బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం.

నేడు సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని బాలల పుస్తక దినోత్సవం (Children’s Book Day) ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటారు.

ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో బాల చెలిమి గ్రంథాలయములో , చదవడం, గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది.

ఈ రోజు విద్యార్థులు చవిచూసి, కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెంచేందుకు ఉద్దేశ్యమైంది.

అలాగే పుస్తకాలు చదివిన తరువాత కథ పై సమీక్షా రాయలని చెప్పడం జరిగింది.

Children’s

 

ఇది హాన్‌సా క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క జయంతి సందర్భంగా, అతను పిల్లల కథలను రచించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మంచి పుస్తకాలు అందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.

ప్రధానోపాధ్యాయులు L. శారదా మాట్లాడుతూ ఈ రోజు పిల్లలు పుస్తకాల మధ్య ప్రయాణం చేస్తూ, కొత్త కథలు చదవడానికి, అక్షరాల మహిమను తెలుసుకునేందుకు ప్రేరణ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల చెలిమి గ్రంధాలయం ఇంచార్జ్ ఎలగొండ రవి పాల్గొన్నారు.

పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుక.

పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుక

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కేసముద్రం మండలం పెనుగొండ గ్రామపంచాయతీ లోని కట్టు గూడెం ఎం పి పి ఎస్ పాఠశాలలో శనివారం ముందస్తు విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షమీం, ఉగాది పండగ పర్వదినాన్ని తెలుగు సంప్రదాయ ప్రకారం తెలుగు సంవత్సరముగా మరియు కొత్త సంవత్సరం ఉగాది పండగ పర్వదినాన్ని తెలుగు ప్రజలు చాలా సాంప్రదాయ పద్ధతిలో మొదటి పండగగా భావించి అంగరంగ వైభవంగా జరుపుకుంటారని ఉగాది పండగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అలాగే తెలుగు నూతన సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ తో సంబంధం లేకుండా పంచాంగం ప్రకారం నెలలను మాసాలతో తిధులతో మంచి రోజులను చూసుకుంటారని అలాగే శుభ ముహూర్తాలను ఈ పంచాంగం ద్వారానే నిర్ణయిస్తారని విద్యార్థులకు వివరించారు. అలాగే ఈ విశ్వా వసునామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

శ్రీ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,సిబ్బంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు వైభవంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్నెపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు కాలమానం ప్రకారం 60 సంవత్సరాల క్యాలెండర్ ఉంటుందని అందులో ఈ విశ్వావసు నామ సంవత్సరం 39వ సంవత్సరమని అన్నారు. ఉగాది సందర్భంగా ప్రతి తెలుగు వారు షడృచులతో పచ్చడి తయారు చేస్తారు. భక్ష్యాలు అనే ప్రత్యేక పిండివంటలు తయారుచేసి కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకోవడం తెలుగు వారి ఆనవాయితి అని,ప్రతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునే గొప్ప సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం.

ప్రభుత్వ పాఠశాలలో పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ…ప్లాస్టిక్ వినియోగం నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని జోగాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యర్థ పేపర్లను వినియోగించి పేపర్ బ్యాగులు, పేపర్ ఫైల్ తయారుచేయడంలో విద్యార్థులకు ఉపాధ్యయుడు మేడికాల అంజయ్య రెండు రోజులు శిక్షణనిచ్చాడు. విద్యార్థులు పలు రకాల బ్యాగులు, వివిధ రకాల పత్రాలు బధ్రపరచుకోవడానికి పేపర్ ఫైల్లను తయారు చేసి ప్రదర్శించారు. తమ గ్రామంలో ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగ్ లు , పేపర్ ఫైల్ వాడతామని చెప్పా రు. శిక్షణను అందించిన ఉపాద్యాయుడు అంజయ్య మాట్లాడుతూ త్వరగా మట్టిలో కలిసిపోయో పేపర్ బ్యాగ్ లు పర్యవరణానికి ఎంతో మేలు చేస్తాయని వీటి తయారికి ఎలాంటి ఖర్చు ఉండదు కావున విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భావితరాలకు కలుష్య రహిత సమాజాన్ని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించవచ్చన్నారు. ప్లాస్టిక్ వలన మన దేశంలో ప్రతి యోట లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా త్వరగా మట్టిలో కలిసి పోయో పేపర్ బ్యాగ్ లు,జూట్ , బట్ట సంచులను విరివిగా వాడాలని ఉపాధ్యాయుడు అంజయ్య పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా శిక్షణనను అందించిన ఉపాద్యాయుడు అంజయ్యను ప్రధానోపాద్యాయులతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు శ్రీధర్ రాజు, ఉపాధ్యాయులు జావీద్, మహేశ్, శ్రీనివాస్ , పద్మ, నర్సయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు.!

ఐదు నవోదయ సీట్లుసాధించిన బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుగా నవోదయ కోచింగ్ సెంటర్లలో చదివించుకుంటారు.కానీ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఇచ్చే కోచింగ్ ద్వారా ప్రతి సంవత్సరం నవోదయలో సీట్లు సాధిస్తున్నారని, అందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో నవోదయలో సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులు వి.నిఖిత, ఇ. వర్షిత్, ఎ. సంజిత్, ఎ.రేవంత్,కె. దీక్షిత్ లను వారు అభినందించారు.వీరి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులను,విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఇష్టంతో కష్టపడి పని చేయడం అలవాటు చేసుకుని, ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ చిన్నారులను ప్రేరణగా తీసుకొని ప్రతి విద్యార్థి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నవోదయ సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.

కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం.

ఆనందోత్సాహాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం

నేటి ధాత్రి కథలాపూర్

 

ఆనందోత్సవాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. ముఖ్యఅతిథిగా కోట్ల సిఐ సురేష్ బాబు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు కూడా కష్టపడి విద్యార్థులకు మంచి బోధన అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. తహసిల్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కథలాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, డైరెక్టర్ గడ్డం దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపా ధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
పచ్చని చెట్లతో,పారే నదులతో,అందమైన పక్షులు, అలరించే జంతువులతో, ఎన్నో జీవుల్ని కలిగి వున్న గ్రహం ఈ భూమి.ఈ జీవులన్నిటి మనుగడకు కావలసినది నీరు.అటువంటి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ప్రజలకు అవగాహన కలిగించుటకు 1993వ సం॥లో ఐక్యరాజ్యసమితి మార్చి 22ని అంతర్జాతీయ జల దినోత్సవం’గా ప్రకటించిందని, భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరయితే ఉందో,ఇప్పుడు కూడా అంతే నీరు ఉంది. పెరగడం కాని, తరగడం కాని లేదు.కానీ ప్రపంచ జనాభా నిత్యం పెరుగుతునే ఉంది. అందుకే కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. భూమి మీద ఉన్న నీటిలో 97% ఉప్పునీరు. కేవలం 3% మాత్రమే మంచినీరు. ఈ నీటిని మనం చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలని, ప్రపంచంలో భారీయుద్ధాలలో చనిపోయిన వారికన్నా కలుషిత నీరు తాగడం వలన మరణించిన వారి సంఖ్య ఎక్కువని,సంవత్సరానికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మరణిస్తున్నారని అన్నారు.
కాబట్టి,నీటిని పొదుపుగా వాడుట, కలుషితం అవకుండా కాపాడుట మన అందరి యొక్క బాధ్యత అని,సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం నీరు,నీరు లేక జీవకోటి మనుగడ లేదని అన్నారు.అనంతరం జల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్,అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్యా,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం.

పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్స్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది‌.ఈ కార్యక్రమానికి నడికూడ మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలు, యుపిఎస్ చౌటపర్తి, యుపిఎస్ ముస్త్యాలపల్లి, యుపిఎస్ పులిగిల్ల, యుపిఎస్ నర్సక్కపల్లి నుండి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హాజరై జడ్పీహెచ్ఎస్ నడికూడ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు వసతులు, విద్యార్థులు పరిశీలించడం జరిగింది.ఇందులో భాగంగా గ్రంథాలయం,సైన్స్ ల్యాబ్, కిచెన్ గార్డెన్,డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి ఉన్నత పాఠశాల పట్ల అవగాహన పొందినారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని ఉపాధ్యాయులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని, ఆనందాన్ని,సంతోషాన్ని పొందారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.

ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాల నైన్ పాక లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నిర్వహించడం జరిగింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులుఒకరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడుగా వ్యవహరించి వారి ప్రతిభను ప్రదర్శించారు.దీనికి సంబందించిన సమావేశంలో ఒకరోజు ప్రధానోపాధ్యాయులు గా వ్యవహరించిన ఎండీ సన మాట్లాడుతూ ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడానికి గత 3 రోజుల నుండి కష్ట పడి తరగతి గదిలో పాఠం చెప్పడం చాలా భయం వేసిందని, రోజూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కష్టపడే విధానం నాకు నచ్చిందని చెప్పడం జరిగింది. మిగతా విద్యార్థులు కూడా వారి వారి అనుభవాలు చెప్పడం జరిగింది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షనతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఊర్మిళ గారు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా ఎంపీపీఎస్ కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు బి నాగరాజు గారు వ్యవహరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ కైరున్నీసా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్, ఇక్రమోద్దీన్, సదానందం, అనిల్ గవస్కర్, హసీనా, రాజేష్ మరియు ఒక్కరోజు ఎంఈఓ గా రేపాల శ్రేయాన్షి ఉపాధ్యాయులుగా , సాత్విక్, తనుశ్రీ, అనుశ్రీ, హర్షవర్ధన్, శ్రీ తేజ, యువీన, చైత్ర, శార్వాణి, సోను, నిహారిక, వైష్ణవి, జనని, తదితరులు పాల్గొన్నారు అనంతరం ఒక్కరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయడం జరిగింది.

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా హోలీ సంబరాలు.

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా ముందస్తు హోలీ సంబరాలు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలు జరుపుకున్నారు శార్వాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాడెంట్ దాయకపు శ్రీనివాస్ మాట్లాడుతూ హోలీ సంబురాలు ఎంత ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నారో విద్యార్థుల జీవితాలు సంతోష కరమైన రంగులమయం కావాలని వారి జీవితాలు ముందుకు సాగాలని కోరుకుంటూ విద్యార్థుల కు ఉపాధ్యాయులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు

మొజార్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం.

మొజార్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

వనపర్తి నెటిదాత్రి:

పెద్ద మందడి మండలం మోజర్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు విద్యార్థులే ఉపాధ్యాయులుగా వారి తోటి విద్యార్థులకు చదువు చెప్పారు . డి ఈ ఓ గా సాయి చరణ్ ఎం ఈ ఓ గా మనోజ్ హెడ్మాస్టర్ గా వైష్ణవి, 7 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు గా వ్యవహరిం చారు ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యుగంధర్, ఉపాధ్యాయులు వెంకటేష్ రాజేశ్వరి ప్రైమరీ ఉపాధ్యాయురాలు కరుణ , మద్దిగట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్ ప్రధాన ఉపాధ్యాయులు, కృష్ణయ్య, శశివర్ధన్
పాల్గొని విద్యార్థులను అభినందించారు

చిన్న ఘనాపూర్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం ప్రారంభం.

చిన్న ఘనాపూర్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం ప్రారంభం….

– విద్యార్థులకు ఐడి కార్డులు అందజేసిన ఉపాధ్యాయులు….

కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :-

School

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనాపూర్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణ రావు , అదేవిధంగా విద్యార్థి నీ విద్యార్థులకు ఐ. డి కార్డులను అందచేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో మరి పాఠశాలలు నాలుగు మాత్రమే ఉన్నాయని అందులో చిన్న ఘనపూర్ పాఠశాల ఎంపిక కావడం జరిగింది. ఈ పాఠశాలలో ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు ఎల్కేజీ యూకేజీ తరగతి గదులు విద్యాబోధన జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఎల్కేజీ యూకేజీ విద్యార్థుల విద్యార్థులని ప్రవేటు పాఠశాలలకు పంపించకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు పంపించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలల్లోనే రికార్డులను రిజిస్టర్ లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జిగా ప్రధానోపాధ్యాయులు సీతారాం , రమణ అదేవిధంగా సిఆర్ పి బృందం రాజశేఖర్ సాయి రాములు ప్రాథమిక పాఠశాల సిబ్బంది సరిత, ప్రియాంక, ప్రమీల, దివ్య, గ్రామంలోని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పట్లోరి సత్యనారాయణ తెలపడం జరిగింది.

School

సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ

స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ సార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థులు.

“సర్ సివి రామన్ యంగ్ జీనియస్” ప్రశంస పత్రాలు అందుకున్న సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థులు సాత్విక్ రాజ్, సిద్ధార్ధ్ రాజ్.

వరంగల్, నేటిధాత్రి.

Students

వరంగల్ దేశాయిపేట రోడ్డులోని సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థులు కందికొండ సాత్విక్ రాజ్ 6త్ క్లాస్, కందికొండ సిద్ధార్థ రాజ్ 4త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఇటీవల రాసిన సీవీ రామన్ టాలెంట్ పరీక్షలో భాగంగా, “సర్ సివి రామన్ యంగ్ జీనియస్” ప్రశంస పత్రాలను స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ సార్ చేతుల మీదుగా అందజేశారు. సంఘమిత్ర టెక్నో స్కూల్లో చదువుతున్న విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ టాలెంట్ టెస్ట్ లో ర్యాంక్ లు సాధిస్తూ, సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు సైతం ప్రతి యేడాది అందుకోవడం గర్వకారణమని సంఘమిత్ర టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ పేర్కొన్నారు. నగర ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నత విద్యను అందిస్తున్న సంఘమిత్ర టెక్నో స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ కు, స్కూల్ టీచర్లకు అభినందనలు తెలియజేశారు విద్యార్థుల తల్లిదండ్రులు.

వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్.!

వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ బిసి మాజీ ఎమ్మెల్యేల

పేరు ప్రకటించినందుకు సీఎం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

వనపర్తి నెటిదాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ దివంగత వనపర్తి బీసీ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాలకృష్ణయ్య ఎం జయ రాములు యాదవ్ పేర్లు వనపర్తి లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే జయ రాముల కుటుంబ సభ్యులు అరవిందు వశిష్ట భరణి అరుణ రోహిణి అల్లుడు రంగస్వామి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము 40 సంవత్సరాలు నుండి మా కుటుంబ సభ్యులం వనపర్తి లో లేకున్నా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ యాదవ్ పోరాటం చేసి బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టుటకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకపోయినందుకు అభినందించారు .ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్ గౌని కార్డు యాదయ్య బొడ్డుపల్లి సతీష్ నాగవరం వెంకటేష్ పుట్టపాకల బాలు రాములు యాదవ్ రాజేష్ బాబుగౌడ్ నరసింహ తిమ్మన్న ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి.!

ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి గృహాల సామాగ్రి సరఫరాకు సీల్డ్ టెండర్లుకు ఆహ్వానం

ఐటీడీఏ పీవో బి . రాహుల్ ఐఏఎస్

నేటి ధాత్రి భద్రాచలం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు మరియు వసతి గృహాలకు కావలసిన డ్యూయల్ డెస్క్ బల్లలు, గ్రీన్ బోర్డ్స్ స్టీల్ వంట సామాగ్రి సరఫరా నిమిత్తం సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి టెండర్ నందు పాన్ కార్డు, టిన్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా మరియు అన్ని అర్హతలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన వారు పాల్గొనవచ్చునని ఆయన అన్నారు.
కావున ఆసక్తిగల టెండర్ దారులు ఉపసంచాలకులు (గి.సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం నుండి తేదీ 06-03-25 నుండి 10-03-25, మధ్యాహ్నం ఒంటిగంట వరకు టెండర్ షెడ్యూల్స్ పొందవచ్చునని, టెండర్ షెడ్యూల్ ధర రూ.3000/-ఉప సంచాలకులు (గి. సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం గారి పేరున ఎస్బిఐ భద్రాచలం నందు చెల్లుబాటు అయ్యే విధంగా డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించి పొందవచ్చునని, ధరావత్ సొమ్ము రూ.3,00,000/-డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టెండర్ షెడ్యూల్ తో పాటుగా టెండర్ బాక్స్ నందు సమర్పించాలని ఆయన అన్నారు.
పూర్తి చేసిన టెండర్ షెడ్యూల్ ఆఖరి తేదీ 10-03-25 సాయంత్రం నాలుగు గంటల లోపు ఉపసంచాలకులు, (గి. సం.) శాఖ, ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం టెండర్ బాక్స్ నందు సమర్పించాలని, తేదీ 10-03-25 సాయంత్రం నాలుగు గంటలకు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలం సమావేశ మందిరంలో హాజరైన టెండర్లదారుల సమక్షంలో తెరిచి తుది నిర్ణయం తీసుకోబడునని, టెండర్ దారులు శాంపిల్స్ తీసుకొని రావాలని, సెలవు దినములలో కూడా ఆఫీసు తెరిచి ఉంచబడునని, కావలసినవారు దరఖాస్తులను పొందవచ్చునని ఆయన అన్నారు.

