ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి .

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి..

సిపిఐ,సిపిఎం జిల్లా కార్యదర్శిలు కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా, నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి :

 

దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు డిమాండ్ చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆపరేష న్ కగార్ ను నిలిపివేయాలని కోరుతూ సిపిఐ, సిపిఎం లిబరేషన్ పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన ప్రభుత్వం అసమానతల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను అతి కిరాతకంగా ఎన్కౌంటర్ లో చంపడం దుర్మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని మావోయిస్టుల తో శాంతి చర్చలు జరిపి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే అందుకే మావోయిస్టులను అంతం చేయాలని చూస్తుందని అన్నారు. 2026 లో ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టు లను అంతం చేయాలనే దురుద్దేశంతో బిజెపి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడుతుందని ఆరోపించారు. మావోయిస్టులు ఈ దేశ పౌరులేనని భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ప్రతి మనిషికి కల్పించిందని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మనిషిని మనిషి చంపుకోవడం ఏంటని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్,వెలిశెట్టి రాజయ్య కన్నూరి దానియల్ నేరెళ్ల జోసెఫ్ మాతంగి రామచందర్,శేఖర్, పొన్నగంటి లావణ్య,గోమాత,శ్రావణి,స్వరూప ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

#మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో క్రయ విక్రయాలు.

#నిషేధిత విత్తనాలపై పర్యవేక్షణ లేని వ్యవసాయ అధికారుల పనితీరు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మారుమూల పల్లెల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తుంటారు అమాయక రైతుల అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది దళారులు నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయించి కోట్లకు పడగలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో దళారులు గ్రామాలలోని కొంతమందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. నిషేధిత విత్తనాలపై సంబంధిత వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతోనే దళారులు ఇష్ట రీతిన నిషేధిత విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నిషేధిత బీ టీ 3 విత్తనాలు వేయడం వల్ల రైతులు అనారోగ్యానికి గురై ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేసినప్పటికీ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన చేయకపోవడంలో విఫలమైనరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారులు మారుమూల గ్రామాలలో విత్తనాలను డంపింగ్ చేసి ఏజెంట్ల ద్వారా రైతులకు ఒక్కొక్క ప్యాకెట్ ధర 1500 చొప్పున విక్రయిస్తూ ఎకరాకు 2 ప్యాకెట్లకు గాని 3000 రూపాయలు వసూలు చేస్తున్నారని విశ్వనీయ సమాచారం. అలాగే విడి విత్తనాలను కేజీకి 3500 ల చొప్పున రైతులకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

#కూలీల కలుపు ఖర్చు మిగులుతుందని.

 

cotton

బీటీ 3 పత్తి విత్తనాలతో ఆరోగ్యానికి హానికరం, భూమిలో భూసారం క్షీణించి పోతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీటీ-3 విత్తనాల అమ్మకాలు నిషేధించింది. కానీ బీటీ-3 విత్తనాలు మొలకెత్తిన తర్వాత కలుపు నివారణకై గడ్డి మందు పిచికారి చేసిన కూడా పంటకు ఎలాంటి నష్టం జరగదని దళారులు చెప్పడంతో రైతులు ఆ విత్తనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా కూలీల ఖర్చు తగ్గుతుందని పంట దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదని రైతులకు దళారులు నచ్చజెప్పడంతో మండలంలో అధిక మొత్తంలో బిటి-3 విత్తనాలు రైతులు విక్రయిస్తున్నారు. బీటీ -2 విత్తనాలపై గడ్డి మందు (గ్లైబో సెట్) పిచికార్ చేస్తే పత్తి పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులకు దళారులు అవగాహన చేస్తూ నిషేధిత విత్తనాల వైపు రైతులను మళ్లిస్తూ అదేవిధంగా నిషేధిత గడ్డి మందు (గ్లైబోసేట్) ల సైతం గ్రామాలలో డంపు చేసి రైతులకు విక్రయిస్తూ దళారులు లక్షల సైతం దండుకుంటున్నారు.

#తనిఖీలు చేపట్టని వ్యవసాయ అధికారులు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ మండలంలో బీటీ-3 విత్తనాలు విక్రయాలు జరుగుతున్న విషయం జోరుగా ప్రచారం జరుగుతున్న సంబంధిత వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ అధికారులు గ్రామాలలో తనిఖీలు చేపట్టి బీటీ-3 విత్తనాల విక్రయాలను అడ్డుకట్ట వేసి నిషేధిత విత్తనాల వల్ల జరిగే అనర్థాలను రైతులకు అవగాహన కల్పించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పారితోషికం తిరిగిచ్చేసిన పవన్‌కల్యాణ్‌

పారితోషికం తిరిగిచ్చేసిన పవన్‌కల్యాణ్‌

సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్‌ హీరోలు. Some heroes liked the story and made films without taking any remuneration.. but suffered losses after the film was released.

సినిమా టికెట్లు
  • అదే బాటలో సిద్ధు జొన్నలగడ్డ

సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్‌ హీరోలు. కథ నచ్చి, పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన హీరోలు కొందరైతే.. చిత్రం విడుదలయ్యాక నష్టాలొస్తే తాము తీసుకున్న రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చిన వారు మరికొందరు. అయితే చిత్రసీమలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ, సినిమా విడుదలకు ముందే తన పారితోషికాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఏ.ఎమ్‌.రత్నమ్‌ నిర్మాత. క్రిష్‌ దర్శకత్వంలో 2020లో మొదలైన ఈ చిత్రం పలు కారణాలతో సుదీర్ఘ కాలం పాటు సెట్స్‌లోనే ఉండిపోయింది. ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తిచేసుకుని ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారు. ఇంతకాలం ఈ సినిమా సెట్స్‌ పైనే ఉన్నందుకు నిర్మాతపై పడ్డ అదనపు భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో ముందు వరుసలో ఉంటారని నిరూపించుకున్నారు. మరో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆయన కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘జాక్‌’ ఏప్రిల్‌ 10న విడుదలైంది. సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంలో విఫలమైంది. దీంతో పారితోషికంగా తాను తీసుకున్న మొత్తంలో సగం(రూ. నాలుగు కోట్లు) తిరిగిచ్చేసి తన సహృదయాన్ని చాటుకున్నారు.

 

Pawan kalyan

షూటింగ్‌కు సిద్ధం

పవన్‌కల్యాణ్‌ మరోసారి పోలీస్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన ఎక్స్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల రెండో వారం నుంచి మొదలవుతోందని మంగళవారం తిరుమలలో వెల్లడించారు ఆయన. త్వరలోనే పవన్‌కల్యాణ్‌ కూడా సెట్స్‌లోకి అడుగుపెడతారని తెలిపారు.

కల్వకుర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి .

కల్వకుర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

కల్వకుర్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భగత్ సింగ్ తండాలో 15 లక్షల వ్యయంతో మురుగు కాలువ, కేశవ నగర్ లో 25 లక్షలతో సైడ్ డ్రైనేజీ, రాఘవేంద్ర కాలనీలో రూ. 22 లక్షలతో సీసీ రోడ్ పనులు,బాల్ రాం నగర్ లో సీసీ రోడ్, 8వ వార్డు సుభాష్ నగర్ లో రూ. 25 లక్షలతో సీసీ రోడ్, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ. 10 లక్షలు, ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయం వద్ద వన మహోత్సవం సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కల్వకుర్తి మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో చేతివృత్తుల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి,కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ల సంజీవ్ కుమార్ యాదవ్, కల్వకుర్తి మున్సిపల్ కమీషనర్ మహ్మద్ షేక్, వాస శేఖర్, మాజీ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనుష్క పోస్టర్‌ 40కి పైగా ప్రమాదాలు

అనుష్క పోస్టర్‌ 40కి పైగా ప్రమాదాలు

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు అల్లు అర్జున్‌…

 

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు అల్లు అర్జున్‌. ‘‘వేదం’కు 15 ఏళ్లు. నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రమిది. ఇతర సినిమాలతో పోలిస్తే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. దర్శకుడు క్రిష్‌కు రుణపడి ఉంటాను. ఎంతో నిజాయితీగా సినిమా తీశారు. ఈ చిత్రంలో మంచు మనోజ్‌, అనుష్క వంటి సహనటులతో ప్రయాణించడం ఓ గొప్ప జ్ఞాపకం. ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు శోభు, ప్రసాద్‌ దేవినేనిలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

