇబ్బందులు పడ్డారు. బస్ స్టేషన్ కు పైకప్పు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల సమస్యను నేటిధాత్రి పత్రిక, “బస్ షెల్టర్ నిర్మించండి సార్” అని, “బస్ షెల్టర్ నిర్మించండి మంత్రి గారు” అని బస్టాండ్ సమస్యపై, అనేకసార్లు వార్తలు రాసి, ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి. సోషల్ మీడియా ఎక్స్, (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన నేటిదాత్రి పత్రిక. పిర్యాదుకు స్పందించిన ఆర్టీసీ ఎండీ, మే 14, బుధవారం నాడు మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు, వారి పర్యటనలో భాగంగా ఖిలా వరంగల్ కు బుధవారం రానున్న నేపథ్యంలో, నగరాన్ని సుందరీకరణ చేస్తున్న విషయం తెలుసుకొని, జిల్లా ఆర్టీసీ అధికారులకు బస్
షెల్టర్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో. వెంటనే స్థానిక ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేశారు. నిలువ నీడ చేకూర్చిన ఆర్టీసీ అధికారులకు, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి పత్రిక కు, స్థానిక కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలియచేశారు ప్రయాణికులు.

RTC bus

బస్ షెల్టర్ నిర్మాణం ఆపాలని, ఆర్టీసీ అధికారులతో వాగ్వాదం

బుధవారం ఉదయం ఆర్టీసీ అధికారులు పోచంమైదాన్ కు చేరుకొని, బస్ షెల్టర్ నిర్మాణం చేస్తుండగా, పక్కనే ఉన్న బిల్డింగ్ యజమాని కుమారులు వచ్చి, ఆర్టీసీ మహిళ అధికారిని పైకి ఇనుప రాడ్డుతో దాడి చేయబోయి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్డుతో దాడి చేయబోయే సంఘటనపై వీడియో తీసిన ఆర్టీసీ అధికారులు వీడియోను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. ఓ టౌన్ ప్లానింగ్ అధికారి సైతం వచ్చి బస్ షెల్టర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆర్టీసీ అధికారులపై రుబాబు మాటలు మాట్లాడటంతో, మున్సిపల్ కార్పొరేషన్ “పెద్దల సహకారం” బిల్డింగ్ ఓనర్ కు ఉంది అనే అనుమానాలకు తావిచ్చింది. బిల్డింగ్ ఓనర్ కుమారులు మాట్లాడుతూ, నగర మేయర్ మేడం మాకు సపోర్ట్ గా ఉంది అని చెప్పడం గమనార్హం.

RTC bus

స్పందించిన స్థానిక కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్

బస్ షెల్టర్ వద్ద నిర్మాణం అడ్డుకున్న వ్యాపారితో మాట్లాడిన స్థానిక కార్పొరేటర్. ఇరువురికి నచ్చచెప్పిన తరువాత ఆర్టీసీ అధికారులు పని మొదలు పెట్టారు. దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించిన స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్. బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేయించిన 25వ డివిజన్ కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికులు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో . ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం గంగాపూర్ గ్రామం పి.మల్ శెట్టి పాటిల్ కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వెడుకల్లో మాజీ సర్పంచ్ లు శంకర్, రామలింగారెడ్డి, శివరాజ్ పాటిల్,జలీల్, జి.నర్శింలు,నబిసాబ్, చెంగల్ జైపాల్,చంద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు విశిష్టత కార్డు తప్పనిసరి.

రైతులకు విశిష్టత కార్డు తప్పనిసరి

నెక్కొండ నేటి ధాత్రి:

 

రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు విశిష్ట కార్డు రైతులకు ముఖ్యమని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర లో రైతు విశిష్ట కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి నాగరాజు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కిసాన్ యోజన తో పాటు ఎరువులు విత్తనాలు కొనుగోలు కేంద్రాల్లో పంటలు అమ్ముకున్న రోజున ఈ విశిష్టత కార్డు ప్రభుత్వం తప్పనిసరి అనే విధానాన్ని కల్పించ నున్నదని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నూతన విధానాన్ని రైతుల కోసం ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రైతు విశిష్టత రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు, కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి వసంత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మేరకు బృందాల ప్రదర్శన. !

