మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం

‘విద్యా నిధికి.. విరాళాలు అందించండి’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

బీఈడీ కళాశాలను అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. రూ. 2 లక్షలతో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా విద్యార్థులకు నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి వీలైనంతవరకు సౌకర్యాలు కల్పించాలని.. అది మనందరి బాధ్యత అన్నారు. కళాశాల అతి పురాతనమైనదని, త్వరలో కళాశాలలకు పూర్తిస్థాయిలో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు అందించామన్నారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఒక్క వ్యక్తితో అది సాధ్యం కాదు కాబట్టి.. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు చేశామని బాధ్యత కలిగిన పౌరులు సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విద్యానిధికి సహకరించాలని చేయూత అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ విద్యా నిధి పారదర్శకంగా అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నెల తన జీతం నుంచి రూ.లక్ష విద్యానిధిలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. మాకు ఈరోజు చాలా శుభదినం అని మా గురించి ఆలోచించి మా బాధలు అర్థం చేసుకొని మాకు శౌచాలయాలను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం.గోవిందరాజులు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నాయకులు ఏసు దాస్ , సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, రాజు గౌడ్, మోయీజ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన…..

ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకు న్నారు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజులు బొడ్రాయి ప్రతిష్ట పోచమ్మ తల్లి విగ్రహమహోత్సవాలు వైభవంగా నిర్వహించారు కవితా-శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా వేద పండితులతో పూజలు నిర్వహించారు మొదటి రోజు అనగా విగ్రహాల ఊరేగింపు రెండవ రోజు గణపతి హోమం సామూహిక పూజలు కుంకుమ పూజలు మూడవరోజు పోచమ్మ తల్లి బొడ్రాయి విక్రమ ప్రతిష్ట వైభవోపేతంగా నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి పూజలు మంగళ హోమం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. బొడ్రాయి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి వంగాల రమ- నారాయణ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వంగాల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెల 15,16, 17 తేదీల్లో గ్రామ ప్రజలు దంపతులతో పూజలు నిర్వహించి పోచమ్మ తల్లి, బొడ్రాయి ప్రతిష్టాపన వైభవంగా జరిగాయి ఈ పూజల్లో పాల్గొన్న పండితులు వేదమంత్రాలు ,పూర్ణాహుతి హోమం, గణపతి హోమం గ్రామ క్షేమాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ష్టాపన వైభవంగా నిర్వ హించారు. అనంతరం కూడా గ్రామంలో పండుగ వాతావ రణం నెలకొంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఆలయ అర్చకులు, వేద పండితులు అందరూ పాల్గొన్నారు.

ఘనంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కెసిఆర్..

మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి..

ముత్తారం :- నేటి ధాత్రి 

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండలంలో మచ్చుపేట గ్రామ బస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బి.ఆర్ఎస్ అధ్యక్షులు కిషన్ రెడ్డి పలువురు నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేసి అగ్రస్థానంలో నిలిపిన గొప్ప నాయకులు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలను ప్రాణంగా పెట్టి తెలంగాణ సాధించిన మహా వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు, రాబోయే రోజుల్లో తెలంగాణ పాలన కొరకు ప్రజలు ఎదురుచూస్తున్నారని వారు తెలిపారు. అలాంటి మహా నాయకునితో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉందని అన్నారు అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల ప్రజల తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్రావు, మాజీ పీ ఎస్ సి చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ నూనె కుమార్, మాజీ ఎంపీపీ అత్తే చంద్రమౌళి, షేర్ స్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్న బెదిరింపులు..తమ్ముడి అర్థింపులు!!

`రెండు సంవత్సరాల క్రితమే విఆర్‌ఎస్‌ తీసుకున్న మహేందర్‌ రెడ్డి

`రాజీనామా చేసినా ఉద్యోగ సంఘంలో నాయకుడు చెలామణి

Vanga mahender reddy

`అటు రియలెస్టేట్‌ వ్యాపారం.. ఇటు రాజకీయం

`సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డి దారి రాజకీయం

`మొత్తానికి టిచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం

`అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం

`పిఆర్‌టియు అభ్యర్థి వంగా మహేందర్‌ రెడ్డి అసత్యాలు ప్రచారం

`అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం

`అబద్దాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం

`పిఆర్‌టియు యూనియన్‌ విస్తుపోతున్న సందర్భం

`అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం

`డిఈఓలు, ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు

`ఎలాగైనా మహేందర్‌ రెడ్డి గెలవాలని డిఈఓలు, ఎంఈవోలు ఆర్డర్లు

`సైలెంట్‌గా సాగుతున్న మహేందర్‌ రెడ్డి ప్రచారం

`చాపకింద నీరులా సాగిస్తున్న రాజకీయం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయాలను మించిపోయాయి. ఉద్యోగ సంఘాలు కూడా టిక్కెట్లు అమ్ముకునే స్ధాయికి ఎదిగిపోయాయి. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు ఓ టీచర్‌ ఎమ్మెల్సీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక సామాన్యమైన ఉపాద్యాయుడు కోట్లు పెట్టి టిచర్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కొనుక్కునే పరిస్దితి వుంటుందా? అప్పులు చేసినా సాధ్యమౌతుందా? కాని టిక్కెట్ల పంపిణీలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా స్వయంగా ఆ టీచర్‌ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా చెబుతున్నాడంటే రాజకీయాలు ఎంత ఖరైదైపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక సగటు ఉపాధ్యాయుడు కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశాడు. దాని వెనుకు వున్న నిగూఢమైన రహస్యమేటి? రోజూ స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కోట్ల రూపాయలు సంపాదించడం సాద్యమా? అంటే కొన్ని సార్లు సాధ్యమే..కాని అసలైన ఉపాధ్యాయుడు కాదు…ఉపాధ్యాయ కొలువును అడ్డం పెట్టుకొని రియల్‌ వ్యాపారాలు సాగించి, ఫైనాన్స్‌ వ్యవహారాలు నిర్వహించే వారికి మాత్రమే సాధ్యం. అలా కరీంనగర్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీని పేరు పొందిన ఉపాద్యాయ సంఘం నుంచి వంగ మహేందర్‌ రెడ్డి ఎలా కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వయాన అన్న వంగ రవీందర్‌ రెడ్డి. ఆయన తెలంగాణ రెవిన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అద్యక్షుడు. ఈ వ్యవహారమంతా ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా రవీందర్‌ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, మెదక్‌, నిజాబామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన డిఈవోలు, ఏంఈవోలపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తన తమ్ముడు వంగ మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం అందరూ సహకరించాలని ఆయన ఆర్డర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. డీఈవోలు, ఎంఈవోలపై ఒత్తిడి తెచ్చి, ఉపాద్యాయులకు వారితో ఫోన్లు చేయిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ ఏకంగా ఎన్నికల కమీషన్‌కు ఉత్తరంకూడ రాశారు. వంగా రవీందర్‌ రెడ్డి తన తమ్ముడు వంగా మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం ఉపాద్యాయులు మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ఎన్నికల కమీషన్‌కు వివరించారు. ఇక అసలు విషయానికి వస్తే వంగా మహేందర్‌రెడ్డి ఉపాద్యాయ కొలువులో చేరినప్పటినుంచి పిఆర్‌టీయూ యూనియన్‌లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలు పెట్టారు. అప్పటికే తన అన్న రవీందర్‌రెడ్డి కూడా ఆయన కొలువు చేస్తున్న శాఖలో నాయకత్వం ఎలా చేస్తున్నాడో చూసిన మహేందర్‌ రెడ్డి కొలువులో చేరిన కొద్ది రోజులకే నాయకుడయ్యారు. చదవు చెప్పడం గాలికి వదిలేశాడు. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన మహేందర్‌ రెడ్డి యూనియన్‌ రాజకీయాలు మొదలు పెట్టారు. చదువు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు.

అలా అంచెలంచెలుగా యూనియన్‌లో ఎదుగుతూ వచ్చారు. 2004 తర్వాత తెలంగాణలో వచ్చిన రియల్‌ బూమ్‌ను ఆసరా చేసుకున్నాడు. అటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రియల్‌ వ్యాపారం మొదలు పెట్టారు. రియల్‌ వ్యాపారాన్ని కూడా టీచర్లతోనే మొదలు పెట్టి, వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అలా కొలువును గాలికి వదిలేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇదిలా వుంటే పేద ప్రజలకు చదువు చెప్పాల్సిన కొలువులో వుంటూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత విస్మరించారు. సిద్దిపేటలో కార్పోరేట్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కొలువు చేసే చోట విద్యా కుసుమాలను వికసింపచేయాల్సిందిపోయి, తన ప్రైవేటు స్కూల్‌లో చదువు పేరుతో దోపిడీ మొదలు పెట్టాడు. అటు రియల్‌ వ్యాపారం, ఇటు ప్రైవేటు కార్పోరేట్‌స్కూలు, మహేందర్‌రెడ్డికి మరో సోదరుడి పేరు మీద కొన్ని కళాశాలలో పార్టనర్‌ షిప్‌లో పూర్తిగా విద్యా వ్యాపారం మొదలు పెట్టారు. అన్న రెవిన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా వుండడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలున్నాయో గుర్తించడం, వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడం, అక్కడ రియల్‌ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అయితే తమ వ్యాపారాలపై ఎవరి కన్ను పడకుండా ఓ స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేశారు. ఈ సంస్ధనిర్వహణకు మరో వైపు పెద్దఎత్తున విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ నిర్వహణ కోసం అటు నిధులసేకరణను తోడు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం వేసుకున్నాడు. కొన్ని స్కూళ్లలో వాటర్‌ ప్లాంటులుఏర్పాటుచేసి విద్యా వ్యవస్ధకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తన ఉద్యోగానికి వాలెంటరీ రిటైర్‌ మెంటుతీసుకొని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు మొదలు పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా వంగ మహేందర్‌ రెడ్డి ఎలా ఉపాద్యాయ సంఘం నాయకుడుగా వుంటారు. ఎలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అర్హుడౌతాడు. కేవలం ఎన్నికల కోసం కొద్ది రోజుల ముందు రాజీనామా చేశారంటే అదీ కాదు. రెండు సంవత్సరాల క్రితమే రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ కొలువును అలాగా వదిలేస్తారా? అంటే అదీ వుండదు. అదృష్టం వుండి గెలిస్తే ఎమ్మెల్సీ అవుతారు. లేకుంటే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని మళ్లీ ఉపాద్యాయ కొలువులో చేరుతారు. ఇలాంటి జిత్తుల మారి రాజకీయాలు చాలా మంది చేస్తున్నారు. అందులో వంగా మహేందర్‌ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో ఎమ్మెల్సీ కావాలనుకునే కొంత మంది ఈ దారిని ఎంచుకున్నారు. అటు అన్న రెవిన్యూ అసోసియేషన్‌ ద్వారా తన పలుకుబడిని ఉయోగిస్తున్నాడు. రవీందర్‌ రెడ్డిపై కూడా పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించారనే అపవాదు వుండనేవుంది. సంపాదించిన ఆస్ధులను కాపాడుకోవాంటే తన తమ్ముడు ప్రజా ప్రతినిధి కావడం ఒక్కటే మార్గం అనుకున్నారు. ఇలా సులువైన మార్గంలో ఎమ్మెల్సీ కావడం రవీందర్‌రెడ్డికి దారి లేదు. తిమ్మిని బమ్మిని చేసి రికార్డులు మార్చి, ఆక్రమణదారులకు సహకరించి, సంపాదించిన సొమ్ముతో తమ్ముడితో రియల్‌ వ్యాపారం రవీందర్‌ రెడ్డి సంపాదించారు. అలా అన్నదమ్ములంతారూ అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలంటే టీచర్స్‌ ఎమ్మెల్సీ ఒక్కటే మార్గమని ఎంచుకున్నారు. ఇది టీచర్స్‌ యూనియన్‌లోని సభ్యులే చెబుతున్నమాట.

ఓ ఎమ్మెల్సీ మీడియా సమావేశంలో పూసగుచ్చినట్టు చెప్పిన ముచ్చట. ఒక నిబద్దత గలిగిన గురువు విద్యార్టులకు విద్యతోపాటు విద్యా వ్యవస్ధలో రావాల్సిన నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడతారు. ప్రభుత్వ విద్యా వ్యవస్ధ మేలు కోసం పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలు చేయడానికి సంఘాలకు కూడా చేతులు రావడం లేదు. టిక్కెట్లు అమ్ముకునే యూనియన్లు వుంటే మహేందర్‌ రెడ్డి లాంటి టీచర్లే ఎమ్మెల్సీ కావాలని కలలు గంటారు. ముఖ్యంగా ఈ దారి ఎంతో సులువైంది. తాను ఉపాద్యాయుడై రేపటి తరానికి దారి చూపుతాననుకునే ఏ ఉపాద్యాయుడు తన వృత్తికి ద్రోహం చేయడు. కాని ఉపాద్యాయ కొలువు పొంది, రాజకీయాలను లక్ష్యంగా చేసుకునే కొంతమంది ఇలా ప్రభుత్వాలను మోసం చేస్తుంటారు. పదవులు అడ్డం పెట్టుకొని కొలువులు చేయకుండా రాజకీయాలు చేస్తుంటారు. లేనిపోని హమీలు ఎంతో చైతన్యవంతులైన ఉపాద్యాయులకే చెబుతుంటారు. సాటి ఉపాద్యాయులను కూడా మోసం చేస్తుంటారు. పాత పెన్షన్‌ విధానం తీసుకురావడం అసలు సాధ్యమా? ప్రభుత్వాలతోనే సాధ్యం కాని ఆ విదానం టీచర్‌ ఎమ్మెల్సీలతో సాధ్యమౌతుందా? దేశ వ్యాప్తంగా అమలౌతున్న కొత్త విధానంలో మార్పు చేయడానికి కేంద్ర ఒప్పుకుంటుందా? అది అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? కేంద్రం అంగీకరించకుండా జరుగుతుందా? విద్య అనేది రాష్ట్ర స్ధాయిలో వుండే అంశం కాదు. ఉమ్మడి అంశం. కేంద్రం జోక్యం లేకుండా ఎలాంటి నిర్ణయాల అమలు సాధ్యంకాదు. కాని తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడై వుండి, యూనియన్‌ సభ్యులను మోసం చేసేవారిని ఎలా ఎన్నుకుంటారో కూడా టీచర్లే ఆలోచించుకోవాలి.

తెలంగాణ లో కాషాయ జెండా ఎగరేద్దాం

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ముసాపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తలకు సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ సమక్షంలో చేరిన మాజీ సర్పంచ్ BRS సీనియర్ లీడర్ భాస్కర్ సమక్షంలో దాదాపు 100 మంది కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ టీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.
తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మోసం చేసిందని మరోసారి బీఆర్ఎస్ కు ఓటేస్తే మోసపోతారన్నారు. రాష్ట్ర, కేంద్ర సర్కార్ ఉంటేనే అభివృద సాధ్యమన్నారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అన్నారు.
రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్ పుట్టినరోజున ఆలయంలో ప్రత్యేక పూజలు

నేటిధాత్రి మొగుళ్లపల్లి:
జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో. గ్రామ కమిటీ అధ్యక్షుడు కత్తిరాజు ఆధ్వర్యంలో. ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బలుగూరు తిరుపతిరావు పాల్గొనగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, జన్మదిన సందర్బంగా. రంగాపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కెసిఆర్ పేరున అర్చన అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని, మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి గా రావాలని ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది.వారి వెంట గ్రామ పార్టీ అధ్యక్షులు కత్తి రాజు మాజీ సర్పంచ్ సూరినినే రవీందర్ రావు, కత్తి రాజయ్య, నాయకులు లక్ష్మణ్ రావు, రాజేశ్వర్ రావు, సదయ్య, నరేష్, సునీల్, రమేష్, రవి, రాజు పాల్గొన్నారు.

బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజుల నుండి పండుగ వాతావరణం లో శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ సమేత సీతలాంబ(బొడ్రాయి),శ్రీ పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. , సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు డప్పుచప్పు ళ్లు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ సమేత సీతలాంబ(బొడ్రాయి) మరియు శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యా లతో ఉండాలని కోరుకున్నారు. కొప్పుల గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

వరంగల్ తూర్పులో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

పోచంమైదాన్ లో కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం, పులాభిషేకం, పండుగ వాతావరణంల కేసీఆర్ జన్మదిన వేడుకలు.

72వ జన్మదినం సందర్బంగా 72 కిలోల భారీ కేక్ కట్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నన్నపునేని నరేందర్.

కార్యకర్తలతో, ఫ్లెక్సీలతో, బిఆర్ఎస్ జెండాలతో గులాబీ మయమైన పోచమ్మమైదాన్ జంక్షన్.

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్బంగా సోమవారం వరంగల్ తూర్పు పొచమ్మమైదాన్ సెంటర్ లో, మాజీ మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి, ఆ కటౌట్ కు భారీ ఎత్తున పాలాభిషేకం, పులాభిషేకం నిర్వహించి ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ను ఏర్పాటు చేసి కార్యకర్తల నడుమునా వారితో కలిసి కేక్ కట్టింగ్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ పాటలతో పోచమ్మమైదాన్ జంక్షన్ లో పండుగా వాతావరణంలో ఈ వేడుకలను నిర్వహించుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షర్చనలో భాగంగా వరంగల్ తూర్పు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సీకేఎం కళాశాల మైదానంలో మొక్కను నాటి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతు ఈ రోజు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందిరికి ఒక పండుగ రోజు ఒక బీసీ బిడ్డను అయినా నన్ను కేసీఆర్ పేదింటి బిడ్డకూ మేయర్, ఎమ్మెల్యేను చేసి నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిన కేసీఆర్ కి నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను అని అన్నారు.

ఈ రోజు ప్రజలందరూ ఒక్కటే కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ సారే రావాలి మా జీవితాల్లో వెలుగులు నింపాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారు, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు ఈ జన్మదిన వేడుకలు మరింత ఘనంగా నిర్వహించుకుంటాం అని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో 34 వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ టి. రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

మరిపెడ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి

అక్రమ ఇసుక రవాణాకు నో ఛాన్స్

ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ ను ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ మరిపెడ సర్కిల్ మరియు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను స్టేషన్ లోపల 5S విధానాన్ని పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు, పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు,ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినంగా వ్యవహారించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్.ఐ సతీష్ గౌడ్,మరియు ఎస్.ఐ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.

బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ కేక్ కట్ చేసి, మిఠాయి పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మండల కేంద్రంలోని చిట్యాల సివిల్ దవఖానాలో రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ..కేసీఆర్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించారని తెలిపారు. ప్రాంత అభివృద్ధి, అన్నివర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబోవు రోజుల్లో కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు.
భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా, ఆయురోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తూరి రాజిరెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు మండల యూత్ అధ్యక్షులు టౌటం నవీన్ మహిళా అధ్యక్షురాలు ఈర్ల మల్లక్క శ్రీదేవి ఎరుకొండ రాజేందర్ మడికొండ రవీందర్ రావు కట్రేవుల కుమార్ సాద మల్లయ్య నాగరాజు పాండ్రాల విరాస్వామి చిలుముల రమణ చారి దుదిపాల తిరుపతి రెడ్డి పెరుమడ్ల రవీందర్ ఏరుకొండ రఘు వెంకట్ నాయక్ పల్లే శశిధర్ రెడ్డి దామర రాజు రాకేష్ భానోత్ శ్రీనివాస్ నాయక్ పోషాల రాజు నరేష్ మొగిలి కట్టేకొల్ల పెద్ద రాజు సాదా రాజు కుస ప్రశాంత్ కట్కూరి రాజేందర్ అశోక్ ప్రశాంత్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతుంది

– ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్

– బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనీ కె కన్వెన్షన్ హాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ,
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.ఈ ఎన్నిక 42 అసెంబ్లీ నియోజకవర్గలలో జరుగుతున్న ఎన్నికని అన్నారు.గ్రామాల్లో ఉన్న పట్టభద్రులకు 50 మందికి ఒకరిని ఇంచార్జి గా పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు పోవాలని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ వేస్తే మళ్ళీ ప్రజా ప్రభుత్వంలో డీఎస్సీ వేయడం జరిగిందని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల లో ఇచ్చిన ఉద్యోగాలను మనం పది నెలల్లో ఇవ్వడం జరిగిందని అన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో లేకుండా బీజేపీ తో ఒక లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు.
ఆనాడు రాష్టప్రతి ఎన్నికల్లో, నల్ల చట్టాల అమలు సమయంలో బిఆర్ఎస్ బీజేపీ కి మద్దతు ఇచ్చారని అన్నారు.
బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ అన్న విధంగా ఉందని అన్నారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు రావడం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ అన్నారు.
మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కష్టపడితే మీకు మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతాయని అన్నారు.
మండలాల వారిగా గ్రామాల వారిగా ప్రతి ఒక్కరు కష్టపడాలని అన్నారు.
బూతుకు ఒక ఇంచార్జి పెట్టీ ఎన్నికలో ముందుకు పోవాలని అన్నారు.
ఎన్నికల రోజు బూతు ఇంచార్జిలు ఇతర ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రులు వచ్చి ఓటు వేసేలా చూడాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ వివరించాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని అన్నారు.
బిఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీన పడ్డది కాబట్టి నేడు పోటీలో లేదని అన్నారు.
బల్మూరి వెంకట్ ప్రతిపక్షంలో అనేక ఆందోళనలు చేసి ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులపై అనేక అక్రమ కేసులను పెట్టారని అన్నారు.
నేడు ప్రజా ప్రభుత్వంలో టిఆర్ఎస్ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు.
ఆనాడు కేటీఆర్ సిరిసిల్ల కి వస్తె నేరేళ్లలో ముళ్ళ కంచెలు వేసేవారని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటు పడుతుందని అన్నారు.

అనుచిత ఉచితాలతో అనర్థాలు

ఈ ‘ఉచిత’ సంస్కృతి మానకపోతే రాష్ట్రాలు నిండా మునగడం ఖాయం

అయోగ్య ‘ఉచితాల’నుంచి ప్రభుత్వాలు బయటపడాలి

ఉచితాలు కావాలని ప్రజలు కోరడంలేదు

అలవాటు చేసి తలకు రోకలి చుట్టుకుంటున్న పార్టీలు

పరాన్న భక్కులను తయారుచేస్తున్న ఉచితాలు

అధికారం మత్తులో పట్టించుకోని పార్టీలు

పార్టీల నిర్వాకానికి అప్పుల ఊబిలో రాష్ట్రాలు

హైదరామాద్‌,నేటిధాత్రి:
ఎన్నికలముందు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ‘ఉచిత’ హామీలు ప్రజలను సోమరిపోతుల్లాగా, పరాన్నభుక్తులుగా మారేలా చేస్తున్నాయంటూ బుధవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం. ఈ అనుచిత ఉచితాలతో ప్రజలు ఇక పనిపై దృష్టిపెట్టరు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడం రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వంటిదే. ఈ ఉచితాల వల్ల మనుషులు పనిచేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఉచిత రేషన్లు, పనిచేయకుండానే డబ్బులు చేతిలో పడుతుండటంతో ఎవరు పనిచేయడానికి ఇష్టపడతారు? ఈవిధంగా దేశంలో ‘పరాన్నభుక్తుల’ వర్గాన్ని మనం చేజేతులారా తయారుచేస్తున్నామని కోర్టు వ్యా ఖ్యానించింది. నిజానికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను నిరుపేదల ఖాతాల్లోకి నేరుగా జమచేస్తున్నారు. అర్హులకు ఇది అందితే ఫర్వాలేదు. కానీ అనర్హుల ఖాతాల్లోకి కూడా ఇవి వెళితే వారిక పనిచేయడం మానేస్తారు. ఆవిధంగా పనిచేసే సామర్థ్యమున్నవారి విషయంలో ఇది ఎంత మాత్రం శ్రేయస్కర ఫలితాలనివ్వదు. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయపార్టీలకు ఆయా పథకాలు ఉపకరిస్తాయేమో కాని, ప్రభుత్వ ఆర్థికవ్యవస్థతో పాటు శ్రామిక మార్కెట్లు దారుణంగా దెబ్బతింటాయన్న సంగతిని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా రు.
అన్నీ ఉచితంగా లభిస్తున్నప్పుడు ఎవ్వరూ పనికెళ్లరు. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రతికూల ప్రభావం ఎక్కువ. ఉచితరేషన్‌ను చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా చాలా గ్రామాల్లో వ్యవసాయ సీజన్‌లో శ్రామికులు దొరకని పరిస్థితి! అన్నీ ఉచితంగా లభిస్తుంటేపనికెళ్లేవారెవరు? పొట్ట నింపుకోవడానికే పనికెళ్లడం! ఇంటివద్దే పొట్ట నిండుతుంటే పనినెవరు పట్టించుకుంటారు? సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల వాగ్దానాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈవిధంగా ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే రీతిలో హామీలివ్వడం, నగదు ప్రోత్సాహకాల పంపిణీ వంటివి ఎన్నికల చట్టాల పరిధి లో నేరంగా పరిగణించే విషయంలో సుప్రీంకోర్టు మరింత కఠినంగా వ్యవహరించాలి. ఈ నేప థ్యంలో, ఇటువంటి హామీలు ఎన్నికల చట్టాల ఉల్లంఘనకిందికి రాదని 2013లో తానిచ్చిన తీ ర్పును సరిదిద్దే అవకాశం వుంది. అయితే ఇటువంటి అంశాలపై న్యాయవ్యవస్థ కల్పించుకోవడంఎంతవరకు సమంజసం? వీటికి సంబంధించి తగిన ఆదేశాలు జారీచేయవచ్చా? లేక ఇటువంటి విధానాలను నియంత్రించేందుకు ఒక ప్రత్యేక ‘బాడీ’ని ఏర్పాటు చేయాలా? అనే అంశాలపై విచారణ 2022నుంచి సుప్రీకోర్టు వద్ద పెండిరగ్‌లో వుంది.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ నిత్యావసరాలను అందుబాటు ధరల్లో అందించేఉద్దేశంతో కొన్ని వస్తువులపై సబ్సిడీలు ప్రకటించడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు సబ్సిడీ స్థాయిని దాటి ఉచితాల దశకు చేరుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సబ్సిడీకి,ఉచితాలకు మధ్య ఉన్న విభజనరేఖను రాజకీయ పార్టీలు చెరిపేశాయనే చెప్పాలి. ఇందుకు కారణం రాజకీయపార్టీల మధ్య వుండే నిర్లక్ష్యపూరిత పోటీ!
ఈ ఉచితాల ప్రభావంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చే సింది. దీని ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తాము రాయితీ ఇవ్వాలనుకుంటున్న వాటిల్లో కొ న్నింటిని ఉచితంగా ప్రజలకు అందించడానికి ముందుకొస్తున్నాయి. అయితే ఈ ఉచితాలకు ఒక స్పష్టమైన నిర్వచనం లేదు. ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేవి అయితే అటువంటి సబ్సి డీలవల్ల ఇబ్బంది వుండదు. ఉదాహరణకు ప్రజాపంపిణీ వ్యవస్థ, ఉపాధి హామీ పథకాలు, విద్య, ఆరోగ్య అంశాలకు ప్రభుత్వ మద్దతు వంటివి సామాజిక ప్రయోజనానికి, ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. కానీ ఉచిత విద్యుత్‌, ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచిత రవాణా సదు పాయం, పెండిరగ్‌లో వున్న రుణాలను రద్దు చేయడం వంటివి ‘ఉచితాలు’గా చెప్పవచ్చు. ఇవి రుణాలు తీసుకునే సంస్కృతినే దారుణంగా దెబ్బతీస్తాయి. ఎట్లా అంటే ఒక వ్యక్తి తన స్థాయికి తగిన రుణాన్ని తీసుకొని తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తాడు. అదే ప్రభుత్వమే ఆ చెల్లింపు జరిపితే రుణాలు తీసుకోవడంలో ప్రజలు బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక క్రాస్‌`సబ్సిడైజేషన్‌ ( అంటే ఒక వర్గానికి ప్రయోజనం కలిగించేందుకు మరో వర్గంవారిపై ఎక్కువ ధరలు విధించడం) ప్రైవేటు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇక వర్తమాన ధరల ప్రకారం ఎటువంటి ప్రోత్సాహకాలు లేని పనివల్ల, శ్రామికుల భాగస్వామ్యం దారుణంగా పడిపోతుందని ఈ పరిశోధనా పత్రం వెల్లడిరచింది.
కొన్ని రకాల ఉచిత పథకాలు తక్కువ లీకేజ్‌లతో నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం కలిగించవచ్చు. అయితే ఇందుకు వెచ్చిస్తున్న పెద్దమొత్తం నిధులవల్ల కలుగుతున్న ప్రయోజనాలను కచ్చి తంగా అంచనా వేయాలి. లేకపోతే ఈ ఉచితాలవల్ల ధరల్లో వచ్చే వికృత మార్పులు, ప్రజల్లో పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాదు వనరుల దుర్వినియోగం కూడా సాధ్యం. ఉచిత విద్యుత్‌, ఉచిత నీటి సరఫరా వల్ల ఒకపక్క పర్యావరణం దెబ్బతింటే మరోపక్క విచ్చలవిడి నీటి వినియోగం వల్ల నీటితావులు ఎండిపోయే ప్రమాదముంది. ఉదాహరణకు గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేస్తామని ప్రకటించింది. ఇది అప్పట్లో పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినడమే కాదు, నెలవారీ జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితిలో అభివృద్ధి మాట ఎత్తడం సాధ్యమా? విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు పరచడానికి ఆసక్తి చూపాయి. ఈ నేపథ్యంలో ‘‘స్టేట్‌ ఫైనాన్సెస్‌: ఎ స్టడీ ఆఫ్‌ బడ్జెట్‌ 2023`24’ పేరిట రిజర్వ్‌ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో, ఈ పథకాన్ని అమలు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు ఆత్మహత్యా సదృశం వంటిదని పేర్కొంది. దీని అమ లు రాష్ట్రాల అభివృద్ధిని పరిమితం చేస్తుందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం అమల్లో వున్న జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) స్థానంలో గతంలో రద్దుచేసిన ఓల్డ్‌ పింఛను విధానాన్ని అమల్లోకి తెస్తే ఎన్‌పీఎస్‌ కింద చెల్లించే మొత్తం కంటే 4.5శాతం అధిక మొత్తాన్ని ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి వుంటుంది. 2060 నాటికి దేశ జీడీపీలో ఈ చెల్లింపులు వార్షికంగా 0.9%కు చేరుకుంటాయని కూడా పేర్కొంది. పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలు కూడా అలవిమాలిన ఉచితాలు ప్రకటించి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాయి.
కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ వంటి విపక్ష పార్టీలు విద్యుత్‌ సబ్సిడీపై హామీలు గుప్పిస్తున్నాయి. పరి శీలిస్తే వివిధ రాష్ట్రాలు కొన్ని యూనిట్ల వరకు విద్యుత్‌ సబ్సిడీని అమలు చేస్తున్నాయి. ఈ సబ్సిడీల చెల్లింపుకు తమ ఆదాయంలో 8 నుంచి 9శాతం వరకు ఖర్చుచేయాల్సి వస్తుండటంతో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు గురవుతోంది. ఇటువంటి అయోగ్య సబ్సిడీలు ఆయా రాష్ట్రాల పెట్టుబడి వ్యయాలకు పెద్ద అడ్డంకిగా మారాయని ఆర్‌.బి.ఐ. నివేదిక స్పష్టం చేసింది.
ఫాలే ఇండియా ఫౌండేషన్‌ విడుదల చేసిన నివేదిక కూడా ఉచిత విద్యుత్‌ వల్ల ఆర్థికంగా రాష్ట్రాలకు అనర్థదాయకమని స్పష్టం చేసింది. పంజాబ్‌ వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఈ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడమే ఉచితమని కూడా సూచించింది.
కేవలం అధికారమే పరమావధిగా, నిర్లక్ష్య పూరిత వైఖరితో పార్టీలు అనుసరిస్తున్న ఈ ఉచితాల సంస్కృతివల్ల ప్రధానంగా నష్టపోయేది పన్ను చెల్లింపుదార్లు. తామిచ్చిన ఉచితహామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కేవలం పన్నుల విధింపు ద్వారానే ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. అభివృద్ధికి పెద్దమొత్తంలో పెట్టుబడి వ్యయం అవసరం. కానీ వచ్చిన ఆదాయంలో సింహభాంగా ఈ ఉచితాలకే పోతుంటే, ఇక అభివృద్ధి మాటెక్కడ? పన్నుల పెంపుకూడా ఒక స్థాయి వరకే చేపట్టగలవు. ఆ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చే యక తప్పడంలేదు. ఒక్కసారి అప్పు తీసుకోవడం మొదలైతే ఆ ఊబినుంచి బయటపడటం ఎవ్వరి వల్లా కాదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయాయంటే ప్రధాన కారణం ఈ అనుచిత ఉచితాలే! నిర్లక్ష్య రాజకీయ పార్టీలు, ఆలోచన లేని ఓటర్లు ఈ ఉచితాల మాయలో పడి అభివృద్ధిని పట్టించుకోకపోవడం వర్తమాన విషాదం!

వెలుగులోకి సోమనాథ క్షేత్ర నిజ శివలింగ భగ్నావశేషం

సోమనాధ దేవాలయంలో ప్రతిష్టకు సన్నాహాలు

ప్రతిష్ట బాధ్యతలు స్వీకరించిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధినేత శ్రీశ్రీ రవిశంకర్‌

ప్రత్యేక అయస్కాంత లక్షణాన్ని కోల్పోని శివలింగం

అప్పట్లో భూమిపై రెండడుగుల ఎత్తులో శివలింగం వుండేది

శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘజనీ

కొన్ని అవశేళాలను భద్రపరచిన అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు

వెయ్యేళ్ల తర్వాత వెలుగులోకి

హైదరాబాద్‌,నేటిధాత్రి:
దాదాపు వెయ్యేళ్ల క్రితం ఇస్లామిక్‌ చొరబాటు దారుడు మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసిన పవిత్రసోమనాథ జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘజనీ ధ్వంసం చేసిన నిజ శివలింగ భగ్నశకలాలను ప్రస్తుత సోమనాథ దేవాలయంలో ప్రతిష్టించడం ద్వారా ఈ జ్యోతిర్లిం గాన్ని పునరుద్ధరించనున్నారు. స్వాతంత్య్రానంతరం ఈ దేవాలయాన్ని ఉపప్రధాని సర్దార్‌ వల్ల భాయ్‌పటేల్‌, ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ నేతృత్వంలో అరేబియా సముద్రతీరంలోనిర్మించారు. నాడు మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసినట్టు చెబుతున్న ఆలయ ప్రదేశానికి స మీపంలోనే ఈ నూతన సోమనాథ దేవాలయం వుంది. ఇదిలావుండగా అప్పట్లో ఘజనీ దండ యాత్ర సందర్భంగా, జ్యోతిర్లింగ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాదు, అక్కడి శివలింగాన్ని ముక్కలుగా పగులగొట్టి, అప్పటికీ కసి తీరక, అందులో ఒక ముక్కను నేటి ఆఫ్ఘనిస్తాన్‌లోని జామా మసీదుకు మెట్టుగా ఉపయోగించాడని చారిత్రక కథనం. అయితే ఆ భగ్న శివలింగానికి చెందిన కొన్ని భాగాలను అప్పటి అగ్నిహోత్రిక బ్రాహ్మణులు తమ ఇళ్లల్లో భద్రపరచినట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆవిధం గా భద్రపరచిన భగ్నావశేషాలను ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ నేతృత్వంలో సోమనాధ ఆలయంలో ప్రతిష్టించడానికి యత్నాలు జరుగుతున్నాయి.
మనదేశంలోని పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సోమనాథ క్షేత్రం ఒకటి. జ్యోతిర్లింగ స్తోత్రంలో మొట్టమొదట ప్రస్తావించేది కూడా ఈ సోమనాధ క్షేత్రాన్నే! వెయ్యేళ్ల క్రితం మనదేశంలో ఇ స్లామిక్‌ చొరబాటుదార్ల దాడులు విపరీతంగా జరిగాయి. ఈ దాడులకు ప్రధానంగా గురవడమే కాదు పూర్తిగా ధ్వంసమైన క్షేత్రం కూడా ఈ సోమనాథ క్షేత్రమే! ఆలయాల్లో బంగారం, ఇతర విలువైన ఆభరణాలు,రత్నాలు వుంటాయన్న సంగతి తెలుసుకున్న ఈ ఇస్లామిక్‌ చొరబాటుదార్లు ఆలయాలే లక్ష్యంగా దారుణ విధ్వంసానికి పాల్పడేవారు. అడ్డువచ్చిన హిందువులను దారుణంగా వధించి ఆలయాల్లో నిక్షిప్తమైన నిధులను దోచుకుపోయేవారు. ఇందులో భాగంగానే క్రీ.శ. 1024లో మహమ్మద్‌ ఘజనీ సోమనాథ క్షేత్రంపై భయంకరమైన దాడికి దిగాడు. అతని ముఖ్య లక్ష్యం ఆలయంలో నిక్షిప్తమైన అపారమైన ధనరాశులను కొల్లగొట్టుకుపోవడమే! అతని దాడినుంచి ఆలయాన్ని రక్షించడానికి హిందువులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. కానీ ఘజనీ నిర్ద యగా 50వేల మంది హిందువులను ఊచకోతకోసి మరీ ఆలయాన్ని లూటీ చేశాడు. అప్పట్లో శివలింగం కింద కూడా నిధులు దాచిపెడతారన్న ప్రచారం వుండేది. ఇందుకోసం అతను శివలింగాన్ని ముక్కలుగా పగులగొట్టాడు. ఆ ముక్కల్లో కొన్నింటిని నేటి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘజ్నావీలో ని ర్మించిన జామా మసీదుకు మెట్లుగా ఉపయోగించినట్లు చెబుతారు. మధ్యయుగాల చరిత్రలో ముస్లిం రాజులు జరిపిన విధ్వంసానికి విషాదపు గుర్తుగా మిగిలిన వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది సోమనాథ క్షేత్రమే!
ఘజనీ దండయాత్ర సమయంలో ఇక్కడి పాలకుడు మొదటి చాళుక్య భీముడు. ఘజనీని ఎదిరించలేక పారిపోయి కంఠ్‌కోటలో ఆశ్రయం పొందుతాడు. మహమ్మద్‌ ఘజనీ ప్రధాన లక్ష్యం లూటీ మాత్రమే! రాజ్యస్థాపన కాదు! దీంతో అతగాడు వెళ్లిపోయిన తర్వాత చాళుక్య భీముడు తిరిగి వచ్చి రాజ్య పాలన చేపట్టినప్పటికీ, ధ్వంసమైన ఆలయాన్ని పునర్‌నిర్మించలేకపోతాడు. ఫలితంగాచాలాకాలం వరకు సోమనాథ ఆలయం శిథిలావస్థలోనే కొనసాగింది. తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టిన చాళుక్య రాజు కుమారపాల ఆలయ పునర్‌నిర్మాణానికి ఉపక్రమిస్తాడు. ఆయన ఆల యాన్ని అద్భుతమైన రీతిలో రత్నాలు తాపడం చేసిన రాతితో నిర్మించినట్టు క్రీ.శ.1169 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసిన తర్వాత ఆలయం దాదాపు వందేళ్ల పాటు శిథిలావస్థలోనే కొనసాగిందనేది ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. కుమారపాలుడు అంత కష్టపడి ఆలయం నిర్మించినప్పటికీ, తర్వాతి కాలంలో దీనిపై దాడులు ఆగలేదు. క్రీ.శ. 1299లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, క్రీ.శ.1395లో ముజాఫర్‌ షా, క్రీ.శ.1665లో ఔరంగజేబ్‌లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు.
విచిత్రమేమంటే దాడికి గురైన ప్రతిసారి ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో సోమనాథ ఆలయా న్ని పునర్‌నిర్మిస్తూ రావడం విశేషం. అయితే ఘజనీ దండయాత్ర తర్వాత ఆలయాన్ని ఘనమైన రీతిలో పునరుద్ధరించిన ఘనత కుమారపాలుడికే దక్కుతుంది. ఇన్ని విధ్వంసాలకు గురైనా శతాబ్దాల ఆధ్యాత్మిక, సాంస్కృతికకు ప్రతీకగా నిలిచిన ఈ దివ్యక్షేత్రం తన గుర్తింపును ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వస్తోంది. అయితే ఇంతటి చరిత్రలో చాలామందికి తెలియని విషయం ఒకటుంది. నాడు ఘజనీ ధ్వంసం చేసిన సోమనాథ శివలింగ భగ్నశకలాల్లో చాలా వాటిని అప్పటి హిందూ పండితులు రహస్యంగా తీసుకెళ్లి తమ ఇళ్లలో వుంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తూ వస్తున్నారు. ఈ రహస్యం దాదాపు వెయ్యేళ్లుగా ఎవ్వరికీ తెలియకుండా, ఆయా కుంటుంబాల వారు, తమ కింది తరాలవారికి ఈ శివలింగ శకలాలను అప్పగిస్తూ వచ్చారు. దాదాపు వెయ్యేళ్ల తర్వాత ఆ పవిత్ర శకలాలు వెలుగులోకి రావడం విశేషం.
ఇన్ని సంవత్సరాలుగా ఈ పవిత్ర శివలింగ భగ్న శకలాలను భద్రపరుస్తూ వచ్చింది, అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు. ఈ శకలాలను భక్తిప్రపత్తులతో ఇన్ని తరాలుగా పూజిస్తూ వస్తున్నారు. ఆవి ధంగా ఈ భగ్నశకలాలను భద్రపరచిన వారిలో సీతారామ శాస్త్రి ఒకరు. ఆయన అగ్నిహోత్రీ య బ్రాహ్మణ పండితుడు. ఇటీవల ఆయన ఈ భగ్నావశేషాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవి శంకర్‌కు అప్పగించారు. గత 21 ఏళ్లుగా ఈ అవశేషాలు శాస్త్రి సంరక్షణలో కొనసాగుతున్నాయి. ఇవి తన మామగారి వద్దనుంచి ఈయనకు అందాయి. ఆయన దాదాపు 60ఏళ్ల పాటు వీటికి భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు. ప్రవీంద్ర సరస్వతిజీ అనే గురువు ఆయనకు ఈభగ్నశకలాలను అప్పగించారు.
