బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
చందుపట్ల కీర్తి రెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి:

మొగులపల్లి మండలం గ్రామం వేములపల్లి లోఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. వారి వెంట నాయకులు మాజీ ఎంపీటీసీ గాజుల రజిత మల్లయ్య రాజు గౌడ్ చంద్రసేన ఎర్ర రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం.

సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. వివిధ శాఖలపై సమీక్షించారు. కార్యక్రమంలో నిర్మలారెడ్డి, టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య పాల్గొన్నారు.

అప్పుల బాధతో ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అమలు.

అప్పుల బాధతో ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అమలు

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.

అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని, పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నాగారం నుండి పాయబట్ల వరకు 400 లక్షలు తో బి.టి రోడ్డు నిర్మాణ పనులు, 150 లక్షల అంచనా విలువ తో వాజేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణం, ఎడ్చర్లపల్లి నుండి ముత్తారం వరకు 300 లక్ష తో బి.టి. రోడ్డు నిర్మాణం పనులను శంకుస్థాపనలు, 14 లక్షలతో నిర్మించిన బేబీ బర్త్ వెయిటింగ్ భవనము ను రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ శబరిష్ , ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి ప్రారంభించినారు.
అనంతరం కొంగాల గ్రామం 57 మందికి , నాగారం గ్రామం 64 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.
అనంతరం వెంకటాపురం మండలం కేంద్రం లో అంచనా విలువ 60 లక్షల నిధులతో ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ (పి.ఆర్) కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి శంకుస్థాపన చేశారు.
పాత్రపురం గ్రామంలోని రైతు వైదిక లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.
ఈ సందర్భంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో 8 లక్షల 19 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలపై పెను భారం మోపిందని, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత పాలకులు చేసిన అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని, వాజేడు, వెంకటాపూరం మండలాలలో నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని తెలిపారు.
గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేయడానికి కార్యక్రమాలను చేపట్టిన ఈ సంవత్సరం ఉగాది నుండి ధనికుడు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తున్నామని అన్నారు. గతంలో పాలించిన దొర కాలంలో అరకొరగా ఉద్యోగ అవకాశాలు కల్పించగా నేటి ప్రజా ప్రభుత్వం పది నెలల కాలంలోనే 57 వేల 662 ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చి పేద రైతులకు చుట్టంగా మార్చిందని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో రాజీవ్ వికాస్ పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని లక్ష్యంతో అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, అర్హులైన వారందరికీ జూన్ 2వ తేదీన ఆరువేల కోట్ల రూపాయలను అందజేయడం జరుగుతుందని అన్నారు. నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు నిరుపేదలు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందడానికి పది లక్షల రూపాయలను పెంచడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం పేదల పట్ల సవతి తల్లి ప్రేమ కనపరిచినప్పటికీ నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పేదల కన్నీళ్లను చూడచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని, రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిన అనంతరం నూతన పథకాలను అమలు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.
ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.
భద్రాచలం శాసన సభ్యులు
తెల్లం వెంకట్రావు.
భద్రాచలం నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.
బుధవారం వాజేడు, వెంకటాపురం మండలాలలో జరిగిన పలు కార్యక్రమాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గ్రామాల నిరుపేద ప్రజలకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. తన నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలలోని అన్ని గ్రామాలలో అన్ని వర్గాల నిరుపేద ప్రజలు ఉన్నారని వారందరికీ దశలవారీగా ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ పనులను త్వరత గతిన పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని అన్నారు. వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామంలో 106 ఇల్లు మంజూరు కాగా 62 ఇండ్లు గ్రౌండ్ లెవెల్ లో ఉన్నాయని 15 ఇండ్లు గ్రౌండ్ ఇండ్లు నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులకు మొదటి విడత డబ్బులు చెల్లించడం జరిగిందని వివరించారు. ఇండ్ల నిర్మాణం కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరుపేదలకు ఐటిడిఏ పరిధిలోని ఆదివాసి గిరిజనులకు ఇండ్ల నిర్మాణం కోసం అదనపు ఇండ్లను కేటాయించిందని అన్నారు.
ఈ కార్యక్రమములలో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు,
మండల అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదవండి.!

ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోండి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం. స్థానిక సెస్. ఆధ్వర్యంలో. ప్రభుత్వ బాలికలు జూనియర్ కళాశాల సిరిసిల్ల అధ్యాపక బృందం. ప్రభుత్వ కళాశాలలో చేరండి మీ మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. అనే.నినాదంతో సారంపల్లి బద్దెనపల్లి గ్రామాల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటింటికి వెళ్లి కళాశాలకు సంబంధించిన కరపత్రాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్మీడియట్ విద్యను చదవండి చదవడం వల్ల కలిగే లాభాలు వారి తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ సీతారాము శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ .నవీన్ రెడ్డి. జెబి ఉల్లా గంగరాజు తదితరులు పాల్గొన్నారు

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.!

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మర్రి చెట్లను తొలగించాలని కమిషనర్ కు వినతి.!

మర్రి చెట్లను తొలగించాలని కమిషనర్ కు వినతి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శేషు పల్లి గ్రామం నుండి క్యాతనపల్లి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా మర్రి చెట్లు ఉన్నందున రోడ్డు పగిలిపోతుందని, మర్రి చెట్లను తొలగించి వేరే చెట్లను పెట్టేలా చొరవ తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు కు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయించేలా చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగిందని మాజీ వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నంది సురేష్, నరేష్, బండారి ప్రశాంత్, ప్రమోద్ ,సాయికిరణ్, కుర్మ విజయ్, నంది అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు

టీజీ ఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి

నెన్నల,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

నీలగిరి వనాలతో ఎన్నో లాభాలున్నాయని,వీటిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీ శ్రావణి అన్నారు.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నీలగిరి తో నా స్నేహం పేరిట నెన్నెల మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో గురువారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ నీలగిరి వనాల ద్వారా కాగితం తయారీకి అవసరమయ్యే కలప లభ్యమవ్వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. ఒకే చోట వేలాదిగా పెంచే నీలగిరి చెట్ల ద్వారా అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తూ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు నీలగిరి చెట్లు పెంచే దశ నుంచి కోత వరకు,ఆ తర్వాత కాగితం తయారీకి అవసరమయ్యే కలపను రవాణా చేసే వివిధ దశల్లో జరిగే పనులను వివరించారు.ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి నీలగిరి వనాలను రక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ వి. సునీత,డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దుర్గం నరేష్,వాచర్లుమొండి,సత్తయ్య,రవి సిబ్బంది షాహిద్,సంజీవ్ లు పాల్గొన్నారు. ‎

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు.

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కి. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ అధ్యక్షులు వెన్ననేని. శ్రీధర్ రావు మాట్లాడుతూ పాకిస్తానీయులను గుర్తించి వారి దేశం విడిచి వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మసీదులో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిములు గుర్తించి వెంటనే వారిని పాకిస్తాన్ కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పాకిస్తాన్ మద్దతుతో దేశంలో ఉండిపోతున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి అలాగే మే 22వ తేదీన కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఏక్తాయాత్ర. నిర్వహించడం జరుగుతుందని . ఈ కార్యక్రమానికి మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వినయ్ ఓబీసీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ జీవన్ మధుసూదన్ పోకల శ్రీనివాస్. రాజు. అనిల్. గణేష్. తదితరులు పాల్గొన్నారు

వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి.!

*వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు *
ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు
బెజగం నాగరాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం మొగుళ్ళపల్లి మండలకేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు
. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెజగం నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పురోహితులు భైరవపట్ల వెంకటేశ్వర్ల శర్మ పూజా ప్రాంగణాన్ని సం ప్రోక్షణ చేసి సకల దేవతలను ఆహ్వానం చేయించిన అనంతరం వాసవి మాతకు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు

 

President

ఆర్యవైశ్య బంధుమిత్రులందరు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బెజగం నాగరాజు ఉపాధ్యక్షులు బజ్జురి వీరన్న కోశాధికారి వేణుగోపాల్ యూత్ అధ్యక్షులు పుల్లూరి సాయికృష్ణ కోశాధికారి గోలి మహేష్ ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మంజుశ్రీ ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులు  కోరుకున్నారు .

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతని ఇస్తుందని తెలియజేస్తూ .నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిది ఒక వరంలో మారాయని కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుంది అని తెలియజేస్తూ లక్ష్మి పూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చందు ఆధ్వర్యంలో 45 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చెక్కులు రావడానికిసహకరించిన పెద్దలందరికీ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు మునిగే ప్రభాకర్ నందగిరి ఆంజనేయులు మహేష్ తక్కల్ల ఆంజనేయులు గణేష్ తదితరులు పాల్గొన్నారు

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి కేసీఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 2 లో కేసీఆర్ నగర్ లో తాడూరు రాము కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మిత్రునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

కోటగుళ్లను సందర్శించిన పురావస్తు శాఖ.

కోటగుళ్లను సందర్శించిన పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో
కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ ను మంగళవారం
పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ సందర్శించారు. త్వరలో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న తరుణంలో అధికారుల బృందం సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. గర్భాలయం ప్రదక్షిణ పదం, కాటేశ్వరాలయం నాట్యమండపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిలా శాసనం శివ ద్వారపాలక విగ్రహాలను పరిశీలించి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్కియాలజిస్ట్ అసిస్టెంట్ రోహిణి సీనియర్ కన్వర్జేటర్ మల్లేశం లుఉన్నారు.

అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట చేను దగ్ధం.

అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట చేను దగ్ధం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని శాంతినగర్ గ్రామంలో కత్తుల ఓదెలు అనే రైతుకి సంబంధించిన రెండు ఎకరాలలో మక్క పంట పండించడం జరిగింది బుధవారం మధ్యాహ్నం సుమారు 3: 20 నిమిషాలు అధిక ఎండపాతం ఉండడంవల్ల పంటలో చేను లో అనుకోకుండా మంటలు వ్యాపించి రెండు ఎకరాల షేను పూర్తిస్థాయిలో దగ్ధం కావడం జరిగిందిని, రైతు ఆవేదన చెందడం జరిగింది, మొక్కజొన్న పంట సుమారు 100 కింటాల మక్కలు ఉన్నట్టుగా రైతు ఓదెలు తెలియజేయడం జరిగింది, అప్పుచేసి పంటకు పెట్టుబడి పెట్టి చేతి కి అందే టైంలో మంటలో కాలిపోవడంతో రైతు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం నుండి సాయం అందించాలని అధికారులను కోరారు.

ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభ.!

ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలి

ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎం సి పి ఐ యు-ఏఐసీటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న సోమవారం వరంగల్ జిల్లా మచ్చాపూర్ లో నిర్వహించే ఎంసీపీఐయు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూఅమరజీవి మద్ది కాయల ఓంకార్ నర్సంపేట నియోజకవర్గం నుండి 5సార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచినాడని ఆయన ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం గల మెత్తడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా సమస్యల అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడు అని ఆయన అన్నారు.1984లో ఎం సి పి ఐ పార్టీని స్థాపించి అంచలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపచేసి 2006లో ఎం సిపిఐ యు గా ఏర్పరిచారని అన్నారు.నిత్యం బడుగు, బలహీన వర్గాల సామాజిక అభివృద్ధి కొరకు తన జీవితకాలమంతా పోరాటాలను కొనసాగించినాడని వారి పోరాట ఫలితమే నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనని ఆయన అన్నారు.ఈ సభకు ప్రముఖ కవులు గోరేటి వెంకన్న,జయరాజు గాయకులు యోచన,ప్రజా కళాకారులు,వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని ఈ సభ విజయవంతం కొరకు విద్యార్థులు,యువకులు,సామాజిక ఉద్యమకారులు,అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:బొల్లోజు రామ్మోహన్ చారి,ధరావత్ రమేష్,వేల్పుల వెంకన్న,గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్,దుగ్గిరాల వెంకన్న,ధారావత్ వీరన్న, సాంబ,బెజ్జం ఐలేష్,కస్తూరి వెంకన్న,లాకావత్ రవి,దేవుల,బానోత్ ఈసు, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

రామాలయ అభివృద్ధికి నగదు అందజేత.

రామాలయ అభివృద్ధికి నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీత రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన మచ్చక సారమ్మ కీర్తిశేషులు జ్ఞాపకార్థం వారి కుమారుడు మచ్చక ముఖేష్ కుమార్ ఆలయ అభివృద్ధి కొరకు 10,000₹ రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బటక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య ఆలయ ప్రాంగణంలో హనుమాన్ మాల ధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి..

ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బడిబాట…

కేసముద్రం  నేటి ధాత్రి:

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బేరువాడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం బేరువాడ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతు న్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ , రాగి జావా,రెండు జతల బట్టలు ఇస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బానోతు వాగ్య, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పనికి ఆహారపథకంలో పాల్గొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి కోరారు.

శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి.!

శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి మహోత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఝరాసంగం మండలం ఈధులపల్లిలో శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి మహోత్సవాలు ఆలయ కమిటీ అద్వార్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంత్ రావు పాటిల్, పెద్దలు రాచయ్య స్వామి,శంకర్ పాటిల్,యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ ,పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మరియు పలువురు పెద్దలు, నాయకులు,భక్తులు పాలుగొన్నారు..

జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన.

జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన ఇరు బార్ అసోసియేషన్ల:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

 

బుధవారం రోజున ఇటీవల జరిగిన జూనియర్ సివిల్ జడ్జి అర్హత పోటీ పరీక్షల్లో ఎంపికైన వారిని హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుదీర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హాల్లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి నియామకాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ముగ్గురు మహిళా న్యాయవాదులు గంగిశెట్టి ప్రసీద, అంబటి ప్రణయ, దార సాయి మేఘన మరియు న్యాయశాఖ ఉద్యోగిి లడే రాజుల ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
ఇట్టి సందర్భంగా పలువురు సీనియర్
న్యాయవాదులు మాట్లాడుతూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నల్గురు జడ్జిలుగా ఎంపిక కావడం చాలా సంతోషకరం అన్నారు. గతంలో కూడా చాలా మంది ఈ బార్ అసోసియేషన్ల నుండి జడ్జిలుగా ఎంపికై వివిధ న్యాయస్థానాలలో జడ్జిలుగా విధులు నిర్వహిస్తున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ మరియు వరంగల్ ప్రధాన కార్యదర్శులు కె.రవి, డి.రమాకాంత్ మరియు ఇరు కమిటీ సబ్యులు మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు,మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం.!

ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం.

కల్వకుర్తి నేటి దాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కన్యకా పరమేశ్వరి మాతదేవాలయం లో వైశాఖ శుద్ధ దశమి బుధవారం రోజున వాసవి మాత జన్మదిన సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్ట్రీ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, మహిళలు చే కుంకుమార్చనలు పూజలు, వాసవి మాత పారాయణం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా అమ్మవారికి పల్లవి సేవ డోలారోహణం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు భోజనప్రసాదాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ నాయకులు, మండల నాయకులు,వాసవి క్లబ్ వనిత క్లబ్,ఆవోప సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version