కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం భవిత సెంటర్లో ఫిజియోథెరపిస్ట్ డా. సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 8 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు అందజేసినట్లు డా. సారిక తెలిపారు. ఈ సందర్భంగా డా. సారిక మాట్లాడుతూ, “తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లలకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయించడం అనేది ఎంతో ముఖ్యమైందని” సూచించారు. పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలతో పాటు ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలైన మార్గమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల కిషోర్, వికలాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డప్పు చప్పుళ్ళు, గిరిజన సంప్రదాయాల మధ్య శుక్రవారం గాంధారి మైసమ్మ జాతర ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీ, నాయక్ పోడులు,గిరిజనులు, తరలివస్తున్నారు. బొక్కల గుట్ట గాంధారి ఆలయం నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సదర్ల భీమ న్న విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలను చేపట్టారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సదర్ల భీమన్న విగ్రహాల వద్దకు చేరుకొని తప్పెటగుళ్లను ఎత్తుకుని దేవతామూర్తులను గోదావరి నదికి సాగనంపారు. గిరిజన సంప్రదాయబద్దంగా సదర్ల భీమన్న విగ్రహాల వద్ద పట్నాలు నిర్వహించారు. అనంతరం తప్పెటగుల్ల, పిల్లనగ్రోవుల ఆటాపాటలతో ఆది వాసీలు గోదావరి నదికి తరలి వెళ్ళారు. తిరిగి నది జలాలతో ఖిల్లాకు చేరుకున్నారు. జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి కలెక్టర్ కుమార్ దీపక్ చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జాతర సజావుగా జరిగేలా అధికారులు, నాయకులు సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులు సైతం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులకు సహకరించాలని కోరారు.జాతర ప్రాంగణంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ భారీ బందోబస్తు చేప ట్టారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో జాతర ఏర్పా ట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గిరిజన, ఆది వాసీ నాయక్‌పోడుల ఆరాధ్య దైవమైన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటే పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అమ్మవారు రక్షిస్తారని గిరిజ నుల నమ్మకం. ఆదివాసీ నాయక్‌పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతరకు తరలి వచ్చే భక్తులకు సేవా కార్యక్ర మాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. జాతర కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్, ఆదివాసి నాయకపోడ్ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, ప్రధాన కార్యదర్శి డి లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు ఎల్ రాజ్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ రోడ్డ రమేష్ ,రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి రాజన్న, ఆదివాసి హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గంజి రాజన్న, ఆదివాసి నాయకపోడ్ పెద్దలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ టీజీ నాయకులు
చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియమించాలని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాట్లాడుతూ గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఆరుగురు డాక్టర్లతో తూతూ మంత్రంగా వైద్య సేవలని అందిస్తున్నారని దుయ్యబట్టారు …. గైనిక్,, అనస్తీసియా,, పీడియాట్రిక్ డిపార్ట్మెంటులో ఇద్దరేసి డాక్టర్ల చొప్పున ఉంటూ వైద్యాన్ని అందించాల్సి ఉండగా వైద్యుల కొరత వల్ల అనేక ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భూపాలపల్లి పరకాల హనుమకొండ వంటి పట్టణాలకు వెళ్లే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… కొన్నిసార్లు సమయానికి వైద్యం అందక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు… గత ఆరు నెలల నుండి పరిస్థితి పూర్తి అధ్వానంగా మారింది.. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదని, పేద ప్రజల ఆరోగ్యం అంటే ఆయనకు లెక్కే లేకుండా పోతుందని మండి పడ్డారు.వెంటనే జిల్లా కలెక్టర్ నిరుపేద రోగుల పరిస్థితుల దృష్ట్యా చిట్యాల హాస్పిటల్ కు పూర్తి స్థాయిలో గైనిక్,, అనస్తీషియా,, పీడియాట్రిక్ డాక్టర్లను నియమించాలని ఆయన కోరడం జరిగింది. లేనట్లయితే చిట్యాల హాస్పిటల్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్థామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శాస్త్రాల తిరుపతి శీలపాక హరీష్ మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు
వైద్యాధికారుల నిర్లక్ష్యం, చర్యలు తీసుకునేవారే అలసత్వం ప్రదర్శిస్తున్నారు?
ఇటీవల నగరంలో వరుసగా ఫెయిల్ అవుతున్న అపెండిక్స్ ఆపరేషన్ లు
ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలకు వెనుకాడుతున్న అధికారులు?
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ జిల్లా గురిజాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం, వారి అబ్బాయి తనీష్ (13) కి కడుపు నొప్పితో బాద పడుతుండగా హనుమకొండ బాలసముద్రం లోని, శ్రీఉదయ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకురాగా, హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ జితేందర్, 13 సంవత్సరాల కుర్రాడైన తనిష్ కు చేసిన అపెండిస్ ఆపరేషన్ వికటించి ప్రాణాపాయస్థితికి చేరుకోగా.. తమ ఏకైక కుమారుడి ప్రాణాలను కాపాడుకోవాలన్నా తాపత్రయంతో తమ బంధువులు, స్నేహితులు వద్ద అప్పుచేసి దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చుతో, హైదారాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించి తమ బిడ్డను ప్రాణాలతో రక్షించుకోగలిగారు ఆ కుర్రాడి తల్లిదండ్రులు. తమ కుమారుడి ప్రాణాలను రక్షించుకోగలిగిన ఆ అమాయకపు తల్లిదండ్రులు, చేసిన అప్పులను మాత్రం తీర్చలేక చచ్చిన జీవశవంలా మిగిలిపోయారు. ఆ ఆసుపత్రి యాజమాన్యంపై, సదరు డాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు తల్లిదండ్రులు.
డి.ఎం.హెచ్.ఓ, పోలీస్ అధికారుల నుండి స్పందన కరువు..?
ఆసుపత్రి యాజమాన్యం అలాగే ఆపరేషన్ చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూలై 31, 2024 రోజున దరఖాస్తు సమర్పిస్తే, మూడు నెలల అనంతరం, అనగా.. నవంబర్ 13, 2024 రోజున ఓ అధికారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించి చేతులు దులుపుకున్న హనుమకొండ డి.ఎం.హెచ్.ఓ. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వయిరీ చేశాడా? అంటే.. ఆ రెండు ఆసుపత్రుల నుండి కేసు షీట్లు తెప్పించుకొని ఓ మూలన పడేశాడు తప్ప ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేదు అని బాదితుల ఆవేదన. కనీసం పోలీసుల వద్ద తమకు న్యాయం జరుగుతుందని ఆశతో మార్చి 23, 2024 రోజున వరంగల్ కమిషనర్ కు పోస్టు ద్వారా ఫిర్యాదు చేయగా.. స్పందన కొరవ. దీంతో లాభం లేదని భావించి, డిసెంబర్ 04, 2024 రోజున కమిషనర్ ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడంతో, హనుమకొండ ఏసీపీ ని సంఘటనపై విచారించాలని ఆదేశించారు. ఏసీపీ కేవలం కుర్రాడి తల్లిదండ్రులను విచారిస్తున్నారు తప్ప ఆసుపత్రి యాజమాన్యాన్ని లేదా ఆ డాక్టర్ ను విచారించడం లేదు అని బాలుడి తల్లిదండ్రుల ఆవేదన. దీంతో పోలీసు కమిషనర్ ను మరోసారి కలిసి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఎన్.హెచ్.ఆర్.సి, ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు
అధికారులపై నమ్మకం కోల్పోయిన కుర్రాడి తల్లిదండ్రులు, ఈసారి ఎన్.హెచ్.ఆర్.సి కి ఫిర్యాదు చేశారు. ఎన్.హెచ్.ఆర్.సి నుండి కూడా అనుకున్న స్థాయిలో స్పందన కొరవవడంతో ఇక చివరి ప్రయత్నంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి, హన్మకొండలో జరిగిన డి.ఎం.హెచ్.ఓ నిర్లక్ష్యం పై ఫిబ్రవరి 10, 2025 రోజున పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
బాలుడి సంఘటనపై “నేటిధాత్రి” వరుస కథనాలు….
ఆసుపత్రి యాజమాన్యం, అపెండిక్స్ ఆపరేషన్ చేసిన డాక్టర్ నిర్లక్ష్యంపై నేటిధాత్రి వరుస కథనాలు ప్రచురించినప్పటికీ, హనుమకొండ వైద్యాధికారుల నుండి స్పందన కరువైంది.. కనీసం ఎన్.హెచ్.ఆర్.సి నుండి అయిన బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం.
త్వరలో ముహూర్తం ఖరారు ? -సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పూర్తి చేయాలని సంకల్పంతో యాత్ర
-ప్రాజెక్టు తో మూడు నియోజక వర్గాలకు ఒక్కొనియోజజవర్గనికి లక్ష ఎకరాల ఆయకట్టు కింద సాగు నీరు అందించలనే ఆకాంక్ష
-జిల్లాలో ఉన్న మంజీర నది ఉన్న రైతుకూ వర్షాధారం దిక్కు -ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వరం రోజుల పాటు పాదయాత్ర
-130 కి.మీ, పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో రోజుకో సభ. -చివరి రోజు సభకు కేసీఆర్ హాజరు?
జహీరాబాద్. నేటి ధాత్రి:
నారాయణ ఖెడ్, అందోల్, నియోజకవర్గాలకు సాగు నీరు కోసం,చేపట్టిన సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పథకం ప్రజాక్ట్ పనులను ప్రారంభించుటకు శంకుస్థావన పనులను అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో 2022 లో ఫిబ్రవరి 21 న నారాయణఖేడ్ లో అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ శంకు స్థాపన చేశారు, ఆర్థిక మంత్రి గా ఉన్న హరీష్ రావు, నేతృత్వంలో ఆయా ఎమ్మెల్యే లు మాణిక్ రావు, భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, చింత ప్రభాకర్ ల నేతృత్వం లో పైలాన్ ఆవిష్కరించి ప్రసంగించారు, కానీ ఆ తర్వాత అదే ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ను అందోళ్ నియోజక వర్గంలోనీ మునిపల్లి మండలం చిన్న చెల్మెడ గ్రామ శివారులో హరీష్ రావు శంకు స్థాపన చేశారు.. అందోల్ జహీరాబాద్ నియోజక వర్గ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్,సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ ఛైర్మెన్ ఎం శివకుమార్, తో కలిసి బూమి పూజ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల నాయకులు రైతులు పాల్గొన్నారు. టెండర్ పనులను కూడా ఖరారు చేసారు, కానీ హనుయంగా 2023 సం రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ అధికారం చేపట్టింది, అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జిల్లా మంత్రి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తి పోతాల పనులను మరుగున పడేశారు, అని ఇటీవల జహీరాబాద్ నియోజక వర్గం జరాసంగం మండలం లోని మేధపల్లి గ్రామ మాజీ సర్పంచ్ యువ నాయకులు పరమేశ్వర్ పాటిల్, అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలం అయింది అని ఉమ్మడి రాష్ట్రం లో ఉన్న రాష్ట్ర రైతుల పరిస్థితి ఇప్పుడు కూడా ఉన్నది అని సాగు నీరు లేక వర్షాధార పంటలు సాగుచేసి ఆకాశానికి వర్షపు బొట్టు కోసం ఎదురు చూస్తున్నారు ఎత్తిపోతల పథకం పనులుపూర్తి చేయాలని పూర్తి కావాలి అంటే అది కేసీఆర్ కే సాధ్యం అని ఎవరివల్ల కాదు, అని ఆ రెండు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, దానికోసం రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాధ్యం అని, ఝరాసంగం మండల కేంద్రం లోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రగా ఐదు రోజులు పాదయాత్ర చేసి గజ్వేల్ మీదుగా ఎర్రవల్లి వరకు 140 కి మీ, పాదయాత్ర చేసి ఆ ఉక్కు గుండెల వాడు, భక్కపలచని కేసీఆర్ ను కలుస్తా, రైతుల సమస్య లను వివరిస్త అని పాదయాత్ర పూర్తి చేసి కేసీఆర్ కు అత్తుకొని బోగోద్వేగానికి గురై పాదాభివందనం చేశారు, దీనికి చలించిన ముఖ్యమంత్రి 31 జనవరి 2025 రోజు జహీరాబాద్ నియోజక వర్గం నుండి పాదయాత్రగా వచ్చిన పరమేశ్వర్ పాటిలు మద్దతుగా వచ్చిన నియోజక వర్గ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ ఛైర్మెన్ ఎం శివకుమార్, సంఘీభావంగా మాజీ మంత్రి హరీష్ రావు, చింత ప్రభాకర్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. దీంతో పాదయాత్ర గా బయలు దేరిన పరమేశ్వర్ పాటిల్ గూర్చి మాట్లాడుతూ, రైతుల పక్షాన దేనికైనా సిద్ధం నీ పాదయాత్ర వృద్ధిపోదు, నీలాంటి యువకులు ముందుకు రావాలి. ఆ రోజు ఉద్యమం మొదలు పెట్టినరోజు ఒక్కడినే కానీ యువకులు, విద్యార్థులు,, అన్ని సంఘాల వారు ముందుకు వచ్చి నాకు మద్దతుగా నిలిచిన రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఉవ్వెత్తున ఎగసి రాష్ట్రం సాధ్యం అయింది, అని అన్నారు. చాలా రోజులకు మొట్టమొదటి సరిగా జహీరాబాద్ ప్రాంతం వారితో కలిసి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి బావోగ్వేధంగా ప్రసంగించారు.. అప్పుడు అక్కడే పక్కన ఉన్న హరీష్ రావుకి మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం కోసం మరో ఉద్యమం మొదలు పెట్టు దానికోసం నారాయణ ఖేడ్, జహీరాబాద్ , అందోల్ నాయకులతో కలిసి ప్రతేక సాగునీటి ఉద్యమం మొదలు పెట్టు అని పేర్కొన్నారు. దానికోసం మాజీ మంత్రి హరీష్, ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేల జహీరాబాద్ ఎమ్మెల్యే తో మాట్లాడి ప్రతేక పోరాటానికి సిద్ధం అయి పాదయాత్రకు సిద్ధ పడ్డారు, దీనికోసం ప్రత్యేకంగా పాదయాత్ర చేయడానికి ఒక వారం రోజుల పాటు పడుతుంది అని, రోజు 18, నుండి 20 కి,మి, పాదయాత్ర కొనసాగుతుంది అని వారం రోజులు పాదయాత్ర చేస్తే 130, నుండి 140 కి. మీ పాదయాత్ర కొనసాగవచ్చు అని తెలుస్తుంది, సంగారెడ్డి, జహీరాబాద్ అందోల్ నారాయణ ఖేడ్, నాల్గు నియోజక వర్గాలకు నాల్గు లక్షల ఎకరాలు సాగునీరు అందేలా చూడాలి అని దానికోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ల మరో సాగునీటి ఉద్యమం మొదలు పెట్టి రైతులకు సాగునీరు అందించడమే కేసీఆర్ లక్షం అని దానికోసం ఆయన అడుగుజాడల్లో దేనికైనా సిద్ధం అని అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో ఉంటే త్వరలో పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది, ఈ రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి అయితే 397 గ్రామాలకు సాగునీరు వచ్చి నాల్గు లక్షల ఎకరాలు ఆయకట్టు పూర్తి అవుతుంది అని బి ఆర్ ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం నుండి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది, ఇక్కడి నుండి పాదయాత్ర మొదలు పెట్టి నారాయణ ఖేడ్, పట్టణం లోని బసవేశ్వర మందిరం వరకు కొనసాగి పాదయాత్ర పూర్తి అవుతుంది, పాదయాత్ర లో నాల్గు నియోజక గ్రామాలు ఉండేలా రూట్ మ్యాప్ తయారు చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాదయాత్ర లో భాగంగా రోజుకొక గ్రామంలో ప్రతేక సభలు ఉండేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు.. పాదయాత్ర ముగింపు రోజు కేసీఆర్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు..