ముందు అనుకున్న సినిమా వేరు

ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఓ సందర్భంలో పంచుకున్నారు క్రిష్‌. ‘‘గమ్యం’ తరువాత ఓ పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రానికి ప్లాన్‌ చేశాను. అయితే ఆ సమయంలో అమరావతికి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన ‘వేదం’ కథ సిద్ధం చేసేలా చేసింది. ఓ చిన్న పిల్లాడు వృద్ధుడిని వేలు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యం నన్ను కదిలించింది. ‘ఒక చిన్న పిల్లాడు వెట్టిచాకిరీ చేస్తాడు. వాడిని విడిపించుకోవడానికి వాళ్లమ్మ కిడ్నీలు అమ్ముతుంది’ ఇలాంటి ఓ లైన్‌తో మొదలైంది ‘వేదం’ కథ. అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క భాగం కావడంతో ఈ సినిమా పెద్ద సినిమాలా మారింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క వెనక్కి తిరిగి కొంటెగా చూస్తున్న పోస్టర్‌ను పెద్ద హోర్డింగ్‌గా చేసి పంజాగుట్ట సర్కిల్‌లో పెట్టారు. ఆ సమయంలో 40కి పైగా ప్రమాదాలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించారు. అంతలా అనుష్క ఆకట్టుకున్నారు’’ అని అన్నారు దర్శకుడు క్రిష్‌.

పళణి మురుగ‌న్ చెంత‌.. సూర్య‌, వెంకీ అట్లూరి

పళణి మురుగ‌న్ చెంత‌.. సూర్య‌, వెంకీ అట్లూరి

కంగువా, రెట్రో వంటి సినిమాల త‌ర్వాత త‌మిళ‌ స్టార్ సూర్య న‌టిస్తోన్న 46వ‌ చిత్రం ఇటీవ‌ల వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

 

కంగువా, రెట్రో వంటి సినిమాల త‌ర్వాత త‌మిళ‌ స్టార్ సూర్య (Suriya) న‌టిస్తోన్న 46వ‌ చిత్రం ఇటీవ‌ల వెంకీ అట్లూరి (Venky Atluri) ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌మితా బైజు (Mamitha Baiju) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా చాలా గ్యాప్ త‌ర్వాత‌ ర‌వీనా టాండ‌న్ (Raveena Tandon) తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండ‌గా రాధిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుంది. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ (Sitara entertainments) నిర్మిస్తోంది. జీవీ ప్ర‌కాశ్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఆ మ‌ధ్య పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా ఆరంభించిన మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆప్డేట్ ఇచ్చారు.

 

Suriya46

అయితే.. హీరో సూర్య‌తో పాటు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి (Venky Atluri), నిర్మాత నాగ‌వంశీ (Naga Vamsi) లు గురువారం త‌మిళ‌నాడులోని పళణి మురుగ‌న్‌ సుబ్ర‌మ‌ణ్య స్వామి (Palani Murugan Temple) ఆల‌యాన్ని సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. జూన్ 9 నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ర‌వితేజ‌.. అనార్క‌లి మొద‌లైంది

ర‌వితేజ‌.. అనార్క‌లి మొద‌లైంది

 

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు మాస్ మ‌హా రాజా ర‌వితేజ

Raviteja

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు మాస్ మ‌హా రాజా ర‌వితేజ (Ravi Teja). గ‌త సంవ‌త్స‌రం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ (Mr. Bachchan) చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌ర్చిన ఆయ‌న త్వ‌ర‌లో ప్ర‌స్తుతం మాస్ (Mass Jathara) జాత‌ర సినిమాతో అరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమా ఆగ‌ష్టులో థియేట‌ర్ల‌కు రానుంది. ఈ చిత్రం త‌ర్వాత ఇప్ప‌టికే చేతిలో మ‌రో మూడు సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌వితేజ న‌టించ‌బోయే మ‌రో కొత్త సినిమా RT76 నుంచి తాజాగా అప్డేట్ వ‌చ్చింది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

గ‌తంలో రామ్‌తో నేను శైల‌జా, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ చిత్రాల‌ను రూపొందించిన కిషోర్ తిరుమ‌ల (KishoreTirumala) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా SLV సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఆ పోస్ట‌ర్‌లో బిజినెస్ క్లాస్‌ విమానంలో ర‌వితేజ (Ravi Teja) ద‌ర్జాగా కూర్చోని ఎదుట సీటుపై కాలు వేసి కూర్చోని ఉన్న లుక్ అదిరిపోయేలా ఉంది.

 

కాగా ఈ సినిమాకు అనార్క‌లి (Anarkali) అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉండ‌గా నాగార్జున నా సామిరంగా మూవీ ఫేమ్ క‌న్న‌డ బ్యూటీ అషికా రంగ‌నాథ్ (Ashika Ranganath) సింగిల్ బ్యూటీ కేతిక శ‌ర్మ‌ క‌థానాయిక‌లు. గురువారం షూటింగ్ ప్రారంభించిన మేక‌ర్స్ 2026 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా అదే సంక్రాంతికి చిరంజీవి అనీల్ రావిపూడి చిత్రం విజ‌య్ జ‌న నాయ‌గ‌న్‌, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఓ రాజు, య‌ష్ టాక్సిక్ సినిమాల విడుద‌ల కానుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు సంక్రాంతి సినిమాల విష‌యంలో అప్పుడే చ‌ర్చ మొద‌లైంది.