నిజానికి 1924లో అప్పటి కంచికోటి పీఠాధిపతి పరమాచార్య వద్దకు ఈ భగ్నశకలాలను తీసుకెళ్లిన అగ్నిహోత్రి పండిత కుటుంబీకులు, వీటిని ఏం చేయాలంటూ ఆయన్ను ప్రార్థించారు. అ ప్పుడు ఆయన ఈ భగ్నశకలాల పవిత్రతను గుర్తించి, మరో వెయ్యి సంవత్సరాల వరకు వీటిని భద్రపరచండి. అప్పుడు సోమనాథ దేవాలయంలో వీటి ప్రతిష్ట జరుగుతుందని సెలవివ్వడంతో ఆ పండిత కుటుంబం వాటిని తమ ఇంటిలో భద్రంగా వుంచి పూజాదికాలు నిర్వహిస్తూ వచ్చా రు. తర్వాత సీతారామ శాస్త్రి మళ్లీ ఈ భగ్నశకలాలను కంచికోటి పరమాచార్య జగద్గురు శ్రీ జయేంద్రసరస్వతిశంకరాచార్య స్వాముల వారికి చూపించి పరిష్కారం కోరగా, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాతనే వీటి ప్రతిష్ట జరుగుతుందని సెలవిచ్చారు. ఇది జరగక ముందే పరమాచార్య శివైక్యం చెందారు. దీంతో సీతారామశాస్త్రి వీటి భవితవ్యంపై మళ్లీ అయోమయంలో పడ్డారు. తర్వాత ప్రస్తుత శంకరాచార్య సలహామేరకు ఆయన శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిసి పరిస్థితి వివరించడంతో, వీటిని సోమనాథ దేవా లయంలో ప్రతిష్టించడానికి హామీ ఇచ్చారు. దీంతో అమితానందం పొందిన శాస్త్రి, ‘నిజంగా నా జీవితం ధన్యమైంది. ఎట్టకేలకు ఈ భగ్నావశేషాలను సోమనాథ దేవాలయంలో ప్రతిష్టించాలన్న పెద్దల ఆకాంక్ష నెరవేరింది’ అన్నారు.
ఇప్పుడు సోమనాథ దివ్యక్షేత్రానికి చెందిన శివలింగ భగ్నావశేషాలను సోమనాథ దేవాలయంలో పున్ణప్రతిష్టించే బాధ్యతను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధినేత శ్రీశ్రీ రవిశంకర్‌ స్వీకరించారు. వీటి ప్రశ స్త్యాన్ని వివరిస్తూ, ఇవి ఇప్పటికీ తమ అయస్కాంత శక్తిని ప్రదర్శిస్తూనే వున్నాయని, వీటి పవిత్రత లేశమాత్రం కూడా నష్టం కాలేదన్నారు. నిజానికి ఇది భారత చరిత్రలోని ఒక భాగాన్ని పున రుద్ధచించడం కాదు. భారతీయ ఆధ్యాత్మిక, నాగరికతలోని చైతన్య పునరుద్ధరణగా భావించాలి.
పురాతన గ్రంథాల ప్రకారం నిజమైన సోమనాథ శివలింగం మూడడుగుల ఎత్తుండేది. భూమిపై రెండడుగులు పైకిలేచి గాల్లో తేలియాడుతుండేది. అంటే భూమ్యాకర్షణ శక్తి దీనిపై పనిచేసేది కాదు. అప్పట్లో సోమనాథ దేవాలయం సంపదకు ప్రసిద్ధి. బంగారం, రత్నాల తాపడాలతో నిర్మి తమై ఆధ్యాత్మిక శోభను వెదజల్లేది. 1024లో ఘజనీ కేవలం దేవాలయంపై దాడికి మాత్రమే పాల్పడలేదు. హిందువుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును ధ్వంసం చేయడానికి యత్నించా డు. ఈ దాడిలో గాల్లో తేలియాడే శివలింగాన్ని ముక్కలు చేయడమే కాదు, వేలాదిమంది హిందవులను ఊచకోత కోసి, ఆలయంలోని అపార సంపదను దోచుకెళ్లాడు.
ఎన్నిసార్లు పునరుద్ధరించినా వరుస దాడులకు గురవుతూ రావడం ఈ ఆలయ చరిత్ర! చివరకు 19వ శతాబ్దం వరకు ఇది శిథిలావస్థలోనే కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లోనాటి ఉపప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో నేటి కొత్త దేవాలయం రూపుదిద్దుకుంది.

ప్రజల ‘మూడ్‌’ ఎన్డీఏ కూటమి వైపే

స్వీయ తప్పిదాలతో మరింత దిగజారుతున్న కాంగ్రెస్‌ పలుకుబడి

ఏడాదిలో పుంజుకున్న బీజేపీ

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మెజారిటీ ఖాయం

ఎన్డీఏ కూటమి సీట్లు 353కు పెరిగే అవకాశం

ఇండీ కూటమి 188కే పరిమితవవచ్చన్న సర్వే

99 నుంచి 78కి పడిపోనున్న కాంగ్రెస్‌ బలం

తమిళనాడులో బీజేపీ ఇంకా ఖాతా తెరవలేకపోవచ్చు

డీఎంకేదే హవా

ఒరిస్సాలో నవీన్‌ పట్నాయక్‌కే ప్రజల మద్దతు

ఉత్తరప్రదేశ్‌లో పుంజుకోనున్న ఎన్డీఏ

బిహార్‌లో కూటమిదే అధికారం

తేల్చిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎన్నికల్లో ప్రజల మూడ్‌ ఏవిధంగా వుంటుందనేది ఆ సమయానికి చోటుచేసుకున్న పరిణామాలు, స్థానిక, జాతీయ సమస్యలపై ఆధారపడివుంటుంది. అది కూడా ఒక్కో రాష్ట్రంలోని పరిస్థితులు కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల దేశం మొత్తంమీద ప్రజల్లో ఒకేరకమైన మూడ్‌ వుంటుందని చెప్పడానికి వీల్లేదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవి స్థానిక సమస్యలు, భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకునే వ్యూహాల ను అనుసరిస్తాయి. జాతీయ ఎన్నికల్లో తామే కింగ్‌మేకర్‌గా వుండి, కేంద్రంలో అధికారంలో ఉ న్న ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో వుంచుకోవాలన్న దృక్పథం కూడా వాటికి వుంటుంది. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలకు దారితీసి కేంద్ర ప్రభుత్వం బలహీనంగా మారిన సంవత్సరాలు కూడా మనం చూశాం. దేశ స్వాతంత్య్రం వచ్చినదగ్గరినుంచి ఛరిష్మా వున్న నాయకులపై ఆధారపడి రాజకీయ పార్టీల మనుగడ సాగిందనేది సుస్పష్టం. నెహ్రూ, ఇందిరాగాంధీలు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్‌ను అధికారంలో నిలిపారు. వారి తర్వాత కేంద్రంలో అంతటి ఛరిష్మా వున్న నాయకులులేకపోవడంతో ఇతర పార్టీల మద్దతో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కానీ కలగూరగంప లాంటి పార్టీల సహకారం నేపథ్యంలో మన విదేశాంగ విధానం, రక్షణ, ఆర్థిక తదితర కీలక అంశాల పై ఆయా ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసుకోలేకపోయేవి. ఒకరకంగా చెప్పాలంటే సంకీర్ణ శకం మనదేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక 2014 నుంచి నరేంద్రమోదీ దేశ ప్రధాని అయ్యాక, ఆయన తన ఛరిష్మాతో మాత్రమే కాదు, పటిష్టమైన విదేశాంగ, ఆర్థిక, రక్షణ విధానాలతో దేశాన్ని అంతర్జాతీయ యువనికపై ఒక కీలకస్థానంలో నిలిపారనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. విచిత్రమేమంటే గత పదేళ్లుగా అధికారంలో వున్నప్పటికీ ఆయన ఛరి ష్మా ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. భిన్న ధృవాలైన రష్యా`అమెరికాలను సమతుల్య రీతిలో ని ర్వహించగల సామర్థ్యం ఆయన నేతృత్వంలోని టీమ్‌కే సాధ్యమైంది. నేడు సమస్యా పరిష్కారకర్త దేశంగా అంతర్జాతీయంగా భారత్‌ తన పేరు ప్రఖ్యాతులను సుస్థిరం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోకపోయినా, కూటమి పరంగా మెజారిటీ సాధించి అధికారంలో వున్న ఎన్డీఏపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇంఇయాటుడే`సీఓటర్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు ఒకింత ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే రీతిలో వుండటం విశేషం. 