జడ్జి పై దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు:-
సంఘీభావం తెలిపిన వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్లు:-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
రంగారెడ్డి జిల్లా కోర్ట్ నందు 9వ అదనపు జిల్లా జడ్జి పై గురువారం నాడు జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు తేది 14-02-2025 రోజున కోర్టు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ లు తమ సంఘీభావం తెలిపి కోర్టు విధులను బహిష్కరించారు.
వివరాల్లోకి వెళితే హత్యాయత్నం కేసులో కరణ్ సింగ్ అనే ముద్దాయికి నేరం రుజువు కావడంతో మంగళవారం రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి యావజ్జీవ శిక్ష విధించారు, కాగా ఇదే ముద్దాయిపై మరొక కేసు విషయంలో గురువారం కోర్టులో ప్రవేశ పెట్టగా, జడ్జి గారు ఇట్టి కేసును విచారిస్తుండగా, జైల్లో పోలీసులు నన్ను వేధిస్తున్నారని అంటూ జడ్జి గారి ముందుకు వెళ్ళిన ముద్దాయి కరణ్ సింగ్ తన కాలు చెప్పును తీసి జడ్జి గారి మీదికి విసిరారు, అది జడ్జి గారికి తగలకుండా ప్రక్కకు పడిపోయింది మరియు అంతటితో ఆగకుండా గట్టిగా అరుస్తూ జడ్జి గారిని తిట్టడం జరిగింది.
దీనిని తెలంగాణ జ్యుడీషియల్ సంఘం ఖండించింది, సంఘం అధ్యక్షులు కె. ప్రభాకర్ రావు మాట్లాడుతూ విచారణ సందర్భంగా మహిళా జడ్జి పై నిందితుడు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూనట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఓపెన్ కోర్టులో మహిళా న్యాయమూర్తి పై దాడి చెయ్యడం మరియు బెదిరించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. కరుడు గట్టిన నేరస్థుల కేసులు నిత్యం విచారించే జడ్జిల భద్రతకు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా జడ్జి గారి పై జరిగిన దాడి విషయంలో తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం కోర్టు విధులకు హాజరుకాకుండా నిరసనలు వ్యక్తం చెయ్యాలని నిర్ణయనుసారం వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యం లో నిరసనలు వ్యక్తం చెయ్యడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ రమేష్ బాబు, జీవన్ గౌడ్ మరియు ఇతర కమిటీ మెంబెర్స్ తో పాటు సీనియర్ న్యాయవాదులు సహోదర రెడ్డి, అంబరీష్ రావు, విద్యాసాగర్ రెడ్డి, ఆనంద్ మోహన్, నర్సింగ రావు మరియు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబెర్స్ జయాకర్, జనార్ధన్ మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.
నేటి విద్యాలయాలు అభివృద్ది.. భవిష్యత్తు దేశాభివృద్ధి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
విద్యాలయాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికలాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా రూ.69 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ మరియు గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ పాఠశాల లో చదివి ఈరోజు జీవితంలో స్థిరపడిన హరీష్ నాకు పాత మిత్రుడని హరిష్ తో పాటు ఈ పాఠశాల లో చదివి జీవితంలో స్థిరపడ్డ వారి మాదిరిగానే మీరు మంచిగా చదువుకొని మీరు కూడా జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మవిశ్వాసానికి ఎదగడానికి మీరందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. వ్యతిరేక ఆలోచనలు చేయరాదని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలో ఏమైనా అభివృద్ధి పనులు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అంతకుముందు అంధుల ఆశ్రమ పాఠశాల లో చదివి వివిధ ప్రభుత్వ ప్రైవేటు శాఖలో ఉద్యోగాలు సాధించి జీవితం లో స్థిరపడిన పలువురు పూర్వపు విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ.రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, రాములు యాదవ్, రమేష్ యాదవ్, ఏసు దాస్ , రఘురామిరెడ్డి ,తిరుమల వెంకటేష్, పాపారాయుడు, రాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం : ఆ రోడ్డు గుండా ప్రయాణించాలంటే… అడుగడుగునా మాలమాలుపులు, ఆపై రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరుకపోవడం తో ఎప్పుడూ ప్రమాదం సంభవిస్తుందోనన్నా భయాందోళనకు వాహన చోదకులు గురవుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాల్సిన సంబందిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ సంఘటన మం డల కేంద్రమైన ఝరాసంగం నుంచి క్రిష్ణాపూర్ గ్రామం వరకు 10 కిలో మీటర్లు 8 మూల మాలుపులు దర్శనమిస్తాయి. రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరుకపో వడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జ రుగుతున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు తరుచు మూల మాలుపుల వద్ద ప్రమా దాలు చోటు చేసుకుంటున్నప్పటికీ, సంబంధిత శాఖ అధికారులు సూచిక బోర్డులు నెలకోల్పడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహన చోదకులు వాపోతున్నారు.
ఈ రోడ్డుపై ప్రతి రోజూ రద్దీ…
ఈ రోడ్డు గుండా ప్రతి రోజు ఝరాసంగం, రాయికోడ్ మండలాలకు చెందిన ప్ర జ లు వివిధ పనుల నిమిత్తం జహీరాబాద్ పట్టణంకు వెళ్ళుతుంటారు. అంతే కా కుం డా ఝరాసంగంలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దర్శనం కోసం కర్ణాటక, మహా రాష్ట్ర భక్తులు ఈ రోడ్డు వెంటే ప్రయాణిస్తారు. కానీ సంబంధిత అధికారులు మూల మాలుపుల వద్ద సూచీక బోర్డు లు, పిచ్చిమొక్కలు తొలగించకపోవడంతో ప్రమాదా లు సంభవిస్తున్నాయి. దీంతో ప్రమాదానికి గురైన వారు ఆస్పత్రి పాలవుతున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2026 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫి బ్రవరి 11న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఎవ్వరితో పొత్తు పె ట్టుకునే ప్రసక్తే లేదని, తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టం చేయడంలో పెద్దగా విశేషమేమీ లేనట్టు కనబడుతున్నా, ఇటీవల జరిగిన ఢల్లీి ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న ఆప్, జవసత్వాలు ఉడికి కాలు,చెయ్యి కదపలేని స్థితిలో వున్న కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండీ’ కూటమితో జట్టు కడితే ఎటువంటి ప్రయోజనం వుండబోదన్న సత్యం ఆమెకు మరోసారి బోధపడినట్టు భావించాలి. తనకు రాజకీయ లబ్దిని కలిగించే ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టని దీదీ నిర్ణయం ఎవ్వరికీ పెద్దగా ఆశ్చర్యపరదనే చెప్పాలి. మితిమీరిన ఉచితాలు వికటిస్తాయన్న మరో స త్యాన్ని ఢల్లీి ఎన్నికలు రాజకీయపార్టీలకు బాగా బోధపరచి వుంటాయి. ప్రధాని పదవికి పోటీలో ఉన్నానని చెప్పుకునే మమతాబెనర్జీకి పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఎంతమాత్రం పలుకుబడిలేదన్న సత్యాన్ని గుర్తించాలి.
పెరుగుతున్న ఆధిపత్యపోరు
బయటి రాజకీయాలు ఒక ఎత్తయితే పశ్చిమబెంగాల్ అంతర్గత రాజకీయాలు ముఖ్యంగా తృణ మూల్ కాంగ్రెస్‌లో మమతాఅభిషేక్ బెనర్జీల మధ్య క్రమంగా పెరుగుతున్న ఆధిపత్యపోరు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. దీన్నే ‘‘ఓల్డ్ గార్డ్స్’’ వర్సెస్ ‘‘యంగ్ టర్క్స్’’ మధ్యపోటీగా అక్కడి రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని అధినేత్రిగా మమతా బెనర్జీ బయటి వారికి కనిపిస్తున్నా ఒక వయసు దాటిన వృద్ధులు రాజకీ యాలనుంచి తప్పుకొని యువకులకు ఛాన్స్ ఇవ్వాలన్న వాదనలు పార్టీలో క్రమంగా బలం పుం జుకోవడం, అభిషేక్ బెనర్జీకి పట్టం కట్టాలన్న వర్గం బలపడుతున్న సంగతిని స్పష్టం చేస్తున్నది. అయితే మమతా బెనర్జీ మాత్రం ‘‘సీనియర్ నాయకులను గౌరవించాల్సిందే’’నని స్పష్టం చేస్తున్నారు.
‘ఓల్డ్’ వర్సెస్ ‘యంగ్’
గత నెలలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ అధికార భవనం ‘నబన్న’లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రవాణా శాఖమంత్రి స్నేహశీష్ చక్రవర్తినుద్దేశించి ‘‘సరైన సంఖ్యలో బస్సులు లేకపోవడంవల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బం దులను గురించి వాకబు చేయడానికి ఏనాడైనా బస్టాండ్‌కు వెళ్లారా? అసలు రవాణాశాఖలో ఏంజరుగుతున్నదో ఏమీ తెలియడంలేదు’’ అని అనడంతో మంత్రి నీళ్లు నమలడమే సమాధానమైంది. ఇక విద్యాశాఖ సమీక్షలో ‘‘నాకు తెలియకుండా ప్రాథమిక పాఠశాలల్లో సెమిస్టర్ వ్యవస్థను ఎట్లా ప్రవేశపెడతారు? అటువంటి కీలకమైన నిర్ణయాలను నన్ను సంప్రదించకుండా ఎట్లా తీసుకుంటారు? దినపత్రికల్లో చదివి తెలుసుకోవాల్సి వచ్చింది’’ అని ప్రశ్నిస్తే ఆయనవద్ద కూడా స మాధానం లేదు. పిల్లల మీద భారం తగ్గించాలి కానీ, పెంచకూడదని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి స్నేహశీష్ చక్రవర్తి, విద్యామంత్రి బ్రత్యబసులు, ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి నమ్మిన బంట్లు కావడం గమనార్హం! ఈ సమీక్ష ద్వారా ఒక్క విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కొన్ని కీలక నిర్ణయాలు మమతా బెనర్జీకి తెలియకుండానే జరుగుతున్నాయి.ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాలకు డైమండ్ హార్బర్ (ఇది అభి షేక్ బెనర్జీ స్థానం) కేంద్రస్థానంగా వున్నదన్నది పశ్చిమ బెంగాల్‌లో బహిరంగ రహస్యమే. అంతేకాదు ఈ సమీక్షపై రాష్ట్రంలోని టెలివిజన్ ఛానళ్లు తృణమూల్ పార్టీలో పెరుగుతున్న ‘‘ప్రబీణ్’’ (ప్రావీణ్యత) వర్సెస్ ‘‘నబీన్’’ (నవ్యత) మధ్య జరుగుతున్న సంఘర్షణగా పేర్కొన్నాయి. అంతేకాదు వృద్ధులు మమతా బెనర్జీవైపు, యువకులు అభిషేక్ వైపు మొగ్గు చూపుతుండటం ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామం.
కళాకారుల వివాదం
కొందరు సెలబ్రిటీ కళాకారులు, ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల్లో తాము పాల్గనాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు రద్దుచేశారని ప్రకటించారు. వీరంతా గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం లో ముందు వరుసలో నిలవడం గమనార్హం. కొందరు తృణమూల్ కాంగ్రెస్ నాయకుల నిర్దేశం మేరకే ఈ రద్దు జరిగిందని వారు పేర్కొన్నారు. అంతకు ముందు టీఎంసీ సీనియర్ నాయకు డు, అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘అధికారపార్టీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కళాకారులను బాయ్‌కాట్ చేయాలి’’ అన్నది ఈ పోస్టు సారాంశం. మరుసటిరోజే అభిషేక్ బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ ‘‘ప్రజాస్వామ్యంతోనిరసనహక్కు ప్రతి ఒక్కరికి వుంటుంది. మా ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా కాదు’’ అని స్పష్టం చేశారు. అంతేకాదు అధినేత్రి మమతా బెనర్జీ తరపున ఎవ్వరూ ఎటువంటి పోస్ట్ లు పెట్టకూడదని కూడా హెచ్చరించారు. కుణాల్ ఘోష్ దీనికి స్పందిస్తూ ‘‘మమతా బెనర్జీకి తెలియకుండా, ఆమె చెప్పకుండా తానెటువంటి పోస్ట్‌లు పెట్టనని’’ సమాధానమిచ్చారు. ఇక్కడ కూ డా మమత, అభిషేక్‌ల మధ్య వున్న విభేదాలు స్పష్టమయ్యాయి.