ప్రభుత్వ పథకాలు పేదలకు అందిస్తాం.

ప్రభుత్వ పథకాలు పేదలకు అందిస్తాం.

ఆమనగల్ నేటిధాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలోని బోడ నరేష్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఆవాసం కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ.. అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ.. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగేలా చూడటం తన ప్రాధాన్య లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో.. మెకానిక్ బాబా, ఎమ్మెల్యే సహోదరులు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీమండలఅధ్యక్షులు జగన్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేశవులు, శివలింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్, కృష్ణా నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అప్పం శ్రీను, ఎంగలి ప్రసాద్, ఖాదర్, మాజీ వార్డు సభ్యులు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ, కరుణ ఇదే సర్వమత సారం

ప్రేమ, కరుణ ఇదే సర్వమత సారం: జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జీర్ణపల్లి గ్రామంలో నూతన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సాటి మనిషికి సాయం ఇదే సర్వమత సారమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, వెంకట్ రెడ్డి, మాజి ఎంపీటీసీ ప్రవళిక, యువ నాయకులు మిథున్ రాజ్, మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్, బస్వరాజ్, నాయకులు సంజీవ్ కిష్టయ్య బోరేగాం రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి గ్రామంలోని కాలుని లో నూతన సీసీ రోడ్డు పనులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారి కోటా లో ఎం ఆర్ జి ఎస్ రోడ్డు పనులను ప్రారంభించిన మొగుడంపల్లి మండల అధ్యక్షులు బి.రాములు ఇటీ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ అంజయ్య జట్టప్ప అనంతరం అంజయ్య తెలంగాణ ప్రభు నాగేష్ యాదవ్ అల్లావుద్దీన్ బిఆర్ఎస్ నాయకులు వెంకటేష్ కృపాకర్ తదితరులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రేవూరిని కలిసిన మండల ఫర్టిలైజర్స్ వెల్ఫేర్

ఎమ్మెల్యే రేవూరిని కలిసిన మండల ఫర్టిలైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ

 

పరకాల నేటిధాత్రి :

 

మండల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ అధ్యక్షులు వెంకన్న ను మరియు ప్రధాన కార్యదర్శి నవత బ్రదర్స్ శివాజీని,కోశాధికారి మల్లికార్జున,ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి విత్తనాలు లో,ఎరువులు,పురుగు మందులు వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు ఎరువులను రైతులకు అందించే విధంగా నాణ్యత ప్రమాణాలతో తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా నా సహాయ సహకారాలు మీకు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలి.

సిరిసిల్ల జిల్లా చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డ్ లను పరిశీలించి,చెక్ పోస్ట్ లో గల సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగినది.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవడం జరిగిందని, గోవుల అక్రమ రవాణా గోవధ నివారించేందుకు జిల్లా సరిహద్దుల జిల్లెళ్ల, పెద్దమ్మ, మానాల క్రాస్ రాడ్ వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,తనిఖీల్లో సరైన పత్రాలు ఉన్న రైతులకు సంబంధించిన లేదా వ్యవసాయనికి సంబంధించిన పశువుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది విధులు నిర్వహిచాలని తెలియజేశారు. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ యంత్రాంగామంతా సమన్వయముతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్.ఐ శంకర్ నాయక్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రపై డాక్యుమెంటరీ: మధుయాష్కీ గౌడ్.

మధుయాష్కీ గౌడ్ నివాసంలో కాంగ్రెస్ పెద్దల కీలక భేటి.

పార్లమెంటులో కాంగ్రెస్ ఆనాటి ఎంపిల పోరాటం నేపథ్యంగా డాక్యుమెంటరీ.

ఎంపిగా వున్న సమయంలో ఎమ్మెల్సీ విజయశాంతి పోరాటం కూడా డాక్యుమెంటరీలో పొందుపర్చడం జరుగుతుంది.