సర్వసాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఐదేళ్ల పాలనాకాలం తర్వాత ప్రజల్లో ప్రభుత్వవ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. కేంద్రంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం 293. ఇందులో భారతీయ జనతాపార్టీవి 240 స్థానాలు. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 38.5% ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అప్పటివరకు అంటే 2004`2014 వరకు పాలించిన యు.పి.ఎ. కూటమి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మొట్టమొదటి సారి ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో 45.43% ఓట్లతో 353 స్థానాల్లో గెలిచిన ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. రెండోసారి నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ప్రచారం సాగించినప్పటికీ కూటమి 293 స్థానాలకే పరిమితం కా వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలం ఎన్డీఏ కూటమి పాలనపై ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో మారితే ఎన్ని స్థానాలు గెలుచుకోగలదన్న అంశంపై ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో ఇండియా టుడే`సీ ఓటర్‌ నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే సంతృప్తికరమైన పనితీరు ప్రదర్శించని ఎన్డీఏ ఇప్పటికిప్పు డు ఎన్నికలు జరిగితే 353 స్థానాల్లో తిరుగులేని విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇందులో బీజేపీ సొంతంగా 280కి పైగా స్థానాలను కైవసం చేసుకొని సాధారణ మెజారిటీ సాధి స్తుందని కూడా పేర్కొంది. ఇక లోక్‌సభలో 243గా ఉన్న ఇండీ కూటమి బలం ఏకంగా 188కి పడిపోతుందని కూడా స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9వరకు దేశం లోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.

ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 39 రాజకీయ పార్టీలు భాగస్వాములుగా వుండగా వీటిల్లో బీజేపీ, నేషనలిస్ట్‌ పీపుల్స్‌ పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా ఎన్నికల కమిషన్‌ చేత గుర్తింపు పొందా యి. మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలే. ఎన్నికలు జరిగితే భారతీయ జనతాపార్టీ 281 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అంటే ప్రస్తుతం వున్న 240 స్థానాలతో పోలిస్తే మరో 41స్థానాలను కైవసం చేసుకోగలుగుతుంది. ఏడాది కాలంలో బీజేపీ తిరిగి పుంజుకుందన్నది స్పష్టమవుతోంది. ఇక కాంగ్రెస్‌ ప్రస్తుత బలం 99 నుంచి 78కి పడిపోతుంది. వ్యక్తిగతంగా భాజపా ఓట్ల శాతం గతంతో పోలిస్తే మూడు శాతం పెరిగి 41%కు పెరుగుతుంది. ఇక కాంగ్రెస్‌ ఓట్ల షేరు 20శాతానికి పడిపోవడం గమనార్హం.

మొత్తంమీద పరిశీలిస్తే పదేళ్లకాలం పరిపాలించినా నరేంద్రమోదీ ఛరిష్మా చెక్కుచెదరలేదన్నదని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్‌ తన తిరోగమన విధానాలను ఇప్పటికైనా సరిదిద్దుకోపోతే పతన తప్ప ఉత్థానం వుండదని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తాను ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను పున్ణసమీక్షించుకోవాలి. మితిమీరిన మైనారిటీ బుజ్జగిం పు, మెజారిటీ వర్గాలను నిర్లక్ష్యం చేయడం, అధికారంకోసం అలవికాని హామీలివ్వడం, ప్రతి అంశాన్ని ప్రతికూల ధోరణితో ఆలోచించడం వంటి పద్ధతులను మార్చుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌ మనుగడ కష్టం. ఇప్పటికే కీలక నాయకులను కోల్పోయి, కేవలం గాంధీ కుటుంబంపై ఆధారపడి రాజకీయాల్లో కొనసాగే స్వయం ప్రకాశం లేని నాయకులే పార్టీలో అధికం. ఇదే పార్టీని దారుణంగా దెబ్బతీస్తోంది. గత ఎన్నికల్లో నరేంద్రమోదీ ‘400 సీట్లు’ నినాదాన్ని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలచుకుంది. ముఖ్యంగా అన్ని సీట్లు ఎన్డీఏకి వస్తే, రాజ్యాంగాన్ని మార్చేస్తా రని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని తప్పుడు ప్రచారాలను విపరీతంగా చేపట్టడం ప్రజల్లో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో అనుమానాలు పెరిగి, భాజపాను 240 వద్దే నిలిపేశారు. విచిత్రంగా ఆరునెలలు తిరగకుండానే మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో విజయం సాధించి పడిలేచిన బంతిలాభాజపా తన సత్తా ఏంటో చూపింది.

తమిళనాడులో మళ్లీ డీఎంకోకాంగ్రెస్‌ కూటమి 39 స్థానాలను స్వీప్‌ చేస్తుందని సర్వే స్పష్టం చేసింది. కాకపోతే బీజేపీ ఓట్ల శాతం పెరిగినా, అవి సీట్లను గెలిపించే స్థాయిలో వుండవని పే ర్కొంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే డీఎంకే కూటమి 52% ఓట్ల షేరు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే ఇది ఐదుశాతం ఎక్కువ. గత ఎన్నికల్లో తమిళనాడులో 18% ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 21% వరకు పొందగలుతుగుందని సర్వే పేర్కొంది. ఇక ఏ.ఐ.డి.ఎం.కె గతంలో 20% ఓట్లు పొందగా 3శాతం పెరిగి 23%కు చేరుతుంది.

ఇక ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో భాజపా 43`45 స్థానాల్లో గెలిచే అవకాశ మున్నదని సర్వే పేర్కొంది. బీజేపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే 4% పెరగుతుందని, ఇండీ బ్లాక్‌ఓట్లు 2% తగ్గుతాయని సర్వే తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండీ కూటమికి 43 సీట్లు వచ్చాయి. వీటిల్లో 37 సమాజ్‌వాదీ పార్టీవి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇండీ కూటమి సీట్లు 34`36 వరకు మాత్రమే పరిమితమవుతాయి. భాజపా కేవలం 33 సీట్లలోనే విజయం సాధించింది. అయితే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు రాష్ట్రం నుంచి 36 స్థానాలున్నాయి. ఇక బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 33`35 స్థానాల్లో విజయం సాధిస్తే, ‘మహాఘట్‌బంధన్‌’ కూటమికి 5`7 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీఏకు 47% ఓట్లు రాగా ఇప్పుడు అవి 52%కు పెరగనున్నాయి. బిహార్‌ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్డీఏ కూటమిలో చీలిక లేకుండా, ఉమ్మడిగా పోటీచేస్తే ప్రభుత్వానికి ఢోకాలేదని ఈ సర్వే తెలియజేస్తోంది. ఎందుకంటే ఢల్లీిలో మాదిరిగా బిహార్‌లో ఓట్ల చీలిక సాధ్యం కాదు. బీజేపీ, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీల కూటమి బలంగా వుంటే వీరిని ఓడిరచడం సాధ్యంకాదు. విచిత్రమేమంటే గత ఏడెనిమిది సంవత్సరాలుగా నితిష్‌కుమార్‌ హవా రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతూ వచ్చింది. ఈసారి ఆయన గతంలో మాదిరిగా ఓటర్లను ఆకట్లుకోలేక పోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు భిన్నంగా బీజేపీ ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకొని మరింత బలంగా రూపొంది అధికారంపై పట్టు సాధించవచ్చుననేది స్థానిక విశ్లేషకుల అంచనా. ఒరిస్సా విషయానికి వస్తే ఈ సర్వేలో 52% మంది ఓటర్లు నవీన్‌ పట్నా యక్‌ను తిరుగులేని నే తగా పేర్కొన్నారు. 

మొత్తంమీద జాతీయ స్థాయిలో సర్వే ఫలితాలను పరిశీలిస్తే ఎన్డీఏ కూటమి మరింత బలపడే అవకాశాలే మెండుగా వున్నట్టు తోస్తున్నది. ప్రజలు ఊరికే పట్టం కట్టరు…పనితీరుకే ప్రాధాన్యమి స్తారన్న సంగతిని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

పవన్‌లో ఇజం లేదు!నిజం అసలే కాదు!!

`పదవీ కాంక్ష తప్ప పరోపకారం లేదు!

 `జనంలో లేని సేనకు సేనాని!?

 `తనకు తానే అప్రకటిత జ్ఞాని?

`యంత్రాంగం లేని పార్టీని డుపుకుంటున్నాడు.

`టిడిపి నీడలో గెలిచి నేనే గొప్ప అనుకుంటున్నాడు.

`తెలుగు తమ్ముళ్ల దయతో గెలిచి నా వల్లే కూటమికి బలిమనుకుంటున్నాడు!

`పక్కదారి పడుతున్న పవన్‌ అత్యాశ!

`పవన్‌ గెలుపే టిడిపి పుణ్యం!

`పవన్‌ పేరాశ పదవికి చేటు

`జనసేనకు జనంలో ఆదరణ లేదు

`పవన్‌ కళ్యాణ్‌ను జనం నాయకుడుగా ఇంకా గుర్తించలేదు

`తెలుగు దేశం బలంతో జనసేన గెలిచింది

`ఎన్నికల నాటికి జనసేనకు అభ్యర్థులే లేరు

`జగన్‌ వద్దనుకున్న ఎమ్మెల్యేలను అద్దెకు తెచ్చుకున్నారు

`పార్టీకి పని చేసిన వారికి పక్కకు పెట్టి టిక్కెట్లిచ్చాడు

`2019 నుంచి పవన్‌ చేసిన పోరాటం లేదు

`అసలు జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు

`లోకేష్‌ పాదయాత్ర కూటమి గెలుపుకు కారణమైంది

`చంద్రబాబు మీద నమ్మకంతో జనం ఓట్లేసి గెలిపించింది

`పొత్తు ధర్మంలో చంద్రబాబు స్నేహానికి విలువిచ్చారు

`దానిని పవన్‌ విచ్చిన్నం చేసుకోవాలని చూస్తున్నారు

`ఇప్పటికీ అన్న నాగబాబు రాజకీయ భవిష్యత్తు కోసం పవన్‌ ఆరాటపడుతున్నాడు

`పెద్దన్న చిరంజీవికి పెద్ద పోస్ట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నడు

`జనసేన నాయకుల కోసం పవన్‌ ఆలోచించడం లేదు

`కూటమి గెలుపులో కీలక భూమిక తెలుగు తమ్ముళ్లు

`ఐదేళ్లలో కేసులు ఎదుర్కొన్నది తమ్ముళ్లు

`వైసిపి మీద అలుపెరుగని పోరాటం చేసింది తమ్ముళ్లు

`నిర్భంధాలను ఎదుర్కొని నిలబడిరది తమ్ముళ్లు

`సుదీర్ఘమైన పాదయాత్ర చేసింది లోకేష్‌

`ఇక్కడ పవన్‌ పాత్రేముంది?

`పవన్‌ బలం ఎక్కడ పనికొచ్చింది

`పంట చేతికొచ్చాక కుప్ప మీద కూర్చున్నది పవన్‌

`కూటమిలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నది పవన్‌

`చెరపకురా చెడేవు అన్న సామెత మర్చిపోయినట్లున్నాడు

`స్వయంకృతాపరాధంతో మొత్తం చెడగొట్టుకుంటున్నాడు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలుపుకు కారణం ఎవరు? ఇది ఇప్పుడు ఏపిలో జరుగుతున్న చర్చ. నిజంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మూలంగానే కూటమికి అంత మెజార్టీ వచ్చిందా? లేక తెలుగుదేశం బలం వల్లనే జనసేనకు ఉనికి ఏర్పడిరదా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మూలంగానే జనసేనకు ఊపిరి పోసినట్లైందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే జనసేనాని పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల్లో గెలిచింది లేదు. గత ఎనికల్లో రెండు చోట్ల పోటీచేసినా ఒక్క సీటులో కూడా కనీసం ప్రభావం చూపలేదు. అలాంటి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వల్ల తెలుగుదేశానికి ఊపు వచ్చిందనేదానిలో అర్దమే లేదు. ఎందుకంటే వైసిపి ప్రభుత్వ హయాంలో జనసేన చేసిందేమీ లేదు. తన ఉనికి కోసం పడిన ఆరాటం లేదు. వైసిపి మీద చేసిన జనసేనాని ప్రత్యక్షంగా చేసిన పోరాటమేమీ లేదు. ఏనాడు ఏ ఒక్క సమాజం కోసం ఉద్యమం చేసింది లేదు. అసలు ప్రజల్లో వున్నదే సరిగ్గా లేదు. అప్పుడప్పుడు సీజనల్‌ నాయకుడిగా వచ్చిపోవడం తప్ప ఆయన నిబద్దతలో రాజకీయాలు చేయలేదు. అటు సినిమాలు చేసుకుంటూ, ఆ గ్యాప్‌లో రాజకీయాలు చేస్తూ వచ్చారు. కాని ఎన్నికలకు ఆరు నెలల ముందు వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం, ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ కలిసి రావడంతో జనసేన దశ తిరిగింది. తెలుగుదేశం నీడలో ఆ పార్టీకి వెలుగు సంతరించుకున్నది. ఎంతో గొప్ప మనసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హుందాగా పవన్‌ కల్యాణ్‌ సహాకారాన్ని కొనియాడారు. ప్రభుత్వ ఓటు చీలిపోకుండా వుండేందుకు, కూటమి అద్భుతమైన విజయం సాదించేందుకు పవన్‌ కృషి గొప్పదని అనేక సార్లు చెప్పారు. నిజానికి ఆ సమయంలో పొత్తు లేకపోకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. ఇది ముమ్మాటికీ నిజం. కాని జగన్‌ రాజకీయాన్ని తుడిచిపెట్టాలంటే జనసేన కూడా కలిసి వస్తే అద్భుతమైన విజయాన్ని చూడొచ్చని తన రాజకీయ చాణక్యంతో చంద్రబాబు ముందుకు సాగారు. అది జనసేనకు బాగా కలిసి వచ్చింది. అసలు ఉనికిలో లేని జనసేనకు జవసత్వాలు వచ్చేలా చేసింది. ఎన్నికల మందుకు పవన్‌ కల్యాణ్‌కు కూడా తన బలమెంతో తెలియదు. అంతే కాదు తాను గెలుస్తానో లేదో..అని చెప్పిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి. అలాంటి పవన్‌ కళ్యాణ్‌కు ఆ పొత్తు పొడిచినప్పుడే అడిగిన 50 సీట్లకు తగ్గేవారు కాదు. కాని ఆయనకు పది సీట్లు ఇస్తే ఎక్కువ అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయకుడు ఎంతో ఉదారతతో 21 సీట్లు ఇచ్చారు. అయినా పవన్‌ కల్యాణ్‌ ఎంత మంది జనసేన నాయకులకు టిక్కెట్లు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో తన అన్న నాగబాబుకు కూడా టికెట్‌ ఇచ్చిన పవన్‌ ఈ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు. ఎందుకంటే తన గెలుపు మీదనే ఆయనకు నమ్మకం లేదు. దాంతో నాగబాబును రంగంలోకి దింపలేదు. లేకుంటే తప్పకుండా అన్నకు టికెట్‌ ఇచ్చేవారు. గత ప్రభుత్వం వైసిపి మీద నిరంతరం పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు, లోకష్‌, తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు నాయుడు నుంచి, తమ్ముళ్లదాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు ఏకంగా జైలు పాలయ్యారు. లోకేష్‌ సుధీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలను చైతన్యం చేశారు. ఇలా ఐదేళ్ల పాటు నిరంతరం వైసిపికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాని వైసిసికి వ్యతిరేకంగా పోరాటం చేసిన జనసైనికులు ఎవరైనా వున్నారా? అసలు ఇప్పటి వరకు ఆ పార్టీకి యంత్రాంగమే లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు 21 టికెట్లు ప్రకటిస్తే కూడా అందులో జనసేన నుంచి పోటీ చేసేందుకు అభ్యర్దులే దొరకలేదు. జగన్‌ టికెట్లు ఇవ్వకుండా వదిలేసిన నాయకులను జనసేనలోకి తీసుకొని పవన్‌ టిక్కెట్లు ఇచ్చారు. వైసిపి పనికి రారని వదిలేసిన వారికి పవన్‌ టిక్కెట్లు ఇచ్చారు. అది కూడా ఆ నాయకులు పవన్‌ను చూసి రాలేదు. కూటమిని చూసి వచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వచ్చారు. ఈ విషయం పవన్‌కు ఇప్పటికీ అర్ధం కాకుండా వుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వత మిత్రులు వుండరు. 2019లో ఆయన తెలుగుదేశానికి దూరంగా వున్నారు. తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. జగన్‌ మీద కలిసి పోరాటం చేశారు. ఇది కూడా పవన్‌ కల్యాన్‌ వ్యూహంలో భాగమే. ఒకరికొకరు అన్నట్లు ఉభయ కుశలోపరిగా సహకరించకుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకున్నారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇంత వరకు బాగానేవుంది. కాని ఎప్పటికైనా తెలుగుదేశం పొత్తుతో ఈ ఐదేళ్ల కాలంలో ఏదైనా జరగొచ్చని పవన్‌కు తెలియంది కాదు. మంత్రి లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రతిపాదనలు వస్తాయని పవన్‌కు తెలియక కాదు. పవన్‌కు అన్నీ తెలుసు. తెలిసే పొత్తుకు అంగీకరించారు. ముందు ఏరు దాటాలి. అప్పుడు కదా? ఏ నిర్ణయం తీసుకునేది అనుకున్నారు. అనుకున్నట్లుగా ఆది నుంచి వ్యవహరిస్తూనే వస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ మీద చేసిన వ్యాఖ్యలైనా, ఇతర చర్యలైనా ఆయన కావాలనే చేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తనపై రాకుండా చూసుకుంటూ జాగ్రత్తపడుతున్నారు. అయితే లోకేష్‌కు ప్రాధాన్యత ఇంత తొందరగా ఇచ్చే రాజకీయం మొదలౌతుందని పవన్‌ కూడా ఊహించలేదు. దాంతో తన ప్లాన్‌కు పవన్‌ మరింత పదును పెట్టారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా దూరం దూరంగా వుంటున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అయితే ఈ మధ్య ఆయనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. తర్వాత తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు వార్తలువచ్చాయి. కాని మరునాడే దక్షిణభారత దేశ సనాతన ధర్మ యాత్ర మొదలు పెట్టారు. దేవాలయాల సందరర్శను వెళ్లిపోయారు. ఇది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడాలనుకున్నా సాధ్యం కాలేదు. అంటే దూరం పెంచుకోవాలని పవన్‌ అనుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నట్లే లెక్క. దీని వెనకాల బిజేపి వుందన్న వాదనలు కూడా వున్నాయి. బిజేపి దక్షిణాదిలో పాగా వేసేందుకు పవన్‌ను ఒక వారదిగా వాడుకోవాలని చూస్తోందనేది కనిపిస్తూనే వుంది. ఎందుకంటే ఒకప్పటి పవన్‌ వేరు..ఇప్పుడు పవన్‌ వేరు. ఒకప్పుడు తాను ఎర్రరంగు వాదినని ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు కాషాయదారిగా మారారు. అందువల్ల పవన్‌ రాజకీయాలు రకరకాల మార్గాలను ఎంచుకొని సాగుతోంది. కూటమిలో కటకట మొదలైందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు అందులో పెద్దగా విబేధాలు కనిపించకపోయినా, కుంపటిలో నివురుగప్పిన నిప్పులా పొగ మాత్రం అప్పుడపప్పుడూ కనిపిస్తుంది. అందుకే పవన్‌ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజకీయాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కూడా పవన్‌ రాజకీయానికి ఆది లోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది. పెద్దలు కీలెరెగి వాతలు పెట్టాలన్నారు. ఇప్పుడు జనసేన విషయంలో టిడిపి ఆ పద్దతి అనుసరించాల్సిన పరిస్ధితి వస్తుందనే చెప్పాలి. రెండు బలమైన జోడెట్లు బండి లాగుతుంటే దాని కింద నడుస్తున్న మేక నేనే లాగుతున్నాను అన్నట్లు వుంది ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆలోచన. రాజకీయాలలోకి రాకుముందు పవన్‌ కల్యాణ్‌పై రకరకాల ఆరోపణలు వుండేవి. ఆయన ఆవేపరుడని అంటూ రకాల మాటలు వినపడేవి. అవి ఆయన ప్రత్యక్ష్యంగా తెలిసిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలే. కాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనలో కొంత మార్పువచ్చిందని అంటారు. కాని గతంలో ఎన్నికల ముందు ఆయన ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలు చూసిన వారికి ఇంకా ఆయనలో అలాంటి ఆవేశం వుందనేది కాదనలేనిది. కాకపోతే పవన్‌ కల్యాన్‌ను బాగా అభిమానించే వారంత ఆయన వ్యక్తిత్వమే పవనిజమంటూ గొప్పగా చెప్పుకునేవారు. ఆ పవనిజంలో నిజమెంత వుంది? అన్నది ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులతోనే తేలిపోతోంది. ఒకప్పుడు ఆయన ఆలోచనలు వేరు. ఆయన చెప్పిన మాటలు వేరు. తాను బీఫ్‌ తినాల్సివస్తే అంటూ ఒకరి మనోభావాలను, వారి ఆచార వ్యవహారాలను తప్పు పట్టొద్దని చెప్పిన సందర్బాలు అనేకం వున్నాయి. కాని ఇప్పుడు అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ఎత్తుకున్న సనాతన ధర్మంలో గతం తాలూకు ఆలోచనలన్నీ తుడిచేశారా? సమాధి చేశారా? అన్నది ఆయన వ్యక్తిగతం. కాని ఆయన ప్రజల్లో వుంటున్నారు. ప్రజానాయకుడుయ్యారు. రాజ్యాంగబద్దమైన పదవిలో వున్నారు. దాంతో ఆయన గతంలో చెప్పిన మాటలను, ఇప్పడు ఆచరిస్తున్న విధానాలను అనేక మంది ప్రశ్నిస్తున్నారు.