సస్పెన్షన్లు
ఇటీవల రాజ్యసభ మాజీ సభ్యుడు శంతన్ సేన్‌ను టీఎంసీ సస్పెండ్ చేసింది. విచిత్రమేమంటే ఈయన అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. రాజకీయుడిగా మారిన ఈ డాక్టర్, ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటనపై చేసిన ప్రకటనలు, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. దీనికి తోడు ‘‘సే వాశ్రయ’’ పేరుతో, అభిషేక్ లోక్‌సభ నియోజకవర్గం డైమండ్ హార్బర్‌లో అనేక మెడికల్ క్యాం పులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇదిలావుండగా గత నవంబర్ నెలలో హుమాయూన్ కబీర్ అనే పార్టీ ఎమ్మెల్యే, అభిషేక్ బెనర్జీకి హోమ్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అంతటితో ఆగకుండా మమత చుట్టూ వున్న వృద్ధ నాయకు లు నిజంగా ముఖ్యమంత్రికి, పార్టీకి శ్రేయోభిలాషులుగా వున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేయడం, పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
పార్టీలో ‘సీనియర్లు’ వర్సెస్ ‘జూనియర్లు’ మధ్య జరుగుతున్న సంఘర్షణకు సాక్ష్యంగా మరో సంఘటనను కూడా ఉదహరించవచ్చు. 2022, ఫిబ్రవరి నెలలో పార్టీ అత్యున్నతస్థానాల్లో ఉన్న నా యకులను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయించింది. విచిత్రమేమంటే ఆవిధంగా తొలగింపునకు గు రైనవారంతా అభిషేక్ మద్దతుదారులే! అయితే అభిషేక్‌ను కట్టడి చేయడానికే ఈ చర్య తీసుకున్నారని భావించినా తర్వాత ఆయన్ను పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించడం గమనార్హం. అంటే మమతా బెనర్జీ తన మేనల్లుడి విషయంలో ‘‘బ్రెడ్ అండ్ స్టిక్’’ పాలసీని అనుసరిస్తున్నార నుకోవాలి.
2023లో అభిషేక్ బెనర్జీ ‘‘తృణమూల్ ఎర్ నబజోవర్ యాత్ర’’ పేరుతో రాష్ట్రం లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. తనపై వస్తున్న ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో ఆయన 60రోజుల పాటు ఈ యాత్రను నిర్వహించారు. ఫలితంగా తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 49స్థానాల్లో 29సీట్లు టీఎంసీ గెలుచుకోగలిగింది. ఈ ఎన్నికల్లో గట్టిపోటీదారుగా వుంటుందనుకున్న భాజపా 12సీట్లకే పరి మితం కాగా, కాంగ్రెస్ ఒక్క సీటు దక్కించుకుంది. ఇక కమ్యూనిస్టులు ఒక్కసీటూ గెలుచుకోలేదు. మరి ఇవే ఎన్నికల్లో అభిషేక్ బెనర్జీ పార్టీ వృద్ధనాయకులైన సుదీప్ బందోపాధ్యాయ్, కళ్యాణ్ బందోపాధ్యాయ్‌లు పోటీచేస్తున్ననియోజకవర్గాలో ప్రచారం చేయలేదు. వీరిద్దరూ పార్టీలో యువ నాయకత్వాన్ని ఎప్పుడూ విమ ర్శిస్తుండటం గమనార్హం.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీలో రెండు అధికార కేంద్రాలు కొనసాగుతున్నాయన్న వార్తలు జోరందుకున్నాయి. గత డిసెంబర్‌లో మమతా బెనర్జీ తన మేనల్లుడితో సమావేశమై, పార్టీలో మార్పులు చేపట్టడానికి అనుమతివ్వడం గమనార్హం! అంతేకాదు వచ్చే ఏడాది జరుగబోయే అ సెంబ్లీ ఎన్నికల్లో పోరుకు పార్టీని సిద్ధం చేయాలని కూడా ఆమె కోరడం విశేషం! పార్టీలో వ్యక్త మవుతున్న ఆగ్రహావేశాలను, నాయకత్వం ఇప్పటివరకు సమర్థవంతంగా నియంత్రణలో వుంచ గులుతోందనేది అక్షరసత్యం. కాకపోతే పార్టీ మమతా బెనర్జీ ఛరిష్మాపైనే నడవడం పెద్ద బలహీనత! అభిషేక్ బెనర్జీకి పార్టీపై పట్టున్నప్పటికీ, ప్రజల్లో ఛరిష్మా ఎంతవరకు ఉన్నదనేది ఇంకా స్పష్టం కాలేదు! వ్యక్తి ఛరిష్మాపై ఆధారపడిన పార్టీల చరిత్ర ఎట్లా ముగిసిందో మనం చూస్తూనే వున్నాం.
`పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి జీవితంలో మర్చిపోలేను.
`ప్రత్యర్థులు పట్టభద్రులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు.
`విద్యా వేత్తగా నేను అందరికీ సుపరిచితం.
`పట్టభద్రుల స్పందన చాలా బాగుంది.
`పట్టభద్రులు బ్రహ్మ రథం పడుతున్నారు.
`నరేందర్ రెడ్డి ప్రచారంలో మహిళామణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.
`ప్రజలు నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు.
`అందరికీ అందుబాటులో వుంటారు అనే పేరు నాకు మాత్రమే వుంది.
`విద్యావేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తిని కావడం నాకు కలిసొచ్చే అంశం.
`రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై యువతలో మంచి స్పందన.
`ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం.
`పదేళ్లలో పట్టుమని గత పాలకులు పది కొలువులు ఇచ్చింది లేదు.
`బిజేపికి మాటలు ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు.
`బిజేపి మాటలు నీటి మీద రాతలని తరలిపోయింది.
`దేశంలో బిజేపి వల్ల నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది.
`పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిపోయింది.
`బిజేపి చేతగాని తనం వల్ల అమెరికాలో మన యువత ఇబ్బందులు పడుతున్నారు.
`కాంగ్రెస్ పాలనలో దౌత్య సంబంధాలు చాలా మెరుగ్గా వుండేవి.
`మన దేశం నుంచి వెళ్లిన యువతకు మంచి గౌరవం వుండేది.
`బిజేపి దౌత్యపరమైన అవగాహన రాహిత్యం దేశానికి తీరని నష్టం జరుగుతోంది.
`కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులలో ఒక భరోసా కలిగింది.
`కాంగ్రెస్ ప్రభుత్వంమే ఉద్యోగాలు ఇస్తుందని బలమైన నమ్మకం ఏర్పడిరది.
`ఒక్క ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక చరిత్ర.
`రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో వెంటనే ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తాను.
`ప్రైవేటు రంగంలో కూడా తెలంగాణ యువతకు ప్రాధాన్యత కలిగేలా చూస్తాను.
`రాష్ట్ర ప్రభుత్వం ఐటి విస్తరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.
`ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
`ఎంతో మంది నిరుద్యోగుల కల నెరవేరేందుకు మంచి రోజులు రానున్నాయి.
`కొన్ని లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దాను.
`వారి సహకారంతో గెలిచి, నిరుద్యోగ యువతకు సేవ చేస్తాను.
హైదరాబాద్,నేటిధాత్రి:
నిత్యం ప్రజల్లో వుంటా..ప్రజలతో వుంటా…ప్రజల జీవన విదానంలో వుంటా..ప్రతి నిమిషం ప్రజలతోనే గడుస్తుంది. రోజులో ఏ కొద్ది సమయమే నా కోసం వుంటుంది. మిగతా సమయమంతా ప్రజలోనే వుంటుంది. నిత్యం ఎంతోమందిని కలుస్తుంటాను. సమాజాన్ని దగ్గరుండి చూస్తుంటారు. సామాజిక సమస్యలు ప్రతి క్షణం అద్యయనం చేస్తుంటాను. పేదరికంలో మగ్గుతున్న జీవితాలను చాలా దగ్గరగా వుండి చూస్తుంటారు. నేను వ్యాపార వేత్తను కాదు. విద్యా వేత్తను. ప్రతి ఏటా కొన్ని వేల మందిని సమాజంలోకి పంపిస్తుంటారు. పసి వయసు నుంచి నా విద్యా సంస్ధలతో వారు పెనవేసుకున్న అనుబంధం, వారిని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే వరకు వారితో నా ప్రయాణం సాగుతుంది. ఇది ఒక్క ఉపాద్యాయుడికి మాత్రమే దక్కుతుంది. అందులో విద్యా సంస్దల నిర్వహణతో నేను అనేక పాఠాలు నేర్చుకుంటాను. వాటిని మా విద్యాలయాల ద్వారా విద్యార్దులకు, పరోక్షంగా సమాజానికి నేర్పిస్తుంటాను. దేశ విదేశాలలో విద్యా వ్యవస్దల మీద నిరంతరం అధ్యయనం కొనసాగుతుంది. మన పిల్లల ఉత్తమ భవిష్యత్తుకు మార్గలు వేయడం జరుగుతుంది. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. అనేక సభలు, సమావేశాలకు హజరౌతుంటాను. సామాజిక స్ధితిగతుల మీద నిరతంరం ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఇలా నా జీవితమంతా ప్రజలతోనే ముడిపడి వుంటుంది. తెలంగాణలో నన్ను గుర్తు పట్టని వారుండరు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాతో పరిచయం లేని వాళ్లంటూ వుండరు. నా విద్యా సంస్దల్లో చదువుకున్న వాళ్లు, వారి తల్లిండ్రులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇలా అన్ని రంగాల ప్రజలతో నాకు వున్నంత సత్సంబందాలు మరెవరికీ వుండవు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. నాపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వ విజయాలలో ప్రధాన భూమిక ఉద్యోగ కల్పనపై ప్రజలకు వివరిస్తాను. వారికి మెరగైన ఉపాది కల్పన కోసం కృషి చేస్తాను. నా మాటల మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీపై వున్న విశ్వాసంతో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంటున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, ఆల్‌ఫోర్స్ విద్యా సంస్దల అదినేత డాక్టర్. వి. నరేందర్ రెడ్డితో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు చెప్పిన విషయాలు, వివరాలు ఆయన మాటల్లోనే…
సమాజంలో ఉన్నత లక్ష్యాలు, వ్యక్తిగత ఆశయాలు, వాటిని నిజం చేసుకునే అవకాశం కల్పించే ఏకైక వారధి విద్య. ఆ విద్యను కొన్ని లక్షల మందికి ముప్పై సంవత్సరాలకు పైగా అందిస్తున్నాను. అలా ప్రజలతో నా ప్రయాణం ఇప్పటి వరకు ఎంతో గొప్పగా సాగుతోంది. అందుకు కారణం నా అంకితభావమే కారణం. ఒక విద్యా వేత్త సమాజం గురించి ఆలోచించినంతగా మరెవరూ ఆలోచించరని ఆ నా అభిప్రాయం. ఈ సమాజం నాది. నా సమాజం ఎప్పుడూ ఉన్నతంగా వుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. అంతే కాకుండా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, దేశంలో పంచవర్ష ప్రణాళికలు రూపొందిం చి,ఐదేళ్లకోసం లక్ష్యాలను నిర్ధేశించుకొని దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. బిజేపి పార్టీకి అలాంటి లక్ష్యాలు ఏమీ లేవు. దేశాబివృద్దికి ప్రధాన్యతలు లేవు. ప్రణాళికలను ఎత్తి వేసినప్పుడే బిజేపి అంతరంగం అర్దమైంది. కేవలం రాజకీయం తప్ప ప్రగతి దారి మూసేయమే బిజేపి లక్ష్యంగా మారింది. అలాంటి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు తప్ప ఉఫాది కల్పించింది లేదు. ప్రజల జీవితాల్లో వెలుగు నిందింది లేదు. వికసిత్ భారత్ అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉపాధి కల్పనలో మహాత్మాగాంధీ ఉపాధి హమీ పధకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పధకం వల్ల పల్లె ప్రజలకు నిత్యం ఉపాది కలుగుతోంది. ఆ పధకాన్ని కూడా అటెకెక్కించే కుట్ర బిజేపి చేస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ఈ పదకం ప్రస్తావన కూడా తేలేదు. ఉపాధి పథకం కూలీ పెంచలేదు. పైగా రెండు కోట్ల మందిని ఆ ఉపాధి నుంచి తప్పించే కుట్ర చేస్తోంది. ఇలా పేదల జీవితాలను చిద్రం చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా మారింది బిజేపి. అలాంటి బిజేపి పాలనతో పేదలకు మేలు కన్నా, శాపమే ఎక్కువైంది. ఏ రంగంలో చూసినా అవరోహనమే కనిపిస్తోంది. మధ్య తరగతి మీద పన్నుల మీద పన్నుల వడ్డిస్తూ వారి జీవితాలన చిదిమేస్తున్న పార్టీ బిజేపి. 2014 ఎన్నికల ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. యువత జీవితాలలో ఆశలు రేపింది. ఈ పదకొండేళ్ల కాలంలో ఉద్యోగాలు ఇచ్చిందిలేదు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చింది లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోంది. దేశంలోనే అతి పెద్దదైన రైల్వే వ్యవస్ధను నిర్వీర్యం చేసి, ప్రైవేటు రంగానికి అప్పగించే కుట్రలు చేస్తోంది. ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ప్రభుత్వం వ్యాపారాలు చేయదని చెప్పినప్పుడే ఆయన అంతరంగం పూర్తిగా అర్ధమైపోయింది. మన దేశ స్వామ్య వాద ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా వ్యక్తి ఆర్ధిక వ్యవస్ధగా మార్చి, ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఎల్‌ఐసి లాంటి సంస్ధలను కూడా ప్రైవేటు పరం చేసి, ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్యం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి సాగిస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సివుంది. విద్యా వైద్య రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించి, ప్రజల జీవితాలను ఆగం చేస్తోంది. మన దేశ సగటు ఆయు ప్రమాణమే 69 సంవత్సరాలు. అలాంటిది 70 సంవత్సరాలకు పై బడిన వారికే ఉచిత వైద్యం అని చెప్పి ఇలా కూడా ప్రజలను మోసం చేయొచ్చని నిరూపించిన ఏకైక పార్టీ బిజేపి. బిజేపి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ విధానాల వల్ల విదేశీ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ట్రంప్ మన విద్యార్ధులను, ప్రజలకు బేడీలు వేసి, తిరిగి పంపిస్తున్నారు. ఒక దేశానికి చెందిన సైనిక విమానం మరో దేశం అనుమతి లేకుండా వాలడం అంటే మనపై ఆధిపత్యాన్ని చూపించినట్లే లెక్క. అయినా స్పందన లేని ప్రధాని మోడీ అమెరికా మందు సాగిలపడడం మన దౌర్భాగ్యం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాలంలో ఇలాంటి పరిస్దితులు దేశం చూసిందా? ఇతర దేశాల ముందు సాగిలపడడం జరిగిందా? అందువల్ల దేశ ప్రజల్లో చైతన్యం రావాలి. అది ముందు తెలంగాణ నుంచే మొదలవ్వాలి. తెలంగాణలో బిజేపి పార్టీకి చోటులేదు. ప్రజల ఆదరణ అంతకాన్న లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు కూడా పడదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరూ ప్రజలు తెలిసిన వాళ్లు కాదు. ప్రజల్లో వుండేవాళ్లు కాదు. అందుకే ఎక్కడికెళ్లినా నన్ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రి శ్రీధర్‌బాబు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ నా గెలుపు కోసం ఎంతో శ్రమిస్తున్నారు. వారి కృషి వృదా కాదు. వ వారి ఆశీస్సులతో నేను గెలవడం పక్కా…అది కూడా మంచి మెజార్టీతో గెలుస్తాను. గతంలో ఏ పార్టీ కూడా అదికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే మొత్తంగా ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర లేదు. అది ఒక్క కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకే దక్కుతుంది. అందుకే ప్రజా ప్రభుత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడిరది. నిరుద్యోగులు తమ ఆశలు, కలలు నెరవేరుతాయన్న విశ్వాసం వారిలో బలంగా ఏర్పడిరది. తాను ఎమ్మెల్సీగా గెలిచిన మరు క్షణం నుంచి నిరుద్యోగుల ఆశల నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తాను. అటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తాను. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇస్తూ, యువత భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తోడ్పడతాను..ఇది నా హమీ…
లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖా సహాయ మంత్రి వి.సోమన్న సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి తిరుపతి జిల్లాలో కేవలం 2.40 లక్షల గ్రామీణ ఇళ్లకు (57.58%) త్రాగు నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అయితే,గత అయిదేళ్లలో 1.76 లక్షల కొత్త కనెక్షన్లు అందించారని, ప్రస్తుతం 4.16 లక్షల ఇళ్లకు (99.82%) తాగునీటి కనెక్షన్లు అందించబడ్డాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారీగా చూసినట్లయితే 1.19 లక్షల ఎస్సీ, 26 వేల ఎస్టీ కుటుంబాలకి త్రాగునీటి కనెక్షన్లు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఓబిసిలకి సంబందించిన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో కనెక్షన్ల కవరేజ్ గరించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం తిరుపతి జిల్లాలో మొత్తం 4,018 హ్యాబిటేషన్లు ఉండగా వాటిలో 487 ఎస్టీ,1,331 ఎస్సీ హ్యాబిటేషన్ గా గుర్తించబడ్డాయని పేర్కొన్నారు. వీటిలో 09.02.2025 నాటికి 485 ‘ఎస్టీ, మరియు1,328 ‘ఎస్సీ హ్యాబిటేషన్లు పూర్తి స్థాయిలో కనెక్షన్ లు అందించా బడ్డాయని తెలిపారు.అలాగే తాగునీటి నిర్వహణలో గ్రామస్థాయి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల ఏర్పాటు ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని 908 గ్రామాలలో 901 గ్రామాలకు గ్రామ నీటి,పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. ఇందులో 50% కమిటీ సభ్యులు మహిళలు కావడం గమనార్హమని అన్నారు.ఈ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాధాన్యం కల్పించామనీ తెలిపారు. ఈ పథకం ప్రారంబించే సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో 30.74 లక్షల (32.18%) గ్రామీణ ఇళ్లకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందుబాటులో ఉండగా, 2025 ఫిబ్రవరి 9 నాటికి ఈ సంఖ్య 70.46 లక్షల (73.76%)కు చేరిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామీణ ఇంటికి 55 లీటర్ల తాగునీరు రోజుకు అందించే లక్ష్యం కోసం జల్ జీవన్ మిషన్ వేగంగా పురోగమిస్తోందని ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక & సాంకేతిక సహాయం అందిస్తూనే ఉందని తెలియజేశారు.
– రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం ముందు వరుసలో నిలబెట్టాలి
– మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణవేణి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జీ కృష్ణవేణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా మహిళా కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా విభాగం సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత నలినీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆదేశాల మేరకు బుధవారం సమావేశం నిర్వహించగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కృష్ణవేణి హాజరయ్యారన్నారు. గత సెప్టెంబర్ 15 నుండి మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నుండి సభ్యత్వం నమోదు ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. సభ్యత్వం నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మహిళ కాంగ్రెస్ లో జిల్లా విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరు సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. అనంతరం ఇంచార్జి కృష్ణవేణి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెయ్యడానికి సెప్టెంబర్ 15 న మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మహిళా నాయకురాలు విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం నమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాను సైతం రాష్ట్రం లో ముందు నిలిపేలా ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేయని మహిళా కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికలలో అవకాశం వస్తే ప్రతి మహిళా పోరాడాలని, విజయం సాధించాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత నలినీకాంత్ కి సహకరిస్తు, సభ్యత్వ నమోదును పెంచాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి అర్థం అయ్యేలా వివరించాలని కోరారు. ఈ సమావేశంలో
ఏఎంసి చైర్మన్,సిరిసిల్ల టౌన్ అధ్యక్షురాలు వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ కోడం అరుణ, సీనియర్ నాయకురాలు మడుపు శ్రీదేవి, గట్టు రుక్మిణి, సత్య లక్ష్మి, మండలాల అధ్యక్షురాలు హారిక , లహరి,లత, సత్య ప్రసన్న, రాజ్యలక్ష్మి, లహరి, సుధా, రోజా, సరిత, లత,మరియు జిల్లా కమిటీ మెంబర్స్, టౌన్ కమిటీ మెంబర్స్, వార్డ్ అధ్యక్షురాలు గ్రామ శాఖ అధ్యక్షురాలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.
గట్టుప్పల మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో కుక్కల స్వైర్య వివారం చేస్తున్నాయి . దారి వెంట నడవాలంటే ప్రజలుకుక్కల భయానికి బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన గుంపులు గుంపులుగా కుక్కలు దర్శనమిస్తున్నాయి. అధికారులకుచెప్పినవినిపించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మండల వ్యాప్తంగా పిచ్చికుక్కల భయానికి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే మా గ్రామంలో ఉన్న పిచ్చి కుక్కలను లేకుండా చేయాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.చిన్నపిల్లలు అయితేకుక్కల భయానికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకునివెళ్తున్నారు.జనసంచారంఅధికంగా ఉండే ప్రాంతాల్లో కుక్కల సంచారం అధికమవడంతోప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో రోడ్డు మీద వెళ్లే వారిని బైకులపై వెళ్లే వారిని అకస్మాత్తుగా వచ్చికరిచేస్తున్నాయి. వీధి కుక్కల బారినపడి ఎంతోమందిఆస్పత్రుల పాలవుతున్నారు.మరి రాత్రుళ్లు అయితే మరి దారుణం ప్రతి వీధిలో పదుల సంఖ్యలో కుక్కలు వీధుల వెంట సంచరిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా వీధి కుక్కలు స్వైర్య వివారం చేస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
`కాంగ్రెస్ లో చేరినా బిఆర్‌ఎస్ పార్టీని ఉతికి ఆరేయలేకపోతున్నారు
`మరి కొందరు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు
`రెండు వైపులా దారులు మూసుకుపోయే పరిస్థితి తెచ్చుకున్నారు
`అటు ఎన్నికలంటే భయం..ఇటు పదవీ గండం!
`కాంగ్రెస్‌కు దగ్గర కాలేక, దూరంగా వుండలేక సతమతమౌతున్నారు
`నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకుల ఆదరణ లేదు
`నియోజకవర్గాలకు వెళ్తే జేజేలు కొట్టే వారు లేరు
`అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారు
`ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామన్న విశ్వాసం కనిపించడం లేదు
`రాజీనామా చేసినా వెంటనే ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు
`ఆరు నెలల పాటు ప్రజల్లో వుంటూ ప్రచారం అంత సులువు కాదు
`ఏ రకంగా చూసినా కష్టకాలమే!
`సుప్రీం కోర్టు ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని రూలేం లేదు?
`ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నా కారుకే ప్రమాదం
`రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతారు
`భవిష్యత్తు రాజకీయానికి తమకు తామే చరమగీతం పాడుకున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
పిరాయింపులు ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. నిజానికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. గతంలో ఎమ్మెల్యేలు పార్టీలు పిరాయించిన సందర్బాలు అనేకం వున్నాయి. అప్పుడు వారికి ఈ పరిస్దితి ఎదురుకాలేదు. కాని ఇప్పుడు ఎదురౌతున్న సమస్యతో పిరాయింపు దారులంతా తలలు పట్టుకుంటున్నారు. ఎరక్కపోయి వచ్చామా? తొందరపడ్డామా? అని మధనపడుతున్నారు. తెగిన గాలిపటాలైపోయే పరిస్దితి ఎదురుకానుందా? అన్న ఆందోళనలో వున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోలోన వారు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అటు కాంగ్రెస్‌లో వున్నట్లు లేదు. ఇటు గెలిచిన పార్టీకి తిరిగి వెళ్లిపోయే పరిస్ధితి లేదు. రెంటికీ చెడిన రేవడిగా తమ రాజకీయం మారుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. మూలుగుతున్న నక్కమీద తాటి పండు పడ్డట్టు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేయడంతో వారి ఆందోళన మరింత ముదురుతోంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసకోవాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురౌతోంది. ఒక వేళ సుప్రింకోర్టులో ఊరట లభిస్తే అన్న చిరు ఆశతో వున్నారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రింకోర్టు ఇప్పటికే కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇంకా స్పీకర్‌కు సమయం ఇవ్వకపోవచ్చు. ఆ లోపు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పరిస్ధితి ఎలా వుంటుందా? అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ సుప్రింకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఆ ఎమ్మెల్యేలపై ప్రజల్లో మరింత తీవ్రత పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. కండువాలు మార్చినా జై కాంగ్రెస్ అనలేకపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు దగ్గర కాలేకపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొంత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆదరించడం లేదు. ముఖ్యంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేగా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. అభివృద్ది పనులపై ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ నాయకులే ఆయనను అడ్డుకుంటున్నారు. అలాంటి ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడితే ఇక కాంగ్రెస్ కూడా ఆయనను ఆదరించదు. ఆయనకు టికెట్ ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసినా సరే కాంగ్రెస్ నాయకులు వినే పరిస్దితి వుండదు. ఎందుకంటే గెలిపించాల్సింది ప్రజలు, నాయకులు, కార్యకర్తలే. వారిని ఒత్తిడి తెచ్చి గూడెంకు మళ్లీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం కుదిరేపని కాదు. కచ్చితంగా ఆయన స్ధానంలో మరొకరికి టికెట్ ఇవ్వకతప్పదు. కార్యకర్తలే తిరుగుబాటు చేస్తుంటే జై కాంగ్రెస్ అనలేకపోతున్నాడు. అలా అని బిఆర్‌ఎస్ మీద విమర్శలు చేయలేకపోతున్నాడు. సహజంగా పార్టీ మారిన తర్వాత ప్రత్యర్ధి పార్టీని టార్గెట్ చేయకుండా రాజకీయాలు చేస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరు. గుంపులో చేరిన తర్వాత ఆ పార్టీ నినాదాలను అందుకోవాలి. కాని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరూ అటు కేసిఆర్‌ను గాని, ఇటు ఇతర నాయకులపై గాని ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. పార్టీ మారడానికి తొలి అడుగు వేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే తొలి