రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ
ఎదురుచూస్తున్న… యువత నిరుద్యోగులు
వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :
వీణవంక మండల కేంద్రంలో
బిఆర్ఎస్వి సీనియర్ నాయకులు హొల్లాల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న ఇదిగో పథకం అదిగో పథకం అని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రభుత్వం కాలయాపన గడుపుతూ యువతకు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పేరుతో దరఖాస్తులు తీసుకొని మూడు నెలలు గడిచిన ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల యువత జేబులు చిల్లుపరిచి ఇన్కమ్,క్యాస్ట్, రెసిడెన్సి సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు గురిచేసి దరఖాస్తులు పెట్టుకొని మూడు నెలలు గడిచిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కాలం వెళ్లబుచ్చుతూ యువతరాన్ని నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వెంటనే వారు ఇచ్చిన హామీల్లో భాగంగా రాజీవ్ వికాస్ పేరుతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .