అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట చేను దగ్ధం.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని శాంతినగర్ గ్రామంలో కత్తుల ఓదెలు అనే రైతుకి సంబంధించిన రెండు ఎకరాలలో మక్క పంట పండించడం జరిగింది బుధవారం మధ్యాహ్నం సుమారు 3: 20 నిమిషాలు అధిక ఎండపాతం ఉండడంవల్ల పంటలో చేను లో అనుకోకుండా మంటలు వ్యాపించి రెండు ఎకరాల షేను పూర్తిస్థాయిలో దగ్ధం కావడం జరిగిందిని, రైతు ఆవేదన చెందడం జరిగింది, మొక్కజొన్న పంట సుమారు 100 కింటాల మక్కలు ఉన్నట్టుగా రైతు ఓదెలు తెలియజేయడం జరిగింది, అప్పుచేసి పంటకు పెట్టుబడి పెట్టి చేతి కి అందే టైంలో మంటలో కాలిపోవడంతో రైతు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం నుండి సాయం అందించాలని అధికారులను కోరారు.