రోజుల్లో కొంత దూకుడు ప్రదర్శించాడు. సాక్ష్యాత్తు అసెంబ్లీలోనే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్నారు. తర్వాత ఆయన కూడా బిఆర్‌ఎస్ మీద మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. అంతే కాదు ఇటీవల కాలంలో కేసిఆర్ గొప్ప నాయకుడు. భోళా శంకరుడు అంటూ కితాబిస్తున్నారు. బిఆర్‌ఎస్ నాయకులనేద్దేశించిన వ్యాఖ్యలపై కేటిఆర్‌ను కలిసి వివరణ కూడా దానం నాగేందర్ ఇచ్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక హైడ్రా విషయంలో దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తితో వున్నారు. కాంగ్రెస్‌లో చేరినా తన మాట చెల్లుబాటు కావడం లేదని మధనపడుతున్నాడు. బిఆర్‌ఎస్ నుంచి వచ్చి, సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేసి కాంగ్రెస్ కోసం త్యాగం చేస్తే తనను గుర్తించేవారు లేకుండాపోయారని అనుకుంటున్నారట. ఇదిలా వుంటే సుప్రింకోర్టు ఒక వేళ దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని భర్తరఫ్ చేస్తే రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడినట్లే అని చెప్పకతప్పదు. పది మంది ఎమ్మెల్యేల భర్తరఫ్ జరిగితే మాత్రం టికెట్ రాని వారిలో దానం నాగేందరే మొదటి వ్యక్తి అవుతారని చెప్పడంలో సందేహం లేదు. సరే మంచో చెడో పార్టీ మారడం జరిగింది. పరిరిస్దితి చేయి దాటిపోయింది. కాంగ్రెస్ పార్టీలోనైనా పూర్తిగా కలిసిపోతున్నారా? అంటే అదీ లేదు. తమకు ఎలాంటి ప్రాదాన్యత లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నా బిఆర్‌ఎస్‌పై ఇప్పటి వరకు పల్లెత్తు మాట అనని నాయకులు మళ్లీ తమకు కారులో చోటు దక్కుతుందన్న ఆశతో వున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. అదే జరిగితే ప్రజలు కాంగ్రెస్‌కన్నా ముందు బిఆర్‌ఎస్‌నే చీదరించుకుంటారు. ఉప ఎన్నికలే వస్తే బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు. అప్పుడు బిజేపికి బంగారు పళ్లెంలో ఎమ్మెల్యేలను అందించినట్లౌవుంది. నిజం చెప్పాలంటే రెండు వైపులా దారులు మూస్తే తప్ప భవిష్యత్తులో ఇలా పార్టీ మారడానికి ఎమ్మెల్యేలు ముందుకు రారు. ప్రజా ప్రభుత్వాలను అసి ్దరపర్చాలనుకోవడం రాజకీయ పార్టీల అనైతిక రాజకీయాలకు పరాకాష్ట. అలాంటి రాజకీయాలను ఎవరూ సహించకూడదు. సమర్ధించకూడదు. పార్టీ మారారు.. కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కకపోయినా పదవి ఊడిపోకుండా వుంటే చాలని కోరుకుంటున్నారు. పొరపాటున ఉప ఎన్నికలు వస్తే మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చుక్కలు చూడడం తప్పదు. ఎందుకంటే ఇప్పటికప్పుడు సమీపంలో ఎన్నికలు లేవు. ఓ ఆరు నెలల సమయంలో కేరళ రాష్ట్ర ఎన్నికలున్నాయి. అప్పటి వరకు ఉప ఎన్నికలు రాకపోవచ్చు. అప్పటి వరకు పార్టీ మారిన ఎమ్యెల్యేలు ప్రజల్లో వుండాలంటే దూల తీరిపోతుంది. ప్రజలు ఎన్నికల వాగ్ధానాల మీద నిలదీస్తుంటారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ అంటూ వెళ్తే అడుగడుగునా సమాధానం చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఆదరించడం లేదు. ఇక ప్రజలు కూడా దూరం కొడితే వారి రాజకీయం శంకగిరి మాన్యాలే. ఆరు నెలల పాటు కార్యకర్తల సాధకబాధకాలు చూసుకోవాలి. ఎమ్మెల్యేగా వున్నప్పుడు నాయకులు, కార్యకర్తలు ఇంటి ముందు వచ్చి వాలుతారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలే పార్టీ కార్యకర్తల ఇంటి ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురౌతుంది. సరే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా మూడు నెలుల వుంటేనే ఊపిరి సలపకుండాపోతుంది. అలాంటిది ఆరు నెలల కాలమంటే ఇక ఎమ్మెల్యే అభ్యర్ధులు ఆస్దులమ్ముకొవాల్సిందే. రాజకీయాలు చేయాల్సిందే. వారి కష్టాలు తీర్చేవారు కూడా ఎవరూ వుండరు. ప్రజల్లో వుంటూ, ప్రజలకు సేవ చూస్తూ, వారి మాటల పడుతూ, అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటూ వెళ్లినా, ఆఖరు నిమిషంలో టికెట్ దక్కకపోతే ఆ బాధ ఊహిస్తేనే భయంకరంగా వుంటుంది. ఈ సంగతి వాళ్లకు కూడా తెలుసు. అయినా తప్పదు. తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సి వుంటుంది. ప్రత్యర్ధి పార్టీలు నిత్యం వేసే నిందలను భరించాలి. ప్రజలను రెచ్చగొట్టి చేసే రాజకీయాలను ఎదుర్కొవాలి. ఎటు చూసినా మద్దెల వాయింపు తప్పదు. ఆరు నెలల పాటు కడుపు నిండా తిండి వుండదు. కంటి నిండా నిద్ర వుండదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చి నెత్తి మీద పడుతుందో తెలియదు. ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారానికి వస్తే సమయం ఇవ్వకపోతే ప్రజల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత మామూలుగా వుండదు. అసలే సోషల్ మీడియా కాలం. ఆ పది మంది ఎమ్మెల్యేల చుట్టూ నిత్యం వందలాది సోషల్ మీడియా ప్రతినిధులు వుంటారు. ఎమ్మెల్యేలను వెంటాడుతుంటారు. వారు ఎక్కడికెళ్లితే అక్కడికి వాలిపోతారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద కూడా కొంత మంది ఎప్పుడూ సిద్దంగా వుంటారు. ప్రతి నిమిషాన్ని వివాదం చేయడానికి సిద్దంగా వుంటారు. పిరాయింపు ఎమ్మెల్యేలు పొరపాటున ఎవరి మీద నైనా అసహనం వ్యక్తం చేసినా, ఆ ఎమ్మెల్యే మీద ప్రజలు ఏవైనా వ్యాఖ్యలు చేసినా ఇక సోషల్ మీడియాలో కనిపించే వాయింపు ఓ రేంజ్‌లో వుంటుంది. ఇన్ని రకాల అవరోధాలును ఎదుర్కొని, సమస్యల వలయాన్ని చేధించుకొని నిలిచేదెవరో..గెలిచేదెవరో.. చూడాలి.
అన్ని పార్టీలకు చెందిన కొందరు నాయకుల మెడకు చుట్టుకుంటున్న వైనం
ఎా3గా మాజీ హైకోర్టు న్యాయమూర్తి
30వేల మంది బాధితులు
నిఘా నీడలో రాష్ట్రంలోని ప్రముఖులు
నేటిధాత్రి డెస్క్:
‘‘నన్ను మోసం చేశాడు’’ అని అనడం తప్పు. ఎందుకంటే నువ్వు మోసపోయే అవకాశం పక్కవాడికి ఇచ్చావు కనుక మోసంచేసాడు. అంటే లోపం నీదగ్గరే వుంది. అందువల్ల మోసపోయేవాడున్నప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడూ వుంటాడు! మోసపోవడానికి ప్రధాన కారణం ‘ఆకర్షణ’. సహేతుకంగాలేని ‘ఆకర్షణ’కు లోబడటం మానవుల సహజ బలహీనత! దీన్నే మోసగాళ్లు సావ కాశంగా తీసుకుంటున్నారు. ఇటువంటి ప్రలోభపూరిత ‘ఆకర్షణలకు’ మహిళలే తేలిగ్గా ఎరగా మారుతుంటారు. ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతం కేరళలో స్వచ్ఛంద సంస్థ ముసుగులో 26ఏళ్ల యువకుడు మొత్తం 14 జిల్లాలకు చెందిన ప్రజలను రూ.వెయ్యికోట్ల మేర మోసం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విచిత్రమేమంటే అతనికి ప్రచారం విపరీతంగా వస్తున్న నేపథ్యంలో, అతనితో కలిసి ఫోటోలు దిగిన లేదా సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులల మెడకు కూడా ఇది చట్టుకోవడంతో కేరళను ఈ స్కాం కుదిపేస్తోంది. కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.ఎన్. రామచంద్రన్ పేరు ఈ కేసులో మూడో నిందితుడిగా వుండటం మరో విచిత్రం! అయితే రాజకీయ నాయకులు, ఈ మాజీ న్యాయమూర్తి తమకు ఈ స్కాంతో ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నారు. ఈ మొత్తం స్కాంకు మూలకారకుడు 26 సంవత్సరాల యువకుడు అనందు కృష్ణన్. మువ్వత్తుప్ఫూజ సామాజిక`ఆర్థిక అభివృద్ధి సొసైటీ పేరుతో ఇతను నడిపిన స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ)కు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను ఇప్పుడు కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రారంభంలో 34 కేసులు క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేసినప్ప టికీ ఇవి 30వేలు దాటవచ్చని, బాధితుల సంఖ్య లక్షవరకు వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ స్కాం విలువ రూ.వెయ్యికోట్లు దాటడంతో కేరళ స్టేట్ పోలీస్ చీఫ్ (ఎస్‌పీసీ) షేక్ దర్వేష్ సాహెబ్ కేసును క్రైమ్ బ్రాంచ్‌కి అప్పగించారు.
సగం ధరకే వస్తువులు
మొదట్లో సగం ధరకే స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, కుట్టుమిషన్లు అందజేస్తానని అనందు కృష్ణన్ విపరీతంగా ప్రచారం చేశాడు. ‘‘తనవద్ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ (సీఎస్‌ఆర్)లు వున్నాయని, మీరు సగం ధర చెల్లిస్తే, మిగిలిన సగం ధరను తనవద్ద ఉన్న సీఎస్‌ఆర్ నిధులనుంచి చెల్లిస్తానని నమ్మబలికాడు. దీనికి విపరీత ప్రచారం కల్పించడంతో జనాలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఇతని చేతిలో పెట్టి చివరకు నిండా మునిగినట్టు తెలుసుకొని ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఇప్పుడు అనందు కృష్ణన్ స్కామ్ కేరళలోని ప్రధాన రాజకీయ ఫ్రంట్‌ల మెడకూ చుట్టుకుంది. అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ మరియు బీజేపీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులకు అనందు కృష్ణన్ నుంచి నిధులు అందాయని ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఆయా పార్టీల్లో కలకలం రేగింది. ఇప్పుడు కృష్ణన్‌తో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గన్న ఆయా పార్టీల నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివరణ
కాంగ్రెస్ ఎమ్మెల్యే మ్యాథ్యూ కుజల్‌నందన్‌కు ఏకంగా రూ.7లక్షలు కృష్ణన్ నుంచి అందాయని మళయాలం టీవీ ఛానల్ సోమవారం కథనాన్ని ప్రసారం చేయడంతో అసెంబ్లీలో దుమారం రే గింది. దీంతో ఆయన టీవీ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అసెంబ్లీలో ప్రకటించారు. ‘‘ఈ సంస్థలో కొంత మొత్తం డిపాజిట్ చేశామని, దీనికి సంబంధించి సంస్థ ఇచ్చిన హా మీ మేరకు తమకు వస్తువులు అందలేనది, నా సన్నిహితుడు తెలిపాడు. ఆయనతో పాటు మరి కొందరు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని నాకు చెప్పాడు’’, నాకు ఇంతవరకే తెలుసని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఇక కేరళలో సాయి ట్రస్ట్ ఛైర్మన్ కె.ఎన్. ఆనంద్‌కుమార్‌కు అనందు కృష్ణన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనపై నిఘా పెట్టాయి. ఈయన కేరళలో చాలా పేరున్న సామాజికవేత్త! ‘‘నేనెక్కడికీ పారిపోలేదు. వచ్చిన నిధులన్నింటికీ సక్రమంగా లెక్కలున్నాయి. అన్నీ చట్టపరిధిలోనే జరిగాయి’’ అని ఆయన తెలిపారు. ఇక ఈకేసులో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.ఎన్. రామచంద్రన్ నాయర్ పేరుకూడా వుండటంతో, ‘‘కృష్ణన్ సంస్థకు తాను ప్యాట్రన్‌గా ఎప్పుడూ వ్యవహరించలేదని, ఒకప్పుడుసంస్థకు సలహాదారుగా వ్యవహరించినప్పటికీ, ఆ పోస్ట్‌కు ఎప్పుడో రాజీనామా చేశాను’’ అని చెప్పారు.
హాఫ్ ప్రైజ్‌ాస్కామ్
కేరళను కుదిపేసిన ఈ రూ.1000కోట్ల స్కామ్‌ను ఇప్పుడు ‘‘హాప్ ప్రైజ్‌ాస్కామ్’’గా పిలుస్తున్నా రు. సగంధరకే వస్తువులు అందిస్తామని ప్రచారం చేయడంతో దీనికి ఈ పేరు స్థిరపడిపోయింది. స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలను సగం ధరకే ఇస్తామని, మిగిలిన సగం మొత్తా న్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ (సీఎస్‌ఆర్)నుంచి చెల్లిస్తామని ప్రచారం చేయడంతో ప్రజలు నమ్మారు. ప్రజలను నమ్మించడానికి కృష్ణన్ రాష్ట్రంలోని ఇతర ఎన్.జి.ఒ.ల పలుకుబడినికూడా చక్కగా ఉపయోగించుకోవడం, ప్రజల్లో విశ్వసనీయత రావడానికి ప్రధాన కారణం. అసలు సీఎస్‌ఆర్ నిధులు లేనేలేవని విచారణాధికార్లు స్పష్టం చేశారు.
ఎవరీ అనందు కృష్ణన్
అనందు కృష్ణన్ ఇడుక్కి జిల్లా తొడుప్పుజాకు చెందినవాడు. ప్రస్తుతం అతనిపై అనేక కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణన్‌కు గతంలో మోసపూరిత చరిత్ర వున్నదని, ఇప్పుడు దాదాపు 30వేల మంది బాధితులనుంచి డబ్బును సేకరించేందుకు రెండు డజన్లకు పై గా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్టు విచారణాధికార్లు నిర్ధారించారు. మీడియా కథనాల ప్ర కారం ఇడుక్కిలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అనందు కృష్ణన్, తన స్థానిక పరిచయాల నేపథ్యం లో కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఒక పంచాయతీ సభ్యుడు చెప్పిన ప్రకారం కృష్ణన్ తన స్వచ్ఛంద సంస్థలకు సర్దార్ పటేల్, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల పేర్లు పెట్టేవాడు. ఇతని తండ్రి కార్పెంటర్. తల్లి రాష్ట్ర పౌరసరఫరా విభాగంలో పనిచేస్తున్నారు. ఎన్.జి.ఒ.ను ప్రారంభించిన తర్వాత కృష్ణన్ జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. లగ్జరీ కార్లు, ఆ స్తులు కొనుగోలు చేశాడు. ఒక్క డిసెంబర్ నెలలోనే అనందు కృష్ణన్ ఢల్లీి ప్రయాణాలకు రూ.338,000, అక్కడ విలాసవంతమైన హోటళ్లలో బసకు రూ.366,000 ఖర్చు చేసినట్టు విచారణ అధికార్లు వెల్లడిరచారు. కృష్ణన్, అతని సంస్థలకు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను అధికార్లు గుర్తించారు.
