అప్పులున్నా హామీలు నెర‌వేరుస్తున్నాం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

అప్పులున్నా హామీలు నెర‌వేరుస్తున్నాంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 01:

ఎన్నిక‌ల హామీలను ఏడాదిలోనే 85శాతం నెర‌వేర్చిన ఘ‌నత ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వానికే ద‌క్కింద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ భ‌రోషా పెన్ష‌న్ల‌ను మూడువ డిజ‌వ‌న్ లోని ప్ర‌గ‌తీన‌గ‌ర్ లో ఎమ్మెల్యే ల‌బ్దిదారుల ఇళ్ళ‌కు వెళ్ళి పంపిణీ చేశారు. ఎన్డీఏ కూట‌మి నాయ‌కుల‌తోపాటు సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య పెన్ష‌న్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్ర‌ధాన డ్రైనేజీ కాలువ ఎత్తు త‌క్కువుగా ఉండ‌టంతో మురుగు నీరు పొర్లి ఇళ్ళ‌లోకి వ‌స్తున్న‌ట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ‌చ్చారు. కాల‌నీ విస్తరిస్తున్నా విద్యుత్ అధికారులు పోల్స్ ఏర్పాటు చేయ‌క‌పోతుండ‌టంతో త‌మ‌కు వీధి లైట్లు లేక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు. కాగా సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య ప్ర‌గ‌తీన‌గ‌ర్ లోని స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యేకి వివ‌రించారు. స్థానికులు త‌న దృష్టికి తీసుకువ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. కాగా ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన మాట ప్ర‌కారం మూడు వేల రూపాయ‌ల పెన్ష‌న్ ను నాలుగు వేలు చేసి ఏడాది నిండింద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. తిరుప‌తిలో 18వేల 664 మంది పెన్ష‌న‌ర్లు ఉండ‌గా వారికి 8 కోట్ల 23 ల‌క్ష‌ల రూపాయ‌లు అందిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. సూప‌ర్ సిక్స్ హామీల్లో కీల‌క‌మైన పిఎం కిసాన్ – అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం త్వ‌ర‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. అలాగే ఆగ‌స్టు 15వ తేదీ మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ప్ర‌భుత్వం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో పెన్ష‌న్ రెండు వేల నుంచి మూడు వేల‌కు పెంచేందుకు ఐదేళ్ళు ప‌ట్టింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బ‌ట‌న్ నొక్కి సొంత ప్ర‌చారం మాజీ సిఎం జ‌గ‌న్ చేసుకున్నారే త‌ప్ప ల‌బ్దిదారుల‌కు డ‌బ్బులు మాత్రం ప‌డ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. 10ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని వైసిపి ప్ర‌భుత్వం దివాళా తీయించినా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోది స‌హ‌కారంతో సంక్షేమం, అభివృద్ధి స‌మ‌పాళ్ళ‌లో ముందుకు తీసుకువెళ్ళుతున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, యువ‌నాయుకుళు లోకేష్ ల‌దేన‌ని ఆయ‌న కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు కోడూరు బాల‌సుబ్ర‌మ‌ణ్యం, సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య‌, జ‌న‌సేన నాయ‌కులు రాజా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అమలు.

అప్పుల బాధతో ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అమలు

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.

అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని, పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నాగారం నుండి పాయబట్ల వరకు 400 లక్షలు తో బి.టి రోడ్డు నిర్మాణ పనులు, 150 లక్షల అంచనా విలువ తో వాజేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణం, ఎడ్చర్లపల్లి నుండి ముత్తారం వరకు 300 లక్ష తో బి.టి. రోడ్డు నిర్మాణం పనులను శంకుస్థాపనలు, 14 లక్షలతో నిర్మించిన బేబీ బర్త్ వెయిటింగ్ భవనము ను రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ శబరిష్ , ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి ప్రారంభించినారు.
అనంతరం కొంగాల గ్రామం 57 మందికి , నాగారం గ్రామం 64 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.
అనంతరం వెంకటాపురం మండలం కేంద్రం లో అంచనా విలువ 60 లక్షల నిధులతో ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ (పి.ఆర్) కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి శంకుస్థాపన చేశారు.
పాత్రపురం గ్రామంలోని రైతు వైదిక లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.
ఈ సందర్భంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో 8 లక్షల 19 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలపై పెను భారం మోపిందని, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత పాలకులు చేసిన అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని, వాజేడు, వెంకటాపూరం మండలాలలో నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని తెలిపారు.
గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేయడానికి కార్యక్రమాలను చేపట్టిన ఈ సంవత్సరం ఉగాది నుండి ధనికుడు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తున్నామని అన్నారు. గతంలో పాలించిన దొర కాలంలో అరకొరగా ఉద్యోగ అవకాశాలు కల్పించగా నేటి ప్రజా ప్రభుత్వం పది నెలల కాలంలోనే 57 వేల 662 ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చి పేద రైతులకు చుట్టంగా మార్చిందని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో రాజీవ్ వికాస్ పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని లక్ష్యంతో అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, అర్హులైన వారందరికీ జూన్ 2వ తేదీన ఆరువేల కోట్ల రూపాయలను అందజేయడం జరుగుతుందని అన్నారు. నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు నిరుపేదలు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందడానికి పది లక్షల రూపాయలను పెంచడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం పేదల పట్ల సవతి తల్లి ప్రేమ కనపరిచినప్పటికీ నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పేదల కన్నీళ్లను చూడచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని, రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిన అనంతరం నూతన పథకాలను అమలు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.
ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.
భద్రాచలం శాసన సభ్యులు
తెల్లం వెంకట్రావు.
భద్రాచలం నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.
బుధవారం వాజేడు, వెంకటాపురం మండలాలలో జరిగిన పలు కార్యక్రమాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గ్రామాల నిరుపేద ప్రజలకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. తన నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలలోని అన్ని గ్రామాలలో అన్ని వర్గాల నిరుపేద ప్రజలు ఉన్నారని వారందరికీ దశలవారీగా ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ పనులను త్వరత గతిన పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని అన్నారు. వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామంలో 106 ఇల్లు మంజూరు కాగా 62 ఇండ్లు గ్రౌండ్ లెవెల్ లో ఉన్నాయని 15 ఇండ్లు గ్రౌండ్ ఇండ్లు నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులకు మొదటి విడత డబ్బులు చెల్లించడం జరిగిందని వివరించారు. ఇండ్ల నిర్మాణం కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరుపేదలకు ఐటిడిఏ పరిధిలోని ఆదివాసి గిరిజనులకు ఇండ్ల నిర్మాణం కోసం అదనపు ఇండ్లను కేటాయించిందని అన్నారు.
ఈ కార్యక్రమములలో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు,
మండల అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version