‌నాపై తప్పుడు ప్రచారం చేయొద్దు..

అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు.

సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను.

వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను.

రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు.

నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు.

నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌

మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దు.

సోషల్ మీడియాలో నాపై దుష్పచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించడానికి వెనుకాడను.

ఎమ్మెల్సీ “పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి”.

“నేటిధాత్రి”, హైదరాబాద్.

తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజా ప్రతినిధిగా 20 సంవత్సరాల పాటు మచ్చలేని నాయకుడు, వివాద రహితుడిగా పేరు సంపాదించుకున్నాను. మొయినాబాద్ మండల తోల్కట్డ గ్రామంలో నాకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సంఘటనకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. 2018 ఆ భూమి కొనుగోలు చేసిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతలను నా మేనల్లుడు జాన్‌దేవ్ రెడ్డికి అప్పగించాను. ఇక్కడ మరో ముఖ్య విషయం. నా వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి నిర్మాణాలు లేవు. కేవలం వ్యవసాయ కూలీలు సేదదీరడం కోసం వేసిన రేకుల షెడ్లు మాత్రమే వున్నాయి. నా వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి తోట, మామిడి తోటలున్నాయి. నిరంతరం వ్యవసాయ పనుల కోసం వాడే పని ముట్లు దాచడం కోసం రేకుల షెడ్లు వినియోగిస్తారు. అక్కడ గెస్ట్ హౌస్ లేదు. ఫామ్ హౌస్ లేదు. కానీ కొందరు పని గట్డుకొని అసత్యాలన్నీ ప్రచారం చేస్తున్నారు.‌ కాకపోతే మా మేనల్లుడు నా సమాచారం లేకుండా సదరు తోటను వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లు మాత్రమే తెలిసింది. అయితే రమేశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మరో వ్యక్తి ఎం. వెంకట పతి రాజుకు కౌలుకిచ్చారని నిన్ననే నా దృష్టికి వచ్చింది. వెలుగులోకి వచ్చిన విషయంలో సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా నేను స్వయంగా నిన్ననే పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను. వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు. నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు. నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌ అయితే మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దు. సోషల్ మీడియాలో నాపై దుష్పచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించడానికి వెనుకాడను. అని పోచంపల్లి తెలిపారు.

టీయూసీఐ మహాసభను జయప్రదం చేయాలి

*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :*

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16న కొత్తగూడెం లో జరుగు టీయూ సీఐ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం పెట్రోల్ బంక్ ఆటో అడ్డల మీద ప్రచారం నిర్వహించారు. అనంతరం గుండాల ఏరియా అధ్యక్షలు గడ్డం, రమేష్, కార్యదర్శులు, కొమరం, శాంతయ్య,పాల్గొని మాట్లాడుతూ మహాసభను జయప్రదం చేయాలని గుండాల ఏరియా పరిధిలో చేస్తున్న అసంఘటితంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొంబాయి రమేషు,కోడూరు జగన్, మొక్క, నరీ, పెండకట్ల, రాంబాబు, సాయం, రమేష్, గడ్డం, సుధాకర్, పాయం, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా ముగిసిన ఫిజియోథెరపీ చికిత్సలు.

కామారెడ్డి జిల్లా/పిట్లం నేటిధాత్రి:

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం భవిత సెంటర్లో ఫిజియోథెరపిస్ట్ డా. సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 8 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు అందజేసినట్లు డా. సారిక తెలిపారు.
ఈ సందర్భంగా డా. సారిక మాట్లాడుతూ, “తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లలకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయించడం అనేది ఎంతో ముఖ్యమైందని” సూచించారు. పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలతో పాటు ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలైన మార్గమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల కిషోర్, వికలాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…

జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాటు…

భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు తీర్చుకోవాలి…

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డప్పు చప్పుళ్ళు, గిరిజన సంప్రదాయాల మధ్య శుక్రవారం గాంధారి మైసమ్మ జాతర ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీ, నాయక్‌ పోడులు,గిరిజనులు, తరలివస్తున్నారు. బొక్కల గుట్ట గాంధారి ఆలయం నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సదర్ల భీమ న్న విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలను చేపట్టారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సదర్ల భీమన్న విగ్రహాల వద్దకు చేరుకొని తప్పెటగుళ్లను ఎత్తుకుని దేవతామూర్తులను గోదావరి నదికి సాగనంపారు. గిరిజన సంప్రదాయబద్దంగా సదర్ల భీమన్న విగ్రహాల వద్ద పట్నాలు నిర్వహించారు. అనంతరం తప్పెటగుల్ల, పిల్లనగ్రోవుల ఆటాపాటలతో ఆది వాసీలు గోదావరి నదికి తరలి వెళ్ళారు. తిరిగి నది జలాలతో ఖిల్లాకు చేరుకున్నారు. జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి కలెక్టర్ కుమార్ దీపక్ చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జాతర సజావుగా జరిగేలా అధికారులు, నాయకులు సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులు సైతం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులకు సహకరించాలని కోరారు.జాతర ప్రాంగణంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో రామకృష్ణాపూర్‌ ఎస్సై రాజశేఖర్ భారీ బందోబస్తు చేప ట్టారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో జాతర ఏర్పా ట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గిరిజన, ఆది వాసీ నాయక్‌పోడుల ఆరాధ్య దైవమైన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటే పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అమ్మవారు రక్షిస్తారని గిరిజ నుల నమ్మకం. ఆదివాసీ నాయక్‌పోడ్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతరకు తరలి వచ్చే భక్తులకు సేవా కార్యక్ర మాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. జాతర కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్, ఆదివాసి నాయకపోడ్ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, ప్రధాన కార్యదర్శి డి లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు ఎల్ రాజ్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ రోడ్డ రమేష్ ,రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి రాజన్న, ఆదివాసి హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గంజి రాజన్న, ఆదివాసి నాయకపోడ్ పెద్దలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ టీజీ నాయకులు

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియమించాలని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాట్లాడుతూ గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఆరుగురు డాక్టర్లతో తూతూ మంత్రంగా వైద్య సేవలని అందిస్తున్నారని దుయ్యబట్టారు …. గైనిక్,, అనస్తీసియా,, పీడియాట్రిక్ డిపార్ట్మెంటులో ఇద్దరేసి డాక్టర్ల చొప్పున ఉంటూ వైద్యాన్ని అందించాల్సి ఉండగా వైద్యుల కొరత వల్ల అనేక ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భూపాలపల్లి పరకాల హనుమకొండ వంటి పట్టణాలకు వెళ్లే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… కొన్నిసార్లు సమయానికి వైద్యం అందక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు… గత ఆరు నెలల నుండి పరిస్థితి పూర్తి అధ్వానంగా మారింది.. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదని, పేద ప్రజల ఆరోగ్యం అంటే ఆయనకు లెక్కే లేకుండా పోతుందని మండి పడ్డారు.వెంటనే జిల్లా కలెక్టర్ నిరుపేద రోగుల పరిస్థితుల దృష్ట్యా చిట్యాల హాస్పిటల్ కు పూర్తి స్థాయిలో గైనిక్,, అనస్తీషియా,, పీడియాట్రిక్ డాక్టర్లను నియమించాలని ఆయన కోరడం జరిగింది. లేనట్లయితే చిట్యాల హాస్పిటల్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్థామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శాస్త్రాల తిరుపతి శీలపాక హరీష్ మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version