తన గ్రామంలోని వారికి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు అందజేశాడు. ఆవిధంగా ఒకపక్క పెరుగుతున్న సంపదతో పాటు ఫిర్యాదులు కూడా పెరగడం మొదలైంది. కృష్ణన్ స్కీమ్ ప్రాథమికంగా ‘సీడ్ సొసైటీలు’, ‘కన్సల్టెన్సీల’ ద్వారా జరిగింది. మొదట్లో కొత్త అప్లికేషన్ల ద్వారా వచ్చిన మొత్తంతో ఏకమొత్తంగా స్కూటీలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశాడని, ఈ కొనుగోళ్లకు అతనికి కమిషన్ కూడా ముట్టిందని పోలీసులు తెలిపారు.
నేషనల్ ఎన్జీఓస్ ఫెడరేషన్‌కు తాను కొఆర్డినేటర్‌గా కొనసాగడం కూడా ప్రజల్లో అతనిపట్ల వి శ్వాసం పెరగడానికి మరో కారణం. ఈ హోదాలోనే సీఎస్‌ఆర్ ఫండ్స్ తనకు వస్తాయని ప్రజలకు నమ్మబలికాడు. అందుకనుగుణంగా తొలినాళ్లలో అందరికీ వారికి కావలసిన ఉత్పత్తులను సరఫరా చేసి స్కీమ్ పట్ల నమ్మకాన్ని కలిగించాడు. క్రమంగా కృష్ణన్ ప్రజలకు ఉత్పత్తులను అందించలేకపోవడంతో, ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇదిలావుండగా స్థానిక రాజకీయ నాయకులతో ఇతనికున్న సంబంధాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కృష్ణన్ దెబ్బకు రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులు, నేషనల్ ఎన్జీవో కాన్ఫిడరేషన్ సభ్యులు, రాజకీయనాయకులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో వున్నారు. విచారణలో తాను రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చానని కృష్ణన్ ఒప్పుకోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇందులో సీఎస్‌ఆర్ ఫండ్స్‌ను వినియోగించామని చెప్పినప్పటికీ, వీరు చెబుతున్న కంపెనీలకు అసలీవిషయమే తెలియకపోవడం విశేషం. చివరకు అసలు సీఎస్‌ఆర్ నిధులనేవే లేవని పోలీసులు తేల్చారు.
– కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
మాజీ మంత్రి హరీష్ రావు మతిభ్రమించి వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడుతున్నాడని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం నామాపూర్ కు చెందిన నకీర్తి కనకవ్వకు 31 భూమి ఉంటే 1600 లు మాత్రమే రైతు భరోసా ఆమె ఖాతాలోకి వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొనడం సిగ్గుచేటని మహేందర్ రెడ్డి అన్నారు. వాస్తవాలను పరిశీలించడం జరిగిందని 589, 943 సర్వేనెంబర్ లలో ఆమెకు 11 గుంటల భూమి మాత్రమే ఉందని ఆ భూమికి సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం 1650 రూపాయలు చెల్లించిందని ఆ మహిళా రైతుకు వచ్చే రైతు భరోసా అంతేనని ఆయన పేర్కొన్నారు ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మానుకోవాలని మీపై ప్రజలకు నమ్మకం లేకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అయినా ఇంకా బుద్ధి రావడం లేదని మహేందర్ రెడ్డి అన్నారు. రైతు భరోసాలో ప్రభుత్వం కోతలు విధిస్తుందని అనడం హరీష్ రావు కు సిగ్గుగా అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని అది జరగదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మీ ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినప్పుడే బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూసిన ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలకు సెంటిమెంట్ పెరిగితే డిఎంకె అధికారానికి ముప్పే
సెంటిమెంట్ సునామీని నాస్తికవాదం ఎదురొడ్డటం కష్టం
హిందువులపై కఠినచర్యలు ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశమే
హైదరాబాద్,నేటిధాత్రి:
బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని, ఒక ప్రాంతానికే పరిమితమైనవని భావించే కొన్ని సంఘటనలు ఒక్కసారి విస్ఫోటం చెంది చరిత్రగతిని మార్చిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అయితే అవి కొన్ని వర్గాల విశ్వాసాలను ప్రభావితం చేసేవిగా వుంటే వాటి పరిణామం చాలా తీవ్రం గావుంటుందనేది అక్షరసత్యం. ఇందులో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజలే నాయకులుగా తమ విశ్వాసాలను కాపాడుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో సరిగ్గా ఇదే జరుగు తోంది. ఇప్పటివరకు దేశంలోని ఇతర ప్రాంతాలకు పెద్దగా పరిచయంలేని తిరుపరన్‌కుండ్రం మురుగన్ దేవాలయం వివాదం ఒక్కసారిగా పతాక శీర్షికలకెక్కింది. ఉత్తరాదిలో అయోధ్య ఉద్యమంలాగా దక్షిణాది రాజకీయాలను సమూలంగా మార్పుచేసే దిశగా ఈ ఉద్యమం రూపుదిద్దు కుంటుందేమోనని తమిళనాడు డి.ఎం.కె.సర్కార్ భయపడుతోంది. పూర్తి నాస్తిక వాదులుగా చె ప్పుకునే డి.ఎం.కె నాయకులు ఎన్నికలప్పడు మాత్రం మురుగన్ దేవాలయాల చుట్టూ తిరిగి, వేలాయుధాన్ని చేతుల్లో పట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ద్రవిడవాదం ముసుగులో మైనారిటీల బుజ్జగింపు, హిందువుల పట్ల వివక్ష కొనసాగిస్తూరావడం వీరి ప్రవృత్తి. దక్షిణాది రాజకీయాలను ఇప్పుడు తిరుపరన్‌కుండ్రం ప్రభావితం చేయనున్నదని ద్రవిడవాదాన్ని భుజాన వేసుకున్న డి.ఎం.కె నాయకులే చెబుతున్నారు. తిరుపరన్‌కుండ్రం దేవాలయ వివాదం తమిళనాడు వ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం కలిగిస్తే తమ పుట్టి మునగడం ఖా యమనివారు భయపడుతున్నారు. ఫిబ్రవరి 4న మదురైలోని పాలంగనాథమ్ కూడలివద్ద ఈ ఆలయవివాదంపై 50 హిందూ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. లక్షలాది మంది స్వచ్చందంగా ఈ నిరసనలో పాల్గనడం ఇప్పుడు డి.ఎం.కె. ప్రభుత్వానికి మింగుడు పడటంలేదు. ముఖ్యంగా వేల సంవత్సరాలకాలంగా తిరుపరన్ కుండ్రం కొండపై మురుగన్ దేవాలయం వుంది. ఇప్పుడు ఈ కొండను కొందరు ఇస్లామిస్టులు తమకు చెందినదిగా వాదిస్తుండ టం ఉద్రిక్తలకు కారణమవుతోంది. ప్రస్తుతం ఈ వివాదాన్ని తమిళనాడు వ్యాప్తంగా ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకెళుతోంది. మరో ఏడాదిన్నర కాలంలోగా తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో స్కంధమలై వివాదం డిఎంకె మెడకు ఉరితాడు కాబోతున్నదా లేక పూలహారం కాబోతున్నదా అనేది కాలమే చెబుతుంది.
అసలు వివాదమేంటి?
2024 డిసెంబర్ చివరివారంలో మలైయదిపట్టికి చెందిన సయ్యద్ అబు దహీర్ (53) అనే వ్యక్తితన కుటుంబంతో సహా దర్గావద్దకు మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చాడు. ఒక గొర్రె, రెండు కోడిపుంజులను ఇక్కడ బలివ్వడానికి తనతో కూడా తీసుకువచ్చాడు. అయితే కొండ దిగువభా గంలో పోలీసులు వారిని అడ్డుకొని, జంతువులను బలివ్వడానికి పైకి తీసుకెళ్లకూడదని చెప్పారు.సరిగ్గా అప్పుడే స్థానిక 20 ముస్లిం కుటుంబాలు అక్కడికి చేరుకొని, సయ్యద్ అబు దహీర్‌కు మద్దతుగా నిరసనకు దిగారు. జంతువులను బలిచ్చి, వాటి మాంసాన్ని వండుకొని తినడం తమ సంప్రదాయమని వారు వాదించారు. ఇందుకోసం ఒక ఫిర్యాదు ఇచ్చినట్లయితే తగిన నిర్ణయం కోసం ప్రభుత్వానికి పంపుతామని అధికార్లు నచ్చజెప్పినా వారు వినకుండా తమ నిరసనను కొ నసాగించారు. చివరకు పోలీసులు ఆ జంతువులను తెచ్చినవారితో సహా పదిమందిని అదుపులోకి తీసుకొని తర్వాత విడుదల చేశారు. అయితే ఈ సంఘటన ఈ ప్రాంతంలో ఉద్రిక్తలకు దారి తీసింది. ముస్లింలెవరూ బలివ్వడానికి కొండపైకి తీసుకెళ్లడానికి వీల్లేదని జనవరి 22న మదురై పోలీసులుకచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. వండిన మాంసాన్ని తీసుకెళ్లి దర్గావద్ద భుజించవ చ్చునని వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారాన్ని తింటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ వివాదం రగిలింది. ఈ నేపథ్యంతో తమిళనాడులో బలంగా వున్న హిందూ మున్నాని సంస్థ తిరుపరన్ కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 4ననిరసన ప్రదర్శనలుచేపట్టాలని నిర్ణయించింది. అధికార్లు ఇందుకు అనుమతినివ్వలేదు సరికదా ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలో నిషేధాజ్ఞలు విధించారు. దీంతోమదురై ప్రాంత హిందూమున్నాని గ్రూపు ప్రధాన కార్యదర్శి ఎస్. కళానిధిమారన్ మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌కు ఒక పిటిషన్ దాఖలు చేస్తూ ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3గంటలనుంచి రాత్రి 9.45 గంటలవరకు ‘‘16 కాల మండపం’’ వద్ద తాము నిర్వహించ తలపెట్టిన నిరసనకుఅనుమతినివ్వాలని అభ్యర్థించారు. హైకోర్టు బెంచ్ ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పాలంగనాథమ్ కూడలివద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యకాలంలో నిరసనలు తెలుపుకోవడానికి అనుమతించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయకూడదని కోర్టు హెచ్చరించింది. అనుకున్న ప్రకారమే లక్షలాది హిందువులు పాలంగనాథమ్ కూడలివద్ద తమనిరసనలనుతెలియజేశారు. కాగా ఈ నిరసరన ప్రదర్శనల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, హిందూ ము న్నాని, హిందూ ఫ్రంట్, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గన్నారు.తిరుపరన్ కుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా వీరు నినా దాలిచ్చారు. ఈ నిరసన ప్రదర్శన సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. ఈ సందర్భం గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమిళనాడు ప్రభుత్వం సుమారు నాలుగువేలమంది పోలీసులను మోహరించింది.
డీఎంకే వర్సెస్ బీజేపీ
ప్రస్తుతం ఈ ప్రదర్శన వివాదంపై తమిళనాడులో డిఎంకె వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడులో హిందూ ముస్లింలు సహోదరుల్లాగా మెలుగుతున్నారని, బీజేపీ మత విద్వేసాలను రెచ్చగొడుతున్నదంటూ రాష్ట్ర హిందూ రిలిజియస్ అండ్ చారిటీస్ ఎండోమెంట్ మంత్రి పి.కె. శేఖర్‌బాబు ఆరోపించారు. 1931నాటి బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్ ఇచ్చిన తీర్పుతో పా టు ప్రస్తుతం 2023 నుంచి రెండు కేసులు కోర్టులో పెండిరగ్‌లోవున్న విషయాన్ని గుర్తుచేశారు.తమ ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై ర్యాలీ శాంతియుతంగా జరిగిందని, ఎక్కడా అల్లర్లు లేదా బస్సు దహనాలు, వి ధ్వంసం వంటివి చోటుచేసుకోలేదన్న సంగతిని గుర్తుచేశారు. 1931నాటి బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్ హిందువులకు అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతిని గుర్తుచేస్తూ, (అప్పటి ప్రీవీకౌన్సిల్ కొండపై మాంసాహారాన్ని వండటం, తినడం, జంతువుల బలి ఇవ్వడం నిషేధమని స్పష్టంగా తీర్పు చె ప్పింది. స్వాతంత్రానంతరం ద్రవిడ ప్రభుత్వాలు కొండపైకి మాంసాన్ని తీసుకెళ్లడాన్ని అనుమతి స్తూ వచ్చాయి) ప్రభుత్వం అసలు విషయాన్ని మరుగున పరచవద్దని చురకలంటించారు. ర్యాలీ లో పాల్గనకుండా తమిళనాడు వ్యాప్తంగా 350ప్రదేశాల్లో బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారని, ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. రామనాథపురం ఎం.పి. నవాజ్‌ఖని గ్రూపుకు చెందినవారే ఈ వివాదానికి కారణమని ఆయన ఆరో పించారు.అయితే ఖని ఈ ఆరోపణలను ఖం డిరచారు.ఇదిలావుండగా కలెక్టర్ ఎం.ఎస్. సంగీత మాట్లాడుతూ, స్థానిక ప్రజలు శాంతియుతంగానే వున్నారని, బాహ్య శక్తులవల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఆలయం ఎగువన కొండపై వున్న దర్గావద్ద ‘కందూరి’ (జంతుబలి)కి అనుమతినివ్వాలని గతంలో రెండు సార్లు ముస్లింలు కోరినా అందుకు అనుమతించలేదన్న సంగతి గుర్తుచేశారు. మాతా నల్కినక్క అమైప్పుగళ్(మతసామరస్యానికి కృషిచేస్తున్న గ్రూపు) సంస్థ మతసామరస్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అప్పీల్ చేసింది. కాగా అడ్వకేట్ ఎస్. ముత్తుకు మార్, 2012లో కొండపైబాంబులు దొరికిన కేసుతో సహా జంతుబలి, మాంసాహర సేవనానికి సంబంధించిన అన్ని కేసులను ఎన్.ఐ.ఎ.కు బదిలీచేయాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. ఇక బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మహణ్యస్వామి మాట్లాడుతూ కొండపైనుంచి దర్గానుమరో ప్రదేశానికి తరలించడమే సమస్యకు పరిష్కారమన్నారు. నమాజ్ ఎక్కడైనా చేయవచ్చునని, ప్రజాప్ర యోజనార్థం ప్రభుత్వం మసీదులను వేరేచోటికి తరలించడానికి లేదా కూలగొట్టడానికి షరియాచట్టం అనుమతిస్తుందన్న సంగతిని గుర్తుచేశారు. అంతేకాదు దర్గాను ఎక్కడికి తరలి స్తే బాగుంటుందో సలహా ఇచ్చే బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించాలని కూడా ఆయన కోరారు. రామనాథపురం ఎం.పి. నవాజ్‌ఖని మాట్లాడుతూ ‘దశాబ్దాలు గా ముస్లిం భక్తులు గొర్రెలు, మేకలు, కోళ్లను కొండపైకి తీసుకెళ్లి బలిస్తుండటం కొనసాగుతోంది. వండిన మాంసం తీసుకెళ్లడమనేది కేవలం తాత్కాలిక ఆదేశాలు మాత్రమే. నేను మదురై పోలీసులతో మాట్లాడతాను. అదీకాకుండా కొండ పై ఉన్న ఈ దర్గా వక్ఫ్ ఆస్తి’ అని స్పష్టం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ముస్లింలు ఈ కొండపేరును ‘‘సికిందర్ మలై’’గా మార్చాలన్న తమ డిమాండ్‌ను మళ్లీ పైకి తీసుకొచ్చారు.