తెలంగాణ ఉద్యమ పోరాట చరిత్రపై డాక్యుమెంటరీ రూపొంచనున్నట్లు
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ప్రకటించారు. ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల జానారెడ్డి , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , కే కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్సీ విజయశాంతితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎన్ని పోరాటాలు జరిగినా పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడం ఎంతో కీలకపరిణామమని అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. ఆ ఆర్టికల్ ను రూపొందించిందే కాంగ్రెస్ పార్టీ అని మధు యాష్కీ పేర్కొన్నారు. మధుయాష్కీ నివాసంలో జరిగిన సమావేశంలో నాయకులకు డాక్యుమెంటరీ వివరాలు తెలియజేశారు.‌ ఈ డాక్యుమెంటరీలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీలుగా ఆ సమయంలో తాము చేసిన పోరాటాన్ని తెలంగాణ సమాజానికి గుర్తు చేసేలా డాక్యుమెంటరీ వుంటుందని యాష్కీ గౌడ్ చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు ఎంపిగా వున్న ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోరాటం కూడా డాక్యుమెంటరీలో పొందుపర్చడం జరుగుతుందన్నారు. కేసిఆర్ కన్నా పార్లమెంటులో ఎక్కువగా విజయశాంతి పోరాటం చేసిందని మధుయాష్కీ గుర్తు చేశారు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు

జహీరాబాద్ నేటిధాత్రి:

మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే మాణిక్ రావు కేక్ కట్ చేసిన అనంతరం గులాబీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద‌ర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాట్లాడుతూ ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ వెన్నంటి నడిచిన నిజమైన గులాబీ సైనికుడు హ‌రీష్ అని అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హ‌రీష్ రావు గార‌ని కొనియాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్టీ వెన్నెముక, క‌ష్ట‌కాలంలో నిలుస్తూ.. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతున్న యోధుడు హ‌రీష్ రావుగార‌ని అన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల ప్ర‌భుత్వ పాల‌న‌లో నీటి పారుద‌ల‌, ఆర్థిక మంత్రిగా వారు రాష్ట్రానికి ఎన‌లేని సేవ‌లు చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే కాళేశ్వ‌ర ప్రాజెక్టు సాకారంలో కేసీఆర్ గారితో పాటు హ‌రీష్ గారు శ్ర‌మ, కృషి మ‌రువ‌లేనిద‌ని అన్నారు. హ‌రీష్ రావు నిండు నూరేళ్లు అష్టైశ్వ‌ర్యాల‌తో , సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ముఖ్య‌మంత్రిగా తిరిగి కేసీఆర్ గారిని చేయ‌డంలో హ‌రీష్ రావు గారి నాయ‌క‌త్వాన్ని తెలంగాణ కోరుకుంటోంద‌ని అన్నారు.కార్య‌క్ర‌మంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,చిన్న రెడ్డి,వెంకట్, నర్సింహ రెడ్డి,ఇబ్రహీం,దేవదాస్,గణేష్,సురేష్ ,నరేష్ రెడ్డి,జాకీర్,అశోక్ రెడ్డి,ఇమ్రాన్ ,నాయకులు కార్యకర్తలు త‌దిత‌రులు పాల్గొన్నారు

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు.

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు

పెద్దమ్మతల్లి దేవాలయ విగ్రహాలకు లక్ష సహాయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామంలో ముది రాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మా ణానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మిట్టపల్లి సతీష్ యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచి,దేవాలయంలో ప్రతిష్టిం చే పెద్దమ్మతల్లి, పోతరాజుల విగ్రహాల కోసం లక్ష రూపాయ లు అందజేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి చిందం రవి, గ్రామస్తుల ఆధ్వర్యంలో సతీష్ విగ్రహాలను కొనుగోలు చేసి, గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈనెల 6న విగ్రహాల ప్రాణప్ర తిష్ట కార్యక్రమం నిర్వహించ నున్నారు. తన వయసుకు మించి గ్రామం కోసం పాటు పడుతున్న సతీష్ ను బుచ్చిరెడ్డి, చిందం రవి, గ్రామస్తులు హృదయపూ ర్వకంగా అభినందించి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

 

ఝరాసంగం మండల్ పరిధిలోని కుప్పానగర్ గ్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్ స్థానిక ప్రజలకు రైతులకు నకిలీ విత్తనాలు, సైబర్, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలపై వారికి వివరించారు. రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు. ఒకటికి.. రెండు సార్లు సరి చూసుకుని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ ఆర్గనైజర్ వద్దే విత్తనాలు తీసుకోవాలన్నారు. వాటిని రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆర్గనైజర్ నుంచి రశీదు పొందాలన్నారు. అలాగే తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తి అయ్యేవరకు రైతులు తమ వద్దే దాచాలన్నారు. ఆయా విత్తనాలను సాగు చేయడం వల్ల రైతు నష్టాలు పొందినట్లైతే సంబంధిత ఆర్గనైజర్ ను, కంపెనీని, బాధ్యులను చేయుటకు రైతు తీసుకున్న రశీదు, ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడుతాయని, ఆ ఆర్గనైజర్, కంపెనీపై కఠిన చర్యలు తీసుకొనుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 

