పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజుల నుండి పండుగ వాతావరణం లో శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ సమేత సీతలాంబ(బొడ్రాయి),శ్రీ పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. , సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు డప్పుచప్పు ళ్లు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ సమేత సీతలాంబ(బొడ్రాయి) మరియు శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యా లతో ఉండాలని కోరుకున్నారు. కొప్పుల గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.