తిరుపరన్‌కుండ్రం చరిత్ర
తిరుపరన్ కుండ్రం లేదా తిరుప్పరన్ కుండ్రం దేవాలయం మదురై నగరానికి సమీపంలో వుంది. మదురైలోని పెరియార్ సెంట్రల్ బస్టాండ్‌కు సరిగ్గా ఏడుకిలోమీటర్ల దూరం. తిరుపరన్‌కుండ్రం 1028 అడుగుల ఎత్తైన ఏకశిలతో ఏర్పడిన కొండ. ఈ పర్వతాన్ని హిందువులు అతి పవి త్రమైనదిగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రాచీన శైవమతానికి చెందిన గుహలున్నాయి. ఈ కొండను హిందువులు ‘స్కందమలై’గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో శైవం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో క్రీ.శ.7 నుంచి క్రీ.శ15వ శతాబ్దం మధ్యకాలంలో ఈకొండ ఉత్తరభాగంలో మండపాలు, ఆలయాలను పలు హిందూ రాజవంశాలు నిర్మించాయి. ఆవిధంగా నిర్మితమైన అతిపెద్ద దేవాయలయ సముదాయం తిరుపరన్‌కుండ్రం మురుగన్ ఆలయంగా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని ఆరు ప్రముఖ మురుగన్ దేవాలయాల్లో (అరుపడై వీడు) దీన్ని మొట్టమొదటిగా పరిగణిస్తారు. మదురై వెళ్లినవారు మీనాక్షి అమ్మవారి దర్శనం తర్వాత తప్పకుండా ఈ మురుగన్ ఆలయాన్ని దర్శిస్తారు. ఇదే కొండ పై క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీ॥శ. 2వ శతాబ్దం మధ్యకాలం నాటి జైనుల తమిళ బ్రహ్మీలిపి శాసనాలు కూడా ఇక్కడ వున్నాయి. కొండకు దక్షిణాన సరస్వతీ తీర్థం వుంది. ఇక్కడే తిరుప్పరన్‌కుండ్రం రాతి గుహాలయాలున్నాయి. ఇక్కడ ప్రాచీన జైనదేవాలయాన్నే క్రీ॥శ ఏడవ శ తాబ్దంలో శివాలయంగా మార్చి, 13వ శతాబ్దం నాటికి దీన్ని పూర్తిగా విస్తరించారని చెబుతారు. కొందరు హిందువులు ఈ కొండచుట్టూ ప్రదక్షిణం చేయడం సర్వపాపాలను హరిస్తుందని నమ్ముతారు.
ఢల్లీి సుల్తానులు తిరుపరన్‌కుండ్రరామదురై ప్రాంతాల్లో లూటీలుాదహనాలకు పాల్పడి విచ్చల విడి విధ్వంసం సృష్టించారు. 14వ శతాబ్దం తర్వాత తమిళనాడులో ఇస్లామిక్ సుల్తానేట్‌ను ఏ ర్పాటు చేయాలని ఢల్లీి సుల్తానులు ప్రయత్నించారు. దీన్నే మదురై సుల్తానేట్‌గా వ్యవహరించారు.అయితే ఈ సుల్తానేట్ ఎక్కువకాలం మనుగడలో లేదు. ఈ సుల్తానేట్‌కు చెందిన చివరి పాలకుడు సికిందర్ షా అతని సైనికాధికార్లను 1377లో విజయనగర రాజులు తిరుపరన్‌కుండ్రమ్‌లో వధించి, వారి పాలనకు అంతం పలికారు. అయితే సికిందర్ షాకు ఇక్కడ సమాధిని నిర్మించు కోవడానికి విజయనగర పాలకులు అప్పట్లో అనుమతించారు. దీంతో ఈ సమాధి నిర్మాణం తి రుపరన్ కుండ్రం ఉత్తరభాగంలో 14, 15శతాబ్దాల్లో జరిగింది. క్రమంగా 17, 18 శతాబ్దాల కాలంలో ముస్లింలు ఈ సమాధిని క్రమంగా దర్గాగా మార్పుచేసి మరింత విస్తరించారు. దీన్నే ఇప్పుడు తిరుపరన్‌కుండ్రం దర్గా అని పిలుస్తున్నారు.
కార్తీకదీపానికీ అనుమతి లేదు
ఇక్కడ కాశీవిశ్వనాథర్ దేవాలయం వద్ద వున్న స్థూపంపై కార్తీకదీపాన్ని పెట్టే సంప్రదాయానికి అనుమతివ్వాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలానికి ముందు వరకు ఇక్కడి స్థూపంపై కార్తీకదీపం పెట్టేవారు. ఆ యుద్ధకాలంలో దీపం పెట్టడం కొన్ని కారణాలవల్ల నిలిచిపోయింది. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ దీపం పెట్టడానికి అనుమతించలేదు. మరెక్కడైనా పెట్టుకోవచ్చని చెప్పినా అది ఆగమశాస్త్ర విరుద్ధమని హిందువుల వాదన. అయితే ఈ విశ్వనాథర్ దేవాలయానికి వెళ్లే దారిలో నమాజ్‌లు చేసిన సంఘటనలు కూడా పెరిగాయి. ఆవిధంగా ఆలయానికి వెళ్లే దారిలో నమాజ్‌లు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వడానికి మద్రాస్ హైకోర్టు ఇటీవల తిరస్కరించింది. ఇదిలావుండగా, క్రమంగాకొండపై ఆక్రమణలు పెరుగుతున్నాయని హిందువులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా శివగంగలోని కరైక్కుడికి చెందిన అన్నానగర్‌ల ఫిబ్రవరి 3న జరిగిన ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో కొందరు ముస్లిం మహిళలు పాల్గనడం విశేషం. ‘‘లలితా ముత్తుమారియన్ ములైకొట్టు తిన్నై’’ దేవాలయంలో ‘‘సీర్‌వారిసై’’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గనడం వీరికి హిందువులు ఆహ్వానం పలకడం కొసమెరుపు!
`ప్రజా రాజ్యం ఏర్పాటు తర్వాత ఇక సినిమాలు చేయను అన్నారు!
`జెండా పీకేసిన తర్వాత ఇక సినిమానే నా ప్రపంచం అన్నారు.
`ఇక రాజకీయాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించారు.
`మళ్ళీ ఆశలు చిగురించినట్లున్నాయి.
`ప్రజా రాజ్యం కలలింకా కదులుతున్నట్లే వున్నాయి.
`జనసేన తో మళ్ళీ తన ప్రయాణం మొదలుపెట్టనున్నారు.
`దక్షణాదిన బిజేపికి వెన్నుదన్నుగా నిలువనున్నారు.
పార్లమెంటు చరిత్రలో 1985 తర్వాత పూర్తి స్దాయి మెజార్టీతో 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా, మూడోసారి కూడా దాదాపు పూర్తి మెజార్టీకి దగ్గరగా గెలిచిన భారతీయ జనతాపార్టీకి దక్షిణాదిలో బలపడేందుకు ఏదో ఒక ప్రాంతీయ పార్టీ తోడు కావాలా? ఆ పార్టీ దక్షిణాదిలో ఒంటరిగా బలపడే అవకాశమే లేదా? గతంలో సంగతి వదిలేద్దాం..ఇప్పుడు కూడా ఏదో ఒక పార్టీ తోడుగా నిలిస్తే తప్ప ఉనికిని చాటుకోలేదా? ఇలా అయితే ఇంకా ఎంత కాలానికి బిజేపి దేశమంతా విస్తరించగలదు? అనే ప్రశ్నకు సమాదానం ఎవరి వద్దా లేదు. దక్షిణాదిన బిజేపి ఇప్పటికీ ఎందుకు బలపడడం లేదన్నదానిపై నిజానికి ఇప్పటి వరకు ఆ పార్టీలో పూర్తి స్ధాయి అధ్యయనం జరగలేదన్నది ముమ్మాటికీ వాస్తవం. పైగా ఆ పార్టీ పూర్తి స్ధాయిలో ఉత్తరాదినే ఎక్కువగా దృష్టిపెట్టిందనే చెప్పాలి. కనీసం ఈ పదేళ్లలో దక్షిణాది అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టిపెడితే బాగుండేది. ఎంత సేపు ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో ఎలా బలపడాలన్నదానిపైనే బిజేపి దృష్టిపెడుతూ వచ్చింది. అందుకే దక్షిణాదిన కొంత వెనుకబాటులోవుంది. కాకపోతే ఉత్తరాధి రాజకీయ పరిస్దితులు వేరు. దక్షిణాది రాజకీయాలు వేరు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా దక్షిణాది ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ప్రతి అంశాన్ని శ్రాస్త్రోత్తరంగా కాకుండా శాస్త్రీయంగా ఆలోచిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. అందుకే బిజేపి లాంటి పార్టీలకు దక్షిణాదిలో చోటు పూర్తి స్ధాయిలో దక్కకుండా పోయింది. ఇప్పుడిప్పుడే దిక్షిణాదిలో కూడా బిజేపికి అనుకూలమైన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని బిజేపి ఎదగాలనుకుంటోంది. అయితే జనసేన లాంటి పార్టీని నమ్ముకొని బిజేపి ఎదగడం అన్నది అంత ఈజీ కాదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు తన మనుగడ కోసం ఆలోచిస్తాయే గాని, జాతీయ పార్టీల ఎదుగుదలను ఎక్కడా అంగీకరించిన దాఖలాలు లేవు. ఒక్కసారి జాతీయ పార్టీ పాగా వేస్తే ప్రాంతీయ పార్టీలకు చోటు లేకుండా చేస్తాయన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. కాని ప్రాంతీయ పార్టీలు కూడా ఇటీవల కాలంలో స్వంత బలాన్ని నమ్ముకొని రాజకీయం చేయడం లేదు. ఉభయ కుశలోపరిగా జాతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో ప్రాంతీయపార్టీలు కలిసి రాజకీయం చేసేవి. కాని ఇప్పుడు ప్రాంతీయపార్టీలలో ఏకచ్చత్రాధిపత్యం ఎక్కువైంది. అసలు మరో ప్రాంతీయపార్టీ పుట్టుకనే అంగీకరించలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలకు, జాతీయపార్టీలకు మధ్య సయోధ్య ఎక్కువైంది. అంత మాత్రాన జాతీయ పార్టీలను పూర్తిగా పాగా వేసేందుకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇష్టపడదు. అందులోనూ జనసేన లాంటి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను నమ్ముకొని బిజేపి రాజకీయం చేయాలనుకోవడం కూడా అంత కరక్టు కాదు. కాని అవసరం రెండు పార్టీలకు వుంది. పైగా మరో అవకాశం లేని కారణంగా ఇద్దరూ సర్ధుకుపోతున్నారు. బిజేపికి దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటకలో తప్ప, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో పార్టీని నడిపించేంత శక్తి వున్న నాయకులు ఎవరూ లేరు. గతంలో కూడా అంత బలమైన నాయకత్వాలు ఇక్కడ ఎదగలేదు. పార్టీ పేరు చెప్పుకొని మాత్రమే రాజకీయం చేస్తే తప్ప మనుగడలో వుంటారు. రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తే బిజేపి నాయకులు గెలుస్తారు. ఏదొ ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సీట్లు సాధిస్తారు. అంతే తప్ప బిజేపి తలరాత మార్చే నాయకులు దక్షిణాదిలో ఎవరూ లేరు. ముఖ్యంగా తెలంగాణ, ఏపి రాష్ట్రాలలో పార్టీని నడిపించి ఓట్లు పొంది, సీట్లు సాధించి, అధికారంలోకి తీసుకొచ్చేంత శక్తి వంతమైన నాయకులు లేకపోవడం మూలంగానే ఇతర పార్టీలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఏపి కన్నా, తెలంగాణ కొంత బెటర్. ఇక్కడ కొంత మంది బలమైన నాయకులు వున్నారు. కాని వాళ్లు కూడా జాతీయ స్ధాయిలో వున్న స్దితిగతుల ఆధారం చేసుకొని గెలిచే నాయకులు మాత్రమే. అందుకే ఏపి, తెలంగాణలలో బిజేపి ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్‌ను అక్కున చేర్చుకున్నది. ఇప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవిని దగ్గరకు తీసుకుంటోంది. జనసేనను తెలంగాణలో విస్తరింపజేసేలా సహకరిస్తే, తమకు లాభం చేకూరుతుందని బిజేపి బావిస్తోంది. అందుకు బిజేపి, జనసేనల మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. కాని అది సాధ్యమా? అన్నది కూడా బిజేపిలో చర్చ జరగాల్సిన అవసరం వుంది. అయితే తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన గ్రాఫ్ బాగా పెరిగినట్లు సంకేతాలు అందుతున్న వేళ, తాను కూడా మళ్లీ ఒకసారి తన రాజకీయ జీవితంపై జాతకం ఎలా వుంటుందో చూసుకోవాలనుకుంటున్నారు. ఆ విషయం ఈ మధ్య ప్రజారాజ్యం కొనసాగింపే జనసేన అంటూ కీలక వ్యాఖ్య చేశారు. అంటే తాను రాజకీయాలకు దూరంగా లేను అని చెప్పకనే చిరంజీవి చెప్పినట్లైంది. కాని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. 180సీట్లు గెల్చుకుంటున్నామని గొప్పలకు పోయారు. 