మొగుళ్ళపల్లి, నేటి ధాత్రి:

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ సునీత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అంకుషాపురం రంగాపురం గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను తహసిల్దార్ నేరుగా స్వీకరించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆర్డీవో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చి అవకాశం వినియోగించుకోవాలని సూచించారు రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. 5/06/2025 రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గుడిపాడు వేములపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించబడుతుందని ఆ గ్రామాలలో ఉన్న రైతుల భూమికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రైతులుఅవకాశాన్ని వినియోగించుకోవాలని తాసిల్దారు కోరారు కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు

నిజాంపేట నేటి ధాత్రి:

జాతీయ ఉపాధి హామీ పనుల పై సామజిక తనిఖీ అధికారులు సర్వే చేపట్టారు. ఈ మేరకు మండలం లోని నస్కల్ గ్రామంలో బీఆర్పి అధికారులు మూడు రోజులుగా గ్రామం లోనీ ఇంటి ఇంటికి వెళ్లి కూలీలు ఎంత పని చేశారు. ఎంత డబ్బులు పడ్డాయనే దానిపై సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లాడారు.. 2024 – 25 సంవత్సరంలో 18 పనులు జరిగాయని ఈ పనులకు సంబంధించి కూలీ వేతనాలు, సామాగ్రి తో కలుపుకొని రూ,, 33,04,117 వచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో నూతన పని బుక్కులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందం, గ్రామ కార్యదర్శి అరిఫ్ హుస్సేన్, దేశెట్టి సిద్ధ రాములు, సుధాకర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు ఉన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసిన విత్తనాలనే… మేలు

శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసిన విత్తనాలనే… మేలు

కేసముద్రం/ నేటిదాత్రి

 

 

 

 

కేసముద్రం రైతు వేదిక యందు,నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి, వరి మరియు పెసర మూల విత్తనాల కిట్లను, కేసముద్రం మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల రైతులకు, ప్రతి రెవిన్యూ గ్రామం నుంచి ముగ్గురు అభ్యుదయ రైతులకు ప్రతి రెవెన్యూ గ్రామానికి రెండు వరి మరియు ఒక పెసర మిని కిట్లను, కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న అధ్యక్షతన, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్, గంటా సంజీవరెడ్డి మరియు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గంటా సంజీవరెడ్డి, మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి, నాణ్యమైన వరి మరియు పెసర విత్తనాలను, అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటువంటి విత్తనాలను గ్రామస్థాయిలో అభ్యుదయ రైతులు శాస్త్రవేత్తల సలహా సూచనలతో ఉత్పత్తి చేసి గ్రామంలో ఉన్న రైతులకు పంపిణీ చేసి వచ్చే సీజన్లో తక్కువ ఖర్చుతో విత్తనాలను సరఫరా చేయాలని వారు సూచించారు దీనివలన విత్తన ఖర్చులు తగ్గి రైతుకు మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చి,నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. అదేవిధంగా రైతులు విత్తన కంపెనీల మీద ఆధారపడకుండా వారి యొక్క విత్తనాలను వారి గ్రామంలోని స్వతహాగా తయారు చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మాట్లాడుతూ కేసముద్రం మండలానికి 15 రెవెన్యూ గ్రామాలకు గాను 30 వరి కిట్లను, 15 పెసర కిట్లను అభ్యుదయ రైతులకు పంపిణీ చేశామని తెలిపారు అదే విధంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విత్తనం వేసినప్పటినుంచి పంట చేతికి వచ్చే వరకు విత్తన ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేసముద్రం, ఉపాధ్యక్షులు, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు మహబూబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ రావుల మురళి, మరియు సొల్లేటి జయపాల్ రెడ్డి , బండారు వెంకన్న , కదిరే సురేందర్ , గుగులోతు దశ్రు నాయక్ , వివిధ గ్రామాల అభ్యుద రైతులు, కేసముద్రం మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, డి రాజేందర్, శ్రీనివాస్, సాయిచరణ్ రవి వర్మ, లావణ్య లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version