మందమర్రి హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించ.!

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి కార్మల్ హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించి రంగులతో ముగ్గులు వేసి అలరించారు.

మందమర్రి నేటి ధాత్రి

Science

ఈ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తేదీ 4 -3 -2025 రోజున మన కార్మెల్ పాఠశాలలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ రంగోలి కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవ శాస్త్రాలు యొక్క పటాలను విద్యార్థులు చాలా చక్కగా డ్రా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి డాక్టర్ ఫాదర్ జె.వి.ఆర్ రెక్స్ జె, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎమ్ కుమారస్వామి, జీవశాస్త్ర ఉపాధ్యాయిని ఐ సునీత మేడం ఇతర సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పిఈటి కృష్ణ గారు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని ఈ రంగోలి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి.!

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి

విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డి ఈ వో కు వినతి పత్రం అందజేత

హనుమకొండ, నేటిధాత్రి :

అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తూనా స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు 7 నెల నుండి రాలేకపోవడం వలన కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారుతుందని అన్నారు. పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రత, పాఠశాల ఆవరణం మొత్తం పరిశుభ్రం చేస్తున్న క్రమంలో వేతనాలు రాలేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కావున జిల్లా కలెక్టర్, డీఈవో జ్ఞానేశ్వర్ స్పందించి స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో మంగళవారం రోజున విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ను జరుపుకున్నారు.
విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మంచి వేషధారణతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులను మరిపించే విధంగా బోధన చేశారు వీరి తీరును చూసి ఎంఈఓ కోడపాక రఘుపతి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పుల్ల హర్షవర్ధన్ ఎంఈఓ గా వెళ్దండి సహస్ర, డిఈఓ గా మొగుళ్ళ సాయి చరణ్,లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి జడ్జిలుగా తుపాకుల వందన,గడ్డం శంకర్,కుచనపల్లి శ్రీనివాసులు వ్యవహరించారు.
అనంతరం వారి అనుభవాలను పంచుకున్నారు. పవిత్రమైన బోధనా వృత్తి తమకంతో ఆనందం కలిగించిందని, అందులోని కష్టసుఖాలను ఈ కార్యక్రమంలో ద్వారా తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోడపాక రఘుపతి ఎంఈఓ , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి గారు ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, సరళాదేవి,నీలిమారెడ్డి, విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, బుర్ర సదయ్య,సుజాత,బుజ్జమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు

జోరుగా మద్యం దందా…

జోరుగా మద్యం దందా…

వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు…

బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం.

అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం…

అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.?

నూగూర్ వెంకటాపురం/నేటిధాత్రి

alcohol

(ఫిబ్రవరి26) వెంకటాపురం మండలంలో అక్రమ మద్యం దందా సాగుతున్న అధికారులు మౌనం వెనుక కారణం ఏమిటి.?వైన్ షాపుల తంతు చూస్తే ఆదాయం రెట్టింపు చేయడం కోసం వాహనాల ద్వారా మధ్యాన్ని తరలిస్తూ, ఎమ్మార్పీకి మించి వసూలుకు పాల్పడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుడి,బడి అని తేడా లేకుండా బెల్ షాపులు ఉండడంతో మద్యానికి బానిసలు అవుతున్నారు.దీంతో పేద కుటుంబాల మధ్య గొడవలు కలహాలు నిత్యకృతమవుతున్నాయి,చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మద్యానికి బానిసలు అవుతూ వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.బెల్స్ షాపుల్లో మద్యం విక్రయాలను తమ ఇష్టానుసారంగా కొనసాగిస్తూ,పేద కుటుంబాల వినాశనానికి కారణమైన బెల్ట్ షాపులను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.రెట్టింపు ఆదాయం కోసం బెల్ట్ షాపులను వైన్స్ యజమాన్యమే ప్రోత్సహిస్తుందని పలు విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి.వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపులకు తరలిస్తూ గ్రామీణ ప్రాంతంలో విక్రయాలు అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నరు.
వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సిండికేటుగా మారిన అక్రమ మద్యం వ్యాపారులు సాగిస్తున్నారు మండలంలో రెండు వైన్ షాపులు ఉన్నప్పటికీ ఒకటి మండల కేంద్రంలో రెండవది చోక్కాల గ్రామంలో ఉంది ఈ రెండు వైన్ షాపుల నుండి మద్యం రోజు ఉదయం 8 గంటల సమయంలో రెండు వాహనాల ద్వారా వెంకటాపురం మీదుగా పాత్రపురం,వీరభద్రారం,ఆలుబాక,సురవీడు,ఏదిరా,ఏకన్న గూడెం మీదుగా మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోందితదితర గ్రామాలకు చట్ట విరుద్ధంగా వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుపుతున్నారు. ఇది వైన్స్ యజమాన్యమే అధిక ధరలకు విక్రయించేందుకు చేస్తూ ఒక సీసా పై 20 నుండి 30 రూపాయలు వసూలు చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నారు.
బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం

alcohol

సిండికేట్ గా మారి మద్యం వాహనాల ద్వారా రవాణా చేస్తూ ప్రతి బెల్ట్ షాపులకు డోర్ డెలివరీ చేస్తూ,వైన్స్ యజమాన్యమే గ్రామాల్లో గుడి బడి అని తేడా లేకుండా బెల్ట్ షాపుల నిర్వాహకులను వైన్ షాప్ యాజమాన్యమే ప్రోత్సహిస్తుందని పలు అనుమానాలు వెళ్ళుతున్నాయి.
అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం…
అక్రమ మద్యం రవాణాపై ఇంతవరకు సంధిత అధికారులు చర్యలు తీసుకుపోవడం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం నుండే ఈ తథంగం జరుగుతున్నప్పటికీ ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో, అక్రమ మద్యం రవాణా ఇంకా జోరందుకున్నదని చెప్పుకోవాలి.గతంలో అమ్మకాల కంటే ఈసారి నేరుగా గ్రామాల్లోకి మద్యం తరలిపోవడంతో అమ్మకాలు ఇంకా జోరు సాగుతుంది. ఇకనైనా కళ్ళు తెరిచి ఉన్నతాధికారులు సంబంధిత శాఖ అధికారులు అడ్డదిడ్డంగా వెలుస్తున్న వందలాది బెల్ట్ షాపులపై అలాగే అక్రమ రవాణా చేస్తున్న వైన్ యాజమాన్యంపై చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.?
మద్యం వ్యాపారం అదుపు తప్పడంతో ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్న అధికారులను తాము చెప్పిందే చేయాలంటూ ఖద్దరు నేతల అడుగు జాడలో నడుస్తుందని తెలుస్తోంది. మండలంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులే ఉన్నారు. కొంత మంది నేతలు గ్రూపులుగా ఏర్పడి తలోకొంత పెట్టుబడులు పెట్టి మద్యం దందాను నడుపుతున్నారు. నేతలు తమ రాజకీయ పలుకుబడితో అధికారులను తమ దారికి తెచ్చుకుంటున్నారు. కొన్ని విషయాలను చూసీ చూడనట్లుగానే వదిలేయాలంటూ అధికారులను సైతం తమ దారికి తెచ్చుకుంటున్నారని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారం చేస్తున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఇవన్నీ తెలిసిన మౌనం పాటిస్తారు తప్ప, చర్యలు ఏమాత్రం తీసుకోరని జోరుగా ప్రజల్లో ప్రచారం జరుగుతోంది.నెలవారీగా మాముళ్లను ముట్టజెప్పడంతో సైలెంట్‌ అయిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా క్షేత్ర స్థాయిలో అక్రమ మద్యం దందాపై ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

జిల్లా పరిషత్,సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండలస్థాయి అవగాహన,శిక్షణ కార్యక్రమం

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణ

Students

పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తీర్ణత మరియు వ్యక్తిత్వ వికాసం పై ఏర్పాటు చేసిన అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ డాక్టర్ కన్నం.నారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువు పై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు.ప్రఖ్యాత మోటివేటర్ దిలీప్ కుమార్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు,తహసీల్దారు విజయలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ విధ్యార్థులకు చదువడం జ్ఞాపక శక్తి పెంచుకోవడం మరియు పరీక్షలు రాయడంలో మెలకువల గురించి వివరించారు,ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాన్ని చేరుకునే విధంగా కృషి చేయాలని,విద్యార్థులు అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే తల్లి తండ్రులు ఉపాధ్యాయులు సంతోషిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి,జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పరకాల బాలుర గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సి. హెచ్ మధు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version