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. అయినా చిరంజీవిలో పోరాట పటిమ వుంటుందని అందరూ అనుకున్నారు. కాని ఆయన కనీసం ఓ ఐదేళ్లపాటు కూడా పార్టీని నడపలేకపోయారు. ఎన్టీఆర్ చరిత్రను తిరగరాయాలని కలలు గన్నారు. కాని కుదరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సామాజిక తెలంగాణ అంటూ తనకు తెలియని రాగం అందుకున్నారు. అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటని ఓ రిపోర్టుర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. అయినా కాలం కలిసిరాలేదు. కాని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. జెండా పీకేశాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ప్రతిగా రాష్ట్ర క్యాబినేట్‌లో తన అనుచరుడైన గంటా శ్రీనివాస్‌రావును మంత్రిని చేశారు. తాను రాజ్యసభ సభ్యత్వం స్వీకరించి, కేంద్రంలో స్వతంత్ర హోదాలో మంత్రి పదవి తీసుకున్నారు. తాను సినిమాలు వదిలి, రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో ఇక తన జీవితం ప్రజలకే అంకితం. ఇకపై ముఖానికి రంగు వేసుకునేది లేదని ప్రకటించారు. రాజకీయాలకే తన పూర్తి సమయం కేటాయిస్తానని, సినిమాలను వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే పరిస్ధితులు అనుకూలించలేదు. చిరంజీవి చెప్పిన మాట మీద నిలబడలేదు. రాజకీయాలు అచ్చి రాలేదని మళ్లీ సినిమాలు మొదలు పెట్టారు. కాని అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ కనిపించడం లేదు. సినిమాలైతే చేస్తున్నాడే గాని, ఒకప్పటి ఆదరణ ఇప్పుడు ఆయన సినిమాలకు లేదు. గతంలో చిరంజీవి సినిమా ముందు ఏ ఇతర హీరోల సినిమాలు నిలిచేవి కాదు. ఇప్పుడు ఆ హీరోల సినిమా ముందు చిరంజీవి సినిమాలు ఆడడం లేదు. ఇతర హీరోల సినిమా రేంజ్‌ను చిరంజీవి సినిమాలు అందుకోవడం లేదు. అటు రాజకీయం లేక, ఇటు సినిమాల్లో విజయాలు లేక కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కాకపోతే ఆయనకు వున్న మెగాస్టార్ కుర్చీ మాత్రం అలాగేవుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఒక దారిలో పడిరది. ఆయన సినిమాలతోపాటు, రాజకీయం కూడా సక్సెస్ బాటలోనే నడుస్తోంది. ఇప్పుడు అన్నకు తమ్ముడి జనసేన బాటలు వేస్తోంది. మొన్నటి వరకు నువ్యు ఒక పార్టీలో ,నేను ఒక పార్టీలో అంటూ ఒకే ఇంటి మీద రెండు జెండాలు ఎగిరే రాజకీయం చేశారు. కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసి కట్టు నాగం బొట్టు అన్నట్లు ప్రయాసపడుతోంది. అందవల్ల కాంగ్రెస్‌లోవుండడం కన్నా, జనసేనలో చేరడం ఉత్తమమని చిరంజీవి బావిస్తున్నారు. పైగా బిజేపి కూడా తోడు కోరుతోంది. ఈ సయోధ్య రెండు పార్టీలకు కలిసి వస్తుందన్న నమ్మకం రెండు పార్టీలలో వుంది. కాని తెలంగాణలో చిరంజీవి వల్ల బిజేపికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం చెప్పలేం. ఈ తరానికి చిరంజీవి గురించి తెలిసిన యువతరం తక్కువ. వారికి తెలంగాణలో వున్న బిజేపి నాయకుల కన్నా, చిరంజీవి వారి దృష్టిలో పెద్ద నాయకుడు కాదు. పాలల్లో మజ్జిగ చుక్కలా కలిసి ఘనతంతా నాదే అని చెప్పుకునేందుకు చిరంజీవి ఏ మాత్రం వెనుకాడడు. అయినా చిరంజీవి ఎప్పుడో సమైక్య వాదిగా తనుకుతానుగానే ముద్రవేసుకున్నారు. తెలంగాణను ఆయనే కాదనుకున్నారు. జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఏర్పాటును స్వాగతించలేదు. సమైక్యాంద్ర కోసం రాజీనామా చేసి, తెలంగాణ ప్రజా రాజ్యం నాయకుల ఆత్మగౌరవం దెబ్బ తీశాడు. అలాంటి నాయకుడిని పొరపాటును బిజేపి తెలంగాణ మీద రద్దితే మొదటికే మోసం వస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
కొత్త సారు కొంత కాలం ఎదురు చూడాల్సిందే అంటున్నారు.
రికాం(ర్డ్) లేని తిరుగుడులో తప్పేవరిధి? తప్పించేదేవరు?
ఆక్రమ పట్టాదారుల ఆగడాలను అడ్డుకొనేదెవరు?
వేల రూపాయల రైతుబంధు నిధులను దుర్వినియోగం.
30 సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు.
ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువ ఉన్న సాకుతో ఆ…. పట్టా.
రైతు భరోసా రద్దుచేశాం,పట్టారద్దుకు చర్యలు తీసుకుంటాం.
“నేటిధాత్రి” ఐనవోలు,
భూరికార్డుల్లో ఉన్న అవకతవకలు సరిచేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అవినీతిని రూపుమాపి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం తీసుకోచ్చినదే ధరణి యాప్. ఐతే రాజులు తల్చుకుంటే దెబ్బలకు కొదువేముంది అన్న నాణుడి తరహాలో ధరణి లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారులు కొత్త తరహా అవినీతికి తెర లేపుతున్నారు. తప్పుగా నమోదైన ఆర్.ఎస్. ఆర్ రికార్డ్ ను సవరించాల్సిన తహసీల్దార్ అదే ఆ లొసుగును ఆసరాగా చేసుకొని మోఖా మీద లేని రైతుకు కేవలం ఖాతా నెంబర్ ద్వారా రికార్డ్ లో ఎక్కువగా ఉన్న భూమికి పట్టాదారు పాస్ బుక్కులు జారీ చేసి తనదైన మార్క్ చూపించారు.పూర్తి వివరాల్లోకి వెళితే… హనుమకొండ జిల్లా అయినవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి రాజుకు సర్వేనెంబర్ 194 లో ఒక ఎకరం 24 గుంటల వ్యవసాయ భూమి కలదు. ఈ భూమిని రాజు తాత ఐన కట్కూరి కట్టయ్య 1983లో ఒక ఎకరం 1990లో 24 గుంటలుగా మొత్తం 1-24 ఎకరాల భూమి అసలు పట్టాదారుడు ఐన యాకయ్య మరియు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఖరీదుకు కొనుగోలు చేసినాడు.అప్పటినుండి దాదాపుగా 40 సంవత్సరాల నుండి అదే భూమిలో వ్యవసాయం చేస్తూ జీవించాడు. తన తాత తధనంతరం వారసత్వంగా వచ్చిన భూమిని రాజు 2011 సం. లో ఒక ఎకరా తన పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్ బుక్కులు పొంది ఉన్నాడు. మరియు 2018లో 24 గుంటల భూమికి సాధా బైనామా ద్వారా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్ బుక్ పొందాడు. 194 సర్వే నెంబర్లో తాను ఒక్కడే రైతు తాను సాగులో ఉన్న భూమి మొత్తానికి ప్రస్తుతం పట్టా కలిగి ఉన్నాడు. ఇట్టి భూమిని గతంలో రాజు ఎవరికి అమ్మలేదు ఎవరు కొనుగోలు చేయలేదు.
ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువ ఉన్న సాకుతో ఆ…. పట్టా
అయితే ఇదే సర్వేనెంబర్ 194 లో మోకాపై ఎలాంటి భూమి లేకుండా కేవలం ఆర్.ఎస్.ఆర్ రికార్డుల్లో అదనంగా ఒక ఎకరం భూమి తప్పుగా చూపిస్తూ సోల్డ్ అవుట్ అని పాత పట్టాదారుని ఖాతా నెంబర్ 226 తో ఒక ఎకరం ఎక్కువగా తప్పుడు రికార్డ్ అయ్యింది. అట్టి విషయాన్ని బాధితుడు అప్పుడే స్థానిక తహసీల్దార్ కి పిర్యాదు చేయగా విచారణ జరిపిన స్థానిక వి.ఆర్.ఓ ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువగా ఉన్నట్టు ఆ భూమిని తొలగించాలని నివేదిక ఇచ్చారు. అయితే తర్వాత వచ్చిన తాహశీల్దారు ఇవేవి పట్టించుకోకుండా 2022 సంవత్సరంలో ఎలాంటి ఆధారాలు లేకుండా, విచారణ చేయకుండా, కనీసం పాత లింక్ డాక్యుమెంట్ రికార్డులు పరిశీలించకుండా ‘సత్య’ వంతులైన కొందరి సూచనలతో పట్టా చేసినారు. కానీ అప్పటికే కట్కూరి రాజు సంబంధీకులు మోఖాలో ఉండి సాగులో ఉన్నారు.ఆ విషయం తహసీల్దార్ విచారణ చేయకుండా ఆ అక్రమ పట్టా చేయడం ద్వారా ఇప్పటివరకు అనర్హుడైన రైతు దాదాపు 20 వేల రూపాయలు రైతుబంధు రూపేణా ప్రజల సొమ్మును అప్పనంగా లబ్ది పొందడం కొసమెరుపు. మరి అన్ని వేల రూపాయల ప్రజాధనం మళ్ళీ రికవరీ చేస్తారో లేదో వేచి చూడాలి.. అన్ని ఆధారాలు ఉండి రెవెన్యూ అధికారుల తప్పిదాలతో భూములు ఎక్కక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు తహసీల్దార్ ల చుట్టూ తిరిగితే అంతా ధరణి మయంలో ఉంది మాకు అధికారం లేదు అని చెప్పే రెవెన్యూ అధికారులకు ఇది ఎలా సాధ్యం అయినట్లు?..
ఇదిలా ఉండగా అక్రమ పట్టా తొలగించాలని ప్రస్తుత తహసీల్దార్ ను బాధితులు ఆశ్రయించగా ప్రస్తుతం ఉన్న ధరణి యాప్ లో అలాంటి అధికారం నాకు లేదు అని చెబుతున్నట్లు తెలుస్తోంది.
30 సార్లు ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు..
ధరణిలో ఉన్న లొసుగులు ఆధారంగా చేసుకొని తహసీల్దార్ సాయంతో తాను సాగుచేసున్న భూమి ని అక్రమంగా పట్టా చేయించుకున్నారని బాధిత రైతు 2022 నుండి ఇప్పటివరకు 30 సార్లు కలెక్టర్ లాంటి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా, పిర్యాదు చేసినప్పుటి నుంచి ముగ్గురు కలెక్టర్లు మారారు తప్ప మాకు న్యాయం జరుగలేదు. ప్రస్తుత కలెక్టర్ కి కూడా పిర్యాదు చేస్తే మండల గర్ధవర్ మండల సర్వేయర్లతో విచారణ చేయగా వారు పొందిన పట్టా అక్రమం అని తేల్చి పట్టా తొలగించాలని నివేదిక ఇచ్చినా గాని ఉన్నత అధికారులు కాలయాపన చేస్తున్నట్టు బాధితులు తెలిపాడు. నాపై మరియు మా కుటుంబ సభ్యులపై అక్రమ పట్టాదారులు దాడులు చేసి దౌర్జన్యంగా ఆస్తి నష్టం చేసినారని అట్టి విషయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ కి మూడుసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది.తప్పు చేసిన అధికారి ధర్జాగా అధికారం అనుభవిస్తూ ఉంటే ఏ తప్పు చేయని మేం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇంతవరకు ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు.
బాధిత రైతు కట్కూరి రాజు కొండపర్తి
రైతు భరోసా రద్దుచేశాం,పట్టారద్దుకు చర్యలు తీసుకుంటాం.
ఇదే విషయం పై స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్ ను నేటిధాత్రి ప్రతినిధి వివరణ కోరగా..
కొండపర్తి గ్రామంలో సర్వే నెంబర్ 194 లో స్థానిక రైతు కట్కూరి రాజు మోఖ మీద ఉన్నట్టు విచారణలో తేలింది. ఐతే అదే సర్వే నెంబర్ లో ఒక ఎకరం భూమి ఆర్. ఎస్. ఆర్ ప్రకారం ఎక్కువగా నమోదు అయ్యింది. అట్టి విషయం పై బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ జరిపించాం. సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ కి పంపించటం జరుగుతుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన పిమ్మట ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం..
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. వి. నరేందర్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. నరేందర్ రెడ్డి నామినేషన్‌కు నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు హజరై నరేందర్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో హజరైన పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లిన నరేందర్ రెడ్డి తన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ కార్యమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, బోధన్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆదిలాబాద్ పార్లమెంటు కంటెస్టెట్ ఆత్రమ్ సుగుణ, మానాకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ రాకూర్ ఇతర నాయకులు హజరయ్యారు. అందరు నాయకులకు ఆత్మీయ స్వాగతం పలికిన నరేందర్ రెడ్డి తర్వాత నామినేషన్ కు బయలుదేరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.