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళా బృందాల ప్రదర్శన….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర.సంబంధాల శాఖ ఆధ్వర్యంలో. తెలంగాణ సాంస్కృతిక సారధి గడ్డం శ్రీనివాస్ కళాబృందం ఆధ్వర్యంలో పలు గ్రామాలలో బృందంచే. అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు అయిన. కెసిఆర్. కాలనీ కాబట్టి ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పారిశుభ్రత పాటిస్తూ ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా .తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. తెలియజేస్తూ ముఖ్యంగా యువత పిల్లలు డ్రగ్స్ గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని. పెద్దలు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులతో కలిసి కలకాలం. పిల్లాపాపలతో చల్లగా ఉండాలని. ముఖ్యంగా ప్రజలు వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాలని. కూలి పనికి వెళ్లేవారు. ఉదయం. సాయంత్రం. పనులు చేసుకోవాలని ఎండలో పనిచేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తలపాగా టోపీ గొడుగు మంచిరు వంటివి వెంట తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందిరమ్మ ఇల్లు రాజు యువ వికాసం గృహ జ్యోతి ఉచిత . వంట గ్యాస్. 200 యూనిట్ల ఇంటి కరెంటు సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో. జిల్లా సాంస్కృతిక. సారధి టీం లీడర్ గడ్డం శ్రీనివాస్. కళాకారులు. శ్రీరాముడు రామచంద్రం. గుగ్గిళ్ళ పరశురాములు. వంతడుపుల గణేష్. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ.

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ బృందం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

హైదరాబాద్ లోని మినిష్టర్ నివాసంలో వ్వవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరావు ను సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కె కె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, వైస్ చైర్మెన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, కమిటీ డైరెక్టర్ లు కలసి పుష్పగుచ్చాము అందజేసి శాలువతో సత్కరించారు.అనంతరం సర్దాపూర్ లో గల వ్వవసాయ్ మార్కెట్ కమిటీ సిసి రోడ్ కాపౌండ్ వాల్ కొరకు నిధులు కొరకు మంత్రి దృష్టి కి తీసుకెళ్లగా, మంత్రి గారు స్పందించి, సిసి రోడ్ కు నిర్మాణానికి 1 కోటి 30 లక్షలు, కాంపౌండ్ వాల్ కోటి రూపాయలు కేటాయించి నిధులు మంజూరు చేశారాని మార్కెట్ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ కు సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్స్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం.!

రేపు రంజోల్ దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ. స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. లియో క్రాఫ్ట్, ఇంటిరియర్స్ అధినేత చెవుల ఉమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి గణపతి పూజ, పంచామృత అభిషేకం, 9గం. లకు దత్త హోమం, 11. 30 కి పూర్ణహుతి, మ. 12 గం. లకు స్వామివారికి హారతి, 12. 30 కి అన్నప్రసాద కార్యక్రమలు జరుగునని తెలిపారు.

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలి.

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలి..

#ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

#దేవాలయ స్థల దాతకు ఘన సన్మానం .

#మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.!

జర్నలిస్టు కాలనీ స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్య
లు తప్పవు బెల్లంపల్లి తహసిల్దార్ జోష్ణ.

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

 

బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదా
రిని ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీ స్థలంలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్లాటింగ్ చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేయడంతో రెవె
న్యూ అధికారులు బుధవారం తొలగిం
చారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల కిందట జర్నలిస్టు కాలనీ లోని స్థలంలోకొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా సిమెంటు పోల్స్ పాతిస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు(టేకు
లబస్తీ) జర్నలిస్టు కాలనీకి వెళ్లి క్షేత్ర
స్థాయిలో పరిశీలించి సంబంధిత తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్లను విషయాన్ని వివరించి స్థలాన్ని రక్షించి అర్హులైన జర్నలిస్టులకు సంబంధిత స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయడం జరి
గింది. స్పందించిన బెల్లంపల్లి తహసీల్ జోష్ణ ఆదేశాల మేరకు బెల్లంపల్లి రెవెన్యూ ఆర్ఐ మురళీదర్ రెవెన్యూ సిబ్బంది సహాయంతో స్థలంలో పాతిన సిమెంట్ పోల్స్ ను తొలగించారు. ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి జర్నలిస్టు కాలనీ స్థలాన్ని రక్షించినందుకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జోష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హామీ హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీసుకున్న వర్కింగ్ జర్నలిస్టు
లందరికీ జర్నలిస్టు కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి. !

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం సీతారాంతండకు చెందిన వాంకుడోత్ రజిత-ఉక్కస్వామి దంపతుల కూతురు కృష్ణవేణి-శ్రీనివాస్ ల. వివాహ వేడుకల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు మృతి.

విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు మృతి
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:

 

మండలంలో విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షంలో రైతు మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన పడిదల బాపురావు ఇంటినుండి దగ్గరలోని విద్యుత్ పోల్ నుండి సర్వీస్ వైర్ ఈదురు గాలులకు మధ్యలో తెగి జెర్సీ అవుమీదపడి విద్యుత్ ప్రసరణ జరగడంతో.రైతు పడిదల బాపురావు కు చెందిన 60 వేల విలువగల జెర్సీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ షాక్ గురై ఆవు చనిపోయిన. రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నూతన టివైజెఎఫ్ జహీరాబాద్ అధ్యక్షుడుని ఎన్నిక.!

నూతన టి.వై.జె.ఎఫ్. జహీరాబాద్ అధ్యక్షుడుని ఎన్నిక….!

◆-టి.వై.జె.ఎఫ్.అధ్యక్షుడుగా చెలిమేడ అనిల్ కుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ జర్నలిస్టు వృత్తి బాధ్యత గల వృత్తి అని, ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని రాష్ట్ర టి . వై.జె.ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ తనుగులు జితేందర్ రావు అన్నారు.హైదరాబాద్ లోని రాష్ట్ర టీ .వై .జె.ఎఫ్ ఆఫీసులో నిర్వహించిన ముఖ్య సమావేశంలో డాక్టర్ జితేందర్ రావు అధ్యక్షతన జహిరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన (టి.వై.జె.ఎఫ్) అధ్యక్షుడు కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన చెలిమేడ అనిల్ కుమార్ ను, టి.వై.జె.ఎఫ్. ఉపాధ్యక్షుడిగా ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామానికి చెందిన నాగేష్ , నూ రాష్ట్ర టి.వై.జె.ఎఫ్.

 

President

అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు నియమిస్తున్నట్లు తెలపడం జరిగింది. త్వరలోనే జహీరాబాద్ టీ.వై.జె.ఎఫ్. మిగతా శాఖలను అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కలిసి నియమించుకోవాలని రాష్ట్ర టి. వై .జె .ఎఫ్.అధ్యక్షుడు కోరడం జరిగింది. చెలిమేడ అనిల్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జహీరాబాద్ నియోజకవర్గ టీ.వై.జె.ఎఫ్. అధ్యక్షుడిగా నాకు ఇంత పెద్ద బాధ్యత చెప్పినందుకు రాష్ట్ర టీ.వై.జె.ఎఫ్.అధ్యక్షులకు డాక్టర్ తనుగుల జితేందర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో.!

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి

నేటి యువత అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తున్నారు అది తెలంగాణ మట్టిగడ్డ యొక్క గొప్పతనం – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలోని శాంతినగర్ లో శ్రీసేవాలాల్ మహారాజ్ కాంప్లెక్స్ నందు మాలోత్ కల్పన రాజు నాయక్ పెట్టిన రాయల్ బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ కొత్తపెల్లి మండల వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ లతో కలసి ప్రారంభించడం జరిగినది. ఈసందర్భంగా నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నేటి యువతరం కష్టపడి తమ కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో రకమైన వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారని ఒకప్పుడు ఏపని లేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ముందుకు ఎదుగుతుంది అంటే అందుకు కారణం యువతరమని ఏదో ఒక పని చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పనిచేస్తున్నారని అందుకోసమే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఉద్యోగం కాదు వ్యాపారంలో కూడా అధిక లాభాలు సంపాదించి అభివృద్ధి చెందవచ్చనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించారన్నారు. అందులో భాగమే నేడు కల్పన రాజు నాయక్ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడడం కోసం బేకరీ ఫాస్ట్ ఫుడ్ పెట్టడం జరిగిందని సందర్భంగా వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మాజీ వార్డ్ మెంబర్ నజీమా బేగం, బిజెపి నాయకులు సదానందం నాయక్,
బిఆర్ఎస్ నాయకులు చెట్టుపెళ్లి నరేందర్, మల్లేశం, భాస్కర్ నాయక్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ రవి నాయక్, గిరిజన నాయకులు రంగనాయక్, మోహన్ నాయక్, పాప నాయక్, జాంగిర్, పైడిపాల రవి, శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

ఖానాపూరం మండలం బుధరావుపేట గ్రామంలో భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారా తోరణం (ఆర్చ్) ను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుదవారం ప్రారంభించారు.అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు,దేవాలయ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్ పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి :

 

 

రైతులు రైతు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. రైతులు కేంద్ర ప్రభుత్వం పథకాలను పొందడానికి ఈ రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దీని ద్వారా 11 అంకెల కార్డు రావడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అప్పుల బాధలు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జహీరాబాద్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని . మహేంద్ర కాలనీకి చెందిన మృతుడు రవికాంత్ చారీ 32 స్వర్ణకారుడు వ్యాపారం చేస్తుండేవాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version